Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YARCP MLcs Questioned Over Vizag Steel Plant Privatization In Assembly1
‘స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ: మేం పోరాడతాం.. మీరు ఆపలేరా?’

సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌.. స్టీల్‌ ప్లాంట్‌ నడపటం చాలా కష్టం, దానికి మైన్స్‌ కావాలి.. లాభాల్లోకి రావాలంటూ కామెంట్స్‌ చేశారు. తాము ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పకనే చెప్పేశారు.ఏపీలో అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్బంగా నేడు శాసన మండలిలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు అడుగులు పడుతున్నాయి మూడు బ్లాస్ట్ ఫర్నేష్‌లలో రెండు మూత పడ్డాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. పెట్టుబడుల ఉప సంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేస్తారా లేదా?. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వం అని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ప్రైవేటీకరణ వేగంగా జరుగుతుంటే ఆపే ప్రయత్నం చేశారా?. ఇద్దరు ఎంపీలు ఉన్న కర్ణాటకలో ఉక్కు మంత్రి ఆ రాష్ట్రంలో భద్రావతి స్టీల్ ప్లాంట్‌కు 30వేల కోట్లు ఆర్థిక సహాయం తెచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రధాన మంత్రిని ఆడిగారా? అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘మాకు ప్రైవేటీకరణ ఆపే శక్తి ఉంది కాబట్టే అఖిలపక్ష సమావేశం మేము వేయలేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వలేదు. స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంట్‌తో కూడిన అంశం. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. మంత్రులు గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదు. ఈ ఆరు నెలల్లో స్టీల్ ప్లాంట్ భూములను రెండు దఫాలుగా వేలానికి నోటిఫికేషన్ ఇచ్చారు. మా నాయకుడు ప్రధానమంత్రి దగ్గరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకమని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము పోరాడుతాం. పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు ఆ మాటకి కట్టుబడి ఉండాలి అని డిమాండ్‌ చేశారు.ఎమ్మెల్సీల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్‌ సమాధానం ఇస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా భావోద్వేగమైన అంశం. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమే కానీ.. దానిని నడపడానికి చాలా సమస్యలు ఉన్నాయి. దానికి మైన్స్ కావాలి, లాభాల్లోకి రావాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక, చివరగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్టీల్‌ ప్లాంట్‌పై తీర్మానం అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.అనంతరం, కూటమి సర్కార్‌ తీరుపై స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ​ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్‌ చేశారు. స్టీల్‌​ ప్లాంట్‌ విషయంలో మంత్రుల వ్యాఖ్యలపై నిరసన చేపట్టారు. అలాగే, తీర్మానం చేయాలని కోరారు. దీంతో, చెర్మన్‌ మండలిని వాయిదా వేశారు.

1500 Migrants Depart From Mexico To Reach USA On Jan 202
ట్రంప్‌ టెన్షన్‌.. 1500 మంది అక్రమ వలసదారుల కొత్త వ్యూహం!

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయాన్ని అందుకున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ట్రంప్‌ ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కుర్చీ ఎక్కేలోగా వలసదారులు అమెరికా చేరుకోవాలని ప్లాన్‌ చేసుకుంటున్నారు. దాదాపు 1500 మంది అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం.డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారం చేపట్టే నాటికి అక్రమ వలసదారులు అమెరికాలోకి వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. మెక్సికన్‌ సిటీ తపచులా నుంచి దాదాపు 1500 మంది వలసదారులు అమెరికాకు బయలుదేరినట్టు కథనాలు వెలువడ్డాయి. సరిహద్దుల వెంట 2600 కిలోమీటర్లు నడక మార్గంలో ప్రయాణించి అమెరికా చేరుకోవాలని వారు ప్రణాళిక చేసుకున్నారు. అయితే, ఎలాగైనా అమెరికా చేరుకుని ట్రంప్‌ అధికారంలోకి రాక ముందే అక్కడ ఆశ్రయం పొందాలనేది తమ ప్రణాళిక సదరు వలస బృందంలోని ఓ వ్యక్తి చెప్పినట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.ఇదిలా ఉండగా.. తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను దేశంలోకి రాకుండా అరికడతానని, అమెరికాలో ఉన్నవారిని పంపించి వేస్తానని ఎన్నికల సందర్భంగా డొనాల్డ్‌ ట్రంప్ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 20న ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే లోపే అమెరికాలో అడుగుపెట్టాలని శరణార్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలిచిన తర్వాత పలువురు అక్రమ వలసదారులు ఇప్పటికే అమెరికాను విడిచివెళ్లినట్టు సమాచారం. Tapachula: This morning, Nov. 20th, another caravan departed southern Mexico. This is the sixth caravan to leave Chiapas since Claudia Sheinbaum's presidency; five have left from Tapachula and one from Tuxtla Gutiérrez with the intention of reaching central Mexico. “Fear,… pic.twitter.com/Y9W98aIQIY— Auden B. Cabello (@CabelloAuden) November 20, 2024

Volunteers Are No More: AP People Angry on Chandrababu Cheating3
చంద్రబాబు పచ్చి మోసంపై ప్రజాగ్రహం

అమరావతి, సాక్షి: ఏపీలో సంక్షేమ వారధులుగా ముద్రపడిపోయిన వలంటీర్లకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పెద్ద షాకే ఇచ్చారు. గతంలో వాళ్లపై తీవ్ర విమర్శలు గుప్పించి.. ఎన్నికలటైంలో వాళ్లను కొనసాగిస్తానని, జీతం సైతం పెంచుతామని స్వయంగా ఆయన ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థకే మంగళం పాడేశారు.ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వలంటీర్‌ వ్యవస్థ మొదలైంది. సంక్షేమ పథకాల విషయంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను మొదలుపెట్టారాయన. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నంతకాలం.. వీళ్ల ద్వారానే పౌర సేవలు నిరాటంకంగా సాగాయి. ఎండా, వాన, చలి లెక్కచేయకుండా.. చివరకు కరోనా టైంలోనూ ప్రాణాలకు తెగించి మరీ సేవల్ని అందించారు వాళ్లు. దేశవ్యాప్తంగా వలంటీర్‌ వ్యవస్థ గురించి చర్చ నడిచింది. అయితే.. ఎన్నికలకు నెలముందు.. టీడీపీ రాజకీయం నడిపించి వలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచింది. దీంతో లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఈలోపు ఎన్నికలయ్యాయి. అధికారంలోకి వచ్చి ఇన్నిరోజులైనా వాళ్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు. మరోవైపు.. తమ విధులకు సంబంధించి 2.66 లక్షల మంది వాలంటీర్ల ఆందోళనకు గురయ్యారు. కలెక్టరేట్‌ల చుట్టూ తిరిగి వినతి పత్రాలు సమర్పించారు. ఇంకోపక్క.. నామ మాత్రంగా సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కొనసాగించారు. దీంతో వలంటీర్‌ వ్యవస్థ కొనసాగుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే.. ఇక్కడ వైఎస్సార్‌సీపీ అనుమానాలే నిజమయ్యాయి. జగన్‌ ఆలోచనను తుడిచేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఆ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్లే.. అసెంబ్లీ సాక్షిగా ఏపీ మంత్రి చేసిన ప్రకటనతో.. చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్ల ఊపిరి తీసింది. వలంటీర్లు విధుల్లో లేరని, వాళ్లను కొనసాగించేది లేదని, అలాంటప్పుడు జీతాల పెంపు ఎక్కడిదంటూ? చెప్పడంతో చంద్రబాబు పచ్చి మోసంపై.. ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది.బుధవారం మండలిలో మండలి ప్రశ్నోత్తరాల సంద­ర్భంగా వలంటీర్‌ వ్యవస్థపై ప్రశ్న YSRCP ఎమ్మెల్సీల ప్రశ్న.. గ్రామ, వార్డు వలంటీర్లకు గౌరవ వేతనం ఎప్పుడు పెంచుతారు?మంత్రి వీరాంజనేయస్వామి సమాధానం.. ప్రస్తుతం రాష్ట్రంలో వలంటీర్లు పనిచేయడంలేదని చెప్పారు. వారికి ఈ ఏడాది మే వేతనం రూ.277.21 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం వలంటీర్లను నియమించిందని, ఆ తర్వాత వారిని కొనసాగిస్తూ జీవో ఇవ్వలేదని, అందుకే తాము వారిని కొనసాగించలేమని అన్నారు. వలంటీర్‌ వ్యవస్థే లేనప్పుడు జీతాల పెంపు అంశం ఎలా వస్తుంది.

Ind vs Aus 1st Test: Morne Morkel Shares Key Update About Gill Fitness4
ఆసీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు శుభవార్త?!

ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్భంగా గాయపడ్డ యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ రోజురోజుకు మెరుగు అవుతున్నాడని టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ తెలిపాడు. పెర్త్‌ టెస్టుకు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటూ అభిమానులకు శుభవార్త అందించాడు.​కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది. శుక్రవారం నుంచి ఈ మెగా సిరీస్‌ మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే ఆసీస్‌కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడుపుతోంది.ఈ క్రమంలో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో గిల్‌ ఎడమ బొటన వేలికి గాయం అయింది. అయితే, బౌలింగ్‌ కోచ్‌ మోర్కెల్‌ అందించిన సమాచారం ప్రకారం.. గిల్‌ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. బలహీనంగా టాపార్డర్‌ఇదిలా ఉంటే.. ఇప్పటికే వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరం కావడంతో... టాపార్డర్‌ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో గిల్‌ కూడా మ్యాచ్‌ ఆడకపోతే జట్టుకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.మ్యాచ్‌ ప్రారంభానికి ముందుఈ నేపథ్యంలో చివరి వరకు వేచి చూసే ధోరణి అవలభించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. మ్యాచ్‌ రోజు వరకు గిల్‌ ఫిట్‌నెస్‌ సాధించాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ‘గిల్‌ రోజు రోజుకు మెరుగవుతున్నాడు. టెస్టు మ్యాచ్‌ ప్రారంభానికి ముందు అతడిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నాడు.ఇక రోహిత్‌ శర్మ గైర్హాజరీలో కెప్టెన్సీ చేయబోతున్న బుమ్రా గురించి మోర్కెల్‌ మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియా పిచ్‌లపై బుమ్రాకు మంచి అనుభవం ఉంది. నాయకత్వ బృందంలో బుమ్రా కూడా భాగం. అతడు గతంలో ఇక్కడ చాలా మంచి ప్రదర్శనలు చేశాడు. జట్టును ముందుండి నడిపించడాన్ని ఇష్టపడే బౌలర్‌ అతడు. మిగిలిన వాళ్లు అతడిని అనుసరిస్తారు’ అని తెలిపాడు.ఒత్తిడిని దరిచేరనివ్వం... ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో 0–3తో టెస్టు సిరీస్‌ కోల్పోయిన నేపథ్యంలో భారత జట్టు ఒత్తిడిలో ఉందని అంతా అనుకుంటున్నారని... అయితే దాన్ని మార్చి వేసుకునేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు మించింది లేదని మోర్కెల్‌ అన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియాలో రాణిస్తే వచ్చే పేరు ప్రఖ్యాతులు వేరని పేర్కొన్నాడు. ‘ప్రతి ఒక్కరు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు అని అడుగుతున్నారు. మా వరకు దాన్ని పక్కన పెట్టేసి మెరుగైన ప్రదర్శనపైనే దృష్టి పెట్టాం’ అని మోర్కెల్‌ అన్నాడు. చదవండి: సంజూ శాంసన్‌ తండ్రి క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే!

TG police Not Given Permission To BRS Darna At Mahabubabad5
బీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన పోలీసులు.. కేటీఆర్‌ పర్యటన వాయిదా

సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ పట్టణంలో బీఆర్‌ఎస్‌ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. మరోవైపు.. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని అనుమతి నిరాకరించడంతో బీఆర్‌ఎస్‌ కూడా ధర్నా వాయిదా వేసుకుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌.. మహబూబాబాద్‌ పర్యటనను వాయిదా వేసుకున్నారు.గిరిజన, దళిత, పేద రైతులపై దాడికి నిరసగా మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. కాగా, బీఆర్‌ఎస్‌ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వెంటనే రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్‌ ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు బీఆర్‌ఎస్‌ నాయకులు బుధవారం రాత్రి ధర్నాకు దిగారు.అయినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ రైతు మహా ధర్నాకు కేటీఆర్‌ కూడా హాజరు కావాల్సి ఉండగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. మరోవైపు.. ఈరోజు మహబూబాబాద్‌ జిల్లావ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన​ విధించినట్టు ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ తెలిపారు. నిమిషానికి నలభైసార్ల KCR రావాలే అని తెగ ఒర్లుతావు! అసెంబ్లీలో KCR ముందు నుంచునే మాట దేవుడెరుగు…కనీసం మహబూబాబాద్ లో మహాధర్నా కు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేగా చిట్టినాయుడు?!— KTR (@KTRBRS) November 20, 2024

Dil Raju Comments Tamil Film Active Producers Association6
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ విధానం అమలవుతుంది: దిల్‌ రాజు

సినిమా రివ్యూల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న తమిళ్‌ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌పై టాలీవుడ్‌ నిర్మాత దిల్‌ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళ ఇండస్ట్రీలో వారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పకుండా అమలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా దానిని అమలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయా పడ్డారు.సినిమా విడుదలైన తర్వాత థియేటర్ల వద్దకు కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌, రివ్యూలు ఇచ్చేవారిని అనుమతించకూడదని తమిళ్‌ ఫిల్మ్ యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి రివ్యూస్‌ వల్ల ఇండస్ట్రీ చాలా ఎక్కువగానే నష్టపోతుందని వారు తెలిపారు. దీనిని అరికట్టాలంటే థియేటర్‌ యజమానులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. థియేటర్‌ ముందు రివ్యూస్‌ చెప్పేవారిని లోపలికి అనుమతించకూడదని నిర్ణయించారు.దిల్‌ రాజు నిర్మించిన కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదల తేదీని ప్రకటించే కార్యక్రమంలో ఇదే విషయం గురించి ఆయన మాట్లాడారు. 'కోలీవుడ్‌లో వారు తీసుకున్న నిర్ణయం విజయవంతమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అలా అమలయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ విషయంలో వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోలేము. ఫిల్మ్‌ ఛాంబర్‌ జోక్యం చేసుకుని ఫైనల్‌గా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే చాలామంది ఇక్కడి ఎగ్జిబిటర్లు అలాంటి రివ్యూలను అరికట్టాలని సిద్ధంగా ఉన్నారట' అని దిల్‌ రాజు పేర్కొన్నారు.

Gautam Adani charged with bribery scheme Congress Comes With This Demand7
తెరపైకి ‘హమ్‌ అదానీ కె హై’.. మళ్లీ జేపీసీ డిమాండ్‌

ఢిల్లీ: అదానీ గ్రూప్‌ సంస్థ గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ఆయన వ్యవహారాలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.లంచం, మోసం చేశారనే అభియోగాలపై అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు న్యూయార్క్‌ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు వెల్లడించడం తెలిసిందే. ఈ ఆరోపణలతో స్టాక్‌మార్కెట్‌ సైతం కుదేలైంది. మరోపక్క.. రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపుతోంది.‘మోదాని’ స్కామ్స్‌పై జేపీసీ ఏర్పాటు చేయాలని 2023 జనవరి నుంచి డిమాండ్‌ చేస్తున్నాం. అయితే.. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు బలం చేకూరుతోంది అని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అలాగే.. ‌ The indictment of Gautam Adani and others by the Securities and Exchanges Commission (SEC) of the US vindicates the demand that the Indian National Congress has been making since Jan 2023 for a Joint Parliamentary Committee (JPC) investigation into the various Modani scams. The…— Jairam Ramesh (@Jairam_Ramesh) November 21, 2024न्यूयॉर्क के पूर्वी ज़िले के अमेरिकी अटॉर्नी कार्यालय द्वारा गौतम अडानी और उनसे जुड़े अन्य लोगों पर गंभीर आरोप लगाना उस मांग को सही ठहराता है जो भारतीय राष्ट्रीय कांग्रेस जनवरी 2023 से विभिन्न मोदानी घोटालों की संयुक्त संसदीय समिति (JPC) जांच के लिए कर रही है। कांग्रेस ने हम…— Jairam Ramesh (@Jairam_Ramesh) November 21, 2024 ‘హమ్‌ అదానీ కె హై’ సిరీస్‌లో ఇప్పటివరకు వందలాది ప్రశ్నలు సంధించామని, మోదీ, అదానీ బంధంపై వేసిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం రాలేదని జైరాం రమేష్‌ విమర్శ గుప్పించారు.గతంలో.. అదానీ సంస్థ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లో మోసాలు చేస్తోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఇచ్చిన నివేదిక మార్కెట్‌ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు ఆ సమయంలో పార్లమెంట్‌ సమావేశాల్లోనూ డిమాండ్‌ చేశాయి.అదానీపై తాజా అభియోగాలివే..ఇదిలా ఉంటే.. అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్‌ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఆపై.. అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు వాళ్లు పేర్కొన్నారు. అలాగే..తద్వారా.. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్‌ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపించారు. న్యూయార్క్‌ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. దీంతో గౌతమ్‌ అదానీ, ఆయన బంధువు సాగర్‌ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ఇదే సమయంలో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌(SEC) మరో సివిల్‌ కేసు నమోదు చేసింది. యూఎస్‌ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్‌ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్‌ డాలర్లకు పైగా సమీకరించిందని అందులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్‌ కోరింది. ఈ వార్తలపై అదానీ గ్రూప్‌ స్పందించాల్సి ఉంది.

Excise Department issues orders to beverage companies to produce beer8
వేసవి వస్తోంది.. బీర్ల ఉత్పత్తి పెంచండి

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఏటా వేసవిలో బీర్ల కొరత ఏర్పడుతుంది. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు మద్యం ప్రియులు బీర్ల వైపు మొగ్గు చూపుతారు. సాధారణ రోజుల్లో కంటే ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఏటా ఫిబ్రవరి వచ్చిందంటే చాలు క్రమంగా బీర్లకు డిమాండ్‌ పెరుగుతుంది. ఏప్రిల్, మే మాసాల్లో బీర్ల కొరత ఏర్పడుతుంది. ప్రధానంగా బ్రాండెడ్‌ బీర్లు దొరక్క బీరు ప్రియులు అల్లాడుతుంటారు. రానున్న వేసవిలో ఈ సమస్య తలెత్తకుండా ఎక్సైజ్‌శాఖ ము(మ)ందస్తు జాగ్రత్త తీసుకుంటోంది. బీర్ల ఉత్పత్తిని పెంచాలని బెవరేజెస్‌ కంపెనీలపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచుతోంది. రాష్ట్రానికి బీర్లు సరఫరా చేస్తున్న యూనిట్లలో ఉత్పత్తి పెంచాలని ఎక్సైజ్‌శాఖ బెవరేజెస్‌ విభాగం అధికారులు ఆయా బీర్ల కంపెనీలను ఆదేశించారు.డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి.. సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ బెవరేజెస్‌ కంపెనీలో నెలకు సుమారు మూడు లక్షల కేసుల నుంచి నాలుగు లక్షల కేస్‌ల బీర్లు ఉత్పత్తి ఉంటుంది. ఎక్సైజ్‌ అధికారుల ఒత్తిడి మేరకు ఈ కంపెనీ తన ఉత్పత్తిని ఏకంగా ఐదు లక్షల కేస్‌లకు పెంచింది. ఒక్కో కేస్‌లో 12 సీసాలు (650 ఎంఎల్‌) ఉంటాయి. మరో మల్టీనేషనల్‌ బెవరేజెస్‌ కంపెనీ నెలకు సుమారు 25 లక్షల కేస్‌ల బీరు ఉత్పత్తి చేస్తుంది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్పత్తిని సుమారు 30 లక్షల కేస్‌ల వరకు పెంచినట్టు ఎక్సైజ్‌వర్గాలు చెబుతున్నాయి. లిక్కర్‌ మాదిరిగా కాకుండా, బీర్లకు ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. ఉత్పత్తి జరిగిన తేదీ నుంచి ఆరు నెలల లోపే వినియోగం జరగాలి. దీంతో ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచుకుంటూ వెళితేనే వేసవి డిమాండ్‌కు సరిపడా స్టాక్‌ అందుబాటులో ఉంచొచ్చని ఎక్సైజ్‌శాఖ భావిస్తోంది.డిమాండ్‌కు తగినట్టుగా ‘బీర్ల డిమాండ్‌ను ముందుగా అంచనా వేసి బెవరేజెస్‌ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకుంటాయి. సాధారణంగా బ్రాండెడ్‌ బీర్లకు వేసవిలో డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని పెంచుకుంటాయి’అని ఎక్సైజ్‌శాఖ బ్రూవరీస్‌ విభాగం అధికారి తెలిపారు.సంగారెడ్డి నుంచే రాష్ట్రమంతటికీ సరఫరా.. సంగారెడ్డి జిల్లాలో ఆరు కంపెనీలకు చెందిన బీర్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. యూబీ కంపెనీకి చెందినవి రెండు, కల్స్‌బర్గ్, క్రౌన్, లీలాసన్స్, ఏబీ ఇన్‌బీవ్‌ అనయూసర్‌–బుష్, వంటి బ్రీవరేజెస్‌ కంపెనీలు ఇక్కడ బీర్ల ఉత్పత్తి చేస్తాయి. రాష్ట్రమంతటికీ బీర్ల సరఫరా సంగారెడ్డి జిల్లా నుంచే జరుగుతుంది. ఎక్సైజ్‌శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో ఉన్న బెవరేజెస్‌ కంపెనీల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 6,800 లక్షల లీటర్లు. అయితే ఈ బీర్ల తయారీకి అవసరమైన నీటి కోసం ఆయా కంపెనీలు ఏకంగా పైప్‌లైన్‌లనే వేసుకున్నాయి. కొన్ని కంపెనీలు మంజీర నదీ జలాలనే వినియోగిస్తున్నాయి.

India Slams Canadian Report On Nijjar Issue case9
మోదీ టార్గెట్‌గా కెనడా కొత్త ప్లాన్‌!.. భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

ఢిల్లీ: ఢిల్లీ: కెనడాపై భారత ప్రభుత్వం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు ప్లాన్‌ చేసిన విషయం ప్రధాని మోదీకి ముందే తెలుసు అంటూ కెనడాకు చెందిన ‘ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌’ వార్తా పత్రిక ఓ కథనం రాసుకొచ్చింది. ఈ కథనాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. అలాంటి అర్థం లేని కథనాలను కొట్టిపారేస్తున్నామని ఖండించింది.కెనడా కథనంపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ స్పందిస్తూ.. మేము సాధారణంగా మీడియాలో వచ్చే కథనాలపై స్పందించం. కానీ, కెనడా ప్రభుత్వ వర్గాలను ఉద్దేశిస్తూ వెలువడిన ఈ హాస్యాస్పద వార్తలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరాధారమైన ఇలాంటి వార్తలు హాస్యాస్పదం. ఇలాంటి వార్తలపై అధికారులు కచ్చితంగా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు, ప్రచారాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతిస్తాయి. ఇప్పటికైనా తప్పుడు నివేదికలు ప్రచురించకపోవడం మంచిది అంటూ కామెంట్స్‌ చేశారు.సదరు వార్తా పత్రిక.. ఈ హత్యకు కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ కూడా భాగమైనట్లు తమకు తెలిసిందని కెనడా సీనియర్‌ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు ఆ కథనం పేర్కొనడం గమనార్హం.ఇదిలా ఉండగా.. గత సంవత్సరం, నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించిన తర్వాత రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. కెనడా వాదనలు నిరాధారమైనవి అని తెలిపింది. నిజ్జర్ హత్య జరిగినప్పటి నుంచి కెనడా.. భారత ప్రభుత్వం, మోదీపై తప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది. అంతకుముందు.. కెనడాకు చెందిన పలు నేతలు అమిత్‌ షాను కూడా టార్గెట్‌ చేసి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. Our response to queries regarding a report in Canadian media: https://t.co/1IAURpKlfT pic.twitter.com/jIPlg05JM6— Randhir Jaiswal (@MEAIndia) November 20, 2024

Gautam Adani charged in US with alleged 265 million bribery10
గౌతమ్‌ అదానీపై సంచలన ఆరోపణలు

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు న్యూయార్క్‌లో అధికారులు అభియోగాలు మోపారు. గౌతమ్‌ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు.20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం వచ్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్ట్‌ల కోసం వీరు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్‌ డాలర్లు లంచాలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు.అదానీ కేసు వ్యవహారంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ స్పందించారు. కేసు నుంచి అదానీ తప్పించుకోలేరని, వాళ్ల దగ్గర తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి తప్పించుకునేందుకు అక్కడున్నది మోదీ ప్రభుత్వం కాదని చురకలేశారు. దీనిపై జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ వేసి విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ డిమాండ్‌ చేశారు.అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీపై అమెరికా అధికారుల అభియోగాల నేపథ్యంలో అదానీ గ్రూప్ యూనిట్లు 600 మిలియన్ డాలర్ల బాండ్‌ను రద్దు చేశాయి. అలాగే అమెరికన్‌ డాలర్‌పై జారీ చేసిన అన్ని బాండ్లను వెనక్కితీసుకున్నట్లు తెలిసింది.ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం.. అదానీ సంపద 69.8 బిలియన్‌ డాలర్లు. ప్రపంచంలో 22వ అత్యంత సంపన్నుడిగా ఉన్న ఆయన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తర్వాత స్థానంలో ఉన్నారు. గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడ్డాక అదానీ గ్రూప్ స్టాక్‌లలో సుమారు 150 బిలియన్‌ డాలర్లు కరిగిపోయాయి. Adanis indictment in the US is for 5 counts massive bribery & fraud; & relies on irrefutable electronic evidence. It seeks forfeiture of their properties.Adani forgot that US is not ruled by Modi where he could rely upon a pliant ED, SEBI& CBI to get away with anything.#Modani pic.twitter.com/G0VWQyTIUW— Prashant Bhushan (@pbhushan1) November 21, 2024

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
కాన్ఫరెన్స్‌ కాల్‌లో ట్రంప్‌-పిచాయ్‌-మస్క్‌!

ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌నకు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ కాల్‌ చేశారు.

title
ఉక్రెయిన్‌కు బైడెన్‌ భారీ ఆఫర్‌.. ట్రంప్‌ సమర్థిస్తారా?

వాషింగ్టన్‌: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య భీకర పోరు జరుగుతున్న వేళ

title
ట్రంప్‌ టెన్షన్‌.. 1500 మంది అక్రమ వలసదారుల కొత్త వ్యూహం!

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌

title
రూ.1,000 కోట్ల పెయింటింగ్‌!

బెల్జియం సర్రియలిస్ట్‌ ఆర్టిస్టు రెన్‌ మార్గిట్‌ చేతినుంచి జాలువారిన ఈ ప్రఖ్యాత పెయింటింగ్‌ వేలం రికార్డులను బద్దలు కొట్

title
అమెరికా పార్లమెంట్‌లో బాత్‌రూమ్‌ గొడవ

వాషింగ్టన్‌ : అమెరికా పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారిగా ప్రతిన

Advertisement
Advertisement