కార్తీక్‌కు కలెక్టర్‌ అభినందన | - | Sakshi
Sakshi News home page

కార్తీక్‌కు కలెక్టర్‌ అభినందన

Published Thu, Feb 20 2025 8:16 AM | Last Updated on Thu, Feb 20 2025 8:11 AM

కార్త

కార్తీక్‌కు కలెక్టర్‌ అభినందన

జేఈఈ మెయిన్స్‌లో

99.17 పర్సంటైల్‌ సాధించిన కార్తీక్‌

సంగారెడ్డి: ఇటీవల జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో 99.17 పర్సంటైల్‌ సాధించి ప్రతిభ కనబరిచిన సంగారెడ్డి పట్టణానికి చెందిన విద్యార్థి పి.కార్తీక్‌ను బుధవారం కలెక్టర్‌ వల్లూరు క్రాంతి ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...విద్యార్థులు జీవితంలో లక్ష్యం పెట్టుకుని ఇష్టంతో చదివితే మంచి విజయాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ఇష్ట జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రవికిరణ్‌రెడ్డి, అకాడమిక్‌ ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ షేక్‌ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధ

డీఎల్‌పీవో అనిత

హత్నూర(సంగారెడ్డి): గ్రామాలలో తాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామపంచాయతీ కార్యదర్శులకు డీఎల్‌పీవో అనిత సూచించారు. హత్నూర మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం గ్రామపంచాయతీ కార్యదర్శులతో డీఎల్‌పీవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ...గ్రామాలలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. పైప్‌లైన్‌ లీకేజీలున్నా వెంటనే మరమ్మతులు చేయించాలని, ప్రతీరోజు పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. గుండ్లమాచునూరు గ్రామంలోని నర్సరీని ఆమె పరిశీలించారు. గ్రామపంచాయతీ రికార్డులను సైతం పరిశీలించి కార్యదర్శికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీఈవో యూసుఫ్‌, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

కేతకీ హుండీ

ఆదాయం రూ.28లక్షలు

ఝరాసంగం(జహీరాబాద్‌): శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయం 76 రోజుల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. గర్భగుడిలోని పార్వతీపరమేశ్వరులకు అభిషేకం, మహామంగళహారతి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్‌లోని శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు ఆదాయాన్ని లెక్కించారు. ఈ మేరకు రూ.28,07,500ల ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ రంగారావు, ఆలయ ఈవో శివరుద్రప్ప, ఆలయాధికారులు, అర్చకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజానుకూల బడ్జెట్‌గా మార్పులు చేయాలి

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025–26 బడ్జెట్‌ను ప్రజానుకూల బడ్జెట్‌గా మార్పు చేయాలని సీపీఎం జిల్లా నేతలు డిమాండ్‌ చేశారు. కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్‌ వద్ద బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ...కేంద్ర బడ్జెట్‌ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ అని, కేవలం కార్పొరేట్‌ శక్తులకు మేలు కలిగించే బడ్జెట్‌ అని విమర్శించారు. ప్రధాని మోదీ రైతు బడ్జెట్‌ అంటూనే రైతు రుణమాఫీకి తగిన బడ్జెట్‌ కేటాయించలేదన్నారు. విద్యుత్‌ సంస్కరణలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీసం వేతనంగా రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాయిలు, మాణిక్యం,నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కార్తీక్‌కు కలెక్టర్‌ అభినందన
1
1/3

కార్తీక్‌కు కలెక్టర్‌ అభినందన

కార్తీక్‌కు కలెక్టర్‌ అభినందన
2
2/3

కార్తీక్‌కు కలెక్టర్‌ అభినందన

కార్తీక్‌కు కలెక్టర్‌ అభినందన
3
3/3

కార్తీక్‌కు కలెక్టర్‌ అభినందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement