అందరూ ఊహించినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నది ప్రజారాజధాని కాదు..ప్రైవేట్ రాజధాని అని తేలింది. కేపిటల్‌సిటీ మాస్టర్ ప్రణాళికే ఇది స్పష్టం చేసింది. భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)లో రైతుల నుంచి తీసుకున్న 35వేల ఎకరాలతోపాటు ప్రభుత్వానికి చెందిన అటవీ, దేవాదాయ శాఖల చెందిన మరో 19వేల ఎకరాల్లో సింహభాగం ప్రైవేట్ సంస్థలకు, రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి కట్టపెడుతోంది. మొత్తం 54వేల ఎకరాల్లో రహదారులు, గ్రామాల సెటిల్‌మెంట్స్, ప్రభుత్వ ఇనిస్టిట్యూషన్స్, మౌలిక సదుపాయాలు, సీడ్ కేపిటల్, వాటర్ బాడీలకు అవసరమయ్యే భూములను తప్ప మిగతా 21,870 ఎకరాలను సింగపూర్‌కు చెందిన కంపెనీలకు, ప్రైవేట్‌సంస్థలకు ఏకంగా 99ఏళ్ల పాటు లీజుకు కేటాయించనుంది.
Published Mon, Aug 3 2015 9:29 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement