పుణె యెరవాడ జైల్లో మహాత్మా గాంధీ ఉపయోగించిన చరఖాను లండన్లో వేలం వేయనున్నారు. నవంబర్ 5న ప్రతిష్టాత్మక బ్రిటీష్ యాక్షన్ హౌస్లో అందుబాటులో ఉంచనున్నారు. దీని కనీస బిడ్ను దాదాపు 50 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. భారత స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీని కొన్నాళ్లు యెరవాడ జైల్లో నిర్భందించారు. ఆ సమయంలో వాడిన చర్కాను గాంధీ.. అమెరికాకు చెందిన పఫర్కు కానుకగా ఇచ్చారు. గాంధీకి అత్యంత ఇష్టమైన వస్తువుల్లో చరఖా ఒకటి. ఖాదీ దుస్తుల్ని ధరించాలని పిలుపునిచ్చిన గాంధీ స్వయంగా నూలు వడికారు. మహాత్మా గాంధీకి సంబంధించి 60 వస్తువుల్ని వేలం వేయనున్నట్టు యాక్షన్ హౌస్ నిర్వాహకులు తెలిపారు. ఇందులో ముఖ్యమైన దస్తావేజులు, ఫొటొలు, పుస్తకాలు ఉన్నాయి. ఇంగ్లండ్లో గతంలో భారత చారిత్రక వస్తువుల్ని చాలావాటిని వేలం వేశారు. వీటిలో కొన్నింటిని భారతీయులు సొంతం చేసుకున్నారు.
Published Tue, Oct 22 2013 12:49 PM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement