మేడారం జాతరలో ప్రధాన ఘట్టం చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకురావడం. ఈ ఘట్టంలో అత్యంత ఉద్విగ్న భరిత క్షణాలు చిలకలగుట్ట కిందికి సమ్మక్క దిగిరావడం ఆ సమయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఎదురేగి వెళ్లి తుపాకులతో గాలిలోకి కాల్పులు జరపడం. ఈ క్షణాల్లో అందరి కళ్లు భరణి రూపంలో ఉన్న సమ్మక్కపైనే ఆ తర్వాతి స్థానం ఆ భరణి తీసుకువచ్చే ప్రధాన వడ్డే కొక్కెర కృష్ణయ్యపైనే ఉంటాయి. వేలది మంది ప్రత్యక్షంగా లక్షలాది మంది ప్రసార మాధ్యమాల్లో కోట్లాది మంది పరోక్షంగా ఉత్కంఠను అనుభవిస్తారు. అంతటి ఉత్కంఠ, ఉద్విగ్నభరిత క్షణాలను తన భూజాలపై మోసే కొక్కర కృష్ణయ్య మనోగతం సాక్షి పాఠకులకు ప్రత్యేకం.
ఆరోసారి
2022 ఫిబ్రవరి 17వ తేదిన చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను కొక్కెర కృష్ణయ్య తీసుకురానున్నారు. అంతకు ముందు ఆయన మొదటిసారిగా 2012 జాతరలో ఈ అదృష్టాన్ని దక్కించుకున్నారు. అంతకు ముందు జాతరలో కొక్కెర కృష్ణయ్యకు∙బాబాయ్ అయిన కొక్కెర వెంకన్న ఈ బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత ఆయన కొడుకు సాంబశివరావు చేశారు. వారిద్దరి తర్వాత కృష్ణయ్యకు ఈ భాగ్యం దక్కింది. కొక్కెర కృష్ణయ్య మేడారంలోనే నివాసం ఉంటారు. సాధరణ సమయంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. భార్య వినోద, ఎనిమిదో తరగతి చదివే కొడుకు, డిగ్రీ, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఆ వారం రోజులు నిష్టతో ఉంటాను
గుడిమెలిగె పండుగతో సమ్మక్క–సారలమ్మ జాతరకు తొలి అడుగు పడుతుంది. అయితే జాతర మొదలయ్యేది మండెమెలిగే పండుగతోనే. మండెమెలిగే పండుగ నాడు మేడారంలో ఉన్న సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ రోజు నుంచి చిలకలగుట్ట పైనుంచి సమ్మక్కతల్లిని గద్దెలపైకి చేర్చే వరకు నియమనిష్టలతో ఉంటాం. పగటి వేళ కేవలం పాలు, అరటిపళ్లు ఆహారంగా తీసుకుంటారు. రాత్రి పొద్దుపోయాక పూజ చేసిన అనంతరం అన్నం తింటారు.
ఆ రోజున
దేవాదాయశాఖ ఇచ్చిన కొత్త బట్టలు ధరిస్తాం మేడారం సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ తర్వాత రహాస్యం అయిన పూజా సామగ్రిని తీసుకుని నాతో పాటు వడ్డెల బృందం చిలకలగుట్టకు బయల్దేరుతుంది. సమ్మక్క వడ్డేలైన దోబేపగడయ్య దూపం వేస్తుండగా మల్యాల ముత్తయ్య జలకంపట్టి వేస్తూ ముందుకు కదులుతాం. జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య). భజంత్రీలు మాదిరి పుల్లయ్య, మాదిరి నారయణలు మమ్మల్ని అనుసరిస్తారు. అయితే చిలకలగుట్ట సగం వరకే వీరికి ప్రవేశం. ఆ తర్వాత సమ్మక్క తల్లి కొలువై ఉండే రహాస్య ప్రదేశానికి నేనొక్కడినే వెళ్తాను. అక్కడ పూజాలు నిర్వహించిన తర్వాత సమ్మక్క తల్లి భరిణి రూపంలో కిందకు తీసుకువస్తాను. నేను రావడం కనిపించగానే జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య). భజంత్రీలు మాదిరి పుల్లయ్యలు తమ వాయిద్యాలతో శబ్ధం చేస్తారు. అలా గుట్టమధ్య నుంచి సమ్మక్క తల్లి చిలకలగుట్ట పాదల వద్దకు చేరుకోగానే చేరుకోగానే ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్, ఎస్పీలు గాల్లోకి కాల్పులు జరిగి ఆ తల్లికి ఘనస్వాగతం పలుకుతారు.
మేము మద్యం సేవించం - కొక్కెర కృష్ణయ్య
సమ్మక్క, సారలమ్మ పూజారులు తాగుతారనే అపోహా అందరిలో ఉంది. తాగితేనే దేవత పూనుతుందని అనుకుంటారు. తాగడం అనేది పూజా విధానంలో ఓ భాగంగా అంతా భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. తాగడం అనేది వడ్డెల వ్యక్తిగత విషయం. జాతర సంబరాల్లో భాగంగా మద్యం తీసుకునే అలవాటు ఉన్న వడ్డేలు తాగువారు. మద్యం సేవించడం పూజా విధానంలో భాగం కాదు. నా వరకు నేను మండెమెలిగె పండగ నాటి నుంచే నిష్టతో ఒక్క పొద్దు ఉంటాను. గద్దెలకు చేర్చేవరకు మద్యం సేవించను. నాతో పాటు ఉండే వడ్డేలు వారి వ్యక్తిగత అలవాట్లను బట్టి మద్యం తీసుకుంటారు. అలా మద్యం సేవించడం తప్పు కాదు. అదేవిధంగా సేవించడం తప్పనిసరి కాదు. గతంలో సాయంత్రం 4 గంటలకు కల్లా గద్దెల మీదికి సమ్మక్క తల్లిని తీసుకువచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు జాతరకు జనం పెరగడం వల్ల సాయంత్రం 5 అవుతోంది. అయితే ఏడుగంటలల్లోపు ఎప్పుడు వచ్చినా మంచిదే.
అందరిలానే నేను
ఎంతో మంది భక్తులు తమ కోరికలు తీరాలని, తమ కష్టాలు తొలగిపోవాలని ఆ తల్లిని కొలుస్తారు. వారు అనుకున్న పనిని తల్లి చేసిపెడుతుంది. అందుకే ఏ ఏడుకి ఆ ఏడు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఆ తల్లిని స్వయంగా తీసుకువచ్చే నాకు మరింత మేలు జరుగుతుంది అని అనుకుంటారు. అందరిలానే నేను. తీసుకురావడం అనేది బాధ్యత అంతే. అందరికీ మేలు చేసే తల్లి నా కుటుంబానికి మేలు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment