చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం గొల్లపల్లి వద్ద పండ్లరసాల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో పాటు పొగ కమ్ముకుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో దగ్గరకు వెళ్లలేకపోతున్నారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు దూరం నుంచే ప్రయత్నిస్తున్నారు. మూడు పైరింజన్లతో పాటు నీటి ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమయితే తమిళనాడు నుంచి ఫైరింజన్లు రప్పించనున్నారు. మంటలు చట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా గుట్టమీదపల్లి గ్రామస్థులను అప్రమత్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వీరిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంటలు అంటుకోవడానికి గల కారణాలు వెల్లడి కాలేదు. మంటలు అర్పితేనే ఎంత ఆస్తి నష్టం జరిగిందన్నది తెలుస్తుంది.
Published Wed, Jul 24 2013 1:59 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement