గుమ్మడిదలలో 15వ రోజుకు చేరుకున్న ఆందోళనలు
జిన్నారం(పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఒక్కోరోజు ఒక్కో వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం అర్ధనగ్నంగా జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు మహిళలు వందల సంఖ్యలో పాల్గొని ప్రధాన కూడళ్ల వద్ద ర్యాలీలు నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేశారు. ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటు విరమించే వరకు ఆందోళన కార్యక్రమాలు విరమించేది లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment