మొరాయిస్తున్న ఈవీఎంలు.. పోలింగ్ ఆలస్యం | polling delayed as evms struck in khammam district | Sakshi

మొరాయిస్తున్న ఈవీఎంలు.. పోలింగ్ ఆలస్యం

Mar 30 2014 8:09 AM | Updated on Nov 6 2018 4:04 PM

రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కాసేపు నిలిపివేసి ఆలస్యంగా ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కాసేపు నిలిపివేసి ఆలస్యంగా ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు గాను మొత్తం 522 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా 121 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మధిర పీవీఎం పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దీంతో 15 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. కొత్తగూడెంలో కూడా ఈవీఎంలు మొరాయించాయి. దాంతో ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఐదో వార్డులో గుర్తులు తారుమారు కావడంతో అక్కడ పోలింగ్ను అధికారులు నిలిపేశారు. కరీంనగర్ 27వ డివిజన్లో ఈవీఎంలు మొరాయించాయి. దాంతో అధికారులు పోలింగ్ నిలిపివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement