రేవంత్ రెడ్డికి బెయిల్ నిరాకరించిన హైకోర్టు | no bail to revanth reddy | Sakshi
Sakshi News home page

రేవంత్ రెడ్డికి బెయిల్ నిరాకరించిన హైకోర్టు

Jun 30 2015 10:31 AM | Updated on Aug 31 2018 8:24 PM

రేవంత్ రెడ్డికి బెయిల్ నిరాకరించిన హైకోర్టు - Sakshi

రేవంత్ రెడ్డికి బెయిల్ నిరాకరించిన హైకోర్టు

ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే ఆధారాలన్నీ సేకరించినందున తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రేవంత్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం తీర్పు వెలువరించిన కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది.

 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ. 5 కోట్లు లంచం ఇవ్వజూపి, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేశారని, దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీటు దాఖలు చేయడానికి మరింత సమయం పడుతుందని, అంతవరకూ ఏ1 రేవంత్ రెడ్డి సహా ఏ2 ఉదయసింహా, ఏ3 సెబాస్టియన్ కు బెయిల్ ఇవ్వొద్దన్న తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనను హైకోర్టు సమర్థించింది. ఇప్పటికే ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రేవంత్ సహా ఇతర నిందితుల జ్యుడీషియల్ కస్టడీని జులై 13 వరకు పొగిడించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement