కార్యాచరణపై ఎమ్మెల్యేలతో భేటీ కానున్న వైఎస్ జగన్ | ys jagan mohan reddy to meet party mlas tomorrow | Sakshi

కార్యాచరణపై ఎమ్మెల్యేలతో భేటీ కానున్న వైఎస్ జగన్

Dec 21 2015 10:05 AM | Updated on Oct 29 2018 8:08 PM

ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ ను పున:పరిశీలనతో పాటు కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంపై చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం సభ నుంచి బాయ్ కాట్ చేసింది.

హైదరాబాద్‌: ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ ను పున:పరిశీలనతో పాటు కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంపై చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం సభ నుంచి బాయ్ కాట్ చేసింది. సభ నడుస్తున్న తీరుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రోజా సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధమని చెప్పినా పునఃపరిశీలించేందుకు ప్రభుత్వం నిరాకరించింది.

 

కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై కూడా చర్చించేందుకు ప్రభుత్వం విముఖత చూపడంపట్ల వైఎస్ఆర్ సీపీ నిరసన వ్యక్తం చేస్తూ బాయ్ కాట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement