Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

పోలింగ్‌ రోజున నరసరావుపేటలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై దాడి చేసి కార్లను  ధ్వంసం చేస్తున్న టీడీపీ గూండాలు..  (ఇన్‌సెట్‌లో) సర్వశ్రేష్ఠ త్రిపాఠి
కూటమి సేవలో 'ఘనాపాఠి'

సాక్షి, అమరావతి: సర్వ శ్రేష్ఠుడు అంటే అందరికంటే సమర్థుడు అని అర్థం. కానీ ఆ సమర్థత విధి నిర్వహణలో కాకుండా చంద్రబాబు కుట్రలకు వత్తాసు పలకడంలో చూపించిన ఘనాపాఠి గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి! ఎన్నికల సందర్భంగా పల్నాడులో టీడీపీ మూకలు బరితెగించి సాగించిన విధ్వంసకాండకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు ఓటింగ్‌లో పాల్గొనకుండా భయానక వాతావరణం సృష్టించిన టీడీపీ గూండాలకు పోలీసు లాఠీని అందించారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు పోలింగ్‌ బూత్‌లలో లేకుండా దాడులకు తెగబడ్డ పచ్చ ముఠాలకు ఈ ఖాకీ కొమ్ము కాశారు. పోలింగ్‌ అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ రౌడీమూకలు రోడ్లపై దర్జాగా తిరుగుతున్నా వారిని అరెస్ట్‌ చేయకుండా పోలీసు యంత్రాంగం చేతులు కట్టేశారు. ఓట్ల లెక్కింపు రోజు టీడీపీ గూండాలు మరోసారి అరాచకం సృష్టించేందుకు రంగం సిద్ధం చేయిస్తు­న్నారు. ఎన్నికల అక్రమాలకు సహకారం అందించేందుకు చంద్రబాబు, పురందేశ్వరి పక్కా పన్నాగంతో పల్నాడులో ప్రవేశపెట్టిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వారి­ద్దరి నమ్మకాన్ని వమ్ము చేయలేదనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసు వ్యవస్థ రాజకీయ బురద పులుముకుంటే ప్రజాస్వామ్యానికి ఎంత చేటు కలుగుతుందో చెప్పేందుకు ఈ ‘పచ్చ’ ఖాకీ కథే నిదర్శనం!పోలింగ్‌కు ముందు పల్నాడులో పచ్చ జట్టు పల్నాడులో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉందని గుర్తించిన చంద్రబాబు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాగానే కుట్రకు తెరతీశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైన పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని పావులు కదిపారు. గుంటూరు డీఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ శివశంకర్‌రెడ్డితోపాటు క్షేత్రస్థాయిలో కీలకమైన డీఎస్పీలు, సీఐలపై అసత్య ఆరోపణలతో ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి ఫిర్యాదులు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ద్వారా కథ నడిపించారు. టీడీపీ ఆరోపణలు చేసిన పోలీసు అధికారులపైనే ఆమె ఫిర్యాదు చేయడం గమనార్హం. అంతేకాదు.. ఆ అధికారుల స్థానాల్లో ఎవర్ని నియమించాలో సూచిస్తూ ఆమె ఏకంగా జాబితా సమర్పించడం గమనార్హం. అంటే ఈసీ అధికార పరిధిలో పురందేశ్వరి జోక్యం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. టీడీపీ, బీజేపీ ఒత్తిడికి ఈసీ తలొగ్గినట్టు అనంతరం పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో గుంటూరు డీఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిని ఈసీ ఆకస్మికంగా బదిలీ చేసింది. వారి స్థానాల్లో టీడీపీ అనుకూలురైన పోలీసు అధికారులు నియమితులయ్యారు. గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠీ, ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్‌ బాధ్యతలు చేపట్టారు.జాబితా పంపిన నిమ్మగడ్డ, వర్లచంద్రబాబుకు నమ్మిన బంటు అయిన వివాదాస్పద ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అత్యంత సన్నిహితుడు. ఎస్పీగా నియమించిన గరికపాటి బిందు మాధవ్‌ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులుకు బంధువు. ఐజీగా రాగానే త్రిపాఠి టీడీపీ కుట్రలను అమలు చేశారు. పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు మాచర్ల టౌన్‌ సీఐ పి.శరత్‌బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, గురజాల సీఐ పల్లపురాజు, ఎస్సై ఎం.రామాంజనేయులును బదిలీ చేయడం గమనార్హం. వారి స్థానాల్లో నియమించాల్సిన అధికారుల జాబితాను సైతం ఆయనే పంపించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్, టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఇచ్చిన జాబితాలనే ఆయన పంపడం గమనార్హం. టీడీపీకి అనుకూలురైన కోటేశ్వరరావు మాచర్ల టౌన్‌ సీఐగా, కారంపూడి సీఐగా నారాయణస్వామి నియమితులయ్యారు. రెంటచింతల మండలానికి చెందిన నారాయణస్వామి టీడీపీ గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావుకు సన్నిహితుడు.పోలీసులను కట్టడి చేసి..పల్నాడు అంతా టీడీపీ అనుకూల పోలీసు అధికారుల ద్వారా తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన రెండో దశ కుట్రను అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, పేద వర్గాలకు చెందిన ఓటర్లను బెంబేలెత్తించి వారు ఓట్లు వేయకుండా అడ్డుకోవాలన్న పచ్చ పన్నాగానికి ఐజీ త్రిపాఠి కొమ్ము కాశారు. జిల్లాలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తనకు చెప్పకుండా కాలు కదపటానికి వీల్లేదని ఆదేశించారు. ఎక్కడైనా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నట్లు సమాచారం అందినా సరే తాను అనుమతిస్తేనే వెళ్లాలని స్పష్టం చేశారు. టీడీపీ మూకలు దౌర్జన్యాలకు పాల్పడ్డ ప్రాంతాల వైపు పోలీసులు కన్నెత్తి చూడకుండా ఉండేందుకే త్రిపాఠి ఇలా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.అరాచకాలకు అండదండలు⇒ పోలింగ్‌కు మూడు రోజుల ముందు మాచర్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి, మాజీ ఎంపీపీ వెల్దుర్తిలో ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ మూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. విధి నిర్వహణలో ఉన్న ఎస్సై, కానిస్టేబుళ్లపై కూడా పచ్చమూకలు దాడి చేయడం గమనార్హం. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దాడికి పాల్పడిన వారిని కనీసం స్టేషన్‌కు పిలిచి కూడా మాట్లాడలేదు.⇒ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విద్యా సంస్థలకు చెందిన బస్సులో టీడీపీ కార్యకర్తలు హోలోగ్రామ్‌లు ముద్రించిన ఓటర్ల స్లిప్పులు, డబ్బులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐజీ త్రిపాఠి ఆదేశాలతో వాటిని జప్తు చేయకుండా వదిలేశారు. ⇒ పోలింగ్‌కు రెండు రోజుల ముందు అంటే మే 11న రెంటచింతలలో టీడీపీ వర్గీయులతో సమావేశమైన సీఐ నారాయణస్వామి.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినా తాము పట్టించుకోబోమని భరోసానిచ్చారు. అదే రోజు కారంపూడి మండల వైఎస్సార్‌సీపీ జేసీఎస్‌ కన్వీనర్‌ వెంకటేశ్వరరెడ్డిని ఆయన కాలితో తన్నారు. వెంకటపల్లిలో టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేసినట్లు సమాచారం అందినా ఒక్క కానిస్టేబుల్‌ను అక్కడకు పంపారు. అనంతరం ఆయనే ఆ గ్రామానికి వెళ్లి బాధితుడైన మహేశ్‌ను ఓ విద్యుత్‌ స్తంభానికి కట్టేసి కొట్టారు. ⇒ మే 12న సీఐ నారాయణస్వామి టీడీపీ వర్గీయులతో కలసి రెంటచింతల వెళ్లారు. దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీకి చెందిన మోర్తల ఉమామహేశ్వరరెడ్డి, ఆయన అనుచరులపై దాడికి తెగబడ్డా నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఐజీ త్రిపాఠి ఆదేశాలతో ఉదాశీనంగా వ్యవహరించారు. తద్వారా దాడులకు తెగబడ్డా, ఓటర్లను బెదిరించినా పట్టించుకోబోమని టీడీపీ శ్రేణులకు సంకేతాలిచ్చారు.కుట్రలకు సహకారం..కీలకమైన పోలింగ్‌ రోజు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తానో పోలీస్‌ ఉన్నతాధికారిననే విషయాన్ని విస్మరించి టీడీపీ కార్యకర్త తరహాలో చెలరేగిపోయారు. పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించాల్సిన ఆయన ఓ వర్గానికి వత్తాసు పలికారు. స్వయంగా పల్నాడులో తిష్ట వేసి మరీ టీడీపీ రిగ్గింగ్‌కు కొమ్ము కాయడం విభ్రాంతి కలిగిస్తోంది. మాచర్లలోని కేసీపీ సిమెంట్స్‌ గెస్ట్‌ హౌస్, జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కేంద్రంగా టీడీపీ కుట్రలకు సంపూర్ణ సహకారం అందించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కండ్లకుంటతోపాటు పరిసర గ్రామాల్లో టీడీపీ ఏజెంట్లను ఐజీ త్రిపాఠీనే నియమించడం గమనార్హం. అంతేకాదు.. ఆయనతోపాటు ఎస్పీ బిందుమాధవ్‌ ఆ గ్రామాల్లోనే ఉన్నారు. ఒక అదనపు ఎస్పీ, ఒక ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీ, ఇద్దరు సీఐలను అక్కడ నియమించారు. అదే త్రిపాఠీకి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి స్వగ్రామం వెల్దుర్తిలో అన్ని పార్టీల ఏజెంట్లు ఉన్నారో లేదో చూడాలని కూడా అనిపించలేదు.రిగ్గింగ్‌ నిరోధించాలని పిన్నెల్లి మొర పెట్టుకున్నా.. టీడీపీ వర్గీయులు కొత్తూరు, కంభంపాడు, భైరవునిపాడు, రెంటాల, జెట్టిపాలెం, పాల్వాయి గేటు, గోలి, మిట్టగుడిపాడు, కారంపూడి, ఒప్పిచర్ల, పేట సన్నెగండ్ల, చింతపల్లి, ముటుకూరు, అడిగొప్పుల, పోలేపల్లి, వెల్దుర్తి, లోయపల్లి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సపెంట గ్రామాల్లో రిగ్గింగ్‌కు కుట్ర చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ 20 గ్రామాల్లో సక్రమంగా పోలింగ్‌ జరిగేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆ కాపీని ఐజీ త్రిపాఠీకి అందచేసి టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడకుండా కట్టడి చేయాలని కోరినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వెల్దుర్తితోపాటు ఆ 20 గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు దాడి చేసి చితకబాది బూత్‌ల నుంచి వెళ్లగొట్టినా స్పందించలేదు. టీడీపీ రౌడీమూకలు ఆరు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశాయి. దీనిపై సమాచారం అందినా ఆ పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఒక డీఎస్పీని కూడా పంపలేదు. త్రిపాఠి ఆ పోలింగ్‌ కేంద్రాలను కనీసం సందర్శించ లేదు.పదేపదే ఫోన్లు చేసినా..పల్నాడు అంతటా టీడీపీ శ్రేణులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినా పట్టించుకోవద్దని సంకేతాలిచ్చి ఐజీ త్రిపాఠి పోలీసుల చేతులు కట్టేశారు. అదే అదనుగా అల్లరి మూకలు కర్రలు, కత్తులు, రాడ్లు పట్టుకుని స్వైర విహారం చేస్తున్నా పోలీసు యంత్రాంగం చోద్యం చూస్తుండి పోయింది. పోలింగ్‌ రోజు ఉదయం 9 గంటలలోపే యథేచ్చగా రిగ్గింగ్‌ పాల్పడాలన్న టీడీపీ కుట్రకు త్రిపాఠి కొమ్ము కాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం వర్గాలు అత్యధికంగా ఉన్న పోలింగ్‌ బూత్‌ల వద్ద టీడీపీ విధ్వంసకాండ సృష్టించింది. మాచర్ల, రెంటచింతల, వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పెదకూరపాడు... ఇలా పల్నాడు అంతటా పచ్చ ముఠాలు బరితెగించి అక్రమాలకు పాల్పడ్డాయి. పోలింగ్‌ బూత్‌లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడి చేసి బయటకు వెళ్లగొట్టినా, ఓటర్లను బెదిరించి పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నా, టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్‌ చేస్తున్నా పోలీసులు మౌనముద్ర దాల్చారు. దీనిపై ఐజీ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్‌లకు వైఎస్సార్‌సీపీ నేతలు పదేపదే ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల కమిషన్, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ల మీద ఫోన్లు చేయడంతో ఉదయం 9 గంటల తరువాత వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లను అనుమతించారు.కౌంటింగ్‌ రోజు అక్రమాలకు అభయం!ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దన్నుతో పల్నాడులో భయానక వాతావరణం సృష్టించిన పచ్చ ముఠాలు ఓట్ల లెక్కింపు రోజైన జూన్‌ 4న మరోసారి దాడులకు తెగబడాలని పథకం రచిస్తున్నాయి. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు లేకుండా చేసి ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడాలని పన్నాగం వేశాయి. దీనిపై నిఘా వర్గాలు స్పష్టమైన నివేదిక ఇచ్చినా ఐజీ త్రిపాఠి నిర్లిప్తంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. పోలింగ్‌ సందర్భంగా దాడులకు పాల్పడిన రౌడీమూకలను ఇప్పటివరకు గుర్తించకపోవడం గమనార్హం. పల్నాడు జిల్లాలో 581 మంది దాడుల్లో పాల్గొన్నట్టు నిర్థారించగా ఇప్పటివరకు 274 మందినే గుర్తించారు. మరో 307 మందిని ఇంతవరకు గుర్తించలేదు. వీరిలో అత్యధికంగా మాచర్ల నియోజకవర్గానికి చెందినవారే 245 మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నరసరావుపేట నియోజకవర్గానికి చెందినవారు 62 మంది ఉన్నారు. ఇప్పటివరకు గుర్తించిన వారిలో కేవలం 19 మందినే పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరంతా గురజాల నియోజకవర్గానికి చెందినవారే. మాచర్ల, నరసరావుపేట నియోకజవర్గాల్లో పోలింగ్‌ రోజు దాడులకు పాల్పడ్డ వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్‌ చేయలేదంటే ఐజీ త్రిపాఠి నేతృత్వంలో పోలీసు యంత్రాంగం ఎంత చేష్టలుడిగి చూస్తోందో అర్థమవుతోంది. టీడీపీ గూండాల దాడులపై వీడియోలతో స్పష్టమైన ఆధారాలున్నా అరెస్ట్‌ చేయకపోవడం వెనుక టీడీపీ ఒత్తిళ్లు ఉన్నట్లు వెల్లడవుతోంది. ఓట్ల లెక్కింపు రోజు వరకూ ఆ నిందితులను అదుపులోకి తీసుకోకూడదన్నది పోలీసుల ఉద్దేశంగా ఉంది. తద్వారా మరోసారి దాడులు, దౌర్జన్యాలతో భయానక పరిస్థితి సృష్టించేందుకు పోలీసు యంత్రాంగం కొమ్ము కాస్తున్నట్లు స్పష్టమవుతోంది.

TDP not seeking repolling in Macherla: andhra pradesh
టీడీపీ రీపోలింగ్‌ ఎందుకు కోరలేదు?

సాక్షి, నరసరావుపేట: ‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేశాడు.. ఓటర్లను బెదిరించాడు.. ఎన్నికలు సక్రమంగా జరగలేదు’.. అని రెండ్రోజులుగా గగ్గోలు పెడుతున్న టీడీపీ, పచ్చ మీడియా వర్గాలు ఎందుకు ఈవీఎంలు పగలగొట్టిన చోట్ల రీపోలింగ్‌ జరపమని ఎన్నికల సంఘాన్ని కోరలేదన్న ప్రశ్న అందరిలోనూ వేధిస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు పోలింగ్‌ రోజు అధికార పార్టీ రిగ్గింగ్‌ చేసిందనో, అధికారులను ఉపయోగించి ఎన్నికలు పారదర్శకంగా జరపలేదన్న కారణాలను చూపి రీపోలింగ్‌ అడుగుతాయి.ఫ్యాక్షన్‌ కు దూరంగా ఉంటూ అభివృద్ధి బాటపట్టిన మాచర్లను కావాలనే టీడీపీ అనుకూల మీడియా చంబల్‌లోయ అంటూ గత కొన్నినెలలుగా విషప్రచారం చేస్తోంది. అదే నిజమైతే అక్కడ నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో అరాచకం సృష్టించాడు.. రీపోలింగ్‌ జరపండి అని ఈసీని కోరాలిగానీ అటువంటి చర్యలేవి తెలుగుదేశం పార్టీ, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తీసుకోలేదు, అంటే.. ఎన్నికల వారికి అనుకూలంగా జరిగాయని వారు భావిస్తున్నట్లేగా? తాము చేసిన రిగ్గింగ్‌ వృథా కాకూడదనే మౌనంగా ఉన్నారా అన్న వాదన వినిపిస్తోంది.విచ్చలవిడిగా రిగ్గింగ్‌ చేసిన జూలకంటి..నిజానికి.. ఫ్యాక్షన్‌ నేతగా ముద్రపడిన మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పోలింగ్‌ రోజు తన నిజస్వరూపాన్ని బయటపె­ట్టాడు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు లాగి కళ్లలో కారంకొట్టి దాడి చేయించాడు. రెంటచింతల మండలం పాల్వా­యిగేట్, తుమృకోట, జెట్టిపాలెం, కారంపూడి మండలం ఒప్పిచర్ల, చింతలపూడి, వెల్దుర్తి వంటి పలు గ్రామాల్లో ఇదే జరిగింది. ఒప్పిచర్లలో పోలింగ్‌ ఏజెంట్‌గా ఉన్న ఎస్టీ సామాజికవర్గానికి చెందిన పాలకీర్తి శ్రీనివాసరావు, ఆయన సోదరుడు పాలకీర్తి నరేంద్రలపై వందల మంది దాడిచేసి బయటకు లాగి యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేశారు.అలాగే, రెంటచింతల మండలం తుమృకోటలో ఏజెంట్లుగా ఉన్న షేక్‌ సైషావలీ, షేక్‌ జానీబాషాలను బయటకు లాగి విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరి­చా­రు. రిగ్గింగ్‌ అడ్డుకున్నందుకు తుమృకోటలో నాలుగు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొ­ట్టా­రు. జూలకంటి సొంత గ్రామమైన వెల్దుర్తిలో వైఎ­స్సార్‌సీపీ ఏజెంట్లను బయటకులాగి దాడిచేసి రిగ్గింగ్‌లకు తెగబడ్డాడు. 137, 138, 139, 140, 141 బూత్‌లలో కూర్చున్న వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లను టీడీపీ నేతలు బయటకులాగి రిగ్గింగ్‌కు పాల్ప­డ్డారు. ఇలా మాచర్ల నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాల పరిధిలోని సుమారు 20 పోలింగ్‌ బూత్‌ల­లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారు. అంతేకాక.. మాచర్లలో బ్రహ్మారెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచే­శాడు. ఇందుకు పోలీసుశాఖ పూర్తి సహాయ సహకా­రా­లు అందించిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.వీడియో బయటకు వచ్చాక గగ్గోలు..ఇక జూలకంటి బ్రహ్మారెడ్డి అనుకున్నట్లుగా రిగ్గింగ్‌ విచ్చలవిడిగా జరగడంతో టీడీపీ, పచ్చమీడియా పోలింగ్‌ రోజు, తరువాత వారం రోజులపాటు రిగ్గింగ్‌ అన్న పదం వాడలేదు. టీడీపీ రిగ్గింగ్‌ చేయడంతో అడ్డుకోవడానికి పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఈవీఎంలు పగలగొట్టాడు అని వార్తలు సైతం పెద్దగా రాయలేదు. కారణం పాల్వాయిగేట్‌లో టీడీపీ చేసిన రిగ్గింగ్‌ బయట­పడుతుందన్న ఒకేఒక్క కారణంతో. అయితే, నిజమో కాదో తెలియని ఓ ఈవీఎం పగల­గొడుతున్న వీడియో బయటకు రాగానే ఒక్క­సారిగా మాచర్లలో అరాచకం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు.అయినా సరే.. ఏ టీడీపీ నేత కూడా ఈవీఎంలు పగలినచోట్ల రీపోలింగ్‌ జరపమని మాటవరుసకైనా అనలేదు. కారణం అక్కడ రిగ్గింగ్‌ చేసింది, లాభపడింది తెలుగు­దేశం పార్టీ కావడమే. ఈవీఎంలు పగలడానికి ముందు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో జరిగిన దౌర్జన్యాల సీసీటీవీ ఫుటేజ్‌ బయటపెట్టమని అడగడంలేదు. ఒకవేళ టీడీపీ రిగ్గింగ్‌ చేసి ఉండకపోతే పూర్తి సీసీ ఫుటేజ్‌ బయటపెట్టమని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తున్నా సరే వారెందుకు మౌనంగా ఉంటున్నారో మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కారణం జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గం చేసిన అరాచకాలు బయటపడితే వారి కుట్రలు ప్రజలకు తెలిసిపోతాయని.రీపోలింగ్‌ కోరిన పిన్నెల్లి..మరోవైపు.. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ చేసిన రిగ్గింగ్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి రెండుసార్లు లేఖ రాశారు. పోలింగ్‌ రోజు నియోజకవర్గంలోని 8 గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలలో టీడీపీ చేసిన దౌర్జన్యాలను వివరిస్తూ మే 13వ తేదీ మ.3.33 గంటలకు.. సా.6.10 గంటలకు ఈసీకి రెండు లేఖలు రాశారు. ఇందులో టీడీపీ రిగ్గింగ్‌ చేస్తున్న గ్రామాల్లో తిరిగి రీపోలింగ్‌ నిర్వహించాలని అభ్యర్థించారు. ఆ గ్రామాలు కారంపూడి మండలంలో చింతపల్లి, ఒప్పిచర్ల, పేటసన్నెగుండ్ల, పెదకోడగుండ్ల, రెంటచింతల మండం తుమృకోట, పాల్వాయిగేట్, జెట్టిపాలెం, వెల్దుర్తి గ్రామాలున్నాయి. అయినా, ఈ లేఖలను ఎన్నికల సంఘం పట్టించుకున్న పాపాన పోలేదు.టీడీపీ నేతలు రీపోలింగ్‌ జరపకుండా ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి తెచ్చి విజయం సాధించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగా.. వైఎస్సార్‌సీపీ నేతలు రిగ్గింగ్‌ చేసి ఉంటే రీపోలింగ్‌ జరపమని పదేపదే లేఖలు రాసి ఎందుకు డిమాండ్‌ చేస్తారు? వెబ్‌కాస్టింగ్‌ వీడియోలు పూర్తిగా బయటపెట్టమని ఎందుకు అడుగు­తా­రు? అంబటి రాంబాబు లాంటి నేతలు రీపోలింగ్‌ కోసం ఎందుకు హైకోర్టు మెట్లు ఎక్కుతారు? ఈ చిన్న లాజిక్‌వల్ల పల్నాడులో అరాచకాలు చేసింది తెలుగుదేశం పార్టీయేనని సృష్టమవుతోంది.

కారంపూడిలో  టీడీపీ మూక దాడిలో కాలిపోతున్న బైక్‌లు (ఫైల్‌)
పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..

సాక్షి, నరసరావుపేట: పోలింగ్‌ రోజు, ఆ తర్వాత టీడీపీ నేతలు పల్నాడులో విధ్వంసం సృష్టించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నారన్న అక్కసుతో వారిపై దాడులకు తెగబడ్డారు. ఎలాగైనా వారిని ఓటింగ్‌కు దూరం చేసి ఏకపక్షంగా రిగ్గింగ్‌కు పాల్పడేందుకు అరాచకాలు సృష్టించారు. ఓటింగ్‌ తరువాత సైతం బడుగు, బలహీన వర్గాలపై ప్రతాపం చూపారు. బలహీన వర్గాలపై సాగిన వరుస దాడులను అడ్డుకోవాల్సిన పోలీసు యంత్రాంగం పట్టించుకున్న పాపానపోలేదని వైఎస్సార్‌సీపీ నేతలు వాపోతున్నారు. పోలింగ్‌ రోజు, తరువాత పల్నాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడుల పరంపర కొనసాగింది. ఓటేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీలపై దాడి రెంటచింతల మండలం తుమృకోటలో మే 13న ఓటు వేసేందుకు వెళ్తున్న ఎస్సీ, ఎస్టీ మహిళలపై టీడీపీలోని అగ్రకుల నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. అప్పటికే క్యూలైన్లలో ఉన్న మహిళల్ని కొట్టడంతోపాటు వారిని బయటకు తరిమేసిన టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్లను బయటకు గెంటేశారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తున్న మహిళల తలలు పగులగొట్టారు. దీంతో బాధిత మహిళలు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. ఆ ఒక్క కులమే గ్రామంలో బతకాలా.. దళితులకు ఓటు వేసే హక్కులేదా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. రెంటచింతల మండల పరిధిలోని గోలి గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన మూఢావత్‌ మల్లయ్య నాయక్, కొండానాయక్, ఆర్‌.నాగేశ్వరరావు నాయక్, నాగేశ్వరరావు నాయక్‌లపై టీడీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. పాలువాయిగేటు బూత్‌లలో అరాచకం పాలువాయిగేటు గ్రామంలో టీడీపీ గూండాలు ఈ నెల 13న ఉదయం 6.30 గంటల సమయంలో ప్రవేశించి గ్రామంలోని 201, 202 పోలింగ్‌ బూత్‌లలో వైఎస్సార్‌సీపీకి చెందిన వారిని ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నంబూరి శేషగిరిరావు బరితెగించి ఓటర్లపై దౌర్జన్యానికి దిగారు. 202 బూత్‌లోకి వెళ్లి ఓటర్లను భయాందోళనకు గురిచేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌కు, నియోజకవర్గ రిటరి్నంగ్‌ అధికారికి, ఎస్పీ బిందుమాధవ్, జేసీ శ్యామ్‌ప్రసాద్‌ తదితర ఉన్నతాధికారులకు పిన్నెల్లి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎవరూ స్పందించలేదు. ఈ సమయంలో టీడీపీ గూండాలు ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో వచ్చి వైఎస్సార్‌సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి, డ్రైవర్‌ అంజిరెడ్డి, శ్రీను, మరికొందరికి గాయాలయ్యాయి. అక్కడితో ఆగకుండా టీడీపీ వర్గీయులు పిన్నెల్లి కాన్వాయ్‌లోని వాహనాన్ని ధ్వసం చేశారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు నంబూరి శేషగిరిరావు. అతనిపై పోలీసులు ఏ1గా కేసు నమోదు చేశారు. అయితే.. ఆయనేదో ప్రజాస్వామ్యాన్ని రక్షించాడంటూ చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించడంపై పాలువాయిగేటు గ్రామ ప్రజలు ఛీదరించుకుంటున్నారు. పోలింగ్‌ ముగిశాక బుడగ జంగాలపైనా దాడి కారంపూడి మండలం పేటసన్నెగండ్ల శివారు బాలచంద్రనగర్‌ (పోతురాజుగుట్ట)లో నివాసం ఉంటున్న బేడ బుడగ జంగాలు తమకు ఓటు వేయలేదని ఆగ్రహించిన టీడీపీకి చెందిన సుమారు 70 మంది పోలింగ్‌ ముగిశాక వారి ఇళ్లపై దాడి చేశారు. కనిపించిన ప్రతి ఒక్కరినీ కర్రలు, రాళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. మహిళలు, పిల్లలని కూడా చూడకుండా చావబాదారు. ఇళ్లలోని సామాన్లు, చివరకు ఫ్యాన్లు, బల్బులను కూడా పగులగొట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు పెల్లూరి కోటయ్యకు చెందిన స్కార్పియో కారును ధ్వంసం చేశారు. గొర్ల సైదులు చేయి, కాలిపై కర్రలతో బాదారు. కత్తెర లక్ష్మి చేయి విరగ్గొట్టారు. రాళ్ల దాడితో పోతురాజుగుట్టలోని వారంతా ప్రాణభయంతో పారిపోయి వేరేచోట తలదాచుకున్నారు. ‘ఏరా.. టీడీపీకి ఓటు వేయకుండా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేస్తారా. నా కొడకల్లారా..’ అంటూ తీవ్రంగా దూషిస్తూ అరాచపర్వాన్ని కొనసాగించారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తామని బెదిరించారన్నారు. ఊరొదిలి పారిపోయిన బడుగు జీవులు గురజాల నియోజకవర్గ పరిధిలోని మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకి చెందిన కుటుంబాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్ల వేశారన్న అక్కసుతో యరపతినేని శ్రీనివాస్‌ వర్గీయులు పక్క గ్రామాల నుంచి పెద్దఎత్తున టీడీపీ రౌడీలు, గూండాలను తీసుకొచ్చి పోలింగ్‌ రోజు రాత్రి దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల్ని లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లపై దాడులకు పాల్పడి ధ్వంసరచన సాగించారు. బైక్‌లు, జేసీబీలు, ఆటోలను, ఇళ్లలోని సామగ్రితోపాటు టీవీలు ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. మహిళలు, పిల్లలు అనే కనికరం కూడా లేకుండా బూతులు తిడుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నేతలు పొలాల్లోకి పారిపోయి అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. మహిళలు, చిన్న పిల్లలు, మహిళలు గంగమ్మ గుడిలో తలదాచుకున్నారని తెలిసి రాళ్లు విసురుతూ భయకంపితుల్ని చేశారు. పోలీసులకు విషయం తెలిసినా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి కల్పించారు. ఇప్పటికీ ఆ గ్రామానికి చెందిన బాధితులు అజ్ఞాతంలో ఉండగా, వారిపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం కొసమెరుపు. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అనిల్‌కుమార్, కాసు మహేష్‌రెడ్డిపై కూడా టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయంటే వారి అరాచకం ఏ స్థాయిలో ఉందో ఆర్థం చేసుకోవచ్చు. చివరకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నాయకుల్ని గ్రామాలు దాటించాల్సిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముప్పాళ్లలో మైనార్టీలపై దాడులు సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్ల మండలం తొండపిలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన ముస్లింల ఇళ్లలోకి టీడీపీ సానుభూతిపరులు మూకుమ్మడిగా చొరబడ్డారు. మహిళలను, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తూ దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలోని పురుషులంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పొలాల్లోకి పరుగులు తీశారు. మహిళలు, చిన్నారులు తలుపులు వేసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు. ముస్లిం వర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గ్రామం వదిలి వెళ్లిపోయారు. కంభంపాడులో విధ్వంసకాండ పెదకూరపాడు నియోజకవర్గం కంభంపాడులో పోలింగ్‌ రోజున వైఎస్సార్‌సీపీకి పట్టున్న ఎస్సీ, బీసీ కాలనీలపై కత్తులు, కర్రలతో టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వీరంగం వేశారు. మహిళలపైనా దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత, సర్పంచ్‌ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు (నాగయ్య), సతీమణి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు అంజిమ్మ లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు దాడులకు పాల్పడ్డారు. పలుమార్లు ఎస్సీ, బీసీ కాలనీలకు టీడీపీ రౌడీ మూక వెళ్లి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఎస్సీలపై దాష్టీకం చిలకలూరిపేట మండలం కావూరు ఎస్సీ కాలనీలో పోలింగ్‌ సందర్భంగా మే 13వ తేదీ రాత్రి వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ నాయకుల దౌర్జన్యం చేశారు. వైఎస్సార్‌సీపీకి ఎస్సీలు ఓటు వేశారన్న అక్కసుతో వారిపై టీడీపీ నేతలు దాడి చేశారు. పోలింగ్‌ మరుసటి రోజు నుంచి కాలనీకి చెందిన ఎస్సీలు గ్రామంలోని ప్లాంట్‌నుంచి మంచినీరు తీసుకువెళ్లకుండా టీడీపీ నేతలు తమ దాష్టీకాన్ని చాటుకున్నారు. ఓటేయకుండా అడ్డుకున్నారు ఓటేద్దామని పోలింగ్‌ బూత్‌కు వెళితే టీడీపీ నేతలు బెదిరించి అడ్డుకున్నారు. కర్రలతో దాడులు చేస్తుండటంతో ప్రాణభయంతో ఇంటికి పారిపోయా. అధికారులకు చెప్పినా చూస్తూ నిలబడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవడం మేలని ఓటేయకుండా తిరిగొచ్చేశా. –కర్రా ఏసుపాదం, ఎస్సీ మహిళ, తుమృకోట ఓటు వేయలేకపోయా ఓటు వేయాలని రెండుసార్లు పోలింగ్‌ బూత్‌కు వెళ్లాను. అక్కడ యుద్ధ వాతావరణం చూసి భయపడి ఇంటికి వచ్చేశా. టీడీపీకి చెందిన వారు దాడులు చేస్తూ బడుగులను భయపెట్టి ఇళ్లకు పంపించారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి నేను చూడలేదు. – నందిగం పున్నమ్మ, ఎస్సీ మహిళ, తుమృకోట నా భర్తను కొట్టారు ఓటు వేయడానికి వెళ్లిన నా భర్త దీపావత్‌ స్వామినాయక్‌ను టీడీపీ గూండాలు దారుణంగా కొట్టారు. నన్ను కూడా ఓటు వేయకుండా బెదిరించారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద దాడులు చేయడంతో మా కాలనీలో ఎవరూ ఓటు వేయలేదు. అధికారులు మాకు రక్షణ కలి్పంచలేకపోవడం వల్ల ప్రాణ భయంతో ఓటు వేయడానికి వెళ్లలేదు. – దీపావత్‌ రమణ, ఎస్టీ మహిళ, తుమృకోట ప్రాణభయంతో పరుగులు పెట్టా ఓటు వేయవద్దని.. వేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని టీడీపీ నేతలు బెదిరించారు. గ్రామస్తులు లెక్కచేయకపోవడంతో రిగ్గింగ్‌ చేయాలనే తలంపుతో దళితులపై కర్రలు, రాళ్లతో దాడులు చేయడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టా. – కత్తి భూలక్ష్మి, ఎస్సీ మహిళ, పాలువాయిగేటు, రెంటచింతల మండలం వైఎస్సార్‌ సీపీకి ఓటు వేశామని దాడి టీడీపీ నేతలు పోలింగ్‌ రోజు మా ఇళ్ల మీద పడి కనపడిన వారిని కనపడినట్టు కొట్టారు. మా ఆస్తులను ధ్వంసం చేశారు. నా చేయి, కాలుపై కర్రలతో కొట్టారు. నాతో మరో నలుగురిని కొట్టారు. ముసలోళ్లమని కూడా చూడలేదు. బీభత్సం చేశారు. – గొర్ల సైదులు, జంగాల కాలనీ, పేటసన్నెగండ్ల , కారంపూడి

Daily Horoscope: Rasi Phalalu 24-05-2024 In Telugu
ఈ రాశి వారికి సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి, ధనలాభం

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.పాడ్యమి సా.6.55 వరకు, తదుపరి విదియ నక్షత్రం: అనూరాధ ఉ.9.58 వరకు, తదుపరి జ్యేష్ఠ వర్జ్యం: ప.3.43 నుండి 5.19 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.03 నుండి 8.51 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.11 వరకు అమృతఘడియలు: రా.1.32 నుండి 3.13 వరకు.సూర్యోదయం : 5.30సూర్యాస్తమయం : 6.23రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం: శ్రమానంతరం పనులు పూర్తి. మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.వృషభం: దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. వాహనయోగం. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.మిథునం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.కర్కాటకం: మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. రుణయత్నాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.సింహం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.కన్య: ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. తుల: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.వృశ్చికం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.ధనుస్సు: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.మకరం: చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.కుంభం: శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. సోదరులు, సోదరీలతో సఖ్యత. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.మీనం: ఆదాయానికి మించి ఖర్చులు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

Ap Elections 2024 May 24 Political Updates Telugu
May 24th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 24th AP Elections 2024 News Political Update8:28 AM, May 24th, 2024ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణజూన్‌ 6 వరకు పిన్నెల్లి, గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్టు చెయ్యొద్దని పోలీసులకు ఆదేశంకౌంటింగ్‌ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండొద్దని అస్మిత్‌రెడ్డికి ఆదేశంనలుగురి కంటే ఎక్కువ మందితో తిరగరాదుఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదుసాక్షులను ప్రభావితం చేయరాదు.. దర్యాప్తులో జోక్యం చేసుకోరాదుహైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు స్పష్టీకరణవీరిపై నిఘా పెట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం8:23 AM, May 24th, 2024టీడీపీ రిగ్గింగ్‌లపై ఈసీకి మరోసారి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపోలింగ్ రోజు 16 నియోజకవర్గాలలో టీడీపీ రిగ్గింగ్‌కి పాల్పడినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదు60కి పైగా పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీని కోరిన వైఎస్సార్‌సీపీపోలింగ్ రోజు పలుచోట్ల యథేచ్ఛగా టీడీపీ రిగ్గింగ్పచ్చమూక రిగ్గింగ్ చేసుకోవడానికి సహకరించిన కొందరు పోలీస్ అధికారులురిగ్గింగ్ జరిగిన ప్రాంతాలలో వెబ్ కాస్టింగ్ పరిశీలించాలంటున్న వైఎస్సార్‌సీపీఆయా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ పర్సంటేజ్‌ని గమనించినా రిగ్గింగ్ జరిగిందో లేదో అర్ధమవుతోందంటున్న వైఎస్సార్‌సీపీచేసిన రిగ్గింగ్ బయటపడుతుందనే రీపోలింగ్ కోరని టీడీపీపల్నాడు జిల్లాలో టీడీపీ రిగ్గింగ్‌పై పోలింగ్ రోజే ఈసికి ఫిర్యాదు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిరిగ్గింగ్‌కి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుపిన్నెల్లి ఫిర్యాదుపై ఇప్పటివరకు చర్యలు తీసుకోని ఈసీ8:05 AM, May 24th, 2024నగరి టీడీపీ అభ్యర్థి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనఫలితాలు రాకముందే గాలి భానుప్రకాష్‌ను నగరి ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఫ్లెక్సీల ఏర్పాటు బీఎస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ను ప్రారంభించిన భానుప్రకాష్‌ఎన్నికల అధికారికి మున్సిపల్‌ చైర్మన్‌ హరి ఫిర్యాదు 7:19 AM, May 24th, 2024టీడీపీ దాడులపై చర్యలెందుకు తీసుకోలేదు?: సజ్జల రామకృష్ణారెడ్డిఒక్క పాల్వాయి గేట్‌ వీడియోనే ఎలా లీక్‌ అయ్యింది?అది కూడా చిన్న క్లిప్పింగే ఎలా బయటకు వచ్చింది?7 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని ఎన్నికల కమిషనే చెబుతోందిఆ వీడియోలను ఎందుకు రిలీజ్‌ చేయట్లేదు?అమాయక ఓటర్లపై దాడులు చేసిన టీడీపీ గూండాలపై చర్యలకెందుకు వెనుకాడుతున్నారు?ఎన్నికల కమిషన్‌కు ప్రశ్నలు సంధించిన సజ్జల 7:10 AM, May 24th, 2024మహిళా పోలీస్‌కే రక్షణ లేదు..టీడీపీ నేతల దాడిపోలింగ్‌ రోజున మహిళా పోలీస్‌ అనూషపై టీడీపీ నేతల దాడిప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురంలో ఘటనఎస్పీని కలవకుండా మధ్యలోనే అడ్డుకున్న పోలీసులుచివరికి కలెక్టర్‌ ఆదేశాలతో టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసురాజీకి ఒప్పుకోలేదని కౌంటర్‌ కేసూ నమోదు చేశారని బాధితురాలి ఆవేదన7:07 AM, May 24th, 2024ఆ వీడియో లీక్‌ అయింది.. మేము విడుదల చేయలేదు: సీఈవోఅది మేము విడుదల చేయలేదుఈసీకి సంబంధం లేదుదర్యాప్తు సమయంలో బయటకు వెళ్లి ఉండవచ్చుదానిపైనా విచారణ చేస్తున్నాంఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లుమీడియాతో సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా7:03 AM, May 24th, 2024టీడీపీ రీపోలింగ్‌ ఎందుకు కోరలేదు?మాచర్లలో విచ్చలవిడిగా రిగ్గింగ్‌ చేసిన టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిఅడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లు, కార్యకర్తలపై దాడిరిగ్గింగ్‌ అడ్డుకోవడంతో తుమృకోటలో నాలుగు ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలుఅయినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆరోపణలుపోలింగ్‌ సక్రమంగా జరగలేదంటూ గగ్గోలుఅయినా రీపోలింగ్‌ కోరని టీడీపీఅంటే తమకు అనుకూలంగా ఎన్నికలు జరిగినట్లేగా..మరోవైపు.. మాచర్లలోని పలు ప్రాంతాల్లో రీపోలింగ్‌ కోరిన ఎమ్మెల్యే పిన్నెల్లి రీపోలింగ్‌ జరగకుండా ఎన్నికల అధికారులపై టీడీపీ నేతల ఒత్తిడి6:56 AM, May 24th, 2024పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..పల్నాట గ్రామాలు వదిలి బయట తలదాచుకుంటున్న బడుగులుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు.. ఆపై రిగ్గింగ్‌కు పాల్పడిన టీడీపీ నేతలుఓటింగ్‌ తరువాత కూడా బడుగు, బలహీన వర్గాలపై దాడులు కొనసాగింపువైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో బేడ బుడగ జంగాలపై దాడి.. రెంటచింతల మండల పరిధిలోని గోలిలో ఎస్టీలపై దాడితొండేపి గ్రామాన్ని వదలి ప్రాణభయంతో బయట తలదాచుకుంటున్న మైనార్టీలుచిలకలూరిపేట మండలం కావూరులో ఎస్సీలకు తాగునీరు నిలిపివేతకొత్త గణేషునిపాడు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను వెళ్లగొట్టిన టీడీపీ నేతలుచివరకు బాధితులపైనే కేసులు నమోదు పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేలు కాసు, అనిల్‌ కుమార్‌పైనా దాడిపట్టించుకోని పోలీసు యంత్రాంగం 6:40 AM, May 24th, 2024కూటమి సేవలో 'ఘనాపాఠి'చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి.. పల్నాడులో హింసాకాండకు ఐజీ త్రిపాఠి వత్తాసుకీలక అధికారుల ఆకస్మిక బదిలీల వెనుక సూత్రధారిపోలీసులను కట్టడి చేసి టీడీపీ గూండాగిరికి అండదండలుకౌంటింగ్‌ రోజు మరోసారి అలజడికి కొమ్ము కాస్తున్న వైనంపచ్చ ముఠాలను ఇంతవరకు అరెస్ట్‌ చేయకపోవడమే నిదర్శనంటీడీపీ అధినేత ఒత్తిడితోనే త్రిపాఠికి పోస్టింగ్‌పల్నాడులో ప్రశాంతత కోసం ఆయన్ను తక్షణం బదిలీ చేయాలంటున్న పోలీస్‌ యంత్రాంగం

Suspension of AB Venkateswara Rao
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ సబబే

సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి సస్పెండ్‌ అయిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదే­శిస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన ఉత్త­ర్వు­లను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్‌ తీర్పు అమలును నిలుపుదల చేయాలని అభ్యర్థించింది. ఈ వ్యాజ్యంపై న్యాయ­మూర్తులు జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్‌ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జన­రల్‌ (ఏజీ) ఎస్‌. శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ, క్యాట్‌ ఇచ్చిన ఉత్తర్వులు అసమంజసంగా ఉన్నాయన్నారు.అక్రమాలపై దర్యాప్తు పూర్తయ్యే వరకు, కోర్టులో విచారణ ముగిసేంత వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్‌ చేసే విచక్షణాధి­కారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఇందు­కు ఆల్‌ ఇండియా సర్వీస్‌ నిబంధనలు అనుమతిని స్తున్నాయన్నారు. వెంకటేశ్వరరావుపై తీవ్రమైన అవి­నీతి ఆరోపణలున్నాయన్నారు. అంతేగాక ఆయ­నపై నమోదైన కేసులో సాకు‡్ష్యలను ప్రభావితం చేసేలా కూడా వ్యవహరించారన్నారు. రెండో సారి సస్పెండ్‌ చేయడానికి ఇది కూడా ఓ కారణమని, అయితే ఈ విషయాన్ని ట్రిబ్యునల్‌ పరిగణనలోకి తీసుకోలేద­న్నా­రు.అవినీతి నిరోధక చట్టం కింద ఏబీ వెంకటేశ్వ­రరావును ప్రాసిక్యూట్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని కూడా ఇచ్చిందన్నారు. వెంకటేశ్వరరావు తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణ­రావు వాదనలు వినిపిస్తూ, క్యాట్‌ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే తీర్పు ఇచ్చిందన్నారు. ఒకే అభియోగంపై రెండు సార్లు సస్పెండ్‌ చేయడాన్ని క్యాట్‌ తప్పు పట్టిందన్నారు. వెంటనే విధుల్లోకి తీసుకుని జీతభత్యాల బకాయిలు చెల్లించాలని ఆదేశించిందన్నారు. అయితే ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. సస్పెన్షన్‌ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

AP High Court protection for those candidates Until June 6th 2024
ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ

సాక్షి, అమరావతి: ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులకు హైకోర్టు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను జూన్‌ 6వ తేదీ వరకు అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో వారికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసినట్లయింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. కౌంటింగ్‌ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండరాదని.. తాడిపత్రి బయట ఉండాలని జేసీ అస్మిత్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సోమశేఖర నాయుడులను హైకోర్టు ఆదేశించింది. నలుగురు కంటే ఎక్కువ మందితో తిరగరాదని.. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని అస్మిత్‌రెడ్డి, పెద్దారెడ్డిలతో సహా మిగిలిన అభ్యర్థులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్‌ తదితరులనూ ఆదేశించింది. పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తున్నారని, అందువల్ల అభ్యర్థుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని ప్రధాన ఎన్నికల అధికారికి స్పష్టంచేసింది. అంతేకాక.. ఆయా కేసులకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయడంగానీ.. దర్యాప్తులో జోక్యం చేసుకోవడంగానీ చేయరాదని ఆదేశించింది. కేసు పూర్వాపరాల ఆధారంగా ఎలాంటి అభిప్రాయం వ్యక్తంచేయడం లేదన్న హైకోర్టు, ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతాప వెంకట జ్యోతిర్మయి గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.అరెస్టుకు అవకాశం ఉంది.. మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వండి..ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన కేసుల్లో పోలీసులు తమను అరెస్టుచేసే అవకాశముందని, అందువల్ల తమకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వైఎస్సార్‌సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌లతో పలువురు స్వతంత్ర అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు టి. నిరంజన్‌రెడ్డి, పి.వీరారెడ్డి, ఓ.మనోహర్‌రెడ్డి, పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాదులు ఎస్‌.రామలక్ష్మణరెడ్డి, చుక్కపల్లి భానుప్రకాశ్‌.. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి తమ తమ వాదనలను వినిపించారు.సుప్రీంకోర్టుకన్నా తామే ఎక్కువని ఈసీ భావిస్తోంది..పిటిషనర్లపై నమోదైన కేసులన్నీ కూడా ఏడేళ్ల కంటే తక్కువ శిక్షపడే కేసులని, అందువల్ల వారికి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాల్సి ఉంటుందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. అర్నేష్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే కేసుల్లో అరెస్టుచేయడానికి వీల్లేదన్నారు. అయితే, ఎన్నికల సంఘం మాత్రం రామకృష్ణారెడ్డిని అరెస్టుచేసి తీరుతామని ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు కన్నా తామే ఎక్కువన్న విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని తెలిపారు. అలాగే, టీడీపీ నేత నారా లోకేశ్‌ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌చేసిన వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్‌ రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశించిందన్నారు. వాస్తవాలు విచారించకుండా ఇలాంటి వీడియోల ఆధారంగా అరెస్టుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇలా వ్యవహరించిన ఉదంతాలు గతంలో ఎక్కడా లేవన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది పోలీసు బృందాలు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల వెంటపడ్డాయన్నారు. తాము కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోరుతున్నామని సీనియర్‌ న్యాయవాదులు తెలిపారు. ఇప్పుడు అరెస్టుచేస్తే కౌంటింగ్‌ రోజున ఏజెంట్లను నియమించుకునే అవకాశం కూడా ఉండదన్నారు. దీనివల్ల పిటిషనర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ సమయంలో పీపీ నాగిరెడ్డి జోక్యం చేసుకుంటూ.. మధ్యంతర బెయిల్‌ ఇస్తే మొన్న జరిగిన ఘటనల వంటి వాటిని పునరావృత్తం చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలనుకుంటే షరతులు విధించాలని కోర్టుకు విన్నవించారు. ఎలాంటి ఘటనలు జరిగినా వారినే బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి, హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను జూన్‌ 6వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకు పిటిషనర్లను అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించారు.ఆ పిటిషన్ల విచారణ 30కి వాయిదా..ఇదిలా ఉంటే, ఎన్నికల సమయంలో, ఎన్నికల తరువాత జరిగిన ఘర్షణలపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ పలువురు వ్యక్తులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.

జనవరి 31న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు  అందుకున్న ఆనందంలో నర్సింగ్‌ ఆఫీసర్లు
TG: కొలువు సరే.. జీతాలేవీ?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే మొదటగా చేపట్టిన నియామకం నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌ నర్స్‌) పోస్టుల భర్తీ. ఎల్బీ స్టేడియంలో జనవరి 31వ తేదీన అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేశారు. తర్వాత వారంతా తమకు కేటాయించిన ఆస్పత్రుల్లో విధుల్లో చేరిపోయారు. మూడు నెలలుగా ఆస్పత్రుల్లో రేయింబవళ్లు డ్యూటీలు చేస్తున్నారు. కానీ వారికి ఇప్పటివరకు ఒక్కపైసా వేతనం అందలేదు. తొలి జీతం అందుకుని సంతోషంతో కుటుంబ సభ్యులకు స్వీట్లు పంచుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ పోస్టులకు ఎంపికైవారిలో చాలా మంది వారి స్వస్థలాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో నియామకం అయ్యారు. అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వారికి మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో.. అద్దె కూడా చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత వల్లే తమకు వేతనాలు అందడం లేదని.. నర్సింగ్‌ ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 6,956 మంది నర్సింగ్‌ ఆఫీసర్లు.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2022 డిసెంబర్‌ 30వ తేదీన 5,204 నర్సింగ్‌ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. గత ఏడాది ఆగస్టు 2న పరీక్ష నిర్వహించింది. 40,936 మంది దరఖాస్తు చేయగా.. 38,674 మంది పరీక్షలు రాశారు. ఫలితాలు వెల్లడించి, నియామకాలు చేపట్టాల్సి ఉన్నా.. ఎన్నికల నేపథ్యంలో ప్రక్రియ ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం డిసెంబర్‌ 15న ఆ నోటిఫికేషన్‌కు మరో 1,890 పోస్టులను కలిపింది. మొత్తంగా డీఎంఈ పరిధిలో 5,650 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 757, ఎంఎన్‌జే, గురుకులాల్లో మిగతా పోస్టులను సిద్ధం చేశారు. ఫలితాల తర్వాత 6,956 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాష్ట్రంలోని 26 మెడికల్‌ కాలేజీలు, ఇతర స్పెషాలిటీ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో వారికి పోస్టింగ్‌ ఇచ్చారు. వీరిలో బీసీలు 45.97 శాతం, ఎస్సీలు 30.64 శాతం, ఎస్టీలు 12.81 శాతం మంది ఉన్నారు. ఆర్థోపెడికల్లీ చాలెంజ్డ్‌ కేటగిరీలో అభ్యర్థులు లేకపోవడంతో 138 పోస్టులు భర్తీ కాలేదు. కొత్తగా ఎంపికైన నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు రూ.36,750– రూ.1,06,990గా పేస్కేల్‌ ఖరారు చేశారు. దీంతోపాటు టీఏ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర అలవెన్సులు ఉంటాయి. కొత్తగా ఎంపికై వారందరికీ కలిపి నెలకు దాదాపు రూ.35 కోట్లు ఖజానా నుంచి చెల్లించాల్సి ఉంటుంది. దొరికిందే చాన్స్‌గా ‘ముడుపుల’ వ్యవహారం వాస్తవానికి డ్యూటీలో చేరిన 15 రోజుల్లోగా నియామక ప్రక్రియ పూర్తికావాలి. కానీ మూడు నెలల తర్వాత కూడా కొన్నిచోట్ల క్లర్కుల స్థాయిలోనే ఫైళ్లు ఆగిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో నర్సింగ్‌ ఆఫీసర్లకు ఎంప్లాయి ఐడీలు కూడా ఇవ్వలేదు. ట్రెజరీలకు వివరాలు పంపలేదు. మూడు నెలలుగా వేతనాలు రాక నర్సింగ్‌ ఆఫీసర్లు ఇబ్బంది పడుతుంటే.. కిందిస్థాయి సిబ్బంది ‘ముడుపులు’ అందితేనే ఫైల్‌ కదులుతుందని డిమాండ్‌ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఐడీ, ప్రాన్‌ కార్డుల కోసం హెచ్‌ఓడీ, డీఎంహెచ్‌ఓ ఆఫీసు స్టాఫ్‌ డబ్బులు అడుగుతున్నారని ఓ నర్సింగ్‌ ఆఫీసర్‌ వాపోయారు. ముడుపులు ఇచ్చినోళ్ల వివరాలను మాత్రమే ట్రెజరీకి పంపుతున్నారని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి.. తమకు వెంటనే వేతనాలు అందేలా చూడాలని నర్సింగ్‌ ఆఫీసర్లు కోరుతున్నారు. వేతనాలు వెంటనే ఇవ్వాలి.. కొత్తగా నియమితులైన నర్సింగ్‌ ఆఫీసర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు వేతనాలు ఇవ్వలేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వేతనాలు మంజూరు చేయాలని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చాం. శాశ్వత పద్ధతిలో నియమితులైన వారందరికీ వేతనాలు, గుర్తింపు కార్డులు త్వరగా ఇవ్వాలి.. – వి.మరియమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నర్సెస్‌ అసోసియేషన్‌ ప్రభుత్వం నుంచి ఆమోదం రావాలి మొదటిసారి శాలరీలు డ్రా చేయాలంటే అందరూ చేరేంతవరకు ఆగాల్సి ఉంటుంది. నర్సింగ్‌ ఆఫీసర్లు అంతా చేరడానికి ఫిబ్రవరి వరకు పట్టింది. తర్వాత వాళ్ల నుంచి 27 కాలమ్స్‌ డేటా సేకరించాలి. కానీ ఆ డేటాను అందరూ ఇవ్వడం లేదు. కొందరు పాన్‌కార్డు లేదంటారు. అంతేకాదు ప్రతీ దానికి ఒక డాక్యుమెంట్‌ కావాలి. వివరాలన్నీ ఒకేసారి పట్టుకొని రావాలని ట్రెజరీ అధికారులు అంటున్నారు. ఇవన్నీ అందజేస్తే అప్పుడు నర్సింగ్‌ ఆఫీసర్లకు ఎంప్లాయీ ఐడీ ఇస్తారు. ఐడీ వచ్చాక ముంబై నుంచి ప్రాన్‌ నంబర్‌ తెప్పించాలి. చాలా మంది వివరాలు సరిగా ఇవ్వలేదు. దాంతో ఆలస్యం అవుతోంది. సప్లిమెంటరీ బిల్లులు తొందరగా పాస్‌ కావు. రెగ్యులర్‌ బిల్లు అయితే ప్రభుత్వం వెంటనే జీతాలు వేస్తుంది. ఇప్పుడు నర్సింగ్‌ ఆఫీసర్లది సప్లిమెంటరీ బిల్లు కావడం వల్లే ఈ సమస్య. – డాక్టర్‌ వాణి, డీఎంఈ 3 నెలలైనా ప్రక్రియ పూర్తి చేయక.. నర్సింగ్‌ ఆఫీసర్ల నియామక ప్రక్రియను ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం పర్యవేక్షించాలి. అభ్యర్థులు తమ నియామక పత్రాలను సంబంధిత ఆస్పత్రి సూపరింటెండెంట్, డీ ఎంహెచ్‌వోకు అందజేస్తే.. వారికి సర్వీస్‌ నిబంధనల ప్రకారం.. ఎంప్లాయ్‌ ఐడీ, బ్యాంక్‌ ఖాతా కేటాయిస్తారు. ఆ వివరాలను ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయానికి, అక్కడి నుంచి నర్సింగ్‌ విభాగానికి పంపి అప్‌డేట్‌ చేస్తారు. అప్పటి నుంచీ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు లభిస్తుంది. అయితే 3 నెలలైనా ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, కిందిస్థాయి అధికారుల అవినీతితోనే జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Sajjala Ramakrishna Reddy comments on TDP
టీడీపీ దాడులపై చర్యలెందుకు తీసుకోలేదు?

సాక్షి, అమరావతి: అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు చేసిన దాడులకు సాక్ష్యాలున్నా చర్యలెందుకు తీసుకోవట్లేదని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సోషల్‌ మీడియా వేదికగా గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి ప్రశ్నలు సంధించారు. అలాగే పోలింగ్‌ రోజున మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గూండాల అరాచకాలకు సంబంధించిన వీడియోలను ఆయన సామాజిక మాధ్యమం (ఎక్స్‌)లో పోస్టు చేశారు. ‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్‌ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా? వీడియో సరైనదేనా? కాదా? అనేది నిర్ధారించకుండానే ఈసీ చర్య­లకు ఎలా దిగుతుంది? ఒకవేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్‌ మీడియాలోకి ఎలా వచి్చంది? మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్‌ రోజున ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఎన్నికల కమిషనే చెబుతోంది.అలాంటప్పుడు కేవలం ఈ ఒక్క వీడియో మాత్రమే ఎలా లీక్‌ చేశారు? ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను.. 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన పూర్తి వీడియోలను ఎందుకు బయటపెట్టట్లేదు? ఒక చిన్న క్లిప్పింగ్‌ మాత్రమే బయటకు ఎలా వదిలారు?అన్ని వీడియోలు బయటకు వస్తే అసలేం జరిగిందో తెలుస్తుంది కదా! తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?’ అని సజ్జల ప్రశి్నంచారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే అమా­యక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని సజ్జల చెప్పారు.వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనుక ఉన్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని నిలదీశారు. టీడీపీ మూకల రిగ్గింగ్‌లపై తాము ఫిర్యాదు చేసిన అన్నిచోట్లకు సంబంధించిన వీడియోలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు కచి్చతంగా ఉందన్నారు. మాచర్లలో ప్రజాబలమున్న పిన్నెల్లి ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలి­చారని.. ఐదోసారి కూడా గెలవబోతున్నారని చెప్పారు. ఏదో నలుగురు అధికారులను మేనేజ్‌ చేసి.. అవసరమైనంత వరకే వీడియోను కట్‌ చేసి.. దొంగ వీడియోలను లీక్‌ చేసి.. కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తులం కాదన్నారు.

Cyclone to reach West Bengal and Bangladesh coasts by May 26 evening: IMD
నేడు బంగాళాఖాతంలో వాయుగుండం

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప­పీ­డనం గురువారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ శనివారం ఉదయా­నికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవ­కా­శం ఉంది. ఆ తరువాత ఉత్తరం వైపు వెళ్లి 26వ తేదీ ఆది­వారం సాయంత్రానికి బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌ తీరానికి చేరుకుని తీవ్ర తుపా­నుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది.దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో శుక్ర, శని­వా­రాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవ­కాశం ఉందని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీ­ఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలి­క­పాటి వర్షాలకు ఆస్కారం ఉంది.శనివారం అల్లూరి సీతా­రామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆదివారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురు­స్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవిస్తాయని తెలిపింది.నేడు, రేపు కొన్నిచోట్ల వడగాడ్పులుమరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సాధారణంకంటే 3నుంచి 5 డిగ్రీలు అధి­కంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండురోజులు వడగాడ్పులు వీయ­నున్నాయి. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 11, పార్వతీపురం మన్యం 11, కాకి­నాడ 1, తూర్పు గోదావరి 1 మండలం చొప్పున 33 మండలాల్లోను, శనివారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 7, పార్వతీపురం మన్యం 5, పశ్చిమ గోదావరి 1, ఏలూరు 2, కృష్ణా 2, బాపట్ల జిల్లాలో రెండు చొప్పున 24 మండలా­ల్లోనూ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement