
సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదు
నిజామాబాద్‌నాగారం: ప్రభుత్వం తమ సమ స్యలను పరిష్కరించే పోరాటం ఆగదని జూని యర్ డాక్టర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్ అన్నారు. సోమవారం ప్రారంభించిన నిరవధిక సమ్మెలో సుమారు 300 మంది పాల్గొన్నారు. సోమవారం ఉదయం విధులు బహిష్కరించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర విభాగంలో పనిచేసే జూనియర్ డాక్టర్లకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతోనే సమ్మెకు దిగామని తెలిపారు. తమకు ప్రతినెలా స్టైఫండ్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
స్టైఫండ్ ప్రతినెలా ఇవ్వాలి
జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ రాక నానా ఇబ్బందులు పడుతున్నాం. నెలల తరబడిగా ఇవ్వకుండా పెండింగ్‌లో పెడుతున్నారు. రోగులకు సేవలందిస్తున్న మాకు సకాలంలో స్టైఫండ్ ఇస్తే బాగుంటుంది. ప్రభుత్వం తమ ఏడు డిమాండ్లను పరిష్కరిస్తే సమ్మె విరమిస్తాం.
– చంద్రకాంత్, జూనియర్ డాక్టర్ల
అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
డిమాండ్లను పరిష్కరించాలి
మా డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. గత ప్రభుత్వానికి సైతం పలుమార్లు మా సమస్యలను విన్నవించాం. ఇదిగో, అదిగో అంటు కాలం వెళ్లదీశారు. ఇప్పటికై నా ప్రస్తుత ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలను పరిష్కరించాలి.
– సురేష్ నీరుడి, జూనియర్ డాక్టర్ల
అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ప్రభుత్వం న్యాయం చేయాలి
ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయా లి. అత్యవసర సేవల విషయంలో ఇబ్బందులు రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి. తగిన ఫలితం ఉంటే మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించగలుగుతాం.
– స్టాఫీ డాలర్, జూనియర్ డాక్టర్
గుర్తింపు ఇవ్వాలి
రోగులకు మెరుగైన సేవ లు అందించడ కోసం ని రంతరం శ్రమిస్తున్నాం. బాధ్యతయుంగా విధు లు నిర్వహిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం అయినా మా డిమాండ్లను నెరవేర్చాలి. పని చేస్తున్నందుకు తగిన గుర్తింపు ఇవ్వాలి.
– డాక్టర్ హరితకృష్ణ, జూనియర్ డాక్టర్
జూనియర్ డాక్టర్ల అసోసియేషన్
జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్
జూడాల సమ్మె ప్రారంభం
విధులు బహిష్కరించి నిరసన

సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదు