షాకింగ్‌ వీడియోను షేర్‌ చేసిన టాప్‌ హీరో! | Akshay Kumar Tweets Video of Cop Saving Woman Who Fell Off Moving Train | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 26 2016 6:27 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ సామాజిక విషయాల్లోనూ చురుగ్గా ఉంటారు. తాజాగా ఆయన సోషల్‌ మీడియాలో ఓ షాకింగ్‌ వీడియో పోస్టు చేశారు. ముంబై రైల్వే స్టేషన్‌లో నడుస్తున్న రైలు నుంచి దిగుతూ ఓ మహిళ అదుపుతప్పి పడిపోయింది. రైలు కిందకు వెళ్లిపోతున్న ఆమెను అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌ చురుగ్గా స్పందించి కాపాడాడు. వెంటనే ఆమెను ఇటువైపు లాక్కొచ్చి ప్రాణాలు నిలబెట్టాడు. ఆ కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిని అక్షయ్‌కుమార్‌ కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. 'ఈ వీడియో చూసి తన గుండెలు ఆగినంత పనైంది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన లోనావాలా పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ పవన్‌ తాయ్‌డేకు సెల్యూట్‌' అంటూ అక్షయ్‌ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement