తెలంగాణపై సుప్రీంకోర్టుకు కిరణ్ | Kiran kumar Reddy moves to supreme court on Telangana issue | Sakshi

తెలంగాణపై సుప్రీంకోర్టుకు కిరణ్

Mar 6 2014 1:49 PM | Updated on Jul 29 2019 5:31 PM

తెలంగాణపై సుప్రీంకోర్టుకు కిరణ్ - Sakshi

తెలంగాణపై సుప్రీంకోర్టుకు కిరణ్

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్తో పాటు, ఇదే అంశంపై దాఖలైన మరికొన్ని పిటిషన్లను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ఈ విచారణ శుక్రవారం కొనసాగనుంది. ఇంతకుముందు ఫిబ్రవరి 7, 17 తేదీలలో కూడా విభజనను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలైనా, అప్పటికి పార్లమెంటు ఇంకా తెలంగాణ బిల్లును ఆమోదించనందున అప్పటికి సమయం పరిపక్వం కాలేదంటూ వాటిపై విచారణకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. 
 
ఫిబ్రవరి 20వ తేదీన పార్లమెంటు తెలంగాణ బిల్లును ఆమోదించింది. అలాగే, పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకుండా స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను కూడా విచారణకు స్వీకరించలేదు. తగిన సమయంలో రిట్ పిటిషన్లను విచారించొచ్చని సుప్రీం అప్పట్లో తెలిపింది. ఇక రెండు రాష్ట్రాల ఏర్పాటుకు జూన్ రెండో తేదీని 'అపాయింటెడ్ డే'గా కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కిరణ్ సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement