స్రవంతి.. ప్రాజెక్టుతో సత్తా చాటి
జోగిపేట(అందోల్): ప్రతి రోజూ కళ్ల ముందే అంగవైకల్యంతో ఉన్న స్వీపర్ తరగతి గదిని శుభ్రం చేస్తూ పడుతున్న ఇబ్బందులు చూసి ఆ విద్యార్థినిని తన ఆలోచనకు పదును పెట్టింది. ఈ ఇబ్బందిని ఎలాగైన దూరం చేయాలని సులభంగా గదిని శుభ్రం చేసే విధంగా ఓ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసింది. రెండు, మూడు మాసాలు కష్టపడి ‘డెస్క్ లిఫ్టర్’ అనే ప్రాజెక్ట్‌ను తయారు చేయడమే కాకుండా అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది.
సంగారెడ్డి జిల్లా అందోలు మండలం కన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన అతిపేద కుటుంబానికి చెందిన ఆశం యాదయ్య, కవితల మూడవ కూతురు స్రవంతి. జోగిపేటలోని ఎస్‌ఆర్‌ఎమ్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. పాఠశాలలో పని చేస్తున్న సైన్స్ టీచర్ సిద్దేశ్వర్ సహకారంతో 2023లో ‘డెస్క్ లిఫ్టర్’ అనే ప్రాజెక్టుకు తయారు చేసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో ఈ ప్రాజెక్టు ప్రదర్శించారు. అక్కడ అందరినీ ఆకట్టుకొని హైద్రాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర ప్రదర్శనకు ఎంపికై ంది. 2024వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ఢిల్లీలో జరిగిన 11వ నేషనల్ సైన్స్ ఇన్‌స్పైర్ అవార్డు ప్రదర్శనలో ప్రాజెక్టుకు ప్రశంసలు దక్కాయి. అంతే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో 2025 జూన్‌లో జపాన్‌లో నిర్వహించే అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపిక చేశారు. జపాన్ ప్రదర్శనకు జాతీయ స్థాయిలో 60 ప్రాజెక్టులు, రాష్ట్ర స్థాయిలో నాలుగు ప్రాజెక్టులు ఎంపిక కాగా వాటిలో కన్‌సాన్‌పల్లి విద్యార్థిని రూపొందించిన ‘డెస్క్ లిఫ్టర్’ ప్రాజెక్టు ఒకటి కావడం విశేషం. అతి తక్కువ ఖర్చుతో, తేలికై న వస్తువులతో ఎక్కడికై నా అవలీలగా తీసుకువెళ్లే విధంగా ‘డెస్క్ లిఫ్టర్’ ప్రాజెక్టును రూపొందించారు. పాఠశాలలు, ఆఫీసులు, ఇతర కార్యాలయాల్లో గదులు శుభ్రం చేయడానికి దీన్ని వాడొచ్చు.
అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికై న ‘డెస్క్ లిఫ్టర్’
తక్కువ ఖర్చు, తేలికై న వస్తువులతో రూపకల్పన చేసిన విద్యార్థిని
సులువుగా గదులు శుభ్రం చేసేందుకు ఉపయోగం
సంతోషంగా ఉంది
డెస్క్ లిఫ్టర్ ప్రాజెక్టు తయారు చేసే సమయంలో జిల్లా, రాష్ట్ర స్థాయి గుర్తింపు వస్తే చాలనిపించేది. కానీ భారత ప్రభుత్వం ద్వారా జపాన్‌లో జరిగే ప్రదర్శనకు ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. జూన్‌లో జపాన్ వెళ్లేందుకుగాను అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. పాస్ పోర్టును కూడా సిద్ధం చేసుకున్నాను. ఈ అనుభూతిని జీవితంలో మరచిపోను.
– శ్రవంతి, విద్యార్థి, కన్‌సాన్‌పల్లి
జాతీయ స్థాయిలో గుర్తింపు
డెస్క్ లిఫ్టర్ అనే పరికరాన్ని ఎక్కడికై నా తీసుకెళ్లొచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా స్కూళ్లు, ఆఫీసులు, ఆస్పత్రుల్లో టేబుళ్లని లేపి చక్కగా శుభ్రం చేయొచ్చు. 2025 జూన్ మాసంలో జపాన్ రాష్ట్రంలోని సకూరలో జరిగే ప్రదర్శనకు భారతదేశ ప్రభుత్వం ఎంపిక చేసింది. గతేడాది కన్‌సాన్‌పల్లి పాఠశాల నుంచి ‘పింక్ లూ ’ ప్రాజెక్టు తరఫున భూమిక జపాన్ ప్రదర్శనకు వెళ్లింది.
– సిద్దేశ్వర్, గైడ్ టీచర్, కన్‌సాన్‌పల్లి
స్రవంతి.. ప్రాజెక్టుతో సత్తా చాటి
స్రవంతి.. ప్రాజెక్టుతో సత్తా చాటి
Comments
Please login to add a commentAdd a comment