Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు | Latest Telugu News Telugu Breaking News 14th October 2022 | Sakshi
Sakshi News home page

Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు

Published Fri, Oct 14 2022 5:47 PM | Last Updated on Fri, Oct 14 2022 6:10 PM

Latest Telugu News Telugu Breaking News 14th October 2022 - Sakshi

1. మోగిన ఎన్నికల నగారా.. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశంలో మరోసారి ఎన్నికల నగరా మోగింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. గొంతు పిసికి చంపేశాడు! అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ?’
ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబుపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు. తన మాట వినమని! వినల! గొంతు పిసికి చంపేశాడు!! అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ?’’ అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్‌‌ చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. విశాఖ గర్జన.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు
రాబోయే తరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటమని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. జేఏసీ మీడియా సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, రేపు(శనివారం) విశాఖ గర్జనలో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను తెలుపుతామన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. భారత సంతతి విద్యార్థిపై దాడి...మోదీజీ సాయం చేయండి అంటూ వేడుకోలు
భారత సంతతి విద్యార్థిపై ఒక దుండగుడు 11 సార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు బాధితుడని శుభమ్‌ గార్గ్‌గా గుర్తించారు. అతను సిడ్నీలోని న్యూ సౌత్‌వేల్స్‌ యూనివ‍ర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నట్లు తెలిపారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే టార్గెట్‌.. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో..
నగరంలో మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో రూ.6 కోట్ల మోసం జరిగింది. 30 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, వారి బంధువులే టార్గెట్‌గా వారి నుంచి 6 కోట్లు వసూళ్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్లతో కూకట్‌పల్లికి  చెందిన కొంగర అంజమ్మ చౌదరి,నాగం ఉమాశంకర్‌లు మోసాలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో!
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో(Reliance Jio) తన యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు జియో యూజర్లు రీచార్జ్‌ చేసుకుంటే కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా వచ్చేది. కానీ తాజాగా కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్‌లలో డిస్నీ+ హాట్‌ స్టార్‌ని తొలగించినట్లు తెలుస్తోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. బుమ్రా స్థానంలో వరల్డ్‌కప్‌ ఆడేది అతడే: బీసీసీఐ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌-2022 జట్టులో జస్‌ప్రీత్‌ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయనున్న బౌలర్‌ పేరును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి వెల్లడించింది. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీని బుమ్రా స్థానంలో ఈ మెగా ఈవెంట్‌కు ఎంపిక చేసినట్లు తెలిపింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

8. రోహిత్‌ను పక్కన పెట్టేసిన హౌస్‌మేట్స్‌, అతడికే ఫుల్‌ సపోర్ట్‌!
బిగ్‌బాస్‌ ఇచ్చిన బ్యాటరీ రీచార్జ్‌ టాస్క్‌ ముగిసింది. ఈ టాస్క్‌లో రోహిత్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. హౌస్‌మేట్స్‌ కోసం రెండు వారాలు సెల్ఫ్‌ నామినేట్‌ అయిన రోహిత్‌కు కనీసం ఫోన్‌ మాట్లాడేందుకు ఛాన్సే ఇవ్వలేదు. తన త్యాగానికి తగిన గుర్తింపు దక్కలేదని రోహిత్‌ ఎమోషనలయ్యాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
గుప్పెడంత ఉండే గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు కలిగిన సూపర్‌ ఫుడ్‌గా గుడ్డును పేర్కొంటారు నిపుణులు. భారత పౌష్టికాహార సంస్థ గుర్తించిన 650 ఆహార పదార్థాల్లో గుడ్డు మొదటిది కావడం గమనార్హం. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఒక్కమాటలో వెయ్యి ఏనుగుల బలం.. కట్‌చేస్తే అంతర్జాతీయ స్థాయిలో
మా అబ్బాయి బొమ్మలు భలే వేస్తాడు’ అని ఫ్రెండ్స్‌తో చెప్పుకొని మురిసిపోయేవాడు ఆ తండ్రి. ఆ పిల్లాడు పెరిగి పెద్దయ్యాక ‘నేను ఆర్టిస్ట్‌ కావాలనుకుంటున్నాను’ అన్నాడు. ఇది తండ్రికి నచ్చలేదు. ఎందుకంటే ఆర్ట్‌ అనేది ఆయన దృష్టిలో అనేకానేక అభిరుచుల్లో ఒకటి మాత్రమే.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement