భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 రేపటి (నవంబర్ 22) నుంచి ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 7:50 గంటలకు ప్రారంభం కానుంది.
తొలి టెస్ట్ ప్రారంభం నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత బ్యాటర్లు.. అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లపై ఓ లుక్కేద్దాం.
టాప్-5 బ్యాటర్లు..
5. చతేశ్వర్ పుజరా- 11 మ్యాచ్‌ల్లో 47.28 సగటున 993 పరుగులు (3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు)
4. రాహుల్ ద్రవిడ్- 16 మ్యాచ్‌ల్లో 41.64 సగటున 1166 పరుగులు (సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు)
3. వీవీఎస్ లక్ష్మణ్- 15 మ్యాచ్‌ల్లో 44.14 సగటున 1236 పరుగులు (4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు)
2. విరాట్ కోహ్లి- 13 మ్యాచ్‌ల్లో 54.08 సగటున 1352 పరుగులు (6 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు)
1. సచిన్ టెండూల్కర్- 20 మ్యాచ్‌ల్లో 43.20 సగటున 1809 పరుగులు (6 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు)
టాప్-5 బౌలర్లు..
5. జస్ప్రీత్ బుమ్రా- 7 టెస్ట్‌ల్లో 32 వికెట్లు
4. బిషన్ సింగ్ బేడీ- 7 టెస్ట్‌ల్లో 35 వికెట్లు
3. రవిచంద్రన్ అశ్విన్- 10 టెస్ట్‌ల్లో 39 వికెట్లు
2. అనిల్ కుంబ్లే- 10 టెస్ట్‌ల్లో 49 వికెట్లు
1. కపిల్ దేవ్- 11 టెస్ట్‌ల్లో 51 వికెట్లు
Comments
Please login to add a commentAdd a comment