మహా శివరాత్రికి భద్రత పెంచండి
ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
నరసరావుపేట: ఈ నెల 26న మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని కోటప్పకొండ, అమరావతి, సత్రశాల, దైద శివాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరునాళ్ల బందోబస్తు ఏర్పాట్లు, నేరాల కట్టడికి తీసుకోవలసిన చర్యల గురించి సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మహిళలు, బాలికలు, చిన్నారులకు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వారికి సంబంధించిన కేసుల విచారణ సమయంలో తప్పనిసరిగా మహిళా పోలీస్ అధికారి, సిబ్బంది ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండే సదస్సులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వేగ నియంత్రికలు, ట్రాఫిక్ సూచనలను తెలిపే సైన్ బోర్డులను, అవసరమైన చోట స్టాఫ్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. 112కు వచ్చే కాల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గంజాయి రవాణా అరికట్టాలని చెప్పారు. అడ్మిన్ అదనపు ఎస్పీ జేవీ సంతోష్, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల డీఎస్పీలు కె.నాగేశ్వరరావు, ఎం.హనుమంతరావు, జగదీష్, మహిళా స్టేషన్ డీఎస్పీ వెంకట రమణ, ఏసీబీ సీఐలు సురేష్‌బాబు, శరత్‌బాబు పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు
అమరావతి: అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి మహా శివరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం అన్ని శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తహసీల్దార్ డానియేల్ అన్నారు. శనివారం స్థానిక ఆలయంలో సమన్వయ కమిటీ రెండో సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్నానాల ఘాట్‌ల వద్ద పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పోలీసులు తగినంత మంది సిబ్బందిని నియమించాలన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వేడుకల సమయంలో మద్యం షాపులను మూసివేయాలని ఎకై ్సజ్ శాఖాధికారులను ఆదేశించారు. సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సీఐ అచ్చియ్య, ఆలయ ఈవో సునీల్‌కుమార్, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
మహా శివరాత్రికి భద్రత పెంచండి
Comments
Please login to add a commentAdd a comment