సిద్దిపేట రూపురేఖలు మారిపోయాయి | - | Sakshi
Sakshi News home page

సిద్దిపేట రూపురేఖలు మారిపోయాయి

Published Thu, Feb 20 2025 8:15 AM | Last Updated on Thu, Feb 20 2025 8:10 AM

సిద్ద

సిద్దిపేట రూపురేఖలు మారిపోయాయి

50 ఏళ్ల తర్వాత మళ్లీ పురిటిగడ్డకు

సంతోషంగా ఉంది: సీనియర్‌ సిటిజన్లు

సిద్దిపేటజోన్‌: యాభై ఏళ్ల కిందట ఉన్న సిద్దిపేటకు ప్రస్తుతం చూస్తున్న దానికి చాలా వ్యత్యా సం ఉందని, అభివృద్ధి చెంది రూపు రేఖలే మారిపోయాయని సిద్దిపేట సీనియర్‌ సిటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్‌ మిత్రులుగా చాలా సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట పట్టణంలో బాల్యం, విద్యాభ్యాసం పూర్తి చేసుకొని విదేశాల్లో ఏళ్ల కొద్ది జీవించిన తర్వాత సిద్దిపేట రావడం జరిగిందన్నారు. సిద్దిపేట పట్టణం అభివృద్ధి చెందడంతో రోల్‌ మోడల్‌గా ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే హరీశ్‌ రావు ప్రత్యేక శ్రద్ధతో సిద్దిపేట ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. ఈ సందర్భంగా వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం రంగనాయక, మల్లన్న సాగర్‌, కోమటిచెర్వు సందర్శించారు. సమావేశంలో సికిందర్‌, హమీద్‌, నజిమ్‌, కలిమ్‌తో పలువురు పాల్గొన్నారు.

పరిశ్రమలో అగ్ని ప్రమాదం

ఘటనా స్థలాన్ని పరిశీలించిన తూప్రాన్‌ డీఎస్పీ వెంకట్‌రెడ్డి

మనోహరాబాద్‌(తూప్రాన్‌): మండలంలోని రంగాయపల్లి శివారులో గల ఎంఎస్‌ అగర్వాల్‌ పరిశ్రమలో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ బట్టిలోంచి వచ్చే వేస్టేజ్‌ను ఒక పక్కన వేయగా వేడికి అక్కడ మంటలు చెలరేగి పక్కన్న ఉన్న స్టోర్‌ రూమ్‌ దగ్ధమైంది. ఇది గమనించిన యాజమాన్యం, స్థానికులు ఫైర్‌ ఇంజన్‌కు సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి మంటలార్పారు. కార్మికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న తూప్రాన్‌ డీఎస్పీ వెంకట్‌రెడ్డి పరిశ్రమ వద్దకు చేరుకొని కార్మికులతో మాట్లాడారు. వీరి వెంట తూప్రాన్‌ సీఐ రంగాకృష్ణ, ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ ఉన్నారు. పరిశ్రమలో జరిగే ప్రమాదాల వల్ల గ్రామానికి ముప్పు పొంచి ఉందని రంగాయపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కళ్లలో కారం కొట్టి

మహిళ మెడలోంచి బంగారం చోరీ

పటాన్‌చెరు టౌన్‌: కిరాణా షాపు నిర్వాహకురాలు కళ్లలో కారం కొట్టి గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోంచి బంగారం లాక్కెళ్లిన ఘటన అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని తులసీవనం కాలనీలో రమ్య అనే మహిళ కిరాణా షాపు నడుపుతుంది. మూడు రోజుల నుంచి ఓ వ్యక్తి కిరాణా షాపునకు తెల్లవారుజామున వచ్చి సామగ్రి తీసుకెళ్తున్నాడు. బుధవారం ఉదయం బైక్‌పై మాస్క్‌ ధరించి కిరాణా షాపునకి వచ్చాడు. ఉల్లిపాయలు కావాలని అడుగడంతో రమ్య తీస్తుండగా ఆమె కళ్లల్లో కారం కొట్టి మెడలో నుంచి పుస్తెలతాడు లాగే ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా పట్టుకోవడంతో విరిగిన అరతులం బంగారంను లాక్కొని పారిపోయాడు. ఈ ఘటనపై షాపు నిర్వాహకురాలు రమ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సిద్దిపేట రూపురేఖలు  మారిపోయాయి
1
1/1

సిద్దిపేట రూపురేఖలు మారిపోయాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement