కరోనా వ్యాప్తితో ప్రస్తుతం సాఫ్‌్టవేర్ ఉద్యోగులతో పాటు మరికొన్ని రంగాల ఉద్యోగులు ఇంటి నుంచే పని (Work From Home) చేస్తున్నారు. కార్యాలయాలకు రాకుండా ఇంట్లో ఉండే విధులు నిర్వహిస్తున్నారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. కొందరు ఈ విధానంపై ట్రోలింగ్ చేస్తుండగా మరికొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దురా మొర్రో అంటూ ఇలా ఫన్నీగా ఎన్నో మీమ్స్, ఫొటోలు వచ్చాయి. వాటిని చూసి సరదాగా నెటిజన్లు నవ్వుకుంటున్నారు. తాజాగా ఇదే విధానంలో ఓ ఉద్యోగి పని చేస్తున్న ఫొటో నెటిజన్లను తెగ నవ్వులు తెప్పిస్తోంది.
చదవండి: నిర్దోషిగా తేలిన హీరో.. అసలు దొంగలను పట్టుకున్న పోలీసులు
ఓ వ్యక్తి ల్యాప్‌టాప్ పెట్టుకుని జూమ్ మీటింగ్ కంపెనీకి సంబంధించిన మీటింగ్‌లో హాజరయ్యాడు. చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వింటున్నాడు. అయితే వింటూనే కింద కూర్చుని కూరగాయలు కోస్తున్నాడు. ఆలుగడ్డ పొట్టు తీస్తున్న ఫొటోను ప్రముఖ జర్నలిస్ట్ ప్రశాంత్ కుమార్ షేర్ చేశాడు. ‘ఇంటి నుంచి పని’లో ఇంటి పని కూడా (వెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫర్ హోమ్) అని పేర్కొంటూ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. పైన ఆఫీస్‌కు వెళ్తున్నట్టు ఫార్మాల్ షర్ట్ టై కట్టుకుని కనిపించగా కింద షార్ట్ వేసుకుని కూర్చున్నాడు. ఈ ట్వీట్‌ను 5 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ ఫొటోపై సరదా కామెంట్లు వస్తున్నాయి. దీంతోపాటు ‘మా కష్టాలు మీకేం తెలుసు’ అని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారు వాపోతున్నారు.
చదవండి: ఎంతటి దుస్థితి! అఫ్గాన్ మంత్రి నేడు డెలివరీ బాయ్‌గా
When “work from home” and “work for home” go hand in hand! 😂👇🏼 pic.twitter.com/lqIBBwnYUy
— Prashant Kumar (@scribe_prashant) August 21, 2021
Comments
Please login to add a commentAdd a comment