ఈ రాశి వారికి సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి, ధనలాభం | Today Telugu Horoscope On May 24th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారికి సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి, ధనలాభం

Published Fri, May 24 2024 6:54 AM | Last Updated on Fri, May 24 2024 10:42 AM

Daily Horoscope: Rasi Phalalu 24-05-2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు  వైశాఖ మాసం, తిథి: బ.పాడ్యమి సా.6.55 వరకు, తదుపరి విదియ నక్షత్రం: అనూరాధ ఉ.9.58 వరకు, తదుపరి జ్యేష్ఠ  వర్జ్యం: ప.3.43 నుండి 5.19 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.03 నుండి 8.51 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.11 వరకు అమృతఘడియలు: రా.1.32 నుండి 3.13 వరకు.

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.23
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: శ్రమానంతరం పనులు పూర్తి. మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

వృషభం: దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. వాహనయోగం. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.

మిథునం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ.  పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

కర్కాటకం: మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. రుణయత్నాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

సింహం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య: ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.  

తుల: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

మకరం: చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు  ఇంక్రిమెంట్లు.

కుంభం: శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. సోదరులు, సోదరీలతో సఖ్యత. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

మీనం: ఆదాయానికి మించి ఖర్చులు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement