
అత్యధికంగా పశి్చమబెంగాల్‌లో 78.48 శాతం
అత్యల్పంగా బిహార్‌లో 56.76 శాతం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడతలో 62.2 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. అత్యధికంగా పశి్చమబెంగాల్‌లో 78.48%, అత్యల్పంగా బిహార్‌లో 56.76% పోలింగ్ నమోదైనట్లు తెలిపింది.
మే 20న 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరగడం తెలిసిందే. అయిదో విడతలో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించింది. మహిళలు 63 శాతం, పురుషులు 61.48 శాతం, థర్డ్ జెండర్ 21.96 శాతం మంది ఓటేశారని ఈసీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment