
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: బ.అష్టమి ప.3.27 వరకు, తదుపరి నవమి,నక్షత్రం: పూర్వాషాఢ రా.6.37 వరకు, తదుపరి ఉత్తరాషాఢ,వర్జ్యం: రా.2.20 నుండి 3.52 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.22 నుండి 9.10 వరకు, తదుపరి రా.10.54 నుండి 11.42 వరకు,అమృతఘడియలు: రా.1.50 నుండి 3.24 వరకు
మేషం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటిలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు.
వృషభం: మిత్రులతో విభేదాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి
మిథునం: ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు కూడా వసూలవుతాయి. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం: ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వస్తు, వస్త్రలాభాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గృహయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగుతాయి.
సింహం: పనులలో స్వల్ప ఆటంకాలు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.
కన్య: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.
తుల: విద్య, ఉద్యోగావకాశాలు. అప్రయత్న కార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృశ్చికం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
ధనుస్సు: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీసేవలకు గుర్తింపు రాగలదు. ఉద్యోగ, విద్యావకాశాలు. ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మకరం: రుణదాతల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు తప్పవు. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.
కుంభం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
మీనం: బంధుమిత్రుల సహకారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment