అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి | life time prisoner dies of open air jail in anantapur | Sakshi

అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి

Jul 27 2015 10:34 PM | Updated on Apr 3 2019 8:07 PM

తపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని ఓపెన్ ఎయిర్‌జైలు నందు జీవిత ఖైదీ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు.

బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని ఓపెన్ ఎయిర్‌జైలు నందు జీవిత ఖైదీ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. ఓపన్ ఎయిర్ జైలు సూపరిండెంట్ ఈశ్వరయ్య తెలిపిన వివరాలు.. కర్నూలు జిల్లా పెద్ద కంబదూరు మండలం, చిన్న కంబదూరు గ్రామానికి చెందిన బోయ బెంగల గంటి లక్ష్మిరెడ్డి (40) 2002 లో ఓహత్య కేసులో నిందితుడు. 2005లో శిక్ష పడింది.

2013లో కడప సెంట్రల్ జైలు నుండి జిల్లా ఓపెన్ ఎయిర్‌జైలుకు వచ్చాడు. గత కొద్ది రోజులుగా మూర్ఛవ్యాదితో బాధపడుతూ ఉన్నాడు. దీంతో అప్పుడప్పుడు జైలు అధికారులు చికిత్సలు చేయిస్తూ ఉండేవారు. సోమవారం ఉదయం మూర్ఛవ్యాది రావడంతో జైలు అధికారులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మరణించినట్లు సూపరిండెంట్ ఈశ్వరయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement