అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నాటకీయ పరిణామాల మధ్య ఎన్డీఏ కూటమి అక్కడ అధికారాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి పెమా ఖండూ నేతృత్వంలోని 43 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. వీరంతా ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్(పీపీఏ)లో గంపగుత్తగా విలీనం అయిపోయారు. జూలైలో పెమా ఖండూ సీఎం పగ్గాలు స్వీకరించడం తెలిసిందే. రెండు నెలల తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి పీపీఏలో చేరారు. ఒక సీఎం పార్టీకి రాజీనామా చేసి పార్టీ ఫిరాయించడం గమనార్హం. దీంతో అరుణాచల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది.
Published Sat, Sep 17 2016 7:45 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
Advertisement