తెలంగాణ శాసనసభలో విపక్షాలు శనివారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాలు, సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో విపక్షాలు శనివారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాలు, సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలపై బీజేపీ, 2011-12 డీఎస్సీ అభ్యర్థుల పోస్టింగ్లపై సీపీఐ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలపై సీపీఎం వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. డిసెంబర్ నాటికి వాస్తవ పరిస్థితిపై స్పష్టమైన అవగాహన వస్తుందని, వచ్చే బడ్జెట్‌లోగా శ్వేతపత్రం అందిస్తామని ఆయన తెలిపారు.