
నత్తేనయం..
నత్తనడకన సాగుతున్న గోదావరి కరకట్ట పనులు
● రూ.139కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
● ముగిసిన కాంట్రాక్టర్ అగ్రిమెంట్
● పొడగించాలని ప్రభుత్వానికి విన్నపం
వరదలు వచ్చే పరిస్థితి ఉంది. మంగపేట గోదావరి పుష్కరఘాట్‌లోని కొన్ని మెట్లు కొట్టుకుపోయాయి. ఒడ్డు మొత్తం నీటిలో కలిసిపోయింది. గ్రామానికి అతి సమీపంలో గోదావరి వరద ఉండడంతో గంపోనిగూడెం, మంగపేట ప్రజలు వణికిపోతున్నారు. సకాలంలో రివిట్‌మెంట్ చేయకపోతే ఈసారి వరదలు వస్తే ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.
ఏటూరునాగారం: వర్షాకాలంలో ఓ వైపు గోదావరి వరదలు..మరో వైపు కరకట్ట లీకేజీలతో ఏటూరునాగారం, రొయ్యూరు, శంకరాజుపల్లి గ్రామాల ప్రజలు అల్లాడిపోయారు. దీంతో గోదావరి ఒడ్డువెంట నిర్మించిన కరకట్ట, కట్టకు ఉన్న గేట్లు పటిష్ట పర్చేందుకు మంగపేట వద్ద రివిట్‌మెంట్, రాంనగర్ వద్ద కొత్త కరకట్ట, మరో 20 చోట్ల తూములకు గేట్లను అమర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 139 కోట్లను కేటాయిస్తూ మంజూరు ఇచ్చింది. గత ఏడాది టెండర్లు పూర్తి చేసి అగ్రిమెంట్ అయినప్పటికీ పనులను కాంట్రాక్టర్ ఆలస్యంగా మొదలు పెట్టారు. అగ్రిమెంట్ సమయం కూడా ముగిసింది. పనులు చేసేందుకు అగ్రిమెంట్ సమయాన్ని పొడగించాలని మళ్లీ గుత్తేదారుడు ప్రభుత్వానికి విన్నవించారు.
ఏటూరునాగారం గ్రామం నుంచి రాంనగర్, మంగపేట వరకు ఉన్న కరకట్టను పటిష్ట పర్చేందుకు, దెబ్బతిన్న చోట కొత్తది నిర్మించడం, తూములకు ఉన్న గేట్లు తుప్పుపట్టినవి తొలగించి కొత్తవి అమర్చాలి. అలాగే రివిట్‌మెంట్ చేయడం వంటి పనులను గుత్తేదారుడు టెండర్ ద్వారా దక్కించుకున్నారు. అయితే ఈ పనులు గత ఏడాది మొదలు పెట్టాల్సి ఉండగా ఆలస్యంగా మొదలు పెట్టారు. అయినా కూడా పనులు ఇంకా నత్తనడకన సాగుతున్న పరిస్థితి ఉంది. రామన్నగూడెం–ఏటూరునాగారం మధ్యలో కరకట్టను సుమారు 200ల మీటర్ల మేర మట్టితో నిర్మించి రివిట్‌మెంట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం మట్టి పనులు కొసాగుతున్నాయి. కరకట్ట పటిష్టతకు రాయి, మట్టి, ఇసుకను కలుపుకొని పనులు చేయించడంలో ఇరిగేషన్ అధికారులు విఫలం అయ్యారు. గుత్తేదారుడు సకాలంలో మిషనరీ, సామగ్రిని తెచ్చుకోవడంలో జాప్యం జరిగింది. మరో రెండు నెలల సమయంలో వర్షాలు మొదలయ్యే పరిస్థితి ఉంది. పనులు పూర్తి కాకపోతే దీనివల్ల మళ్లీ పెడచెవిన సీఎం ఆదేశాలు
గత ఏడాది వరదల సమయంలో సీఎం కేసీఆర్ ఏటూరునాగారం ఐటీడీఏలో రివ్యూ ఏర్పాటు చేసి కరకట్ట పనులను సకాలంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇక్కడ పనుల పురోగతి చూస్తే మాత్రం అంతంత మాత్రమే కనిపిస్తోంది. ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వంతో కరకట్ట మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్‌కు ఏడాది సమయం ఇచ్చారు. ఆ సమయం కాస్తా కూడా ముగిసింది. మళ్లీ అగ్రిమెంట్‌ను పొడగించుకొని పనులను వర్షా కాలంలోపు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప
నులను చూస్తే మరో రెండేళ్ల కాలం పట్టేలా ఉందని రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు.
40 గేట్లకు.. పది పూర్తి
కరకట్టకు ఉన్న 40 తూము గేట్లను తొలగించి కొత్త వి అమర్చాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 10 గేట్లను మాత్రమే కొత్తవి ఏర్పాటు చేశారు. ఇంకా 30 గేట్లను మార్చాల్సి ఉంది. వాటి పనులు ముందుకు సాగకపోవడం వల్ల మళ్లీ వరద నీరు వస్తే ఆ గేట్ల గుండా కాల్వల ద్వారా మండల కేంద్రాన్ని చుట్టుముట్టి భారీ నష్టాన్ని మిగిల్చే పరిస్థితి ఉంది.
పలు చోట్ల ప్రమాదకరంగా..
మండల కేంద్రంలోని 1వ వార్డు వద్ద 3 చోట్ల కరకట్టకు పగుళ్లు తేలి ఉన్నాయి. గత వర్షా కాలంలో నీరు ఊట అంతా కూడా బయటకు వచ్చింది. స్థానికులు సకాలంలో గుర్తించి ఇసుక బస్తాలు వేసి కరకట్టను, గ్రామాన్ని కాపాడుకున్నారు. అంతే కాకుండా 2, 3వ వార్డుల సమీపంలో కూడా కరకట్ట అక్కడక్కడా దెబ్బతిని ఉంది. వాటిని కూడా పరిశీలించి పూర్తి చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment