జగన్కు బెయిల్ రాకుండా బాబు అడ్డుకునే ప్రయత్నాలు: ఉమ్మారెడ్డి | Chandrababu Naidu Delhi trip has hidden agenda says Ummareddy | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 12 2013 4:37 PM | Last Updated on Wed, Mar 20 2024 1:46 PM

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ను మరోసారి అడ్డుకునేందుకు బాబు కుట్రచేస్తున్నారని విమర్శించారు. అందుకే అర్థాంతరంగా ఆత్మగౌరవయాత్రను ముగించుకొని ఆయన ఆగమేఘాల మీద ఢిల్లీ బయలుదేరారని ధ్వజమెత్తారు. ద్వితీయ శ్రేణి నేతల్ని పంపిస్తే లాభంలేదనుకున్న చంద్రబాబు, తానే స్వయంగా ఢిల్లీకి వెళ్తున్నారన్నారు. చిదంబరంతో చంద్రబాబుకు ఉన్న చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర అర్థంతరంగా ఆగిపోయిందన్నారు. ఎవరి ఆత్మగౌరవం కోసం బాబు యాత్ర చేశారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబూ.. నీది రెండుకళ్ల సిద్దాంతం కాదు, రెండుకాళ్ల సిద్దాంతం అని విమర్శించారు. బస్సుయాత్రలో ఏనాడైనా చంద్రబాబు జై సమైక్యాంధ్ర అన్నారా? అని ప్రశ్నించారు. ఆనాడే అవిశ్వాసానికి మద్దతు పలికి ఉంటే ఈ ప్రభుత్వం కూలిపోయి ఉండేదన్నారు. నాలుగేళ్ల కాలంలో టిడిపి 46 చోట్ల పోటీచేస్తే 26 చోట్ల డిపాజిట్ గల్లంతయిందన్నారు. టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు పడటం వల్లే డిపాజిట్లు గల్లంతయ్యయన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement