ఇళ్ల స్థలాల కోసం నిరసన
జహీరాబాద్ టౌన్: మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలతోపాటు రూ.5లక్షలు ఇవ్వాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ...మున్సిపల్‌లో పనిచేస్తున్న కార్మికులంతా నిరుపేదలని, వారికి సొంత ఇళ్లులేవన్నారు. అందుకని ప్రభుత్వం వారికి ఇళ్ల స్థలాలతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించిన వారికి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదన్నారు. ఎన్నికల డ్యూటీ డబ్బులు వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆర్డీవో కార్యాలయం అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక యూనియన్ నాయకులు యశోదమ్మ, మా ణిక్, శ్రీనివాస్, పాండు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment