కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో నర్సులు చేసిన నిర్వాకానికి వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. పురిటి నొప్పులు రావడంతో గర్భిణిని ఆమె బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్ లేరు. ఇద్దరు నర్సులతో కలిసి స్టాఫ్ నర్సు ఆపరేష్ చేసింది. కవల పిల్లలు పుట్టారు. ఆ తరువాత మహిళకు రక్తస్రావం అయింది. నర్సులు చేసిన వైద్యం వికటించి మహిళ మృతి చెందింది. దాంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాలింత మృతి చెందినట్లు వారు ఆరోపిస్తున్నారు.
Published Sun, Nov 3 2013 2:53 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
Advertisement