జమ్మూ కశ్మీర్ ప్రజలు ప్రశాంతత పాటించాలని, అప్పుడే రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. రాష్ట్ర పరిస్థితిపై మంగళవారం ఆయన ఉన్నత స్థాయి భేటీలో సమీక్షించి, ఆందోళన వ్యక్తం చేశారు. అమాయక ప్రజలకు ఎలాంటి ఇబ్బందిగాని, ప్రాణనష్టంగాని జరగకూడదని ఆకాంక్షించారని పీఎంఓ కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.