సికింద్రాబాద్ లోని చిలకలగూడలో మంగళవారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. బిల్డింగ్ పై నుంచి ప్రియురాలు రూపను ప్రియుడు సాజిద్ నెట్టివేసిన స్థానికంగా సంచలనం రేపింది. ఏడు సంవత్సరాలుగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది, అయితే గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రూప బర్త్ డే కార్యక్రమానికి వచ్చిన సాజిద్.. ఆమైను మూడో అంతస్తు నుంచి తోసి ఈ అఘాయిత్యాయానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రియుడు సాజిద్ కుత్బుల్లా పూర్ గాజుల రామారంకు చెందిన వాడని తెలిసింది. బాధితురాలు పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రియుడిపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
Published Tue, Oct 14 2014 7:58 PM | Last Updated on Thu, Mar 21 2024 5:25 PM
Advertisement
Advertisement
Advertisement