breaking news
Hanamkonda
-
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
వరంగల్: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని దృఢంగా నమ్మిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి.. 24 గంటల ఉచిత విద్యుత్, గిట్టుబాటు ధర, సబ్సిడీ విత్తనాల పంపిణీ, ఇండస్ట్రీయల్ పాలసీని తీసుకొచ్చారన్నారు. దీని వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. రైతులు మార్కెట్‌కు నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి గరిష్ట ధర పొందాలన్నారు. పత్తిని అమ్ముకునే రైతులు కిసాన్ కపాస్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని ఆయా మిల్లుల్లో కేటాయించిన తేదీల్లో విక్రయించాలన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే 1800 599 5779 టోల్ ఫ్రీ నంబర్, 88972 81111 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాలన్నారు. అనంతరం మార్కెట్లోని అపరాల యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, సీసీఐ జీఎం మోహిత్ శర్మ, మార్కెటింగ్ శాఖ డీడీ పద్మావతి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, డీసీ నీరజ, కాటన్ కొనుగోలు అధికారి కృష్ణారెడ్డి, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేద ప్రకాశ్, కాటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చింతలపల్లి వీరారావు, పండ్ల మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు వెల్ది సాంబయ్య, గ్రేడ్ –2 కార్యదర్శి రాము, తదితరులు పాల్గొన్నారు. మెట్ల బావిని పరిరక్షించుకోవాలి..ఖిలా వరంగల్ : వరంగల్ శివనగర్‌లోని చారిత్రక ప్రసిద్ధి చెందిన మెట్ల బావిని మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సుందరీకరణ, లైటింగ్, అభివృద్ధి పనులు చేపట్టారు. సోమవారం ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై మెట్ల బావిని పునఃప్రారంభించి మాట్లాడారు. మెట్ల బావిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అనంతరం రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధిని మంత్రి సురేఖ బావిలోకి దిగి పరిశీలించారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, తహసీల్దార్ ఇక్బాల్, కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్, గోపాల నవీన్‌రాజు, శామంతుల శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ -
వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి ప్రణాళిక
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల ఆలయ అభివృద్ధిలో భాగంగా దేవాలయ ప్రాంగణంలో గార్డెన్, సెంట్రల్ లైటింగ్, భూగర్భ డ్రెయినేజీలను ఏర్పా టు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఏఎంవీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సోమవారం సుబ్రహ్మణ్యంతోపాటు హంపీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ నిఖిల్‌దాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ కృష్ణచైతన్య వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించి పరిశీలించారు. రుద్రేశ్వరస్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, జోగులాంబ దేవాలయం కన్జర్వేటర్ అసిస్టెంట్ మల్లేశం, వరంగల్ కేంద్ర పురావస్తుశాఖ కన్జర్వేటర్ అసిస్టెంట్ అజిత్ పాల్గొన్నారు. కార్తీక సోమవారం పూజలు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా వే యిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామి వారికి ప్రత్యే క పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణ వ్ నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 8గంటలకు మహాహారతి శోభాయమానంగా నిర్వహించారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. కోట సందర్శన..ఖిలా వరంగల్: ఖిలావరంగల్ కోటను సోమవారం కేంద్ర పురావస్తుశాఖ మాన్యుమెంట్ డైరెక్టర్ సుబ్ర హ్మణ్యం, అధికారులు సందర్శించారు. భవిష్యత్తుల చేపట్టనున్న నిర్మాణాల శైలిని డైరెక్టర్‌కు అధికారులు వివరించారు. ఆయనవెంట టీజీ టీడీసీ ఇన్చార్జ్ అజయ్ ఉన్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఏఎంవీ సుబ్రహ్మణ్యం ఆలయాన్ని పరిశీలించిన పురావస్తుశాఖ అధికారులు -
కౌమర బాలికలకు సాధికారత కల్పించాలి
కాజీపేట రూరల్ : కౌమర బాలికలకు సమాజంలో సాధికారత కల్పించి ప్రోత్సాహించాలని సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయని దేవి అన్నారు. ఫాతిమానగర్ బాలవికాస కేంద్రంలో ఏడు జిల్లాలకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న కౌమర బాలికల సంఘాల తయారీలో భాగంగా సోమవారం స్నేహ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాత్యాయని దేవి మాట్లాడుతూ.. బాలికలకు విద్య, మార్గదర్శకత్వం, ఉపాధిని కొనసాగించేలా చేయాలన్నారు. యూనిసెఫ్ విభాగం నుంచి మురళి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జోన్స్ టెక్నికల్ కన్సల్టెంట్, సెర్ప్ హెచ్డీ విభాగం నుంచి లింగయ్య గౌడ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు ఆర్డీఓలు సరిత, 7జిల్లాల డీపీఎంలు, ఏపీఎంలు మాట్లాడారు. ప్రపంచంలోనే భారత్ అధిక కౌమర జనాభా ఉన్న దేశమని, వారి అవసరాలు, ఆలోచనలు, ప్రస్తుత సామాజిక మాధ్యమం ఇంటర్నెట్, సమాచార ఏఐ యుగం, డ్రగ్స్ మద్యం, వ్యసనాలు, సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్ అండ్ హెల్త్ తదితర విషయాలపై పనిచేసి వారి సంఘాలు ఏర్పాటు చేసి అభివృద్ధి వైపు నడిపించాలన్నారు. కార్యక్రమంలో జయశంకర్, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్, ములుగు, హనుమకొండ, కొమురంభీమ్, ఆసిఫాబాద్ నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయనిదేవి -
జాతర పనుల్లో వేగం పెంచాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. మేడారంలో జరుగుతున్న జాతర అభివృద్ధి పనులను సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మేడారం ఐటీడీఏ కార్యాలయంలో జాతర అభివృద్ధి పనులపై ఎస్పీ శబరీశ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. జాతర పనుల పురోగతిపై ఆయాశాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతర సమయం దగ్గర పడుతోందని, పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. డిసెంబర్‌కల్లా పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతర అభివృద్ధి పనులతోపాటు అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులపై పూజారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. అంతకుముందు మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఈఓ వీరస్వామి, సీఐ దయాకర్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ : రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నా టి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని, మెటీరియల్ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. 24/7 సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఏజెన్సీలు, బ్రేక్ డౌన్ టీంలు రెడీగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఔత్సాహికులు ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు తీసుకోవా లన్నారు. సమావేశంలో డైరెక్టర్లు మోహన్రా వు, మధుసూదన్, సీఈలు రాజు చౌహాన్, వెంకటరమణ, జీఎంలు అన్నపూర్ణ, శ్రీనివాస్, శ్రీకాంత్, డీఈ లు అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి -
విద్యార్థుల ప్రగతికి అధునాతన సాంకేతిక సేవలు
● వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ కాళోజీ సెంటర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రగతి కోసం ఇంటర్ బోర్డు పలు అధునాతన సాంకేతిక సేవలను ప్రారంభించిందని వరంగల్ ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోమవారం గూగుల్ మీట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు పలు ఆధునిక సేవలను వివరించారు. కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు మెరుగుదల కోసం ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్ఆర్ఎస్) ప్రారంభించినట్లు తెలిపారు. హాజరు విధానాన్ని అధునాతన సాంకేతిక పద్ధతిలో ఇంటర్ విద్యావిభాగం అవలంబిస్తోందని వివరించారు. ఆన్లైన్ ద్వారా టైంటేబుల్, టీచింగ్ డైరీ నమోదుతో అధ్యాపకుల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడానికి ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి సాంకేతిక సంస్థలతో ఒప్పందం చేసుకొని ఆన్లైన్ తరగతులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కళాశాలల్లో వసతుల మెరుగుదలకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలి పారు. గూగుల్ మీట్లో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.బైక్ దొంగల అరెస్ట్.. హసన్‌పర్తి: వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు బైక్ దొంగలను అరెస్ట్ చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. వారి వద్ద నాలుగు ద్విచక్రవాహనాలతోపాటు మూడు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు సోమవారం హసన్‌పర్తి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హసన్‌పర్తి ఎస్సై గోవర్ధన్ సీతంపేట క్రాస్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు పారిపోతుండగా గమనించారు. వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించగా తాము చేసిన చోరీలను అంగీకరించారు. దీంతో కాజీపేట బాపూజీనగర్‌కు చెందిన కలుగుల సాయిచంద్, రెడ్లమ్ రాకేశ్, గంపల సాయితేజాను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ చెప్పారు. వీరి వద్ద నుంచి ఒక బైక్‌తో పాటు మూడు గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా... సీతంపేటక్రాస్ వద్ద ఎస్సై దేవేందర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా కాజీపేట వైఎస్సార్ నగర్‌కు చెందిన ముద్దంగుల అనిల్ పోలీసులకు చిక్కాడు. దీంతో విచారించగా గతంలో వివిధ ప్రాంతాల్లో చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కాగా, దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్సైలు గోవర్ధన్, దేవేందర్తోపాటు కానిస్టేబుల్ క్రాంతి, వెంకటస్వామిని ఏసీసీ అభినందించారు.ఈ సందర్భంగా నగదు పురస్కారం అందజేశారు. డిసెంబర్ 13, 14న ఏపీఆర్జేసీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నయీంనగర్ : డిసెంబర్ 13, 14న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (ఏపీఆర్జేసీ) నాగార్జున సాగర్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నాగార్జునసాగర్ విజయపురి సౌత్‌లో నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ ఏపీఆర్జేసీ సాగర్ పరివార్ బాధ్యులు, కళాశాల పూర్వ విద్యార్థులు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామక శ్రీనివాస్, డాక్టర్ కన్నం నారాయణ, పరకాల ఆర్డీఓ, కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ మారెళ్ల అంజిరెడ్డి తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో గోల్డెన్ జూబ్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. దేశంలో అత్యున్నత ఉద్యోగాలు చేసిన ఏపీఆర్జేసీ పూర్వ విద్యార్థులు, వివిధ దేశాల్లో సెటిల్ అయిన 5 వేల మంది పూర్వ విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో చార్టెడ్ అకౌంటెంట్ చంచల్ అగర్వాల్, స్వామి, డాక్టర్ రాజు పాల్గొన్నారు. -
పారా అథ్లెట్ దీప్తికి గౌరవం..
● హైదరాబాద్‌లోని ఓ ప్లైఓవర్ పిల్లర్‌పై ఆమె రన్నింగ్ చిత్రం పర్వతగిరి : హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఫ్లైఓవర్ పిల్లర్‌పై సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జివాంజీ దీప్తి గౌరవార్థం ఆమె రన్నింగ్ చిత్రం వేశారు. దీప్తి పారిస్ పారా ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతోపాటు అర్జున అవార్డు సాధించింది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 400మీటర్లు, 200మీటర్ల పరుగు పందెంలో రెండు స్వర్ణ పతకాలు సాధించింది. దీంతో దీప్తి ప్రతిభకు గుర్తింపునిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మామునూరు పీఎస్‌లో ఇద్దరు సస్పెన్షన్వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలోని మామునూ రు పోలీస్ స్టేషన్ వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది. పర్యవేక్షణ అధికారులు మౌనం వహించ డం, కిందిస్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పోలీస్ స్టేషన్ పాలన అస్తవ్యస్తంగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ కేసు విషయంలో మామునూరు ఇన్స్పెక్టర్ ఒంటేరు రమేశ్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్‌కు పోలీస్ కమిషనర్ మెమోలు జారీ చేసి ఒక్కరోజు కాకముందే అదే పీఎస్‌లో పనిచేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌పై సీపీ సస్పెన్షన్ వేటు వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం కమిషనరేట్‌లో చర్చనీయాంశమైంది. పది రోజుల క్రితం వాహనాల తనిఖీలో గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు నిందితులను పీఎస్ లో విచారిస్తున్న క్రమంలో ఆ నిందితులు పోలీసుల కళ్లు కప్పి పరారయ్యారు. ఈ ఘటనలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు హెడ్ కాని స్టేబుల్ ఎండీ యూసుఫ్, కానిస్టేబుల్ శ్రీనివాస్‌లు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నిందితులు పరారైనట్లు నిర్ధారించి సీపీకి నివేదికలు ఇచ్చా రు. దీంతో ఆయన ఆ ఇద్దరి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మామునూరు పీఎస్‌లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయితే మరికొంత మంది అధికారులపై చర్యలు ఉండే అవకాశం ఉంది. 29 వరకు డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ బీఏ,బీకాం, బీబీఏ, బీఎస్సీ బీ ఒకేషనల్, బీసీఏ, బీహెచ్ఎం అండ్ సీటీ (రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్) మొదటి, మూడు , ఐదో సెమిస్టర్ పరీక్షలు నవంబర్‌లో నిర్వహించనున్నారు. ఈమేరకు రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 29వ తేదీ వరకు గడువు ఇస్తూ కేయూ పరీక్షలనియంత్రణాధికారి సోమవారం ఫీజు రీ–నోటిఫికేషన్ జారీచేశారు. ఆయా సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించేందుకు అపరాధ రుసుములేకుండా ఈనెల27వతేదీతో గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 29వ తేదీవరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చారు. -
శ్రీనివాసరావుకు నబారా స్మారక పురస్కారం
హన్మకొండ కల్చరల్ : కవి, న్యాయవాది డాక్టర్ నమిలికొండ బాలకిషన్‌రావు స్మారకంగా ఏర్పాటు చేసిన నబారా పురస్కారం–2025ను కవి పొట్లపల్లి శ్రీనివాసరావు అందుకున్నారు. ఆదివారం రాత్రి శ్రీరాజరాజనరేంద్రంద్ర భాషానిలయంలో కవి బిల్ల మహేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం నబారా సొసైటీ అధ్యక్షుడు నమిలికొండ పాంచాలరాయ్ అతిథులతో కలిసి శ్రీనివాసరావుకు నబారా స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎన్వీఎన్ చారి, గన్నమరాజు గిరిజమనోహర బాబు, వీఆర్ విద్యార్థి చంద్, వల్లంపట్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ క్రీడా ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 బాలబాలికల ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ క్రీడాంశాలలో నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో మొదటి రోజు యోగా, కరాటే, టగ్‌ఆఫ్‌వార్, తంగ్తా, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నీస్, సాఫ్ట్ టెన్నిస్, మాల్కమ్, గట్కా క్రీడల్లో ఎంపికలు నిర్వహించినట్లు ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 350 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్జేడీ గోపాల్, డీవైఎస్ఓ గుగులోత్ అశోక్‌కుమార్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కాకా మాధవరావు, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి దరిగి కుమార్, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా హెల్త్ రన్
పబ్లిక్ గార్డెన్ జంక్షన్లో వైద్య విద్యార్థుల ఫ్లాష్‌మాబ్ ● మహిళా ఆరోగ్యంపై ఫ్లాష్‌మాబ్ ఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలలో ఉత్కర్ష–25 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు వేడుకల్లో భాగంగా వైద్యవిద్యార్థులు మహిళల ఆరోగ్యంపై హెల్త్ రన్ నిర్వహించడంతో పాటు ప్లాష్ మాబ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈహెల్త్ రన్ కేఎంసీ ప్రధాన గేట్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు కొనసాగగా.. ఈ రన్‌ను కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్య అనిల్, ఐఎంఏ వైద్యులు, అధ్యాపకులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్ చౌరస్తాలో వైద్యవిద్యార్థులు స్కిట్స్, డ్సాన్స్ల ప్రదర్శనతో మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. మధ్యాహ్నం క్విట్, పెయింటింగ్ వంటి సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించగా.. సాయంత్రం వైద్యవిద్యార్థులు నిర్వహించిన షార్ట్ ఫిలింస్ అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్ఐ శ్రీనివాస్, ఐఎంఏ ప్రతినిధులు కూరపాటి రమేశ్, వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
విద్యారణ్యపురి: విద్యారంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేయాలని, స్కూళ్లను సెమీ రెసిడెన్షియల్‌గా మార్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఆదివారం నిర్వహించిన విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో తక్కువగా నిధులు కేటాయిస్తోందని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం విధ్వంసానికి గురైందన్నారు. గురుకులాలను ఏర్పాటు చేసి లక్షలాది మంది విద్యనభ్యసించే సాధారణ ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాధారణ ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాట్లకు ఉపక్రమించిందని పేర్కొన్నారు. దీంతో విద్యలో మరింత అంతరాలు పెరిగిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, అందరికీ సమాన విద్య అందించాలని డిమాండ్ చేశారు. అధ్యాపక జ్వాల సంపాదకురాలు జి.కళావతి మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ విలువైన సమయాన్ని యాప్‌లలో అప్లోడ్ చేసేందుకు కేటాయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. డీటీఎఫ్ నాయకురాలు ఎస్.అనిత మాట్లాడుతూ విధి నిర్వహణలో మహిళా ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్‌రెడ్డి, అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ గంగాధర్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కె. నారాయణరెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జి.ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీ నివాస్ బాధ్యులు ఎం.రఘుశంకర్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి ఎ.సంజీవరెడ్డి, డి.రమేశ్, వివిధ జిల్లాల బాధ్యులు గోవిందరావు, యాకయ్య, రాంరెడ్డి, తిరుపతి, భాస్కర్, దేవేందర్‌రాజు, ఆదిరెడ్డి మాట్లాడారు. ఏలూరి సత్యమ్మకు అభినందన డీటీఎఫ్ హనుమకొండ జిల్లా కౌన్సిలర్ ఏలూరు సత్యమ్మ శ్రీరాములపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈనేపథ్యంలో ఆమెకు ఆదివారం అభినందన సభ నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తిలో సత్యమ్మ నిబద్ధత, అంకితభావంతో పనిచేశారని డీటీఎఫ్ రాష్ట్ర, జిల్లాల బాధ్యులు కొనియాడారు. విద్యాసదస్సులో డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి -
ఆరబెట్టలేక.. అమ్ముకోలేక!
వరంగల్: పండించిన పత్తిని రైతులు మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితులు కనిపించట్లేదు. అకాల వర్షాలతో పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈదుస్థితి ఏర్పడింది. పత్తిలో 8 శాతం తేమ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.8,110 ఇస్తామని సీసీఐ వెల్లడించింది. ప్రతీ అదనపు శాతానికి రూ.81 కోత ఉంటుందని ఇప్పటికే పేర్కొంది. అది కూడా 12 శాతం వరకే. అంతకుమించితే కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేసింది. ఇదే ఇప్పుడు పత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆరబెడదామంటే అనువైన పరిస్థితులు లేవు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో పత్తిని ఆరబెట్టుకోలేక, ఇంట్లో నిల్వ చేస్తే తేమ శాతం పెరిగే అవకాశాలున్నాయి. దీంతో మార్కెట్‌కు తీసుకొచ్చి రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. మద్దతు ధర కంటే సుమారు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తక్కువగా అమ్మడంతో రైతులు నష్టపోతున్నారని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 60 కొనుగోలు కేంద్రాలు.. సీసీఐ నిర్దేశించిన దానికంటే పత్తిలో తేమ ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం అన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలో 60 సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు మార్కెటింగ్ అధికారులు సిద్ధమవుతున్నారు. వరంగల్ జిల్లాలో 28, హనుమకొండలో 3, జనగామలో 15, మహబూబాబాద్ 6, భూపాలపల్లి 5, ములుగులో 3 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా సోమవారం లాంఛనంగా వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రాలతోపాటు మక్కల కొనుగోలు కేంద్రాలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభిస్తారని వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ తెలిపారు. పత్తిలో తేమ శాతం కారణంగా మిగిలిన కేంద్రాలను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పత్తిలో తేమ 8 శాతం ఉంటే మద్దతు ధర రూ.8,110 చెల్లిస్తారు. 9 శాతం ఉంటే రూ.8,028, 10 శాతం ఉంటే రూ.7,947, 11 శాతం ఉంటే రూ.7,866, 12 శాతం ఉంటే 7,785.60 ధర చెల్లిస్తారు. 12 శాతం మించితే కొనుగోలు చేయమంటున్న సీసీఐ నేడు ఏనుమాముల మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గతంలో సీసీఐ కొనుగోలు చేసిన పద్ధతితోనే రైతులకు ఇబ్బందులు ఉండవు. కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని సంబంధిత కేంద్రానికి తీసుకొస్తే తేమ ఎక్కువ ఉందని అంటే రైతు సరుకు వాపస్ తీసుకుపోవాల్సి వస్తోంది. దీని వల్ల రవాణా చార్జీలు అదనంగా భరించాలి. రైతు ఇష్టం ఉన్న కేంద్రంలో అమ్ముకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దేశంలో పలుచోట్ల ఈపద్ధతిపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. పంజాబ్‌లో గొడవలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో సైతం ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిసింది. రైతు పట్టా పాస్‌బుక్, బ్యాంకు ఖాతాలను పరిగణనలోకి తీసుకుని కొనుగోలు చేస్తే బాగుంటుంది. – బొమ్మినేని రవీందర్‌రెడ్డి, కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
● ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి విద్యారణ్యపురి: సీనియర్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే ప్రకటించాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలో టీఎస్‌యూటీఎఫ్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులంతా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉపాధ్యాయులు టెట్ గురించి ఆందోళన చెందుతున్నారన్నారు. విద్యాహక్కు చట్టం అమలుకు ముందే ఎన్సీటీఈ నిబంధనలు 2010 ఆగస్టు 23 కంటే ముందే నియామకమైన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2023 జూలై నుంచి పీఆర్సీని అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ క్లియర్ చేయాలన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల బెనిఫిట్స్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్, కేజీబీవీల టీచర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జంగయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.సోమశేఖర్, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు, బి.వెంకటరెడ్డి లక్ష్మారెడ్డి, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, వరంగల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.కుమార్, సి.సుజన్‌ప్రసాద్‌రావు, చంచాల లింగారావు వివిధ జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు. -
కాకతీయుల శిల్పకళ అద్భుతం
హన్మకొండ: కాకతీయుల శిల్పకళా నైపుణ్యం అద్భుతమని త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్‌వర్మ అన్నారు. రెండు రోజుల పర్యటనకు వచ్చిన హేమంత్‌వర్మ, అనిత దంపతులు శనివారం హనుమకొండకు చేరుకున్నారు. హోటల్ హరిత కాకతీయలో మధ్యాహ్న భోజనం అనంతరం రామప్పకు చేరుకుని దైవ దర్శనం చేసుకున్నారు. హేమంత్ వర్మను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. ఆదివారం వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం ఖిలా వరంగల్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా హేమంత్‌వర్మ మాట్లాడుతూ అద్భుత కళా నైపుణ్యానికి నిదర్శనం వేయిస్తంభాల గుడి అని కొనియాడారు. ఎంతో ఘన చరిత్ర గల వేయిస్తంభాల గుడిని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. వరంగల్ మూడు కోటల ప్రాకారాలు, వాటి చరిత్రను గైడ్ వివరించారు. వరంగల్ ఎస్ఈ కె.గౌతమ్‌రెడ్డి, డీఈలు జి.సాంబరెడ్డి, శెంకేశి మల్లికార్జున్, ఏడీఈ పి.మల్లికార్జున్, ఉద్యోగులు పాల్గొన్నారు.త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్‌వర్మ -
వైద్యుల నిర్లక్ష్యంపై మంత్రి సీరియస్!
పరిపాలనాధికారులపై వేటుకు రంగం సిద్ధం ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో కొన్ని రోజులుగా వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. శనివారం ఎలాంటి వైద్య సిబ్బంది సహాయం లేకుండా రెండు, మూడు రోజుల పసికందులను ఆక్సిజన్ సిలిండర్‌తో ఎక్స్‌రేకు తీసుకెళ్లిన ఘటనతో పాటు, కొన్ని రోజులుగా వైద్యసేవల నిర్లక్ష్యంపై మంత్రి స్వయంగా ఆరా తీసినట్లు చర్చించుకుంటున్నారు. ఎంజీఎం ఆస్పత్రిని తక్షణమే గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హెల్త్ సెక్రటరీని సైతం అదేశించినట్లు వైద్యవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక నుంచి ప్రతీవారం ఎంజీఎం ఆస్పత్రిపై సమీక్ష నిర్వహించి పేదలకు వైద్యసేవలందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీఎంఈ ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తొంది. అలాగే ఎంజీఎం ఆస్పత్రిలో ఏళ్ల తరబడి తిష్టవేసిన మినిస్ట్టీరియల్ సిబ్బందితో పాటు వైద్యసిబ్బంది వివరాల సేకరణకు రంగం సిద్ధమైంది. ప్రొఫెసర్ల గైర్హాజరే అసలు కారణం ఎంజీఎం ఆస్పత్రిలోని ప్రతీ విభాగాన్ని పర్యవేక్షించే వైద్యులు హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వస్తూ చుట్టపుచూపుగా సేవలందించడమే ఆస్పత్రిలో సేవల తిరోగమనానికి కారణమని రోగులు పేర్కొంటున్నారు. ప్రొఫెసర్లు విధుల్లోకి రాకపోవడంతో, అసోసియేట్, అసిస్టెంట్లు సైతం విధులపై బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం వల్ల పారామెడికల్ సిబ్బందిలో సైతం నిర్లక్ష్యం పెరిగిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పేద రోగికి అందాల్సిన వైద్యం కోసం ఎంజీఎంలో తీవ్ర పాట్లు పడాల్సిన దుస్థితి నెలకొంది. కలెక్టర్ ఎంజీఎం ఆస్పత్రిపై ఎన్ని సమీక్షలు నిర్వహించినా నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటే తప్ప ఎంజీఎంలో పేద ప్రజలకు సేవలు అందని దుస్థితి నెలకొంది. -
కంచెలు ఏర్పాటు చేయండి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ వరంగల్ అర్బన్: ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవకుండా కంచెలు ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులకు సూచించారు. శనివారం నగర పరిధి గొర్రెకుంట కీర్తినగర్ కోటిలింగాల ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి శానిటేషన్తో పాటు టౌన్‌ప్లానింగ్‌కు చెందిన అంశాలను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా కమిషనర్ ప్రభుత్వానికి చెందిన ఓపెన్ స్పేస్‌లను గుర్తించాలని ఆక్రమణలకు గురవకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఓపెన్ స్పేస్‌లో బయో కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేయాలని ముఖ్య ఆరోగ్యాధికారికి సూచించారు. గొర్రెకుంట ప్రాంతంలో పర్యటించి ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. కీర్తినగర్‌లో మరో 2 ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, వరంగల్ మ్యూజికల్ గార్డెన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈ సంతోశ్‌బాబు, ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి డీఈ సతీశ్, టీపీఎస్ శ్రీకాంత్, టీపీబీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
కాసింత సమయం కేటాయిద్దాం..
సమాజంలో అందరూ మనలాగే ఉండరు.. సంతోషంగా బతకాలని ఉన్నా.. అందుకు అవకాశం లేని వారూ ఉన్నారు. మనతోనే సమాజంలో జీవనం సాగిస్తున్నా.. అందరిలా ఆనందం పొందడం లేదు వాళ్లు.. చుట్టూ ఎంత మంది ఉన్నా.. నా అన్న వాళ్లు లేని అనాథలు.. అమ్మానాన్నలకు దూరమైన చిన్నారులు కొందరైతే.. కన్నవారి నిరాదరణకు గురైన అమ్మానాన్నలు మరికొందరు. అసలు సమాజాన్ని చూడలేని అంధులు కొందరైతే.. సాటి మనిషి తోడుంటే తప్ప కదల్లేని దివ్యాంగులు ఇంకొందరు. ఇలా వీరంతా మనలాగే మనుషులు. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మ విశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనసులు.. ఆనందాన్ని పంచే మాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరున్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం ఇవ్వగలిగేవే.. మనం చేసే ఖర్చు.. వెచ్చించే సమయం కొంతైనా వారికి ఆనందాన్నివ్వవచ్చు. కాసింత సమయం కేటాయిద్దామనే ఆలోచనలతో ఎంతో మంది ఆశ్రమాలను సందర్శిస్తూ ఒకపూట ఆత్మీయంగా గడుపుతున్నారు. -
నవంబర్ 6 నుంచి ఎంఏ తెలుగు సెకండియర్ ఇంటర్నల్స్
హన్మకొండ కల్చరల్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో ఎంఏ తెలుగు సెకండియర్ మొదటి ఇంటర్నల్ పరీక్షలు వచ్చే నెల 6నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆ పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాల కోసం 99894 17299, 9989 139136 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కేయూ క్యాంపస్: డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని సెనేట్హాల్లో శనివారం పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులపై సమీక్షించి అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఆయనమ మాట్లాడుతూ ప్రతీ పోలీస్టేషన్ పరిఽ ధిలోని రౌడీషీటర్లపట్ల కఠినంగా వ్యవహరిస్తూ నే వారి కదలికలపై దృష్టి పెట్టాలని కోరారు. చోరీలకు పాల్పడిన నిందితులతోపాటు గంజాయి విక్రయదారులపై హిస్టరీ షీట్లను తెరవాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల్లో బాధితులకు సొమ్మును తిరిగి ఇప్పించడంతోపాటు నేరగాళ్లను పట్టుకునేందుకు కృషి చేయాలన్నారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ అధికారిగా ఎస్సై స్థాయి అధికారి తప్పకుండా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రతీ శుక్రవారం పోలీస్టేషన్లలో శ్రమదానం చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, అంకిత్‌కుమార్, ఏఎస్పీ చేతన్‌నితిన్, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్‌రావు, బాలస్వామి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. మామునూరు: బాలికలపై జరిగే దాడులు, చట్టపరమైన రక్షణ చర్యలపై మరింత అవగాహన పెంచుకోవాలని వరంగల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కందుకూరి పూజ అన్నారు. ఈమేరకు శనివారం మామునూరు నవోదయ విద్యాలయంలో వరంగల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఎస్సై కృష్ణవేణి ఆధ్వర్యంలో చట్టపరమైన చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జడ్జి కందుకూరి పూజ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ రమేశ్, పీసీ రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: వర్జీనియాలోని ఫెయిర్ ఫాక్స్‌లో ఉన్న జార్జ్ మాసన్ విశ్వవిద్యాలయం (జీఎంయూ) ప్రతినిధి బృందం కాకతీయ యూనివర్సిటీని సందర్శించినట్లు శనివారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, ప్రొఫెసర్లు బి.వెంకట్రామ్రెడ్డి, పి.మల్లారెడ్డి, ఎం.సదానందం, డాక్టర్ బి.రమ, డాక్టర్ డి.రమేశ్, ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ రమణ, డాక్టర్ భిక్షాలు, స్టూడెంట్స్ అఫేర్స్ డీన్ మామిడాల ఇస్తారితో జీఎంయూ బృంద సభ్యులు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈబృందంలో గ్లోబల్ ఎంగేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కమ్మీ సంఘీర, కంప్యూటర్ సైన్స్ విభాగం అసోసియేట్ చైర్మన్ డాక్టర్ రాబర్ట్ పిటిట్ ఉన్నారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి న్యూశాయంపేట: దివ్యాంగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని వరంగల్ జిల్లా సంక్షేమాధికారి బి.రాజమణి అన్నారు. కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు కలెక్టరేట్లో దివ్యాంగులు, వయోవృద్ధులకు శనివారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి 10 ఫిర్యాదులు స్వీకరించారు. జెడ్పీ సీఈఓ 1, సివిల్ సప్లయీస్ 3, ఈడీఎం 1, మెప్మా పీడీ 1, డీఎంహెచ్ఓ 1, డీఆర్డీఏకు 3 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను అధికారులకు ఎండార్స్ చేశారు. అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అనాథ, వృద్ధాశ్రమాల్లో పుట్టిన, పెళ్లిరోజు వేడుకలతో సందడి
సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో భోజనాలు.. కాజీపేటలో పిల్లలకు పండ్లు అందజేస్తున్న దాతలు (ఫైల్)కాజీపేట: వారంతా మనలాగే మనుషులు. చుట్టూ అందరూ ఉన్నా..నా అనేవారు లేని వాళ్లు.. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే రెండు మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మవిశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనుషులు.. ఆనందాన్ని పంచే ఆటపాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరు ఉన్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం వారికి అందించగలం.. ‘మేం అనాథలం కాము’ అని వారిలో ఆనందాన్ని నింపగలం.. ఇందుకు కావాల్సిందల్లా కాసింత సమయం.. ఓపిక మాత్రమే. నగరంలోని చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు ఇటీవలి కాలంలో సేవాపథంలో ముందుకు సాగుతున్నారు. ఆదివారాన్ని ఆనందంగా గడుపుతూనే.. దాన్ని మరికొంత మందికి పంచేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అనాథలు, మానసిక దివ్యాంగులు, వృద్ధుల మధ్య పుట్టిన రోజు, వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. పండ్లు, స్నాక్స్, బ్రెడ్ ప్యాకెట్లు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. బాగున్నావా అవ్వ., ఏం చేస్తున్నావు తమ్ముడూ.. ఆరోగ్యం ఎలా ఉంది అన్న అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఒంటరి మనుషుల మోముల్లో చిరునవ్వు నింపుతున్న కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారితో ఆటాపాట.. పండ్లు.. కడుపు నిండా భోజనం ఇటీవల పెరిగిన సేవా దృక్పథం -
‘లక్కు’ దక్కేదెవరికో..
సాక్షిప్రతినిధి, వరంగల్ : 2025–27 ఎకై ్స జ్ టెండర్లలో అదృష్టజాతకులెవరో సోమవారం తేలనుంది. వచ్చే రెండేళ్ల కోసం మద్యం దుకాణాలను నిర్వహించే అవకాశం ఉమ్మడి వరంగల్‌లో ఎవరికి దక్కనుందో వెల్లడి కానుంది. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున.. 10,493 మంది రూ.314.79 కోట్లు ఫీజు రూపేణా చెల్లించారు. వాస్తవానికి దరఖాస్తుల గడువు ఈ నెల 18 తేదీనే ముగిసినప్పటికీ.. మరో ఐదు రోజులు పొడిగించి 23కు మార్చారు. ఈ నెల 18వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలోని 294 వైన్స్(ఏ–)షాపులకు 9,754 దరఖాస్తులు రాగా.. 23 వరకు 739 పెరిగి మొత్తం 10,493లకు చేరింది. ఇందులో గౌడ కులస్తులకు కేటాయించిన దుకాణాలకు 2,050 దరఖాస్తులు రాగా, ఎస్సీ రిజర్వుడ్పై 1,023, ఎస్టీలపై 651, ఓపెన్ టెండర్లపై 6,769 వచ్చినట్లు ప్రొహిబిషన్, ఎకై ్సజ్‌శాఖ అధికారులు ప్రకటించారు. 10,439 దరఖాస్తుల్లో 294 మందికే వైన్‌షాపులు దక్కనుండగా, ఆ ‘లక్కీ’ వరించే 294 మంది ఎవరో? అన్న సస్పెన్స్‌కు రేపు తెరపడనుంది. గతంతో పోలిస్తే తగ్గిన దరఖాస్తులు 2023–25 టెండర్లతో పోలిస్తే ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గాయి. ఫలితంగా దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచినా ఆదాయం ఊహించిన మేర రాలేదు. గత టెండర్ల సందర్భంగా ఉమ్మడి వరంగల్‌లో 294 షాపులకు 16,039 దరఖాస్తులు రాగా, రూ.320.78 కోట్లు ఆదాయం ప్ర భుత్వానికి సమకూరింది. ఈసారి అదేస్థాయిలో.. అంతకంటే ఎక్కువ కూడా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. దీంతో అదనంగా పెరిగిన అప్లికేషన్ ఫీజు రూ.లక్ష కలిపి దరఖాస్తుల ద్వారా రూ.481 కోట్ల నుంచి రూ.520 కోట్ల వరకు రావొచ్చనుకున్నారు. కానీ, ఈసారి ఆశించిన మేర స్పందన లేక గడువు పొడిగించినప్పటికీ గతంతో పోలిస్తే 5,546 తక్కువ వచ్చాయి. మొత్తం 10,493 దరఖాస్తులు రాగా.. వాటిపై రూ.314.79 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. కాగా ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేస్తూ గత టెండర్లలో మద్యం వ్యాపారం తడాఖా చూపించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఉద్యోగులు పలువురు తప్పుకున్నారు. దీంతో టెండర్ షెడ్యూళ్ల సంఖ్య తగ్గగా.. టెండర్లు వేసిన వారిలో మద్యం దుకాణాలు దక్కించుకునే అదృష్ట జాతకులెవరో? ఎవరికి ఆ దుకాణాలు దక్కుతాయో?నన్న చర్చ జోరుగా సాగుతోంది. లక్కీ డ్రాకు విస్తృత ఏర్పాట్లు.. మద్యం షాపులు ఖరారు చేసేందుకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించనున్నారు. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాకు సంబంధించి 67 షాపులకు దాఖలైన 3,175 దరఖాస్తుల నుంచి లక్కీ డ్రా తీసేందుకు అంబేడ్కర్ భవన్ వేదికగా ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలో 57 వైన్‌షాపులకు దాఖలైన 1,958 దరఖాస్తుల నుంచి ఎంపిక చేసేందుకు వరంగల్‌లోని నాని గార్డెన్స్‌లో డ్రా తీయనున్నారు. రేపు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ఉదయం 11 గంటల నుంచి డ్రా... కలెక్టర్ల సమక్షంలో తీసేందుకు ఏర్పాట్లు ఉమ్మడి జిల్లాలో 10,493 దరఖాస్తులు.. ఆదాయం రూ.314.79 కోట్లు జిల్లా వైన్స్‌లు 18 వరకు వచ్చిన 23 వరకు వచ్చిన (ఏ–4) దరఖాస్తులు దరఖాస్తులుహనుమకొండ 67 3,012 3,175 వరంగల్ 57 1,826 1,958 జనగామ 50 1,587 1,697 మహబూబాబాద్ 61 1,672 1,800 భూపాలపల్లి/ములుగు 59 1,657 1,863 294 9,754 10,493 -
సదర్ సంబురం
యాదవుల తీన్మార్ స్టెప్పులు, డప్పు దరువులతో ఖిలా వరంగల్ కోట గురువారం రాత్రి మార్మోగింది. సదర్ ఉత్సవంలో భాగంగా దున్నపోతుల విన్యాసాలు అలరించాయి. కాళోజీ సెంటర్: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో శుక్రవారం నుంచి ఎస్ఏ–1 పరీక్షలు నిర్వహించాలని వరంగల్ డీఈఓ రంగయ్య నాయు డు, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 14,279 మంది, 6 నుంచి పదో తరగతి వరకు 17,936 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు 24,752 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో క్యాంపస్‌లోని పరిపాలనా భవనం వీసీ చాంబర్ వద్ద విద్యార్థులు ధర్నా చేశారు. ఈసందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. హాస్టళ్ల డైరెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. న్యూ పీజీ బాయ్స్ హాస్టల్, జగ్జీవన్ హాస్టల్ విద్యార్థులకు సరైన వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు తమ సమస్యల్ని పట్టించుకోవట్లేదన్నారు. న్యూ పీజీ హాస్టల్ వద్ద నిర్మించిన డైనింగ్ హాల్ మెస్‌ను ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. కామన్ మెస్‌లోనూ, మహిళా హాస్టల్స్ మెస్‌లోనూ మెనూ చార్టును అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిచాలన్నారు. తప్పుడు లెక్కలు, అధిక బిల్లుల విషయంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండగా.. వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి అక్కడికి వచ్చి సంఘం బాధ్యులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆరోపణలపై విచారణ జరిపిస్తామన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ధర్నాలో రణదీప్, రాహుల్, సూరజ్, నాగరాజ్, రాజేశ్, సునీల్, పవన్, అనూప్ పాల్గొన్నారు. -
గ్రీన్‌ఫీల్డ్ రైతులతో ఆర్బిట్రేషన్
న్యూశాయంపేట: గ్రీన్‌ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న నెక్కొండ మండలంలోని పత్తిపాక, వెంకటాపూర్ రైతులతో వరంగల్ కలెక్టర్ సత్యశారద గురువారం కలెక్టరేట్లో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. అదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎన్‌హెచ్ ఇంజనీరింగ్ అధికారి ఈశ్వర్, రైతులు పాల్గొన్నారు. ఈఆర్సీ చైర్మన్లను కలిసిన కలెక్టర్ నగర పర్యటనకు వచ్చిన పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్లు విశ్వజిత్ఖన్నా, అరవింద్‌కుమార్‌ను కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. -
ఒక్కేసి పువ్వేసి.. చందమామ
● వైభవంగా నేతకాని ‘దీపావళి బతుకమ్మ’ ఉత్సవాలు ● భక్తిశ్రద్ధలతో నిమజ్జనం ఒక్కేసి పువ్వేసి చందమామ.. అంటూ యువతులు, మహిళలు పాటలతో సందడి చేశారు పోయి రావమ్మ.. గౌరమ్మ అంటూ దీపావళి (నేతకాని) బతుకమ్మను సాగనంపారు. హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామంలో మూడు రోజులపాటు నిర్వహించిన దీపావళి(నేతకాని)బతుకమ్మ వేడుకలు గురువారం ముగిశాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, పురుషులు గ్రామ వీధులగుండా కిలోమీటర్ దూరం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బతుకమ్మ ఆడి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శరత్, మాజీ ఎంపీటీసీ రజిత, స్థానికులు చేరాలు, రాజయ్య, గాంఽధీ పాల్గొన్నారు. – హసన్‌పర్తి -
కమ్యూనిటీ హాళ్లను స్వాధీనం చేసుకోవాలి
వరంగల్ అర్బన్: మహానగరవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ హాళ్లను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. గురువారం కమిషనర్, టౌన్ ప్లానింగ్, పన్నుల విభాగం అధికారులు హనుమకొండలోని టీఎన్జీఓస్ కాలనీలోని రోజ్ గార్డెన్‌ను సందర్శించారు. గార్డెన్‌ను స్వాధీనం చేసుకోవడంతోపా టు బల్దియా పేరిట బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో సుమారు 60 నుంచి 80 వరకు ఉన్న కమ్యూనిటీ హాళ్లలో సగం వరకు బల్దియా ఆధ్వర్యంలో ఉన్నాయని తెలిపారు. మిగతా సగం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయని, వారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వాటి జాబితాను అధికారులు నివేదించాలన్నారు. ఎవరైనా హాల్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో చేసుకోవచ్చని.. ఒక ఫంక్షన్‌కు రూ.20 వేలు, అదనంగా విద్యుత్ చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. పురాతన కట్టడాలు.. బావుల్ని పునరుద్ధరించండి నగరంలో స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కి) పథకం అమలులో భాగంగా పురాతన కట్టడాలు, బావుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. గురువారం హనుమకొండ‘ కుడా’ కార్యాలయంలో సాస్కి పథకంపై ఆయా విభాగాల అధికారులతో చర్చించారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, ‘కుడా’ సీపీఓ అజిత్‌రెడ్డి, సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డి సీహెచ్‌ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి, ఈఈలు రవికుమార్, సంతోశ్‌బాబు, డీఈలు రవికిరణ్, శివానంద్, స్మార్ట్ సిటీ పీఎంసీ ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీఓస్ కమ్యూనిటీ హాల్ స్వాధీనం హన్మకొండ: హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలోని టీఎన్జీఓస్ కమ్యూనిటీ హాల్‌ను బల్దియా స్వాధీనం చేసుకుంది. గురువారం ఉదయం అధికారులు టీఎన్జీఓస్ కమ్యూనిటీ హాల్‌కు తాళం వేసి వెళ్లారు. సాయంత్రం తాళం తీసి ఈ కమ్యూనిటీ హాల్‌ను తామే నిర్వహించనున్నట్లు, శుభకార్యాలు, ఈవెంట్లకు అద్దెకు ఇవ్వనున్నట్లు బ్యానర్ ఏర్పాటు చేశారు. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తామంతా వ్రతాలు, పూజా కార్యక్రమాల్లో ఉండగా.. వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు చేరుకుని తాళం వేసినట్లు టీఎన్జీఓస్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొక్కిరాల రవీందర్రావు, కార్యదర్శి కిశోర్ తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మాట్లాడతానని చెప్పారన్నారు. విందుకు రూ.20 వేల చొప్పున చార్జీ విధించాలి కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ -
‘ఏసీబీ’ దడ.. ‘సైబర్’ వల
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వరరావుపై ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఆరోపణలు రావడంతో కొద్ది రోజుల క్రితం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లో దాడులు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపారు. ఇదే అదునుగా భావించిన సైబర్ నేరస్తులు నర్సంపేట డివిజన్‌కు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్‌ను ఏసీబీ పేరిట బెదిరించి రూ.3.50 లక్షలు వసూలు చేశారు. ఫిబ్రవరిలో రవాణాశాఖ వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది. ఆ తర్వాత మహబూబాబాద్ కార్యాలయంలోనూ తనిఖీలు చేసింది. దీంతో రవాణాశాఖ అధికారులు కొందరు ఏసీబీ భయంతో వణికిపోతున్నారని పసిగట్టిన సైబర్ నేరస్తులు.. వరంగల్ ఎంవీఐ, మహబూబాబాద్ ఇన్చార్జ్ ఆర్టీఓ తుమ్మల జయపాల్‌రెడ్డిని టార్గెట్ చేయగా, ఆయన రూ.10 లక్షలు సమర్పించుకున్నారు. ఈ నెల 21న మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. ...అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కొందరు అధికారులకు కంటిమీద కునుకు కరువైంది. కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పలువురు అవినీతి అక్రమాల ఆరోపణలపై ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ ఇరుక్కున్నారు. ఈక్రమంలో ప్రతీ పనికి బాధితుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న కొన్ని శాఖల అధికారులు ఏసీబీ నుంచి తప్పించుకునేందుకు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. తాయిలాలు ఇచ్చి మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అదునుగా రంగంలోకి దిగుతున్న సైబర్ నేరస్తులు ఆ అక్రమార్కులకు వలవేసి రూ.లక్షలు కొల్లగొడుతుండడం చర్చనీయాంశమవుతోంది. ఆ ఐదు శాఖలే టార్గెట్.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా జరిగిన దాడులను పరిశీలిస్తే.. రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్, నీటిపారుదల శాఖలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖలో పని చేసిన ఉన్నతాధికారులు కొందరు ఏసీబీ దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ, వాస్తవానికి రెవెన్యూ, రవాణా, పోలీస్, రిజిస్ట్రేషన్శాఖల్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని అత్యధికంగా కరప్షన్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణలకు తగ్గట్టుగానే ఏసీబీకి చిక్కడం గమనార్హం. డిప్యూటీ తహసీల్దార్ మొదలు ఆర్డీఓ వరకు.. ఎంవీఐ మొదలు డీటీసీ వరకు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులపై ఏసీబీ దాడులను ఎదుర్కోవడం అవినీతి అక్రమాలకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. దీంతో వారు ఏసీబీ అధికారులను మచ్చిక చేసుకునేందుకు మార్గాలు వెతుక్కునే క్రమంలో సైబర్ నేరస్తుల వలలో పడి రూ.లక్షలు పోగొట్టుకుంటుండడం చర్చనీయాంశమవుతోంది. అయినా మార్పులేదు.. రవాణాశాఖలో అదే తీరు రవాణాశాఖలో ఇన్‌చార్జ్‌ల పాలన ఇంకా కొనసాగుతుంది. ఓ వైపు ప్రక్షాళన జరుగుతున్నా.. మరోవైపు అవినీతి ఊడలు బారుతోంది. కొందరు ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓ కోసం పోటీపడి తెచ్చుకుంటున్నారు. మరికొన్ని చోట్ల జూనియర్లను డీటీఓలుగా తెరమీద పెట్టి తెరవెనుక సీనియర్లు చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టును సీనియర్లు ఉంటే వారికే ఇవ్వాల్సి ఉంది. ఆరోపణలు, ఏసీబీ దాడుల నేపథ్యంలో 1994 బ్యాచ్‌కు చెందిన సీనియర్లు ఉన్నా.. 2012 బ్యాచ్‌కు చెందిన వారిని ఆ పోస్టులో నియమించారు. ఇదిలా ఉంటే చాలాచోట్ల తెరవెనుక చక్రం తిప్పుతున్న సీనియర్లు లెర్నింగ్ మొదలు.. ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, లైట్, గూడ్స్ వాహనాల లైసెన్సుల జారీ, తదితరాలపై అంతకు ముందున్న రేట్లకు రెట్టింపు వసూలు చేయడం ఇటీవల వివాదాస్పదంగా మారింది. ఇదిలా ఉండగా వరంగల్ ఘటనతో ‘ఏసీబీ అధికారులు ఎవరికీ ఫోన్ చేయరని.. సైబర్ నేరస్తుల వలలో పడొద్దని.. ఏదైనా ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1064కి ఫోన్ చేయాలి’ అని తాజాగా ఏసీబీ అధికార వెబ్సైట్లో అలర్ట్ పెట్టింది.ఏసీబీ తెలంగాణ వెబ్సైట్లో అలర్ట్ నోటిఫికేషన్అవినీతి అధికారులకు కంటిమీద కునుకు కరువు తాయిలాలతో మచ్చిక చేసుకునేందుకు అడ్డదారులు ఇదే అదునుగా రంగంలోకి సైబర్ నేరగాళ్లు ఏసీబీ పేరుతో ఫోన్ బెదిరింపులు.. యూపీఐ ద్వారా వసూళ్లు ఒకేరోజు రూ.10 లక్షలు కాజేత తాజా బాధితుడు మహబూబాబాద్ ఆర్టీఓ రూ.10 లక్షలు సైబర్ నేరస్తులకు సమర్పించుకున్న తుమ్మల జయపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు అసలేం జరిగిందన్న వివరాలు ఇలా ఉన్నాయి.. జయపాల్ రెడ్డి వరంగల్‌లో ఎంవీఐగా, మహబూబాబాద్ ఇన్చార్జ్ ఆర్టీఓగా వ్యవహరిస్తున్నారు. హనుమకొండ హంటర్‌రోడ్డులో ఉంటున్న ఆయనకు ఈ నెల 15న మధ్యాహ్నం 12.30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి 98868 26656 (ఈ నంబర్ ట్రూ కాలర్‌లో ఏసీబీ అని వస్తుంది) నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాను ఏసీబీ (అవినీతి నిరోధక బ్యూరో) నుంచి డీఎస్పీగా పరిచయం చేసుకుని, అవినీతి కేసు నమోదు చేశామని జయపాల్ రెడ్డికి తెలియజేశాడు. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని బెదిరించాడు. ఆ తర్వాత కాల్ చేసిన వ్యక్తి ఫిర్యాదుదారుడికి డబ్బులు పంపాలని చెప్పి మొదట రూ.75 వేలు 77606 40948 మొబైల్ నంబర్‌కు బదిలీ చేయమని సూచించాడు. ఆ తర్వాత సైబర్ నేరగాడు చెప్పినట్లు జయపాల్ రెడ్డి రూ.75 వేలతో పాటు మరో రూ.25 వేలు పాయల్ మేఘనకు పంపాడు. అనంతరం మరో రూ.లక్ష పంకజ్ కుమార్‌కు, రూ. 2 లక్షలు దివ్య పేరిట ఉన్న మొబైల్ నంబర్ (97097 65940)కు పంపాడు. మరో రూ.5 లక్షలు బెంగళూరులోని సదాశివనగర్ బ్రాంచ్‌లో ఓ కాంట్రాక్టర్ పేరుతో ఉన్న ఖాతా నంబర్ 477825001010847701 (ఐఎఫ్ఎస్సీ కోడ్: కే ఏఆర్‌బీ0000908)కు పంపాడు. మూడు మొబైల్ నంబర్లు (98868 26656, 95919 38585, 98804 72272) ద్వారా మొత్తం రూ.10 లక్షలు జయపాల్ రెడ్డితో ట్రాన్స్ఫర్ చేయించాడు. మోసపోయానని గ్రహించడానికి ఆరు రోజులు పట్టిన జయపాల్‌రెడ్డి చేసేది లేక తెలియని వ్యక్తులపై చర్య తీసుకోవాలని మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 318(4) బీఎన్ఎస్, 66–డీ ఐటీఏ–2000–2008ల కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సైబర్ నేరస్తులు కాజేసిన రూ.10 లక్షల కథ -
కార్తీక మాసోత్సవాలు షురూ
నగరంలోని పలు ఆలయాల్లో బుధవారం కార్తీక మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల ఆలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలిమ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్తీక మాసోత్సవాలను ప్రారంభించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకుడు మణికంఠశర్మ పూజలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. కార్పొరేటర్ వెంకటేశ్వర్లు, సరళాయాదవ్, రవీందర్‌రెడ్డి, కుమార్‌యాదవ్ పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీభద్రకాళి దేవాలయంలో బుధవారం రాత్రి ఈఓ రామల సునీత దీపోత్సవాన్ని ప్రారంభించారు. – హన్మకొండ కల్చరల్ -
పోరాటయోధుడు కొమురం భీమ్
కేయూ క్యాంపస్ : ఆదివాసీల హక్కులు, ఆస్థిత్వం కోసం పోరాటం చేసిన యోధుడు కొమురం భీమ్ అని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం కేయూ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో కొమురం భీమ్ జయంతిని పురస్కరించుకొని రిజిస్ట్రార్ వి.రామచంద్రంతో కలిసి భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేయూ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్ బి.సురేష్‌లాల్, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎ.రాజు, డాక్టర్ సుకుమారి, ఎం.నవీన్, వల్లాల పృథ్వీరాజ్ వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్ : హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు నవంబర్ 14వరకు నిర్వహించనున్నారు. ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ పర్యవేక్షించారు. డాక్టర్ మంద శ్రీనివాస్, శ్రీదేవి అధ్యాపకులు ఉన్నారు. ప్రీ పీహెచ్డీ పరీక్షలు ప్రారంభం కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో వివిధ విభాగాల పరిశోధకులకు బుధవారం ప్రీ పీహెచ్డీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 187 మంది పరిశోధకులకు గాను 180 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల నిర్వహణను కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం పరిశీలించారు. ప్రొఫెసర్ కె.రాజేందర్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి.శ్రీనివాస్, మమత పాల్గొన్నారు. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ జువాలజీ విభాగం అధిపతిగా అదే విభాగం ప్రొఫెసర్ వై.వెంకయ్య నియమితులయ్యారు. బుధవారం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు ఆ విభాగం అధిపతిగా విధులు నిర్వర్తించిన ప్రొఫెసర్ జి.షమిత పదవీకాలం పూర్తికావడంతో ఆమె స్థానంలో వెంకయ్యను నియమించారు. రెండేళ్ల పాటు ఆయన విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఆయన కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాజీపేట అర్బన్ : హనుమకొండ జిల్లా (వరంగల్ అర్బన్)లోని 67 వైన్స్‌లకు గాను బుధవారం జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌కు 16 దరఖాస్తులు అందజేశారు. వైన్స్ టెండర్ల ప్రక్రియ వెలువడిన నాటి నుంచి బుధవారం వరకు 3,036 దరఖాస్తులు అందాయి. కాగా పొడిగించిన టెండర్ల గడువు నేటి (గురువారం)తో ముగియనుంది. నయీంనగర్ : హనుమకొండ బాలసముద్రం కరెంట్ ఆఫీస్ పక్కన ఉన్న కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)కు చెందిన 2ఎకరాల 27 గుంటలు (12,957 చదరపు గజాలు) ప్రైమ్ ల్యాండ్‌కు నవంబర్ 3న హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఈ స్థలం హనుమకొండ బస్ స్టేషన్‌కు అతి దగ్గరలో వాణిజ్య, షాపింగ్‌మాల్స్, హోటల్స్, ఆస్పత్రి, విద్యా సంస్థలు, ఐటీ కంపెనీ ఇతర కార్యాలయాలకు అత్యంత అనువైనదిగా ఉందని పేర్కొన్నారు. వచ్చిన నిధులను మహానగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఖర్చు పెడతామని వివరించారు. అభివృద్ధి పనులకు అడ్డుపడడం సరికాదని, తాము ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి నిధులు ఉపయోగిస్తామని వెల్లడించారు. కొనుగోలుదారులు పూర్తి వివరాలకు 98665 14550, 94403 74866, 73372 22469, 77025 52226 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
బల్దియా ఆవరణలో కోతులను విక్రయించిన కాంట్రాక్టర్
● ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం కెమెరాల్లో రికార్డు ● జీడబ్ల్యూఎంసీ అధికారుల వైఫల్యంపై విమర్శలు ● నాలుగున్నరేళ్లలో రూ.2.50 కోట్ల ఖర్చు చేసినా నగర ప్రజలకు తప్పని వానరాల బెడద ఏ కాలనీలో చూసినా వానరాలే..నగరంలో వానరాలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. పాఠశాలకు వెళ్లే పిల్లలు కోతుల భయంతో వణికిపోతున్నారు. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, పండ్లు తీసుకుని వచ్చే సమయంలో దాడి చేస్తున్నాయి. మీదపడి చేతుల్లో ఉన్న కవర్లను, సంచులను లాక్కొనిపోతున్నాయి. ఒకవేళ ఇవ్వకపోతే పెద్దపెట్టున అరుస్తూ గుంపుగా వెంబడిస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జారవిడవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో రెండో కాకుండా పదుల సంఖ్యలో ప్రత్యక్షమవుతున్నాయని పేర్కొంటున్నారు. కోతులు ఆకలి, దప్పిక సమయాల్లో ఇళ్లలోకి చొరవడి పండ్లు, కూరగాయలు తదితర సామగ్రిని ఎత్తుకపోతున్నాయి. ఇంటి పనులు చేస్తున్న మహిళలపైన దాడులు చేస్తున్నాయి. దీంతో ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నా తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఇంటి పరిసరాల్లో ఏమైనా పదార్థాలు చేతుల్లో కనిపిస్తే చాలు మీద పడి కరుస్తూ వాటిని తీసుకెళ్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ అర్బన్: వినడానికి విచిత్రం.. చూస్తే సచిత్రం, కనిపిస్తే ఆందోళనకరం.. ఇదేంటి ఇలా అంటున్నారు అనుకుంటున్నారా.. అదేనండి వరంగల్ మహానగరంలో కోతులు ఇళ్లు, రోడ్లు తేడా లేకుండా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. నివాసాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. మనిషి కనిపిస్తే చాలు ఎదురు దాడికి దిగేందుకు రంకెలేస్తున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే మరో కొత్తకోణం వెలుగు చూడడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కోతులను పట్టుకునే కాంట్రాక్టర్ తాజాగా కొన్ని కోతులను బల్దియా ఆవరణ నుంచి అమ్మకానికి పెట్టాడు. ఓ ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసి కారులో తరలించడం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం (ఐసీసీసీ) కెమెరాల్లో రికార్డు కావడం, బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోతిని పట్టుకొని తరలిస్తే రూ.550 ఒక్కో కోతిని పట్టేందుకు జీడబ్ల్యూఎంసీ చెల్లిస్తున్నది అక్షరాలా రూ.550. ఒకవేళ పట్టిన వాటిని ఏటూరునాగారం అడవుల్లో వదిలేయడంతో పెద్ద అవినీతి జరుగుతోంది. చెల్లిస్తున్న పన్నుల నుంచి రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు కోతులను పట్టుకునేందుకు బల్దియా బడ్జెట్ కేటాయిస్తోంది. ఈ సొమ్ముతో ఎన్ని కోతులను పట్టుకొని, ఎక్కడ వదిలేస్తున్నారనే వివరాలను రికార్డుల్లో కాకిలెక్కలుగా మారాయి. ఫిర్యాదు వస్తే ఆయా కాలనీల్లో నాలుగైదు పెద్ద బోన్లు, ఐదు బాక్స్ బోన్లు పెడతారు. బోనులో కోతులు పడేందుకు అరటిపండ్లు, పల్లీలు ఎరగా వేస్తారు. వరుసగా రెండు రోజులపాటు వీటిని తినేందుకు కోతులు వస్తాయి. మూడోరోజు బోనులో కోతులు చిక్కుతాయి. ఇందుకోసం బల్దియా ప్రత్యేకంగా వాహనాన్ని సమకూరుస్తుంది. ఇదే తరహాలో కోతులను పట్టుకుంటారు. కానీ, నగరంలో కోతుల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పట్టుకున్న కోతులను జీపీఎస్ కలిగి ఉన్న వాహనంలో తరలిస్తూ ఏటునాగారం అడవుల్లో వదిలేయాలి. అటవీ శాఖ అధికారి సంతకం తీసుకుంటున్నామని నమ్మలేని నిజాలు సృష్టిస్తుండడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగున్నర ఏళ్ల కాలంలో సుమారు రూ.2.50 కోట్ల మేరకు నిధులు వెచ్చించినా నగరంలో కోతలు బెడద ఎక్కువగా ఉన్నట్లు జీడబ్ల్యూఎంసీ అధికారులే చెబుతుండడం విశేషం. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణ నుంచి కోతులను తరలిస్తున్న కారు నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్ తాజాగా ఐదు కోతులను అమ్మిన మాట వాస్తవమే. సీసీ ఫుటేజీలను పరిశీలించి సదరు వ్యక్తులను విచారించాం. అవి కోతులు కావని, కొండముచ్చులను పట్టుకొని అమ్మినట్లు అంగీకరించారు. విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం. – రాజారెడ్డి, సీఎంహెచ్ఓ -
‘పది’కి ప్రణాళిక
వందశాతం ఉత్తీర్ణతకు విద్యాశాఖ కార్యాచరణవిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో పదో తరగతి విద్యార్థులపై ఇప్పటి నుంచే జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 2024–2025లో పదో తరగతిలో విద్యార్థులు 96.13 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈవిద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఈనెల 8వ తేదీ నుంచే సాయంత్రం 4–15 గంటల తర్వాత మరో గంటపాటు విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకో సబ్జెక్టు టీచర్ విద్యార్థులకు ప్రత్యేకంగా బోధన చేస్తున్నారు. జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో కలిపి సుమారు 11,500 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. జనవరి 9 వరకు సిలబస్ పూర్తిచేయాలి.. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఏడాది జనవరి 9 వరకు పదో తరగతి విద్యార్థులకు సిలబస్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. విద్యార్థుల హాజరు కూడా ప్రతి పాఠశాలలోను వంద శాతం నమోదయ్యేలా చూడాలని జిల్లా విద్యాశాఖాధికారి డి.డివాసంతి హెచ్ఎంలను ఆదేశించారు. అవసరమైతే టీచర్లు తల్లిదండ్రులతో, హాస్టళ్లలో ఉండే విద్యార్థుల కోసం హాస్టళ్ల వార్డెన్లతోను మాట్లాడి విద్యార్థులు సక్రమంగా పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. జనవరిలో ఉదయం, సాయంత్రం కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేక తరగతులపై సమీక్ష.. సమగ్రశిక్ష రూపొందించిన గణితం, ఫిజిక్స్, బయాలజికల్ సైన్స్, సోషల్‌కు సంబంధించిన అభ్యాసక దీపికలను కూడా ఇప్పటికే అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అందజేశారు. పాఠ్యాంశాలకు సంబంధించిన వివిధ అంశాలు సులభరీతిన చదువుకొని ప్రశ్నలకు సమాధానాలు రాసేవిధంగా ఈ అభ్యాసక దీపికల్లో ముఖ్యమైన అంశాలతో పొందుపరిచారు. వాటిని విద్యార్థులు చదువుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. వాటిలో కూడా ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేస్తున్నారు. గణితంలో గ్రాఫ్‌లు, రేఖాగణిత నిర్మాణాలు, సైన్స్‌లో రేఖాచిత్రాలు, ప్రయోగాలు, సాంఘిక శాస్త్రంలోని మ్యాప్పాయింటింగ్ లాంటివాటిపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు స్వతంత్రంగా పాఠాలు చదవడానికి, ప్రశ్నలకు సమాధానం రాసేందుకు టీచర్లు ప్రొత్సహిస్తున్నారు. ప్రతి పాఠశాలలో వారానికోసారి ప్రత్యేక తరగతులపై సమీక్ష చేస్తారు. విద్యార్థుల అభ్యసనాల స్థాయిని కూడా రికార్డు చేయాల్సి ఉంటుంది. వారాంతపు పరీక్షలు కూడా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. టీచర్లు కీపేపర్ తయారు చేయాలి.. జిల్లాలో ఈనెల 24 నుంచి ఎస్ఏ–1 పరీక్షలు పరీక్షలు నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కరబరచాల్సి ఉంటుంది. పరీక్ష తదుపరి ప్రతి సబ్జెక్టు టీచర్ ఆ ప్రశ్నపత్రం ఆధారంగా నమూనా జవాబుపత్రంను కీ(పేపర్) తయారుచేసి విద్యార్థులకు చూపించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారు. అభ్యాసక దీపికలను సాధన చేయించాలి అభ్యాసక దీపికలను ప్రతిరోజు సాధన చేయించాలి. విద్యాప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలి. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. టీచర్లు విద్యార్థులను దత్తత తీసుకోవాలి. ఉదయం వేళ అధ్యయన అలవాటును ప్రోత్సహించేందుకు వేకప్ కాల్ టీచర్లు చేయాలి. టెన్త్‌లో జిల్లా వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆయా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అవసరమైనప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులతోనూ సమావేశాలు నిర్వహించి సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థుల పురోగతిని వివరించాల్సి ఉంటుంది. – వాసంతి, హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి హసన్‌పర్తిలో విద్యార్థుల దత్తత హసన్‌పర్తి మండలంలోని అన్ని ప్రభుత్వ, ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వివిధ సబ్జెక్టులు బోధిస్తున్న టీచర్లు విద్యార్థులను దత్తత తీసుకొని వేకప్ కాల్స్ కూడా చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించేందుకు సమావేశం కూడా నిర్వహించనున్నాం. ప్రతీ హైస్కూ ల్లో విద్యార్థులను వివిధ గ్రూపులుగా విభజించి, వారికి సబ్జెక్టుల వారీగా టీచర్లు ప్రత్యేక శ్రద్ధతో బోధన చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే కృషి చేస్తున్నాం. – ఎ.శ్రీనివాస్, హసన్‌పర్తి ఎంఈఓ సాయంత్రం వేళ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పాఠశాలల్లో అభ్యాసక దీపికల పంపిణీ హనుమకొండ జిల్లాలో పరీక్షలకు హాజరుకానున్న 11,500 మంది విద్యార్థులు -
అమరుల త్యాగాలు మరువలేనివి
టీజీఎస్పీ నాలుగో బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి మామునూరు: అమరవీరుల త్యాగాలు మరువలేనివని కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుంచే సామాజిక విలువలు, హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బుధవారం మామునూరు టీఎస్పీ నాలుగో బెటాలియన్ ఆవరణలో టీఎస్ఎప్పీ పరిపాలన విభాగం అధికారుల ఆధ్వర్యంలో ఓపెన్‌హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి హాజరై ఓపెన్‌హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని చెప్పారు. అనంతరం పలు రకాల ఆయుధాలను ప్రదర్శించారు. విద్యార్థులకు అధునాతన ఆయుధాలు, వాటి పనితీరు, చట్టాలు, కేసులు, రికార్డులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జాగృతి కళాబృందంతో చైతన్యం రావాలి
సీపీ సన్‌ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం : సాంస్కృతిక కార్యక్రమాలతో పోలీస్ జాగృతి కళాబృందం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. పోలీస్ జాగృతి కళాబృందం సభ్యులతో సీపీ తన కార్యాలయంలో ముచ్చటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఏఏ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారనే విషయాలను కళాబృందం ఇన్చార్జ్ ఏఎస్సై నాగమణిని సీపీ అడిగి తెలుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ, మూఢనమ్మకాలు, షీ టీం, డయల్–100, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించే రీతిలో గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో కథాంశాలతో ప్రదర్శనలు ఇవ్వాలన్నారు. అదే విధంగా కేవలం కథాంశాలే కాకుండా మూడేళ్లుగా సంబంధించి పూర్తి వివరాలను ప్రజలకు వివరించడంతో పాటు జరిగిన నష్టాలపై ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. కళాబృందం కార్యాచరణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా ఏసీపీ ఎస్.బీ 2జాన్ నర్సింహులుకు సీపీ సూచించారు. సీపీతో ముచ్చటించిన వారిలో హెడ్ కానిస్టేబుళ్లు విలియమ్, రత్నయ్య, వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ పూల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
‘సాస్కి’పై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
సమీక్షలో మేయర్, కమిషనర్వరంగల్ అర్బన్ : స్కీమ్స్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కి) పథకం అమలుకు నవంబర్ 30లోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సాస్కి ప్రతిపాదనలపై ఇంజనీర్లతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. సాస్కి పథకంపై అధికారులు వ్యూహాత్మక ప్రణాళికతో స్థలాలను గుర్తించి, తగిన డాక్యుమెంటేషన్‌తో అన్ని అంశాలను క్రోడీకరించి ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. నైబర్ హుడ్ ప్రణాళిక అంశంలో పాదచారులు నడిచే మార్గాలను అభివృద్ధి చేయడం, మౌలిక వసతులు కల్పించడం, ప్రజలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. స్పాంజ్ సిటీ కాన్సెప్ట్‌లో భాగంగా నగరంలో స్పాంజ్ పార్క్ ఏర్పాటు చేయడం, అందుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని తెలిపారు. సిటీ గ్రీన్‌లో భాగంగా 50 ఎకరాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం తో పాటు పురాతన బావులను పునరుద్ధరించే అంశాలను పొందుపరచాలని మేయర్ అధికారులకు సూచించారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, ఈఈలు రవికుమార్, మాధవీలత, డీఈ శివానంద్, ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
వరంగల్ క్రైం: శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాదినుంచి ఇప్పటివరకు దేశంలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 191మంది పోలీస్ అమరవీరుల పేర్లను అదనపు డీసీపీ రవి చదివి వినిపించారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్‌తోపాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ సచిన్ అన్నారావు, కల్నల్ రవి, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు డీసీపీలు సురేష్ కుమార్, ప్రభాకర్‌రావు, శ్రీనివాస్, బాలస్వామి, రెడ్‌క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ శ్రీనివాస్‌రావుతోపాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆర్ఐ స్పర్జన్ సారథ్యంలో సాయుధ పోలీసులు శోక్ శ్రస్త్ చేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. పోలీసులు చిత్తశుద్ధితో పనిచేయాలి పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహనుభావులని కొనియాడారు. పోలీసు అమరవీరుల చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాలన్నారు. అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వారికి ఎలాంటి సమస్య ఉన్నా పోలీస్ విభాగం తరఫున పూర్తి సహకారం ఉంటుందని సీపీ భరోసా ఇచ్చారు. చివరగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి మిషన్ హస్పటల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కమిషనరేట్‌లో ఘనంగా ప్లాగ్ డే -
శంకర్ దాదాలు @ ఇందిరమ్మ కాలనీ
హన్మకొండ అర్బన్ : హనుమకొండ 49వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొద్దిరోజులుగా శంకర్‌దాదాలు రాజ్యమేలుతున్నారు. వివిధ ప్రాంతాలనుంచి ఇక్కడికి వచ్చి ఇల్లు నిర్మించుకున్న వా రు ఒక ముఠాగా ఏర్పడి ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒకరి ప్లాట్ ఇంకొకరికి విక్రయించడం, అసలు యజమానిని బెదిరించి మరొక ప్లాట్ ఇవ్వడం వంటివి ఇక్కడ సర్వసాధారణం అయ్యాయని తెలుస్తోంది. ఎవరైనా ఎదురు తిరిగితే భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వరుస ఘటనలతో కాలనీవాసులు బెంబేలెత్తిపోతున్నారు. మేం చెప్పిన చోటే ఇల్లు నిర్మించుకోవాలి.. కాలనీలో బరితెగించిన ఓ ముఠా ఖాళీ ప్లాట్లపై కన్నెస్తోంది. ఆ ప్లాట్‌ను ఎవరికో ఒకరికి అంటగడుతూ..అసలు ఓనర్ వచ్చి అది తనదంటే బెదిరించి వెళ్లగొడుతున్నారు. గట్టిగా తిరగబడితే ఇంతకాలం ఇక్కడ లేవు.. కాబట్టి ఆ ప్లాట్ వేరే వాళ్లకు ఇచ్చేశాం.. మీకు ఇంకోచోట చూపిస్తాం అంటూ వేరే చోట ప్లాట్‌ను వీరికి అంటగడుతున్నారు. అక్కడే ఇల్లు నిర్మించుకోవాలని చెబుతున్నారు. అందుకుగాను అటు ప్లాటు ఓనర్నుంచి ఇటు కొత్తగా కొనుగోలు చేసినవారి నుంచి రూ.లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు. ఇలా ఇద్దరి వద్ద వసూలు చేస్తున్న నగదుతో జల్సాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై పలుమార్లు రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శృతిమించిన రౌడీయిజం కాలనీలో కొందరు తమకు రాజకీయ నేతలు, పోలీసుల అండదండలు ఉన్నాయని చెప్పుకుంటూ చలామణి అవుతుండటం వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఓ డీసీసీ మాజీ అధ్యక్షుడి అనుచరుడిని అంటూ కాలనీలో ఓ వ్యక్తి హంగామా చేస్తున్నాడు. కొందరిని ఏకంగా చంపుతానంటూ బహిరంగంగా బెదిరించడం, దేవుడి వద్ద ప్రమాణాలు చేయడం కాలనీలో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. ఇటీవల సదరు వ్యక్తి కాలనీలోని కొందరు తన బండికి అడ్డుగా నిలబడ్డారని ఆగ్రహంతో మైనర్లను విచక్షణ రహితంగా చితకబాదిన ఘటన సీసీ ఫుటేజీలతో సహా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. పోలీసులు మాత్రం కొందరికి వత్తాసుగా మాట్లాడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు పోలీస్ స్టేషన్‌కి వెళ్తే ఉదయం రమ్మని చెప్పిన పోలీసులు వారి మీదనే గొలుసు దొంగతనం కేసు పెడతామంటూ బెదిరించినట్లు ఆరోపిస్తున్నారు. ఆ గొలుసు రాత్రిపూట తమకు దొరికిందని ఇస్తామంటే ఉదయం పట్టుకు రమ్మని చెప్పారని, తీరా ఉదయం మాత్రం దొంగతనం చేశారని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్లాట్ల కబ్జాలపై పోలీస్, రెవెన్యూ అధికారులు సీరియస్‌గా దృష్టి సారించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ప్లాట్ల కబ్జా..అడిగితే దౌర్జన్యం.. భౌతిక దాడులు రాజకీయ నేతల పేర్లతో చలామణి పోలీసుల అండ ఉందని ధీమా -
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఈ నెల 12న : హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కార్పొరేటర్ ఇంట్లో కొనసాగుతున్న పేకాట శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. కార్పొరేటర్ భర్త గుజ్జుల మహేందర్‌రెడ్డితో పాటు 11మంది పట్టుబడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉండడం గమనార్హం. రూ.60,610 నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 20న : వరంగల్ సబ్ డివిజన్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ 13మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకుడు దోనెపూడి రమేష్‌బాబు, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ తదితరులు ఉన్నారు. వీరినుంచి రూ.3.68లక్షల నగదు, 11సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 19న : హనుమకొండ సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధి శ్రీనివాస్ కాలనీలో నందికొండ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతూ 11 మంది పట్టుబడ్డారు. ఇందులో ప్రముఖ వ్యాపారులతోపాటు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరుడు భీరం సుధాకర్‌రెడ్డి పట్టుబడ్డారు. 30 ఏళ్ల యువతి కూడా ఉంది. వీరినుంచి రూ.1,27,650 నగదు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్మెంట్లు, ప్రముఖుల ఇళ్లు, పండ్ల తోటలే అడ్డాలు ‘టాస్క్‌ఫోర్స్’కు పట్టుబడుతున్న రాజకీయ ప్రముఖులు మహిళలు సైతం పట్టుబడుతున్న వైనం దృష్టి సారించని స్థానిక పోలీసులు -
నేటినుంచి కార్తీక మాసోత్సవం..
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో నేటినుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేడు (బుధవారం) నుంచి నవంబర్ 20వ తేదీవరకు దేవాలయంలో కార్తీక మాసోత్సవం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఈఓ ధరణికోట అనిల్‌కుమార్, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. మంగళవారం దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హనుమకొండ పీఎస్ సీఐ మచ్చ శివకుమార్, ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షుడు గట్టు మహేష్‌బాబుతో కలిసి అనిల్‌కుమార్, ఉపేంద్రశర్మ ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ శివకుమార్ మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపాలు వెలిగించుకునే మహిళా భక్తుల కోసం మహిళా కానిస్టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏమైనా ఇబ్బంది ఏర్పడితే డయల్–100కు కాల్ చేస్తే తక్షణమే స్పందిస్తామన్నారు. గట్టు మహేష్‌బాబు మాట్లాడుతూ.. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా వస్తుంటారని అన్నారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ దీపాలు వెలిగించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ప్రతిరోజూ ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సాయంత్రం ప్రదోషకాల పూజలు, చతుర్వేదసేవ జరుగుతాయన్నారు. కార్యక్రమంలో కాకతీయకాలనీ గురుద్వార్ ఆధ్యక్షుడు హరిసింగ్, విజయరాణి, వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, దేవాదాయశాఖ సిబ్బంది మధుకర్, రామకృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమాల వివరాలు.. అక్టోబర్ 22న (బుధవారం) కార్తీక శుద్ధపాడ్యమి ఉత్సవాలు ప్రారంభం. 25న శనివారం నాగులచవితి పూజలు. 27న సోమవారం కార్తీక ప్రథమ సోమవారం పూజలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు. నవంబర్ 3న కార్తీకమాస రెండో సోమవారం సామూహిక రుద్రాభిషేకాలు. 5న బుధవారం కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సామూహిక రుద్రాభిషేకాలు, సాయంత్రం 6గంటల నుంచి లక్ష దీపోత్సవం. 10న కార్తీకమాస మూడో సోమవారం, 17న కార్తీకమాస నాలుగో సోమవారాల్లో ఉదయం 6గంటల నుంచి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సామూహిక రుద్రాభిషేకాలు. 18న మంగళవారం మాసశివరాత్రి మకరలగ్నంలో ఉదయం 10:35 గంటలకు శ్రీ శివకల్యాణోత్సవం, రూ.1,116 చెల్లించాచి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చన్నారు. వేయిస్తంభాల దేవాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి -
ఆర్టిజన్ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ విద్యు త్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ చంద్రారెడ్డి, కోకన్వీనర్ చందర్ సింగ్ ఠాకూర్, ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ ధరావత్ సికిందర్ కోరారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డికి డిమాండ్ల నోటీసు అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 23, 667 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడం లేదన్నారు. ఎని మిది సంవత్సరాలుగా ఆర్టిజన్లకు ప్రయోజనాలు ఇవ్వకుండా యాజమాన్యాలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆర్టిజన్, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను రెగ్యులర్ పోస్టుల్లోకి కన్వర్షన్ చేస్తామని హామీ ఇచ్చిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాంత్, జి.అనంత రెడ్డి, మహేందర్ గౌడ్, బి.శ్రీనివాస్, కలకోట అశోక్, చింతలపూడి సతీశ్ కుమార్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ వినతి -
ఉత్సాహంగా ‘దీపావళి’ బతుకమ్మ
హసన్‌పర్తి : మండలంలోని సీతంపేట గ్రామంలో దీపావళి బతుకమ్మ వేడుకలు మంగళవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. గ్రామానికి చెందిన నేతకాని కులస్తులు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మూడ్రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకలను తిలకించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతకాని కులస్తులు ఇక్కడి వస్తారు. ఉత్సవాలను పురస్కరించుకని తొలిరోజు చెరువు వద్దకు వెళ్లి రేగడి మట్టిని సేకరించారు. ఆ మట్టిని ఇంటికి తీసుకొచ్చి జోడెద్దుల రూపం(దేవతామూర్తుల ప్రతిమలు) తయారు చేశారు. గారెలతో వాటిని అందంగా అలంకరించారు. బుధవారం పురుషులు కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. జోడెద్దుల ప్రతిమలతో భారీ ప్రదర్శనగా వెళ్లి వాటిని స్థానిక చెరువులో నిమజ్జనం చేయడం ఇక్కడి నేతకాని కులస్తుల సంప్రదాయం. రేపు బతుకమ్మ వేడుకలు గురువారం దీపావళి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మహిళలు బతుకమ్మలతో భారీ ప్రదర్శగా వెళ్తారు. పురుషులు కూడా బతుకమ్మలను ఎత్తుకుని మహిళలను అనుసరిస్తారు. ఉత్సవాలను పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేసినట్లు ఎంపీఓ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. నేడు కేదారేశ్వర వ్రతం రేపు బతుకమ్మ నిమజ్జనం -
ప్రజాచైతన్యానికి ‘వల్లంపట్ల’ కృషి
విద్యారణ్యపురి: వల్లంపట్ల నాగేశ్వర్రావు తన జీవి త కాలమంతా కవిగా, కళాకారుడిగా, సామాజిక స్పృహ.. హేతువాద దృక్పథంతో ప్రజాచైతన్యం కోసం విశేషంగా కృషిచేస్తున్నారని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ కొని యాడారు. సోమవారం హనుమకొండలోని టీచర్స్‌కాలనీ ఫేజ్–1లో వల్లంపట్ల నాగేశ్వర్రావు 70 వ సంతాల జన్మదిన వేడుకల చైతన్య కార్యక్రమంలో భాగంగా ‘వల్లంపట్ల సప్తతి నవ సమాజ జాగృతి’ అనే శీర్షికన సంవత్సరం పాటు జరుగనున్న చైతన్య కార్యక్రమాల పోస్టర్లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. సమాజంలోని మూఢనమ్మకాల నిర్మూలనకు వల్లంపట్ల రూపొందించిన సాహిత్యం కళారూపాలు ప్రాచుర్యం పొందాయన్నారు. కేయూ తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యుడు బన్నఅయిలయ్య మాట్లాడుతూ అర్ధశతాబ్ద కాలంగా వల్లంపట్ల సృజించిన సాహిత్యం పేరెన్నికగన్నది అన్నారు. నవతరం నిర్మాణం కోసం తనవంతు కృషిని అలాగే కొనసాగిస్తానని వల్లంపట్ల నాగేశ్వర్రావు తెలిపారు. ప్రగతి మిత్ర అధ్యక్షుడు రాంరెడ్డి, టీచర్స్ కాలనీ కమిటీ బాధ్యులు డోలిరాజలింగం, సత్యనారాయణ, ఇమ్మడి పుల్లయ్య, రతన్‌సింగ్, హరినాథరావు, కవులు, రచయితలు కృష్ణమాచారి, పురుషోత్తం, మహేందర్, శంకర్రావు, వల్స పైడి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ -
టీజీ ఎన్పీడీసీఎల్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ
హన్మకొండ: తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ టీజీ ఎన్పీడీసీఎల్ కన్వీనర్లుగా శ్రీకాంత్, డి.రవీందర్‌రెడ్డిని ఎన్నుకున్నట్లు చైర్మన్ ధరావత్ సికిందర్ మంగళవారం తెలిపారు. కోకన్వీనర్‌గా జి.అనంతరెడ్డి, కో చైర్మన్‌గా టి.తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్‌గా మహేందర్ గౌడ్, కోశాధికారి అటికేటి రవీందర్, చింతలపూడి సతీశ్‌కుమార్ ఎన్నికయ్యారని వివరించారు. కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు కాజీపేట రూరల్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి–దానాపూర్ మధ్య ఆరు వారాంతపు ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. అక్టోబర్ 23, 28వ తేదీల్లో చర్లపల్లి–దానాపూర్ (07091) వీక్లీ ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 24, 29వ తే దీల్లో దానాపూర్–చర్లపల్లి (07092) వీక్లీ ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 26వ తేదీన చర్లపల్లి–దానా పూర్ (07049) వీక్లీ ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 27వ తేదీన దానాపూర్–చర్లపల్లి (07050) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తాయి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, త్రిటైర్ ఏసీ, స్లీపర్‌క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు చర్లపల్లి–దానాపూర్ మధ్య కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్కాగజ్నగర్, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్పూర్, కాట్ని, మహియర్, సంత, ప్రయాగ్‌రాజ్ చోకి, పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, బాక్సర్, ఆరా స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ నిర్మాణానికి బుధవారం ఉదయం 11గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. రూసా నిధులు రూ. 3కోట్ల 50లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించబోతున్నారు. ఈ నిర్మాణం పూర్తయిన అనంతరం సైన్స్ ప్రాజెక్టులకు సంబంధించిన పరిశోధనలకు అవసరమైన ఈక్విప్‌మెంట్లను (పరికరాలను) ఏర్పాటు చేస్తారు. కాగా, కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్, రూసా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవసేన (ఐఏఎస్), కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, రూసా ప్రాజెక్టు ఆఫీసర్ సౌందర్యజోసెఫ్.. భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆర్చరీ పోటీలకు కేయూ జట్లు కేయూ క్యాంపస్ : పంజాబ్‌లోని భటిండాగురు కాశీ యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 31వ తేదీవరకు నిర్వహించనున్న ఆలిండియా ఇంటర్ యూని వర్సిటీ ఆర్చరీ పోటీలకు పురుష, మహిళల జట్లను ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య మంగళవారం తెలిపారు. ఇండియన్ రౌండ్ (పురుషులు) టి.సునీల్‌కుమార్ (ప్రభుత్వ డి గ్రీ కళాశాల, నిర్మల్), రికర్వ్ రౌండ్ బి.గంగరాజు (కేడీసీ, హనుమకొండ), త్రిశూల్ (సమత డిగ్రీ కళా శాల, తొర్రూరు), ఇ.ఆనంద్, కె.అశ్వత్దొ ర (ప్రభు త్వ డిగ్రీ కళాశాల, భద్రాచలం), రికర్వ్ రౌండ్ (మహిళలు) తన్వీన్ కౌసర్ (సీకేఎం కాలేజీ, వరంగల్), మన్సురహాహాసిబా (పద్మావతి కళాశాల, వరంగ ల్) ఎంపికయ్యారు. ఈ బృందానికి కోచ్ కమ్ మేనేజర్‌గా న్యూసైన్స్ డిగ్రీ కళాశాల వ్యా యామ అధ్యాపకుడు రాజేశ్ వ్యవహరిస్తారు. హన్మకొండ: వరంగల్ మహానగరపాలక సంస్థ 57వ డివిజన్ హనుమకొండ గాంధీనగర్ వాసులపై దీపావళి రోజు సోమవారం రాత్రి వీ ధికుక్కల గుంపు దాడి చేసింది. మొత్తంగా ఏ డుగురికి గాయాలయ్యాయి. వారు ఎంజీఎంలో చికిత్స పొందారు. కుక్కలు కరిచిన విషయాన్ని గాంధీనగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షు డు వెంకట రాజిరెడ్డి, కార్పొరేటర్ స్వరూపరా ణిలు.. మున్సిపల్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ రాజా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా మంగళవారం బల్దియా సిబ్బంది కుక్కలను ప ట్టుకెళ్లారు. కొన్ని వలకు చిక్కకుండా తప్పించుకున్నాయని కాలనీ వా సులు తెలిపారు. మంగళవారం బాధితులను గాంధీనగర్ అభివృద్ధి కమి టీ సభ్యులు పరామర్శించారు. -
పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయం
మామునూరు: శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేసి అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని టీజీఎస్పీ నాలుగో బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి, పోలీసు శిక్షణ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కె. రమేశ్ పేర్కొన్నారు. మంగళవారం ఖిలా వరంగల్ మండలం మామునూరులోని టీజీఎస్పీ నాలుగో బెటాలియన్, పోలీసు శిక్షణ కళాశాలలో వేర్వేరుగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్తూపాల వద్ద సిబ్బందితో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ రక్షణలో అసువులు బాసిన పోలీసుల సేవలు మరువలేనివన్నారు. విధినిర్వహణలో ప్రజలను రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన అమరుల త్యాగాలను నేటి పోలీసులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తీవ్రవాదుల దుశ్చర్యలతో దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది అమరులయ్యారని, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, విజయ్, భిక్షపతి, సోమాని, ఏఓ కల్పనారెడ్డి, ఆర్ఐ చంద్రశేఖర్, మహేశ్, నవీన్, డాక్టర్ సుధీర్, పీఆర్ఓ రామాచారి, టీజీఎస్పీఏసీ కృష్ణప్రసాద్, శ్రీనివాస్‌రావు, ఆర్ఐలు విజయ్, కార్తీక్, రవి, వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. టీజీఎస్పీ నాలుగో బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి , పీటీసీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రమేశ్ -
పనుల్లో నిర్లక్ష్యం తగదు
● కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ వరంగల్ అర్బన్ : కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరణ పనుల్లో నిర్లక్ష్యం తగదని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఇంజనీర్లను హెచ్చరించారు. మంగళవారం మ్యూజికల్ గార్డెన్లో కొనసాగుతున్న పనులను కమిషనర్ పరిశీలించారు. గ్రీనరీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పనులు దాదాపు పూర్తి కాగా మిగిలిన ప్యాచ్ వర్క్ పనులపై దృష్టి సారించి, త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ‘కుడా’ హార్టికల్టర్ అధికారి ఆసిఫ్, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జ్యోతిబా పూలే విగ్రహం ధ్వంసం
ఖిలా వరంగల్ : వరంగల్ ఉర్సు కరీమాబాద్ దర్గా ప్రాంతం ఆటోస్టాండ్ వద్ద సోమవారం అర్ధరాత్రి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ధ్వంసమైంది. మద్యం మత్తులో సంచరిస్తున్న ఓ యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం పూలే విగ్రహం ధ్వంసమైన విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ మరుపల్లి రవి, స్థానికులు మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ రమేశ్‌కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సిబ్బందితో కలిసి వారు ఘటనాస్థలికి చేరుకుని ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. మొదట గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి, తర్వాత సమీపంలోని రోడ్డుపై ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. మద్యం మత్తులో ఉన్న యువకుడు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసి వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఉర్సు కరీమాబాద్ వెంకటేశ్వర స్కూల్ లేన్‌కు చెందిన రాహుల్‌ను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, మద్యం మత్తులోనే విగ్రహాన్ని ధ్వంసం చేశాడని పోలీసుల విచారణలో తేలింది. విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు. నల్ల కండువాలతో నిరసన ధ్వంసమైన జ్యోతిబా పూలే విగ్రహాన్ని పలు సంఘాలు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు పరిశీలించి ఘటనను తీవ్రంగా ఖండించారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పూలే విగ్రహ కమిటీ ప్రతినిధులు, స్థానిక కార్పొరేటర్ నల్లకండువాలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, డాక్టర్ వన్నాల వెంకటరమణ, బీసీ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, పూలే, అంబేడ్కర్ వాదులు ధ్వంసమైన విగ్రహాన్ని సందర్శించారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ బోనగాని యాదగిరి గౌడ్, వర్కింగ్ చైర్మన్ దొడ్డపల్లి రఘుపతి, సభ్యులు కురుమిళ్ల శ్రీనివాస్‌గౌడ్, చాగంటి రమేశ్, సమ్మయ్య, పూజారి విజయ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పూలే, సావిత్రిబాయి విగ్రహాల ఏర్పాటుకు కృషి ధ్వంసమైన చోటే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు. మంగళవారం ఘటనా స్థలిని సందర్శించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మద్యం మత్తులో యువకుడి ఘాతుకం ఘటనాస్థలిని సందర్శించిన పలు సంఘాల ప్రతినిధులు -
రూ.3.25 కోట్లు!
● వరంగల్ జిల్లాలో రేషన్ డీలర్లకు ప్రభుత్వాలు చెల్లించాల్సిన కమీషన్ ● త్వరగా ఖాతాల్లో జమచేసి ఆదుకోవాలని డీలర్ల విజ్ఞప్తిసాక్షి, వరంగల్/నెక్కొండ: రేషన్ బియ్యం పంపిణీ చేసి పేదల ఆకలి తీర్చుతున్న రేషన్ డీలర్లు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్ రాకపోవడంతో షాపుల నిర్వహహణకు వారు తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారు. ప్రస్తుతం డీలర్లకు కేంద్రం నుంచి ఈ నెల అక్టోబర్‌తో కలుపుకుంటే ఆరు నెలల కమీషన్ పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్, అక్టోబర్ కమీషన్ రావాల్సి ఉంది. జూన్‌లో ఒకేసారి జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల బకాయిలకు తోడుగా మరో నాలుగు నెలల బకాయిలు చేరాయి. ఇలా మొత్తం కేంద్రం నుంచి ఏడు నెలల బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల ఏప్రిల్‌కు సంబంధించి కేంద్రం నుంచి కమీషన్ రేషన్ డీలర్ల ఖాతాలో పడింది. 509 రేషన్ దుకాణాలు.. 2,82,674 మంది లబ్ధిదారులు జిల్లాలో 509 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 2,82,674 మంది రేషన్‌కార్డుదారులు ఉన్నారు. ప్రతి నెలా నర్సంపేట, ఏనుమాముల, వర్ధన్నపేట ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం ఆయా షాపులకు లారీల ద్వారా వెళ్తున్నాయి. ఇలా నెలకు 5,382.518 మెట్రిక్ టన్నులు రేషన్ కార్డుదారులకు అందిస్తున్నారు. సుమారుగా ఒక్కో దుకాణంలో 100 నుంచి 120 క్వింటాళ్ల బియ్యాన్ని డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. కిలోకు కేంద్రం నుంచి 90 పైసలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50 పైసల కమీషన్ డీలర్లకు వస్తుంది. ఈ లెక్కన ఒక దుకాణానికి 100 క్వింటాళ్లు అనుకుంటే రూ.తొమ్మిది వేలు.. ఆరు నెలలకు సంబంధించి కేంద్రం నుంచి రూ.54,000 వరకు ఒక్కో డీలర్‌కు రావాల్సి ఉంది. అంటే ఆరు నెలలకు సుమారు రూ.2,74,86,000 కమిషన్ రూపంలో డీలర్ల ఖాతాలో జమ కావాల్సి ఉంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి రూ.50,90,000 డీలర్లకు బకాయి ఉంది. రూ.3,25,76,000 మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జూన్ నెలలో ఒకేసారి మూడు నెలల బియ్యం సరఫరా చేయాల్సి రావడంతో హమాలీ, లేబర్, ఇతర ఖర్చులు మూడింతలయ్యాయి. ఈ మొత్తం ఖర్చు బయట నుంచి అప్పోసప్పో చేసి సొంతంగా పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు సర్దుబాటు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమ బకాయిలు తొందరగా విడుదల చేయాలని డీలర్లు కోరుతున్నారు. -
విజయానికి చిహ్నమే దీపావళి
చెడుపై మంచి సాధించిన విజయంతో ప్రజలు దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. నరకాసుర ప్రతిమను దహనం చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుడిని సంహరించిన రోజున ప్రజలందరు ఇంటింటా దీపాలు వెలిగించారని గుర్తుచేశారు. శ్రీరంగనాఽథుడి సన్నిధిలో రంగలీల మైదానంలో 100 ఏళ్లుగా దసరా ఉత్సవాలు, 20 ఏళ్లుగా నరకాసుర వధ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఉత్సవ కమిటీతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని తెలిపారు. అనంతరం నగర ప్రజలకు ఆమె దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు పల్లం పద్మ, పోశాల పద్మ, పలు శాఖల అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
వేయిస్తంభాల ఆలయంలో మాసశివరాత్రి పూజలు
హన్మకొండ కల్చరల్ : శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో ఆదివారం మాసశివ రాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠ అవధాని, అర్చకులు ప్రణవ్, సందీప్‌శర్మ ఉదయం ప్రభాతసేవ, ఉత్తిష్టగణపతికి ఆరాధన గరికపూజ, శ్రీరుద్రేశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. అనంతరం నాట్యమండపంలో శ్రీ రుద్రేశ్వరిదేవి, శ్రీ రుద్రేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించి కళశ స్థాపన, బాసికధారణ, యజ్ఞోపవితధారణ, పాదప్రక్షాళణ, జీలకర బెల్లం, మాంగళ్యధారణ, అక్షతారోహణ, మహాహారతి జరిపి శ్రీరుద్రేశ్వరిదేవి, శ్రీరుద్రేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహించారు. సెలవు దినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. సిబ్బంది మధుకర్, రామకృష్ణ పాల్గొన్నారు. హన్మకొండ : అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నక్కలగుట్టలోని మారుతి టవర్స్‌లో అసోసియేషన్స్ సర్వసభ్య సమావేశం నిర్వహించి, నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రెంటాల కేశవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నడుముల విజయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా తిరవరంగం ప్రభాకర్, కోశాధికారిగా రాజ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్.కృపాకర్ రావు, డీ.వీ.ప్రసాద్, మర్రి రెడ్డి, జి.శ్రీనివాస్, వి.నరేందర్ రెడ్డి, బి.శివశంకర్, స్వరూప, జాయింట్ సెక్రటరీలుగా ఎం.జనార్దన్ రెడ్డి, పి.నరేందర్ రెడ్డి, కె.సత్యనారాయణ రెడ్డి, ఎం.శ్రీనివాసులు, డి.సారంగపాణి, కె.అశోక్ రెడ్డి, ఆర్.సత్యనారాయణ, ఎస్.మాధవి, పద్మజతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. -
మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం
నెహ్రూసెంటర్: వాస్తవ కథనాలు ప్రచురించిన సాక్షి పత్రికపై, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం, పోలీసులు వేధింపులు మానుకోవాలి. ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు చెప్పినట్లు అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. సాక్షి పత్రికపై దాడులు, పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. – గుగులోత్ భీమానాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడునెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులు, నోటీసులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అక్రమ కేసులు పెట్టడాన్ని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవ కథఽనాల ద్వారా అక్రమాలను వెలికితీస్తే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికై నా సాక్షిపై అక్రమంగా పెట్టిన కేసులు, నోటీసులను వెనక్కి తీసుకోవాలి. – గుగ్గిళ్ల పీరయ్యమాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలి ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ -
కిక్కు రాలే.!
సాక్షి ప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్ దరఖాస్తుల ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి శనివారం అర్ధరాత్రి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించింది. దరఖాస్తులు, ఆదాయం రెండింతలు వస్తుందనుకున్న ప్రభుత్వ లక్ష్యం ఈసారి నెరవేరలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 294 వైన్స్‌కు 2023–25 టెండర్లలో 16,039 దరఖాస్తులతో రూ.318 కోట్ల ఆదాయం వచ్చింది. 2025–27కు శనివారం చివరి తేదీగా మొదట ప్రకటించారు. రాత్రి 10 గంటల వరకు 9,754 దరఖాస్తులతో 292.4 కోట్ల ఆదాయం లభించింది. కాగా, గత టెండర్లతో పోల్చితే 6,285 దరఖాస్తులు, 28.16 కోట్ల ఆదాయం తగ్గింది. కాజీపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని కడిపికొండ వైన్స్‌కు అత్యధికంగా 114 దరఖాస్తులు వచ్చాయి. భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మూడు వైన్స్‌లకు ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే రావడం గమనార్హం. చివరి రోజు వరంగల్ అర్బన్‌లో 1,577, వరంగల్ రూరల్‌లో 910, జనగామలో 950, మహబూబాబాద్‌లో 735, భూపాలపల్లిలో 1,036 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు పెంపుదలే కారణం.. వైన్స్ దరఖాస్తులకు నాన్ రీఫండబుల్‌గా గత టెండర్లలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈసారి రూ.3 లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీంతో దరఖాస్తులు చేసేందుకు మద్యం వ్యాపారులు ఈసారి పెద్దగా ముందుకురాలేదు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా ఉండడంతో స్థిరాస్తుల కొనుగోళ్ల వైపు ఎవరూ మొగ్గు చూపడం లేదు.రూ.3 లక్షల నాన్ రీఫండ్ ఫీజుతో దరఖాస్తు చేసే బదులు రెండున్నర తులాల బంగారం కొనుగోళ్లకు మధ్య తరగతి కుటుంబాల వారు ఆసక్తి కనబరిచారు. రూ.320.7 కోట్ల టార్గెట్.. 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న టెండర్ల ప్రక్రియ ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల చివరి తేదీ తొలుత నిర్ణయించారు. కాగా, అక్టోబర్ 18 చివరి రోజు వరకు కేవలం 9,754 దరఖాస్తులు, రూ.292.2 కోట్ల ఆదాయం వచ్చింది. గత టెండర్ల రూ. 320.7 కోట్ల ఆదాయ టార్గెట్‌ను దాటేందుకు ఈనెల 23 చివరి తేదీగా మరోఐదు రోజుల అవకాశం కల్పించింది. ఈనెల 27వ తేదీన లక్కీడ్రా తీయనున్నారు. కాగా, రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజుతో దరఖాస్తుతో పాటు ఆదాయం పెరుగుతుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో ఖజానాకు ఆదాయం కిక్కు పొందేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది.జిల్లా వైన్స్ 2023–25 ఆదాయం 2025–27 ఆదాయం దరఖాస్తులు (రూ.కోట్లలో) దరఖాస్తులు (రూ.కోట్లలో) వరంగల్ అర్బన్ 67 5,859 117 3,012 90.3 వరంగల్ రూరల్ 57 2,938 58 1,826 54.7 జనగామ 50 2,492 49 1,587 47.6 మహబూబాబాద్ 61 2,589 51 1,672 50 .1 భూపాలపల్లి 59 2,161 43 1,657 49.7 మొత్తం 294 16,039 318 9,754 292.4వైన్స్ టెండర్ల గడువును ఈనెల 23 వరకు పొడిగిస్తూ శనివారం అర్ధరాత్రి ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఐదు రోజులు పొడిగించినా ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు ఉన్నాయి. కాగా, మూడు రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణకు సమయం ఉంది. 294 షాపులకు 9,754 అర్జీలు, రూ.292 కోట్ల రెవెన్యూ టెండర్ల గడువు 23 వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం -
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు..
స్టేషన్‌ఘన్‌పూర్: పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. సాక్షి మీడియాలో ఏపీ ప్రభుత్వం పోలీసులతో సోదాలు, దాడులు చేయిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికారంగంపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న దాడి అనాగరికం. పత్రికా స్వాతంత్య్రం అత్యంత కీలకం. సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదు. – మంగు జయప్రకాశ్, టీఎస్ యూటీఎఫ్ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు, స్టేషన్‌ఘన్‌పూర్ -
రాష్ట్రస్థాయి బృంద గీతాల పోటీల్లో ప్రతిభ
హనుమకొండలో బాణసంచా విక్రయిస్తున్న వ్యాపారులు దీపావళి పండుగను పురస్కరించుకుని వరంగల్, హనుమకొండ, కాజీపేటలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. కుండీలు, ప్లేట్లు, బాతులు, తాబేలు, దీపం, గిన్నెల వంటి ఆకృతుల్లో తయారైన సంప్రదాయ మట్టి ప్రమిదలతోపాటు బాణసంచా, పూలు,పండ్లను ప్రజలు కొనుగోలు చేశారు. దీంతో నగరంలోని ప్రధాన రహదారులు సందడిగా మారాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హనుమకొండవిద్యారణ్యపురి : హైదరాబాద్‌లోని కూకట్పల్లి పీఎన్ఎం హైస్కూల్లో భారత్ వికాస్ పరిషత్ కమిటీ ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి జాతీయ బృంద గీతాల పోటీల్లో ఓరుగల్లు విద్యార్థులు ప్రతిభ చూపారు. తెలంగాణ రాష్ట్రస్థాయి బృంద గీతాల పోటీల్లో 30 పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా తెలుగు, జానపదం విభాగం (రూరల్) వరంగల్‌లోని నాగార్జున ప్రైమ్ స్కూల్ విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. విజేతలకు మెమోంటో, సర్టిఫికెట్లు అందజేశారు. పాఠశాల కరస్పాండెంట్ ఎ.వెంకటేశ్వర్లు, బీవీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుధీర్‌కుమార్, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, బాధ్యులు వెంకటరెడ్డి తదితరులు ఆదివారం అభినందించారు. -
ఉర్సు రంగలీల మైదానంలో నరకాసుర వధ
ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఆదివారం సాయంత్రం నరకాసుర వధ కనులపండువగా జరిగింది. కృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుడిని బాణసంచాతో సంహరించే వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవ కమిటీ, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసింది. మైదాన పరిసరాల్లోకి వాహనాలు రాకుండా కిలోమీటర్ల దూరంలోనే నలువైపులా ప్రత్యేక పార్కింగ్ వసతి అందుబాటులోకి తెచ్చారు. ప్రధాన ఘట్టంగా రథయాత్ర.. ఉర్సు ప్రతాప్‌నగర్ నుంచి ప్రత్యేక రథంపై కృష్ణుడు, సత్యభామ ఉత్సవ మూర్తులతోపాటు యువతులు ధనస్సు చేతబట్టి శ్రీకష్ణుడు, సత్యభామ వేషధారణతో వచ్చారు. కళాకారుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, భజనల నడుమ వారు రంగలీల మైదానానికి చేరుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి, సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 58 అడుగుల నరకాసుర ప్రతిమను మేయర్ గుండు సుధారాణి స్విచ్ ఆన్‌చేసి ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ పరికరంతో దహనం చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు.. ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన కృష్ణుడు, సత్యభామ నాటకం, నృత్యాలు, పేరిణ, శివతాండం, కూచిపూడి నృత్యాలు విశేషంగా అలరించాయి. జానపద గేయాలు, తెలంగాణ ఆటపాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. భారీ బందోబస్తు.. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్‌సింగ్ ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, ఏఎస్పీ శుభంప్రకాశ్ పర్యవేక్షణలో మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుజాత, ఎస్సైలు, 100 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షించారు. 58 అడుగుల ప్రతిమను దహనం చేసిన మేయర్ సుధారాణి బాణసంచా మోతతో దద్దరిల్లిన ప్రాంగణం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -
భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు..
హన్మకొండ: పత్రికా స్వేచ్ఛను హరించొద్దు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉండే పత్రికలపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై కక్ష గట్టడం సరికాదు. ఎడిటర్, విలేకరులపై అకారణంగా, అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం. వార్తలో లోపాలుంటే ఖండన ఇవ్వాలి. ఇలా కాకుండా నోటీసులు ఇచ్చి కేసులు పెట్టి వేధించడం అప్రజాస్వామికం. – ఏదునూరి రాజమొగిలి, బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి -
గ్రామస్థాయి నుంచి బీసీ ఉద్యమం బలోపేతం
హన్మకొండ : బీసీ ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. ఆదివారం హనుమకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంద్ ఫర్ జస్టిస్ విజయవంతానికి కృషి చేసిన, సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ బంద్ తెలంగాణ ఉద్యమం తరహాలో జరిగిందని, ఈ బంద్ బీసీ ఉద్యమానికి ఆరంభం మాత్రమేనన్నారు. బీసీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి బీసీలను చైతన్య పరుస్తామన్నారు. ఓటు మనదే.. సీటు మనదే.. రాజ్యాధికారం మనదే అనే నినాదంతో బీసీలందరినీ సంఘటితం చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించేందుకు బీసీ జేఏసీ కృషి చేస్తోందన్నారు. సమావేశంలో బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా వర్కింగ్ చైర్మన్ దొడ్డపెల్లి రఘుపతి, వైస్ చైర్మన్లు దాడి మల్లయ్య యాదవ్, బోనగాని యాదగిరి గౌడ్, వైద్యం రాజగోపాల్, తమ్మల శోభారాణి, కోఆర్డినేటర్లు గాజు యుగంధర్ యాదవ్, తంగళ్లపల్లి రమేశ్, ప్రచార కార్యదర్శి అరేగంటి నాగరాజు గౌడ్, చాగంటి రమేశ్ పాల్గొన్నారు. టీఎస్ బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ -
అనుమానాస్పద స్థితిలో బీఆర్ఎస్ నాయకుడి మృతి
గీసుకొండ : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు ల్యాదేళ్ల రాజు(46) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం అతడి మృతదేహం ఇదే డివిజన్లోని మొగిలిచర్ల శివారులో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి బంధువులు, గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. గోనె సంచుల వ్యాపారం చేస్తున్న రాజు శనివారం మధ్యాహ్నం హసన్‌పర్తి పీఎస్‌లో పని ఉందంటూ ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాలేదు. మరుసటి రోజు అతడి మృతదేహం మొగిలిచర్ల శివారులోని శ్మశానవాటిక సమీపంలో లభ్యమైంది. తన భర్త అనుమానాస్పదంగా మృతి చెందాడని మృతుడి భార్య ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తోపాటు మృతుడి సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు. కాగా, ఘటనాస్థలిని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం రాజు అంత్యక్రియలకు రూ. 50వేలు అందజేశారు. -
పర్యావరణహిత ‘దీపావళి’ని ఆహ్వానించాలి
మహబూబాబాద్ రూరల్: చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగ పరామర్థం మానవ జీవితంలో ఆనందాలను నింపడమే.. అందుకే ఈ రోజున బాణసంచా పేల్చుతాం. అయితే దీపావళి వేడుకలను శబ్దకాలుష్యం లేకుండా దీపోత్సవంగా జరుపుకోవాలి. బాణసంచా కాల్చడం వల్ల బీపీ, తలనొప్పి, గుండెపోటు తదితర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని చెప్పొచ్చు. కాలుష్య పొగను పీల్చితే ముక్కు, గొంతులో మంటలు ఏర్పడుతాయి. బాణసంచా పొగ కళ్లను మండించి నీరు తెప్పించడమేకాకుండా ఎరుపు రంగులోకి మారుస్తాయి. చెవులు ఒక్కోసారి పనిచేయడం మానేస్తాయి. అంతేకాకుండా చెవుడుకూడా వచ్చేప్రమాదం ఉంది. బాణసంచా కాలిస్తే అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల వ్యాధులు, దగ్గు, తుమ్ములు, అస్తమా, ఉబ్బసం, అధికమవుతాయి. శ్వాస కష్టమవుతుంది. విషవాయువులు గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మానసికంగా సరిలేని వారు కూడా ఈ పండుగ రోజుల్లో భయం, ఒత్తిడికి గురవుతారు. భారీ ధ్వని కాలుష్యానికి వయసు పైబడిన వారు మరింత బాధపడుతారు. అందుకే ప్రతీ ఒక్కరూ పర్యావరణహిత ‘దీపావళి’ని జరుపుకోవాలని ఆశిద్దాం. -
ఇంటిలోని ఏమూలలోనూ చీకటి లేకుండా చూడాలి..
ఈ రోజు దీపతోరణాలు వెలిగించే ఆచారం ఉంది. అందుకే దీపావళి పండుగగా పిలుస్తారు. ఈరోజున శ్రీమహా లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఇంటింటికీ తిరుగుతుందని భావిస్తారు. అందుకే ప్రజలు శ్రీమహాలక్ష్మీదేవికి నీరాజనాలు పలుకుతూ తమ ఇంటిలోపల, వెలుపల దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు మట్టి ప్రమిదలో నెయ్యి లేదా నూనె పోసి, ఒత్తులు వేసి దీపాలు వెలిగించడం సర్వశ్రేష్టం. దీపాల వరుసను వృక్షాకారంలో, స్వస్తిక్ ఆకారంలోనూ పేర్చి వెలిగిస్తే మరింత మంచిది. పురాతన శివాలయాలలో దీపదానం చేయడం దేవాలయాల్లో దీపాలు వెలిగించడం సంప్రదాయం. ఇంటిలోని ఏ మూలలోనూ చీకటిలేకుండా చూడాలి. -
సీతంపేటలో ‘దీపావళి’ బతుకమ్మ
హసన్‌పర్తి: తెలంగాణ వ్యాప్తంగా దసరా ఉత్సవాలను పురస్కరించుకుని బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తే.. సీతంపేటలో మాత్రం దీపావళి సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ గ్రామానికి చెందిన నేతకాని కులస్తులకు మాత్రమే ఈ వేడుకలు ప్రత్యేకం. మూడు రోజులపాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. రెండు వందల ఏళ్ల నుంచి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నేతకాని కులస్తులు పేర్కొన్నారు. గతంలో ఐదు రోజులపాటు కొనసాగిన ఈ ఉత్సవాలను మూడు రోజులకు కుదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న నేతకాని కులస్తులు ప్రతీ దీపావళికి సీతంపేటకు వచ్చి ఉత్సవాల్లో పాల్గొంటారు. కోలాటాల మధ్య ఉత్సవాలు కొనసాగనున్నాయి. తొలిరోజు దేవతామూర్తుల ప్రతిమలు.. దీపావళి బతుకమ్మ వేడుక సందర్భంగా తొలి రోజు మంగళవారం చెరువు నుంచి మట్టిని తీసుకొచ్చి దేవతల ప్రతిమలను(ఎద్దులు) తయారు చేస్తారు. ఆ ప్రతిమలను ప్రత్యేక గదిలో ప్రతిష్ఠించి నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం విశేష పూజలు నిర్వహిస్తారు. రెండో రోజు పురుషుల ఉపవాస దీక్షలు రెండో రోజు బుధవారం పురుషులు ఉపవాస దీక్ష చేపడుతారు.అనంతరం సాయంత్రం ఇళ్లల్లో ప్రతిష్ఠించిన దేవతా మూర్తుల ప్రతిమలను భారీ ప్రదర్శనగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారు. అనంతరం చెరువు వద్ద ఉపవాస దీక్ష విరమిస్తారు. ఆతర్వాత చెరువు నుంచి జలం తీసుకొచ్చి ప్రత్యేక గదిలో పెట్టి పూజలు చేస్తారు. చివరి రోజుల బతుకమ్మ వేడుకలు మూడో రోజు గురువారం మహిళలు గౌరమ్మ(బతుకమ్మ)లను తయారుచేసి భారీ ప్రదర్శనగా బయలుదేరుతారు. మహిళలతో పాటు పురుషులు కూడా బతుకమ్మలు ఎత్తుకుని ముందుకు సాగడం ప్రత్యేకత. రేపటి నుంచి వేడుకలు ప్రారంభం మూడు రోజులపాటు సంబురాలు -
కార్తీక వనభోజనంలో పాల్గొనండి
హన్మకొండ కల్చరల్ : నవంబర్ 16న నిర్వహించే కార్తీక వనభోజనంలో విశ్వబ్రాహ్మణుల పాల్గొనాలని తెలంగాణ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ మాతృ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచారి కోరారు. వరంగల్ రంగశాయిపేట దూపకుంట మై మాస్టర్ స్కూల్ వెనుక ఉన్న మామిడి తోటలో నిర్వహించే వనభోజన కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విశ్వబ్రాహ్మణుల పాల్గొనాలని పేర్కొన్నారు. ఆదివారం రంగశాయిపేటలో వనభోజనాల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెందోట సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్తీక వనభోజనాల కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అన్నదానం
హన్మకొండ కల్చరల్ : అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం పురస్కరించుకుని ఆదివారం హనుమకొండలోని కేయూ క్రాస్ రోడ్లో అన్నదానం చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్పొరేటర్ సిరంగి సునీల్, కమిటీ స్టేట్ సెక్రటరీ దుశెట్టి భాస్కర్, జోనల్ సెక్రటరీ కంకటి సాగర్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు బయాల సంతోష్‌కుమార్, పీఆర్వో బాలరాజు, అజయ్‌గౌడ్, సభ్యులు జితేందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పాలన గాడిన పడినట్లేనా?
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో కొన్నేళ్లుగా పలు సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయి. రెగ్యులర్ వీసీగా ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పుడు వర్సిటీలోని వివిధ సమస్యలు పరిష్కారమవుతాయని అంతా భావించారు. కానీ, ఆయన ఏనిర్ణయం తీసుకోవడంలోనైనా, దృష్టికి వచ్చిన సమస్యకు పరిష్కారం చూపడంలోనైనా స్లో పాలన కొనసాగిస్తున్నారు. వీసీగా ప్రతాప్‌రెడ్డి బాధ్యతలను స్వీకరించి ఈనెల 19 (ఆదివారం)తో ఏడాది పూర్తవుతోంది. పాలనపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈఏడాదిలో వీసీగా కేయూలో చేపట్టిన కార్యక్రమాలు, పరిష్కారానికి నోచుకున్న సమస్యలు, చేపట్టబోయే అభివృద్ధిపై ప్రత్యేక కథనం. పాఠాల బోధనేది? కేయూలో కొన్నేళ్లుగా వివిధ విభాగాల్లో, వివిధ వర్సిటీ కాలేజీల్లోనూ సరిగ్గా తరగతులు జరగడంలేదు. ఉన్న రెగ్యులర్ అధ్యాపకుల్లో కొందరు పరిపాలనా పదవుల్లో కొనసాగుతున్నారు. పాఠాల బోధనపై ఆసక్తి కనబర్చడంలేదు. కొందరు రెండు, మూడు, నాలుగు పదవుల్లోనూ కొనసాగుతుండడం బోధనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. కాంట్రాక్టు, పార్ట్‌టైం అధ్యాపకుల్లోనూ కొందరు తరగతులు సరిగ్గా తీసుకోవడం లేదని, ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. కాగా, ఇటీవల వీసీ ప్రతాప్‌రెడ్డి బాటనీ విభాగాన్ని తనిఖీ చేయగా టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు ఎవరూ లేరని గుర్తించారు. ఫార్మసీ కాలేజీకి వెళ్లగా, అక్కడ ప్రిన్సిపాల్, మరో ప్రొఫెసర్ ఉన్నారు. మిగతా పలువురు అధ్యాపకులు ఆసమయంలో విధుల్లో లేరని గుర్తించి ప్రిన్సిపాల్‌తో మాట్లాడినట్లు సమాచారం. వివిధ విభాగాల్లో ప్రాక్టికల్స్ కూడా మొక్కుబడిగానే చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ● ఈఏడాది జూలై 7న కేయూ 23వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఆగస్టులో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్‌ను విజయవంతంగా నిర్వహించారు. ● పలు సంస్థలతో ఎంఓయూలు చేపట్టారు. ● ఆరోపణలు వచ్చిన వారిపై కమిటీలు వేశారు. పలువురిపై చర్యలు తీసుకున్నారు. మరో రెండు మూడు నివేదికలపై ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ● గతంలోకంటే కేయూకు బ్లాక్గ్రాంటును ఈఆర్థిక సంవత్సరంలో కేయూకు బడ్జెట్‌ను రూ.145 కోట్ల వరకు పెంచడానికి వీసీ కృషి చేశారు. గత మూడునెలలుగా పెన్షనర్లకు ప్రభుత్వం పెన్షన్‌ను మంజూరు చేయడం లేదు. వర్సిటీ అంతర్గత నిధుల నుంచి చెల్లిస్తున్నారు. ● రూసా ప్రాజెక్టుల, సైన్స్ రీసెర్చ్ప్రాజెక్టుల పరిశోధనలకోసం సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ భవనం, మహిళా హాస్టల్ భవనం, పద్మాక్షి మహిళా హాస్టల్లో నూతనంగా డైనింగ్ హాల్ నిర్మించబోతున్నారు. ● కేయూలోని మహిళా హాస్టళ్లన్నింటికీ కలిసి రూ.3.50 కోట్ల వ్యయంతో ప్రహరీ నిర్మించబోతున్నారు. ● కేయూ చుట్టూ ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు రూ.20 కోట్ల యూనివర్సిటీ నిధులతో 10.2 కిలోమీటర్ల మేర ప్రహరీ నిర్మించబోతున్నారు. ● కేయూ పీజీ హాస్టల్ డైనింగ్ హాల్ వద్ద మరో రూ.40 లక్షలు వెచ్చించి కిచెన్ షెడ్డును నిర్మించారు. దీన్ని త్వరలోనే వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది. వర్సిటీలో అడ్మిషన్లు పొందిన వారిలో కొందరికి వసతి కల్పించలేకపోతున్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఫస్ట్ ఇయర్లో ఎవరికీ హాస్టల్ వసతి కల్పించడం లేదు. మరో రెండు హాస్టళ్ల భవనాలు అవసరం ఉంది. న్యూపీజీ హాస్టల్ వద్ద రూ.2.50 కోట్ల వ్యయంతో డైనింగ్ హాల్ నిర్మించి మూడేళ్లవుతోంది. నేటికీ వినియోగంలోకి తీసుకురాలేదు. వర్సిటీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉంది. పార్ట్‌టైం లెక్చరర్లను నియమించాలనే డిమాండ్ ఉంది. ఇటీవల పాలకమండలి కూడా పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి ఓకే చెప్పింది. రూ.4.50 కోట్లతో నిర్మించిన కె హబ్‌ను ఇప్పటి వరకు వినియోగంలోకి తీసుకు రాలేదు. పీవీ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయలేదు. రూసా ప్రాజెక్టు కింద రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయి. వివిధ విభాగాల ప్రొఫెసర్లు ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు చేపట్టలేదు. సూపరింటెండెంట్లకు అసిసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పించాల్సి ఉంది. నాలుగో తరగతి ఉద్యోగుల పోస్టులు 150 వరకు భర్తీ చేయాల్సి ఉంది. 1992 నుంచి రెగ్యులర్ బోధనేతర ఉద్యోగుల నియామకాలు లేవు. పార్ట్‌టైం లెక్చరర్లను కాంట్రాక్టు లెక్చరర్లుగా నియమించాలనే డిమాండ్ అలాగే ఉండిపోయింది. రెగ్యులర్ అధ్యాపకులు 77 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 15 ఏళ్లుగా నియామకాలు లేవు. కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్యాకేంద్రంలో అడ్మిషన్ల సంఖ్య పడిపోతోంది. ప్రవేశాలు పొందిన వారికి సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించడం లేదు. పరీక్షలు సకాలంలో నిర్వహించడం లేదు. కేయూ భూముల ఆక్రమణలు గుర్తించి స్వాధీనం చేసుకోవడం లేదు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి పాలనకు నేటితో ఏడాది పూర్తి వినియోగంలోనికి రాని కె హబ్, డైనింగ్ హాల్ కమిటీలు వేసి చర్యలు తీసుకోవడంలో జాప్యం కొన్నేళ్లుగా ఎక్కడి సమస్యలు అక్కడే.. వేధిస్తున్న రెగ్యులర్ అధ్యాపకుల కొరత -
ఏటీఎంలో నగదు కొల్లగొట్టేందుకు యత్నం
కాజీపేట: కాజీపేటలోని డీజిల్ కాలనీ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించి మిషన్‌ను ధ్వంసం చేశారు. ఏటీఎం మిషన్‌లో డబ్బులు ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించిన దుండగులు ముఖాలకు ముసుగులు ధరించి.. వెంట తెచ్చుకున్న ఆయుధాలతో మిషన్‌ను ధ్వంసం చేశారు. ఎంత ప్రయత్నించినా డబ్బులు బయటకు వచ్చే బాక్స్ మాత్రమే ఓపెన్ అయ్యింది. దీంతో దుండగులు కోపంతో మిషన్‌ను ఇష్టం వచ్చినట్లుగా ధ్వంసం చేసి నిరాశతో పరారయ్యారు. ఉదయం వేళ డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన వారు గమనించి 100 డయల్ చేసి ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి ఎస్బీఐ అధికారులతో పాటు సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సైలు లవన్‌కుమార్, శివ క్రైం పార్టీ సిబ్బందితో చేరుకుని ఆధారాల కోసం ప్రయత్నించారు. రహదారులపై ఉన్న సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. ఇది స్థానిక దొంగల పనేనా? లేక ఇతర ప్రాంతాలకు చెందినవారెవరైనా చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏటీఎంలో దాదాపు రూ.7లక్షల వరకు నిల్వ ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎస్బీఐ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా దీపావళి పండుగకు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు యశ్వంత్‌పూర్–ముజఫర్‌ఫూర్ మధ్య రెండు ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు శనివారం రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. అక్టోబర్ 22వ తేదీన యశ్వంత్‌పూర్ – ముజఫర్‌పూర్ (06261) ఎక్స్‌ప్రెస్ గురువారం కాజీపేటకు చేరుకొని వెళ్తుంది. అదేవిధంగా అక్టోబర్ 24వ తేదీన ముజఫర్‌పూర్–బెంగళూర్ సీఎఎన్టీటీ (06262) ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు శనివారం చేరుకొని వెళ్తుంది. ఈ రైళ్ల సర్వీస్‌లకు ఎలహంక, ధర్మవరం, అనంతపూర్, దోన్, మహబూబ్‌నగర్, కాచిగూడ, కాజీపేట, రామగుండం, బల్లార్షా, నాగపూర్, ఇటార్సీ, జబల్పూర్, సంత, ప్రయాగ్‌రాజ్, చోకి, పండిట్ డీడీ ఉపాధ్యాయ, బాక్సర్, ఆర, ధానాపూర్, పాటలిపుత్ర, సోనాపూర్, హజిపూర్ రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్ఓ తెలిపారు. హన్మకొండ: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు. నవంబర్ 5న జరిగే గిరి ప్రదక్షిణకు అదే నెల 3న హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్ నుంచి బయలుదేరుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చార్జీ పెద్దలకు రూ.5 వేలు, పిల్లలకు రూ.3,500గా నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ టూర్ ప్యాకేజీ పూర్తి సమాచారం కోసం 90634 07493, 77805 65971, 98663 73825, 99592 26047 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. వరంగల్: హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఫ్యాషన్ వీక్ జూనియర్స్ అనే కార్యక్రమంలో వరంగల్ ప్రీ స్కాలర్స్ మాంటిసోరి ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన మైరా చేసిన క్యాట్ వాక్ అందరినీ ఆకర్షించింది. బెస్ట్ ఫర్ఫార్మెన్స్గా ఎంపికై ంది. రెండేళ్ల 9నెలల వయస్సు ఉన్న మైరా ఇటీవల పదవీ విరమణ చెందిన ఏనుమాముల మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పోలేపాక నిర్మల మనుమరాలు. మెరుగైన వైద్యసేవలు అందించాలి ● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో వైద్య, ఆరోగ్యశాఖ, ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్ఓలతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యసేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల లభ్యత, వైద్యుల హజరు, పరీక్ష పరికరాల వినియోగం, మాతాశిశు సంరక్షణ వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీసెస్ సర్వే నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సిజేరియన్లు కాకుండా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. ప్రైవేట్ డాక్టర్లు విధిగా సాధారణమైన ప్రసవాలు ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ బి.సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు ప్రకాశ్, కొంరయ్య, ప్రోగాం అధికారులు రవీందర్, ఆచార్య, విజయ్‌కుమార్, మోహన్‌సింగ్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.● మిషన్ తెరుచుకోకపోవడంతో దొంగలు పరార్ -
వేగంగా సాంకేతికత అభివృద్ధి
● ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డిహసన్పర్తి: నేటి ఆధునిక యుగంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి అన్నారు. అన్నాసాగరం శివారులోని సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వరదారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు సృజనాత్మక శక్తిని పెంపొందించుకోవాలన్నారు. ప్రొఫెసర్ వెంకటనారాయణ మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ జీవితంలో కొత్త ప్రారంభమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థినులు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈసందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ సుదర్శన్, డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ శ్రీవాణి, ఏఓ వేణుగోపాల్, కార్యక్రమ కో–ఆర్డినేటర్లు ఝాన్సీరాణి, ఎస్.శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
యాసంగికి సన్నద్ధం కావాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ● ట్రాన్స్ కో, డిస్కం అధికారులతో సమీక్ష హన్మకొండ: యాసంగి సాగుకు సన్నద్ధం కావాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి విద్యుత్ అధికారులకు సూచించారు. హనుమకొండ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్‌కో సీఈలు, ఎస్ఈలు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈలు, ఎస్ఏఓలతో శనివారం సమీక్ష నిర్వహించారు. డివిజన్లు, జిల్లాల వారీగా ప్రగతిని సమీక్షించారు. సమావేశంలో సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి కొత్తగా నెలకొల్పే 220/33 కేవీ, 132/33 కేవీ కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యం పెంపు, డబుల్ సర్క్యూట్ లైన్లు, బే ఎక్స్టెన్షన్ ప్రతిపాదనలు పంపాలని, పురోగతిలో ఉన్న పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులకు ట్రాన్స్‌కోకు లేఖలు రాయాలని సూచించారు. ట్రాన్స్ కో, ఎన్పీడీసీఎల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్లు తగ్గించాలని, రిపేర్లు పెంచాలన్నారు. వ్యవసాయ, కొత్త సర్వీసులు, టీజీఐ పాస్‌లో నమోదు చేసుకున్న సర్వీసులు త్వరగా మంజూరు చేయాలన్నారు. సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్లాల్, కె.తిరుమల్‌రావు, అశోక్, రాజు చౌహన్, ట్రాన్స్ కో చీఫ్ ఇంజనీర్ శ్రీరామ్‌కుమార్ పాల్గొన్నారు. -
కోర్టులు.. న్యాయం పంచే పవిత్ర స్థలాలు
జనగామ: కోర్టులు న్యాయం పంచే పవిత్ర స్థలాలు అని, న్యాయం జరిగిందన్న నమ్మకంతో కక్షిదారులు కోర్టు నుంచి తిరిగి వెళ్లేలా చూడడం ప్రతీ న్యాయవాది బాధ్యత అని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్ సేన్‌రెడ్డి అన్నారు. జనగామ మండలం చంపక్ హిల్స్ వద్ద రూ.81 కోట్ల నిధులతో నిర్మించనున్న నూతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి హైకోర్టు జడ్జిలు నామవరపు రాజేశ్వరావు, బీఆర్ మధుసూదన్‌రావు, సుద్దాల చలపతిరావుతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ఆర్అండ్బీ అతిథి గృహంలో జిల్లా న్యాయమూర్తి బి.ప్రతిమ, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్ యాదవ్, తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులు పోలీ సుల గౌరవ వందనం స్వీకరించారు. బాణాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు, సిద్ధాంతి క్రిమాచాచారి మంత్రోచ్ఛరణల నడుమ కోర్టు నూతన భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం హైకోర్టు జడ్జిలు మొక్కలు నాటి నీరు పోశారు. న్యాయవాదులు మెరుగైన పాత్ర పోషించాలి.. సిద్దిపేట రోడ్డులోని ఉషోదయ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసుల పరిష్కారం విషయంలో న్యాయవాదులు ప్రావీణ్యతతో మరింత మెరుగైన పాత్ర పోషించాలన్నారు. కక్షిదారులకు సమగ్ర, ధర్మబద్ధ న్యాయం అందించడం న్యాయవాదుల ప్రధాన లక్ష్యమన్నారు. వరకట్న వేధింపులు, చెక్ బౌన్స్ కేసులు కుటుంబ తగాదాలు, భాగస్వామ్య కేసులు ఎక్కువగా వస్తున్నాయని, వీటిని త్వరతగతిన పరిష్కరించే అవకాశం ఉందని తెలిపారు. కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో న్యాయవాదులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నూతన కోర్టు భవనం రెండేళ్లలో పూర్తవుతుందని కాంట్రాక్టర్ చెప్పారని, కానీ, 20 నెలల్లో ప్రారంభోత్సవం చేసుకుంటామనే నమ్మకం ఉందన్నారు. అనంతరం హైకోర్టు ఆద్వర్యంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ప్రతిమ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్ యాదవ్, సీనియర్ సివిల్ జడ్జిలు సి.విక్రమ్, సుచరిత, ప్రిన్సిపల్ జూనిర్ సివిల్ జడ్జి శశి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి సందీప, సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ వెంకటరాం నర్సయ్య, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్ సేన్‌రెడ్డి నూతన కోర్టు భవన సముదాయానికి భూమిపూజ -
శిల్ప కళాసంపద మహాద్భుతం
ఖిలా వరంగల్: చారిత్రక వైభవాన్ని చాటే కాకతీయుల రాజధాని నిర్మాణం, నళ్లరాతితో తయారైన నాటి శిల్ప కళా సంపద మహాద్భుతంగా ఉందని టాంజానియా దేశ మిడ్ లెవెల్ సివిల్ సర్వెంట్ అధికారులు కొనియాడారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీ (డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ)లో ప్రాఫెసర్, కోర్సు డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న టాంజానియా దేశానికి అధికారులు శనివారం సాయంత్రం ఖిలా వరంగల్ కోటను సందర్శించారు. కాకతీయలు కీర్తితోరణాల నడుమ ఉన్న అద్భుత శిల్ప సంపదతోపాటు ఖుష్‌మాహల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిలగుట్ట, శృంగారపు బావిని తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, కోట గైడ్ రవియాదవ్ వివరించారు. ఆనాటి కట్టడాలు, శిల్పకళా సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు. అనంతరం వారు టీజీ టీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించే సౌండ్ అండ్ లైటింగ్ షోను తిలకించారు. వారి వెంట ఎంసీహెచ్ఆర్డీ విజిట్ కో–ఆర్డినేర్ నందకిషోర్, కేంద్ర పురావస్తుశాఖ కోట ఇన్చార్జ్ శ్రీకాంత్, టూరిజం అభివృద్ధి సంస్థ మేనేజర్ అజయ్, రాజేశ్ తదితరులు ఉన్నారు. ● టాంజానియా దేశ సివిల్ సర్వెంట్లు -
ముగిసిన నేషనల్ అథ్లెటిక్స్ మీట్
● హెప్టాథ్లాన్‌లో తెలంగాణకు గోల్డ్ వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజుల పాటు కొనసాగిన జాతీయస్థాయి 5వ అథ్లెటిక్స్ అండర్–23 చాంపియన్‌షిప్ పోటీలు శనివారం ముగిశాయి. చివరి రోజు జరిగిన పలు ఈవెంట్లలో పతకాల కోసం అథ్లెట్లు పోటీపడ్డారు. పోటీల ఏర్పాట్లను తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె.సారంగపాణి, అధ్యక్షుడు స్టాన్లీజోన్స్, డీవైఎస్ఓ గుగులోతు అశోక్‌కుమార్ పర్యవేక్షించారు. పోటీల నిర్వహణలో టెక్నికల్ అఫీషియల్స్, కోచ్‌లు వాసుదేవరావు, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. చివరి రోజు జరిగిన పోటీల్లో మహిళల 800 మీటర్ల హెప్టాత్లాన్ విభాగంలో తెలంగాణ నుంచి కేతావత్ సింధు బంగారు పతకాన్ని సాధించింది. రికార్డులు బ్రేక్ మూడు రోజుల పాటు జరిగిన ఈ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ మీట్లో పలువురు అథ్లెట్లు వివిద విభాగాల్లో పాత రికార్డులు బ్రేక్ చేసి కొత్త రికార్డులు సృష్టించారు. 100 మీటర్ల మహిళల విబాగంలో సుదీష్న హనమంత శివాంకర్ (మహారాష్ట్ర), 100 మీటర్ల మహిళల పరుగు విభాగంలో సాక్షి (గుజరాత్), డిస్కస్‌త్రో మహిళల కేటగిరీలో నిఖితకుమారి (రాజస్తాన్), పురుషుల 20వేల మీటర్ల రేస్‌వాక్‌లో సచిన్బొహారా(ఉత్తరాఖండ్), పురుషుల లాంగ్‌జంప్‌లో అనురాగ్ సీవీ (కేరళ), 400ల మీటర్ల పురుషుల హార్డిల్స్‌లో అర్జున్ ప్రదీప్ (కేరళ) కొత్త రికార్డులు సృష్టించారు. లాంగ్ జంప్ అనురాగ్ సీవీ తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. 2024లో తన పేరు మీద ఉన్న 7.87 మీటర్ల పాత రికార్డు 8.08 మీటర్లతో కొత్త రికార్డును సృష్టించాడు. కాగా 400ల మీటర్ల పురుషుల హార్డిల్స్ విభాగంలో కేరళకు చెందిన అర్జున్ ప్రదీప్ రికార్డు బ్రేక్ చేశాడు. 2022లో యాషెస్ (కర్ణాటక) 50.89 పేరున ఉన్న పాత రికార్డును అర్జున్ప్రదీప్ 50.29 స్కోర్‌తో రికార్డు సృష్టించాడు. -
బీసీ బంద్ సక్సెస్
గ్రేటర్లో వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థల మూసివేతహన్మకొండ/వరంగల్‌చౌరస్తా: గ్రేటర్ వరంగల్ పరిధిలో బీసీ బంద్ ప్రశాంతంగా విజయవంతమైంది. శనివారం నగరవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రైవేట్ విద్యాసంస్థలు, సినిమా హాళ్లు మూసివేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీలు రోడ్డెక్కారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ర్యాలీలు తీయడంతో పోరు హోరెత్తింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి, బీఆర్ఎస్ నాయకులు, బీసీ సంఘాల నాయకులు వేకువజామునే ఆర్టీసీ జిల్లా బస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. వరంగల్–1 డిపో గేట్లో బైఠాయించి బస్సులు అడ్డుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో బంద్ ప్రశాంతంగా సాగింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పని చేశాయి. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు వరంగల్ మహానగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ కూడలి నుంచి ములుగు క్రాస్ రోడ్డులోని జ్యోతిబా పూలే విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజు ఆధ్వర్యంలో హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహంనుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌కు చేరుకుని బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు వడ్లకొండ వేణుగోపాల్, దొడ్డిపల్లి రఘుపతి, బొనగాని యాదగిరి గౌడ్, తమ్మెల శోభారాణి, మూగల కుమార్ యాదవ్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం బాస్కర్, బీఆర్ఎస్ నాయకులు చింతం సదానందం, శోధన్, పులి రజనీకాంత్, పోలెపల్లి రామ్మూర్తి, ముత్తిక రాజు, శ్రీధర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్ రావు, నాయకులు తోట వెంకటేశ్వర్లు, రవీందర్, పోతుల శ్రీమాన్, విజయశ్రీ, సతీష్, బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్‌లో.. వరంగల్‌లో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ర్యాలీలు, రాస్తారోకోలు చేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా షాపులు మూసివేశాయి. వరంగల్ ఆర్టీసీ బస్‌స్టేషన్, వాణిజ్య రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. వరంగల్ వామపక్షాల నాయకులు హెడ్‌పోస్టాఫీస్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేశారు. ఎంసీపీఐ (యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్, సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి, సీపీఐ ఎంఎల్ (న్యూడెమొక్రసీ) జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, రఘుసాల సుమన్, సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి యాదగిరి, రాచర్ల బాలరాజు పాల్గొన్నారు. బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు ఆధ్వర్యంలో వరంగల్ శివనగర్‌లోని తమ్మెర భవన్ నుంచి సీపీఐ, బీసీ హక్కుల సాధన సమితి కార్యకర్తలు ప్రదర్శనగా బయల్దేరి అండర్ బ్రిడ్జి రోడ్డు, స్టేషన్ రోడ్డు, పోస్టాఫీస్ సెంటర్, వరంగల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సీపీఎం నాయకులు వరంగల్ పోస్టాఫీస్ సెంటర్ నుంచి వరంగల్ చౌరస్తా, బట్టలబజార్, బీట్ బజార్లో ప్రదర్శన నిర్వహించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు అరూరి రమేశ్, జిల్లా కార్యదర్శి రంగయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం, పోచమ్మమైదాన్, మండిబజార్, ఆర్ఎన్టీ రోడ్డు, వరంగల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు రాజనాల శ్రీ హరి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు బీసీ సంఘాలు, వివిధ పార్టీల ర్యాలీలు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ -
మానసిక దివ్యాంగులకు సత్వర న్యాయసేవలు
హనుమకొండ జిల్లా న్యాయమూర్తి డాక్టర్ పట్టాభిరామారావు హన్మకొండ అర్బన్: మానసిక దివ్యాంగులకు సత్వర నాయసహాయం అందించేందుకు మనో న్యాయ్ లీగల్ క్లినిక్‌లు ఎంతో ఉపయోగపడతాయని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కె.పట్టాభి రామారావు అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే అధ్యక్షత మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మనోన్యాయ్ లీగల్ సర్వీస్ క్లినిక్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మానసిక వికలాంగులకు న్యాయసేవలు ముఖ్యంగా సైకియాట్రిక్ సేవలు, ఆధార్, సోషల్ ఎంటైటిల్ సదుపాయాలు అందించేందుకు తగిన చర్యలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చేపడుతోందన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి, డీఎంహెచ్ఓ అప్పయ్య, అనితారెడ్డి, డాక్టర్ ఎస్. సాగ్నిక్ ముఖర్జీ, డాక్టర్ కె. ప్రహసిత్, సీడబ్ల్యూసీ సభ్యుడు సుధాకర్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్చార్జ్ ఎస్.ప్రవీణ్ కుమార్, మల్లికాంబ నిర్వాహకురాలు బండ రామలీల, పద్మ, శ్రీకాంత్. సీనియర్ న్యాయవాది గోపు వనజ పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌రోడ్డులో.. విద్యారణ్యపురి: కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌రోడ్డులోని శంకర్‌నగర్‌లో వారిధి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్‌ను జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి.అపర్ణదేవి శని వారం ప్రారంభించారు. న్యాయసేవలను వినియోగించుకోవాలని కోరారు. హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ క్షమాదేశ్‌పాండె, కమ్యూనిటీ మధ్యవర్తిత్వ వలంటీర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు. -
దాడులను ఖండిస్తున్నాం..
జనగామ: ప్రభుత్వం చేసే మంచి, చెడులను ప్రజలకు తెలియజేస్తూ, మనకు దారి చూపించే పత్రికలపై ఏపీ సర్కార్ తీరు సరికాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నాం. సమాజంలో పత్రికలే మార్గదర్శకంగా ఉండి మనల్ని నడిపిస్తున్నాయి. –పెండెల శ్రీనివాస్, గ్రామ పరిపాలన ఆఫీసర్, రాష్ట్ర నాయకుడు, జనగామ కేసుల నమోదు సరికాదుములుగు రూరల్: సాక్షి కార్యాలయాలపై ఏపీ ప్రభుత్వం దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రజ లకు తెలియజేసే పత్రికలపై దాడులు, ఎడిటర్‌పై కేసులు నమోదు చేయడం సరికాదు. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. – పోలు రాజు, టీఎన్జీఓ ములుగు జిల్లా అధ్యక్షుడు -
వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్ : మహా నగరంలో వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని మేయర్ గుండు సుధారాణి హెచ్చరించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో శనివారం ఆమె ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మేయర్ మాట్లాడుతూ దీపావళి పర్వదినం సందర్భంగా ప్రతీ లైటు వెలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరవాసులకు నీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా క్షేత్రస్థాయిలో లోపాలను అరికట్టాలన్నారు. అవసరం మేరకు నీటి సరఫరా జరగని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా అందించాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను సక్రమంగా నిర్వహించాలన్నారు. విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఉర్సు రంగ లీలా మైదానం జరిగే నరకసుర వధ కార్యక్రమానికి బల్దియా తరఫున విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ సత్యనారాయణ, ఈఈలు రవికుమార్, మహేందర్, సంతోశ్‌బాబు, మాధవీలత, డీఈలు రాజ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, రాగి శ్రీకాంత్ పాల్గొన్నారు. బాణసంచా దుకాణదారులు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాలి..నగరంలో బాణసంచా విక్రయదారులు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బాణసంచా దుకాణదారులు పాటించాల్సిన విధివిధానాలు, ఫైర్ సేఫ్టీ తదితర అంశాలపై శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అధికారులతో మేయర్ సమీక్షించి మాట్లాడారు. నగర వ్యాప్తంగా వరంగల్‌లో 3 ప్రాంతాల్లో, హనుమకొండ పరిధిలో 6 దుకాణాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయని తెలిపారు. ప్రతీ టపాసుల దుకాణం వద్ద అగ్నిమాపక పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. వరంగల్ అర్బన్‌లో 2,186, వరంగల్ రూరల్ 989 కాజీపేట అర్బన్ : వరంగల్ అర్బన్ పరిధిలోని 67 వైన్స్‌కు 2025–27 సంవత్సరానికి టెండర్లు పిలవగా శనివారం చివరి రోజు 2,186 దరఖాస్తులు వచ్చాయి. టెండర్ ప్రక్రియ ప్రారంభించిన నాటినుంచి శనివారం వరకు మద్యం వ్యాపారులు 3,621 దరఖాస్తులు అందజేశా రు. వరంగల్ రూరల్‌లోని 57 వైన్‌షాపులకు గా ను చివరిరోజు 989 దరఖాస్తులు రాగా, మొ త్తంగా 1,905 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. కాగా, టెండర్ దరఖాస్తుల ద్వారా వరంగల్ అర్బన్‌కు రూ.108 కోట్లు, వరంగల్ రూరల్‌కు రూ.57 కోట్ల ఆదాయం వచ్చింది. -
నేడు నరకాసుర వధ
ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి, వరంగల్ /ఖిలా వరంగల్: దీపావళి పండుగ సందర్భంగా వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఆదివారం నరకాసుర వధ ఉత్సవం జరగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాలతో డీసీపీలు, ఏసీపీ శుభం ప్రకాశ్ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నా యి. ప్రత్యేకంగా వాహన పార్కింగ్ స్థలాలు ఏర్పా టు చేశారు. పలు ప్రభుత్వ శాఖల సహకారంతో చేస్తున్న ఏర్పాట్లను శనివారం ఏఎస్పీ శుభ ప్రకాశ్, ఉత్సవకమిటీ అధ్యక్షుడు మరుపల్లి రవి, ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఏఈ సుకృత, తహసీల్దార్ ఇక్బాల్, ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ పరిశీలించారు. 23 ఏళ్లుగా.. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి ఆధ్వర్యంలో గత 23 ఏళ్లుగా నరకాసుర వధ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆదివారం కరీమాబాద్ ఉర్సు ప్రతాప్‌నగర్ నుంచి శ్రీకృష్ణ సత్యభామ ఉత్సవ మూర్తులు, పిల్లల వేషధారణతో భారీ ఊరేగింపుతో రంగలీల మైదానానికి చేరుకుంటారు. అక్కడే శ్రీకృష్ణ, సత్యభామ డిజిటల్ బొమ్మలను ఏర్పాటు చేయగా.. బాణసంచాలతో కాల్చే పక్రియను నేత్రపర్వంగా నిర్వహిస్తారు. గత ఏడాది 56 అడుగుల నరకాసుర ప్రతిమను ఏర్పాటు చేయగా.. ఈఏడాది 58అడుగుల నరకాసుర ప్రతిమను సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్రం 6గంటలకు వేదికపై ప్రత్యేక సాంస్కృతిక నృత్యాలు ప్రారంభమవుతాయని, రాత్రి 8గంటలకు నరకాసుర ప్రతిమను మంత్రి కొండా సురేఖ స్విచ్ ఆన్‌చేయగానే శక్తివంతమైన బాణసంచాతో దహనమవుతుందని నిర్వాహకులు తెలిపారు. విజయవంతంగా జరుపుకోవాలి ఉర్సుగుట్ట మైదానంలో నిర్వహించే నరకాసుర ప్రతిమ దహనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఆదేశాలప్రకారం వేదిక, బారీకేడ్లు నాలుగు వైపుల పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు చేపడుతున్నాం. – శుభం ప్రకాశ్ ఏఎస్పీ, వరంగల్ ఓరుగల్లు ప్రతిష్టను పెంచేలా ఏర్పాట్లు ఓరుగల్లు ప్రతిష్టతను మరింతగా పెంచేలా నరకాసుర వధ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఆదివారం సాయంత్రం 6గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయి. వీఐపీ, వీవీఐపీలకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశాం. కిలోమీటరు దూరంనుంచి వేడుకలను వీక్షించేలా ఎత్తయిన ప్రదేశంలో 58 అడుగుల నరకాసుర ప్రతిమ ఏర్పాటు చేశాం. – మరుపల్లి రవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడువరంగల్ రంగలీల మైదానంలో 58 అడుగుల ప్రతిమ ఏర్పాటు సాయంత్రం 6 గంటలనుంచి వేదికపై సాంస్కృతిక నృత్యాలు మంత్రి సురేఖ చేతులమీదుగా స్విచ్ ఆన్ చేసి దహనం ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ, ఏఎస్పీ -
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
కక్షసాధింపు చర్యలు మానుకోవాలినెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛను హరిస్తే సమాజానికి మేలు జరగదు. జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం సుపరిపాలన అనిపించుకోదు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదు. – ఎం.వివేక్, డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు..హన్మకొండ అర్బన్: ఏపీలో సాక్షి మీడియాపై అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. సాక్షి మీడియాను, సంస్థ ప్రతినిధులను, జర్నలిస్టులను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేయడం దుర్మార్గపు చర్య. పత్రికా స్వేచ్ఛను కాలరాయడమంటే ప్రజల పక్షాన మాట్లాడే గొంతుకను నొక్కడమే. – ఆకుల రాజేందర్, ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్, హనుమకొండ ఏపీ ప్రభుత్వానికి ఇది మంచిదికాదు ● సాక్షి దినపత్రిక, ఎడిటర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి ● ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ ఆంధరప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం తగదని, ఉద్దేశపూర్వకంగా సాక్షి దినపత్రికపై దాడులు, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని, ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు ఖండిస్తున్నారు. నిజాలను నిర్భయంగా రాస్తే అక్కడి పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పత్రికలు వారధి అనే విషయాన్ని మర్చిపోవద్దని సూచిస్తున్నారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు – సాక్షి నెట్వర్క్ -
ఎయిర్‌పోర్ట్‌తో పారిశ్రామికాభివృద్ధి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ● భూసేకరణపై అధికారులతో సమీక్ష న్యూశాయంపేట: వరంగల్‌లో ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రజల ఆకాంక్ష అని, హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా పేర్కొంటున్న వరంగల్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు మామునూరు ఎయిర్పోర్ట్ ఎంతో ఉపయోగపడుతుందని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. ఎయిర్పోర్ట్ భూసేకరణ పనుల పురోగతిపై ల్యాండ్ ఆక్విజేషన్ రిటైర్డ్ ఓఎస్డీ మనోహర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎయిర్పోర్ట్ మేనేజర్ తులసి మహాలక్ష్మి, లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు 220 ఎకరాల వ్యవసాయ భూమి సేకరణకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఎయిర్పోర్ట్ స్థలంలోని చెరువులు కుంటలు, విద్యుత్ హైపోల్స్, సెల్‌టవర్లు, ఎత్తుగా ఉన్న భవనాలు, చెట్లను గుర్తించి నివేదికలు అందజేయాలని సంబంధిత అధికారులను సత్యశారద ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ, వరంగల్ ఇన్చార్జ్ ఆర్డీఓ విజయలక్ష్మి, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, ఆర్డీఓ కార్యాలయ డీఏఏ ఫణికుమార్, ఎస్ఈ ఇరిగేషన్ వరంగల్ హెచ్వీ.రాంప్రసాద్, మిషన్ భగీరథ డీఈ జీవన్, ఎన్పీడీసీఎల్ ఏడీఈ చంద్రమౌళి, లీగల్ మెట్రాలజీ శ్రీని వాస్‌రావు, డీఎఫ్ఓ సృజనకుమారి, సర్వేయర్ రజిత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి న్యూశాయంపేట: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి ఆదేశించారు. వరంగల్ డివిజన్లో ధాన్యం కొనుగోలుపై సన్నాహక, శిక్షణను హనుమకొండ డీసీసీబీ భవన్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించారు. అధికారులు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు. -
మత్స్యశాఖకు దిక్కెవరు?
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ, వరంగల్ జిల్లాల మత్స్యశాఖ కార్యాలయాలకు పెద్ద దిక్కు కరువైంది. సుమారు ఏడాదిన్నర క్రితం హనుమకొండ డీఎఫ్ఓ డాక్టర్ విజయభారతి బదిలీ కావడంతో ఆ సీటు ఖాళీ అయిపోయింది. వరంగల్ డీఎఫ్ఓ నరేశ్‌నాయుడు బదిలీ కాగా, ఆయన స్థానంలో నాగమణి బాధ్యతలు చేపట్టారు. కాగా, హనుమకొండ ఖాళీగా ఉండడంతో మత్స్యశాఖ ఉన్నతాధికారులు నాగమణికి ఇన్చార్జ్ డీఎఫ్ఓ బాధ్యతలను అప్పగించారు. ఏడాదిన్నరగా రెండు జిల్లాల అధికారిగా కొనసాగుతున్న నాగమణి తాజాగా ఏసీబీ కేసులో అరెస్ట్ కావడంతో రెండు జిల్లాలకు అధికారులు లేకుండా పోయారు. ఉచిత చేప పిల్లల పంపిణీ ఎలా? ఏటా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ ఇప్పటికే ఆలస్యమైంది. గత నెల వరంగల్, హనుమకొండ జిల్లాలకు టెండర్లను ఆహ్వానించగా, బిడ్లు కూడా ఖరారైనట్లు ఇటీవల నాగమణి వెల్లడించారు. ఇప్పుడు ఆమె అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడంతో చేప పిల్లల పంపిణీపై ప్రభావం పడే అవకాశాలున్నాయని పలువురు మత్స్య సహకార సొసైటీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న హరీశ్ వరంగల్ ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్ ఈఏడాది ఆగస్టు 15న వరంగల్ కలెక్టర్ సత్యశారద, మేయర్ సుధారాణి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా అవా ర్డు అందుకున్నారు. ఆ ఉత్తమ ఉద్యోగి శుక్రవారం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధి కారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. డీఎఫ్ఓ నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్ ఏడాదిన్నరగా అవకాశం ఉన్న ప్రతీ అంశంలో అవినీతికి పాల్పడుతున్నారని మత్స్యశాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. లంచాల కోసం ప్రతి ఒక్కరినీ పీడించే వార ని బాహాటంగానే మాట్లాడుకోవడం వినిపించింది. ఏడాదిన్నర క్రితం హనుమకొండ డీఎఫ్ఓ బదిలీ ఇన్చార్జ్ డీఎఫ్ఓగా నాగమణి ఏసీబీకి చిక్కడంతో రెండు జిల్లాలు ఖాళీ -
నేటి బంద్ ఆరంభం మాత్రమే
హన్మకొండ: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం నేడు (శనివారం) తలపెట్టిన బంద్ ఆరంభం మాత్రమేనని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కే అంతిమ లక్ష్యం వరకు పోరాటం సాగుతుందన్నారు. బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్‌కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, బీసీ ఉద్యమాన్ని అడ్డుకుంటే మరో తెలంగాణ ఉద్యమం అవుతుందన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. అన్ని వర్గాలు సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓరుగల్లు వేదికగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అంబేడ్కర్ ఆలోచనా విధానంతో, గాంధీ మార్గంలో బీసీల హక్కుల సాధనకు ఉద్యమిస్తామన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, బీఆర్ఎస్ లీగల్ సెల్ బాధ్యుడు తాళ్లపెల్లి జనార్దన్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, బీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్ ముది రాజ్, కుసుమ లక్ష్మీనారాయణ, నార్లగిరి రమేశ్, శోభ్, రఘు, నరెడ్ల శ్రీధర్, పెరికారి శ్రీధర్ రావు, పానుగంటి శ్రీధర్, మూటిక రాజు యాదవ్, సారిక, పోలపెల్లి రామ్మూర్తి, సుహాస్ పాల్గొన్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కే వరకు పోరాటం బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి -
భక్తసేవాశ్రమంలో క్యూలైన్ల ఏర్పాటు
హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి రోడ్డులోని శ్రీధర్మశాస్తా అయ్యప్పస్వామి భక్తసేవాశ్రమంలో ఈనెల 22 నుంచి అయ్యప్ప దీక్షలు ప్రారంభం కానున్నట్లు అర్చకుడు గణపతిశర్మ తెలిపారు. కార్తీకమాసం సందర్భంగా దేవాలయ వ్యవస్థాపకుడు, గురుస్వామి టీఆర్ బాలస్రుబహ్మణ్యశర్మ ఆధ్వర్యంలో భక్తులకు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈనెల 18న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. భవానీనగర్, గోకుల్‌నగర్, హౌసింగ్‌బోర్డు కాలనీ, కేఎల్ఎన్ రెడ్డి కాలనీ, సుమంగళి ఫంక్షన్‌హాల్, అశోకా కాలనీ, విద్యానగర్, రాంనగర్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, ప్రకాశ్‌రెడ్డిపేట, పోస్టల్ కాలనీ, ఎఫ్‌సీఐ కాలనీ, విద్యుత్‌నగర్ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, నయీంనగర్ మాతాబార్, తోటబడి బ్యాక్ సైడ్ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, కొత్తూరు మార్కెట్, కుమార్‌పల్లి, తోటబడి బ్యాక్‌సైడ్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, అదేవిధంగా సోమిడి, వెస్ట్‌సిటీ సబ్‌స్టేషన్ ప్రాంతంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్‌లో.. వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. అబ్బనికుంట, ఎస్ఆర్టీ, టీఆర్టీ కాలనీ, యాకూబ్పుర, లేబర్ కాలనీ, 100 ఫీట్ల రోడ్డు, నర్సంపేట రోడ్డు ప్రాంతాల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లోని యార్డులు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతీరోజు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కాంట్రాక్టర్‌ను మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు ఉప్పుల శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం మార్కెట్‌కు వచ్చిన ఆయన యార్డులను సందర్శించారు. పత్తి యార్డులో కొంత అపరిశుభ్రంగా ఉండడంతో సంబంధిత కాంట్రాక్టర్‌ను పిలిపించి మాట్లాడారు. యార్డులు శుభ్రంగా ఉండాలని సూచించారు. అనంతరం ఆయన పత్తిలో నాణ్యత, తేమ శాతం ఎంతవరకు ఉందని పర్యవేక్షకులను అడిగి తెలసుకున్నారు. రైతులు, వ్యాపారులు, మార్కెట్ సిబ్బంది, కార్మికులకు సదుపాయాలు కల్పించాలని సూచించారు. పత్తి యార్డులో అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. కార్యక్రమంలో గ్రేడ్–2 కార్యదర్శులు ఎస్.రాము, జి.అంజిత్‌రావు, సహాయ కార్యదర్శి జి.రాజేందర్, మార్కెట్ ఉద్యోగులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లా (వరంగల్ అర్బన్)లోని 67 వైన్‌షాపులకు శుక్రవారం రాత్రి 9:35 గంటలకు 895 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటి వరకు 1,435 దరఖాస్తులు వచ్చాయి. కాగా, శనివారంతో దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. గత టెండర్లలో 5,859 దరఖాస్తులకు రూ.117 కోట్ల ఆదాయం ఎక్సైజ్ ఖజానాకు వచ్చింది. 2025–27 సంవత్సరం టెండర్ల ప్రక్రియలో గత టార్గెట్ చేరుకుంటుందా లేదా? ప్రభుత్వం దరఖాస్తుల గడువు పొడిగిస్తుందా? అని వేచి చూడాలి. -
ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత వాసుదేవరావు అలియాస్ ఆశన్న
శనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షిప్రతినిధి, వరంగల్: దండకారణ్యంలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. బుధవారం ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట 61 మంది సహచరులతో ఆయుధాలతో లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు, డీకేఎస్జెడ్సీ ప్రతినిధి తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ శుక్రవారం అనుచరులతో అడవిబాటను వదిలారు. 208 మంది (110 మంది మహిళలు, 98 మంది పురుషులు)తో కలిసి 153 ఆయుధాలతో ఆయన జగ్దల్పూర్లో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లో భారీగా మావోయిస్టులు లొంగిపోయినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. కాగా.. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఇంద్రావతి ఏరియాను కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఆశన్న కార్యక్రమాలు కొనసాగించారు. చర్చల కోసం ప్రయత్నించి.. ‘ఆపరేషన్ కగార్’ ఉధృతం కావడంతో చాలామంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఈనేపథ్యంలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామ ని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట మార్చి 28న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒక దశలో ఓకే అన్నప్పటికీ.. తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా నో చెప్పారు. ఆ తర్వాత మే నెలలో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న చర్చలను ప్రతిపాదిస్తూ ఛత్తీస్‌గఢ్‌లోని ఓ మీడియా చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, ప్రజా సంఘాలు చొర వ చూపాలని ఆయన కోరారు. అయినప్పటికీ దండకారణ్యంలో పోలీస్ కూంబింగ్ కొనసాగి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్ సహా పలువురు అగ్రనాయకులు, కేడర్ ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఇక చర్చల ప్రతిపాదనలతో ఫలితం లేదనే భావనతోపాటు పలు కారణాలతో లొంగుబాటును ఎంచుకున్న కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అ భయ్, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ రూపే శ్ సహచరులు, ఆయుధాలతో సరెండర్ అయ్యారు. మావోయిస్టు నేత తాతతో కలిసి పనిచేసిన ఆశన్న 1993–94లో అన్నసాగర్ ఏరియా డిప్యూటీ కమాండర్‌గా, కమాండర్‌గా పనిచేశారు. శేషగిరిరావు అలియాస్ గోపన్నతో కలిసి పనిచేసిన ఆయన నల్లగొండ జిల్లాలోనూ కొంతకాలం దళనేతగా ఉన్నారు. ఆతర్వాత అనతి కాలంలోనే 1999లో పీపుల్స్‌వార్ పార్టీ నాయకత్వం యాక్షన్ టీంకు ఇన్చార్జ్గా నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక యాక్షన్లకు ఆశన్న నాయకత్వం వహించినట్లు పోలీసు రికార్డులు నమోదయ్యాయి. 2000 సంవత్సరంలో అప్పటి హోం మంత్రి మాధవరెడ్డి కారును పేల్చి చంపిన ఘటనలో కీలకమని అప్పట్లోనే పోలీసులు ప్రకటించారు. 2003లో అలిపిరిలో చంద్రబాబు కాన్వాయ్‌ని క్లైమోర్మైన్ పేల్చిన ఘటనతోపాటు హైదరాబాద్ సంజీవరెడ్డినగర్‌లో ఐపీఎస్ అధికారి ఉమేశ్‌చంద్రను పట్టపగలే కాల్చిచంపిన ఘటనకు ఈయనే నాయకత్వం వహించినట్లు రికార్డులున్నాయి. ఆ తర్వాత నిర్బంధం పెరగడంతోపాటు ఉద్యమ నిర్మాణంలో భాగంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు, దండకారణ్యంలో వివిధ కేడర్లలో పనిచేసిన ఆశన్న కేంద్ర మిలటరీ కమిషన్‌కు కూడా కొంతకాలం ఇన్చార్జ్గా పనిచేసినట్లు ప్రచారం ఉంది. కాగా, దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నేత వరకు ఎదిగి.. ఛత్తీస్‌గఢ్, సౌత్‌బస్తర్, మాడ్ డివిజన్లలో కీలకంగా వ్యవహరించిన ఆయన శుక్రవారం ఉద్యమ సహచరులతో కలిసి లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది.తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నది ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలం లక్ష్మీదేవిపేట శివారు పోలోనిపల్లి (నర్సింగాపూర్) స్వగ్రామం. తల్లి సరోజన, తండ్రి భిక్షపతిరావు, తమ్ముడు సహదేవరావు, అక్క సౌమ్య. తండ్రి భిక్షపతిరావు 2012లో గొంతు క్యాన్సర్‌తో మృతిచెందగా, తమ్ముడు సహదేవరావు రైల్వేశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తూ హనుమకొండలోని గోపాల్‌పూర్‌లో స్థిరపడినట్లు బంధువులు తెలిపారు. కాగా, వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం కాజీపేటలోని సెయింట్‌గ్యాబ్రియల్ స్కూల్లో సెకండరీ విద్యనభ్యసించారు. భువనగిరిలో ఐటీఐ కూడా చేసిన ఆయన, కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ.. రాడికల్ స్టూడెంట్ యూనియన్‌కు (ఆర్ఎస్యూ) నాయకత్వం వహించారు. ఆతర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1991 నుంచి ఆర్ఎస్యూలో పని చేసి అజ్ఞాతంలోకి వెళ్లాక దళ సభ్యుడి నుంచి నాలుగున్నర దశాబ్దాల్లో కేంద్ర కమిటీ అగ్రనేత వరకు ఎదిగారు. 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి.. నాలుగున్నర దశాబ్దాలు అడవిలో.. దళసభ్యుడి నుంచి కేంద్ర కమిటీ వరకు ఆశన్న ఉద్యమ ప్రస్థానం -
ప్రజల గొంతుకపై ఆంక్షలు సరికాదు
వరంగల్/న్యూశాయంపేట: ప్రభుత్వాలు, ప్రజలకు వారధిగా ఉన్న పత్రికలపై ఆంక్షలు విధించడం సరికాదని పలువురు ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ‘సాక్షి’ మీడియాపై అనుసరిస్తున్న వైఖరి, ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు పలువురు పాత్రికేయులపై అక్రమంగా కేసులు పెట్టి వేధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేశారు. ఈసందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన విషయాలపై కథనాలు రాసినా, ప్రచురించినా ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉంటే వివరణ కోరాలే తప్ప కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అన్నారు. వరంగల్ ‘సాక్షి’ బ్యూరో ఇన్చార్జ్ గడ్డం రాజిరెడ్డి మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను ఏపీ ప్రభుత్వం హరిస్తోందని, ‘సాక్షి’ చీఫ్ ఎడిటర్ ధనంజయరెడ్డిపై పెట్టిన కేసులను భేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ‘సాక్షి’ మీడియాపై అనుసరిస్తున్న దమననీతికి వ్యతిరేకంగా ప్రజా, ఉద్యోగ సంఘాలతో ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ వాంకే శ్రీనివాస్, జర్నలిస్టు సంఘాల నా యకులు నల్లాల బుచ్చిరెడ్డి, పొడిశెట్టి విష్ణువర్ధన్, కంకణాల సంతోశ్, సాయిరాం, బోల్ల అ మర్, అలువాల సదాశివుడు, కొల్ల కృష్ణకుమార్, అహ్మద్, రాధాకృష్ణ, డి.రమేశ్, జి.రమేశ్, ఎ.నరేందర్, వెంకట్, జాఫర్, నరేశ్, సునేందర్, రవి, అనిల్, సబ్ ఎడిటర్లు ఓంకార్, ఉమామహేశ్, బోనాల రమేశ్, బండి రాజు, రాంచందర్, డి.రాజు, అశోక్, మహ్మద్ సాజీత్, దాసరి బాబు, సంపెట శ్రవణ్, శివ, సంపెట వెంకటేశ్వర్లు, వీకే రమేశ్ పాల్గొన్నారు.సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అత్యంత దారుణం. ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంటాయి. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను బయటపెడుతుంటాయి. ఇది సహించలేని ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం, కాలరాయడం తీవ్రంగా ఖండిస్తున్నా. సాక్షి మీడియాపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. సాక్షి పత్రిక, ఎడిటర్, సిబ్బందిపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేయడాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలని కోరుతున్నా. – తాటిపాముల వెంకట్రాములు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు● ‘సాక్షి’ మీడియా, ఎడిటర్‌పై పెట్టిన కేసులు ఎత్తివేయాలి జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా -
రేస్‌వాక్‌లో రికార్డు బ్రేక్..
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కొనసాగుతున్న జాతీయస్థాయి 5వ అథ్లెటిక్స్ అండర్–23 చాంపియన్‌షిప్ పోటీల్లో అథ్లెట్లు శుక్రవారం అదే జోరు ప్రదర్శించారు. రెండో రోజు 30 ఈవెంట్లలో పోటీలు నిర్వహించగా 13 ఈవెంట్లలో ఫైనల్స్ పూర్తయ్యాయి. అథ్లెటిక్స్ పోటీల్లో 20వేల మీటర్ల పురుషుల రేస్‌వాక్‌లో ఆర్మీ విభాగానికి చెందిన సచిన్ బొహరా (1:26:59:83) నిమిషాలతో కొత్త రికార్డును సృష్టించాడు. 2022లో రాజస్తాన్‌కు చెందిన సంజయ్‌కుమార్ (1:27:14) నిమిషాల్లో చేరి విజేతగా నిలిచాడు. సరికొత్తగా ఆ రికార్డును బ్రేక్ చేయడం సంతోషంగా ఉందని సచిన్ తెలిపాడు. పోటీల ఏర్పాట్లను తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, అధ్యక్షుడు స్టాన్లీజోన్స్, డీవైఎస్ఓ గుగులోతు అశోక్‌కుమార్ పర్యవేక్షించారు. పోటీల నిర్వహణలో టెక్నికల్ అఫిషి యల్స్, కోచ్‌లు వాసుదేవరావు, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులు.. మహిళల 20 వేల మీటర్ల రేస్‌వాక్‌లో మహిమాచౌదరి(రాజస్తాన్) గోల్డ్, ఆర్తి(హరియాణా) సిల్వర్, కోమల్పాల్(మధ్యప్రదేశ్) బ్రాంజ్ మెడల్ సాధించారు. పురుషుల 20 వేల మీటర్ల రేస్‌వాక్: సచిన్బోహ్రా(ఆర్మీ)గోల్డ్, రోషన్‌కుమార్(ఝార్ఖండ్) సిల్వర్, హిమాన్షుకుమార్(ఉత్తరాఖండ్) బ్రాంజ్, 100 మీటర్ల హార్డిల్స్ మహిళల విభాగం: ప్రంజాలిరాలిపాటి(మహారాష్ట్ర)గోల్డ్, అక్షిదాస్ (తమిళనాడు) సిల్వర్, శ్రీయారాజేష్(కర్ణాటక) బ్రాంజ్ మెడల్ కై వసం చేసుకున్నారు. డెకాథ్లాన్ పురుషుల విభాగం: కౌశల్‌కుమార్(మహారాష్ట్ర) గోల్డ్, అభిజిత్భోసలే(ఎయిర్‌ఫోర్స్) సిల్వర్, హరీశ్ ఎస్(తమిళనాడు) బ్రాంజ్ గెలుపొందారు. పురుషుల 1,500 మీటర్ల పరుగు: ప్రభుజోత్సింగ్(పంజాబ్) గోల్డ్, వికాష్(హరియా ణా) సిల్వర్, ఆకాశ్భాటి(ఉత్తరప్రదేశ్) బ్రాంజ్ మెడల్ సాధించారు. డిస్కస్‌త్రో పురుషుల విభాగం: ఉజ్జవల్(జేఎస్‌డబ్ల్యూ) గోల్డ్, నాగేంద్రఅన్నప్ప(కర్ణాటక)సిల్వర్, రితిక్(ఎన్సీఓఈ(పటియాల)బ్రాంజ్ మెడల్ సాధించారు. పురుషుల 400 మీటర్ల పరుగు : తరణదీప్సింగ్(పోలీస్స్పోర్ట్స్ కంట్రోల్) గోల్డ్, సేతుమిశ్రా(బిహార్)సిల్వర్, అంకుల్, ఎన్సీఓఈ(త్రివేండ్రం), బ్రాంజ్ పతకాలు సాధించారు. పోల్‌వాల్ట్ మహిళల విభాగం: కార్తీక వి( తమిళనాడు) గోల్డ్, నేఖ ఎల్దో ఎన్సీఓఈ(త్రివేండ్రం) సిల్వర్, విదువిజయ్కుమార్(తమిళనాడు) బ్రాంజ్ మెడల్ సాధించారు. 110 మీటర్ల హార్డిల్స్ పురుషుల విభాగం: క్రిషిక్ ఎం(ఐఏసీఎల్) గోల్డ్, రాహిల్సఖీర్(కేరళ) సిల్వర్, రతీష్దుహీషా(రిలయన్స్) బ్రాంజ్, లాంగ్‌జంప్ పురుషుల విభాగం: అనురాగ్ సీవీ(కేరళ)గోల్డ్, శారోన్దూస్(తమిళనాడు)సిల్వర్, ఆర్యన్చౌదరి (ఉత్తరప్రదేశ్) బ్రాంజ్, హైజంప్ పురుషుల విభాగం: శివ్భగవాన్(హరియాణా) గోల్డ్, సుదీప్(కర్ణాటక) సిల్వర్, ఎండీ అలీ(వెస్ట్‌బెంగాల్) బ్రాంజ్, షాట్‌పుట్ పురుషుల : అతుల్(రిలయన్స్) గోల్డ్, అనురాగ్‌సింగ్ (రైల్వేస్పోర్ట్స్) సిల్వర్, నిఖిలేశ్(హరియాణా) బ్రాంజ్, 400 మీటర్ల పరుగు మహిళల విభాగం: ఆయుష్(ఉత్తరప్రదేశ్) గోల్డ్, ప్రియ(కర్ణాటక) సిల్వర్, సండ్రామోల్సాబు ఎన్సీఓఈ(త్రివేండ్రం)బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు.జేఎన్ఎస్లో రెండో రోజు అథ్లెట్ల సందడి 13 ఈవెంట్లలో పోటీలు పూర్తి -
ఏసీబీ వలలో అవినీతి చేపలు
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని ములుగు రోడ్ సమీపంలో గల వరంగల్ జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో అవినీతి చేపలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆఫీసుకు వచ్చిన మత్స్యకారుల్లో కలిసిపోయి అవినీతి చేపను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సినిమా సీన్‌ను తలపించే ఘటనతో మత్స్యశాఖ కార్యాలయ సిబ్బందికి అసలు ఏం జరుగుతుందో అర్ధంకాక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు మత్స్యశాఖ ఉద్యోగుల్లో ప్రకంపనలు లేపాయి. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాధన్నపేట గ్రామ మత్స్యసహకార సంఘంలో నూతన సభ్యులను చేర్చుకోవడం కోసం 2023లో అప్పుటి ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్, ప్రస్తుతం జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణికి సొసైటీ తరఫున దరఖాస్తు చేశారు. ఏడాది క్రితం సొసైటీ ప్రెసిడెంట్ తమ ఫైల్ అప్రూవల్ ఎప్పడు అవుతుందని ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్‌ను అడిగితే రూ.80 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇదే విషయాన్ని డీఎఫ్ఓ నాగమణి దృష్టికి తీసుకెళ్లగా ఆమె సైతం హరీశ్ చెప్పిన మొత్తాన్ని ఇస్తేనే పని అవుతుందని చెప్పారు. రెండు సంవత్సరాలుగా మత్స్యశాఖ అధికారి చుట్టూ తిరిగిన మాధన్నపేట సొసైటీ ప్రెసిడెంట్, సభ్యులు విసిగిపోయారు. దీంతో హనుమకొండలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించగా శుక్రవారం మత్స్యశాఖ కార్యాలయానికి వచ్చి.. ప్రణాళిక ప్రకారం ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్‌కు సొసైటీ ప్రెసిడెంట్ రూ.50 వేలు, డైరెక్టర్ రూ.30 వేలు లంచం ఇస్తుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హరీశ్‌ను విచారించగా తనకేమీ తెలియదని, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి తీసుకోమని చెబితేనే తీసుకున్నానని ఏసీ బీ అధికారుల ముందు చెప్పాడు. దీంతో ఫీల్డ్ ఆఫీ సర్ హరీష్, డీఎఫ్ఓ నాగమణి లను తదుపరి విచా రణ కోసం నేడు(శనివారం) ఏసీబీ కోర్టులో హాజ రుపరచనున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. సొసైటీ సభ్యత్వం కోసం లంచం డిమాండ్ రూ.80 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ ఫీల్డ్ ఆఫీసర్ వరంగల్ మత్స్యశాఖ ఆఫీసులో ఘటన -
భవన మరమ్మతు పనులు పూర్తిచేయాలి
కాళోజీ సెంటర్: వరంగల్ ఎల్బీ నగర్‌లోని భవిత సెంటర్‌ను భవిత వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కట్ల శ్రీనివాస్‌తో కలిసి డీఈఓ రంగయ్య నాయుడు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మౌలాలి ప్రాథమిక పాఠశాలలోని భవిత సెంటర్లో జరుగుతున్న భవన మరమ్మతు పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల (సీడబ్ల్యూఎస్ఎన్)తో కొద్దిసేపు మాట్లాడారు. మౌ లాలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మాసూమ్ అలీ పాఠశాల ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, ఉపాధ్యాయుల సెలవు పత్రాలు, విద్యార్థుల పురోగతి, తల్లిదండ్రుల సమావేశాలు వంటి అంశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం జయబాల రెడ్డి, ప్రాథమిక పాఠశాల మౌలాలి హెచ్ఎం జోసెఫ్, భవిత సెంటర్ స మ్మిళిత విద్యా ఉపాధ్యాయులు స్వాతి పాల్గొన్నారు. వరంగల్ డీఈఓ రంగయ్య నాయుడు -
మినీ బ్యాంకులో రూ.59 వేలు గోల్మాల్
నర్సంపేట రూరల్: ఎస్బీఐ మినీ బ్యాంక్ (వినియోగదారుల సేవా కేంద్రం)లో డబ్బులు గోల్మాల్ అయిన ఘటన చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అడ్డగట్ల స్రవంతి.. గ్రామంలో పది సంవత్సరాలుగా ఎస్బీఐ మినీ బ్యాంక్‌ను నడిపిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఆరెల్లి సాంబయ్య ప్రతి ఏడాది రూ.1,506 చొప్పున 21 సంవత్సరాలపాటు ఎల్ఐసీ ఇన్సూరెన్స్‌ను చెల్లించాడు. ఈ ఏడాది మార్చి 19వ తేదీన ఎల్ఐసీకి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు రూ.59,581 తన అకౌంట్లో జమ అయ్యాయి. నగదు జమ అయ్యాయా.. లేదా.. లేదా అని తెలుసుకునేందుకు స్థానిక ఎస్బీఐ మినీ బ్యాంక్‌కు వెళ్లాడు. వెళ్లినప్పుడల్లా మినీ బ్యాంక్ నిర్వాహకురాలు స్రవంతి వేలిముద్ర వేయించుకొని చెక్ చేసినట్లుగా నటించి డబ్బులు పడలేదని చెప్పడంతో వెనుదిరిగాడు. ఎన్నిసార్లు చెక్ చేసినా ఫలితం లేకపోవడంతో బాధితుడు బ్యాంక్‌కు వెళ్లి మినీ స్టేట్మెంట్ తీసుకోవడంతో బండారం బయటపడింది. మార్చి 19వ తేదీన ఎల్ఐసీకి సంబంధించి రూ.59,581 జమ అయ్యాయని తేలింది. మార్చి 23వ తేదిన రూ. 29 వేలు, ఏప్రిల్ 4వ తేదీన రూ.30 వేలు మొత్తం రూ. 59 వేలు డ్రా చేసినట్లు ఉండడంతో లబోదిబోమంటూ వెళ్లి మినీబ్యాంక్ నిర్వాహకురాలిని నిలదీశాడు. అప్పుడే వేలిముద్ర వేసి డబ్బులు డ్రా చేసుకున్నావని నిర్వాహకురాలు చెప్పడంతో సాంబయ్య అవాక్కయ్యాడు. నా డబ్బులు నాకు ఇప్పించాలని కోరుతూ బాధితుడు మినీబ్యాంక్ ఎదుట కుటుంబ సభ్యులతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు వచ్చి మినీ బ్యాంక్ నిర్వాహకురాలిని నిలదీయగా ఏం చేసుకుంటారో.. చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుందని, తక్షణమే ఆమైపె చర్యలు తీసుకొని బాధితుడికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయమై ఎస్సై రాజేశ్‌రెడ్డిని వివరణకోరగా.. బాధితుడి నుంచి ఫిర్యాదు అందిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మినీబ్యాంక్ నిర్వాహకురాలు స్రవంతిని వివరణ కోరగా ఆరెల్లి సాంబయ్యకు ఎల్ఐసీ ఇన్సూరెన్స్ డబ్బులు రాగానే రెండు దఫాలుగా వేలిముద్ర వేసి రూ.59 వేలు డ్రా చేసి ఇచ్చానని, నగదు ఇచ్చే క్రమంలో మా బుక్‌లో సంతకాలు సైతం చేయించానని, కావా లనే డబ్బులు ఇవ్వలేదని సాంబయ్య తప్పుడు ఆరోపణలు చేస్తున్నడని చెప్పడం కొసమెరుపు. వేలిముద్ర పెట్టించుకుని స్వాహా చేసిన ఎస్బీఐ మినీ బ్యాంక్ ఆర్గనైజర్ లబోదిబోమంటున్న బాధితుడు -
రామప్ప కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పాలి
వెంకటాపురం(ఎం): కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో ప్రపంచస్థాయిలో రామప్పకు ప్రత్యేక గుర్తింపు లభించిందని, రామప్ప కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని మాజీ డీజీపీ రతన్ వలంటీర్లకు పిలుపునిచ్చారు. రామప్పలో పది రోజులుగా జరుగుతున్న వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంపు శుక్రవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ప్రొఫెసర్ పాండురంగారావు అధ్యక్షత వహించగా మాజీ డీజీపీ రతన్‌తోపాటు రాష్ట్ర ఆర్కియాలజికల్ అండ్ మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలోని 13 రాష్ట్రాల నుంచి 35 మంది, ఇరాన్ నుంచి ముగ్గురు వచ్చి శిక్షణ తీసుకోవడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తుందన్నారు. 13వ శతాబ్దంలో కాకతీయులు రామప్ప ఆలయాన్ని అద్భుతంగా నిర్మించడంతోనే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందన్నారు. అనంతరం కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ తరపున వలంటీర్లకు సర్టిఫికెట్లు, మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో క్యాంపు కోఆర్డినేటర్ జనగాం శ్రీధర్‌రావు, ఆసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, గైడ్లు గోరంట్ల విజయ్‌కుమార్, తాడబోయిన వెంకటేష్, యోగా గురువు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ డీజీపీ రతన్ రామప్పలో ముగిసిన వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంప్ -
వరంగల్ మార్కెట్‌కు సెలవులు
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సెలువులు ఉన్నందున మార్కెట్లో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని ఈవిషయాన్ని రైతులు, వ్యాపారులు, గుమస్తా, దడవాయి, కార్మికులు గమనించాలని మార్కెట్ కమిటీ కార్యదర్శి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18వ తేదీ (శనివారం)వారంతపు యార్డు బంద్, 19న (ఆదివారం)వారంతపు సెలవు, 20న(సోమవారం) దీపావళి పండుగ(ప్రభుత్వ సెలవు), 21న (మంగళవారం) అమావాస్య కావడంతో వరసగా మార్కెట్ బంద్ ఉంటుందని, బుధవారం 22వ తేదీన మార్కెట్ పునఃప్రారంభం అవుతుందని తెలిపారు. రైతులు తమ పంట ఉత్పత్తులను సెలవు దినాల్లో మార్కెట్‌కు తీసుకురావొద్దని సూచించారు. కేయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా కేయూ క్యాంపస్: రాష్ట్రంలో బీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నేడు(శనివారం) కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన ఎల్ఎల్బీ, బీటెక్, ఎంఎస్సీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎంటెక్, దూరవిద్య ఎంఎల్ఐఎస్సీ పరీక్షలను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. మిగితా పరీక్షలు టైంటేబుల్ ప్రకారం జరుగుతాయని విద్యార్థులు గమనించాలని తెలిపారు. పూర్తి వివరాలకోసం www.kakatiya.ac.inలో చూడాలని కోరారు. మణికంఠ కాలనీలో చోరీవరంగల్: వరంగల్ 14వ డివిజన్ ఏనుమాముల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుందరయ్యనగర్ మణికంఠకాలనీలో శుక్రవారం మధ్యాహ్నం ఓ ఇంటిలో చోరీ జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సమాచారం తెలిసిన వెంటనే సీఐ సురేశ్, డాగ్ స్క్వాడ్‌తో వెళ్లి ఇంటిని పరిశీలించినట్లు తెలిసింది. ఈవిషయమై సీఐని వివరణ కోరగా బంగారం, నగదు దోచుకుపోయినట్లు నిర్ధారణ అయ్యిందని, ఇంటి యజమాని లేకపోవడంతో ఎంతపోయిందన్న వివరాలు తెలియలేదన్నారు. బాధితుడు రాత్రి 7 గంటల వరకు ఫిర్యాదు చేయలేదు. తాళం వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్‌గా పెట్టుకున్నందున ఎవరైనా ఊరికి వెళితే సమాచారం అందించాలని సీఐ కోరారు. -
చికిత్స పొందుతున్న యువకుడి మృతి
ఐనవోలు: ప్రేమించిన యువతి తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రాంనగర్ గ్రామానికి చెందిన యాకర ప్రమీల– బాబుల చిన్న కుమారుడు యాకర హరిబాబు(27) డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల హరిబాబు ఓ యువతిని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న సదరు యువతి తల్లిదండ్రులు హరిబాబును దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన హరిబాబు ఈ నెల 12న రాంనగర్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హరిబాబును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడి మేనమామ కలకోట రత్నం ఫిర్యాదు మేరకు యువకుడు ప్రేమించిన అమ్మాయి, వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ వెల్లడించారు. -
బస్సు పోలీస్ స్టేషన్‌కు పోనివ్వండి
కురవి: ‘నా ఫోన్ పోయింది.. బస్సును పోలీస్ స్టేష న్కు పోనివ్వండి..’ అంటూ ఆర్టీసీ బస్సులో ఓ ప్ర యాణికుడు హల్చల్ చేశాడు. వివరాలిలా ఉన్నా యి.. శుక్రవారం ఓ యువకుడు ఖమ్మం వెళ్లేందుకు మానుకోట డిపో ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కాసేటికి అతని సెల్‌ఫోన్ పోయిందని బస్సులో వెతికాడు. ఫోన్ దొరక్కపోవడంతో కండక్టర్, డ్రైవర్‌తో ఫోన్ పోయిందని బస్సును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాలని వాదించాడు. డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లగా.. తన ఫోన్ పోయిందని.. చెక్ చేయాలని ప్రయాణికుడు పోలీసులను కోరాడు. చెక్ చేయడం కుదరదని, ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని తెలిపారు. కానీ, ప్రయాణికుడు ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయాడు. సెల్‌ఫోన్ పోయిందని ప్రయాణికుడి హల్చల్ సముదాయించి పంపించిన పోలీసులు -
అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమాలు
కేయూ క్యాంపస్: సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా, కామన్ విద్యావిధానం కోసం ఎంతోమంది ఉద్యమించి తమ ప్రాణాలు కోల్పోయారని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ అన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో జరగనున్న పీడీఎస్‌యూ మహాసభలను విజయవంతం చేసేందుకు కేయూ ఫార్మసీ కళాశాలలో కమలమ్మ హాల్లో శుక్రవారం నిర్వహించిన ఆహ్వాన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని విధ్వంసం చేస్తున్నాయన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా పోరాడాలన్నారు. పీడీఎస్‌యూ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కడారి భోగేశ్వర్, రిటైర్డ్ హెచ్ఎం రాంబ్రహ్మం, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేశ్ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ శ్రీకాంత్, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం అజయ్, ఎం.మహేశ్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, మంద నవీన్, ప్రణయ్‌కుమార్, కోశాధికారి రాణాప్రతాప్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దీపాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడిగా (హెచ్ఆర్ఎఫ్) జీవన్‌కుమార్, అధ్యక్షుడిగా కేయూ రిటైర్డ్ ఆచార్యులు కాత్యాయనీవిద్మహే, ప్రధాన కార్యదర్శిగా మెస శ్రీనివాస్, కోశాఽధికారిగా బొడపెల్లి అజయ్‌కుమార్ ఎన్నికయ్యారు. మొత్తం 200 మంది సభ్యులతో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ -
బాణసంచా వ్యాపారంలో భద్రత పాటించాలి
వరంగల్ క్రైం : బాణసంచా విక్రయ సమయాల్లో భద్రతా ప్రమాణాలను పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ విక్రయదారులకు సూచించారు. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ శుక్రవారం కమిషనరేట్ పరిధిలోని బాణాసంచా విక్రయదారులతో వరంగల్ పోలీస్ కమిషనర్ కమిషనరేట్ కార్యాలయములో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. బాణాసంచా విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, అ నుమతుల కోసం వ్యాపారస్తులు ముందుగా అగ్నిమాప క విభాగం అధికారుల నుంచి ఎన్ఓసీ పొందాలన్నారు. అలాగే వ్యాపారస్తులు స్థల యజమాని నుంచి అనుమతి పత్రాన్ని పొందాలన్నారు. రూ.800 ప్రభుత్వ బ్యాంక్ చలాన్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. విక్రయాలు జరిపే ప్రదేశంలో అగ్ని ప్రమాద నివారణకు వినియోగించే ఇసుక, నీరు, ఇతర అగ్ని ప్రమాద నిరోధక సాధనాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గత అనుభవనాలను దృష్టిలో ఉంచుకొని వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బాణాసంచా వ్యాపారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే బాణాసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, పెద్దలు పిల్లల వద్ద ఉండాలన్నారు. సమావేశంలో డీసీపీలు షేక్ సలీమా, అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారులు సుదర్శన్ రెడ్డి, రేమాండ్ బాబు, శ్రీధర్ రెడ్డి, అదనపు డీసీపీ రవి, ఏఎస్పీ శుభం, ఏసీపీ జితేందర్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నర్సింహారావులు, ఇన్స్పెక్టర్లు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ -
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ హసన్‌పర్తి: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ను గురువారం సీపీ సందర్శించారు. ఈసందర్భంగా పోలీస్‌స్టేషన్ ఆవరణను పరిశీలించి స్టేషన్ పరిఽధిలోని సమస్యాత్మక గ్రామాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏయే గ్రామాల నుంచి అధికంగా ఫిర్యాదులు నమోదవుతున్నాయని, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తుల వివరాలతో పాటు స్టేషన్ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి తెలుసుకున్నారు. హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని స్టేషన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సిబ్బందికి సూచించారు. తొలుత సీపీకి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ పశాంత్రెడ్డి, స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్సై దేవేందర్, రవి పాల్గొన్నారు. -
20న లక్ష్మీ పూజలు, 21న నోములు
హన్మకొండ కల్చరల్: ఈనెల 20న (సోమవారం) ఉదయం మంగళ హారతులిచ్చి, సాయంత్రం ధనలక్ష్మి పూజలు నిర్వహించి దీపావళి పండుగను జరుపుకోవాలని, 21న మంగళవారం కేదారేశ్వర నోములు నిర్వహించుకోవాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, వేయిస్తంభాల ఆలయ అర్చకుడు గంగు మణికంఠ అవధాని, వరంగల్ రాజరాజేశ్వరీదేవి దేవాలయం అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ, ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ గ్రామం శ్రీపశుపతినాథ్ దేవాలయ అర్చకుడు సదానీరంజన్ సిద్ధాంతి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం రోజున సూర్యోదయ సమయానికి ఉన్న అమావాస్య తిథిని ప్రామాణికంగా తీసుకుని కేదారేశ్వర వ్రతాలు నిర్వహించుకోవచ్చని బుధవారం (అక్టోబర్ 22)న నోము ఎత్తుకోవచ్చని తెలిపారు. ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం లేని కారణంగా కొత్త నోములు చేపట్టవద్దని, పడిపోయిన నోములు చేయరాదని వివరించారు. హన్మకొండ: విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకునేందుకు ఈనెల 17 ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఎస్ఈ పి.మధుసూదన్‌రావు తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈకార్యక్రమంలో హనుమకొండ జిల్లా వినియోగదారులు 87124 84506 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు వివరించాలని, సలహాలు, సూచనలు అందించాలని కోరారు. వరంగల్ సర్కిల్ ఎస్ఈతో.. విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాలో భాగంగా సమస్యలు, సలహాలు తెలుసుకునేందుకు ఈనెల 17న ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ ఎస్ఈ కె.గౌతంరెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా వినియోగదారులు శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నిర్వహించే ఈకార్యక్రమంలో 87124 84818 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని, సలహాలు, సూచనలు అందించాలని కోరారు. కేయూ క్యాంపస్: వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–26ను నిర్వహించేందుకు కేయూలోని కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ఎంపికై ంది. ఇందులో పాల్గొనాలనుకునే విద్యార్థులు తమ పేర్లను ‘మై భారత్ పోర్టల్’లో నమోదు చేసుకోవాలని ఆ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.రమణ గురువారం తెలిపారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్‌ను జిల్లాలో నిర్వహించేందుకు కేయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ రమణ, హనుమకొండలోని నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేశ్ చింతల, కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో కేయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ, ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శైలజ, ఎం. సౌజన్య పాల్గొన్నారు. అక్టోబర్ 20 నుంచి 10 సర్వీసులు కాజీపేట రూరల్: దీపావళి పండుగను పురస్కరించుకుని దర్బాంగా–యశ్వంత్‌పూర్ మధ్య 10 ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడిపిస్తున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. కాజీపేట జంక్షన్ మీదుగా నడిచే ఈ రైళ్లు ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్ 11 వరకు ప్రతీ సోమవారం దర్బాంగా–యశ్వంత్‌పూర్ (05541) వెళ్లే ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా అక్టోబర్ 23వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు యశ్వంత్‌పూర్–దర్బాంగా (05542) వెళ్లే ఎక్స్‌ప్రెస్ ప్రతీ బుధవారం కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. 3–ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్, సెకెండ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీసులకు అప్ అండ్ డౌన్ రూట్లో సమస్థిపూర్, ముఝఫర్‌పూర్, హాజీపూర్, సోనాపూర్, చాప్రా, గ్రామీణ్, సివన్, డోరియోసాదర్, గోరఖ్‌పూర్, గోండా, బారబంకి, అశీశ్‌బాగ్, కాన్‌పూర్‌సెంట్రల్, ఓరియా, వీజీఎల్ ఝాన్సీ, బీనా, బోఫాల్, ఇటార్సీ, జోద్పూర్, కాబిన్, ఆమ్లా, నాగ్‌పూర్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేట జంక్షన్, కాచిగూడ, మహబూబ్‌నగర్, దోనే, ధర్మవరం, హిందుపూర్, ఎలహంకా స్టేషన్లో హాల్టింగ్ కల్పించారు. -
కళాక్షేత్రంలో పనులు పూర్తి చేయండి
బల్దియా కమిషనర్, ‘కుడా ’వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్‌పాయ్ వరంగల్ అర్బన్: కాళోజీ కళాక్షేత్రంలో పెండింగ్‌లో ఉన్న పనుల్ని త్వరగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్, ‘కుడా’ వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. గురువారం కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్ని ఆమె పరిశీలించారు. కమిషనర్ వెంట సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీం రావు, అధికారులు పాల్గొన్నారు. నిబంధనలు పాటిస్తేనే అనుమతులు నిబంధనలు పాటిస్తేనే నిర్మాణాలకు అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. గురువారం కమిషనర్ నగర పరిధి ఎక్సైజ్ కాలనీ, శ్రీనివాస కాలనీ, బ్యాంక్ కాలనీ, సాయి గణేశ్ కాలనీ, చింతగట్టు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నమోదు చేసిన వివరాలను కొలతలు వేసి పరిశీలించారు నిబంధనలు విస్మరిస్తే కూల్చేయండి భవన నిర్మాణాల్లో నిబంధనలు విస్మరిస్తే కూల్చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి శ్రీదేవి సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కమిషనర్, అధికారులు పాల్గొన్నారు. -
క్రీడాకారులకు గాయాలు.. 108లో ఎంజీఎంకు తరలింపు
జేఎన్ఎస్లో జరుగుతున్న అథ్లెటిక్స్ పోటీల్లో ఇద్దరు క్రీడాకారులు, ఒక టెక్నికల్ అఫీషియల్ గాయపడ్డారు. హరియాణ రాష్ట్రానికి చెందిన సోనూయాదవ్ లాంగ్‌జంప్ చేస్తుండగా ఎడమకాలు మణికట్టులో గాయమైంది. మరో క్రీడాకారిణి త్రివేణికి సైతం మణికట్టులో స్వల్ప గాయం కాగా అక్కడే విధుల్లో ఉన్న 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఈఎంటీ చైతన్య, పైలెట్ కొండ తిరుపతి లు ఎంజీఎం తరలించారు. కాగా, టెక్నికల్ అఫీషియల్ శివకుమార్ కుడి చేయి మధ్య వేలుకు గాయం కాగా చికిత్స అందించారు. చాంపియన్‌షిప్‌లో భాగంగా మొదటి రోజు గురువారం 30 ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు. ఉదయం 6 నుంచి 10: 30 గంటల వరకు, తిరిగి 12 నుంచి సాయంత్రం 6:30గంటల వరకు పోటీలు జరిగాయి. 30 ఈవెంట్లలో 11 ముగిశాయి. మిగిలిన ఈవెంట్లు శుక్రవారం కొనసాగుతాయి. 10,000 మీటర్ల పురుషుల పరుగు : రిజ్వాన్(ఇండోర్) ప్రఽథమ స్థానం, సచిన్‌యాదవ్(ఉత్తర్‌ప్రదేశ్) ద్వితీయ, శివాజీకాశీరామ్(కర్నాటక) తృతీయ స్థా నంలో నిలిచారు. 10000 మీటర్ల మహిళల విభాగం: లతికతల్వార్(రాజస్తాన్) ప్రథమ స్థానం, ఆర్తిపవారా(మహారాష్ట్ర) ద్వితీయ, భూష్రాగౌరి(మధ్యప్రదేశ్)తృతీయ స్థానం, షార్ట్ఫుట్ మహిళల విభాగం: సిమ్రాన్జిత్కౌర్(ఢిల్లీ) ప్రథమ స్థానం, ఝలక్చా హల్(ఉత్తర్‌ప్రదేశ్)ద్వితీయ,పూజకుమారి(ఎన్సీఓ పీ) తృతీయ స్థానం, హైజంప్ మహిళల విభా గం: సీమకుమారీ(ఉత్తర్‌ప్రదేశ్) ప్రథమ స్థానం, సారి కకుమావత్(రాజస్తాన్)ద్వితీయ, రింపల్కౌర్(పంజాబ్)తృతీయ స్థానం, డిస్కస్‌త్రో మహిళల విభా గం: నిఖితకుమారి(ఎన్సీఓపీ, ఆర్గనైజేషన్ ) మొదటిస్థానం, కిరణ్(రాజస్తాన్)ద్వితీయ, అఖిలరాజు(కేరళ)తృతీయ స్థానం, హ్యామర్‌త్రో పురుషుల వి భాగం: దినేశ్ ఎస్(తమిళనాడు) ప్రథమ స్థా నం, పవన్(రాజస్తాన్) ద్వితీయ, రాబిన్యాదవ్(ఉత్తర్‌ప్రదేశ్) తృతీయ స్థానం, పోల్‌వాల్ట్ విభాగం: కు మార్కుల్దీప్(జేఎస్‌డబ్ల్యూ,ఆర్గనైజేషన్) ప్రథమ, క వీన్రాజ్(తమిళనాడు)ద్వితీయ,రామ్రాజన్(రాజస్తాన్) తృతీయ స్థానం, 100మీటర్ల పరుగు మహిళ ల విభాగం: సుదీష్న(మహారాష్ట్ర) విజేత, సాక్షి(రిలయన్స్, ఆర్గనైజేషన్) ద్వితీయ, తమన్నా(త్రివేండ్రం) తృతీయ స్థానం, 100మీటర్ల పరుగు పురుషుల విభాగం: హరుత్యమ్జయరామ్(ఒడిశా) ప్రథమ, కుమార్(జార్ఖండ్)ద్వితీయ, రాట్మెల్గే(మహారాష్ట్ర) తృతీయ స్థానం, లాంగ్‌జంప్ మహిళల విభాగం: ముబాస్సిమ్(అంజుబాబీ, ఆర్గనైజేషన్) ప్రథమ, ఎంఎస్ సించానా(కర్నాటక)ద్వితీయ, వీఎం అభిరామ్(కేరళ)తృతీయ స్థానం, 1500 మీటర్ల పరుగు మహిళల విభాగం: వినీతగుర్జర్ (ఉత్తర్‌ప్రదేశ్) ప్రథ మ, లక్ష్మిప్రియకిసాన్(ఒడిశా) ద్వితీయ, భగవతిడియోరా(రాజస్తాన్)తృతీయ స్థానంలో నిలిచారు. -
బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేని పార్టీలు
హన్మకొండ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్ప నపై ఏ రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి లేదని తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఈ నెల 18న నిర్వహించనున్న బీసీ బంద్ విజయవంతంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, కార్పొరేట్ రంగాలన్నీ అగ్రవర్ణాల గుప్పిట్లో ఉన్నాయని, ఈ బంద్‌ను విఫలం చేయాలని కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, హోటళ్లు, బస్సులు, ఆటోలు, షాపింగ్ మాళ్లు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం.. దానిని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అనంతరం బీసీ బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మరావు, ఆయా సంఘాల నాయకులు దొడ్డపల్లి రఘుపతి, దాడి మల్లయ్య యాదవ్, బోనగాని యాదగిరి గౌడ్, వైద్యం రాజగోపాల్, తమ్మేలా శోభారాణి, గడ్డం భాస్కర్, సంగాని మల్లేశ్వర్, ఆకారపు మోహన్, పల్లెపు సమ్మయ్య, బచ్చు ఆనందం, ఆడెపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రేపటి బీసీ బంద్‌ను విజయవంతం చేయాలి తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ నాయకుల పిలుపు -
రాష్ట్ర స్థాయి బాలికల వాలీబాల్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
వరంగల్ స్పోర్ట్స్: సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరుగనున్న ఎస్జీఎఫ్ అండర్–19 రాష్ట్ర స్థాయి బాలికల వాలీబాల్ పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టును ఎంపిక చేశారు. గురువారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని వాలీబాల్ మైదానంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. 120 మంది బాలికలు హాజరుకాగా, ఇందులో ప్రతిభ కనబరిచిన 12మందితో ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ బరుపాటి గోపి, ఎస్జీఎఫ్ అండర్–19 మాజీ కార్యదర్శి డాక్టర్ కోట సతీశ్, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ. ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి దరిగి కుమార్, డీఎస్ఏ వాలీబాల్ కోచ్ బత్తిని జీవన్‌గౌడ్ పాల్గొన్నారు. ఎంబీఏ, ఎంసీఏలో స్పాట్ అడ్మిషన్లు కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్‌కళాశాల, సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం(2025–2026)లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఎస్. జ్యోతి, నర్సింహాచారి గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈ నెల 17నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్ని విద్యార్హతల ఒరిజనల్ సర్టిఫికెట్లుతోపాటు ఆధార్, ఐసెట్ ర్యాంకు కా ర్డును తీసుకురావాలన్నారు. టీజీఐసెట్ 2025 అర్హత సాధించినవారు, అర్హతసాధించలేకపోయిన అభ్యర్థులు కూడా ఈ స్పాట్ అడ్మిషన్లకు అర్హులేనని వారు తెలిపారు. పూర్తి వివరాలకు టీజీఐసెట్.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో చూడాలని కోరారు. కళాశాలల వారీగా మిగిలిన సీట్ల వివరాలు మార్గదర్శకాలు కూడా ఆ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బాటనీ హెచ్‌ఓడీతోపాటు కాంట్రాక్టు లెక్చరర్లకు షోకాజ్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ బాటనీ విభాగం అధిపతితోపాటు నలుగురు కాంట్రాక్టు లెక్చరర్లు, నలుగురు నాన్‌టీచింగ్ ఉద్యోగులకు షోకాజ్ నోటీస్‌లు జారీచేసినట్లు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ గురువారం తెలిపారు. ఇటీవల వీసీ ప్రతాప్‌రెడ్డి బాటనీ విభాగాన్ని తనిఖీ చేయగా ఆవిభాగ అధిపతితో సహా నలుగురు కాంట్రా క్టు లెక్చరర్లు, మరో నలుగురు నాన్‌టీచింగ్ ఉద్యోగులు విధుల్లో లేరనే విషయం వెల్లడైందన్నారు. దీంతో వారికి షోకాజ్ నోటీస్‌లు జారీచేసినట్లు తెలిపారు. ఇదిలాఉండగా గురువారం కేయూలోని అకడమిక్ కమిటీహాల్లో వీసీ ప్ర తాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం బాటనీ విభాగం అధిపతి, కాంట్రాక్టు లెక్చరర్లతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. విధుల్లో సమయపాలన పాటించాలనే విషయం, తరగతుల నిర్వహణ, తదితర అంశాలపై చర్చ సాగినట్లు తెలిసింది. -
‘సీఈఏ’ నియమాలు తప్పక పాటించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రైవేట్ క్లినిక్‌లు, ఆస్పత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం (సీఈఏ) నియమాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆస్పత్రుల యాజమాన్యాలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో డీఎంహెచ్ఓ అ ప్పయ్య ఆధ్వర్యంలో ఐఎంఏ, తానా, గైనకాలజిస్ట్ అసోసియేషన్, డెంటల్, ఆయుర్వేదిక్, హోమియో, యునాని, ఫిజియోథెరపీ అసోసియేషన్ల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడారు. చట్టానికి లోబడి ఆస్పత్రులు నిర్వహించడంలో అసోసియేషన్లు సహకరించాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద పార్కింగ్ స్థలం ఉండేలా ఆస్పత్రుల యాజమాన్యాలు చూసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే ఆస్పత్రులు నిబంధనల మేరకు నిర్మించాలని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రతీ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, జిమ్ సెంటర్లు, అవసరమైన ఇతర చోట్ల సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వడానికి అసోసియేషన్లు సహకరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ విజయ్‌చందర్ రెడ్డి, గైనకాలజిస్ట్‌ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ రాధిక, ఐడీఏ అధ్యక్షుడు డాక్టర్ ప్రీతంరెడ్డి, ఆయుర్వేదిక్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ రవీందర్, హోమియో అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ సుధాకర్‌రావు, ఫిజియోథెరపీ అసోసియేషన్ ప్రతినిధి సురేశ్‌కుమార్, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, డెమో అశోక్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కళాక్షేత్రం అందుబాటులోకి తీసుకురావాలి
హన్మకొండ కల్చరల్: సాహిత్య సభలను నిర్వహించుకునేలా కాళోజీ కళాక్షేత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. గురువారం సాయంత్రం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని పీఆర్ భవన్లో పేర్వారం జగన్నాథం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు ఆచార్య పేర్వారం జగన్నాథం స్మారక పురస్కారాన్ని 2023 సంవత్సరానికిగాను సాహితీవేత్త డాక్టర్ లింగంపల్లి రామచంద్రకు, 2024 సంవత్సరానికి సాహితీవేత్త డాక్టర్ పెద్ది వెంకటయ్య, 2025 సంవత్సరానికి కవి పొట్లపల్లి శ్రీనివాసరావుకు ప్రదానం చేశారు. కేయూ విశ్రాంత ఆచార్యులు బన్న అయిలయ్య అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో డాక్టర్ అంపశయ్య నవీన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఆచార్య పేర్వారం జగన్నాథం తనకు సన్నిహితులని, ఆయన పేరిట స్మారక పురస్కారం అందించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈవీ శ్రీనివాసరావు, పేర్వారం జగన్నాథం ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ పేర్వారం శంకర్రావు, డాక్టర్ పేర్వారం శ్రీనాఽథ్, అస్నాల శ్రీనివాస్, కవయిత్రి గట్టు రాధికామోహన్, కవులు, రచయితలు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ ఘనంగా ఆచార్య పేర్వారం జగన్నాథం స్మారక పురస్కార ప్రదానం -
వ్యవసాయ రంగానికి పెద్దపీట
హన్మకొండ: వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారి అవసరాలకు అనుగుణంగా సేవలందిస్తున్నట్లు వివరించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో 2023 సంవత్సరంలో 31,550 రిలీజ్ చేయగా 2024 సంవత్సరంలో 39,693 సర్వీసులను రిలీజ్ చేశామని, 2025 (అక్టోబర్ 16 వరకు ) 34,306 సర్వీస్‌లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 2023తో పోల్చుకుంటే 2024 సంవత్సరంలో 8,143 సర్వీస్‌లు అఽధికంగా మంజూరు చేసినట్లు వివరించారు. ఇంకా మూడు నెలల సమయంలో ఉందని ఈలోపు గతంలోకంటే అధికంగా సర్వీస్‌లు మంజూరు చేస్తామన్నారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కొత్తగా లైన్లు వేయాల్సిన అవసరం లేని సర్వీసులను నెల రోజుల్లో మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ వాటా చెల్లించాల్సి ఉన్న సర్వీసులను రెండు నెలలో మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ సర్వీస్‌ల మంజూరుపై కమర్షియల్ విభా గాధికారులు 16 సర్కిళ్ల అధికారులతో ప్రతీ వారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు, మెటీరియల్ కొరత లేదని పేర్కొన్నారు. రైతులు మెటీరియల్ కొనాల్సిన అవసరం లేకుండా అవసరమైన మేరకు సరఫరా చేస్తున్నమని స్పష్టం చేశారు. సర్వీస్‌ల మంజూరులో ఇబ్బందులుంటే టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని కోరారు. విద్యుత్ కనెక్షన్ల జారీలో పారదర్శకత.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీలో మరింత పారదర్శకత తీసుకొచ్చామని, కొత్త కనెక్షన్ కోసం నమోదు చేసుకున్నప్పటి నుంచి సర్వీస్ రిలీజ్ అయ్యే వరకు ప్రతీ దశలోనూ మొబైల్ నంబర్‌కు తెలుగులో సమాచారం పంపిస్తున్నట్లు తెలిపారు. ఈమెస్సెజ్లో లింక్ కూడా పంపిస్తుండడంతో దాన్ని ఓపెన్ చేస్తే స్టేటస్ రిపోర్ట్ రైతులు తెలుసుకోవచ్చని సూచించారు. మెటీరియల్ త్వరితగతిన రిలీజ్ అయ్యేలా ఈ–స్టోర్ విధానాన్ని తీసుకొచ్చామని, పేపర్ పని లేకుండా ఆన్లైన్ ద్వారా బుక్ చేసి మెటీరియల్ డ్రా చేసుకునే సౌలభ్యం క్షేత్ర స్థాయి అధికారులకు కల్పించిందని, దీంతో రైతుల సర్వీ సుల మంజూరు వేగంగా జరుగుతుందని తెలిపా రు. ట్రాన్స్ఫార్మర్ల తరలింపునకు డిపార్ట్మెంట్ వా హనాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పొలం బాట ద్వారా రైతుల ముంగిటకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇప్ప టి వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలో 4,064 పొలం బాట కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. సత్వర సర్వీస్‌లు మంజూరు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి -
ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు కృషి
వరంగల్ స్పోర్ట్స్: భారత్‌లో 2036లో జరుగనున్న ఒలింపిక్స్ పోటీల్లో కొన్ని క్రీడలను తెలంగాణలో నిర్వహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజులు జరుగనున్న జాతీయస్థాయి 5వ అథ్లెటిక్స్ అండర్–23 చాంపియన్‌షిప్ గురువారం ప్రారంభమైంది. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎంపీ కావ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2026లో జరుగనున్న ఖేలో ఇండియా క్రీడా పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ రూ.3.50 కోట్ల వ్యయంతో స్టేడియంలో అభివృద్ధి పనులు చేపట్టామని, త్వరలో ఫ్లడ్‌లైట్లు ఇతర వసతుల కోసం మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నాయన్నారు. మెరుగైన శిక్షణ కోసం క్రీడాకారులు పట్టుదలతో ముందుకెళ్లాలన్నారు. అనంతరం 10వేల మీటర్ల పరుగులో విజేతలకు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్‌కుమార్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, కార్యదర్శి కె. సారంగపాణి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య జేఎన్ఎస్లో నేషనల్ అథ్లెటిక్స్ మీట్ ప్రారంభం -
ఆస్పత్రి పనులు పూర్తి చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద ఎంజీఎం: వరంగల్‌లో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిని కలెక్టర్ గురువారం సందర్శించి సంబంధిత అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. సివిల్, ఎలక్ట్రికల్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతీ అంతస్తులోని నిర్మాణ స్థితిగతులను తెలుసుకోవాలని సూచించారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ కిశోర్, కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఆర్‌ఎంఓలు, వివిధ విభాగాల అధిపతులు, ఆర్అండ్బీ ఇంజనీర్లు, ఎల్అండ్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టాలి న్యూశాయంపేట: పారదర్శకంగా పంట ఉత్పత్తుల కొనుగోళ్లను చేపట్టాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ధాన్యం పత్తి, మొక్కజొన్నల కొనుగోళ్లపై గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ మద్దతు ధరలతో పంటల కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ పాల్గొన్నారు. గడువులోగా ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేయాలి నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, ఉపాధి హామీ పథకం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 9,457 ఇళ్లకు ఇప్పటివరకు 4,941 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. ఎస్‌హెచ్‌జీల నుంచి రుణాలు ఇప్పించి పెండింగ్‌లో ఉన్న 4,516 ఇళ్ల పనులు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉపాధి హామీలో పని కల్పించేందుకు జాబ్ కార్డులు అందించాలన్నారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న, హౌసింగ్ పీడీ గణపతి, డీపీఓ కల్పన, పీఆర్ ఈఈ ఇజ్జగిరి పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందించాలి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, విద్యార్థులకు కల్పించే కనీస సదుపాయాలపై మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దే దేవాలయాలుగా నిలవాలన్నారు. డీఈఓ రంగయ్యనాయుడు, ఏఎస్ఓ వేణుగోపాల్, అధికారులు పాల్గొన్నారు. -
ఏజెన్సీలో అరుదైన గద్దజాతి పక్షి ప్రత్యక్షం
● పొలాల్లో వాలిన నల్ల రెక్కల గాలిపటం (కపసి) వాజేడు: ఏజెన్సీ ప్రాంతంలో అరుదైన గద్దజాతి పక్షి కనిపించింది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధి ఇప్పగూడెం గ్రామ సమీపంలోని పొలాల్లో నల్ల రెక్కల గాలిపటం (కపసి) పక్షి వాలింది. దీని శాసీ్త్రయనామం ఎలనల్ కెరులియస్. పొడవైన రెక్కలు కలిగిన రాప్టర్, ఇది ప్రధానంగా బూడిదరంగు లేదా తెలుపు రంగులో ఉంది. ఈ పక్షిని గ్రామస్తులు వింతగా చూడటంతోపాటు తమ సెల్ ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. ఎర్రని కళ్లు, రెక్కలు విప్పగానే నెమలి రెక్కల వలే పెద్దగా ఉన్నాయి. ఈ పక్షి రాత్రి సమయంలో మనుషులు అరిచినట్లుగా అరుస్తున్నట్లు ఇప్పగూడెం గ్రామస్తులు తెలిపారు. ఈ పక్షిని అడవి రామదాసు అనికూడా పిలుస్తారని తెలుస్తుండగా, దీని ఆహారంలో మిడతలు, ఇతర పెద్ద కీటకాలు, బల్లులు, ఎలుకలు ఉంటాయని, ఇది రైతులకు మేలు చేకూర్చే పక్షిగా తెలిసింది. -
‘విజిలెన్స్’లో అక్రమార్కుడు
వరంగల్ క్రైం: ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతిని ఎండగట్టి.. అక్రమార్కులపై చర్యలకు సిఫార్సు చేసే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఓ అక్రమార్కుడు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా నడుస్తోంది. విజిలెన్స్‌లో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారికి నమ్మిన బంటైన సదరు కానిస్టేబు ల్ను ఏరి కోరి డిప్యుటేషన్‌పై తెచ్చుకున్నారు. ఇంకేముంది వసూళ్లకు పెట్టింది పేరైన సదరు కానిస్టేబుల్ పేరు చెబితే డీఎస్పీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులకు కూడా చెమటలు పడుతున్నాయి! ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు విచారణలు, తనిఖీలకు ప్రాధాన్యం ఉన్న విజిలెన్స్‌లో ఈ అక్రమార్కుడి సంపాదన మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఇసుక క్వారీలు, రైస్ మిల్లులు, గ్రానైట్ క్వారీలు, ఫర్టిలైజర్స్, ఇలా ఎక్కడ చూసినా తన చేతికి పనిచెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఎంత చెబితే అంత! విజిలెన్స్‌లో ఉద్యోగం కానిస్టేబులే అయినప్పటికీ పెత్తనం మాత్రం అంతా ఇంతా కాదు. ఆ శాఖలో పనిచేస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఇతగాడి నోటి నుంచి ఏం వస్తుందో.. దాని వల్ల వారికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో.. అనే భయంతో వణికిపోతున్నట్లు సమాచారం. ఆ శాఖలో ఆయనకు పనికాదు కదా.. ఎదురు చెప్పే ధైర్యం కూడా ఎవరూ చేయడం లేదు. తనను ఏరి కోరి తెచ్చుకున్న బాస్‌కు అన్నీ తానై చేయడంతో మిగిత అధికారులంతా గప్‌చుప్‌గా ఉంటున్నారు. మట్టి, ఇసుక, గ్రానైట్ లారీలను పట్టాలన్నా.. వాటికి జరిమానాలు విధించాలన్న ఆయన కనసన్నల్లోనే జరగడం గమనార్హం. తనకు అనుకూలంగా ఉండే లారీల యాజమానులకు ముందస్తుగా తనిఖీల సమాచారాన్ని చేరవేసి.. దానికి కాసుల రూపంలో ప్రతిఫలాన్ని పొందడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎవరైనా విజిలెన్స్ కార్యాలయంలో అధికారులను కలవాలంటే ముందుగా ఇతగాడిని ప్రసన్నం చేసుకున్న తర్వాతే దర్శనం దొరుకుతుంది. పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కడ చూసినా ఆ కానిస్టేబుల్ పేరే వినబడుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో సంబంధం లేకుండా ఎక్కడికై నా, ఎప్పుడైనా వెళ్లి ఆయన పనులు గుట్టు చప్పుడు కాకుండా చేసుకుపోతున్నట్లు తెలిసింది. నెలవారీ మామూళ్లను సైతం తనకు ఇష్టం వచ్చినట్లు పెంచి.. ఇవ్వని క్వారీల, లారీల యాజమానుల వెంట పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈతతంగమంతా విజిలెన్స్ బాస్ కనుసన్నల్లో జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వసూళ్లలో దిట్ట పేరుకే కానిస్టేబుల్.. పెత్తనం పెద్దది లీకులకు పెట్టింది పేరు అక్కడ ఆయనే బాస్ -
కేయూలో ఇక ఎఫ్ఆర్ఎస్ హాజరు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో, వర్సిటీ కాలేజీల్లోనూ తొలుత అధ్యాపకులు, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అటెండెన్స్‌ను అమలు చేయనున్నారు. ఈమేరకు బుధవారం యూనివర్సిటీలోని అకడమిక్ కమిటీ హాల్లో కాలేజీల ప్రిన్సిపాళ్లతో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ డిజిటల్ కన్సార్టియం ప్రతినిధులు హాజరై ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పరికరాలు, మొబైల్ సిస్టమ్‌లో అటెండెన్స్ తీసుకునే విధానంపై డెమో ఇచ్చి అవగాహన కల్పించారు. తొలుత మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో.. క్యాంపస్‌లోని మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో పైలెట్ ప్రాజెక్టుగా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో పరికరాలను కళాశాలలో ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత విద్యార్థులకు కూడా వర్తింపజేస్తారు. వెంటనే మిగతా యూనివర్సిటీ కళాశాలల్లో, వివిధ విభాగాల్లో అమలు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా కొద్దిరోజుల్లోనే పూర్తిచేయాలనే యోచనలో యూనివర్సిటీ అధికారులు ఉన్నారు. సమయపాలన పాటించడం లేదని.. కేయూలో టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు సమయ పాలన పాటించడం లేదు. అలాగే వివిధ విభాగాల్లో, కాలేజీల్లో విద్యార్థులు కూడా కొందరు సరిగ్గా తరగతులకు హాజరుకావడం లేదు. ఇప్పటికే పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ సత్ఫలితాలిస్తున్న నేపథ్యంలో సంబంధిత ఉన్నత విద్యాశాఖ అధికారులు వర్సిటీల్లోనూ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్‌ను అమలుకు చేయాలనే ఆదేశించారు. దీంతో కాకతీయ యూనివర్సిటీలో అమలు చేయనున్నారు. తొలుత టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు ఆ తర్వాత విద్యార్థులకు కూడా.. పైలెట్ ప్రాజెక్టుగా మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అమలు -
గ్రీన్‌ఫీల్డ్ హైవేకు భూసేకరణ పూర్తిచేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లా నుంచి వెళ్లే గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేకు భూసేకరణ పూర్తిచేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో భూసేకరణపై కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్‌హెచ్–163జీకి 165.11 హెక్టార్ల భూసేకరణకు ఇప్పటివరకు 159.96 హెక్టర్ల భూసేకరణ పూర్తి అయిందన్నారు. కోర్టు కేసులతో పెండింగ్‌లో ఉన్న మిగిలిన 27.21 హెక్టార్ల భూసేకరణను ఈనెల 21లోగా పూర్తిచేయాలని, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం త్వరితగతిన చెల్లించి ల్యాండ్ అక్విజేషన్ పూర్తిచేయాలని సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, నేషనల్ హైవే పీడీ దివ్య, ఏడీ సర్వేల్యాండ్స్ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు ఏర్పాట్లుధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణపై సమీక్షించారు. ఈసారి కొనుగోళ్లకు 258 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ. 2,389, సాధారణ రకానికి 2,369 చెల్లించనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, మేనేజర్ సంధ్యారాణి, వ్యవసాయ అధికారి అనురాధ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఓరుగల్లు కాంగ్రెస్‌లో తారస్థాయికి మంత్రుల మధ్య విబేధాలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది.. మంత్రుల మధ్య అంతర్గత విబేధాలు తారస్థాయికి చేరాయా? జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ దంపతుల నడుమ అగాధం పెరిగిపోయిందా? మేడారం టెండర్లపై ఇటీవల కాలంలో కొండా మురళి హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారన్న ప్రచారం మరింత గ్యాప్‌ను పెంచిందా? వరంగల్ రాజకీయాలపై పార్టీ, ప్రభుత్వం దృష్టి సారించిందా? అంటే నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు తాజా ఉదాహరణలుగా చె బుతున్నారు. రోజురోజుకూ చినికిచినికి గాలివానగా మారుతున్న మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విబేధాలపై ఇటు అధిష్టానం.. అటు ప్రభుత్వం సీరియస్‌గా స్పందించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుస వేట్లతో కలకలం అధికారుల మితిమీరినతనంపై చర్యల్లో భాగంగా ప్రభుత్వం.. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ పరిధిలోని ఇద్దరు అధికారులపై వేటు వేసింది. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తూర్పులో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నాయకుల బర్త్‌డే వేడుకలు జరపడం.. ఏ హోదా లేకున్నా ఎస్కార్ట్ ఇవ్వడంతోపాటు ఇతర కారణాలను చూపుతూ ఆయనపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. నందిరాంనాయక్ స్థానంలో ఐపీఎస్ అధికారి శుభం ప్రకాశ్ నాగర్లేకు ఏసీపీ బాధ్యతలు ఇచ్చారు. తాజాగా మంత్రి సురేఖ పేషీలో ఓఎస్డీగా పనిచేసే సుమంత్‌ను ఆ పదవి నుంచి ప్రభుత్వం మంగళవారం తప్పించింది. 2023 డిసెంబర్నుంచి ఈ పదవీ బాధ్యతలు చూస్తున్న సుమంత్ అభివృద్ధి పనుల్లో మితిమీరిన జోక్యం.. ఇటీవల మేడారం పనుల వివాదానికి కూడా కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించి.. ఆరోపణలు నిజమేనని తేలడంతో వేటు వేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనలు కొండా దంపతులు ప్రమేయం లేకుండా జరిగాయన్న ప్రచారం ఉండగా.. బుధవారం సీఎం పర్యటనకు హాజరు కాకపోవడంపైనా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. చాలా ఏళ్లుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కొండా దంపతులకున్న రాజకీయ విబేధాలు, వైరం కారణంగానే సీఎం పర్యటనకు సురేఖ దూరంగా ఉన్నారని వారి అనుచరులు చెబుతున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న అంతర్గత విభేధాలు, కుమ్ములాటలకు చెక్ పెట్టే దిశగా పార్టీ, ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐదారు రోజుల్లో సమగ్ర నివేదికలు ఇవ్వాలన్న ఆదేశాల మేరకు నిఘావర్గాలు రంగంలోకి దిగి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల మధ్య రోజురోజుకూ అంతరం పెరుగుతోంది. రాష్ట్ర అటవీ, పర్యాటక, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు వ్యాఖ్యలు పలుమార్లు వివాదాస్పదంగా మారాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఎమ్మెల్యేపై చేసిన బాడీషేమింగ్ వ్యాఖ్యలు దుమారమే రేపాయి. ఆ తర్వాత తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని కొండా దంపతులపై కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానం వరకు వెళ్లారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు.. టీపీసీసీ చీఫ్, సీఎంలకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ అంశంపై టీపీసీసీ క్రమశిక్షణ సంఘం కొండా సురేఖ, కొండా మురళీధర్‌రావుతో మాట్లాడింది. టీపీసీసీ చీఫ్, సీఎంల జోక్యంతో సద్దుమణిగినట్లే అనిపించినా? అంతర్గతంగా ఇంకా రగులుతూనే ఉంది. ఇదే సమయంలో మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణ, ఇతర అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై కొండా మురళి ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈప్రచారంపై సంప్రదించిన మీడియా ప్రతినిధులతో ‘నేను ఇంట్లోనే ఉన్నాను. ఎవరినీ కలవలేదు, ఫిర్యాదులు కూడా చేయలేదు’ అని మురళి స్పష్టం చేశారు. ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌పై ప్రభుత్వం వేటు వేయడం, బుధవారం హనుమకొండకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఆమె కలవకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. వైరల్‌గా మారిన మంత్రి పొంగులేటిపై ఫిర్యాదుల ప్రచారం వివాదాస్పదంగా కొండా దంపతుల వ్యాఖ్యలు... సీరియస్‌గా తీసుకుంటున్న ప్రభుత్వం మొన్న ఏసీపీ, నేడు ఓఎస్డీ.. వేటు వేయడంపై దుమారం ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా కొండా దంపతులు జిల్లా రాజకీయాలపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా? -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు గీసుకొండ: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో పల్లెదవాఖాన వైద్యులు, సూపర్వైజర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లేని పిల్లలను గుర్తించి పీహెచ్‌సీలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలందించాలన్నారు. ప్రోగ్రాం అధికారులు అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించి అనుకున్న ఫలితాలు రాబట్టాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారులు రవీందర్, ఆచార్య తదితరులు పాల్గొన్నారు. -
యుద్ధప్రాతిపదికన పూర్తి చేయండి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: బల్దియా ఆవరణలోని ప్లానిటోరియం పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీర్లను ఆదేశించారు. కొనసాగుతున్న అభివృద్ధి పనులు బుధవారం మేయర్ తనిఖీ చేసి, ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగాధికారులతో సమీక్షించారు. 15వ ఫైనాన్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతితో పాటు ప్లానిటోరియం పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, అకౌంట్స్ అధికారి శివలింగం, జేఏఓ సరిత, ఈఈలు రవికుమార్, సంతోశ్‌బాబు, మహేందర్, డీఈలు కార్తీక్‌రెడ్డి, రోజారాణి, రాగి శ్రీకాంత్, ఏఈ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర ప్రణాళిక రూపొందించండి
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ వరంగల్ అర్బన్: హనుమకొండ బాలసముద్రంలో బల్దియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెహికల్ షెడ్డు, సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లలో రోడ్ల నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్‌ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసి సమర్థవంతంగా చేపట్టేందుకు అధికారులకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ట్రాన్స్ఫర్ స్టేషన్లో రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. అంతర్గత రహదారుల ఏర్పాటు, పార్కింగ్, డ్రెయినేజీ తదితర సమగ్ర అంశాలతో ప్లాన్ తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కళాక్షేత్రంలో పనులు పూర్తి చేయండినయీంనగర్: కాళోజీ కళాక్షేత్రంలో పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాళోజీ కళాక్షేత్రంతో పాటు కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో కొనసాగుతున్న పనుల్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ‘కుడా’ వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. కళాక్షేత్రంలో కొనసాగుతున్న ఇంటీరియర్ పనుల్ని పరిశీలించి నాణ్యతలో రాజీపడకుండా వేగంగా పూర్తి చేయాలన్నారు. కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో ఫినిఫింగ్ పనుల్ని వేగంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ిసీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్ రావు పాల్గొన్నారు. -
సాంకేతిక మహోత్సవానికి ఏర్పాట్లు
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్–25న ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించేందుకు నిట్ విద్యార్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2006లో ప్రారంభమైన టెక్నోజియాన్ టెక్నాలజీని పంచుకునేందుకు, నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. ఈవేడుకకు దేశవ్యాప్త వివిధ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సుమారు 7 వేల మంది హాజరుకానున్నారు. టెక్నోజియాన్–25లో నిర్వహించే పోటీలకు రూ.2 లక్షలు బహుమతులు అందజేయనున్నారు. టెక్నోజియాన్–25లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ కోసం https:// technozion. nitw.ac.in/ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక టీం.. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ చీఫ్ ప్యాటరన్‌గా, .ప్యాటరన్స్గా డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్‌కుమార్, స్యాక్ ప్రెసిడెంట్ హరిప్రసాద్‌రెడ్డి, వెంకన్న ఉడుతలపల్లి, స్టూడెంట్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీలు సాయి వంశీ, కార్తీక్‌రెడ్డి, హర్ష, సమన్విత్రెడ్డి, జాయింట్ సెక్రటరీలు ధీరజ్, పవన్, అభిరామ్, వెబ్ టీం నితిన్, బి.రిషి, సాయిరుషిత్, అమన్, భరత్జౌన్తో కూడిన ప్రత్యేక టీం టెక్నోజియాన్–25ను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతీ ఏడాది ప్రత్యేక థీంతో... ప్రతీ ఏడాది ప్రత్యేక థీంతో సాంకేతిక మహోత్సవం ఈ ఏడాది కూడా ప్రత్యేక థీంతో ఈ నెల 23న ఆవిష్కరించనున్నారు. కాగా 2022లో టెక్స్టేసీగా, 2023లో ఇంజీనియస్‌గా, 2024లో టెక్నోజియాన్గా ప్రత్యేక థీంతో ముందుకు సాగింది. అలరించనున్న టెక్నోజియాన్–25.. టెక్నోజియాన్–25లో స్పాట్‌లైట్స్, ప్రాజెక్ట్ ఎక్స్పో, నియాన్ క్రికెట్, జహాజ్, హోవర్ మానియా, డ్రోన్ హంట్, హాకథాన్ వంటి 50కి పైగా ఈవెంట్స్‌తో పాటు సాంకేతిక విజ్ఞానాన్ని అందించనుంది. ఈనెల 24, 25 తేదీల్లో నిట్‌లో టెక్నోజియాన్–25 హాజరుకానున్న 7 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు 23న లాంఛనంగా ప్రారంభం -
రైల్వే మల్టీ యూనిట్ పనులు వేగవంతం చేయాలి
కాజీపేట రూరల్: కాజీపేట మండలం అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మల్టీ యూనిట్ నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ఆర్.గోపాలకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కాజీపేట రైల్వే మల్టీ యూనిట్ నిర్మాణ పనుల్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. రైల్వే మల్టిపుల్ యూనిట్ లేఔట్‌ను పరిశీలించి కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణ పనులు సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. అయోధ్యపురం భూనిర్వాసితులు డీఆర్ఎం గోపాలకృష్ణన్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం కాజీపేట యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ సైడింగ్, కాజీపేట ఎలక్ట్రిక్ లోకో షెడ్డుకు వెళ్లి అక్కడ యాంటీ కొలెజన్ డివైజ్ లోకో సిస్టంతో పాటు ఇతర విభాగాలను, డీజిల్ లోకోషెడ్డులో తనిఖీలు చేపట్టారు. వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ టెస్టింగ్, రూంను ప్రారంభించి, షెడ్డులో వేస్టేజ్ మెటీరియల్స్‌తో రైల్వే టెక్నీషియన్లు చేసిన స్క్రాప్ టు ఆర్ట్ గ్యాలరీని తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. డీజిల్ షెడ్డులో మొక్క నాటారు. అధికారులతో మాట్లాడి షెడ్డు అభివృద్ధి, సమస్యలు తెలుసుకున్నారు. కాజీపేట జంక్షన్లో జరుగుతున్న అమృత్ భారత్ అభివృద్ధి పనుల్ని తనిఖీ చేసి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డీర్ఎం స్పిక్‌లో సికింద్రాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. డీఆర్ఎం వెంట సికింద్రాబాద్ సీనియర్ డీఓఎం సురేశ్‌రెడ్డి, సికింద్రాబాద్ కో–ఆర్డినేషన్ కె.రవీంద్రనాథ్, డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్, ఆర్వీఎన్ఎల్ జీజీఎం మురళీకృష్ణ, పవర్‌మెక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఏజీఎం సీహెచ్.కృష్ణ, పీఎంసీ శివరామకృష్ణ, కాజీపేట సీనియర్ డీఎంఈ వెంకటకుమార్, కాజీపేట సీనియర్ డీఈఈ సూర్యనారాయణ, ఆర్పీఎఫ్ సీఐ చటర్జీ, స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, రైల్వే సూపర్వైజర్లు ఉన్నారు. సికింద్రాబాద్ డీఆర్ఎం గోపాలకృష్ణన్ అభివృద్ధి పనుల తనిఖీ డీజిల్ షెడ్డులో వీసీబీ రూం ప్రారంభం -
పశు సంపదను కాపాడుకోవాలి
ఎంపీ డాక్టర్ కడియం కావ్య హన్మకొండ: పశు సంపదను కాపాడుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. బుధవారం హనుమకొండ వడ్డేపల్లిలోని పశు వైద్యశాలలో జాతీయ పశువ్యాధుల నివారణ కార్యకమాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ.. పాడి రైతులు పశు సంపదపై దృష్టి సారించి ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశంలో పశుసంవర్థక శాఖ సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పశుసంపద మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకవంటిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత టీకా కార్యక్రమాన్ని రైతులంతా వినియోగించుకోవాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జంతు వ్యాధుల నిర్ధారణ ల్యాబ్ సహాయ సంచాకులు డాక్టర్ నాగమణి పశువ్యాధులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పశు వైద్యాధికారి రాధాకిషన్, సహాయ సచాలకుడు శ్రీనివాస్, వడ్డేపల్లి పశు వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్, వినయ్, కరుణాకర్‌రెడ్డి, సిబ్బంది యాదలక్ష్మి, ఆకాశ్, వంశీ పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లా (వరంగల్ అర్బన్)లోని 67 వైన్‌షాపులకు బుధవారం 48 దరఖాస్తులను జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ స్వీకరించారు. కాగా, టెండర్ ప్రక్రియ ప్రారంభించన నాటి నుంచి మంగళవారం వరకు 219 దరఖాస్తులు ఎకై ్సజ్ శాఖకు మద్యం వ్యాపారులు అందించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగిలిన సీట్లలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ బీఎస్ఎల్ సౌజన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలలో హాజరు కావాలని కోరారు. సీట్ల వేకెన్సీల వివరాలు కళాశాల నోటీస్ బోర్డులో, టీజీఐసెట్.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. కాజీపేట: ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో ఆల్ ఇండియా డ్యాన్సర్స్ అసోసియేషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆఫ్ ఇండియా సంస్థలు సంయుక్తంగా జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో ది టెంపుల్ డ్యాన్స్ విద్యార్థులు నట్వర్ గోపీకృష్ణ జాతీయ అవార్డులు దక్కించుకున్నారు. నృత్యం, అభినయం, క్రియేటివిటీ, ఓన్ కొరియోగ్రాఫిక్ స్కిల్స్, డాన్స్ సిలబస్‌పై పట్టును పరిశీలించి కళాకారులను విజేతలుగా ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేశారు. డ్యాన్స్ సీనియర్ విద్యార్థిని అనిశ్రితరెడ్డి కుందూరు అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి నేషనల్ అవార్డును అందుకున్నారు. యూత్ కేటగిరీలో రావుల సాయి సంజనరెడ్డి నవోదిత కళాకార్ అవార్డు అందుకున్నారు. సీనియర్ విభాగంలో సంజనరెడ్డి సోమిరెడ్డి ద్వితీయ బహుమతి సాధించారు. డి.హన్విక, లక్ష్మి ప్రహర్షిత సీనియర్ గ్రూప్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. సబ్ జూనియర్ కేటగిరీలో జె.ఆరాధ్య ఉత్తమ ప్రతిభ కనబర్చింది. వరుణిక ప్రథమ బహుమతితో పాటు నృత్య కళా శ్రేష్ఠ అవార్డు అందుకున్నట్లు సీఈఓ ఆఫ్ ది టెంపుల్ డ్యాన్స్ హిమాన్సీ కాట్రగడ్డ తెలిపారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి నుంచి 9వతరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ గురుకులాల జిల్లా కో–ఆర్డినేటర్ ఉమామహేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17, 18 తేదీల్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. హనుమకొండలోని వరంగల్ వెస్ట్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో (పలివేల్పులవద్ద ఉన్న) దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను హనుమకొండ కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా సీటు కేటాయిస్తామని తెలిపారు. -
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు
మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లారు. దాంతో మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ పోలీసులతో గొడవకు దిగిన కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత.కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. అయితే సుమంత్ కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తుంది.నిన్న సుమంత్‌ను తన బాధ్యతల నుండి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
వైన్స్‌కు 19 దరఖాస్తులు
కాజీపేట అర్బన్ : హనుమకొండ జిల్లా(వరంగల్ అర్బన్)లోని 67 వైన్‌షాపులకు మంగళవారం 19 దరఖాస్తులను జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ స్వీకరించారు. టెండర్ ప్రక్రియ ప్రారంభించిన నాటి నుంచి మంగళవారం వరకు 171 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వరంగల్: కొత్తపేటలోని శ్రీరాజ్, జైగురుదత్తా జిన్నింగ్ మిల్లులను మంగళవారం జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, వరంగల్ వ్యవసాయ మార్కెట్ గ్రేడ్–2 కార్యదర్శులు ఎస్.రాము, అంజిత్‌రావు, ఎస్.రాజేందర్ తనిఖీ చేశారు. వరంగల్ మార్కెట్ పరిధిలోని 24 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనల మేరకు సౌకర్యాలు ఉన్నాయా లేవా అని తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. సౌకర్యాలు ఉంటే సీసీఐ ఈనెలాఖరులోగా పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుందని తెలిపారు. -
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఎంజీఎంలో పెద్దసార్ల విధులు.. ఉండేది హైదరాబాద్.. వరంగల్‌కు అప్‌అండ్‌డౌన్ ● బయోమెట్రిక్ అటెండెన్స్‌పై చర్యలు శూన్యం ● ఖాళీగా దర్శనమిస్తున్న ఆర్‌ఎంఓల కుర్చీలు ● రూ.లక్షల్లో వేతనాలు.. గంటల్లో సేవలు బదిలీల తర్వాత పరిపాలనపై పర్యవేక్షణ శూన్యం..ఆస్పత్రిలోని కీలక మెడిసిన్, ఆర్థోపెడిక్, సర్జరీ, పిడియాట్రిక్, డెర్మటాలజీ, సైకియాట్రిస్ట్ వంటి విభాగాల్లోని సుమారు 25 మందికి వైద్యులు హైదరాబాద్ నుంచి వరంగల్ నగరానికి అప్‌అండ్‌డౌన్ చేస్తున్నారు. ప్రతీ విభాగంలో ముగ్గురు నుంచి నలుగురు వైద్యులు ఈరకంగా ప్రయాణం చేస్తున్నారు. హాజరు శాతం కోసం వస్తూ రూ.లక్షల్లో వేతనాలు తీసుకుంటూ.. పేద ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా మిగతా జిల్లాల్లో దీర్ఘకాలికంగా ఉన్న వైద్యులను బదిలీ చేసింది. ఈక్రమంలో ఎంజీఎంలో ఉన్న వైద్యులు నర్సంపేట, ములుగు, భూపాలపల్లి, జనగామ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు బదిలీ కాగా, హైదరాబాద్‌లో దీర్ఘకాలికంగా ఉన్న వైద్యులు ఎంజీఎంకు బదిలీ అయ్యారు. అసలు సమస్య అప్పుడే మొదలైంది. సాధారణ బదిలీల తర్వాత పాలన ఎలా సాగుతుందనే విషయంపై పర్యవేక్షణ లేకపోవడం పేద ప్రజలకు శాపంగా మారింది. ఎంజీఎం: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యసేవల తీరుపై కొన్ని నెలలుగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో రోగులను ఈ ఆస్పత్రికి తీసుకురావడానికి పేదలు సైతం జంకే పరిస్థితి నెలకొంది. కీలక విభాగాల వైద్యులందరూ హైదరాబాద్ నుంచి వరంగల్ నగరానికి అప్‌అండ్‌డౌన్ చేస్తున్నారు. దీనివల్ల ఆస్పత్రికి సమయానికి రాకపోవడం.. తొందరగా వెళ్తుండడంతో ప్రజలకు సరైన వైద్యసేవలు అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంజీఎంపై పేద ప్రజలకు భరోసా కల్పించడానికి కలెక్టర్ ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించినా, ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో మార్పు రాని పరిస్థితి. గతంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మూడు సార్లు పర్యటించి వైద్యుల గైర్హాజరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించగా నామమాత్రంగా మెమోలు జారీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఎంజీఎం ఆస్పత్రిపై జిల్లా మంత్రి, ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిసారించి పేదల ప్రాణా లకు భరోసా కల్పించాలని వేడుకుంటున్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్‌పై చర్యలు శూన్యం ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది హాజరుశాతం కోసం ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరాలు నామమాత్రంగా మారాయి. ఈపరికరాల ద్వారా నమోదైన హాజరుతో ఇంత వరకు ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం.. వేతనాల్లో కోత విధించకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రజాప్రతినిధులారా దృష్టి సారించండి.. వేలాది మంది వైద్యం కోసం ప్రాణాలు అరచేతిలో పట్టుకునే వచ్చే ఎంజీఎం ఆస్పత్రి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిసారించాలని పేదలు వేడుకుంటున్నారు. మందుల సరఫరాతో పాటు వైద్యసేవలు, పూర్తిస్థాయి అధికారులను నియమించి పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలని ప్రజలు వేడుకుంటున్నారు.ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటేనే.. ఎంజీఎం ఆస్పత్రిలో పలు విభాగాల్లో విధులు నిర్వర్తించే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు వేతనాలు ఇస్తోంది. వారు యూనిట్ చీఫ్‌గా ఉన్నా.. వారానికి ఒకటి, రెండు రోజుల్లో కనీసం మూడు గంటల పాటు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా సమస్య చెప్పుకుందామని వెళ్తే ఆర్‌ఎంఓల కుర్చీలు ఎప్పుడు చూసినా ఖాళీగా దర్శనమిస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. ఈ విషయం కలెక్టర్‌తోపాటు, ఎంజీఎం సూపరింటెండెంట్‌కు సైతం స్పష్టంగా తెలుసు. కానీ, వీరిపై చర్యలు తీసుకోవడానికి తమకు అధికారం లేదని పరిపాలనాధికారులు పేర్కొంటున్నారు. వీరిపై రాష్ట్రస్థాయిలో డీఎంఈ స్థాయి అధికారి మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఉండడం వీరికి వరంగా మారింది. -
వరంగల్‌కు నేడు సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ నగరానికి రానున్నారు. కాజీపేటలోని పీజీఆర్ గార్డెన్స్‌లో జరిగే నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు. సీఎం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి డాక్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ హెలిపాడ్‌కు బయలుదేరుతారు. 12.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1 గంటకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.05 గంటలకు కాజీపేట ప్రశాంత్‌నగర్‌లోని పీజీఆర్ గార్డెన్స్‌కు చేరుకుంటారు. 1.15 – 1.45 గంటల వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించి ఆయన తల్లి ‘మాతృయజ్ఞం’ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.45 గంటలకు పీజీఆర్ గార్డెన్ నుంచి బయలుదేరి 2.00 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పీజీఆర్ గార్డెన్స్ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. సీపీ వెంట జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, ఏసీపీలు పింగిళి ప్రశాంత్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు హనుమకొండకు.. 2 గంటలకు తిరుగు పయనం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించనున్న ముఖ్యమంత్రి -
ఏకాభిప్రాయంతోనే డీసీసీ అధ్యక్షుల ఎంపిక
ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయిక్ వరంగల్: ఏకాభిప్రాయంతో డీసీసీ అధ్యక్షుల నియామకం జరుగుతుందని ఏఐసీసీ వరంగల్, హనుమకొండ జిల్లాల పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ అన్నారు. హనుకొండలోని వరంగల్ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడువులోగా వచ్చిన దరఖాస్తులను పీసీసీ, ఏఐసీసీ దృష్టికి తీసుకుపోయి డీసీసీ అధ్యక్షులను ప్రకటిస్తామని వెల్లడించారు. వరంగల్ జిల్లాలో అంతర్గత కుమ్ములాటపై స్పందించాలని విలేకరులు అడిగారు. కేవలం డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం పరిశీలికుడిగా వచ్చానని, పార్టీ అంతర్గత విషయాలపై తాను మాట్లాడనని, అయితే ఇక్కడ పరిస్థితులను మాత్రం పీసీసీ, ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తానని నవజ్యోతి పట్నాయక్ సమాధానం ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి తగిన ప్రాధాన్యం ఇస్తారని అన్నారు. సోమవారం మేడారం పర్యటనకు ఎందుకు గైర్హాజరయ్యారని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై ఆమె స్పందిస్తూ మంత్రిగా తనకు పనులు ఉండడంతోనే మేడారం పోలేదని, ఇలాంటి విషయాలపై కామెంట్ చేయనని అన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడారు. జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ పరిశీలకులు దుర్గం భాస్కర్, మసూద్, రేణుక, ఆదర్శ్, జైస్వాల్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కార్పొరేటర్లు బస్వరాజు కుమారస్వామి, గుండేటి నరేంద్రకుమార్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కురుమి పరమేశ్, పీసీసీ నాయకులు వరదరాజేశ్వర్‌రావు, నవీన్‌రాజ్, అయూబ్‌ఖాన్, మీసాల ప్రకాశ్, కొత్తపల్లి శ్రీనివాస్, గోరంట్ల రాజు తదితరులు పాల్గొన్నారు. -
మామునూరు హద్దుల స్థిరీకరణపై దృష్టి
సాక్షి, వరంగల్: వరంగల్వాసుల చిరకాలకోరిక అయిన మామునూరు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) వద్ద 696.14 ఎకరాలు ఉండగా.. విమానాశ్రయం పునరుద్ధరించడానికి అవసరమైన మరో 253 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం భూనిర్వాసితుల నుంచి సేకరించి కేంద్రానికి ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాల్లో భూనష్టపరిహారం నగదు జమ అవుతున్న క్రమంలోనే ఇంకోవైపు ఆ భూముల హద్దుల స్థిరీకరణకు డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థల నుంచి బిడ్లను ఏఏఐ ఆహ్వానించిన విషయం తెలిసిందే. గత నెల 30 నుంచి ఈ నెల 14వ తేదీ వరకు బిడ్లను వేయడానికి అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే కొన్ని డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థలు ఈ బిడ్‌ను దక్కించుకునేందుకు ఆసక్తి చూపాయి. త్వరలోనే ఓ కన్సల్టెన్సీ సంస్థకు ఈ హద్దుల స్థిరీకరణ బాధ్యతలు అప్పగించి విమానాశ్రయ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తారని విమానాశ్రయ అధికారులంటున్నారు. మిగిలిన పరిహారానికి ప్రతిపాదనలు.. ఇప్పటికే జిల్లా రెవెన్యూ అధికారులు నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో 253 ఎకరాలను గుర్తించి ఆయా భూయజమానులతో దఫాలవారీగా సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ భూమి ఎకరానికి రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూమికి గజానికి రూ.4,887గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు సుమారు రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు భూనిర్వాసితులకు పరిహారం చెల్లించారని తెలిసింది. మిగిలింది కూడా సాధ్యమైనంత తొందరగా ఇవ్వడం ద్వారా విమానాశ్రయ నిర్మాణానికి ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు అంటున్నారు. భూపరిహారానికి అదనంగా అవసరమయ్యే డబ్బుల విషయంలో ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అవీ రాగానే అంతా క్లియర్ అవుతుందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏఏఐకి భూమి బదలాయించనున్నారు. పాత రోజులు గుర్తొచ్చేలా... కేంద్రం ఉడాన్ పథకం కింద 2022 సెప్టెంబర్‌లో మామునూరు విమానాశ్రయాన్ని ఎంపిక చేసింది. నిజాం కాలంలోని ఈ విమానాశ్రయంలో ఎయిర్‌స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్ వే ఉంది. ఈ రన్ వే విస్తరణకు అదనంగా 253 ఎకరాల భూమి అవసరం కావడంతో సేకరిస్తున్నారు. మళ్లీ పాత రోజుల్లోలాగానే వరంగల్‌లో విమానం ఎగిరేలా అధికారులు పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వరంగల్ చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి మూడు గంటల ప్రయాణం ఉంటుంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో అంతర్జాతీయ వస్త్ర పరిశ్రమ సంస్థల ఏర్పాటు, ఐటీ రంగం విస్తరణ, ఇతర వ్యాపారాల అభివృద్ధితో పాటు పర్యాటకాన్ని మరింత ప్రగతి బాట పట్టించేందుకు ఈ విమానాశ్రయం పునరుద్ధరణ ఎంతగానో ఉపయోగపడనుంది. కరీంనగర్‌తో పాటు ఖమ్మం, నల్లగొండ జిల్లా ప్రజలకు కూడా ఇది ఉపయోగపడేలా ఆయా మార్గాల్లోని రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. మరో రెండేళ్లలో మాము నూరు విమానాశ్రయ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ముందుకెళ్తున్నారు. విమానాశ్రయం పునరుద్ధరణపై ప్రభుత్వ విభాగాల కసరత్తు ఇప్పటికే బిడ్లను పిలిచిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 949.14 ఎకరాల హద్దులకు డీపీఆర్ కన్సల్టెన్సీ సంస్థల ఆసక్తి ఇది ఫైనల్ కాగానే నివేదికను సిద్ధం చేసి ఏఏఐకి అప్పగింత -
84,654 మందికి పోలియో చుక్కలు
ఎంజీఎం: హనుమకొండ జిల్లాలో 84,654 మంది (100.4 శాతం) పిల్లలకు పోలియో చుక్కలు పంపిణీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ.అప్పయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం 472 పోలియో కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్, మొబైల్ బృందాలతో పోలియో చుక్కలు వేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం వైద్యసిబ్బంది ఇంటింటికి తిరిగి పిల్లలకు పోలియో చుక్కలు వేసిన కార్యక్రమాన్ని పరిశీలించినట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, మహిళా సమాఖ్య సభ్యులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, నర్సింగ్ విద్యార్థులు పాలుపంచుకున్నట్లు పేర్కొన్నారు. హన్మకొండ అర్బన్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ద్వారా 1 జూలై 2017 నుంచి 31 అక్టోబర్ 2025 మధ్య కాలంలో సంస్థలో చేరిన, ఈపీఎఫ్‌లో నమోదు కాకపోయిన, ప్రస్తుతం జీవించి ఉన్న, ఉద్యోగంలో ఉన్నవారిని ఈపీఎఫ్ఓ అందించే ఆన్లైన్ సౌకర్యం ద్వారా సంస్థలు ఉద్యోగుల నమోదు చేసుకోవాలని వరంగల్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్–2 వైడీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని ద్వారా ఉద్యోగుల సామాజిక భద్రత కవరేజీ పెరుగుతుందని, సంస్థలు తక్కువ ఆర్థిక, చట్టపరమైన భారంతో గత రికార్డులను సాధారణీకరించుకోవచ్చని, వ్యాపార నిర్వహణ సులభతరమవుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు వరంగల్ ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయాన్ని సందర్శించాలని ఆయన సూచించారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో మంగళవారం ఉదయం హుండీ లెక్కింపు నిర్వహించారు. మూడు నెలల 20 రోజుల హుండీ ఆదాయం 5,56,967 రూపాయలు, పూజా టికెట్ల ద్వారా రూ.6,30,000 వచ్చింది. మొత్తం ఆదాయం రూ. 11,86,967 సమకూరిందని ఈఓ ధరణికోట అనిల్‌కుమార్ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో పర్యవేక్షకుడిగా దేవాదాయశాఖ పరిశీలకుడు ప్రసాద్ వ్యవహరించారు. దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, సిబ్బంది మధుకర్, లింగబత్తుల రామకృష్ణ, రజిత, హనుమకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది, రాజరాజేశ్వర సేవాసమితి మహిళా సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ విడుదల చేసిన జిమ్నాస్టిక్ డిప్లొమా ఇన్ కోచింగ్ 2024–25 ఫలితాల్లో వరంగల్ జిమ్నాస్ట్‌లు జాతీయస్థాయిలో టాప్ ర్యాంకులు సాధించారు. వరంగల్‌లోని ఉర్సుకు చెందిన పేర్న సూర్యదేవ్ 72.12 శాతం మార్కులతో మొదటి ర్యాంకు, హనుమకొండలోని గుడిబండల్‌కు చెందిన జంగా శివసాయి 68.07 శాతంతో నాలుగో ర్యాంకు, లష్కర్బజార్కు చెందిన తెల్లి ప్రశాంత్ 60.83 శాతంతో సెకండ్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని జిమ్నాస్టిక్ అకాడమీలో 2009 నుంచి 2021 వరకు ముగ్గురు క్రీడాకారులు శిక్షణ పొందారు. ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించి అనేక జాతీయస్థాయి జిమ్నాస్టిక్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. వరంగల్ ఖ్యాతిని దేశం నలుమూలల చాటిన ముగ్గురు క్రీడాకారులను జిమ్నాస్టిక్స్ వరంగల్ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ నెమరుగొమ్ముల రమేశ్‌రావు అభినందించారు. -
విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు విద్యారణ్యపురి: విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యా యమూర్తి డాక్టర్ పట్టాభిరామారావు అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలోని లష్కర్‌బజార్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే కష్టపడి చదివితే ఉన్నత స్థితికి చేరుకుంటారని తెలిపారు. బాలికలకు సురక్షిత, ఆరోగ్యకర, సమానమైన భవిష్యత్ అందించడం మనందరి బాధ్యత అన్నారు. సదస్సులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు దామోదర్, జిల్లా బాలల పరిరక్షణ విభా గం ఇన్చార్జ్ అధికారి ఎస్.ప్రవీణ్‌కుమార్, సఖీవన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ పి.హైమవతి, మహిళా సాధికారిత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ డి.కల్యాణి, హనుమకొండ సీడీపీఓ ఎం.విశ్వజ, భరోసా కేంద్రం ఎస్సై బి.మంగ, పాఠశాల హెచ్ఎం ఉమ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
ట్రాన్స్ఫర్ స్టేషన్‌ను శుభ్రంగా ఉంచాలి
నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నిర్వహణ సమర్థవంతంగా కొనసాగించాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ పోతన నగర్లో బల్దియా నిర్వహిస్తున్న పోతన, బాలసముద్రంలోని సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను మేయర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ట్రాన్స్ఫర్ స్టేషన్ ఆవరణలో ప్లాంటేషన్ కోసం మొక్కలు నాటాలని కోరారు. ఇండోర్ మాదిరిగా శుభ్రంగా ఉంచాలని, స్వచ్ఛ ఆటోల ద్వారా వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు డంప్ యార్డుకు తరలించాలని, ట్రాన్్స్ఫర్ స్టేషన్లో రెండు వాటర్ సర్వీసింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. సిబ్బంది మాస్క్‌లు, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని, డ్రైవర్లు వాహనాల మరమ్మతులు చూసుకోవాలని పేర్కొన్నారు. ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈలు రవికుమార్, మహేందర్, డీఈలు రాజ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, రాగి శ్రీకాంత్, శానిటరీ సూపర్ వైజర్ గోల్కొండ శ్రీను, ఏఈలు నరేశ్, సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ వరంగల్ లీగల్: స్వదేశీ వస్త్రాలు, చేనేత వస్రాలను ప్రోత్సహించాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘం–వరంగల్ డివిజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకం కేంద్రాన్ని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావుతో కలిసి బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి నిర్మలాగీతాంబ మాట్లాడుతూ మన వాతావరణానికి చేనేత వస్త్రాలు శాసీ్త్రయంగా చల్లదనంతో పాటు సౌలభ్యంగా ఉంటాయని తెలిపారు. సింఽథటిక్తో తయారుచేసిన విదేశీ వస్త్రాలు సౌకర్యవంతంగా ఉండవని పేర్కొన్నారు. చేనేత ప్రదర్శన, అమ్మకం కౌంటర్ నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్, కార్యదర్శి రమాకాంత్, ఉపాధ్యక్షుడు జయపాల్, కోశాధికారి అరుణ, సీనియర్ న్యాయవాదులు జీవన్‌గౌడ్, ఆనంద్‌మోహన్, కొండబత్తుల రమేశ్‌బాబు, చిర్ర సాంబశివరాజు, రాచకొండ కృష్ణ, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు పేర్వారం జగన్నాథం స్మారక పురస్కార ప్రదానం
హన్మకొండ కల్చరల్ : హనుమకొండ వడ్డెపల్లి రోడ్డులోని పీఆర్ భవన్లో రేపు (గురువారం) సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పేర్వారం జగన్నాథం స్మారకంగా పురస్కార ప్రదానం చేస్తున్నామని పేర్వారం జగన్నాథం ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ పేర్వారం శంకర్రావు, శ్రీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కార ప్రదానోత్సవంలో భాగంగా 2023 సంవత్సరానికి గాను సాహితీవేత్త డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, 2024 సంవత్సరానికి సాహితీవేత్త డాక్టర్ పెద్ది వెంకటయ్య, 2025 సంవత్సరానికి కవి పొట్లపల్లి శ్రీనివాసరావుకు ప్రొఫెసర్ పేర్వారం జగన్నాథం స్మారక పురస్కార ప్రదానం చేయనున్న ప్రకటించారు. కార్యక్రమానికి కేయూ విశ్రాంత ఆచార్యులు బన్న అయిలయ్య సభాధ్యక్షుడిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ముఖ్య అతిథి గా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత డాక్టర్ అంపశయ్య నవీన్, కాంగ్రెస్ నాయకులు ఈవీ శ్రీనివాసరావు, కవి వీఆర్ విద్యార్థి పాల్గొంటారని తెలిపారు. కవులు, రచయితలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పొట్లపల్లి శ్రీనివాసరావు డాక్టర్ లింగంపల్లి రామచంద్రడాక్టర్ పెద్ది వెంకటయ్య -
ఎమ్మెల్యే ‘దొంతి’కి మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శ
నర్సంపేట: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం రాత్రి పరామర్శించారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మంత్రి శ్రీధర్‌బాబు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి గాజర్ల అశోక్‌కుమార్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. అలాగే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం వేర్వేరుగా కాంతమ్మ చిత్ర పటం వద్ద నివాళులర్పించి ఎమ్మెల్యే మాధవరెడ్డిని పరామర్శించారు. -
దీప్తి.. ఘనకీర్తి
● మరో గోల్డ్ మెడల్ సాధించిన భారత పారా అథ్లెట్ పర్వతగిరి: ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతున్న విర్ట్చూస్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2025లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జివాంజీ దీప్తి మరో గోల్డ్ మెడల్ సాధించారు. ఇటీవల టీ–20 విభాగంలో 400మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించగా, మంగళవారం జరిగిన 200మీటర్లపరుగు పందెంలో మరో గోల్డ్ మెడల్ సాధించింది. దీప్తి పలు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. దీనిపై తల్లిదండ్రులు, గ్రామస్తులు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్‌గా వేణుగోపాల్ గౌడ్ హన్మకొండ: తెలంగాణ స్టేట్ బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్‌గా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్‌ను నియమించినట్లు ఆ జేఏసీ రాష్ట్ర కార్యనిర్వాహక చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న హనుమకొండ నయీంనగర్‌కు చెందిన వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్‌ను ఈ పదవిలో నియమిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. కాగా, బీసీలను రాజకీయంగా ఎదగకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అడ్డుకుంటున్న వారికి తగిన బుద్ధి చెబుతామని వేణుగోపాల్ గౌడ్ అన్నారు. తనను ఈ పదవిలో నియమించిన జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య, కార్యనిర్వాహక చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ నారగోని, కోచైర్మన్లు రాజారాం యాదవ్, దాసు సురేశ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పాత ఫీజులనే కొనసాగిస్తాం ● రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం కేయూ క్యాంపస్ : గత విద్యాసంవత్సరంలోని కామన్ సర్వీస్, పరీక్ష ఫీజులనే కొనసాగిస్తామని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కేయూ పరిధిలో 2025–26 విద్యాసంవత్సరానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ కోర్సుల (నాన్ ప్రొఫెషనల్) కామన్ సర్వీస్, పరీక్ష ఫీజులను పెంపుదలపై వివిధ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో 2024–25లో ఉన్న ఫీజులనే కొనసాగిస్తామన్నారు. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపా ళ్లు తమ కళాశాలల విద్యార్థులకు కూడా తెలియజేయాలని రిజిస్ట్రార్ కోరారు. చేపల వల కాలికి తట్టుకొని యువకుడి మృతి గార్ల : కాలికి చేపల వల తట్టుకొని చెరువులో పడి ప్రమాదవశాత్తు ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్ల గార్ల మండలం గోపాలపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాంపాటి ఉపేందర్ (32), అదే గ్రామానికి చెందిన నర్సయ్యతో కలిసి సమీపంలోని అప్పసముద్రం చెరువులో రాత్రివేళ చేపల వేటకు వెళ్లారు. అయితే ఇద్దరిలో నర్సయ్య ఒక్కడే ఇంటికి వచ్చి నిద్రించాడు. ఉదయమైనా ఉపేందర్ ఇంటికి రాకపోవడంతో మృతుడి తల్లి కోటమ్మ కుటుంబ సభ్యులతో కలిసి చెరువులో గాలించగా, ఉపేందర్ శవమై కనిపించాడు. మృతుడి కాళ్లకు చేపల వల చుట్టుకొని చనిపోయి ఉన్నాడు. మృతుడితో కలిసి వెళ్లిన నర్సయ్యను పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కే రియాజ్‌పాషా తెలిపారు. -
ఆటోలు ఢీ.. ఐదుగురికి గాయాలు
● క్షతగాత్రులను ఎంజీఎంకు తరలింపు ఖిలా వరంగల్ : వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఓ ఆటో అతివేగంగా వెళ్తూ ముందు వెళ్తున్న ఆటోతో పాటు బైక్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు, ఇద్దరు ఆటో డ్రైవర్లు, ఓ వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని నాయుడు పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మామునూరు నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఆటోను మద్యం మత్తులో డ్రైవర్ అతివేగంగా నడుపుతూ ఇద్దరు ప్రయాణికులతో ముందు వెళ్తున్న ఆటోను, ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, ఒక ద్విచక్రవాహన దారుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిలో పర్వతగిరి మండలం చింతనెక్కొండకు చెందిన కుడికాల వర్షిత (20), హనుమకొండ గుండ్లసింగారానికి చెందిన గుగులోత్ రాజేందర్ (32) ప్రయాణికులు కాగా.. ప్రభుత్వ టీచర్ ద్విచక్రవాహనదారుడు బురాన్‌పల్లి గ్రామానికి చెందిన కొప్పుల మహేందర్ (40)కాగా..వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బర్ల రవి, మరో ఆటో డ్రైవర్ గణేష్‌నగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ భూక్య తిరుపతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బోల్తా పడిన ఆటోలను ఎత్తి క్షతగాత్రులను బయటకు తీసి వెంటనే 108 వాహనంలో ఎంజీఎంకు తరలించారు. కాగా ఓ ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఖమ్మం జాతీయ రహదారిపై అతివేగంగా డ్రైవ్ చేయటం వల్ల ఆటో అదుపు తప్పి ప్రయాణికుల ఆటోతో పాటు బైక్‌ను ఢీకొట్టాడని చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే మామునూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి క్షతగాత్రుల వివరాలు సేకరించినట్లు తెలిసింది. -
అన్మ్యాన్డ్ వర్కర్ కుటుంబానికి ఆర్థిక సాయం
హన్మకొండ: విధి నిర్వహణలో ప్రాణం కోల్పోయిన టీజీ ఎన్పీడీసీఎల్ అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ గట్ల కరుణాకర్ రెడ్డి కుటుంబానికి ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. మహబూబాబాద్ మండలం ఈదులపూసలపల్లి గ్రామానికి చెందిన అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ గట్ల కరుణాకర్ రెడ్డి విధి నిర్వహణలో ప్రాణం కోల్పోయాడు. కాగా, మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో కరుణాకర్ రెడ్డి భార్య ప్రియాంకకు సీఎండీ రూ. 20 లక్షల బీమా చెక్కు అందించారు. కార్యక్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డి, న్యూఇండియా ఎష్యు రెన్సు కంపెనీ హనుమకొండ డివిజినల్ ఆఫీస్ సీనియర్ డివిజనల్ మేనేజర్ నాగభట్ల జ్యోతిర్మయి, మార్కెటింగ్ మేనేజర్ రాజేశ్, కాంట్రాక్టర్ సైదులు, తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు
వరంగల్ లీగల్ : హత్య కేసులో గొడుగు కావ్యకు జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధి స్తూ హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పట్టాభిరామారావు మంగళవారం తీర్పు వెలువరించారు. పోలీసుల కథనం ప్రకారం హనుమకొండ బాలసముద్రానికి చెందిన భూమ రాజు, సిరి దంపతులు, చిట్యాల మండలం నైన్‌పాకకు చెంది ప్రస్తుతం నగరంలోని హంటర్‌రోడ్డులో నివాసముంటున్న గొడుగు గణేశ్, కావ్య దంపతులు స్నేహితులు. ఈ క్రమంలో ‘అచల’ చిట్‌ఫండ్‌లో ఏజెంట్‌గా పనిచేస్తున్న గణేశ్ ద్వారా భూమ రాజు రూ.10 లక్షల చిట్టీ వేశాడు. 2021 జనవరిలో చిట్టీ పాట పాడాడు. చిట్టీ ఫండ్ యాజమాన్యం సకాలంలో డబ్బులు చెల్లించలేదు. దీంతో మీ ద్వారా చీటి డబ్బులు చెల్లించామని, అందుకే మీరే బాధ్యత వహించాలని గణేశ్, కావ్య దంపతులపై భూమ రాజు దంపతులు ఒత్తిడి చేశారు. ఈ విషయంపై 2021, సెప్టెంబర్‌లో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో కోపోద్రిక్తురాలైన కావ్య.. మరోసారి డబ్బుల అడిగితే మీ ఇద్దరిని చంపుతానని బెదిరించింది. అయినా రాజు, సిరి దంపతులు డబ్బుల ఇవ్వాలని డిమాండ్ చేశా రు. దీంతో 2021, సెప్టెంబర్ 3న కావ్య పథకం ప్ర కారం రాజు పని చేసే హనుమకొండ డీసీసీ భవన్ వద్ద ఉన్న మొబైల్ రిపేర్ షాప్ వద్దకు వెళ్లింది. అప్పటికే సిరి కూడా అక్కడే ఉంది. ఈ క్రమంలో కావ్య తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ రాజుపై పోసి లైటర్‌తో నిప్పంటించింది. దీంతో ఎవరు నువ్వు అంటూ సిరి.. కావ్య మొహానికి ఉన్న స్కార్ఫ్ తీసే ప్రయత్నం చేసింది. అప్పటికే బాగా వ్యాపించిన మంటల్లో కావ్య స్కార్ఫ్ కూడా కాలింది. దీంతో సిరి తన భర్త రాజును బతికించుకునే ప్రయత్నంలో భా గంగా షాపులోపలికి వెళ్లగా కావ్య అక్కడి నుంచి పరారైంది. అనంతరం తన భర్త గణేశ్‌కు సమాచారం అందించగా ఇద్దరు కలిసి శివనగర్‌లోని తన చిన్నమ్మ ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు పోలీసుల గాలింపు చర్యలు తీవ్రం కావడంతో పారిపోవాలనే ఉద్దేశంతో కాశిబుగ్గ సెంటర్‌కు రాగా గుర్తించిన పోలీసులు ఇద్దరి అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం హత్యా నేరం కింది కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువుకావడంతో కావ్య కు జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ, ఆమె భర్త గణేశ్‌ను నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లు జడ్జి తీర్పులో పేర్కొన్నారు. -
అథ్లెట్లకు అసౌకర్యం కలగొద్దు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా మూడు రోజులపాటు జరుగనున్న జాతీయస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు హాజరయ్యే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు అండర్–23 నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరుగనున్న నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మేయర్ సుధారాణి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు వెయ్యి మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ మీట్‌ను విజయవంతంగా పూర్తి చేయాలని, క్రీడాకారులకు తాగునీరు, వైద్యం, పరిశుభ్రత, లైటింగ్ తదితర సౌకర్యాలను కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్‌కుమార్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఎంహెచ్ఓ రాజిరెడ్డి, ఈఈ రవీందర్, డీఈ సారంగం, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి 16 నుంచి జాతీయస్థాయి అథ్లెటిక్స్ మీట్ జేఎన్‌ఎస్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ -
బాలికలకు భరోసా..
విద్యారణ్యపురి : 2025–2026 విద్యాసంవత్సరంలో పీఎంశ్రీ పాఠశాలల్లో ఇక బాలికల సాధికారత, కౌమార దశ భద్రతాక్లబ్‌లు ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్‌నికోలస్ సంబంధిత జిల్లావిద్యాశాఖాఽధికారులను ఇటీవల ఆదేశించారు. దీంతో ఉమ్మడివరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో బాలికల సాధికారత, కౌమారదశ భద్రతాక్లబ్‌లు ఏర్పాటుచేయబోతున్నారు. ఈ క్లబ్‌ల ముఖ్య ఉద్దేశం ● బాలికలకు కౌమారదశలో ఆరోగ్యం, హైజిన్, లైంగిక అంశాలపై అవగాహన కల్పించడం. ● ఆర్థిక, న్యాయ,సైబర్ భద్రత, డ్రగ్స్, మానసిక ఆరోగ్యం, కేరీర్‌పై విద్యార్థినులకు శిక్షణ ● పాఠశాలల్లో ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ఏర్పాటు, పోలీస్ లింకేజీతో బాల్యవివాహాలు, సైబర్ సమస్యలను గుర్తించి నివేదిక ఇవ్వడం లాంటి అంశాలు క్లబ్‌లు చేయాల్సి ఉంటుంది. కౌమారదశ భద్రత క్లబ్ నిర్మాణం.. ● జిల్లాల్లోని పీఎంశ్రీ పాఠశాలలో క్లబ్ నిర్మాణం ఇలా ఉంటుంది. ప్రతీతరగతి నుంచి ఇద్దరు విద్యార్థులు, (బాలుడు, బాలిక), ఒక మహిళా, ఒక పురుష ఉపాధ్యాయులు గైడ్‌గా ఉంటారు ● హెడ్మాస్టర్ క్లబ్చైర్మన్గా, స్థానిక పోలీస్కానిస్టే బుల్ బాహ్యసభ్యుడుగా ఉంటారు. ప్రతీపాఠశాలలో 14నుంచి 16 మంది సభ్యులు ఉండేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. పీఎంశ్రీపాఠశాలలో గ్రీవెన్స్బాక్స్లు పీఎంశ్రీపాఠశాలల్లో గ్రీవెన్స్బాక్స్లు ఏర్పాటుచేయాల్సింటుంది. బాలికల కోసం ప్రత్యేకంగా ఫిర్యాదులకు ఒకబాక్స్, సాధారణ ఫిర్యాదులకోసం మరొ బాక్స్‌ను ఏర్పాటు చే స్తారు. వేధింపులు, చైల్డ్ మ్యారేజ్, సైబర్‌మోసం వంటి సమస్యలను నివారించేందు కుగాను చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. క్లబ్‌ల ఏర్పాటు నేటినుంచి అమలులోకి.. పీఎంశ్రీస్కూళ్లలో ఈ క్లబ్‌ల ఏర్పాటు ఈనెల 15నుంచి అమలులోకి తీసుకురానున్నారు. నెలవారీగా ఏయే కార్యక్రమాలు చేపట్టాలనేది పలు అంశాలు ఉన్నాయి. అక్టోబర్‌లో బాలల లైంగిక దుర్వినియోగం, ఆరోగ్యం, ఆర్థిక సాక్షరతపై అవగాహన కల్పిస్తారు. నవంబర్‌లో న్యాయసాక్షరత, సైబర్ భద్రత, స్వీయరక్షణ, డిసెంబర్లో మానసిక ఆరోగ్యం, 2026 జనవరిలో జీవన నైపుణ్యాలు, బాల్యవివాహాలు, నేషనల్ గర్ల్స్ చైల్డ్‌డే పై అవగాహన కల్పిస్తారు. ఫిబ్రవరిలో కేరీర్ మార్గనిర్దేశంపై అవగాహన కల్పిస్తారు. పలు అంశాలు ఆన్‌లైన్‌లోకూడా సెషన్లు టీసాట్ ద్వారా నిర్వహిస్తారు. ఇందుకు కూడా షెడ్యూల్ ప్రకారం కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్రంలో 658 పీఎంశ్రీ స్కూళ్లలో బాలికల భద్రత సురక్షిత వాతావరణం, సఫలీకరణకు దోహదపడే గర్ల్స్ చైల్డ్ ఎంపవర్మెంట్, అడోలోసెంట్ సేఫ్ట్టీ క్లబ్స్ (సీజీఈఏఎస్సీఎస్) ఏర్పాటుచేస్తారు. ప్రతీ పీఎంశ్రీ పాఠశాలకు రూ.15వేలు బాలకలసాధికారత, బాలికల కౌమారదశభద్రతాక్లబ్లను ఏర్పాటుచేస్తున్న ఆయాపీఎంశ్రీ పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ. 15వేల చొప్పున మంజూరు చేశారు.ఆయానిధులు ఎలా వినియోగించుకోవాలో కూడా ఆయాపాఠశాలల హెచ్ఎంలకు సమాచారం అందించారు. ఈనెల 15వరకు క్లబ్ ఏర్పాటు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. పీటీఎం సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించాల్సింటుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో లైన్ డిపార్టుమెంట్లతో సమన్వయం జరగాల్సి ఉంటుంది. జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్, లింగసమానత్వం కోఆర్డినేటర్ పర్యవేక్షిస్తారు. ఈ క్లబ్‌ల నిర్మాణం జరిగే పీఎం శ్రీ స్కూళ్ల సంఖ్య జిల్లాల వారీగా ఇలా జిల్లా పాఠశాలల సంఖ్య హనుమకొండ 13 వరంగల్ 14 జనగామ 15 మహబూబాబాద్ 21 ములుగు 08 జయశంకర్ భూపాలపల్లి 07 పీఎంశ్రీ స్కూళ్లలో విద్యార్థినుల సాధికారత, కౌమారదశ భద్రతాక్లబ్‌లు ఏర్పాటు ఒక్కో పాఠశాలకు రూ. 15 వేల చొప్పున మంజూరు నేటి నుంచి అమలుకు ఉపక్రమణ -
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఖిలా వరంగల్ : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం అందించే ఆర్థిక చేయూతను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈమేరకు మంగళవారం వరంగల్ 35వ డివిజన్ శివనగర్‌లోని సాయి కన్వెన్షన్ హాల్లో తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్ అధ్యక్షతన వరంగల్, ఖిలా వరంగల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో ప్రతీ ఇంటికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తూర్పులో 500 మందికి పైగా లబ్ధిదారులకు రూ.5,30,61,480 విలువైన కల్యాణాలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, రూ.35,37,700 విలువైన సీఎ రిలీఫ్ ఫండ్ చెక్కులతోపాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు ధ్రువ పత్రాలు అందజేశామని తెలిపారు. డీఆర్ఓ విజయలక్ష్మి, బల్దియా ఉప కమిషనర్ ప్రసన్నా రాణి, కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, పోశాల పద్మ, చింతాకుల అనిల్, దిడ్డి కుమారస్వామి, కావేటి కవిత, పల్లం పద్మ, గుండు చందన ,నాయకులు శామంతుల శ్రీనివాస్, గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్ పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ -
మల్లేశ్ అంత్యక్రియలు పూర్తి
దేవరుప్పుల : రిమాండ్ ఖైదీ వారాల మల్లేశ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. జైళ్ల శాఖ నిబంధనల మేరకు మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని పోలీసుల నిఘాలో స్వగ్రామం సింగరాజుపల్లికి తరలించి అదేరోజు సాయంత్రం అంత్యక్రియలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన వారాల మల్లేశ్‌కు ఇదే గ్రామానికి చెందిన మిత్రుడు పడకంటి బ్రహ్మచారితో సరదాగా గొడవ జరిగింది. ఇందులో కర్ర తగిలి బ్రహ్మచారి చేయి విరిగింది. ఈ విషయమై పీఎస్‌లో కేసు నమోదు కాగా హాస్పిటల్ నివేదిక ఆధారంగా మల్లేశ్‌ను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించింది. దీంతో మనస్తాపానికి గురైన మల్లేశ్ జనగామ సబ్ జైలులో బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వ్యూహాత్మకంతో ప్రశాంతంగా అంత్యక్రియలు.. రిమాండ్ ఖైదీ మల్లేశ్ ఆత్మహత్య తీరుపై గ్రామస్తులు కోపోద్రిక్తులై ఇప్పటికే జనగామ జైలు ఎదుట ఆందోళన చేపట్టిన విషయం విధితమే. ఈ తరుణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో మల్లేశ్అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిశాయి. వరంగల్ ఎంజీఎంలో ఉస్మానియా, గాంధీ, వరంగల్ కేఎంసీ వైద్య బృందం పర్యవేక్షణలో పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో మల్లేశ్ మృతదేహాన్ని జనగామ మీదుగా కాకుండా ఇతర మార్గాల ద్వారా సింగరాజుపల్లికి తరలించగా కుటుంబీకులు అంత్యక్రియలు పూర్తి చేశారు. పాలకుర్తి సీఐ జానకీరామిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఎలాంటి ఆందోళనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. హైమా కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు? మల్లేశ్ ఆత్మహత్యతో హైమ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్న మల్లేశ్, హైమా దంపతులకు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు కాగా ప్రస్తుతం హైమా మరోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో మల్లేశ్ ఆత్మహత్యతో ఆ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరని బంధువులు, గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం, అధికారులు స్పందించి హైమా కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ఇప్ప వీరారెడ్డి, సింగారపు రమేశ్, తదితరులు డిమాండ్ చేశారు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహం తరలింపు పోలీసుల నిఘాలో ముగిసిన దహన సంస్కారాలు -
కనీస వసతులు కల్పించండి
వరంగల్ అర్బన్: కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని, నగర వ్యాప్తంగా పలు కాలనీల వాసులు గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌కి విజ్ఞప్తి చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్లో కమిషనర్ దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు అందించిన ఫిర్యాదులకు జవాబుదారీగా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, గ్రీవెన్స్‌కు మొత్తం 70 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ, సీహెచ్ఓ రమేశ్, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, పన్నుల అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● కీర్తినగర్‌లో 45–9–127 డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలని వి.లలిత ఫిర్యాదు చేశారు. ● హనుమకొండ మున్నూరుకాపు కాలనీ 7–7–336 ప్రాంతంలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ, నల్లా పైప్లైన్లు ఏర్పాటు చేయాలని కాలనీవా సులు కోరారు. ● 15వ డివిజన్ గొర్రెకుంటలో రోడ్డు మధ్యలో ప్రమాదకర విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఎస్.రవి విన్నవించారు. ● 2వ డివిజన్ రెడ్డిపురంలో డ్రెయినేజీ నిర్మించాలని పి.ముంజుల కోరారు. ● 35వ డివిజన్ పుప్పాలగుట్టలో సీసీ రోడ్లు నిర్మించాలని లక్ష్మీగణపతి కాలనీవాసులు కోరారు. ● హనుమకొండ మాదిరెడ్డి కాలనీ 3–9–205 సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని డిప్యూటీ తహసీల్దార్ విజయ శ్రీ వినతి పత్రం అందించారు. ● హనుమకొండ అడ్వకేట్స్ కాలనీ న్యూ స్వరాజ్యలక్ష్మి రెసిడెన్సీలో సీసీ రోడ్డు నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● హనుమకొండ పోస్టల్ కాలనీలో 40 ఫీట్ల రోడ్డు ఆక్రమణకు గురవుతోందని చర్యలు తీసుకోవాలని దరఖాస్తు అందజేశారు. ● 55వ డివిజన్ నేచర్ కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, నూతనంగా నిర్మించా లని వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ● హనుమకొండ రామారంలోని సహ వికాస కాలనీలో డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు వినతి పత్రం సమర్పించారు. ● 1వ డివిజన్ ఎర్రగట్టు గుట్ట శ్రీనివాస కాలనీరోడ్డు–2లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● 4వ డివిజన్ యాదవనగర్ జంక్షన్ నుంచి 900 మీటర్ల సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని రెడ్డిపురం రోడ్డు కాలనీల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కోరారు. ● 1వ డివిజన్ ఎర్రగగట్టు గుట్ట బాలాజీనగర్ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టాలని కాలనీ అభివృద్ధి నిర్వహకులు విజ్ఞఫ్తి చేశారు. ● వంగపహాడ్లో కమ్యూనిటీ హాల్, లైబ్రరీ ఏర్పాటు చేయాలని రైసింగ్ స్టార్స్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ● మడికొండ నెహ్రూనగర్ 30–2–727 రోడ్డును ప్లాట్లుగా చేసి విక్రస్తున్నారని చర్యలు తీసుకోవాలని ఎం.శ్రీనివాస్ విన్నవించారు. ● 32వ డివిజన్ క్రిస్టియన్ హాస్పిటల్ వెనుక సుమారు 154 కుటుంబాలకు చెందిన మట్టి రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సీసీ రోడ్డు నిర్మించాలని కోరారు. ● హనుమకొండ రెవెన్యూ కాలనీలో 80 ఫీట్ల రోడ్డు ఆక్రమణలను తొలగించి, అభివృద్ధి చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● 2వ డివిజన్ వంగపహాడ్ రింగ్ రోడ్డు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. గ్రేటర్ గ్రీవెన్స్‌లో అర్జీదారుల మొర ప్రజల నుంచి 70 ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని అధికారులకు గ్రేటర్ కమిషనర్ ఆదేశం -
డీసీసీ అధ్యక్ష ఎంపికలో నూతన ఒరవడి
ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ హన్మకొండ చౌరస్తా: దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్ష పదవుల ఎంపికలో నూతన ఒరవడికి ఏఐసీసీ శ్రీకారం చుట్టిందని ఏఐసీసీ హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. గుజరాత్లో రాహుల్‌గాంధీ పైలట్ ప్రాజెక్టుగా ఈకార్యక్రమాన్ని చేపట్టారని, అదే తరహాలో దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉంటుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య, పీసీసీ జిల్లా పరిశీలకులు దుర్గం భాస్కర్, మసూద్, రేణుక, కో–ఆర్డినేటర్ ఆదర్శ్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటన ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ సోమవారం నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. విపక్ష కార్పొరేటర్లున్న 57వ డివిజన్ హనుమకొండ శ్రీకృష్ణ కాలనీ, 59వ డివిజన్ ఎకై ్సజ్ కాలనీలో డివిజన్ కార్యకర్తలు, స్థానికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితి, ఇతర వివరాలు తెలుసుకున్నారు. పార్టీని బలోపేతం చేయాలని శ్రేణులకు సూచించారు. సమావేశంలో పీసీసీ నాయకులు అనిల్‌కుమార్, ఈ.వి.శ్రీనివాస్‌రావు, బత్తిని శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సరళ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
సాక్షిప్రతినిధి, వరంగల్ : 2025–27 సంవత్సరానికిగాను వైన్‌షాపు(ఏ–4)ల టెండర్ల దరఖాస్తుల ప్రక్రియ వేగం పుంజుకోవడం లేదు. దరఖాస్తు గడువు నేటి(మంగళవారం)తో మరో ఐదు రోజులే ఉంది. మద్యనిషేధ, ఆబ్కారీశాఖ గత నెల 26న ఉమ్మడి వరంగల్‌లో 296 దుకాణాలకు టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఈ నెల 18న సాయంత్రంతో దరఖాస్తు గడువు ముగియనుంది. నోటిఫికేషన్ ఇచ్చి సుమారు 19 రోజులు గడిచినా.. సోమవారం నాటికి 296 మద్యం దుకాణాలకు దాఖలైన దరఖాస్తుల సంఖ్య 500 దాటలేదు. గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా తక్కువని చెబుతున్న అధికారులు.. మరో ఐదు రోజులు గడువు ఉండడంతో వేచిచూసే ధోరణిలో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. వైన్‌షాపులకు ఈసారి దాఖలవుతున్న దరఖాస్తులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. 2023–25 టెండర్ల సందర్భంగా ఉమ్మడి వరంగల్‌లో 15,926 దరఖాస్తులు రాగా, ఈసారి శనివారం నాటికి కేవలం 258 వచ్చాయి. హనుమకొండ (వరంగల్ అర్బన్) జిల్లాలో 89, వరంగల్ (వరంగల్ రూరల్)లో 49, జనగామలో 34, మహబూబాబాద్‌లో 57, భూపాలపల్లి, ములుగు కలిపి 29 అప్లికేషన్లే వేశారు. సోమవారం కొంత స్పందన కనిపించినా.. ఉమ్మడి జిల్లాలో 457కే పరిమితమయ్యాయి. ఇందులో సోమవారం ఒక్కరోజే రాత్రి 8 గంటల వరకు 199 రాగా, హనుమకొండ జిల్లాలో 63, వరంగల్‌లో 46, జనగామలో 25, మహబూబాబాద్‌లో 56, భూపాలపల్లిలో 9 దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీశాఖ అధికారులు తెలిపారు. కాగా గతంలో ఎప్పుడు ఇలా జరగలేదని, దరఖాస్తుల ద్వారానే కేవలం రూ.318.52 కోట్ల ఆదాయం వచ్చిందన్న చర్చ ఉంది. రూ.2 లక్షలున్న దరఖాస్తు ధర ఈసారి రూ.3 లక్షలకు పెంచగా.. పోటీ కూడా గతేడాది మాదిరిగానే ఉండి అప్లికేషన్ల ఆదాయం రెట్టింపవుతుందని భావించారు. అందుకు భిన్నంగా దరఖాస్తులు తగ్గడం.. ఆబ్కారీశాఖను సైతం షాక్‌కు గురిచేస్తోంది. వ్యాపారుల వ్యూహం ఏంటి? వైన్‌షాపుల టెండర్ల విషయంలో మద్యం వ్యాపారుల వైఖరి ఏంటనేది అర్థం కావడం లేదు. ఇప్పటికే మద్యం ‘సిండికేట్’లనుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు పడాల్సి ఉన్నా చడీచప్పుడు లేదు. వరంగల్‌కు చెందిన కొంతమంది వ్యాపారులు సిండికేట్‌గా మారి వందల సంఖ్యలో దరఖాస్తులు వేశారు. ఒక గ్రూపు రూ.14 కోట్లు వెచ్చించి 700 దరఖాస్తులు వేస్తే.. మరో గ్రూపు 650 దరఖాస్తులకు రూ.13 కోట్లు వెచ్చించింది. గతేడాది రూ.12 కోట్లు వెచ్చించి 600 దరఖాస్తులు వేసిన జనగామకు చెందిన ఓ సిండికేట్ గ్రూపు ఈసారి ఇప్పటి వరకు స్పందించలేదని తెలిసింది. ఇలా మహబూబాబాద్, భూపాలపల్లితో పాటు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని మద్యం వ్యాపారులు పలువురు ఇంకా దరఖాస్తులు వేయలేదు. దీంతో వారి వైఖరి ఏంటన్న చర్చ జరుగుతోంది. నోటిఫికేషన్ ఇచ్చి 18 రోజులు గడిచినా టెండర్లకు స్పందన లేకపోవడంతో మద్యనిషేధ, ఆబ్కారీశాఖ అధికారులు సైతం ప్రస్తుతం షాపులు నడుపుతున్న వారికి, మద్యం వ్యాపారులకు ఫోన్లు చేస్తున్నారు. 2023–25 వైన్‌షాపుల టెండర్లకు అనూహ్య స్పందన లభించింది. అప్పుడప్పుడే రియల్ ఎస్టేట్ దెబ్బతింటున్న నేపథ్యంలో రియల్ఎస్టేట్, ఫైనాన్స్, కాంట్రాక్ట్ రంగంలో పలువురు మద్యం దందావైపు చూశారు. ఈ దందా కొందరికీ అనుకూలించగా, మరికొందరిని నిండా ముంచేసిందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే గతేడాది మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టిన చాలా మంది ఈసారి దూరంగా ఉండడం వల్ల దరఖాస్తులు తగ్గినట్లుగా చెబుతున్నారు. అయితే ఆబ్కారీశాఖ అధికారులు మాత్రం మరో ఐదు రోజులు గడువు ఉండడంతో వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఈ నాలుగైదు రోజుల్లోనే కచ్చితంగా పెద్ద సంఖ్యలోనే దరఖాస్తులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి వరకు వచ్చిన దరఖాస్తులు ఇలా.. మద్యం టెండర్లకు మందకొడిగా దరఖాస్తులు 296 వైన్‌షాపులకు 500లు కూడా దాటని వైనం మిగిలింది ఇంకా ఐదు రోజులే.. గతేడాది 15,928 దరఖాస్తులు.. రూ.318.52 కోట్ల ఆదాయం రూ.3 లక్షలకు పెంచడంతో ఈసారి ఆదాయం మరింత పెరుగుతుందని అంచనా ఆశించిన స్థాయిలో రాని దరఖాస్తులు.. వ్యాపారుల తీరుపై అనుమానం.. ‘సిండికేట్’గా టెండర్లకు ప్రయత్నం? వేచిచూసే ధోరణిలో ఎకై ్సజ్ అధికారులు -
కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరం
● రూ.60,610 నగదు.. 9 ఫోన్లు స్వాధీనం ● కార్పొరేటర్ భర్తతోపాటు 11మంది అరెస్ట్ ● వారిలో ముగ్గురు మహిళలువరంగల్ క్రైం: హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి కనకదుర్గ కాలనీలో ఓ కార్పొరేటర్ ఇంట్లో పేకాట శిబిరంపై దాడి చేసి 12మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసినట్లు సోమవారం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. నగరానికి చెందిన ఓ కార్పొరేటర్ ఇంట్లో ఆదివారం పేకాట ఆడుతున్నట్లు వచ్చిన నమ్మదగిన సమాచారంతో తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. పేకాడుతూ 12 మంది పట్టుబడినట్లు తెలిపారు. వారినుంచి రూ.60,610 నగదు, 9 సెల్ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పట్టుబడిన వారిలో సిరిసిల్ల జిల్లా శాంతినగర్‌కు చెందిన ఇందిరియాల రాజేందర్, కరీంనగర్ జిల్లా కోతిరాంపూర్‌కు చెందిన గడ్డం శ్రీనివాస్, హనుమకొండ వడ్డేపల్లికి చెందిన గీతం జితేందర్‌రెడ్డి, కనకదుర్గ కాలనీకి చెందిన వెల్దండి రమేశ్, హనుమాన్‌నగర్‌కు చెందిన ముస్కం ముత్తయ్య, కనకదర్గ కాలనీకి చెందిన గుజ్జుల మహేందర్‌రెడ్డి (కార్పొరేటర్ భర్త), వేముల శివాజీ, బాలసముద్రానికి చెందిన కల్వ రమ, వాణినగర్‌కు చెందిన పల్లె సుజాత, కేఎల్ఎన్రెడ్డి కాలనీకి చెందిన బీరం నీరజ, టీచర్స్ కాలనీకి చెందిన మడిశెట్టి భాస్కర్ ఉన్నారు. నిందితులను తదుపరి చర్యల కోసం సుబేదారి పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. దాడిలో ఇన్స్పెక్టర్ రాజు, ఆర్ఎస్సై భానుప్రకాశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
భూ పరిహారం డిపాజిట్ చేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం భూ సేకరణ పూర్తయిన రైతులకు పరిహారం చెల్లించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ జాతీయ రహదారుల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోజాతీయ రహదా రుల శాఖ, వరంగల్ ప్రాజెక్టు డైరెక్టర్ కీర్తి భరద్వా జ్, అధికారులతో ఆమె సమావేశమయ్యారు. పరకాల డివిజన్ పరిధిలో సేకరించిన భూములకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆర్బిట్రేషన్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ ఇంకా ఆయా మండలాల పరిధి 10 గ్రామాలకు చెందిన 110 కేసుల్లో మొత్తం పరిహారం రూ.7.52కోట్లు, బావులు, చెట్లు, స్ట్రక్చర్‌కు సంబంధించి రూ.6.50 కోట్లు రావాల్సి ఉండగా వీటిపై కలెక్టర్ సమీక్షించారు. కాగా, పరిహారం పొందిన తర్వాత కూడా కొందరు రైతులు భూమి మోకాపై ఉండి పంటలు వేసుకున్నారని, ఆభూముల్ని జాతీయ రహదారుల శాఖకు అప్పగించాలని ఎన్‌హెచ్ పీడీ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రూ.15 లక్షలతో కటాక్షపూర్ కాజ్ వే నిర్మాణం వరంగల్–ములుగు ప్రధాన రహదారిలో ఉన్న కటాక్షపూర్ కాజ్ వే నిర్మాణ పనుల్ని రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కటాక్షపూర్ కాజ్ వే నిర్మాణానికి సంబంధించి సాగునీటి పారుదల, జాతీయ రహదారుల శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, సూపరింటెండెంట్ జగత్సింగ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, జాతీయ రహదారుల శాఖ డీఈ కిరణ్‌కుమార్, ఏఈ చేతన్, సాగునీటిపారుదల శాఖ డీఈ సునీత, ఏఈ వేణుగోపాల్, అధికారులున్నారు. పోస్టర్ ఆవిష్కరణ‘సే నో టు డ్రగ్స్’లో భాగంగా డ్రగ్స్ వినియోగం వల్ల ప్రమాదాలు, నిర్మూలనకు సంబంధించి చేపట్టే పలు అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణ, డీడబ్ల్యూఓ జయంతి, డీపీఆర్ఓ, ఎఫ్ఆర్ఓ, కమ్యూనిటీ ఎడ్యుకేటర్, సిబ్బంది పాల్గొన్నారు. -
పౌరుల భాగస్వామ్యమే కీలకం
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: నగర పరిశుభ్రతలో పౌరుల భాగస్వామ్యమే అత్యంత కీలకమని మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం బల్దియా కార్యాలయంలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను మేయర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తిలకించారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. బహిరంగంగా నిర్వహించే డంప్సైట్లతో ఉత్పన్నమయ్యే అంత్య ఉత్పన్నాలను విషపూరిత వాయువులను నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యర్థాల నిర్వహణకు వరంగల్ ఒక బెంచ్‌మార్క్ నగరంగా అవతరించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. నగరంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పౌరుల ఆరోగ్యం ఘన వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేయడానికి ప్రముఖ జాతీయ పరిశోధన విధాన సంస్థల సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ, ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఏసీపీలు ఖలీల్, ప్రశాంత్, రజిత, శ్రీనివాస్‌రెడ్డి, ఈఈలు రవికుమార్, మహేందర్, సంతోశ్‌బాబు, ప్రిన్సిపల్, సైంటిస్ట్ డా.ప్రతిభ గణేశన్ తదితరులు పాల్గొన్నారు. -
వినతులు సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన వినతులు సత్వరమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను ఆయా శాఖల అధికారులు జాప్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజవాణిలో జీడబ్ల్యూఎంసీ 16, పీడీ హౌసింగ్, ఆర్డీఓ హనుమకొండతో పాటు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 80 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. వరంగల్ గ్రీవెన్స్‌లో 80 అర్జీలు..న్యూశాయంపేట: అర్జీలను తక్షణమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ 40, జీడబ్ల్యూఎంసీ 6, హౌసింగ్ 4, డీఆర్డీఓ 4, మిగతా శాఖలకు సంబంధించి 26 (మొత్తం 80) దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. కాగా, వరంగల్ మట్టెవాడలోని సర్వేనంబర్ 442లోని ప్రభుత్వ భూమిని కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టారని, విచారణ చేపట్టి చర్య తీసుకోవాలని బి.రాజు అనే వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, ఆర్డీఓ ఉమారాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఓరుగల్లును మరువలేను
● హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ● ఎక్స్‌లో ట్వీట్ చేసిన ‘సాక్షి’ క్లిప్పింగ్ ఖిలా వరంగల్: ‘చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లుతో అనుబంధం మరువలేను. నా హృదయంలో ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉంది’ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మధుర జ్ఞాపకాన్ని ఆదివారం మరోసారి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. 17 ఏళ్ల క్రితం వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో తన సతీమణితో కలిసి చారిత్రక ఖిలా వరంగల్ కోటను సందర్శించారు. ‘కోటలో ఖాకీబాస్’ శీర్షికతో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇలా వరంగల్ నగరంపై తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేశారు. -
బీసీలు బలహీనులు కాదు
● ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ హన్మకొండ: రిజర్వేషన్లు బీసీల పౌర హక్కు అని ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అన్నారు. ఆదివారం హనుమకొండ రాంనగర్‌లోని బీసీ భవన్లో సుందర్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. బీసీలు బలహీనులు కాదని, బాహుబలులన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం అవకాశం కల్పిస్తామని ఆశ చూపి మోసం చేశారన్నారు. ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలో పరిపాలించిన రెండు జాతీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సమావేశంలో ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ టి.విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, ఆయా సంఘాల నాయకులు వడ్లకొండ వేణుగోపాల్, మౌనిక గౌడ్, పులి రజనీకాంత్, మేధావులు పాల్గొన్నారు. -
కారాఘోరం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ● వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పెండ్యాల సుచరిత (36) సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి మృతి చెందారు. సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో ఆమెను ఆగస్టు 13న నర్సంపేట సబ్ జైలుకు తరలించారు. సబ్‌జైలులో అనారోగ్యానికి గురైన ఆమెను నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆగస్టు 21న మృతి చెందింది.● జనగామ సబ్‌జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ ఖైదీ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగారాజుపల్లికి చెందిన వరాల మల్లేశ్ (42) హత్యాయత్నం కేసులో జనగామ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి మల్లేశ్ నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అధికారులు ఖైదీని వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ...ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన కారాగారాలు సహజ మరణాలు, ఆత్మహత్యలకు వేదికలవుతున్నాయి. నేరాలు, నేరస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. ఓ వైపు జైళ్ల కుదింపు, మరోవైపు విచారణలు, శిక్షలు, విడుదల లేక ఖైదీలతో కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అధికారులు సబ్‌జైళ్లలో రకరకాల పనులు చేయిస్తూ వేధిస్తుండడమే ఖైదీల మృతికి కారణంగా చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలో ఖైదీలకు ఆత్మహత్యకు కారకాలయ్యే వస్తువులను దూరంగా సిబ్బంది ఉంచాలి. వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఖైదీల ఆత్మహత్యాయత్నం ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే, జైలులో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సామర్థ్యానికి మించి జిల్లా, సబ్‌జైళ్లలో ఖైదీలను ఉంచి.. ఆ మేరకు బడ్జెట్, సౌకర్యాలు, అధికారులు, సిబ్బంది లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. సిబ్బంది, ఎస్కార్ట్ కొరతతో నెలల తరబడి విచారణలు వాయిదా పడి జైళ్లనుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లా, సబ్‌జైళ్లలో ఓ వైపు సహజ మరణాలు, మరోవైపు ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. ఖైదీలు పెరుగుతున్నా.. మారని పరిస్థితులు ఖైదీల సంఖ్య పెరుగుతున్నా.. అందుకు అనుగుణంగా జైళ్ల పరిస్థితి మారడం లేదు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2023’లో ఇవే అంశాలను ప్రస్తావించింది. ఈ లెక్కల ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ.. రాష్ట్రంలో అన్ని రకాల జైళ్లు కలిపి 50 ఉండగా.. అన్నింట్లో సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్‌లో వరంగల్ సెంట్రల్ జైలుతోపాటు పరకాల, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట సబ్‌జైళ్లలో కలిపి సుమారు 680 మంది ఖైదీలు ఉండాలి. వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేసే నాటికి ఒక్క ఆ జైలులోనే వెయ్యి మంది వరకు ఉన్నట్లు రికార్డులున్నాయి. 2021లో సెంట్రల్ జైలు ఎత్తివేయగా.. నర్సంపేట సబ్‌జైలును కూడా రద్దు చేశారు. వీటి స్థానంలో మామునూరు ఒక ఓపెన్ ఎయిర్ జైలును ప్రతిపాదించారు. నర్సంపేట సబ్‌జైలు స్థానంలో మహిళల ప్రత్యేక జైలు ఏర్పాటు చేశారు. జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాలతోపాటు ఓపెన్ ఎయిర్ జైలు కలిపితే.. వాటిలో ఖైదీల సామర్థ్యం 50 నుంచి 80 లోపలే. ఆమేరకు పెట్టుకుని ఇతర ఖైదీలను ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జైళ్లకు తరలించాల్సి ఉండగా.. ఉమ్మడి వరంగల్‌లోని పోలీస్స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో విచారణ ఖైదీలు, శిక్షలు పడిన వారు సుమారు 300 మంది జిల్లాల్లోని జైళ్లలోనే ఉంటుండడంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. వాంతులు, విరేచనాలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముందుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఖైదీల మరణానికి కారణం కావొచ్చు. జైలులో సరైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోతే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమై ప్రాణాంతకంగా మారుతాయి. జైలులోని ఒత్తిడితో కూడిన వాతావరణం కూడా ఖైదీల ఆరోగ్య పరిస్థితిని క్షీణింపజేసి మరణానికి దారితీస్తుంది. అయితే, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఇవి తేలుతాయి. – డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణుడు సబ్‌జైలులో సహజ మరణాలకు అనారోగ్యమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యలు, జైలులో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం, జైలు వాతావరణం వల్ల వచ్చే ఒత్తిడి వంటి కారణాల వల్ల మరణాలు తరచూ సంభవిస్తాయంటున్నారు. జైలు, పోలీసు కస్టడీలో మరణాలకు గుండె జబ్బుల వంటివి సాధారణంగా కనిపిస్తాయని వైద్య నిపుణుల అభిప్రాయం. జైళ్ల కుదింపుతో ఇబ్బడిముబ్బడిగా విచారణ ఖైదీలు కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ సంచలనంగా జనగామ సబ్‌జైలు ఖైదీ ఆత్మహత్య.. -
పచ్చదనం పెంపొందించాలి
వరంగల్ అర్బన్: నగర ప్రధాన రహదారుల నడుమ ఉన్న సెంట్రల్ మీడియమ్స్‌లో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. ఆదివారం హనుమకొండ అదాలత్, సుబేదారి ప్రాంతాల్లో మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమర్థంగా చేపట్టేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని ప్రధాన రోడ్ల మధ్య గ్రీనరీ ఉండేలా చూడాలని, పచ్చదనం కోసం గ్రీన్ బడ్జెట్ పేరిట 10% నిధులు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా ఏపుగా పెరిగేందుకు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. మేయర్ వెంట హెచ్ఓ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.మేయర్ గుండు సుధారాణి -
ఈత కొట్టేదెన్నడో?
వరంగల్ స్పోర్ట్స్: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళిక లేమి కారణంగా యువ స్విమ్మర్లు సాధనకు దూరమవుతున్నారు. నిత్యం సాధన చేస్తూ.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధపడే స్విమ్మర్లకు స్విమ్మింగ్‌పూల్ మరమ్మతులు అడ్డంకిగా మారాయి. సుమారు ఆరు నెలలుగా సాధన లేక మానసికంగా, శారీరకంగా కుదేలవుతున్నారు. రూ.41 లక్షలు కేటాయింపు.. హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా క్రీడా ప్రా ధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్విమ్మింగ్ పూల్ కొనసాగుతోంది. పూల్‌లో పలు మరమ్మతులు, వసతుల కల్పన కోసం డీఎస్ఏ నిధుల నుంచి రూ.41 లక్షలు కేటాయించారు. ఆయా పనుల్ని పూర్తి చేసేందుకు తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూడీసీ)కి అప్పగించారు. సుమారు ఆరు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. త్వరతగతిన పూర్తి చేసి స్విమ్మర్లకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. పనుల్లో జాప్యం.. టీజీఈడబ్ల్యూఐడీసీ శాఖ ఇంజనీరింగ్ అధికారులు అబివృద్ధి పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టారీతిన పనులను చేస్తుండడంతో ఆరు నెలలు కావొస్తున్నా.. పూర్తి కాలేదు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది స్విమ్మింగ్ పూల్. అలాంటిది ఆరు నెలలుగా మూసివేయడంతో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా పనుల్లో జాప్యం కారణంగా యువ స్విమ్మర్ల కెరియర్ నష్టపోతుంటే, ఆరోగ్య పరిరక్షణ కోసం స్విమ్మింగ్ పూల్‌కు వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. స్విమ్మింగ్ పూల్ మరమ్మతు పనులు 90 శాతం పూర్తయ్యాయి, రెండు రోజుల క్రితం ట్రయల్ రన్ సైతం విజయవంతంగా పూర్తి చేశాం. చిన్న చిన్న పనులు పూర్తి చేయాల్సి ఉంది. మరో వారం రోజుల్లో డీఎస్ఏకు స్విమ్మింగ్ పూల్‌ను అప్పగిస్తాం. – రవీందర్, డీఈ, టీజీఈడబ్ల్యూఐడీసీ, హనుమకొండ ఆరు నెలలైనా పూర్తికాని మరమ్మతులు సాధనకు దూరమవుతున్న స్విమ్మర్లు -
నిబద్ధత కలిగిన వారికే డీసీసీ పీఠం
హన్మకొండ చౌరస్తా: నిబద్ధత, సామర్థ్యం, కార్యకర్తల అభిమానం కలిగిన వారికే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పీఠం దక్కుతుందని వరంగల్, హనుమకొండ జిల్లాల ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్నాయక్ మాట్లాడారు. డీసీసీ అధ్యక్షుల భర్తీ కార్యక్రమంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంఘటన శ్రీయన్ అభియాన్ పార్టీ పునఃనిర్మాణానికి మొదటి అడుగు పడిందన్నారు. నూతన డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం దరఖాస్తుల స్వీకరణతోపాటు నియోజకవర్గాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రతీ కార్యకర్త, ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామన్నారు. ఈ అభియాన్ ద్వారా అధికారం కొంతమందికి మాత్రమే పరిమితం కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, యువత అన్ని వర్గాలకు నాయకత్వ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. అధ్యక్ష నియామక ప్రక్రియలో భాగంగా సోమవారం డీసీసీ భవన్లో హనుమకొండ జిల్లాస్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 14న పరకాల, 16న వరంగల్ తూర్పు, 17న వర్ధన్నపేట, 18న నర్సంపేట నియోజకవర్గం పరిధి కాంగ్రెస్ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పీసీసీ జిల్లా పరిశీలకులు దుర్గం భాస్కర్, మసూద్, రేణుక, కో–ఆర్డినేటర్ ఆదర్శ్జైస్వాల్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఈవీ శ్రీనివాస్‌రావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ బొమ్మతి విక్రమ్, వెంకట్‌రెడ్డి, శ్రవణ్, సాగరిక, స్వప్న తదితరులు పాల్గొన్నారు.ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ -
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై రాత పూర్వకంగా ఫిర్యాదులు అందించాలని కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు అండర్–19 బాలబాలికల క్రీడా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి రోజు వాలీబాల్, యోగా, టగ్‌ఆఫ్‌వార్, త్రోబాల్, టేబుల్ టెన్నిస్, మకంబ్, సాఫ్ట్‌టెన్నిస్, బీచ్‌వాలీబాల్, తంగ్తా మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, సాఫ్ట్‌బాల్, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్, రగ్బీ క్రీడలు, రెండో రోజు (14వ తేదీన) హ్యాండ్‌బాల్, చెస్, రెజ్లింగ్, షటిల్ బ్యాడ్మింటన్, హాకీ, బెల్ట్ రెజ్లింగ్, సైక్లింగ్ రోడ్, సైక్లింగ్ ట్రాక్, స్కేటింగ్, బేస్‌బాల్, లాన్‌టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, తైక్వాండో, 15వ తేదీన క్రికెట్, క్యారమ్స్, కరాటే, సెపక్తక్రా, కురేష్, కలరిపాయట్టు, ఫెన్సింగ్, పవర్‌లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, బాక్సింగ్, ఖోఖో క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హన్మకొండ: బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో రాకేశ్‌రెడ్డిని విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 200 పాఠశాలల్లో రూ.180 కోట్ల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 80 నుంచి 200కు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు పెంచి, 8 వేల నుంచి 25 వేల మంది వరకు విద్యార్థుల సంఖ్య పెంచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావొస్తున్నా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులను పాఠశాలల్లోకి అనుమతించడం లేదన్నారు. సమస్యను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో చర్చించి బాధిత తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాలల యాజమాన్యాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన భరోసా ఇచ్చారు. కాళోజీ సెంటర్: విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ‘ఎ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్’ అనే కొత్త పాఠ్యాంశానికి సంబంధించిన కార్యక్రమంపై ఈనెల 14, 15, 16 తేదీల్లో టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్ డీఈఓ రంగయ్య నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 9వ తరగతికి బోధించే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, గణితం ఉపాధ్యాయులు ప్రభుత్వ, స్థానిక సంస్థల తెలంగాణ రెసిడెన్షియల్ సొసైటీ పాఠశాలలు, కేజీబీవీ ఉపాధ్యాయులు పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయులు వీలైతే సొంత లాప్టాప్, ట్యాబ్ లేదా ఇటీవల విద్యాశాఖ అందించిన ఏ బుక్ ఆన్ డిజిటల్ ఆర్ని వెంట తెచ్చుకోవాలని సూచించారు. -
ఎమ్మెస్సీ సైకాలజీ మరింత దూరం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) విధానంలో పీజీ కోర్సుగా ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు ఈ విద్యాసంవత్సరం (2025–26)లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)అనుమతించలేదు. దేశవ్యాప్తంగా కూడా ఓడీఎల్మోడ్లో, ఆన్లైన్ మోడ్‌లో ఈ కోర్సు నిర్వహించకూడదని ఈఏడాది ఆగస్టులో యూజీసీ దూర విద్యవిధానంలో ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులను నిర్వహిస్తున్న వర్సిటీలకు, ఓపెన్ వర్సిటీలను కూడా ఆదేశిస్తూ లేఖలను పంపింది. ఇప్పటికే 2025–26 విద్యాసంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య సీడీఓఈలో అన్ని పీజీ కోర్సులతోపాటు ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో కొందరు ఇప్పటికే ఈకోర్సులో ప్రవేశాలు పొందారు. ప్రవేశాలు కొనసాగుతుండగానే ఈ సైకాలజీ కోర్సును నిర్వహించవద్దని యూజీసీ లేఖతో ఇక ఆకోర్సులో ప్రవేశాల కల్పన నిలిపేశారు. దూరవిద్య విధానంలో ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు బాగా డిమాండ్ ఉంది. ప్రతీ విద్యాసంవత్సరంలో కేయూలోని దూరవిద్యలో సుమారు 150 నుంచి 200 మంది వరకు విద్యార్థులు అడ్మిషన్లు పొంది చదువుతున్నారు. ప్రధానంగా యువతే కాకుండా వివిధ ఫ్రొఫెషనల్స్ ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులో దూరవిద్య విధానం ద్వారా చదివారు. చదవుతున్నవారు ఉన్నారు. డిమాండ్ ఉన్న కోర్సు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య విధానంలో 2004 నుంచి ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సు నిర్వహిస్తున్నారు. సుమారు 21 ఏళ్లలో ఎంతోమంది ఈ కోర్సును పూర్తి చేశారు. సైకాలజీ కోర్సులు పూర్తి చేసిన వారు కొందరు వివిధ విద్యాలయాల్లో ఉద్యోగాలు పొందారు. సైకాలజీ కౌన్సెలర్లుగా కూడా ఉద్యోగాలు పొందారు. బాగా డిమాండ్ ఉన్న కోర్సుతో యూనివర్సిటీకి ఆదాయం కూడా బాగానే సమకూరుతోంది. ఇప్పుడు యూజీసీ ఈకోర్సును నిర్వహించవద్దని లేఖ పంపడంతో ఆకోర్సు చేయాలనుకునేవారికి ఇక అవకాశం లేకుండా పోయింది. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలోనూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో కూడా ఈ విద్యాసంవత్సరం 2025–26లో ఎమ్మెస్సీ సైకా లజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తుండగానే ఆన్లైన్ కోర్సుగా నిర్వహించవద్దని యూజీసీ నుంచి ఈఏ డాది ఆగస్టు 12 అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి లేఖ పంపారు. దీంతో ప్రవేశాలు నిలిపేశారు. ఇప్పటికే సుమారు 340 మంది వరకు చేరిన విద్యార్థులకు మీరు ఇతర పీజీ కోర్సులకు చేరాలనుకుంటే ఆప్షన్ ఇవ్వాలని సూచించగా అందులో కేవలం 60 మంది విద్యార్థులు మాత్రం ఇతర పీజీ కోర్సుల్లో చేరారు. మిగతా వారికి చెల్లించిన ఫీజును రీఫండ్ చేయాలని నిర్ణయించినట్లు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ స్టూడెంట్స్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూ ట్రిషన్ తదితర కోర్సులకు ఓడీఎల్ మోడ్ అండ్ ఆన్లైన్ మోడల్లో నిర్వహించకూడదని కూడా యూ జీసీ వర్సిటీలకు లేఖలు పంపినట్లు సమాచారం. దూరవిద్యలో 2024–25 బ్యాచ్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈకోర్సు యథావిధిగా కొనసాగనుంది. ఆయా విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ విద్యాసంవత్సరం (2025–26) ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులో మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వారు చెల్లించిన ఫీజును రీఫండ్ ఇవ్వబోతున్నాం. ఎవరైనా వేరే పీజీ కోర్సు చేస్తామంటే వారికి వేరే కోర్సులోకి మార్చతాం. ఎన్‌సీఏహెచ్‌పీ యాక్ట్ 2021 ప్రకారం ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సును నిర్వహించేందుకు వీలులేదనేది యూజీసీ నిర్ణయించినట్లు సమాచారం. అయితే రెగ్యులర్ కోర్సులుగా ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సును యథావిధిగా నిర్వహించనున్నారు. కేయూలో ఎమ్మెస్సీ సైకాలజీ రెగ్యులర్ కోర్సు యథావిధిగా కొనసాగనుంది. – వి.రామచంద్రం, కేయూ రిజిస్ట్రార్ డీఎల్, ఆన్లైన్ మోడ్‌లో నిర్వహించొద్దు యూనివర్సిటీలకు లేఖలు ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఫీజు రీఫండ్ గత విద్యా సంవత్సర విద్యార్థులకు యథావిధిగా.. -
చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిహన్మకొండ చౌరస్తా: ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆదివారం పల్స్‌పోలియోను నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ అప్పయ్య, జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రెండు చుక్కలతో చిన్నారులకు ఆరోగ్య భద్రత ఖిలా వరంగల్: రెండు పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తాయని కలెక్టర్ సత్యశారద అన్నారు. పల్స్ పోలియో సందర్భంగా ఆదివారం వరంగల్ 35వ డివిజన్ పుప్పాలగుట్ట పీహెచ్సీ కేంద్రంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు ఆధ్వర్యంలో చిన్నారులకు చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్స్‌పోలియో సక్సెస్.. గీసుకొండ: వరంగల్ నగర పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని డీఎంహెచ్ఓ సాంబశివరావు తెలిపారు. ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 20,128 (స్థానికేతరులతో కలిపి) మంది చిన్నారులకు చుక్కల మందు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
నాలుగు రైళ్ల దారి మళ్లింపు
కాజీపేట రూరల్: దానాపూర్–బెంగళూరు–దానాపూర్ మధ్య ప్రయాణించే సూపర్‌ఫాస్ట్ రైళ్ల సర్వీస్‌లకు అక్టోబర్ 13 నుంచి 16వ తేదీ వరకు కాజీపేట, సికింద్రాబాద్, గుంతకల్, ధర్మవరం స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు. దారి మళ్లించిన రైళ్లు ఇవే.. ఈ నెల 13న దానాపూర్–ఎస్ఎంవీవీ బెంగళూరు (03251) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 15న ఎస్ఎంవీటీ బెంగళూరు–దానాపూర్ (03252) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 14న దానాపూర్–ఎస్ఎంవీటీ బెంగళూరు (03259) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 16న ఎస్ఎంవీటీ బెంగళూరు–దానాపూర్ (03260) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు వరంగల్, విజయవాడ, ఒంగోలు, గూడూరు, పెరంబూర్, కటిపాడి, జోలర్పెట్టయ్, బంగారపేట్, వైట్‌ఫీల్డ్ మీదుగా కాకుండా వయా బల్లార్షా, కాజీపేట, సికింద్రాబాద్, సులేహలీ వెస్ట్, గుంతకల్, ధర్మవరం మీదుగా వెళ్లనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. -
బీసీలకు సముచిత స్థానం కల్పించాలి
హన్మకొండ: టీపీసీసీ త్వరలో చేపట్టనున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా సంస్థాగతంగా నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ పదవుల్లో బీసీలకు సరైన వాటా కల్పించాలన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో 17 డీసీసీ అధ్యక్ష పదవులు, వరంగల్ ఉమ్మడి 6 జిల్లాల్లో 3 డీసీసీ అధ్యక్ష పదవులను బీసీలకు కేటాయించి మాట నిలుపుకోవాలని ఏఐసీసీ, టీపీసీసీని కోరారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ కమిటీకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల కళాశాలల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా జె.సోమన్న (ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల) ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కె.సునీల్‌రెడ్డి (బొల్లికుంట వీసీపీఈ ఫిజికల్ డైరెక్టర్), ఉపాధ్యక్షులుగా పి.అజయ్, ఎస్.కుమారస్వామి, బి.రమేశ్, జి.సునీత, కోశాధికారిగా ఎస్.కిరణ్‌కుమార్‌గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా ఎం.కుమారస్వామి, కె.మధుకర్, బి.వెంకట్రామ్, జె.జేత్యాతోపాటు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మహ్మద్ కరీం వ్యవహరించారు. నాలుగేళ్ల పాటు ఈ కార్యవర్గం కొనసాగుతుంది. క్రెడాయ్ సేవలు అభినందనీయంహన్మకొండ చౌరస్తా: క్రెడాయ్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో ఆదివారం పబ్లిక్‌గార్డెన్‌లో నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం గొప్ప పుణ్యకార్యం, అలాంటి కార్యక్రమంలో యువత ముందుండడం సంతోషంగా ఉందన్నారు. మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, రెడ్‌క్రాస్ పాలకమండలి సభ్యుడు ఈవీ శ్రీనివాస్‌రావు, క్రెడాయ్ వరంగల్ అధ్యక్షుడు నాయిని అమరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాఖమూరి అమర్, చైర్మన్ తిరుపతిరెడ్డి, బాధ్యులు శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రజనీకాంత్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, కొండారెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. కడిపికొండలో కారు బీభత్సం కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో ఆదివారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాజీపేట నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్‌తో కడిపికొండ బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ద్విచక్రవాహనదారుడిని ఢీ కొట్టగా అతడికి తీవ్రగాయాలయ్యా యి. ఇదే కారు కొద్ది దూరంలోని వైన్స్ ఎదుట రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొట్టగా కాలు విరిగింది. క్షతగాత్రులను 108 సిబ్బంది శివకుమార్, రాజ్‌సింగ్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, కారు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం ద్వారానే ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కారును మడికొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. -
294 వైన్స్.. 258 దరఖాస్తులు!
కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్‌కు దరఖాస్తు చేసేందుకు మద్యం వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 11 వరకు 294 వైన్స్‌కు కేవలం 258 దరఖాస్తులు రావడం గమనార్హం. సగటున ఒక వైన్స్‌కు ఒక దరఖాస్తు కూడా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం వైన్స్ టెండర్ల దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచింది. దీంతో మద్యం వ్యాపారులు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. మరో వైపు దీపావళి బాణసంచా అమ్మే వ్యాపారుల్లో సగం మంది మద్యం వ్యాపారం చేస్తారు. రూ.3 లక్షలు పెట్టి బాణసంచా విక్రయిస్తే రూ.6 లక్షలు వస్తాయి కదా.. ఇక మద్యం దరఖాస్తులు ఎందుకు అని వారు అనుకుంటున్నట్లు సమాచారం. కాగా, మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. వైన్స్‌కు బదులు ఓటర్లకు సమర్పించుకుంటే ఎన్నికల్లో నైనా నెగ్గుతామంటూ దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. 23న లక్కీడ్రా.. వైన్స్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 18 చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దరఖాస్తుకు గడువు 6 రోజులు మాత్రమే మిగిలింది. అక్టోబర్ 23వ తేదీన లక్కీ డ్రా ద్వారా వైన్స్ కేటాయిస్తారు. 2023–25లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15,926 దరఖాస్తులకు రూ.318 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ, ఈసారి 30 వేల దరఖాస్తులు, రూ.500 కోట్ల ఆదాయం రావాలని పెట్టుకున్న టార్గెట్‌ను కనీసం చేరుకుంటారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏ జిల్లాలోనూ సెంచరీ దాటని అర్జీలు రూ.3 లక్షల ఫీజు, దీపావళి, స్థానిక ఎన్నికల ఎఫెక్ట్ దరఖాస్తు చేసుకోవడానికి మిగిలింది ఇక 6 రోజులేఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్‌లు, దరఖాస్తుల వివరాలు.. జిల్లా వైన్స్ దరఖాస్తులు వరంగల్ అర్బన్ 67 89 వరంగల్ రూరల్ 57 49 జనగామ 50 34 మహబూబాబాద్ 61 57 భూపాలపల్లి 59 29


