జిజ్ఞాస ప్రాజెక్ట్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
నర్సాపూర్ రూరల్: విజ్ఞాస ప్రాజెక్టు పోటీల్లో నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్ బుధవారం తెలిపారు. ఇటీవల కళాశాల విద్యా కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో నర్సాపూర్ ప్రభుత్వ కళాశాల నుంచి జంతు శాస్త్రం, చరిత్ర, ఆంగ్ల సబ్జెక్టులు ఆకట్టుకున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్‌కు ఐదుగురు చొప్పున విద్యార్థులు పాల్గొన్నారు. జంతు శాస్త్రానికి సంబంధించి నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని అర్బన్ పార్క్ నందు సీతాకోక చిలుకల వైవిద్యం, నర్సాపూర్ ప్రాంతీయ గిరిజన మహిళల సాంస్కతిక మార్పుపై చరిత్ర, ఆంగ్లంకు సంబంధించి ఆంగ్ల భాష నేర్చుకోవడంలో విద్యార్థులు ఆందోళన గురించి అధ్యయనం వంటి ప్రాజెక్టులు తయారు చేశారు. ఈ ప్రాజెక్టుల ప్రదర్శనకు, సలహాలు సూచనలు ఇచ్చిన అధ్యాపకులను, విద్యార్థులను ప్రిన్సిపాల్‌తోపాటు తోటి అధ్యాపకులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment