గత ఆరు రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఉస్మానియా వైద్యులు పది గంటల వైద్య నివేదిక విడుదల చేశారు. రిపోర్ట్ వివరాలు: బీపీ 110/60, షుగర్ 70, కీటోన్ లెవల్ 4+ ప్రమాదకర స్థాయిలో కీటోన్స్ హార్ట్‌రేట్ నిమిషానికి 60, యూరిన్ షుగర్ నిల్ బ్లడ్ యూరియా 24, సీరంక్రియాటిన్ 1.1 రేండమ్ బ్లడ్ షుగర్ 64, సోడియం 142, పొటాషియం 4.6 కీటోన్ లెవల్ పెరగడం కిడ్నీలకు ప్రమాదమని వైద్యులు వెల్లడించారు. మరోవైపు జగన్ రక్త నమునాలను వైద్యులు సేకరించారు. కాగా ఆయన పల్స్ రేట్ 50/60కు పడిపోయింది. జగన్ ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాసేపట్లో మరోసారి జగన్కు వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా గత రాత్రి ఆయనను చంచల్గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆయను ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని వైద్యులు కోరినా జగన్ మాత్రం నిరాకరిస్తున్నారు. దీక్ష ఇంకా కొనసాగితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.
Published Fri, Aug 30 2013 11:53 AM | Last Updated on Wed, Mar 20 2024 1:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement