వార్రూమ్ సమావేశంలో బుజ్జగింపు | congress war room meeting over t bill | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 4 2014 8:44 PM | Last Updated on Thu, Mar 21 2024 8:30 PM

ఏఐసీసీ కార్యాలయంలో వార్రూమ్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎంపిలు రాజయ్య, సురేష్ షెట్కర్, పొన్నం ప్రభాకర్, రాపోలు ఆనంద భాస్కర్, విహెచ్ హనుమంత రావు, రేణుకా చౌదరి పాల్గొన్నారు. ఏఐసిసి తరపున మోతీలాల్ ఓరా, కుంతియా హాజరయ్యారు. ఆహ్వానం ఉన్నా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరుకాలేదు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఎంపిలను అధిష్టానం నేతలు బుజ్జగిస్తున్నారు. ఈ సమావేశానికి సీమాంధ్ర, తెలంగాణా కాంగ్రెస్‌ ఎంపీలను మాత్రమే ఆహ్వానించారు. అయితే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు మాత్రం ఆహ్వానాలు పంపలేదు. వార్రూమ్ సమావేశానికి తనకు ఆహ్వానం లేదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు మాత్రమే వెళతారన్నారు. ఆహ్వానం లేకపోయినా లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్ హాజరయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement