ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి జిల్లాలోని రైతులు అందరూ రైతు సేవా కేంద్రాల ద్వారా 11 అంకెలు గల విశిష్ట సంఖ్యను పొందాలని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి పేర్కొన్నారు. శనివారం జిల్లాలో పలు చోట్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా పీఎం కిసాన్ పథకాన్ని పొందే రైతులు 2.09 లక్షల మంది ఉన్నారన్నారు. ఇప్పటి వరకు 35వేల మందికి విశిష్ట సంఖ్యను నమోదు చేయటం జరిగిందన్నారు. ఈనెలాఖరు నాటికి 40శాతం వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. పథకాలను పొందేందుకు భవిష్యత్‌లో ఈ విశిష్ట సంఖ్య ఆధారంగానే సులభ సాధ్యమౌతుందన్నారు. ఈ సంఖ్యను పొందేందుకు సమీపంలోని రైతు సేవా కేంద్ర సిబ్బందికి పొలం వివరాలు, ఆధార్ లింకు అయిన సెల్‌ఫోన్ నంబరు సమర్పిస్తే ఆ రైతుకు 11అంకెలు గల విశిష్ట సంఖ్యను నమోదు చేస్తారన్నారు. సమస్య ఉత్పన్నమైతే మండల వ్యవసాయాధికారి, 83310 56905, 83310 56911 నంబర్లను సంప్రదించాలని కోరారు.
ప్రతి రైతుకు 11 అంకెల విశిష్ట సంఖ్య
Comments
Please login to add a commentAdd a comment