సర్కారి మాట అసత్యాల మూట! | World Bank team about state government on capital city | Sakshi
Sakshi News home page

సర్కారి వారి మాట అసత్యాల మూట!

Published Mon, Oct 9 2017 7:19 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవన్నీ అసత్యాలేనని ప్రపంచబ్యాంక్‌ తనిఖీ బృందం నిర్ధారణకు వచ్చింది. భూసమీకరణ(ల్యాండ్‌ పూలింగ్‌) స్వచ్ఛందమంటూ రాష్ట్రప్రభుత్వం, సీఆర్‌డీఏ చెప్పినదాంట్లో వాస్తవం లేదని గ్రహించింది. ఈ విషయంలో ఇన్నాళ్లుగా సీఆర్‌డీఏ చెప్పినదానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన లేకుండా ఉందని పేర్కొంది. భూసమీకరణ సందర్భంగా తమను బెదిరించినట్టు, భయోత్పాతానికి గురిచేసినట్టు రైతులు తమ తనిఖీల సందర్భంగా వెల్లడించినట్టు బృందం స్పష్టం చేసింది. అంతేగాక సామాజిక, ఆర్థిక, పర్యావరణం అంశాలతోపాటు ఆహారభద్రతపైనా సర్కారు చెప్పిన మాటల్లోనూ నిజం లేదన్న భావనను వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement