Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Hyderabad: No Salaries, TDP Cheat Youth On Survey Jobs
టీడీపీ చీటింగ్‌: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..

హైదరాబాద్, సాక్షి: పచ్చ మూకల కుట్ర రాజకీయాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. సర్వే పేరుతో దొడ్డిదారిన తెలుగు దేశం పార్టీ చేసిన నిర్వాకం ఇది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ.. అదీ రాజధాని నగరంలో సర్వే కోసం యువతను రిక్రూట్‌ చేసుకుంది. మూడు నెలలపాటు గొడ్డు చాకిరీచేయించుకుని.. చివరకు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఆగ్రహంతో బాధితులు విధ్వంసానికి దిగగా.. ఈ ఘటన బయటపడింది.నగరంలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లో టీడీపీ నేతలు కొందరు తమ బినామీ పేరిట ఓ అద్దె భవనం తీసుకున్నారు. అందులో invitcus pvt lmtd bpo పేరిట బీపీవో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. టెలికాలర్స్‌ జాబ్స్‌ పేరిట‌ కొందరు స్టూడెంట్స్‌ను నియమించుకున్నారు. అయితే బీపీవో ముసుగుతో.. గుట్టు చప్పుడు కాకుండా వాళ్లతో ఎన్నికల సర్వే పని చేయించారు వాళ్లు. తీరా ఎన్నికలయ్యాక వాళ్లకు జీతాలు ఎగ్గొట్టడంతో బాధితులు ఆందోళనకు దిగారు.రూ.13 వేలు ఇస్తామని చెప్పి.. రూ.3 వేలే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కొందరు యువకులు ఆ ఆఫీస్‌ వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. ఇదేంటని? వాళ్లు నిలదీయడంతో.. టార్గెట్‌ పూర్తి చేయలేదని అవతలి నుంచి సమాధానం వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన యువకులు.. ఆఫీస్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించారు. గొడవలు జరుగుతున్నాయన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ గ్యాప్‌లోనే కంపెనీ నిర్వాహకులు పరారైనట్లు, బాధితుల తరఫున నిలదీయబోయిన మీడియాపైనా దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.టీడీపీ నేతల అండదండలతోనే ఈ కార్యాలయం నడుస్తోందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. కూకట్‌పల్లిలో సైతం invitcus pvt lmtd ఓ బ్రాంచ్‌ను ఓపెన్‌ చేసి ఇదే మాదిరి అక్కడా కూడా ఎన్నికల సర్వే నిర్వహించినట్లు తేలింది. ఇంకోవైపు మైనర్లతో వెట్టి చాకిరీ పై విచారణ చేయాలనీ బాధితుల బంధువుల ఆందోళన చేపట్టారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని పోలీసులు చెబుతున్నారు.

Taj Mahal Gets Competition As New White Marble Marvel Opens In Agra
ఆగ్రాలో మరో ‘వాహ్‌ తాజ్‌’.. పర్యాటకులు క్యూ

ఆగ్రా అనగానే అందరికీ ముందుగా తెల్లని పాలరాతి కట్టడం తాజ్‌ మహల్‌ గుర్తుకు వస్తుంది. అయితే ఇదే ప్రాంతంలో తాజ్‌కు పోటీనిస్తూ, దానినే పోలిన మరో పాలరాతి భవనం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆలవాలంగా ఉంది.తాజ్ మహల్‌కు 12 కి.మీ. దూరంలోని స్వామి బాగ్ వద్ద రాధాస్వామి సత్సంగ్‌ శాఖ వ్యవస్థాపకుని సమాధి స్థలంలో నిర్మించిన అద్భుత భవనం మరో తాజ్‌గా పేరొందుతోంది. స్వచ్ఛమైన తెల్లని పాలరాయితో నిర్మితమైన ఈ భవనం పర్యాటకులను అమితంగా అలరిస్తోంది. దీనిని చూసిన పర్యాటకులు ఇది తాజ్‌మహల్‌కు పోటీ అని అభివర్ణిస్తున్నారు. మొఘలుల స్మారక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో ఈ ‘తాజ్‌’ మరో ఆకర్షణగా నిలిచింది.రాజస్థాన్‌లోని మక్రానా నుండి తెచ్చిన తెల్లటి పాలరాయితో రూపొందిన ఈ 193 అడుగుల ఎత్తయిన ఈ నిర్మాణం భారతదేశ ఖ్యాతిని మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు. రాధాస్వామి శాఖ వ్యవస్థాపకులు పరమ పురుష్ పూరన్‌ ధని స్వామీజీ సమాధి స్థలంలో ఈ భవనం నిర్మితమయ్యింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ సమాధి స్థలిని సందర్శించేందుకు వస్తుంటారు. ఇక్కడి అద్భుత కళాకృతులను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇక్కడ ఫోటోగ్రఫీని అనుమతించరు.రాధాస్వామి అనుచరుల కాలనీ మధ్య ఈ భవనం ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు విదేశాలలో లక్షలాది మంది రాధాస్వామి అనుచరులు ఉన్నారు. 1904లో అలహాబాద్‌కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ చేతుల మీదుగా ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భవనం కొంతమేరకు నిర్మాణం పూర్తయ్యాక ఆగిపోయింది. అయితే 1922లో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ జరిగే పనులన్నీ హస్త కళాకారుల నైపుణ్యంతో కూడినవే కావడం విశేషం. పైగా వీరు మూడు తరాలుగా ఈ పనుల్లో నిమగ్నమవుతున్నారు. బంగారు పూతతో ఈ భవన శిఖరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శిఖరం తాజ్‌మహల్‌ కన్నా పొడవైనది కావడం విశేషం.

AP Elections 2024: May 18th Political Updates In Telugu
May 18th: ఏపీ పొలిటికల్‌​ అప్‌డేట్స్‌

May 18th AP Elections 2024 News Political Updates 9.30 AM, May 18th, 2024నోరు జారనేల.. పారిపోవడమేల నాగబాబూ?అల్లు అర్జున్‌‌ని పరాయివాడు అంటూ ట్వీట్నాగబాబు చరిత్రని బయటికి తీసి ఉతికారేసిన అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ దెబ్బకి ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి అవమానంతో పారిపోయిన నాగబాబునోరు జారనేల.. పారిపోవడమేల నాగబాబూ? అల్లు అర్జున్‌‌ని పరాయివాడు అంటూ ట్వీట్. @NagaBabuOffl చరిత్రని బయటికి తీసి ఉతికారేసిన @alluarjun ఫ్యాన్స్ దెబ్బకి ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి అవమానంతో పారిపోయిన నాగబాబు pic.twitter.com/YLsZNMFOiq— YSR Congress Party (@YSRCParty) May 18, 2024 9.00 AM, May 18th, 2024అల్లర్లకు అచ్చెన్న ఎత్తుగడపోర్టు వాహనాలతో రోడ్లు పాడైపోతున్నాయంటూ ఆందోళనకు కుట్ర పోలీసులకు ఫోన్‌ చేసి మరీ హెచ్చరించిన అచ్చెన్నముందస్తుగా భారీ ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు8.30 AM, May 18th, 2024హైదరాబాద్‌లో బయటపడ్డ టీడీపీ మోసం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో లోని నాగార్జున సర్కిల్‌లో ఓ అదే భవనంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతరేకంగా తెలుగు దేశం పార్టీ నాయకుల అండదండలతో గుట్టు చప్పుడు కాకుండా బీపీఓ కాల్ సెంటర్ పేరుతో సర్వే చేపడ్తున ఓ ప్రైవేట్ యాజమాన్యంమైనర్ స్టూడెంట్స్ తో సర్వే పేరిట టెలి కాలింగ్ పదమూడు వేల వేతనం అని చెప్పి కేవలం రూ. 3000 మాత్రమే అంటగడుతున్న యాజమాన్యంగత మూడు నెలలుగా సర్వే నడుపుతున్న యాజమాన్యంరెండువందల మంది స్టూడెంట్స్ తో బీపీఓ కాల్ సెంటర్ ఎలక్షన్ అనంతరం టార్గెట్ పూర్తి చేయలేదని డబులు ఎగ్గొట్టే ప్రయత్నం క్రికెట్ వికెట్లతో వేతనం అందని స్టూడెంట్స్ ఫర్నీచర్ ధ్వంసం చేసే ప్రయత్నంమీడియాపై దురుసుగా ప్రవర్తిస్తూ కెమెరాను సైతం తోసేసిన వైనంటీడీపీకి చెందిన సర్వే కంపెనీ invitcus pvt lmtd bpo అరాచకంపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్రాత్రి కి రాత్రే పరారీఎన్నికల ముందు మూడు నెలల నుండి కార్యకలాపాలుకూకట్‌పల్లిలో సైతం ఒక బ్రాంచ్ ఏర్పాటు 7.45 AM, May 18th, 2024విజయవాడఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభంనిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారభించిన వినీత్ బ్రిజ్‌లాల్‌వినీత్ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో సిట్ ఏర్పాటుసిట్ బృందంలో 13 మంది అధికారులుఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్య లత నియామకంఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ లు వి. శ్రీనివాసరావు, రవి మనోహర చారి నియామకంఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జీఐ శ్రీనివాస్, మెయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్ లు సిట్ సభ్యులుగా నియామకంపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై దర్యాప్తు చేస్తున్న సిట్ఎన్నికల అనంతర హింసలో పోలీస్ అధికారులు పాత్ర పైన దర్యాప్తురేపటిలోగా ఎన్నికల కమిషన్‌కి నివేదిక ఇవ్వనున్న సిట్ 7.30 AM, May 18th, 2024టీడీపీ దాష్టీకానికి పరాకాష్టకుట్ర రాజకీయానికి మహిళా వలంటీర్‌ బలివైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో ఫిర్యాదుఆగమేఘాలపై కేసు నమోదుపోలీసుల విచారణ.. ఆందోళనతో ఆగిన గుండె 7.00 AM, May 18th, 2024కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!2004లో ముస్లిములకు 4 శాతం రిజర్వేషన్లుడాక్టర్‌ వైఎస్సార్‌ కల్పించిన వరం...గత పదేళ్లలో ఆరువేలమందికిపైగా డాక్టర్లయిన ముస్లిం యువతవిద్యా ఉద్యోగాల్లో ముస్లిం యువత ముందడుగు..రిజర్వేషన్లను కొనసాగిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ మరింత ఊతంకూటమి విష ప్రచారానికి ముస్లిం సమాజం బెంబేలు.. 6.30 AM, May 18th, 2024పల్నాడుపై పగబట్టిన బాబుటీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులునాటి నుంచి నేటి వరకు అదే తీరు2020లో కాజ టోల్‌గేట్‌ వద్ద పిన్నెల్లిపై దాడివిజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబుఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీఅభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం

Heeramandi Jewellery: Meet The Designers Behind The Exquisite Pieces
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్‌ జంట

ఒక సినిమా నిర్మాణంలో మామూలుగా అయితే కొన్ని నగలు తెప్పిస్తారు. కాని ‘హీరామండీ’ వెబ్‌ సిరీస్‌ కోసం 300 కిలోల నగలు అవసరమయ్యాయి. అవి కూడా బ్రిటిష్‌ కాలం నాటివి. మొగల్‌ సంస్కృతీ వారసత్వానివి. ఢిల్లీలో శ్రీ పరమణి జువెలర్స్‌కు చెందిన అన్షు గుప్తా భర్త వినయ్‌తో కలిసి మూడేళ్ల పాటు శ్రమించి ఈ నగలు తయారు చేశారు. నత్, ఝూమర్, హాత్‌ ఫూల్, పస్సా, టీకా... ఎన్నో నగలు. అన్షు గుప్తా పరిచయం.స్త్రీలు, అలంకరణ అవిభాజ్యం. స్త్రీలు, ఆభరణం కూడా అవిభాజ్యమే. ఆభరణంతో నిండిన అలంకరణ భారతీయ స్త్రీలలో వేల సంవత్సరాలుగా ఉంది. బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు, కెంపులు, మరకతాలు, ముత్యాలు... వీటితో తయారైన ఆభరణాలు రాచరిక స్త్రీలకు ప్రీతికరమైనవి. ఐశ్వర్యవంతులకు స్థాయిని కలిగించేవి. అయితే వీరే కాకుండా కళకారులకు కూడా ఆభరణాలు కీలకమైనవి. మొగలుల కాలంలో విరాజిల్లిన తవాయిఫ్‌లు (రాజనర్తకీమణులు) తమ ప్రదర్శనల్లో ఆకర్షణ కోసం భారీ ఆభరణాలను ఉపయోగించేవారు. మరి వారి గురించిన గాథను తెరకెక్కించేటప్పుడు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాటిని అందించడానికి ముందుకు వచ్చిన జువెలర్స్‌ అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్‌ గుప్తా.హీరా మండి..మొగలుల కాలంలో లాహోర్‌లోని ఒక ఏరియా పేరే హీరా మండి. దాని అంతకు ముందు పేరు షాహీ మొహల్లా. అంటే రాచవాడ. పక్కనే ఉన్న కోట నుంచి నవాబులు నడిచి వచ్చేంత దూరంలో ఉండే కొన్ని భవంతుల సముదాయమే షాహీ మొహల్లా. ఇక్కడ తవాయిఫ్‌లు ఉండేవారు. వీరు ఆట, పాటల్లో నిష్ణాతులు. సాయంత్రమైతే వీరి భవంతుల్లో ప్రదర్శనలు జరిగేవి. నవాబులు, శ్రీమంతులు, రసికులు వీటికి హాజరయ్యి తిలకించేవారు. ఈ తవాయిఫ్‌లకు విశేష పలుకుబడి ఉండేది. వీరి దగ్గర ఐశ్వర్యం ఉండేది. రాచరిక రహస్యాలు మొదట వీరికే తెలిసేవి. వీరు మంత్రాంగం నడిపేవారు. 1857 సైనిక తిరుగుబాటులో కూడా వీరు పాల్గొన్నారు. కాని బ్రిటిష్‌ కాలం వచ్చేసరికి ఇదంతా గతించిపోయింది. షాహీ మొహల్లా కాస్తా సరుకులు అమ్మే మండీగా హీరా మండీగా మారింది. ఆనాడు వెలిగిన వారంతా అంతరించిపోయారు. వేశ్యలుగా మారారు. వారి గాథనే దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ‘హీరామండీ’ పేరుతో భారీ వెబ్‌సిరీస్‌గా తీశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.భారీ నగలుపర్‌ఫెక్షనిస్ట్‌ అయిన దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ ‘హీరామండీ’లో తవాయిఫ్‌ల కోసం నాటి మొగల్‌ తరహా నగలు కావాలని భావించాడు. గతంలో తన ‘బాజీరావు మస్తానీ’ కోసం పని చేసిన ఆభరణాల శిల్పులైన అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్‌ గుప్తాలను సంప్రదించాడు. వీరు ఢిల్లీవాసులు. వీరికి శ్రీ పరమణి జువెలర్స్‌ అనే నగల కార్ఖానా, షోరూమ్‌ ఉన్నాయి. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కార్ఖానాలో ఖరీదైన ఆభరణాలు దొరుకుతాయి. ‘కథ విన్న వెంటనే టైటిల్‌ దగ్గరి నుంచి ప్రతి పాత్రా ఆభరణాలతో ముడిపడి ఉన్నందుకు ఉత్సాహం వచ్చింది. చరిత్రలోకి వెళ్లి పరిశోధించి నాటి ఆభరణాలు తయారు చేయాలి. మొగలులు కళాప్రియులు. వారి కాలంలో ఆభరణాలలో కెంపులు. ముత్యాలు, వజ్రాలు విరివిగా వాడేవారు. ఆపాదమస్తకం అలంకరించుకోవడానికి వందల రకాల ఆభరణాలు ఉండేవి. అవన్నీ మేము తయారు చేయడానికి ముందుకు వచ్చాం. నేను, నా భర్త వినయ్‌ మూడేళ్లు కష్టపడి ఈ నగలు తయారు చేయించాం’ అని తెలిపింది అన్షు గుప్తా.అసలు సిసలు బంగారంతో‘‘హీరామండీ కోసం కొన్ని ముఖ్యమైన నగలు అసలు బంగారంతోనూ, మిగిలినవి బంగారు పూత కలిగిన వెండితోనూ తయారు చేయించాలని నిర్ణయించాం. వజ్రాలు, ముత్యాలు అన్నీ ఒరిజినల్‌వే వాడాం. మా కార్మికులు మూడేళ్ల పాటు శ్రమపడి మూడు గదుల్లో పది వేల చిన్న, పెద్ద ఆభరణాలు తయారు చేశారు. వీటిని తూస్తే 300 కిలోలు ఉంటాయి. నథ్‌ (ముక్కు పుడక) దగ్గరి నుంచి నెమలి నెక్లెస్‌ వరకూ వీటిలో ఉన్నాయి. షూటింగ్‌లో ప్రత్యేక గార్డులు వీటికి కాపలా ఉన్నారు. ‘మేం చేసిన ఆభరణాలు పాత్ర కోసం ధరించి వీటితో పారిపోతే ఒక సినిమా తీసేన్ని డబ్బులొస్తాయి’ అనేది నటి రిచా చద్దా సరదాగా. హీరామండీని చూస్తే ఒక పాత్ర ధరించిన పాపిడి బిళ్లతో మరో పాత్ర ధరించిన పాపిటబిళ్లకు పోలిక ఉండదు. గాజులు, ఉంగారాలు, చెవి కమ్మలు... తెర మీద అద్భుతంగా ఆవిష్కృతమైన తీరుతో మా కష్టం వృథా పోలేదనిపించింది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది అన్షు గుప్తా.

IPL 2024 BCCI Bans Hardik Pandya For 1 Match Slaps Him With Hefty Fine
BCCI: హార్దిక్‌ పాండ్యాకు భారీ షాక్‌.. ఐపీఎల్‌-2025లో..

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి భారీ షాకిచ్చింది. రూ. 30 లక్షల జరిమానాతో పాటు తదుపరి మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిషేధం విధించింది.కాగా ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ సారథిగా రోహిత్‌ శర్మ స్థానాన్ని భర్తీ చేసిన హార్దిక్‌ పాండ్యాకు అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రోహిత్‌ స్థానంలో వచ్చినందుకు సొంత జట్టు అభిమానుల నుంచే ఛీత్కారాలు.. కెప్టెన్‌గా తీసుకున్న నిర్ణయాల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు.ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుఆల్‌రౌండర్‌గానూ తన స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోయాడు హార్దిక్‌ పాండ్యా. సారథిగానూ సరైన వ్యూహాలు రచించలేక చతికిలపడ్డాడు. ఫలితంగా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై పరాభవం మూటగట్టుకుంది.ఇక లీగ్‌ దశలో ఆఖరిదై మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ శుక్రవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ పోరులో లక్నో ముంబైని 18 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ముంబై ఖాతాలో పదో పరాజయం నమోదైంది.ఇదిలా ఉంటే.. లక్నోతో మ్యాచ్‌ సందర్భంగా ముంబై ఇండియన్స్‌ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ హార్దిక్‌ పాండ్యాకు పనిష్మెంట్‌ ఇచ్చింది.ఐపీఎల్‌-2025లో తొలి మ్యాచ్‌ ఆడకుండా నిషేధంఈ మేరకు.. ‘‘ఈ సీజన్‌లో ముంబై జట్టు చేసిన మూడో తప్పిదం కావున.. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి కింద.. స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా పాండ్యాకు రూ. 30 లక్షల జరిమానా విధించడంతో పాటు.. జట్టు తదుపరి ఆడే మ్యాచ్‌ ఆడకుండా నిషేధం విధిస్తున్నాం’’ అని ఐపీఎల్‌ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. అంటే ఐపీఎల్‌-2025లో పాండ్యా తన తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండాలన్నమాట! ఇక పాండ్యాతో పాటు ముంబై జట్టుకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. ముంబై జట్టు మొత్తానికి జరిమానా‘‘లక్నోతో మ్యాచ్‌ ఆడిన ముంబై తుదిజట్టులోని ఆటగాళ్లందరికీ.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌తో సహా ప్రతి ఒక్కరికి రూ. 12 లక్షల జరిమానా లేదంటే మ్యాచ్‌ ఫీజులో 50 శాతం మేర కోత(ఏది తక్కువగా ఉంటే అది) విధిస్తాం’’ అని తెలిపారు. కాగా ఐపీఎల్‌-2024లో ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.చదవండి: Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ చేసిన పనికి అభిమానులు ఫిదా.. వీడియో వైరల్‌ #LSG wrapped up their season on a winning note and happy faces in Mumbai😃👌🎥 Here's a roundup of the #MIvLSG clash at the Wankhede 🏟️ #TATAIPL pic.twitter.com/FbdT2QQQAk— IndianPremierLeague (@IPL) May 18, 2024

A series of attacks provoked TDP ranks
పల్నాడుపై పగబట్టిన బాబు

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, నరసరావుపేట : తెలుగు­దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు పల్నాడుపై పగపట్టారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా జరు­గుతున్న వరుస పరిణామాలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా వరుసగా చా­వు దెబ్బ తింటున్న తెలుగుదేశం ఎలాగైనా పల్నా­డులో ఫ్యాక్షనిజాన్ని ఎగదోసి, వర్గ వైషమ్యాలను పెంచి పోషించడం ద్వారా తన ఉనికిని నిలబెట్టుకునేందుకు శతధా ప్రయత్నిస్తోంది.అందులో భాగంగా వరుస దాడులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మా­చర్ల, గురజాల నియోజకవర్గాలకు పల్నాడు ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మాచర్ల నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ తరఫున పోటీ చేసిన జూలకంటి దుర్గాంబ గెలుపొందారు. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి గెలుపొందారు. 2009, 2012 (ఉప ఎన్నిక), 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తున్నారు. కాగా దుర్గాంబ కుమారుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో మాచర్లలో సైకిల్‌ మూలన పడింది. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్ని­కల్లోనూ టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. టీడీపీ బలోపేతమంటూ...మాచర్లలో టీడీపీని బలోపేతం చేయాలంటే పిన్నెల్లిని అడ్డు తొలగించడమే మార్గం అని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు.. అందుకు అనుగుణంగా దాడుల ప్రణాళిక రచించారు. అందులో భాగంగా 2020 జనవరి ఏడో తేదీన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మంగళగిరికి సమీపంలోని కాజ టోల్‌ప్లాజా వద్ద టీడీపీ శ్రేణులతో భారీ ఎత్తున దాడి చేయించారు. ఎమ్మెల్యే వాహనాన్ని రాళ్లతో ధ్వంసం చేశారు. గన్‌మెన్‌ గాయాలపాలయ్యారు. అయితే ఆ రోజు ఎమ్మెల్యే బయటపడ్డారు. ఆ క్రమంలో భాగంగా రౌడీలు, గూండాలనే గుర్తింపున్న బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలకు మందీ మార్భలాన్ని తోడిచ్చి విజయవాడ నుంచి 2020 మార్చి 11న మాచర్లకు పంపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు, స్థానికులు తిరగబడి బొండా, బుద్దా బృందాలను వెంటపడి తరిమేశారు. దీంతో చంద్రబాబు.. ఫ్యాక్షనిజం, హత్యల నేపథ్యమున్న జూలకంటి బ్రహ్మానందరెడ్డిని మళ్లీ రంగంలోకి దింపుతూ 2021 డిసెంబర్‌లో మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. 2010 మార్చి పదో తేదీన ఆత్మకూరు వద్ద ఏడుగురి హత్య కేసులో జూలకంటి ప్రథమ ముద్దాయి. చివరకు తన బాబాయి కుమారుడైన సాంబిరెడ్డి పొలాల్లో దాక్కుని ఉండగా హత్య చేయించారని అందరూ చెప్పుకుంటారు. పోలేపల్లి శివారెడ్డి హత్య కేసులోనూ జూలకంటిది ప్రధాన పాత్ర అని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మాచర్ల ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసు­కున్నప్పటి నుంచి వరుస దాడులు, దొమ్మీలు, హత్యా ప్రయత్నాల పరంపర కొనసాగుతోంది. ఈ ఎన్నికల తర్వాత అది శ్రుతి మించింది. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై విచ్చలవిడిగా టీడీపీ దాడులు కొనసాగు­తున్నాయి. వినుకొండ, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజక­వ­ర్గాల్లోనూ టీడీపీ దాడులకు తెగబడింది. మాచర్ల నియోజకవర్గంలో అశాంతికి ప్రధాన కారణం పోలీ­సు­లేనని, ప్రధానంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కారంపూడి సీఐ నారాయణస్వామి తీరు వల్లే గొడవలు పెరి­గాయని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బహిరంగా నిప్పులు చెరగడం పల్నాడులో పరిస్థితికి అద్దం పడుతోంది. పదుల సంఖ్యలో ఊళ్లలో విధ్వంసం» మాచర్ల రూరల్‌ మండలంలోని కొత్తూరు, కంబంపాడు, భైరవునిపాడు, వెల్దుర్తి మండలం లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సంపేట, రెంటచింతల మండలం రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు, కారంపూడి మండలం ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి, దుర్గి మండలం ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి తదితర గ్రామాల్లో టీడీపీ దాడులు కొనసాగాయి.» దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల మండలాల్లోని కేశానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, బ్రాహ్మణపల్లి, పెద అగ్రహారం, జానపాడు, వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం, సత్తెనపల్లి నియోజకవర్గంలోని పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుంట్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్లలోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేశారు.» నరసరావుపేట టౌన్, దొండపాడు, పమిడిపాడు, పెదకూరపాడు మండలం యర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు, చిలకలూరిపేటలోని అప్పాపురం గ్రామాల్లో టీడీపీ దాడులకు తెగబడింది. అభివృద్ధిలో పోటీ పడలేకే విధ్వంసంచంద్రబాబు ఏలుబడిలో అభివృద్ధి ఊసే లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పల్నాడులో అభివృద్ధి పరుగెత్తుతోంది. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటైంది. పిడుగురాళ్లలో మెడికల్‌ కాలేజీ రూపు దిద్దుకుంటోంది. వరికపూడిసెలకు మోక్షం కలిగింది. గురజాల నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో తాగునీటి వసతి కలిగింది.నరసరావుపేటలో జేఎన్‌టీయూ కాలేజీకి శాశ్వత భవనాలు ఒనగూరాయి. రొంపిచర్ల, మాచ­ర్లలో కేంద్రీయ విద్యాలయాలు మంజూర­య్యాయి. పులిచింతల ప్రాజెక్టు దిగువన మాదిపాడు వద్ద వంతెన నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. తద్వారా అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, గుంటూరు వరకు, మరోవైపు జగ్గయ్యపేటకు రవాణా వసతి మెరుగు పడనుంది.కొండమోడు–పేరేచర్ల, సాగర్‌– దావుపల్లి, మాచర్ల– దాచేపల్లి, నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు.. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి గొడవలు చేయిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Actress Radhika Sarathkumar Leg Injury
గాయపడ్డ సీనియర్ నటి రాధిక.. వీడియో వైరల్!

ఒకప్పటి హీరోయిన్ రాధిక గాయపడింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటోంది. ఈ క్రమంలోనే ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంది. తాజాగా తన రీల్ బ్రదర్ శివకుమార్ ఇంటికి వచ్చేసరికి అతడితో పాత ముచ్చట్లు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!)ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రాధిక.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో తల్లి పాత్రలు చేస్తోంది. అలానే గతంలో పలు సీరియల్స్‌లోనూ కీలక పాత్రలు చేసి అలరించింది. అలా సీరియల్స్ చేస్తున్న టైంలో శివకుమార్ (హీరో సూర్య తండ్రి)కి చెల్లిగా పలు సీరియల్స్ చేసింది. అయితే వీళ్లు సీరియల్స్‌లో నటించి చాలా కాలమైంది.ఇక చాలా రోజుల తర్వాత రాధిక ఇంట్లో వీళ్లిద్దరూ కలిశారు. ఈ క్రమంలోనే తనకు కాలికి గాయమైన విషయాన్ని రాధిక బయటపెట్టింది. అప్పటి ఆల్బమ్స్, పాత ముచ్చట్లని వీళ్లిద్దరూ గుర్తుచేసుకున్నారు. కొన్నిరోజుల ముందు 'యానిమల్' చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..)A bond for life with #sivakumar anna, who came to see me as I am recovering from a leg procedure.shared so much on drawings , pictures and our travel 🙏🙏🙏🙏 pic.twitter.com/qxwuBMZD4q— Radikaa Sarathkumar (@realradikaa) May 18, 2024

Congress Candidate Kanhaiya Kumar Beaten
కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాడి

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇంకా ఎన్నికల జరగని నియోజకవర్గాల్లో నేతలు ప్రచారాలు సాగిస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీలో మే 25న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈశాన్య ఢిల్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాడి జరిగింది.జవహర్ లాల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ నేత, నార్త్ ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్తార్ నగర్‌లో కన్హయ్య కుమార్‌కు పూలమాల వేసే నెపంతో వచ్చిన కొందరు వ్యక్తులు అతనిని చెప్పుతో కొట్టారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్‌పై కూడా వారు దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయమై ఆ కౌన్సిలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో కన్హయ్య కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో కొందరు పూలదండలతో రావడం కనిపిస్తుంది. వీరు కన్హయ్యకు పూలమాల వేయకుండా, అతనిపై దాడి చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే అక్కడే ఉన్న కన్హయ్య కుమార్ మద్దతుదారులు వెంటనే ఒక యువకుడిని పట్టుకున్నారు.బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని కన్హయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. తనకు అమితంగా పెరుగుతున్న ప్రజాదరణ చూసి, సిట్టింగ్ ఎంపీ తివారీ నిరుత్సాహానికి గురయ్యారని, అందుకే తనపై దాడి చేసేందుకు గూండాలను పంపారని కన్హయ్య పేర్కొన్నారు. మే 25న ఓటింగ్ ద్వారా ప్రజలు దీనికి సమాధానం చెబుతారని అన్నారు.ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో మే 25న ఓటింగ్ జరగనుంది. ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుండి బీజేపీ.. మనోజ్ తివారీని అభ్యర్థిగా నిలబెట్టగా, కాంగ్రెస్ ఈ స్థానం నుంచి కన్హయ్య కుమార్‌ను బరిలోకి దించింది. ఈ సీటులో వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని సమాచారం. కన్హయ్య తన రాజకీయాలను జేఎన్‌యూ నుంచి ప్రారంభించారు. మనోజ్ తివారీ నటుడు, గాయకుడు. రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు.

Dish TV Smart+ Offering TV and OTT On Any Screen Anywhere
ఒకే ప్లాన్‌తో టీవీ చానళ్లు, ఓటీటీ యాప్‌లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఒకే ప్లాన్‌తో ఇటు టీవీ చానళ్లు, అటు ఓటీటీ యాప్స్‌ను కూడా పొందే విధంగా డిష్‌ టీవీ కొత్తగా స్మార్ట్‌ప్లస్‌ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్లాన్‌ కిందే వీటిని పొందవచ్చని సంస్థ సీఈవో మనోజ్‌ దోభల్‌ తెలిపారు.రూ. 200 ప్యాక్‌ నుంచి ఇది అందుబాటులో ఉంటుంది. పాత, కొత్త కస్టమర్లు.. స్మార్ట్‌ప్లస్‌ కింద సదరు ప్లాన్‌లోని టీవీ ఛానళ్లతో పాటు డిఫాల్టుగా లభించే హంగామా వంటి అయిదు ఓటీటీ యాప్‌లతో పాటు జీ5, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్, సోనీ లివ్‌ తదితర యాప్‌ల నుంచి ఒకటి ఎంచుకోవచ్చు. కావాలనుకుంటే మూడు రోజుల తర్వాత మరో యాప్‌నకు మారవచ్చు.పూర్తిగా 16 యాప్‌లు పొందాలంటే నెలకు రూ. 179 చార్జీ ఉంటుంది. కొత్త సర్వీసులతో మార్కెట్‌ వాటా 3–4 శాతం మేర పెంచుకోగలమని ఆశిస్తున్నట్లు మనోజ్‌ తెలిపారు. ప్రస్తుతం తమకు డీటీహెచ్‌ మార్కెట్లో 21 శాతం వాటా ఉందని వివరించారు. వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో ఆండ్రాయిడ్‌ 4కే బాక్స్, క్లౌడ్‌ టీవీ వంటి ఉత్పత్తులు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు.

Daily Horoscope On 18th May 2024 In Telugu
ఈ రాశివారికి వ్యవహారాలలో విజయం.. పనుల్లో విజయం..!

మేషం.. కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.వృషభం.. మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. శ్రమ కొంత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.మిథునం.. కొన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. ఆలయ దర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు పనిభారం.కర్కాటకం.. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. పనుల్లో విజయం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.సింహం.. పనుల్లో తొందరపాటు వద్దు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని అవాంతరాలు.కన్య.. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.తుల.. మిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత వ్యతిరేక పరిస్థితులు.వృశ్చికం.. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.ధనుస్సు.. కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఊహించని ధనలబ్ధి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.మకరం.. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. సన్నిహితులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.కుంభం.. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో మరింత ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.మీనం.. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. ప్రముఖుల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి ఉంటుంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement