సంగారెడ్డి టౌన్ : ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఫసల్వాది గ్రామ సమీపంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని యువకులు మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. చిన్నారి భయంతో కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని పాపను బయటకు తీసుకొచ్చారు. కాగా, యువకులిద్దరినీ పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒకరు తప్పించుకున్నారు. పట్టుబడిన యువకుడికి స్థానికులు అక్కడే దేహశుద్ధి చేశారు. పాపను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment