ABVP
-
గవర్నర్ స్పందించాలి HCU భూములు కాపాడాలి!
-
ఖబడ్డార్ నారా లోకేష్.. బాబు, పవన్ పై ABVP నేత ఫైర్
-
విచారణ చెయ్యకుండానే కెమెరాలు లేవని పోలీసులు
-
మీ గొంతు మూగబోయిందా లోకేశ్?
నెల్లూరు(టౌన్): ‘ఫీజు రీయింబర్స్మెంట్ గురించి యువగళంలో మాట్లాడిన మీ గొంతు మంత్రి పదవి రాగానే మూగబోయిందా లోకేశ్..’ అని ఏబీవీపీ నాయకులు ప్రశి్నంచారు. ‘యువగళంలో మాట్లాడిన నోరు మంత్రి పదవి రాగానే మూగబోయిందా..’ అనే బ్యానర్ చేతపట్టుకుని ఏబీవీపీ నాయకులు సోమవారం నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కనీ్వనర్ రాహుల్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచి్చన వెంటనే జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని లోకేశ్ యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారని చెప్పారు.ఫీజు రీయింబర్స్మెంట్ లేని కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని, అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్ మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మంత్రి లోకేశ్ వెంటనే స్పందించాలని, లేకపోతే ఎక్కడికక్కడ ఆయన పర్యటనలను అడ్డుకుంటామని, సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రోడ్డుపై బైఠాయించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు బలవంతంగా ఈడ్చి పక్కన పడేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సమీర్, సుమన్, రాబర్ట్, వినోద్, హేమంత్, సుకుమార్, నవీన్ పాల్గొన్నారు. -
గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో నిర్వహించాలని డిమాండ్
-
ఏబీవీపీ TGPSC ముట్టడి విఫలం.. నాంపల్లిలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: ఏబీవీపీ ముట్టడి ప్రయత్నంతో నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక వాతావరణం నెలకొంది. గ్రూప్ ఉద్యోగాలు, డీఎస్సీ పోస్టుల డిమాండ్‌తో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు మంగళవారం ఉదయం టీజీపీఎస్సీ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. అయితే.. ఒక్కసారిగా వాళ్లు కమిషన్ భవనం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. పలువురు ఏబీవీపీ కార్యకర్తల్ని, విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 మెయిన్స్‌లో 1:100 పిలవాలని, గ్రూప్ 2 లో పోస్టులు పెంచి, డిసెంబర్ లో గ్రూప్ టు పరీక్షలు నిర్వహించాలని, టీచర్ పోస్టుల్ని పెంచి డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలని టీజీపీఎస్సీని డిమాండ్ చేస్తోంది ఏబీవీపీ. -
ఎన్నికలకు ముందే జేఎన్‌యూలో ఘర్షణ.. పలువురికి గాయాలు!
దేశరాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో శుక్రవారం అర్థరాత్రి విద్యార్థుల మధ్య మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణపై జరిగిన సమావేశంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ ఏబీవీపీ, వామపక్ష విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తమ సభ్యుల్లో కొందరికి గాయాలయ్యాయని ఇరువర్గాలు పేర్కొన్నాయి. వార్తా సంస్థ పీటీఐ తెలిపిన ప్రకారం ఈ ఘర్షణపై జేఎన్‌యూ పాలకవర్గం నుంచి ఇంతవరకూ స్పందన లేదు. 2024 జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల కమిషన్ సభ్యులను ఎన్నుకోవడానికి క్యాంపస్‌లో విద్యార్థి సంఘాలు పరస్పరం ఘర్షణ పడ్డాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు వేదికపైకి ఎక్కి కౌన్సిల్ సభ్యులు, స్పీకర్లతో గొడవకు దిగి, యూజీబీఎంకి అంతరాయం కలిగించారని లెఫ్ట్-అనుబంధ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్) ఆరోపించింది. సోషల్ మీడియాలో రెండు గ్రూపులు షేర్ చేసిన వీడియోలలో, ఏబీవీపీ, జేఎన్‌యూఎస్‌యూ సభ్యులు నినాదాలుచేస్తూ వాదించుకోవడాన్ని చూడవచ్చు. పరిస్థితిని చక్కదిద్దేందుకు విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. -
ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటన.. కానిస్టేబుల్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యురాలైన మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసింది. ఏబీవీపీ కార్యకర్తపై అమనుషంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ ఫాతిమాను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఉన్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని రాష్ట్ర సర్కారు కొత్త హైకోర్టు నిర్మాణం కోసం కేటాయించిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ ఏబీవీపీ కొన్నిరోజులుగా వ్యవసాయ వర్సిటీ వద్ద ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. హైకోర్టుకు భూకేటాయింపు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 23న వర్సిటీలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనకు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ హాజరయ్యారు. ఆందోళన విషయం తెలిసిన రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని, నిరసన తెలుపుతున్నవారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఝాన్సీ పోలీసుల నుంచి తప్పించుకుని ముందుకు పరుగెత్తారు. స్కూటీపై వచ్చిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు.. ఝాన్సీ జుట్టుపట్టుకుని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కిందపడిపోయింది. చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు ఝాన్సీతోపాటు 15మంది ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కూడా స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించి.. ఘటనపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. యువతి ఆరోగ్య పరిస్థితి సహా పూర్తి వివరాలతో నాలుగు వారాల్లోగా నివేదిక అందించాలని సీఎస్, డీజీపీకి నోటీసులు ఇచ్చింది. -
పోలీసుల తీరు అమానుషం
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్ టౌన్/ ఏజీ వర్సిటీ: హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూని వర్సిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకుని మహిళా కానిస్టేబుళ్లు ఈడ్చుకెళ్ళిన ఘట నను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. విద్యార్థినిపై పోలీసుల చర్య అమానుషమని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై తక్ష ణమే సమగ్ర విచారణ జరిపి కమిషన్‌కు నివేదిక సమర్పించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది: బీజేపీ ఆగ్రహం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై పోలీసుల దాడిని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణీ రుద్రమ, బండారు విజయలక్ష్మి తీవ్రంగా ఖండించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వారికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నట్టు స్పష్టం అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాన్ని విడనాడి, ఈ ఘటనపై వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. మహిళా నాయకురాలి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన పోలీసులపై ఇప్పటిదాకా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ధర్నా చౌక్‌ను మూసేసి, ప్రశ్నించే గొంతుకలను నొక్కేసిన దొర పాలనను అంతం చేసి ఒక ప్రత్యా మ్నాయాన్ని కోరుకున్న తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లి రేవంత్‌రెడ్డి మరో కొత్త దొరలా తయారయ్యారని వారు ఆరోపించారు. మహిళా కానిస్టేబుల్స్ వ్యవహరించిన తీరుతో సభ్యసమా జం తలదించుకుంటోందన్నారు. దాడికి పాల్పడిన మహిళా పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకో వాలని వారు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఇది అత్యంత అమానుషం: సబిత వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా వచ్చిన మహిళా నేత పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత అమానుష చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. విద్యార్థినిపై జులుం ప్రదర్శించిన కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలోనే ఈ ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతోందన్నారు. కఠిన చర్యలు తీసుకోవాల్సిందే: బండి ఏబీవీపీ మహిళా నాయకురాలిపై పోలీసులు వ్యవహరించిన తీరును సభ్యసమాజం అస హ్యించుకుంటోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. గురువారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల కోసం నిజాయితీగా, శాంతియుతంగా పోరాడుతున్న నాయకురాలిని జుట్టు పట్టుకుని స్కూటీపై ఈడ్చుకుంటూ లాక్కుపోతారా? ఇంతకన్నా హేయమైన చర్య ఉంటుందా అని మండిపడ్డారు. తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని బండి డిమాండ్ చేశారు. -
ఏబీవీపీ నాయకురాలి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టిన బండి సంజయ్
-
రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
వీరంతా బీజేపీ అభ్యర్థులేనా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల జాబితాపై పార్టీలోని పాతకాపులతోపాటు ఏబీవీపీ, యువమోర్చా విభాగాల్లోని వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పార్టీ ప్రకటించిన 111 మంది అభ్యర్థుల్లో 30–35 మంది మాత్రమే పాతనేతలు, పార్టీ సిద్ధాంత భూమిక ఉన్నవారని.. ఇలాంటి పరిస్థితుల్లో సైద్ధాంతిక భూమిక ఉన్న పార్టీగా ప్రజలకు ఏరకమైన సందేశాన్నిస్తారని నిలదీస్తున్నారు. అసలు ఈ అభ్యర్థులను బీజేపీ వారిగా భావించవచ్చా? ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాక వీరిలో ఎంత మంది పార్టీలో మిగులుతారనే ప్రశ్నలను సంధిస్తున్నారు. పార్టీలో ప్రస్తుత ముఖ్యనేతలు, మరీ ముఖ్యంగా బయట నుంచి వచ్చిన నేతలు వర్గాల వారీగా విడిపోయి తమ అనుయాయులకు పెద్దసంఖ్యలో టికెట్లు ఇప్పించుకున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టికెట్ల ఖరారులో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలతో బీజేపీ విమర్శల పాలైదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్రపార్టీలోని ముఖ్యనేతలు తమ వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు చేసిన హెచ్చరికలకు జాతీయ, రాష్ట్రనాయకత్వాలు లొంగిపోవడం ఎలాంటి సంకేతాలిస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పార్టీలో ముందు నుంచి ఉన్న ముఖ్యనేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కొందరు వర్గాలుగా విడిపోయి టికెట్ల కేటాయింపులో తమ పట్టును నిలుపుకునేలా ఒత్తిళ్లు తెచ్చి పైచేయి సాధించడం వంటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదంటున్నారు. ఏళ్లకు ఏళ్లు పనిచేసినా... నల్లగొండ, చేవెళ్ల, మహబూబాబాద్ ఎంపీ సీట్ల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా పాతకాపులు, పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని ఏళ్లకు ఏళ్లుగా పనిచేస్తున్న వారికి అవకాశం లభించలేదని వారు వాపోతున్నారు. ఈ స్థానాల్లో కొత్తగా పార్టీలో చేరిన వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటున్నారు. రెండు, మూడువారాల వ్యవధిలోనే పార్టీలో చేరిన పది, పదిహేను మందికి సీట్లు ఇవ్వడం పట్ల విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఈ స్థానాల్లో వీరంతా కచ్చితంగా గెలుస్తారని నాయకత్వం చెప్పగలదా అని ప్రశ్నిస్తున్నారు. అలాంటపుడు అన్నిచోట్లా కాకపోయినా వీలున్న చోట్ల అయినా పార్టీని నమ్ముకున్న వారికి పార్టీకి బలపడేందుకు అవకాశం ఉండేదని వాదిస్తున్నారు. మొత్తంగా 111 స్థానాల వారీగా పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల పూర్వాపరాలు, గతంలో ఉన్న పార్టీలు వంటి వాటిని పరిశీలిస్తే... వీరిలో చాలామంది రెండు, మూడుపార్టీలు మారిన వారేనని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి తర్వాత సమావేశమై భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలనే యోచనలో దీర్ఘకాలం పార్టీలో పనిచేసిన పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ జయకేతనం
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సత్తా చాటింది. అధ్యక్ష పదవి సహా మూడు సెంట్రల్ ప్యానెల్ పదవులను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) ఒక సెంట్రల్ ప్యానెల్ పదవిని చేజిక్కించుకుంది. నాలుగేళ్ల తర్వాత శుక్రవారం డీయూఎస్‌యూ ఎన్నికలు జరిగాయి. శనివారం ఫలితాలు వెలువడ్డాయి. ఏబీవీపీకి చెందిన తుషార్ దేధా అధ్యక్ష పదవి, అపరాజిత కార్యదర్శి పదవి, సచిన్ బైస్లా జాయింట్ సెక్రెటరీ పదవిని సొంతం చేసుకున్నారు. తుషార్ దేధా ఎన్ఎస్యూఐ అభ్యర్థి హితేశ్ గులియాపై 3,115 ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. ఎన్ఎస్యూఐకి చెందిన అభీ దహియా ఉపాధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేసే సిద్ధాంతం పట్ల యువత విశ్వాసాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తోందని అన్నారు. ఏబీవీపీ కార్యకర్తలకు అమిత్ షాతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ కూడా పోటీలో నిలిచినప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. విజయం తర్వాత తుషార్ దేధా, సచిన్ బైస్లా, అపరాజిత తదితరుల అభివాదం -
SFI,ABVP విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ
-
సంగారెడ్డిలో అర్ధరాత్రి ఉద్రిక్తత..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థి సంఘాలైన ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాల నేతలు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాల నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే, ప్లీనరీ సమావేశాలు ఉండటంతో ఎస్ఎఫ్ఐ నేతలు ఫ్లెక్సీలు కట్టారు. కాగా, ఫ్లెక్సీల విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: విద్యార్థినుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం -
'సారే జహాన్ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగింపు
ప్రసిద్ధ గేయం 'సారే జహాన్ సే అచ్ఛా' రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ అకమిక్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ మేరకు అకడమిక్ కౌన్సిల్ శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిందని చట్టసభ్యులు ధృవీకరించారు. భారత్ విభజనకు ముందు ఉన్న సియోల్కోట్లో 1877లో జన్మించిన పాక్ కవి అల్లామా ఇక్బాల్‌గా పిలిచే ముమహ్మద్ ఇక్బాల్ ఈ ప్రముఖ గేయం 'సార్ జహాన్ సే అచ్ఛా'ని రాశారు. ఆయన గురించి ఉన్న పాఠ్యాన్ని బీఏలోని పొలిటికల్ సిలబస్ నుంచి తొలగించారు. దీన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏపీవీపీ) స్వాగతించింది. పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో మార్పుకు సంబంధించి తీర్మానం తీసుకురావడమే గాక ఆ పార్యాంశాన్ని తొలగించినట్లు కౌన్సిల్ సభ్యుడు తెలిపారు. వాస్తవానకి 'మోడరన్ ఇండియన్ పొలిటికల్ థాట్' అనే సబ్జెక్టు బీఏలోని ఆరవ సెమిస్టర్ పేపర్లో బాగం. దీన్ని ఇప్పుడూ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాజకీయా ఆలోచనలోని గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ కోర్సును రూపొందించింది యూనివర్సిటీ. ఈ కోర్సులో భాగంగా సిలబస్‌లో రామ్మోహన్ రాయ్, పండిత రమాబాయి, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ మరియు భీమ్రావ్ అంబేద్కర్ తదితరులు గురించి ఉంది. అంతేగాదు ఆధునిక భారతీయ ఆలోచనలపై విమర్శనాత్మక అవగాహనతో విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ఈ కోర్సును ఏర్పాటు చేశారు. ఆయా ప్రముఖుల ఆలోచనల నేపథ్య అన్వేషణ తోపాటు చారిత్రక పథంలో ముఖ్యమైన విషయాలపై సమయోచిత చర్చలను గుర్తించడం సంబంధిత వారి రచనలలో ప్రదర్శించబడిన విభిన్న అవకాశాలను విద్యార్థులకు తెలుసుకోవాలనే లక్ష్యంతో పాఠ్యాంశాల్లో భాగం చేశారు. సిలబస్‌లో మొత్తం ఆయా ప్రముఖుల గూర్తి మొత్తం 12 యూనిట్లు ఉంటాయి. ఇదిలా ఉండగా, భారత రాజకీయ ఆలోచనలను గూర్చి తెలసుకోవాలన్న ఉద్దేశ్యంతో బీఏ ఆరవ సెమిస్టర్లో ఒక సబ్జెక్టు చేర్చిన దీనిలో ఆ మతోన్మాద పండితుడు మొహమ్మద్ ఇక్బాల్‌ని గూర్చి పాఠ్యాంశాన్ని సిలబస్ నుంచి తొలగించింది అకడమిక్ కౌన్సిల్. నిజానికి ఇక్బాల్‌ని పాకిస్తాన్ తాత్విక తండ్రిగా పిలుస్తారు. అతను ముస్లిం లీగ్‌లో జిన్నాను నాయకుడిగా స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడని, ఇక్బాల్ కూడా జిన్నా వలే భారతదేశ విభజనకు కారణమని యూనివర్సిటీ ఆరోపించింది. (చదవండి: ఆక్రమణ నిరోధక డ్రైవ్‌లో షాకింగ్ దృశ్యాలు..పోలీసులు మహిళ జుట్టు పట్టి లాగి, తన్ని..) -
HYD: ఎస్సై సార్ సాహసం.. ప్రాణాలకు తెగించి 16 మందిని కాపాడాడు
సాక్షి, హైదరాబాద్: మనిషికి సమయస్ఫూర్తితో పాటు ధైర్యసాహసాలు కూడా అవసరమే!. తన ప్రాణాలకు తెగించి మరీ ఇక్కడో ఎస్సై సార్.. పదహారు మంది ప్రాణాలను కాపాడారు. రియల్ హీరో అనిపించుకున్నారు. మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. పదహారు మందిని డీసీఎంలో తరలిస్తుండగా.. ఖైరతాబాద్ వైపు వచ్చే వాహనం నడుపుతున్న హోంగార్డు రమేష్‌కు ఫిట్స్ వచ్చింది. దీంతో వాహనం అదుపు తప్పి.. డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో డీసీఎంలో ఉన్న బంజారాహిల్స్ ఎస్సై కరుణాకర్ రెడ్డి అప్రమత్తం అయ్యారు. కిందకు దూకి ప్రాణాలకు తెగించి వాహనాన్ని కంట్రోల్ చేశారు. ఈ క్రమంలో ఆయనకు, మరో కానిస్టేబుల్ సాయి కుమార్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. ఎస్సై సార్ సాహసంతో 16 మంది ప్రమాదం నుంచి బయటపడగా.. గాయపడిన ఎస్సై కరుణాకర్‌ను, రమేష్‌ను ఆస్పత్రికి తరలించారు. -
మంత్రి కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత..
సాక్షి, కరీంనగర్: మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఏబీవీపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఓ జడ్పీటీసీ ఏబీవీపీ కార్యకర్తతో అనుచితంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు బీజేపీ, కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. ఈ అరెస్ట్‌లపై బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హెచ్‌సీయూలో ఉద్రిక్తత.. మోదీ బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనతో టెన్షన్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. హెచ్‌సీయూలో ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన వల్ల ఏబీవీపీ-ఎస్ఎఫ్ఐ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో, పోలీసులు వారిని ఎంట్రీ ఇచ్చారు. వివరాల ప్రకారం.. హెచ్‌సీయూలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యాంపస్‌లో గురువారం సాయంత్రం కశ్మీర్ ఫైల్స్‌ను ప్రదర్శించేందుకు ఏబీవీపీ ప్రయత్నించింది. ఈ సందర్భంగా మోదీ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఎస్ఎఫ్ఐ నేతలు ప్రయత్నించారు. దీంతో, ఇరు వర్గాల విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో క్యాంపస్‌లో ఎలాంటి ప్రదర్శనలకు అనుమతిలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కారణంగా హెచ్‌సీయూలో పోలీసులు భారీగా పోలీసులు మోహరించారు. -
ప్రాథమిక స్థాయిలో శిక్షణేదీ?
ఇటీవల 36వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ... గత పాలకుల వైఫల్యం, క్రీడల్లో బంధుప్రీతి, అవినీతి, తీవ్రమైన మౌలిక వసతుల కొరత వంటి కారణాలవల్ల ప్రపంచ క్రీడా వేదికలపై మనం వెనుకపడ్డామని అన్నారు. విద్యావిధానంలో భాగంగా క్రీడా విధానాన్ని చూసినప్పుడే క్రీడలు కాలానుగుణంగా అభివృద్ధి చెందుతాయి. మన ప్రభుత్వాలు ఆ విషయాన్ని మరచాయి. 1968లో ఇందిరాగాంధీ, 1986లో రాజీవ్ గాంధీ, 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వాలు జాతీయ విద్యా విధానంలో మార్పులు చేసినప్పటికీ క్రీడలకు సముచిత స్థానం కల్పించలేకపోయాయి. కానీ మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చిన నూతన విద్యా విధానం – 2020లో వ్యాయామ విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ‘గ్రాస్ రూట్ టాలెంట్ హంట్’ అనే నినాదంతో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌ను తీసుకురావడం కొంతవరకు మంచి సత్ఫలితాలు ఇస్తున్నప్పటికీ ఇంకా అనేక అంశాలలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర జనాభా కన్నా చాలా తక్కువ ఉన్న దేశాలు కూడా ఒలింపిక్స్‌లో మొదటి పది దేశాల జాబితాలో ఉంటున్నాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ ఈవెంట్స్, ఈత కొలనులో జరిగే పోటీల్లో అత్యంత వెనుకబడిన దేశాలూ ఎన్నో పతకాలను కొల్లగొడు తున్నాయి. కాబట్టి మనం కూడా వీటిపై ప్రత్యేక శ్రద్ధపెడితే మంచి ఫలితాలు వస్తాయి. విద్యాహక్కు చట్టం–2009 ప్రతి పాఠశాలలో క్రీడాస్థలం, క్రీడలకు కావాల్సిన సౌకర్యాలు ఉండాలని ప్రతిపాదించింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించు కున్నట్టు కనిపించదు. చదువు కన్నా ఆటలను ఇష్టపడే వయసులో ఉన్న పిల్లలు ప్రాథమిక పాఠశాలల్లో ఉంటారు. ఆ వయసులోనే పిల్లల్లో నిబిడీకృతమై ఉన్న క్రీడా నైపుణ్యాలు బయటపడతాయి. కానీ దురదృష్టవశాత్తూ మన దేశంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులు కనిపించరు. క్రీడల్లో అగ్రదేశాలకు సవాల్ విసురుతున్న చైనా... అతిచిన్న వయసులోనే పిల్లలో ఉన్న క్రీడా సామర్థ్యాన్ని గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్న విష యాన్ని ఇక్కడ గమనంలో ఉంచుకోవాలి. అందుకే ముందుగా ప్రాథమిక పాఠశా లల్లోనూ వ్యాయామ ఉపాధ్యాయులను నియ మించాలి. పాఠశాలలూ, కళాశాలల్లోనే కాక... గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి శిక్షకులనూ అందుబాటులో ఉంచాలి. అప్పుడే మన దేశంలో ఎంతో మంది పీవీ సింధులు, నికత్ జరీన్‌లు, నీరజ్ చోప్రాలు మన మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడిస్తారు. (క్లిక్ చేయండి: వెల్లివిరుస్తున్న కొత్త క్రీడా సంస్కృతి!) – జంగం పాండు, ఏబీవీపీ ఖేల్ స్టేట్ కన్వీనర్ -
జాతీయవాద ఉద్యమానికి తీరని లోటు
ప్రముఖ విద్యావేత్త, జాతీయవాది, హిందూధర్మ పరిరక్షకులు గుజ్జుల నర్సయ్య సార్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర మాజీ అధ్యక్షులుగా, ఆలిండియా స్థాయిలో ఉపాధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులుగా గణనీయమైన స్థాయిలో సేవలు అందించారు. నర్సయ్య తన 81 ఏళ్ల వయసులో 2022 సెప్టెంబర్ 24 హన్మకొండ హంటర్ రోడ్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య రాజ్యలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామం మండలగూడెంలో 1942 ఆగస్ట్ 8న ఆయన జన్మించారు. 1952లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో స్వయంసేవక్‌గా జీవితాన్ని ప్రారంభిం చారు. 1967లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981లో ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లిష్ భాషను సులభ శైలిలో బోధించి వారిలో ఇంగ్లిష్ భాష అధ్యయనం పట్ల ఆసక్తి పెంచే మెలకువలు నేర్పించిన ఉత్తమ అధ్యాపకులుగా గుర్తింపు పొందారు. 1986లో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రంలో వామపక్ష భావజాలం కలిగిన విద్యార్థి సంఘాలతో జరిగిన అనేక సంఘర్షణ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. ఉత్తర తెలంగాణ పరిధిలో గల జిల్లాల్లో విశేష పర్యటనలు చేసి విద్యార్థి పరిషత్ కార్యకర్తల్లో జాతీయవాద దృక్పథాన్ని ప్రేరేపించారు. 1992లో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించారు. కొంతకాలం వరంగల్ విభాగ్ ప్రముఖ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఏబీవీపీ సంస్థకు పూర్తి సమయ కార్యకర్తగా వరంగల్ నుండి దేశ నలుమూలల పని చేయడానికి వెళ్లారు. క్లిష్ట పరిస్థితులలో జాతీయవాద వ్యాప్తి కోసం నిరంతరం పరితపించిన మహానుభావుడు నర్సయ్య. బిహార్ విశ్వవిద్యాలయం ఈసీ మెంబర్‌గా కూడా ఆయన చాలాకాలం సేవలు అందించారు. 2001లో హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల నుండి ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. 2007లో భారతీయ జనతా పార్టీ పక్షాన ఎమ్మెల్సీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఇంగ్లిష్ లెక్చరర్‌గా నర్సయ్య వడ్డేపల్లిలోని పింగిలి కాలేజీలో, గోదావరిఖని, మంథని, మంచిర్యాల, పెద్దపల్లి, హుజురాబాద్ డిగ్రీ కళాశాలలో పని చేశారు. పలు జూనియర్ డిగ్రీ కళాశాలలు నిర్వహించిన జాతీయ సేవాపతకం శిబిరాల్లో జాతీయ పునర్నిర్మాణంలో యువత పాత్ర అనే అంశంపై అనర్గళంగా ఉపన్యసించి యువతలో సేవాభావం, దేశభక్తి, సంకల్పబలం, మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేసిన సామాజిక చైతన్యశీలి ఆయన. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హన్మకొండ చౌరస్తాలోని వేదికపై ఆయన ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేసే విధంగా సాగేవి. నక్సలైట్ల చేతిలో ఏబీవీపీ కార్యకర్తలు మరణించిన సమయంలో నర్సయ్య మొక్కవోని ధైర్యంతో వెళ్లి వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన సందర్భాలు అనేకం. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక కార్యక్రమాలలో విద్యార్థులను జాగృతం చేయడంలో కూడా కీలక భూమిక పోషించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏబీవీపీ చేపట్టిన పాదయాత్రకు పాటలు, మాటలు అందించారు. గుజ్జుల నర్సయ్యసార్ మరణం విద్యారంగానికి, సామాజిక చైతన్యానికి తీరని లోటు. వారి ఆశయాల సాధనకు కృషి చేయడమే ఘనమైన నివాళి. (క్లిక్: సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్ని కణం చాకలి ఐలమ్మ) - నేదునూరి కనకయ్య వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం, సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక, తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం -
హోంమంత్రి ఇంటిపై ఏబీవీపీ కార్యకర్తల దాడి!
శివాజీనగర: దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారు హత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు శనివారం కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఇంటిని ముట్టడించారు. శనివారం బెంగళూరులో జ్ఞానేంద్ర ఇంటి ప్రాంగణంలోకి చొరబడి బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నాశనమయ్యాయని, హోం శాఖను నిర్వహించటంలో విఫలమైన మంత్రి.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. తర్వాత ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. కొందరిని అరెస్ట్ చేసి 30 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదుచేశారు. ఇదీ చదవండి: కళాశాల విద్యార్థికి ఉగ్రవాదులతో లింక్! -
చెంప ఛెళ్లుమనిపించిన మహిళా హెచ్ఎం.. అసలు ఏం జరిగిందంటే?
రాజంపేట టౌన్ (అన్నమయ్య జిల్లా): రాజంపేట బాలికోన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మీదేవి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి అశోక్ చెంప ఛెళ్లుమనిపించారు. పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో నెంబర్ 117 రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఏబీవీపీ నాయకులు మంగళవారం విద్యాసంస్థల బంద్ చేపట్టారు. అశోక్ ఏబీవీపీ నాయకులను వెంటపెట్టుకొని ఉదయం 11 గంటలకు జెడ్పీ బాలికోన్నత పాఠశాలకు వెళ్లి.. విద్యార్థులను ఇళ్లకు పంపించేయాలని హెచ్ఎం లక్ష్మీదేవిని కోరారు. చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. కొన్నాళ్లు గడిచాక.. విద్యార్థులకు భోజనం పెట్టిన తర్వాత మధ్యాహ్నం నుంచి సెలవు ఇస్తానని హెచ్ఎం ఏబీవీపీ నాయకులకు తెలిపారు. అందుకు అశోక్ ససేమిరా అన్నాడు. విద్యార్థులను ఇళ్లకు పంపితే వండిన భోజనం, కోడి గుడ్లు వృథా అవుతాయని, చాలా మంది విద్యార్థినుల తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి ఉంటారని, పిల్లలు ఇప్పుడు ఇళ్లకు వెళితే మధ్యాహ్నం భోజనంలేక పస్తులుండాల్సి వస్తుందని హెచ్ఎం వివరంగా తెలియజేశారు. అయినప్పటికీ వినిపించుకోని అశోక్ ‘మీకు మెంటలా? చెబుతుంటే అర్థం కావటం లేదా?’ అని పరుష పదజాలంతో గద్దిస్తూ, దురుసుగా ప్రవర్తించటంతో హెచ్ఎం లక్ష్మీదేవి అతని చెంప ఛెళ్లుమనిపించారు. -
ABVP Foundation Day: దేశ పునర్నిర్మాణం కోసం...
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో... దేశంలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం, సమాజ సేవ వంటి భావాలతో విశ్వవిద్యాలయాలు, కళాశాలలను కేంద్రాలుగా చేసుకుని కొందరు యువకులు తాము చదువుతున్న ప్రాంతం నుంచే పని మొదలుపెట్టారు. వీరి లక్ష్యాలలో దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటం, జాతీయ భావన కల్పనకై కృషిచేయడం అత్యున్నతమైనవి. ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు అధికారికంగా 1949 జూలై 9న ‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్’ (ఏబీవీపీ) స్థాపితమైంది. అప్పటి నుండి నేటి వరకూ ‘విద్యా రంగం’ అంటే ఒకే కుటుంబం అనే భావనతో పనిచేసింది. కళాశాలల్లో మౌలిక వసతుల లేమి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సహా అనేక ఫీజులకు సంబంధించిన సమస్యలపై పోరాడింది. ఉపకార వేతనాల పెంపుదల, మెరుగైన హాస్టల్ వసతులు, గ్రామీణ ప్రాంతాలకు బస్ సౌకర్యం వంటి వాటి కోసం ఉద్యమాలు నిర్వహించింది. అంతేకాదు, ‘జాతీయత మా ఊపిరి – దేశభక్తి మా ప్రాణం’ అంటూ దేశంలో ఎక్కడ విచ్ఛిన్నకర సంఘటన జరిగినా అనుక్షణం స్పందిస్తూ దేశ రక్షణలో ఒక వాచ్ డాగ్ లాగా నిమగ్నమై ఉంది. కశ్మీర్లో వేర్పాటువాదుల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ దేశభక్తిని రగిలించడంలో ఈ సంస్థది మరపురాని పాత్ర. మొదట్లో కొద్దిమందితో ప్రారంభమైన ఏబీవీపీ యాత్ర ఎక్కడా ఆగలేదు. విద్యారంగ సమస్యలతో పాటు జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఏబీవీపీ పని చేస్తూ ఉంది. జాతీయ పునర్నిర్మాణం వ్యక్తి నిర్మాణం ద్వారానే సాధ్యమనేది ఏబీవీపీ నమ్మకం. జాతీయ పునర్నిర్మాణం అంటే చిట్టచివరి వ్యక్తికి కూడా గూడు, గుడ్డ, విద్య, వైద్యం వంటి ప్రాథమిక వసతులు అందించాలి. వ్యక్తిగత జీవన ప్రమాణాలు, సంస్కృతిని కాపాడుకుంటూనే ‘వసుధైక కుటుంబం’ అనే భావనతో పనిచేయడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. ఈ ఏడు దశాబ్దాల ప్రయాణంలో విభిన్న వ్యవస్థలలో ఏబీవీపీ కార్యకర్తలు మంచి మార్పుల కోసం, సానుకూల దృక్పథంతో కృషిచేస్తూ వస్తున్నారు. – అంబాల కిరణ్, ఏబీవీపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, వరంగల్ (జూలై 9న ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం) -
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఆందోళనల్లో భాగంగా ఆదివారం ట్రిపుల్ ఐటీ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఏబీవీపీ కార్యకర్తలు బాసర ట్రిపుల్ ఐటీలోకి దూసుకెళ్లారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఓ మహిళా కార్యకర్తను ఈడ్చుకెళ్లినట్టు సమాచారం. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, అక్రమ అరెస్టులపై ఏబీవీపీ నాయకులు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన -
దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశాం
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా త్యాగనిరతులని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గురువారం హైదరాబాద్ తార్నాకలో నూతనంగా నిర్మించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తెలంగాణ ప్రాంత కార్యాలయం ‘స్ఫూర్తి –ఛాత్రశక్తి’భవన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఏబీవీపీ పూర్వ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ బాగా ప్రాచుర్యం పొందితే, భవిష్యత్తులో కొందరికి అడ్డంకి కావచ్చని, ఈ విషయంపై జాగరూకతతో ఉండాలని సూచించారు. హింస ద్వారా సత్యం మరణించలేదని అన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ కార్యకర్త అంటే హేళన చేసేవారని, కానీ, ఇప్పుడు అది నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. దేశ సమైక్యత, సమగ్రతల కోసం ఎంతోమంది ఏబీవీపీ కార్యకర్తలు బలిదానాలు చేశారని కొనియాడారు. దేశంపట్ల విద్యార్థులు ప్రేమానురాగాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కంటే పెద్ద ఆనందం, గర్వం ఏముంటుందని అన్నారు. మనుషుల జీవితంలో రాముడు పరివర్తన తీసుకొచ్చారని భగవత్ పేర్కొన్నారు. ఏబీవీపీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఆశీష్ చవాన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ‘స్ఫూర్తి –ఛాత్రశక్తి’భవన్‌ను నిర్మించటం గర్వంగా ఉందన్నారు. విద్యార్థి సమస్యలపై ఏక్తామార్గంలో ఏబీవీపీ సమరశీల పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. సమ్మేళనంలో ఏబీవీపీ అఖిల భారత, రాష్ట్ర నాయకులు ప్రవీణ్‌రెడ్డి, శేఖర్, రాజేందర్‌రెడ్డి, శంకర్, నిధి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శేషగిరిరావు రచించిన ‘దేశ చరిత్ర–పునర్జీవనం–సంస్కృతి’అనే పుస్తకాన్ని మోహన్ భగవత్ ఆవిష్కరించారు. -
ABVP: విద్యార్థులే భవన నిర్మాతలు
‘విద్యార్థి సేవా సమితి ట్రస్ట్’ ఆధ్వర్యంలో ‘స్ఫూర్తి ఛాత్రా శక్తి భవనం’ నిర్మితమైంది. ఇది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేతుల మీదగా రేపు విద్యార్థి లోకానికి అంకితం కాబోతోంది. 1949 జూలై 9న దేశవ్యాప్తంగా ఏబీవీపీ పనిని ప్రారంభిస్తే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1964లో పనిలోకి దిగింది. అప్పట్లో విద్యానగర్‌లో ఏబీవీపీ కార్యాలయం కోసం ఒక అద్దె భవనాన్ని తీసుకున్నారు. ఆ కార్యాలయం అనేక విద్యార్థి ఉద్యమాలకు వేదిక అయ్యింది. తెలంగాణ ఉద్యమంలో ఈ కార్యాలయం కేంద్ర బిందువయ్యింది, అనేక మంది నాయకులు, మేధావులు, సంఘ సంస్కర్తలు ఇక్కడ తయారయ్యారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యాలయమూ దీనిలోనే ఉంది. ఏబీవీపీ ‘సర్వవ్యాప్త– సర్వ స్పర్శి’ అనే నినాదంతో అన్ని విభాగాల విద్యార్థులకు చేరువ కావడంతో సభ్యుల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి కార్యాలయం విద్యార్థుల అవసరాలను తీర్చలేకపోతున్నందున ఆధునిక కార్యాలయం ఏబీవీపీకి తక్షణ అవసరంగా మారింది. అందుకే కొత్త కార్యాలయం కోసం హైదరాబాద్ తార్నాకలో వేయి గజాల విస్తీర్ణం గల భూమిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ సంగతి తెలిసి వేయిమంది పూర్వ కార్యకర్తలు ఒక్కొక్కరూ ఒక గజాన్ని కొనడానికయ్యే ఖర్చు భరించారు. 2017 ఏప్రిల్‌లో భూమి పూజ జరిగింది. ఈ ఐదేళ్లలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, కరోనా కష్టాలను దాటుకుంటూ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా పదిహేను వేలకు పైగా పూర్వ కార్యకర్తలు ఈ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. వారి నుండి ప్రేరణ పొంది లక్షలాది మంది విద్యార్థులు విరాళాలు ఇచ్చారు. స్థానిక, అలాగే ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల ఎదుగుదలకు కావలసిన స్ఫూర్తినీ, సదుపాయాలనూ ఈ కార్యాలయం అందించాలనేది లక్ష్యం! – చింత ఎల్లస్వామి ఏబీవీపీ రాష్ట్ర మాజీ జాయింట్ సెక్రటరీ, తెలంగాణ (జూన్ 16న ‘స్ఫూర్తి ఛాత్రా శక్తి నిలయం’ ప్రారంభం సందర్భంగా) -
ఆదిలాబాద్ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిరసన సెగ
-
మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ
-
ఉద్రిక్తతంగా మంత్రి కేటీఆర్ నారాయణపేట జిల్లా పర్యటన
-
ఉద్రిక్తత: కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు
సాక్షి, నారాయణపేట్: మంత్రి కేటీఆర్ నారాయణపేట జిల్లా పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ కాన్వాయ్‌ను బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో నిరసనకారలపై పోలీసుల లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. పలువురుఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. కాగా జిల్లా ఆస్పత్రిలో చిల్డ్రన్స్ ఐసీయూ వార్డును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. -
దేశ నిర్మాణంలో భారత విద్యార్థి పాత్ర
భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో దేశంలోని విద్యార్థి యువకుల శక్తిని సంఘటిత పరిచేందుకు పురుడు పోసుకుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం సాధ్యమని స్వామి వివేకానంద స్ఫూర్తితో అంచె లంచెలుగా విస్తరిస్తూ, 73 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో నేడు ప్రపంచంలోనే శక్తిమంతమైన విద్యార్థి సంస్థగా వెలుగొందుతోంది. దేశం పేరు భారత్ ఉంచాలన్న తొలి డిమాండ్, వందేమాతర గీతాన్ని జాతీయ గీతంగా గుర్తించా లనే రెండవ డిమాండ్ చేస్తూ, జ్ఞాన్, శీల్, ఏకతా అని నినదిస్తూ, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విరాజిల్లుతూ, పొరుగు దేశం నేపాల్లోనూ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. దేశంలోని అనేక మంది కీలక రాజకీయ నాయకులు ఒక ప్పుడు ఏబీవీపీ కార్యకర్తలే అని గమనిస్తే, అది యువతలో నాయకత్వ లక్షణాలను నింపే కర్మా గారం అన డంలో ఎలాంటి సందేహం లేదు. దేశ వ్యాప్తంగా కళాశాల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు 4,500 నగరాలు, పట్టణాల్లో 33 లక్షల సభ్యత్వం కలిగివుండటంతో పాటు, ప్రపంచ దేశాల నుండి భారత్ వచ్చి చదువుకునే విద్యార్థుల కోసం డబ్ల్యూఓఎస్‌వై, సామాజిక స్పృహతో పని చేయడానికి ఎస్ఎఫ్డీ, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకై రాష్ట్రీయ కళామంచ్, కేంద్రీయ విద్యా సంస్థల్లో థింక్ ఇండియా... ఇలా ప్రజాస్వామ్య ప్రపం చంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ అవతరించింది. కశ్మీరీ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా 1990 సెప్టెంబర్ 11న చేపట్టిన చలో కశ్మీర్ యువతను చైతన్యపరిచిన ఒక మహోద్యమం. అస్సాం చొరబాటు దారులకు వ్యతిరేకంగా అస్సాంను కాపా డండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో 1983 అక్టోబర్ 2న గౌహతిలో భారీ ప్రదర్శన జరిపింది. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు వ్యతిరేకంగా చలో చికెన్‌నెక్ పేరుతో 2008 డిసెంబర్ 17న బెంగాల్ సరిహద్దుల్లో 40 వేల మంది విద్యార్థులతో భారీ ఆందోళన నిర్వహించింది. భారతీయులను బానిస లుగా మార్చే మెకాలే విద్యా విధానాన్ని మార్చి జాతీయ విద్యా విధానం–2020 కార్యరూపం దాల్చేలా పోరాడింది. మహమ్మారి ఆపత్కాలంలో మేమున్నామంటూ పరిషత్ నిర్ణయంతో దేశవ్యాప్తంగా తరలిన కార్యకర్తల సేవాభావం వెలకట్టలేనిది. కరోనా సోకి దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబాలకు వైద్య సహాయం, భోజనాలు అందించడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, ఏడాదిన్నర నుండి తరగతి గది అభ్యసనానికి దూరమైన విద్యార్థులకు ఎక్కడికక్కడ పరిషత్ పాఠశాల పేరుతో ట్యూషన్స్ చెప్పడంలాంటి అనేక కార్య క్రమాలను ఏబీవీపీ చేపట్టింది. - ప్రవీణ్‌రెడ్డి రాష్ట్ర కార్యదర్శి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, తెలంగాణ -
మంత్రి ఈటలను ఘెరావ్ చేసిన నిరుద్యోగులు
సాక్షి, కరీంనగర్: మంత్రి ఈటల రాజేందర్‌కు సొంత జిల్లా కరీంనగర్లో నిరుద్యోగుల సెగ తగలింది. హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు మంత్రి ఈటల శుక్రవారం వెళ్లారు. ఈ నేపథ్యంలో మంత్రి కాన్వాయ్‌ని ఏబీవీపీ కార్యకర్తలు, నిరుద్యోగులు అడ్డుకుని ఘొరావ్ చేశారు. కారుకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని లేకుంటే నిరుద్యోగులకు భృతి అయినా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాటలో ఓ ఏబీవీపీ కార్యకర్త సృహతప్పి పడిపోయాడు. పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ( చదవండి: ప్రతి ఖాళీని భర్తీ చేయాలి ) -
ఎమ్మెల్యే రసమయిని అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు..
-
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ఆందోళనల సెగ
సాక్షి, కరీంనగర్ : మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు చుక్కెదురైంది. మానకొండూరు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉద్యోగుల పదవీ విరమణ వయసు ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. 33 జిల్లాలలో ఒక్కో జిల్లాకు 2000 ఉద్యోగాల చొప్పున 66000 వేల నూతన ఉద్యోగాల కల్పనను చేసి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వాహనానికి అడ్డం తిరిగి రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్ళగా ఎమ్మెల్యే వాహనం పక్కనుంచి వెళ్లిపోయింది. -
ఏబీవీపీ జాతీయాధ్యక్షుడిపై మహిళ ఫిర్యాదు
చెన్నై: పార్కింగ్ స్థలం వివాదంలో ఏబీవీపీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ సుబ్బయ్య షణ్ముగం తనను వేధిస్తున్నారంటూ 62 ఏళ్ల మహిళ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్బయ్య తన ఇంటి ముందు మూత్ర విసర్జన చేస్తున్నారని.. వాడిన మాస్కులను, వేపాకులను తన ఇంటి ముందు పడేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, సీసీటీవీ వీడియోలను పోలీసులకు అందించారు. మహిళ బంధువు, అప్‌కమింగ్ కమెడియన్ బాలాజీ విజయరాఘవన్.. దీని గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వివాదం గురించి మాట్లాడుతూ.. ‘షణ్ముగం మా ఆంటీ పర్మిషన్తో పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందుకు గాను 1500 రూపాయల అద్దె చెల్లించాల్సిందిగా మా ఆంటి షణ్ముగాన్ని కోరింది’ అని తెలిపాడు. (72 ఏళ్ల విద్యార్థి ఉద్యమం) బాలాజీ మాట్లాడుతూ.. ‘దాంతో షణ్ముగం మా ఆంటీ ఇంటి ముందు మూత్ర విసర్జన చేయడం.. వాడేసిన మాస్క్‌లను ఇంటి ముందు పడేయడం చేస్తున్నాడు. అతడి చర్యలతో విసిగిపోయిన మా ఆంటీ దీని గురించి అడంబక్కం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది’ అని తెలిపారు. షణ్ముగం, ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిగానే కాక కిల్పాక్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ రాయపేట ఆసుపత్రిలో డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ హెడ్‌గా పని చేస్తున్నారు. (ప్రయాణికుల్లా వచ్చి...) ఈ అంశంపై డీఎంకే నాయకురాలు కనిమొళి ట్విటర్లో స్పందించారు. ‘మితవాద నాయకుల మీద ఫిర్యాదులు వస్తే.. పోలీసులు గుడ్డివాళ్లలాగా ప్రవర్తించడం రివాజుగా మారింది. సీఎంఓ తమిళనాడు తక్షణమే దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించాలి’ అని డిమాండ్ చేశారు. అయితే ఈ వీడియో, ఫిర్యాదు అన్ని ఫేక్ అంటుంది ఏబీవీపీ. జాతీయ అధ్యక్షుడి పరువు తీయడానికే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డది. ఫిర్యాదు చేసిన మహిళ వెనక ఎన్ఎస్యూఐ ఉందని ఆరోపించింది. -
నాటు వేస్తూ.. కబడ్డీ ఆడుతూ..
హన్మకొండ చౌరస్తా: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఏబీవీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ మేరకు హన్మకొండలోని జిల్లా బస్టాండ్ వద్ద రోడ్డుపై గుంతల్లో నిలిచిన వర్షపు నీటిలో నాట్లు వేయడంతో పాటు ఆ నీటిలో కాసేపు కబడ్డీ ఆడారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పున్నం వేణుతో పాటు భరత్‌వీర్, అజయ్, వంశీకృష్ణ, అఖిల్, బలరాం, అరుణ్‌సాయి పాల్గొన్నారు ఏబీవీపీ నాయకులపై కేసు నమోదు.. వరంగల్ క్రైం: హన్మకొండ బస్టాండ్ వద్ద రోడ్డు మరమ్మతు చేయాలనే డిమాండ్‌తో నిరసన తెలిపిన ఏబీవీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు హన్మకొండ ఇన్స్పెక్టర్ దయాకర్ తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు కరోనా నిబంధనలకు ఉల్లంగించినందుకు పున్నం వేణు, ఎర్రగోల్ల భరత్, గాజు అజయ్‌కుమార్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
72 ఏళ్ల విద్యార్థి ఉద్యమం
ఏబీవీపీ అనే నాలుగు అక్షరాలు తెలియని విద్యార్థి కళాశాల క్యాంప స్లో ఉండడు. 72 ఏళ్ళుగా విద్యార్థి లోకంతో మమేకమై వారి సమస్యల పరిష్కారంలో ముందుండటమే దీనికి కారణం. 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభమై, నేడు దేశంలో 33 లక్షల సభ్యత్వం గల అతి పెద్ద విద్యార్థి సంఘం ఇది. స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో వందేమాతర గీతాన్ని జాతీయ గీతంగా చేయాలనీ; వివిధ ప్రాంతాల భాషలను రాజ్యభాషగా, హిందీని అధికార భాషగా గుర్తిం చాలనీ; రాజ్యాంగంలో ఇండియా పేరును భారత్‌గా మార్చా లనీ ఏబీవీపీ ఉద్యమం చేసింది. విద్యార్థులపై పన్ను భారం లేని విద్యను కొనసాగించాలని డిమాండ్ చేసింది. కానీ ప్రభుత్వం పన్నును రెండింతలు చేయడంతో దేశం మొత్తం జరిగిన ఆందోళనలకు నేతృత్వం వహించింది. దీనితో 1966లో డి.ఎస్. కొఠారిని యూజీసి చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. 1968లో విద్యపై కేంద్రం ఒక విధానాన్ని ప్రకటించింది. 1973లో గుజరాత్‌లోని ఎల్.డి.ఇంజనీరింగ్ కాలేజీ, మోర్వి పాలిటెక్నిక్ కాలేజీల మెస్ ఉద్యమానికి ఏబీవీపీ మద్దతుగా నిలవడంతో ఉద్యమం ఉధృతమైంది. చిమన్‌భాయ్ పటేల్ సర్కారు గద్దె దిగక తప్పలేదు. గుజరాత్‌లాగే బిహార్‌లో కూడా ఉద్యమం ప్రారంభమైంది. 1974 మార్చి 19న ఉద్యమానికి నేతృత్వం వహించమని జయప్రకాశ్ నారాయణను కోరింది. అసెంబ్లీల ముందు ధర్నాలు, కర్ఫ్యూల నడుమ నడిచిన ఈ ఉద్యమం 1975 జూన్ 20న ఇందిరాగాంధి ఎమర్జెన్సీ విధిం చడంతో ప్రజా ఆందోళనగా మారింది. సుమారు 5 వేల మంది ఏబీవీపీ కార్యకర్తలను మీసా చట్టం క్రింద అరెస్టు చేసి జైళ్లలో బంధించారు. ఎమర్జెన్సీ తరువాత అనేక విద్యార్థి సంఘాలు జనతా పార్టీలో కలిసిపోయాయి. ఏబీవీపీ మాత్రం జాతీయ పునఃనిర్మాణంలో ముందుకెళ్ళాలని నిర్ణయిం చుకుంది. 1990లో ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించి శ్రీనగర్ లాల్ చౌక్‌లో జాతీయ జెండాను కాల్చి దేశానికి సవాల్ విసిరి నప్పుడు, ‘చలో కాశ్మీర్’ కార్యక్రమంతో కార్యకర్తలను సమా యత్తం చేసింది. 10 వేల మందితో అదే లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఎగురవేసి జాతి గౌరవాన్ని నిలిపింది. బంగ్లాదేశ్ చొరబాటుదారుల విషయమై 1983 నుండి ‘సేవ్ అస్సాం’ పేరుతో ఉద్యమాలు చేసింది. బంగ్లా సరిహద్దును మూసి వేయాలని, అక్రమ చొరబాటు దారులను వారి స్వస్థలాలకు పంపాలని 2008 డిసెంబర్ 17న బిహార్ సరిహద్దులోని చికెన్ నెక్ దగ్గర 50 వేల మందితో ఆందోళన నిర్వహించింది. తెలంగాణలోని బీడుభూములు గోదావరి, కృష్ణా జలా లతో సస్యశ్యామలంగా మారాలని 1997లో ‘తెలంగాణ సస్యశ్యామల యాత్ర’ను బాసర నుండి శ్రీశైలం వరకు నిర్వహించింది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని 2009లో నిజాం కాలేజీ గ్రౌండ్లో లక్ష మంది విద్యార్థులతో ‘విద్యార్థి రణభేరి’ మోగించింది. ‘నా రక్తం నా తెలంగాణ’ పేరుతో ఒకే రోజు 22 వేలమంది విద్యార్థి యువకులు రక్త దానం చేసి చరిత్ర సృష్టించారు. 40 దేశాలల్లో ఏబీవీపీ కార్య క్రమాలను కొనసాగిస్తున్నది. దీని ఆవిర్భావ దినోత్సవాన్ని ‘జాతీయ విద్యార్థి దినోత్సవం’గా దేశమంతటా నిర్వహిం చడం సంతోషకరం. వ్యాసకర్త: చిరిగె శివకుమార్ ఏబీవీపీ రాష్ట్ర సహ సంఘటనా కార్యదర్శి, తెలంగాణ -
గాడ్సే దేశాన్ని రక్షించారంటూ పోస్ట్
భోపాల్: రూ. 10 కరెన్సీ నోటుపై మహాత్మాగాంధీ బొమ్మ స్థానంలో నాథూరామ్ గాడ్సే బొమ్మను క్లోన్ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఘటనకు పాల్పడిన వ్యక్తిని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)తో సంబంధమున్న సిధి జిల్లాకు చెందిన శివమ్ శుక్లాగా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను హీరోగా పేర్కొంటూ శుక్లా ఫేస్బుక్లో 'లాంగ్ లివ్ నాథురామ్ గాడ్సే' అంటూ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. మే 19న గాడ్సే 111 వ జయంతిని పురస్కరించుకొని శివమ్ శుక్లా ఈ పోస్ట్ చేసినట్లు తెలిపారు. మరో పోస్ట్‌లో.. రఘుపతి రాఘవ రాజా రామ్, దేశ్ బచ్చా గే నాథూరాం' (నాథూరాం దేశాన్ని రక్షించారు) అని పేర్కొన్నారు. అదే పోస్ట్‌లో 'శుక్లా గాడ్సేను మహాత్మా' అని సంభోదించి.. 'పూజ్య పండిట్ నాథూరాం గాడ్సే అమర్ రహీన్' అంటూ పోస్ట్ చేశారు. ఇదే విషయంపై నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ (ఎన్ఎస్యూఐ) కాంగ్రెస్ విద్యార్థి విభాగం శుక్లాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు శుక్లాను గుర్తించడానికి సైబర్ నిపుణుల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన ఏబీవీపీ.. సంబంధం లేని విషయాల్లో తమ పేరును తప్పుగా వాడుతున్నట్లు కాంగ్రెస్‌పై ఫిర్యాదు చేసింది. కాగా నవంబర్ 15, 1949న 'ఫాదర్ ఆఫ్ ది నేషన్'ను హతమార్చినందుకు గాడ్సేను అంబాలా జైలులో ఉరితీసిన సంగతి తెలిందే. చదవండి: గాడ్సేపై నాగబాబు వివాదాస్పద ట్వీట్ -
ప్రయాణికుల్లా వచ్చి...
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తోందంటూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులు ఇటీవల ఎన్నడూలేని విధంగా అసెంబ్లీ గేట్ నంబర్–2 వరకు పెద్దసంఖ్యలో రాగలిగారు. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు జిల్లాల నుంచి ముందస్తు వ్యూహంతో బయలుదేరిన ఏబీవీపీ కార్యకర్తలు సాధారణ ప్రయాణికుల మాదిరిగా, గరిష్టంగా పది మంది చొప్పున ఆర్టీసీ బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణించారు. జెండాలు ఎవరి కంటా పడకుండా వాహనాలు దిగే వరకు జేబుల్లోనే ఉంచుకున్నారు. అసెంబ్లీ చుట్టూ ఉన్న తెలుగు యూనివర్సిటీ, నిజాం కళాశాల వైపుల నుంచి బస్సులు, ఆటోల ద్వారా వచ్చి.. రవీంద్రభారతి, ఆ చుట్టుపక్కల దిగారు. ఉదయం 11.20 కి ఒక్కసారిగా 1, 2 నంబర్ల అసెంబ్లీ గేట్ల వైపు దూసుకొచ్చారు. గేట్–2 వద్దకు చేరుకుని, ఎక్కేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. వారిని కిందికి దింపే క్రమంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జీ చేశారు. గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించిన వారిని కిందకు లాగేశారు. లాఠీచార్జిలో రాష్ట్ర నాయకులు పృథ్వి సొమ్మసిల్లి పడిపోయాడని, నిహారిక, నరేంద్ర, మల్లికార్జున్ల చేతులకు తీవ్ర గాయాలయ్యాయని ఏబీవీపీ నాయకులు అంబాల కిరణ్, సుమన్‌శంకర్, రాఘవేంద్ర తెలిపారు. ముట్టడిలో పాల్గొన్న ఏబీవీపీతో పాటు పీడీఎస్‌యూ నాయకులు 224 మందిని సైఫాబాద్ పోలీసులు అరెస్ట్‌చేసి నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలిం చారు. వీరిపై 151 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొందరు కార్యకర్తలపై నాన్–బెయిలబుల్ కేసులు నమోదు చేసిన పోలీసులు వారికి నోటీసులిచ్చి విడిచిపెట్టారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, వర్సిటీలలో వైస్చాన్సలర్లను నియమించాలని, జూనియర్, డిగ్రీ కాలేజీలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్లతో ఏబీవీపీ ఈ కార్యక్రమం చేపట్టింది. పీడీఎస్‌యూకు చెందిన విద్యార్థి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు: ఏబీవీపీ విద్యార్థులపై లాఠీచార్జీని నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ఏబీవీపీ పిలుపునిచ్చింది. 24 గంటల్లోగా సీఎం కేసీఆర్ స్పందించి, లాఠీచార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే.. శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునివ్వడానికీ వెనుకాడబోమని హెచ్చరించింది. అరెస్ట్ చేసిన విద్యార్థులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. -
అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ యత్నం
-
తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ బుధవారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొని వెనక్కు నెట్టారు.అయినప్పటికీ ఏబీవీపీ నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 యూనివర్సీటీలకు వెంటనే వీసీలను నియమించాలని, ఖాళీగా ఉన్న 50వేల టీచర్ల పోస్టులను, జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేయడం లేదని దాని వల్ల తమకు స్కాలర్ షిప్‌లు రావడం లేదని విద్యార్థులు మీడియాకు చెప్పారు. ఈ డిమాండ్ తీర్చడం కోసమే అంతా కలిసి అసెంబ్లీ ముట్టడికి యత్నించినట్లు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘అర్బన్ నక్సల్స్తోనే జేఎన్యూకు అపకీర్తి’
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూలో ఈనెల 5న చోటుచేసుకున్న హింసాకాండపై ఏబీవీపీ, వామపక్ష విద్యార్ధుల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. అర్బన్ నక్సల్స్ జేఎన్యూకు చెడ్డపేరు తీసుకువస్తున్నారని బీజేపీ అనుబంధ ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి అన్నారు. ప్రతిష్టాత్మక జేఎన్‌యూ విద్యార్ధులుగా తాము గర్విస్తున్నామని సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె పేర్కొన్నారు. అథ్యాపకులు సైతం తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జేఎన్‌యూ విద్యార్ధులపై తమ కార్యకర్తలు ముసుగు దాడులకు పాల్పడ్డారన్న విద్యార్ధుల ఆరోపణలను ఏబీవీపీ తోసిపుచ్చింది. యూనిటీ ఎగనెస్ట్ లెఫ్ట్ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో ఛాటింగ్‌ను మార్ఫింగ్ చేశారని ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సిద్ధార్ధ్ యాదవ్ చెప్పుకొచ్చారు. మరోవైపు జేఎన్‌యూ క్యాంపస్‌లో దాడిపై పోలీసుల దర్యాప్తును జేఎన్‌యూ విద్యార్ధి సంఘం తప్పుపట్టింది. దాడికి గురైన బాధితులపైనే అభియోగాలు మోపుతూ పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. దాడి జరిగిన రోజు పోలీసులు, సెక్యూరిటీ గార్డులు బాధితులను కాపాడేందుకు ముందుకు రాలేదని ఆరోపించింది. -
ఎందుకు అరెస్టు చేయలేదు?
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు, హీరో ఎంకే ఉదయనిధి సంఘీభావం ప్రకటించారు. ఆదివారం విద్యార్థులతో కలిసి ఆయన నిరసన దీక్షలో పాల్గొన్నాన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిని పోలీసులు ఇప్పటి వరకూ అరెస్టు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. సోమవారం ఉదయం ఆయన చెన్నై నుంచి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జేఎన్‌యూ క్యాంపస్‌కు చేరుకున్న ఆయన విద్యార్థులను కలిశారు. ఈ నెల 5వ తేదీన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో విద్యార్థులపై గుర్తు తెలియని దుండగుల దాడి తరువాత చోటు చేసుకున్న పరిణామాల గురించి ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. ముఖానికి ముసుగులు వేసుకుని క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులపై దాడికి దిగిన వారిని ఢిల్లీ పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరిని మరింత బలాన్ని ఇస్తోందని అన్నారు. నిందితులెవరో సీసీటీవీ ఫుటేజీల్లో తేలినప్పటికీ అరెస్టు చేయకపోవడం పోలీసుల ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన విమర్శించారు. సంబంధిత వార్తలు ఫలించిన స్టింగ్ ఆపరేషన్.. విచారణకు ఆదేశం! జేఎన్‌యూలో మెరిసింది.. ఎవరీ ఆయిషీ ఘోష్? 10 వేల సిగరెట్లు.. 3 వేల కండోమ్‌లు... హీరోయిన్‌పై ఆర్బీఐ మాజీ గవర్నర్ ప్రశంసలు -
ముందే చెప్పాం.. పట్టించుకోలేదు
న్యూఢిల్లీ: యూనివర్సిటీలో దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మూక గురించి పోలీసులకు ముందే సమాచారమిచ్చామని, అయినా వారు చర్యలు తీసుకోలేదని జేఎన్‌యూ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ఆరోపించింది. ఈ నెల 5న మధ్యాహ్నం 3:00 గంటలకు వాట్సాప్‌లో పోలీసులకు మెసేజ్ పెట్టామని, ఆ మెసేజ్‌ను పోలీసులు 3:07 గంటలకు చూసి కూడా పట్టించుకోలేదని విద్యార్థి సంఘం తెలిపింది. ఈ దాడికి పాల్పడింది ఆరెస్సెస్‌కు చెందిన ఏబీవీపీ వర్గం వారేనని ఆరోపించింది. గత వారంలోకూడా తమ సంఘానికి చెందిన నాయకుల మీద వారు దాడిచేసినట్లు తెలిపింది. దాడికి ముందురోజు సాయంత్రం కూడా విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర యాదవ్‌పై దాడిచేశారని చెప్పింది. -
మోదీ నియోజకవర్గంలో ఏబీవీపీకి షాక్..
వారణాసి : వారణాసిలోని సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఏబీవీపీ ఘోరంగా ఓడిపోయింది. మొత్తం నాలుగు సీట్లను కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ కైవసం చేసుకుంది. విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్ఎస్యూఐకి చెందిన శివమ్ శుక్లా ఏబీవీపీ నాయకుడు హర్షిత్ పాండే మీద భారీ మెజారిటీతో గెలుపొందారు. అలాగే ఎన్ఎస్యూఐకి చెందిన చందన్ కుమార్ ఉపాధ్యక్షుడిగా, అవ్నీశ్ పాండే జనరల్ సెక్రటరీగా, రజనీకాంత్ దుబే లైబ్రెరియన్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి ప్రొఫెసర్ శైలేష్ కుమార్ ఫలితాలు ప్రకటించిన తరువాత.. యూనివర్సిటీ వైఎస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాజరామ్ శుక్లా.. వారిచేత సంస్కృతంలో ప్రమాణం చేయించారు. అలాగే వివాదాలకు దూరంగా ఉండేందుకు గెలిచిన అభ్యర్థులు క్యాంపస్‌లో ఊరేగింపు చేపట్టరాదని శుక్లా సూచించారు. అయితే గెలిచిన ఎన్ఎస్యూఐ నేతలు వారి ఇళ్లకు వెళ్లేటప్పుడు పోలీసు భద్రత కల్పించారు. అయితే ఈ ఎన్నికల్లో కేవలం 50.82 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఓటు వేయడం గమనార్హం. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం పరిధిలోని యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో కూడా ఏబీవీపీ ఒక్క సీటులో గెలుపొందని సంగతి తెలిసిందే. -
జేఎన్‌యూ : ఆ పోస్టర్లున్న గదులవైపు వెళ్లలేదు..!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జేఎన్‌యూ హాస్టళ్లపై ఆదివారం రాత్రి ఓ పథకం ప్రకారమే దాడి జరిగిందనడానికి అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 200 మీటర్ల దూరంలో ఉన్న పెరియార్, సబర్మతి హాస్టళ్లపై దుండగులు దాడులు జరిపారు. సబర్మతి హాస్టల్లోనే ఎక్కువ గదులు ధ్వంసమయ్యాయి. అవన్నీ కూడా వామపక్ష, ముస్లిం విద్యార్థులవే అవడం గమనార్హం. సబర్మతి హాస్టల్లోనే జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఐశే ఘోష్‌పై దాడి జరిగిందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ రీసర్చ్ స్కాలర్ తెలిపారు. కళ్లు కనిపించని ఓ సంస్కత స్కాలర్ గదిపై కూడా దాడి చేశారు. ఆ గది తలుపుపై బీఆర్ అంబేడ్కర్ పోస్టర్ ఉండడమే అందుకు కారణమని తెలుస్తోంది. (చదవండి : ‘జేఎన్‌యూ దాడి మా పనే’) ‘బాబర్ కీ ఔలాద్’ అంటూ తనను చితక బాదినట్లు ఓ కశ్మీర్ విద్యార్థి ఆరోపించారు. ఏబీవీపీ పోస్టర్లు, గుర్తులున్న ఏ హాస్టల్ గదిపై దుండగులు దాడి చేయక పోవడం గమనార్హం. దుండగులు దాడి చేసినప్పుడు పలువురు విద్యార్థులు తమ సెల్ఫోన్ల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరు రాలేదని వారు చెబుతున్నారు. ఆ రోజు హాస్టళ్ల వద్ద సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటలవరకు విధులు నిర్వహించాల్సిన షిప్టులో ఒక్క గార్డు కూడా హాజరుకాక పోవడం ముందస్తు ప్రణాళికను సూచిస్తోంది. ఈ విషయమై మీడియా ముందు స్పందించేందుకు గార్డులు నిరాకరించారు. (చదవండి : భయంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేశారు...) -
జేఎన్‌యూ దాడి : ఏబీవీపీకి మంత్రి క్లీన్చిట్
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూలో ఆదివారం సాయంత్రం ముసుగు దుండగులు విద్యార్ధులు, ఉపాధ్యాయులను చితకబాదిన ఘటనలో దర్యాప్తు సాగుతుండగానే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏబీవీపీకి క్లీన్చిట్ ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ అనుబంధ సంస్ధలకు హింసకు పాల్పడేంతటి శక్తిసామర్థ్యాలు లేవని చెప్పుకొచ్చారు. విద్యార్ధుల భవితవ్యంతో చెలగాటం వద్దని కాంగ్రెస్, ఆప్‌లకు హితవు పలికారు. పరీక్షలకు హాజరయ్యే వారిని అడ్డుకోవద్దని జేఎన్‌యూ విద్యార్ధులకు ఆయన విజ్ఞప్తి చేశారు. జేఎన్‌యూ ఘటనపై విచారణ సాగుతోందని త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు.మరోవైపు జేఎన్‌యూ దాడికి తమదే బాధ్యతని హిందూ రక్షా దళ్ ప్రకటించింది. జేఎన్‌యూ కమ్యూనిస్టులకు అడ్డాగా మారిందని, జాతి వ్యతిరేక..హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు వారు పాల్పడుతున్నందునే తమ కార్యకర్తలు క్యాంపస్‌లోకి చొచ్చుకువచ్చి దాడులు జరిపారని ఆ సంస్ధ నేత తోమర్ ఓ వీడియోలో వెల్లడించారు. చదవండి : జేఎన్‌యూ దాడి మా పనే -
జేఎన్‌యూ హింస : వారి పాత్రే కీలకం..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన జేఎన్‌యూలో ముసుగు దుండగుల దాడి వెనుక ఏం జరిగిందనేది ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. జేఎన్‌యూ క్యాంపస్‌లో ఆదివారం రాత్రి చెలరేగిన హింసాకాండకు ఏబీవీపీ, వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వర్సిటీ క్యాంపస్‌లో జరిగిన దౌర్జన్యకాండలో ఇరు వర్గాల తరపున బయట నుంచి వచ్చిన వ్యక్తులు పాలుపంచుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీ పోలీసులు సోమవారం ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదలాయించగా హింస వెనుక వామపక్ష, ఏబీవీపీ వాలంటీర్లు ఇద్దరూ ఉన్నారని క్రైమ్ బ్రాంచ్ నిగ్గుతేల్చింది. యూనివర్సిటీలోకి చొచ్చుకువచ్చిన బయటవ్యక్తులును సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు విద్యార్ధులు షేర్ చేసిన సోషల్ మీడియా వైరల్ వీడియోల ఆధారంగా గుర్తిస్తామని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. ముసుగులు ధరించిన దుండగులు ఇనుపరాలు, హాకీస్టిక్‌లతో ఆదివారం రాత్రి జేఎన్‌యూ క్యాంపస్‌లో స్వైరవిహారం చేసి విద్యార్ధులు, ఉపాధ్యాయులను చితకబాదిన సంగతి తెలిసిందే. చదవండి : జేఎన్‌యూ దాడి: ఫాసిస్ట్ సర్జికల్ స్రైక్స్..! -
జేఎన్‌యూలో దురాగతంపై విద్యార్థుల గర్జన
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో విద్యార్థులు, టీచర్లపై ఆదివారం ముసుగు దుండగులు చేసిన విచక్షణారహిత దాడిపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో విదేశీ యూనివర్సిటీల్లోనూ సోమవారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. అధికార, విపక్ష నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అడ్డుకునే విషయంలో అసమర్ధంగా వ్యవహరించారని యూనివర్సిటీ వైస్ చాన్సెలర్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించామని ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభించాయని క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది. ముసుగులు వేసుకుని జేఎన్‌యూ క్యాంపస్‌లోకి వచ్చిన దుండగులు ఆదివారం రాత్రి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలోయూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ సహా 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిమ్స్‌లో చికిత్స అనంతరం వారిని సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. కాగా, ఈ హింసకు బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీదే బాధ్యత అని విపక్షాలు, యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ఆరోపించాయి. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో జేఎన్‌యూలో పరిస్థితిని సమీక్షించారు. మోదీ ప్రభుత్వ సహకారంతో గూండాలు దేశ యువతపై జరిపిన ఈ దాడి అత్యంత గర్హనీయమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ అంధుడిపైనా వీరంగం కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్లతో ముసుగులు ధరించిన గూండాలు విచ్చలవిడిగా దాడి చేశారని బాధితులు తెలిపారు. ‘మేం హాస్టల్లో ఉండగా, ఏబీవీపీ వారు కర్రలతో వస్తున్నారని ఎవరో అరిచారు. దాంతో మేం రూంలోకి వెళ్లి లోపలి నుంచి తలుపేసుకున్నాం. అయినా, వారు తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నం చేయసాగారు. దాంతో బాల్కనీ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకాం’ అని కశ్మీర్‌కు చెందిన ఓ విద్యార్థి తెలిపారు. అంధుడినని కూడా చూడకుండా తనను విచక్షణారహితంగా కొట్టారని సూర్యప్రకాశ్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పలువురు విద్యార్థులు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. గూండాల దాడికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహిళల వసతి గృహంపైనా దుండగులు దాడికి తెగబడ్డారు. ‘క్యాంపస్‌లో జరిగిన శాంతి ర్యాలీలో పాల్గొంటుండగా.. 20–25 మంది దుండగులు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. నాపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు’ అని జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్ వివరించారు. తనపై దాడి చేసినవారిని గుర్తుపడతానన్నారు. తమకు వ్యతిరేకులైన వారిని గుర్తించి మరీ దాడికి పాల్పడ్డారని, ఇది ఏబీవీపీ దౌర్జన్యమేనని ఘోష్ ఆరోపించారు. ‘మా ఉద్యమాన్ని అడ్డుకునేందుకు గత 4, 5 రోజులుగా ఆరెస్సెస్‌తో సంబంధాలున్న పలువురు ప్రొఫెసర్లు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే, వారి ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగింది’ అని ఘోష్ పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో జేఎన్‌యూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ‘జేఎన్‌యూ సెక్యూరిటీ సహకారంతోనే ఆ గూండాలు రెచ్చిపోయారు. ఫోన్ చేసిన 2 గంటల తరువాత పోలీసులు వచ్చారు’ అని ఆయిషీ ఘోష్ ఆరోపించారు. తమపై వచ్చిన ఆరోపణలను ఏబీవీపీ ఖండించింది. దేశవ్యాప్తంగా నిరసనలు జేఎన్‌యూలో విద్యార్థులపై దాడిని విద్యార్థిలోకం తీవ్రంగా పరిగణించింది. పుదుచ్చేరి నుంచి చండీగఢ్ వరకు.. అలీగఢ్ నుంచి కోల్‌కతా వరకు వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు భారీగా నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, ఢిల్లీ యూనివర్సిటీ, అంబేద్కర్వర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, చండీగఢ్ యూనివర్సిటీ, సావిత్రీబాయి ఫూలె యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, జాదవ్‌పూర్ వర్సిటీసహా పలు విశ్వవిద్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. బెంగళూరులోని నేషనల్ లా యూనివర్సిటీ, ఐఐటీ– బాంబే, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్(పుణె) తదితర విద్యా సంస్థల్లోనూ విద్యార్థులు నిరసన తెలిపారు. ముంబైలో ఆదివారం అర్ధరాత్రి గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నిరసన తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ యువజన విభాగం టార్చ్‌లైట్స్ మార్చ్ నిర్వహించారు. విదేశాల్లో.. నేపాల్‌లోని కఠ్మాండూలో జేఎన్‌యూ పూర్వ విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే, బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్, ససెక్స్ యూనివర్సిటీల్లో, అమెరికాలోని కొలంబియా వర్సిటీలో విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు. వీసీపై ఆరోపణలు దాడి విషయంలో సకాలంలో స్పందించకపోవడంపై యూనివర్సటీ వైస్‌చాన్స్‌లర్ జగదీశ్ కుమార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. జేఎన్‌యూ అధికారులతో సోమవారం మానవ వనరుల శాఖ జరిపిన సమీక్ష సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. వీసీ రాజీనామా చేయాలని జేఎన్‌యూఎస్‌యూ, జేఎన్‌యూ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేశాయి. వీసీ గూండాల నాయకుడిగా వ్యవహరిస్తున్నారని, యూనివర్సిటీలో హింసకు ఆయనదే ప్రణాళిక అని ఆరోపించాయి. దుండగులు ప్రొఫెసర్ల నివాస సముదాయాలపైనా దాడి చేసి, మహిళలను దుర్భాషలాడారని పలువురు టీచర్లు తెలిపారు. దాడిలో ఏబీవీపీ హస్తం? జేఎన్‌యూలో దాడికి, బీజేపీ అనుబంధ సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి సంబంధం ఉన్నదని సూచించే పలు ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో పాల్గొన్నవారిలో జేఎన్‌యూ ఏబీవీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు వికాస్ పాటిల్ ఉన్నట్లు భావిస్తున్నారు. లాఠీలు, ఇనుపరాడ్లు పట్టుకుని ఉన్న కొందరు వ్యక్తులతో వికాస్ ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యాంపస్‌లో ఢిల్లీ పోలీసులకు దొరికిన ఫైబర్ గ్లాస్ లాఠీ లాంటి దానినే పాటిల్ పట్టుకుని ఉన్నారు. ఫొటోలో అతని పక్కన ఉన్న వ్యక్తిని ఏబీవీపీకి చెందిన శివపూజన్ మండల్‌గా గుర్తించారు. ఇతను జేఎన్‌యూలో బీఏ తొలిఏడాది చదువుతున్నాడు. కర్రలతో వికాస్ పాటిల్. శివపూజన్ మండల్. యోగేంద్ర (ఇన్సెట్లో) పాటిల్, మండల్ ఇద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేయడం గమనార్హం. జేఎన్‌యూ క్యాంపస్‌లో వామపక్ష విద్యార్థులపై దాడి చేయాలంటూ వాట్సాప్‌లో జరిగిన చర్చకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. ‘వామపక్ష విద్యార్థులపై భౌతిక దాడికి దిగాలి. అదొక్కటే పరిష్కారం’ అని, ‘మేం ఇక్కడ 25 నుంచి 30 మంది వరకు ఉన్నాం’ అని అందులో ఉన్నాయి. ఈ చాట్‌లో పాల్గొన్న వారిలో జేఎన్‌యూలో సంస్కృతంలో పీహెచ్డీ చేస్తోన్న విద్యార్థి యోగేంద్ర భరద్వాజ్, మరో పీహెచ్డీ విద్యార్థి సందీప్ సింగ్ ఉన్నారు. భరద్వాజ్ ఇప్పటికే తన ఇతర సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసినప్పటికీ, ఆయన ట్విటర్ అకౌంట్ ప్రొఫైల్ ద్వారా అతడు ఏబీవీపీ సభ్యుడని గుర్తించారు. బయటివారా? లోపలి వారా? జేఎన్‌యూలో ఆదివారం హింసకు పాల్పడింది వర్సిటీ విద్యార్థులా? లేక బయటినుంచి వచ్చిన వ్యక్తులా? అనే విషయంపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ దృష్టి సారించింది. ‘ఆదివారం మధ్యాహ్నం నుంచే వర్సిటీ గోడలు, గేట్ల వద్ద భారీగా పోలీసు వాహనాలు కనిపించాయి. ఆ స్థాయిలో పోలీసులున్నా దుండగులు క్యాంపస్‌లోకి ఎలా రాగలిగారు? క్యాంపస్‌లో దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులకు ఆదివారం మధ్యాహ్నం వరకు ఎలాంటి ఇంటలిజెన్స్ సమాచారం రాలేదా? ఒకవేళ వచ్చి ఉంటే.. వారెందుకు వెంటనే స్పందించలేదు?’ అనే ప్రశ్నలను పలువురు సంధిస్తున్నారు. దీనిపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ స్థాయి అధికారి ఒకరు స్పందించారు. ‘గత నెల రోజులుగా పోలీసులు జేఎన్‌యూ పరిసర ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉంటున్నారు. అలాగే, ఆదివారం కూడా అక్కడ ఉన్నారు. వర్సిటీ అధికారుల అనుమతి లేకుండా క్యాంపస్‌లోనికి పోలీసులు వెళ్లలేరు’ అని వివరించారు. పోలీసులు లోపలికి వెళ్లే సమయానికి విద్యార్థులు చాలా కోపంగా ఉన్నారని, పోలీసులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. పోలీసులకు సమాచారమివ్వడంలో ఆలస్యం కావడంపై వర్సిటీ అధికారులు స్పందించారు. ‘సరైన కారణం లేకుండా క్యాంపస్‌లోనికి పోలీసులను పిలిస్తే విద్యార్థులకు కోపమొస్తుంది. అందుకే పరిస్థితి దిగజారిందని భావించాకే పిలిచాం’ అని తెలిపారు. విద్యార్థులపై మోదీ ప్రభుత్వ మద్దతుతో జరిగిన అమానుష దాడి ఇది. విద్యార్థుల నిరసనను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై స్వతంత్ర న్యాయ విచారణ జరగాలి. – సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ ఈ దాడులు 26/11 ముంబై దాడులను గుర్తు చేస్తున్నాయి. దేశంలో తమకు రక్షణ లేదని విద్యార్థులు భావిస్తున్నారు. జేఎన్‌యూలో జరిగిన ఘటనల వంటి వాటిని మహారాష్ట్రలో జరగనివ్వను. నిందితులను పోలీసులు పట్టుకోలేకపోతే.. వారూ అందులో పాలుపంచుకున్నట్లే.. – ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం జేఎన్‌యూ దాడిపై బాలీవుడ్ నటి, అక్షయ్‌కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా స్పందించారు. వార్తా పత్రికలోని ఓ భాగాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ‘భారత్.. ఇక్కడ విద్యార్థుల కంటే ఆవులకే ఎక్కువ రక్షణ ఉంటుంది. ఇప్పుడు ఇది భయానికి వెరవడం లేదు. నిరసనలను హింసతో అణచలేరు. అదే జరిగితే మరింత మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతారు’ అని చెప్పారు. అయితే దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఈ మాటలను ఏబీవీపీకి మద్దతుదారుడైన అక్షయ్ కుమార్‌కు (ట్వింకిల్ భర్త) చెప్పాలంటూ ట్రోల్ చేస్తున్నారు. -
జేఎన్‌యూలో హింస
-
నన్ను తీవ్రంగా కొట్టారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింసలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించి చేతిలో కర్రలతో క్యాంపస్‌లోకి చొరబడిన దుండగులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె తల పగిలింది. ప్రస్తుతం ఆమె ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో దుండగుల దాడి సందర్భంగా తల నుంచి తీవ్రంగా రక్తం కారుతుండగా.. ఆయిషీ ఘోష్ విలపిస్తూ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుండగులు తనను కిరాతకంగా కొట్టారని ఈ వీడియోలో ఆమె విలపిస్తూ పేర్కొన్నారు. ‘తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. నేను మాట్లాడే స్థితిలో కూడా లేను. దాడులు జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న నన్ను తీవ్రంగా కొట్టారు’ అని ఆమె వీడియోలో పేర్కొన్నారు. జేఎన్‌యూలో సబర్మతి దాబా వద్ద ఆదివారం సాయంత్రం 6.45 గంటలకు అలజడి ప్రారంభమై.. కొద్దిసేపట్లోనే మొత్తం హాస్టల్ అంతా హింస చెలరేగింది. ముసుగులు ధరించిన వ్యక్తులు దాడులు చేయడం, పోలీసులు రావడంతో క్యాంపస్ అంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. ఏబీవీపీ, ఆరెస్సెస్ గూండాలు దాడి చేసినట్టు వామపక్షవాద విద్యార్థులు ఆరోపిస్తుండగా.. ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ విద్యార్థులే దాడులకు దిగారని రైట్‌వింగ్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ముసుగు మూక వీరంగం జేఎన్‌యూలో మసుగు మూకల వీరంగానికి సంబంధించి తాజా వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ముసుగులు ధరించిన దుండగులు క్యాంపస్‌లోకి విద్యార్థులపై, టీచర్లపై విచక్షణారహితంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. దాడుల అనంతరం ముసుగులు ధరించిన వ్యక్తులు క్యాంపస్‌లో సంచరిస్తున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖానికి ముసుగులు తొడిగి.. జీన్స్‌ప్యాంట్లు, జాకెట్లు ధరించి.. చేతిలో కర్రలతో గుంపుగా దుండగులు క్యాంపస్‌లో సంచరిస్తూ.. కర్రలతో బెదిరిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. చదవండి: సిగ్గుతో తలదించుకుంటున్నా! -
ముసుగులతో విద్యార్థులపై దాడి
-
సిగ్గుతో తలదించుకుంటున్నా!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింస తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ముసుగులు ధరించిన దుండగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడికి చేశారు. ఈ ఘటనలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ సహా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘోష్ తల పగలడంతో ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల తరఫు లాయర్ రాహుల్ మెహ్రా ట్విటర్లో స్పందించారు. గూండాలు జేఎన్‌యూలోకి ప్రవేశించి.. అమాయకులైన విద్యార్థులపై దాడి చేస్తున్నప్పుడు పోలీసులకు ఎక్కడికి పోయారని ఆయన నిలదీశారు. ‘జేఎన్‌యూలో హింసకు సంబంధించిన వీడియో క్లిప్స్ చూశాక ఢిల్లీ పోలీసు స్టాండింగ్ కౌన్సెల్ అయిన నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. గూండాలు యథేచ్ఛగా జేఎన్‌యూ క్యాంపస్‌లోకి ప్రవేశించి.. మారణహోమం సృష్టించారు. విద్యార్థులను తీవ్రంగా గాయపర్చారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ తర్వాత క్యాంపస్ నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో బలగాలు ఏం చేస్తున్నాయి?’అంటూ ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్ ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ ఘటనలో ఎవరు దాడి చేశారో, ఎవరు బాధితులో అన్నది సందేహముంటే.. ఎబీవీపీ లేదా వామపక్షాల విద్యార్థుల్లో ఎవరికి తీవ్రమైన గాయాలయ్యాయన్న దానినిబట్టి దానిని తేల్చవచ్చునని పేర్కొన్నారు. చదవండి: జేఎన్‌యూలో దుండగుల వీరంగం -
జేఎన్‌యూలో దుండగుల వీరంగం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం హింస చోటు చేసుకుంది. ముసుగులు ధరించిన దుండగులు చేతిలో కర్రలతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. వారి దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘోష్ తల పగలడంతో ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తల నుంచి తీవ్రంగా రక్తం కారుతుండగా, విలపిస్తున్న ఘోష్ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. దాదాపు రెండు గంటల పాటు కర్రలు, ఇనుప రాడ్లతో దుండగులు వర్సిటీలో భయోత్పాతం సృష్టించారు. ఈ దాడిపై వామపక్ష విద్యార్థి సంస్థ జేఎన్‌యూఎస్‌యూ, బీజేపీ అనుబంధ ఏబీవీపీ పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. జేఎన్‌యూఎస్‌యూనే ఈ దాడికి పాల్పడిందని, ఈ దాడిలో తమ సభ్యులు పాతిక మందికి గాయాలయ్యాయని, మరో 11 మంది జాడ తెలియడం లేదని ఏబీవీపీ ఆరోపించింది. వామపక్ష విద్యార్థి సంస్థలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, డీఎస్ఎఫ్ విద్యార్థులు ఈ దాడుల వెనుక ఉన్నారని పేర్కొంది. ఇది ఏబీవీపీ గూండాల పనేనని, ముసుగులు వేసుకుని లాఠీలు, ఇనుప రాడ్లతో వారే ఈ దాడికి తెగబడ్డారని జేఎన్‌యూఎస్‌యూ పేర్కొంది. ఏబీవీపీ వారు చేసిన రాళ్లదాడిలోనే తమ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ ఘోష్ తీవ్రంగా గాయపడ్డారని ఆరోపించింది. హాస్టళ్లలోకి చొరబడి ప్రత్యర్థి వర్గాల విద్యార్థులు లక్ష్యంగా దాడి చేశారని, పలువురు టీచర్లను కూడా గాయపర్చారని పేర్కొంది. జేఎన్‌యూ టీచర్స్ అసోసియేషన్‌కు సంబంధించి ఒక సమావేశం జరుగుతుండగా ఈ దాడి జరిగింది. దుండగులు ముసుగులు ధరించి, యథేచ్ఛగా యూనివర్సిటీలో కనిపించినవారినల్లా కొడతూ భయోత్పాతం సృష్టించారని విద్యార్థులు ఆరోపించారు. దాడికి భయపడి హాస్టళ్లలోని తమ రూముల్లో దాక్కున్నామని పలువురు విద్యార్థులు తెలిపారు. ముఖం కనిపించకుండా కప్పుకుని, హాకీ స్టిక్స్‌తో ఒక భవనంలోపల తిరుగుతున్న కొందరు దుండగుల వీడియోను పలు వార్తాచానెళ్లు ప్రసారం చేశాయి. యూనివర్సిటీలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, దాడికి పాల్పడిన దుండగులను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రమోద్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులంతా సంయమనం పాటించాలని అందులో కోరారు. వర్సిటీలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రుల ఖండన జేఎన్‌యూలో హింసపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని ఆదేశించారు. జేఎన్‌యూ మాజీ విద్యార్థులు, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ జేఎన్‌యూలో జరిగిన హింసాత్మక ఘటనలను ఖండించారు. ఢిల్లీ పోలీసులు, జేఎన్‌యూ అధికారుల నుంచి మానవ వనరుల మంత్రిత్వ శాఖ వివరణ కోరింది. జేఎన్‌యూలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు దారుణమని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిందిగా పోలీసులకు ఆదేశాలిచ్చామని ట్వీట్ చేశారు. విద్యార్థులకు భయపడ్తున్నారు వర్సిటీ విద్యార్థులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నందువల్లనే, వారిని భయభ్రాంతులు చేసేందుకే ఈ దాడి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించాయి. ప్రభుత్వం పంపిన గూండాలే వీరని కాంగ్రెస్ మండిపడింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో జేఎన్‌యూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు. ‘సమరశీల విద్యార్థుల నినాదాలు వింటున్న ఫాసిస్ట్‌లు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ భయం ప్రతిస్పందనే జేఎన్‌యూలో నేడు చోటు చేసుకున్న హింస’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జేఎన్‌యూ ఘటనపై ఢిల్లీ సీఎం, ఆప్ నేత అర్వింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను కోరానన్నారు. ‘జేఎన్‌యూ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యాను. విద్యార్థులను దారుణంగా కొట్టారు. యూనివర్సిటీ క్యాంపస్‌ల్లోనే మన విద్యార్థులకు రక్షణ లేకపోతే.. దేశం ముందుకు ఎలా వెళ్తుంది?’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆదివారం రాత్రి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు. యూనివర్సిటీ వెలుపల స్వరాజ్ అభియాన్‌పార్టీ నేత యోగేంద్ర యాదవ్‌పై కొందరు దాడికి యత్నించారు. బయట వైపు ఉన్న పోలీసులు, ఇతరులు -
కీచక అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై ఆగ్రహం
సాక్షి, వికారాబాద్: అసిస్టెంట్ ప్రొఫెసర్ కీచకపర్వంపై విద్యార్థులు భగ్గుమన్నారు. విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్య ల్యాబ్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల ఆందోళన గురించి తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం ముందుగానే విద్యార్థులను ఇళ్లకు పంపిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడ పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. చదవండి: అసిస్టెంట్ ప్రొఫెసర్ కీచకపర్వం -
పదేళ్ల తర్వాత మళ్లీ.. ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు
సాక్షి, వరంగల్: జై భారత్.. జై జవాన్.. జై కిసాన్ నినాదంతో విద్యారంగ సమస్యలు, వ్యవసాయంలో రైతులకు గిట్టుబాటు ధరలు తదితర సామాజిక సమస్యలపై చర్చించేందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) 38వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారు. వరంగల్‌లోని కేయూ ఆడిటోరియం వేదికగా మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు ఈ సభలు జరుగుతాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, గతంలో 2008 లో హన్మకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు వరంగల్ వేదికగా నిలుస్తోంది. రెండు వేలమంది ప్రతినిధులు.. కేయూలో మంగళవారం నుంచి నిర్వహించనున్న ఏబీవీపీ రాష్ట్ర మహాసభలకు రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి ఎంపిక చేసిన రెండు వేలమంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో సుమారు 8లక్షల సభ్యత్వం కలిగిన ఏబీవీపీలో రాష్ట్ర, జిల్లా, మండల, కళాళాశాల బాధ్యులు ప్రతినిధులుగా హాజరవుతారు. వీరి కోసం కేయూలో పలుచోట్ల వసతి ఏర్పాట్లు చేశారు. చర్చించనున్న అంశాలు ఇవే.. రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్రంలోని పాఠశాల, కళాశాలల స్థాయి నుంచి యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై చర్చించనున్నారు. రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల మూసివేత, యూనివర్సిటీల్లో అధ్యాపకులు, ఉద్యోగుల ఖాళీలు, వీసీల భర్తీలో ఆలస్యం, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి, సంక్షేమ హాస్టళ్ల సౌకర్యాల కల్పన, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు తదితర అంశాలపై చర్చించి తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నారు. మొదటిరోజు కేవలం జెండా ఆవిష్కరణ.. నాలుగు రోజుల పాటు జరిగే ఏబీవీపీ మహాసభల్లో భాగంగా మంగళవారం తొలిరోజు సాయంత్రం 6గంటలకు సభాప్రాంగణం వద్ద ఏబీవీపీ జెండాను రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మీసాల ప్రసాద్.. రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్‌తో కలిసి ఆవిష్కరిస్తారు. ఏబీవీపీ ప్రముఖ్ మాసాడి బాబురావు పాల్గొంటారు. ఇక రెండో రోజైన బుధవారం రాష్ట్ర మభసభలను ఉద్ధేశించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఏబీవీపీ జాతీయ సంఘటసహాకార్యదర్శి కేఎన్ రఘునందన్ పాల్గొననుండగా.. అమరవీరుల కుటుంబాలను సన్మానిస్తారు. మూడో రోజైన గురువారం మధ్యాహ్నం 3గంటలకు కేయూ నుంచి ఏకశిలా పార్కు వరకు శోభాయాత్రగా వెళ్లి అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి,న్రాష్ట్ర నూతన అధ్యక్షడు శంకర్ పాల్గొని ప్రసంగిస్తారు. మహాసభలను విజయవంతం చేయాలి.. కేయూలో మంగళవారం నుంచి జరగనున్న ఏబీవీపీ 38వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని స్వాగత సమితి అధ్యక్షుడు డాక్టర్ నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. కేయూలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఈ సందర్భంగా విద్యారంగ, సామాజిక అంశాలపై చర్చిస్తామని తెలిపారు. మహాసభల కన్వీనర్ ఏలేటి నాగరాజు, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్, కేయూ అధ్యక్షుడు చట్ట సతీష్, నగర కార్యదర్శి భరత్ పాల్గొన్నారు. 1970 దశకం నుంచే ఏబీవీపీ.. స్వాతంత్రనంతం 1949, జూలై 9న ఐదుగురు విద్యార్థులతో ప్రొఫెసర్ బెహల్ ఢిల్లీలో విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1970 దశకం నుంచి ఎక్కువగా ఏబీవీపీ విస్తరణ యూనివర్సిటీల్లో జరిగింది. అప్పటి నుంచే వరంగల్ ప్రాంతంలోనూ ఏబీవీపీ విద్యారంగ సమస్యలపై పోరాడుతూనే విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకు కృషి చేస్తోంది. 1982లో కేయూలో జాతీయ జెండాకు అవమాన జరిగిందంటూ సామ జగన్మోహన్రెడ్డి న్యాయపోరాటం చేస్తూ అసువులు బాశారు. ఆయన స్ఫూర్తిగా ముందుకెళ్తూ విద్యారంగ, సామాజిక సమస్యలపై పోరాడుతోంది. -
మరణశిక్ష వేయాలి
కవాడిగూడ: హైదరాబాద్ నగర శివారులో జరిగిన ‘దిశ’ అత్యాచా రం, హత్యను నిరసిస్తూ సోమవారం అఖిల భారత విద్యా ర్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి పార్క్ నుంచి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి అనుమతి నిరాకరిస్తూ పోలీసులు విధించిన ఆంక్షలను ధిక్కరిస్తూ విద్యార్థులు కదంతొక్కారు. పోలీసుల హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా వందలాది మంది ర్యాలీ చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసు వలయాల మధ్య ఆర్టీసీ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్, ఇందిరాపార్క్ చౌరస్తా వరకు ధర్నా కొనసాగింది. ఇందిరాపార్క్ చౌరస్తా వద్దకు రాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకోవాలని యత్నించగా.. పోలీసులకు, ఏబీవీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో విద్యార్థులు ధర్నాచౌక్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. బహిరంగసభ నిర్వహించారు. దిశ కేసులో నిందితులను కఠినంగా శిక్షించి ఉరితీయాలని నినా దాలు చేశారు. ప్రభుత్వం విఫలం..: నిధి త్రిపాఠి ఈ నిరసన కార్యక్రమానికి ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సభను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను అరికట్టడంలో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. దిశ కేసులో నిందితులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా మరణశిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఉదయ్, నగర కార్యదర్శి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
‘కేసీఆర్ గారు.. మీ పేరు మార్చుకోండి’
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనకు నిరసనగా ‘జస్టిస్ దిశ’ పేరుతో ఏబీవీపీ హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఎస్వీకే నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆలస్యం చేయకుండా నిందితులకు కఠిన శిక్షలు విధించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. దిశకు న్యాయం జరిగేవరకూ తమ ఉద్యమం ఆగదన్నారు. దిశ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి స్పందించిన తీరు దారుణంగా ఉందన్నారు. దిశ ఇంటికి ఫోన్ చేయాల్సింది కాదు, పోలీసులకు ముందు ఫోన్ చేయల్సిందని హోం మంత్రి అనడం సిగ్గు చేటన్నారు. ఫిర్యాదు ఇవ్వబోతే తమ పరిధిలోకి రాదని చెప్పడాన్ని బట్టే పోలీసులు ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతుందని విమర్శించారు. ‘చంద్రశేఖర్ ఆజాద్ లాంటి పేరు పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ .. ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారని, వెంటనే ఆయన పేరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమం మహిళల చేతిలోకి వెళ్లిందని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. -
విద్యార్థినిపై ఏబీవీపీ నాయకుడి దాడి
సాక్షి, ఒంగోలు: తమ కార్యక్రమానికి పిలిస్తే రాలేనన్నందుకు ఏబీవీపీ నాయకుడు హనమంతు తనపై భౌతిక దాడికి దిగాడని ఒంగోలు శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థిని బుధవారం ఒంగోలు వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. బుధవారం స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏబీవీపీ నాయకులు మిషన్ సాహసి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యారి్థనీ, విద్యార్థులను పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు స్థానిక రంగారాయుడు చెరువు పక్కన ఉన్న శ్రీ చైతన్య ఒంగోలు క్యాంపస్‌కు వెళ్లి తరగతి గదుల్లో ఉన్న విద్యారి్థనులను కార్యక్రమానికి రావాలని ఏబీవీపీ నాయకులు హుకుం జారీ చేశారు. ఫిర్యాది తనకు అనారోగ్యంగా ఉందని, తాను రాలేనని చెప్పడంతో ఆగ్రహించిన హనుమంతు తన చున్నీ పట్టుకుని లాగి ఎగ్జామ్ ప్యాడ్‌తో తన ఎడమ భుజంపై కొట్టాడని, రాకుంటే అంతు చూస్తానని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత విద్యారి్థని ఫిర్యాదు మేరకు ఏబీవీపీ నాయకుడు హనుమంతుపై ఒన్‌టౌన్ జియో హనుమంతురావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదేం విధానం? కాలేజీకి విద్యార్థుల కోసం వెళ్తే తల్లిదండ్రులను సైతం దూరంగా ఉంచే కాలేజీ సిబ్బంది, ఒక విద్యార్థి సంఘ నాయకులు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే నేరుగా తరగతి గదుల్లోకి ఎలా అనుమతిచ్చారంటూ విద్యార్థి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ దారుణమేనని, తామే తమ బిడ్డపై చేయి చేసుకోమని, మీరెవరు చేయి చేసుకోవడానికి అంటూ నిలదీశారు. గతంలో కూడా ఇదే కాలేజీలో ఓ విద్యార్థి సంఘ నాయకుడు మీటింగ్ ఏర్పాటు చేసి ఏకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరిన విషయం రచ్చరచ్చగా మారిన విషయం విదితమే. అదే క్యాంపస్‌లో మరోమారు ఘటన జరగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘నా జుట్టు పట్టుకు లాగారు.. కింద పడేశారు’
కోల్‌కతా: బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రీయోకు విద్యార్థుల నిరసన సెగ తగిలింది. గురువారం కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి బాబుల్ సుప్రియో హాజరయ్యారు. ఈ క్రమంలో కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బాబుల్ సుప్రియోను కొందరు విద్యార్థులు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వీరంతా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ), ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అసోసియేషన్‌కు(ఏఎస్ఎఫ్ఏ) చెందిన వారు కావడం విశేషం. విద్యార్థుల నిరసన నేపథ్యంలో బాబుల్ సుప్రియో క్యాంపస్‌లోకి వెళ్లకుండానే వెను తిరిగారు. ఈ సందర్భగా బాబుల్ మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాలు చేయడం కోసం ఇక్కడకు రాలేదు. కానీ విద్యార్థుల ప్రవర్తన చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. వారు నన్ను అడ్డుకున్నారు. నా జుట్టు పట్టుకు లాగారు. కింద పడేసారు. వారంతా తమను తాము నక్సల్స్‌గా పిలుచుకుని నన్ను రెచ్చగొట్టాలని చూశారు. కానీ వారు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నన్ను రెచ్చగొట్టలేరు’ అని పేర్కొన్నారు. ఆ సమయంలో గవర్నర్ జగదీప్ ధంఖర్, యూనివర్సిటీ చాన్సిలర్ అక్కడే ఉన్నారు. జరిగిన విషయాన్ని గవర్నర్ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. -
ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ హవా
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సత్తా చాటింది. అధ్యక్ష పదవితోపాటు మరో రెండు పదవులు కైవసం చేసుకుంది. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో ఏబీవీపీకి చెందిన అశ్విత్ దాహియ ఎన్ఎస్యూఐ అభ్యర్థి చెత్న త్యాగిపై 19వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత కొన్ని సంవత్సరాల ఎన్నికలు పరిశీలిస్తే ఇదే అత్యధిక మెజార్టీ అని ఏబీవీపీ జాతీయ మీడియా కన్వీనర్ మోనికా చౌదరి తెలిపారు. మహిళా సాధికారత కోసం ‘మిషన్ సాహసి’ని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఏబీవీపీకి చెందిన ప్రదీప్ తన్వార్ ఉపాధ్యక్షుడిగా, శివాంగి ఖర్వాల్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. దీంతో వర్సిటీ ప్రాంగణంలో ఆ సంస్థ మద్దతుదారులు భారీ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఒక సెక్రటరీ పదవిని గెలుచుకుంది. ఆ సంస్థ అభ్యర్థి అశిష్ లంబా ఏబీవీపీ అభ్యర్థి యోగి రతీపై విజయం సాధించారు. రామ్జాస్ కాలేజ్‌లో అల్లర్లు జరిగినపుడు యోగి అధ్యక్షుడిగా ఉన్నారని, అల్లర్లకు తాము వ్యతిరేకమని ఈ తీర్పుతో విద్యార్థులు స్పష్టం చేశారని ఎన్ఎస్యూఐ తెలిపింది. గురువారం జరిగిన ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో 39.90 శాతం ఓటింగ్ నమోదైంది. గత సంవత్సరం ఓటింగ్ శాతం (44.46)తో పోలిస్తే ఇది దాదాపు నాలుగు శాతం తక్కువ. మొత్తం నాలుగు స్థానాలకు 16 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇందులో నలుగురు మహిళా అభ్యర్థులున్నారు. 1.3లక్షల మంది ఓటర్లున్నారు. వామపక్ష పార్టీల మద్దతు సంస్థ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) ఒక్క సీటూ గెలవలేకపోయింది. గతంతో పోలిస్తే తమ ఓటింగ్ శాతం పెరిగినందుకు ఆ సంస్థ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. -
మెడలో చెప్పుల దండ.. ముఖంపై నలుపు రంగు
న్యూఢిల్లీ: రెండు పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాల మధ్య విబేధాలు ఓ విపరీతానికి దారి తీశాయి. అనుమతి లేకుండా యూనివర్సిటీ ఆవరణలో సావర్కర్ విగ్రహం ప్రతిష్టించారంటూ.. దాని మెడలో చెప్పుల దండ వేయడమే కాక.. విగ్రహం ముఖానికి నలుపు రంగు పూశారు. ఈ సంఘటన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఢిల్లీ యూనివర్సిటీలోని కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ.. హిందు మహాసభ అధ్యక్షుడైన వీర్ సావర్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించింది. అనుమతి లేకపోయినా యూనివర్సిటీ ప్రాంగణంలో విగ్రహాన్ని పెట్టారన్న కారణంతో.. చెప్పుల దండ వేసి, ముఖానికి నలుపు రంగు పూసింది. మంగళవారం ఉదయం వర్సిటీలోని ఏబీవీపీ అధ్యక్షుడు శక్తి సింగ్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ఏర్పాటు అనుమతి కోసం ఢిల్లీ వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చుట్టూ తాను చాలాసార్లు తిరిగానని.. కానీ ఎవరూ పట్టించుకోలేదని శక్తి సింగ్ తెలిపాడు. ఇక చేసేదేమీ లేక.. తామే విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సావర్కర్ వంటి వ్యక్తుల విగ్రహాలు యువతకు స్ఫూర్తినిస్తాయని.. అందుకే ఏర్పాటు చేశామని అన్నారు. అయితే ఎన్ఎస్యూఐ దీన్ని అంగీకరించడం లేదు. చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి మహనీయుల సరసన.. సావర్కర్ విగ్రహాన్ని పెట్టడం సరికాదని ఎన్ఎస్యూఐ వాదిస్తోంది. ముగ్గురి విగ్రహాలు ఒకేచోట కలిపి పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అంతేకాక 24గంటల్లోగా విగ్రహాన్ని తొలగించకపోతే వర్సిటీ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కానీ ఈలోపే విగ్రహానికి చెప్పుల దండ వేసి, నలుపు రంగు పూయడం గమనార్హం. -
గుర్తుండిపోయే నేత!
కొందరు తమకొచ్చిన పదవులకుండే ప్రాముఖ్యత వల్ల వెలిగిపోతారు. కానీ చాలా తక్కువమంది చేపట్టిన పదవి ఏదైనా దానిపై తమదైన ముద్ర వేస్తారు. ఆ పదవికే వన్నె తెస్తారు. మంగళవారం రాత్రి కన్నుమూసిన సుష్మాస్వరాజ్ 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చాలా తరచుగా తన విశిష్టతను చాటుకున్నారు. ఒకానొక దశలో ఆమెను ప్రధాని పదవికి అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేయొచ్చునన్న ఊహాగానాలు రావడానికి ఈ విశిష్టతే కారణం. ఇతర రంగాల మాదిరిగా పురుషాధిక్యత రాజ్యమేలే రాజకీయరంగంలో మహిళలు ఉన్నత స్థాయికి చేరుకోవడం, తమను తాము నిరూపించుకోవడం సాధారణమైన విషయం కాదు. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి, ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీకి తండ్రి జవహర్లాల్ నెహ్రూ సమున్నత వారసత్వం ఉంది. కానీ సుష్మా స్వరాజ్‌కు అటువంటి నేపథ్యం లేదు. ఆమె పూర్తిగా స్వశక్తితో ఎదిగిన మహిళ. విద్యార్థి దశలోనే సమస్యలపై పోరాడి, పరిష్కారాలు సాధించిన చరిత్రగలవారు. అప్పట్లోనే గొప్ప వక్తగా అందరి మన్ననలూ పొందారు. అరుదైన నాయకత్వ లక్షణాలు, ఏ సమస్యపైన అయినా ప్రభావవంతంగా మాట్లాడగల సామర్థ్యం సొంతం చేసుకోవడం వల్లనే ఆమె 25 ఏళ్ల పిన్న వయసులోనే హర్యానాలో కేబినెట్ మంత్రి కాగలిగారు. జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవ హరించారు. ఏడు సార్లు ఎంపీగా, మూడు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. విద్యార్థి దశలో సంఘ్ పరివార్ అనుబంధ సంఘమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)లో చురుగ్గా పనిచేసిన చరిత్ర ఆమెది. ఆ దశలోనే ఆమె ఆనాటి జనసంఘ్ నాయకుడు ఎల్కే అడ్వాణీ దృష్టిలో పడ్డారు. తన రాజకీయంగా భిన్నాభిప్రా యాలుండే స్వరాజ్ కౌశల్‌ను పెళ్లాడాక ఆమె జనసంఘ్‌కు దూరమయ్యారు. సోషలిస్టు రాజకీ యాల్లో చురుకైన పాత్ర పోషించారు. దేశం ఉక్కు నిర్బంధాన్ని చవిచూసిన అత్యవసర పరిస్థితి కాలంలో నిరసన ప్రదర్శనల్లో ధైర్యంగా పాల్గొన్నారు. ఆ చీకటి రోజుల్లోనే సోషలిస్టు నేత, దివంగత నాయకుడు జార్జి ఫెర్నాండెజ్‌ను ప్రధాన కుట్రదారుగా చేర్చిన బరోడా డైనమైట్ కేసులో భర్తతో పాటు న్యాయస్థానంలో వాదించారు. ఆ క్రమంలో ఆమె లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ అనుయాయిగా మారారు. అత్యవసర పరిస్థితి రద్దయ్యాక సోషలిస్టు పార్టీ జనతా పార్టీలో విలీనమై నప్పుడు ఆ పార్టీలో చేరారు. అనంతరకాలంలో బీజేపీలో చేరి కీలకపాత్ర పోషించారు. కేంద్ర మంత్రిగా, విపక్ష నేతగా పనిచేశారు.అయితే బీజేపీలో చాలామందికి లేని వెసులుబాటు çసుష్మకు ఉంది. సోషలిస్టుగా రాజకీయ రంగప్రవేశం చేయడం వల్ల కావొచ్చు... బీజేపీలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నా ఆమెను ఉదారవాద నేతగానే అనేకులు పరిగణించారు. దానికితోడు ఆమె కొన్ని కీలక సందర్భాల్లో నిర్మొహమాటంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా ఆ భావనే కలిగించేవి. బెంగళూరులోని పబ్‌పై హిందూ ఛాందసవాదులు దాడిచేసి మహిళలపై దౌర్జన్యానికి దిగినప్పుడు ఆ చర్యను ఖండించిన ఏకైక బీజేపీ నేత సుష్మానే. ప్రియాంకా చతుర్వేది కాంగ్రెస్ నేతగా ఉండగా పదేళ్ల ఆమె కుమార్తె పట్ల అసభ్యకరంగా ట్వీట్లు చేసినవారిని సుష్మ మందలించారు. ప్రియాంకకు అండగా నిలిచారు. మతాంతర వివాహం చేసుకున్న జంట పాస్‌పోర్టు కోసం వచ్చినప్పుడు లక్నోలోని అధికారి ఆ మహిళపై తన పరిధి దాటి వ్యాఖ్యానించినప్పుడు సుష్మ మందలించారు. ఆమెకు పాస్‌పోర్టు అందేలా చూశారు. ఇలాంటి సందర్భాల్లో సంఘ్ పరివార్ శ్రేణులుగా చెప్పుకున్నవారు ఆమెపై విద్వేషపూరితంగా, వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసినా సుష్మ లెక్కచేయలేదు. విదేశీ వ్యవ హారాల శాఖ నిర్వహణ ఏ రాజకీయ నేతకైనా ప్రతిష్టాత్మకమైనదే. ఐక్యరాజ్యసమితితోసహా అనేక అంతర్జాతీయ వేదికలపై దేశానికి ప్రాతినిధ్యంవహించే అవకాశం లభించడం, మన వాదనను సమ ర్ధవంతంగా వినిపించడం ఒక వరం. అదే సందర్భంలో ఆ పదవితో సమస్యలు కూడా ఉన్నాయి. అక్కడ నిత్యం వార్తల్లో వ్యక్తిగా ఉండటం సాధ్యపడదు. కానీ ఆ పదవి స్వభావాన్నే ఆమె మార్చారు. ఇరాక్‌లోని బస్రాలో ఉగ్రవాదుల చక్రబంధంలో చిక్కుకున్న 168మందిని కాపాడటం వెనక ఆమె కృషి చాలా ఉంది. విదేశాల్లో పాస్‌పోర్టు పోగొట్టుకున్నవారికి, ఇక్కడి వ్యక్తిని పెళ్లాడి వీసా లభించక ఇబ్బందులు పడుతున్నవారికి, గల్ఫ్ దేశాలకెళ్లి అక్కడ వెట్టిచాకిరీలో మగ్గినవారికి ఆమె అమ్మలా ఆపన్నహస్తం అందించారు. ‘మీరు అరుణగ్రహంపై చిక్కుకున్నా కాపాడతాన’ంటూ ఆమె ఒక సందర్భంలో పెట్టిన ట్వీట్ విదేశాల్లో ఉండకతప్పనివారికి ఎంతో భరోసానిచ్చింది. ఆమెలోని మాన వీయతకు అద్దం పట్టింది. విదేశాంగ శాఖలో కూడా ఇంత చేయొచ్చా అని అందరూ ఆశ్చర్య పోయారు. అడ్వాణీ శిబిరానికి చెందినవారు గనుక ఆమెకు మోదీ ప్రభుత్వంలో చోటుండకపోవ చ్చన్న ఊహాగానాలొచ్చాయి. కానీ ఆమె సమర్థతను మోదీ సరిగానే గుర్తించారు. కీలకమైన విదే శాంగ శాఖ అప్పగించారు. వాజపేయి ప్రభుత్వంలో సమాచార మంత్రిగా ఆ శాఖపై సుష్మ చెరగని ముద్రవేశారు. చిత్రరంగాన్ని పరిశ్రమగా గుర్తించింది ఆమె హయాంలోనే. అందువల్లే చిత్ర నిర్మా ణాలకు బ్యాంకు రుణాలు అందడం మొదలైంది. తమపై వివక్ష ప్రదర్శిస్తున్నారని, ఎదగనీయడం లేదని అనేకులు ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటివారు సుష్మ రాజకీయ జీవితం అధ్యయనం చేయాలి. అడుగడుగునా ఆధిపత్య ధోర ణులు, పితృస్వామిక భావజాలం తొంగిచూసే సమాజంలో ఎలాంటి నేపథ్యమూ లేని కుటుంబాల నుంచి వచ్చిన మహిళలకు ఏదో ఒక రూపంలో, ఎప్పుడో ఒకప్పుడు సమస్యలు తప్పవు. వాట న్నిటినీ దీటుగా ఎదుర్కొనడం వల్లనే, తనను తాను నిరూపించుకోవడం వల్లనే సుష్మా స్వరాజ్ ఇంతమంది అభిమానాన్ని పొందగలిగారు. విశిష్ట నేతగా ఎదిగారు. -
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత..!
-
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత..!
సాక్షి, వరంగల్ అర్బన్ : డిగ్రీ, పీజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో హన్మకొండలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నయీమ్ నగర్ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించిన అనతరం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ధర్నాకు దిగారు. విదార్థుల గుంపును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బిల్డింగ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. గాజు ముక్కలు కోసుకుపోవడంతో ఓ విద్యార్థి చేతికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీతో కొట్టాడంతో గాజు ముక్కలపై పడ్డాడని విద్యార్థి ఆరోపించాడు. ఫలితాల్లో అవకతవకలపై చర్యలు తీసుకునే వరకు కదిలేది లేదంటూ విద్యార్థులు యూనివర్సిటీలో బైఠాయించారు. -
పాఠాలు చెప్పాలని అడిగితే కేసులు పెడతారా?
సాక్షి, మెదక్ : పాఠాలు చెప్పాలని అడిగితే కేసులు పెడతారా? ఎకనామిక్స్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యుడు ఫృథ్విరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ విద్యార్థులకు పాఠాలు చెప్పకపోవడంతో వారు పరీక్షలు ఫేయిల్ కావడం జరిగిందని ఆరోపించారు. విద్యార్థులు వెళ్లి క్లాసులు నిర్వహించాలని అడిగితే శ్రీనివాస్‌తోపాటు ప్రిన్సిపల్ విద్యార్థులను దుర్బాషలాడుతూ వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ విషయంపై స్పందించిన ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ చాంబర్ ముందు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం మెదక్ పట్టణ సీఐ అక్కడికి చేరుకొని విద్యార్థులపై పెట్టిన కేసులను తీసివేసి మళ్లి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామినిచ్చినట్లు ఫృథ్విరాజ్ తెలిపారు. దీంతో విద్యార్థులు ధర్నాను విరమించుకున్నట్లు తెలిపారు. లెక్చరర్ శ్రీనివాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, రాజేశ్వర్, సాయి, వంశీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు పాఠశాలలకు ఏబీవీపీ డిమాండ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచి, ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయని ఏబీవీపీ ఆరోపించింది. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. నిబంధనలకు లోబడి ఫీజును నియంత్రణలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏబీవీపీ ప్రతినిధులు మంగళవారం తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ విజయ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రైవేటు యాజమాన్యాలు అధికంగా ఫీజులు పెంచడం వల్ల ప్రైవేటు పాఠశాలల్లో చదవాలనుకునే పేద విద్యార్థులు ఆ కోరిక కలగానే మిగులుతోందని ఏబీవీపీ పేర్కొంది. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తింది. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం ముందువుంచింది. ఏబివీపీ డిమాండ్లు ఇవి.. తరగతుల వారిగా ప్రైవేటు పాఠశాల ఫీజు వివరాలను వెల్లడించాలి. తప్పనిసరిగా ఫీజు నియంత్రణ చట్టం అమలుపరచాలి. ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి. వీటిని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయికి కూడా విస్తరించాలి. విద్యా హక్కు చట్టాన్ని ఈ విద్య సంవత్సరం నుంచే పటిష్టంగా అమలుపరచాలి. పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి. పాఠశాల ఆవరణలో విద్యార్థులను తప్పుదారి పట్టించే ఎలాంటి అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా పాఠశాల బస్సుల ఫిటినెస్ పరీక్షించే విధంగా చూడాలి. చదువుతో పాటు విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండటానికి ప్రతి స్కూల్‌కు క్రీడా మైదానం ఉండేట్టు చూడాలి. లాబ్స్, అగ్నిప్రమాద నివారణ వ్యవస్థ, టాయిలెట్స్ తదితర కనీస సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఈఓ, ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలి. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి. పాఠశాలలు తప్పనిసరిగా అనుమతులు తీసుకునే విధంగా చూడాలి. అనుమతి తీసుకోని పాఠశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ లిస్ట్ ను బహిర్గతం చేయాలి. -
ఇంటర్‌పై ఇంతటి నిర్లక్ష్యమా..!
బంజారాహిల్స్: వేలాదిమంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసిన ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ను వెంటనే తొలగించాలని, ఇంటర్మీడియట్ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం మంత్రుల నివాసాలను ముట్టడించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ.. బోర్డులో ఉన్నతాధికారులకు సంబంధం ఉందని భావిస్తున్న ఎలాంటి పూర్వ అనుభవం లేని ఓ ప్రైవేట్ సంస్థకు ఫలితాల ప్రక్రియ కాంట్రాక్టు అప్పగించడం వెనక పలు అనుమానాలు ఉన్నాయన్నారు. కాంట్రాక్ట్ అప్పగించడంలో భాగం పంచుకున్న బడా నాయకులపై కేసులు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. బోర్డు చేసిన తప్పిదానికి విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటే కార్యదర్శి మాత్రం తమ తప్పు ఏమీలేదన్నట్లు వ్యవహరిస్తున్నారని, బోర్డు కార్యదర్శితో పాటు ఈ ఘటనకు బాధ్యులైన అందర్నీ శిక్షించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా పేపర్ రివాల్యూవేషన్ చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ముట్టడిలో ఏబీవీపీ గ్రేటర్ కార్యదర్శి శ్రీహరి, జాతీయ నాయకులు అయ్యప్ప, ప్రవీణ్‌రెడ్డి, ఎల్లాస్వామి, శ్రావణ్‌రెడ్డి, రమేష్, ఆనంద్, సురేష్, జీవన్, సుమన్, రాజేష్, శ్రీశైలం, బీరప్ప, మహేష్, శ్రీకాంత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మంత్రుల నివాసాల ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోనికి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువరి మధ్యా వాగ్వాదంతో ఆ ప్రాంతం హోరెత్తింది. బంజారాహిల్స్ పోలీసులు విద్యార్థి నేతలను అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో.. ఇంటర్ బోర్డు నిర్వాకాన్ని ఎత్తిచూపుతూ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసాలను ముట్టడించారు. పోలీసులు వీరిని అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఆర్.కళింగరావు నేతృత్వంలో ఎస్సైలు బత్తు శ్రీను, కె.ఉదయ్, పి.డి. నాయుడు ఇక్కడ బందోబస్తు నిర్వహించారు. -
విచారణ కమిటీ ముందుకు అశోక్‌కుమార్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తన విచారణను ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఇంటర్ బోర్డు కార్యాలమంలో త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. కమిటీ విచారణకు వచ్చిన సమయంలో హైకోర్టు విచారణ నిమిత్తం ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. హైకోర్టు విచారణ ముగియడంతో అశోక్‌కుమార్ బోర్డు కార్యాలయానికి చేరుకొని విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణం ఏమిటి? ఎలాంటి అవకతవకలు జరిగాయో? అవకతవకలు, నిర్లక్ష్యం, అక్రమాలకు బాధ్యులెవరు? అన్న కోణంలో కమిటీ అశోక్‌కుమార్ నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. వెనుక గేటు నుంచి విచారణకు గ్లోబరీనా సీఈవో! ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. గ్లోబరీనా సంస్థ సీఈవో రాజు ఇంటర్ బోర్డు కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం ప్రధాన గేటు నుంచి త్రిసభ్య కమిటీ సభ్యులు లోపలికి వెళ్లగా.. గ్లోబరీనా సీఈవో రాజు మాత్రం వెనుక ఉన్న ఓ చిన్న గేటు నుంచి కార్యాలయం లోపలికి వెళ్లారు. ప్రస్తుతం బోర్డు కార్యాలయంలో సాగుతున్న కమిటీ విచారణలో ఆయన పాల్గొన్నట్టు తెలిసింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా సంస్థనే కారణమని ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ తీవ్రమైన నిర్లక్ష్యం.. నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేలా చేసింది. డీపీఆర్పీ ప్రాజెక్టులో భాగంగా గ్లోబరీనా సంస్థ పలుదశల్లో సాంకేతిక సేవలను ఇంటర్మీడియట్ బోర్డుకు అందించాలి. దీనికి అవసరమైన సమాచారాన్ని బోర్డు నుంచి సేకరించి.. కంప్యూటరీకరించడం, విశ్లేషించడం తదితర పనులు సమయానుగుణంగా చేయాలి. కానీ.. ఈ విషయంలో కనీసస్థాయిలో కూడా అనుభవంలేని గ్లోబరీనా సంస్థ టెండరు దక్కించుకున్నప్పటినుంచీ.. బోర్డుతో సమన్వయం చేసుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ప్రాజెక్టు ఆసాంతం తీవ్ర గందరగోళంగా తయారైంది. ఇంటర్ ఫలితాల వెల్లడిలో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఇంటర్ బోర్డు కార్యాలయంలో విచారణ చేపట్టింది. ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళంపై కమిటీ వివరాలు సేకరించింది. త్రిసభ్య కమిటీ విచారణ నిమిత్తం బోర్డు కార్యాలయానికి చేరుకున్న సమయంలో.. అశోక్‌కుమార్ అక్కడ లేరు. బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో.. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. ఆయన లేని సమయంలోనే త్రిసభ్య కమిటీ కార్యాలయంలో విచారణ చేపట్టడం గమనార్హం. ఇంటర్ బోర్డు వద్ద పోలీసుల దిగజారుడు ప్రవర్తన ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద పోలీసులు దిగజారి ప్రవర్తించడం.. తీవ్ర విమర్శలకు తావిచ్చింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో బోర్డు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కే నాగేశ్వర్‌ను కార్యాలయంలోకి వెళ్లకుండానే పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని మాత్రం వెంటబెట్టుకొని మరి బోర్డు కార్యాలయం లోపలికి పోలీసులు తీసుకెళ్లారు. అది కూడా కార్యాలయంలో త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఇలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీనిపై పోలీసులను మీడియా ప్రశ్నించడంతో సదరు టీఆర్ఎస్ నేతను బయటకు తీసుకొచ్చారు. మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏబీవీపీ ఆందోళన ఇంటర్ ఫలితాల్లో అవకతవకల నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏబీవీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. రీ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ ఉచితంగా చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాయి. -
‘నా కొడుకెక్కడ చౌకీదార్?’
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ‘చౌకీదార్’(కాపలదారు) ప్రచారాన్ని ఉదృతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్యాంపెయిన్ పట్ల సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం కన్పించకుండా పోయిన ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ తల్లి ఫాతిమా నఫీస్ మోదీని ఉద్దేశించి ‘కాపలాదారు నా కుమారుడు ఎక్కడ’ అంటూ ప్రశ్నించారు. యూనివర్సిటీ హస్టల్లో ఉంటున్న నజీబ్ మూడు సంవత్సరాల క్రితం అనుమానాస్పద రీతిలో మాయమయ్యాడు. ఈ కేసును పరిష్కరించేందుకు ఢిల్లీ హై కోర్టు సిట్‌ను కూడా నియమించింది. కానీ ఇప్పటి వరకూ అతని ఆచూకీ లభించలేదు. నజీబ్ తల్లి ఫాతిమా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘కాపలాదారుగా చెప్పుకుంటున్నావ్ కదా.. మరి నా కుమారుడు నజీబ్ ఎక్కడ. తను కనిపించకుండా పోవడానికి కారణమైన ఏబీవీపీ అవివేకులను ఇంతవరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదు. నా బిడ్డను వెతకడంలో మూడు అత్యున్నత శాఖలు ఎందుకు విఫలం చెందాయి’ అంటూ ‘#WhereIsNajeeb’ అనే హాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు ఫాతిమా. చదవండి.. (పేరుకు ముందు ‘చౌకీదార్’) 27 ఏళ్ల నజీబ్ అహ్మద్ ఢిల్లీ జేఎన్‌యూలో బయో టెక్నాలజీ చదవుతున్నాడు. ఈ క్రమంలో 2016, అక్టోబర్ 15న నజీబ్‌కు, ఏబీవీపీ విద్యార్థులకు మధ్య చిన్న వివాదం చోటుచేసుకుంది. ఆ తరువాత నుంచి నజీబ్ కనిపించకుండా పోయాడు. దాంతో ఫాతిమా 9 మంది విద్యార్థుల మీద ఫిర్యాదు చేశారు. అంతేకాక ఆమె అభ్యర్థన మేరకు ఢిల్లీ హై కోర్టు ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సిట్‌ను కూడా నియమించింది. కానీ ఇప్పటివరకూ నజీబ్ ఆచూకీ తెలియలేదు. ఈ కేసు విషయంలో సీబీఐ కూడా ఎటువంటి పురోగతి సాధించలేకపోయింది. -
వైఎస్సార్సీపీలోకి ఉదయ్‌రెడ్డి
ఆల్విన్‌కాలనీ: ఏబీవీపీ మాజీ నాయకుడు బి.ఉదయ్‌రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. మంగళవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.గత 20 ఏళ్లుగా ఏబీవీపీలో పనిచేసిన ఉదయ్‌రెడ్డి పలు సమస్యలపై పోరాటం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆశయాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్టు చెప్పారు. రాజన్న సువర్ణ యుగం రావాలంటే తిరిగి జగన్మోన్రెడ్డి నాయకత్వం అవసరమన్నారు. ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నవరత్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరి పుఫుల్లారెడ్డి తదితరులు ఉన్నారు. -
కరీంనగర్ బరిలో ఇద్దరు బీజేపీ రెబెల్స్
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి రెబెల్స్ బెడద తలనొప్పిగా మారింది. ఈ స్థానం నుంచి ఏకంగా ఇద్దరు రెబెల్స్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రణజిత్ మోహన్, సుగుణాకర్ రావు, బీజేవైఎం నేత, అధికార ప్రతినిధి, న్యాయ వాది ఎడ్ల రవికుమార్ పటేల్ పోటీలో ఉన్నారు. అయితే ఈ స్థానం నుంచి సుగుణాకర్‌రావును పోటీకి దింపాలని బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించింది. దీంతో రణజిత్ మోహన్, ఎడ్ల రవి రెబెల్స్‌గా శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం పరిధిలో బీజేపీ ఐక్యం గా నిలిస్తే గెలిచే అవకాశాలున్నా ఆ పార్టీకి చెందిన వారు ముగ్గురు బరిలో నిలుస్తుండటంతో ఓట్ల చీలిక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వీరితో మాట్లాడే బాధ్యతను కోర్ కమిటీ ఎంపీ బండారు దత్తాత్రేయ కు అప్పగించింది. పోటీ నుంచి తప్పుకోవాలని, పార్టీలో మంచి పదవి ఇస్తామని రణజిత్ మోహన్‌కు దత్తాత్రేయ, పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నచ్చజెప్పే ప్ర యత్నం చేసినా ఒప్పుకోలేదు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్ల నమోదులోనూ రణజిత్, ఎడ్ల రవి చురుకుగా వ్యవహరించారు. వేల సంఖ్యలో కొత్త ఓటర్లను నమోదు చేయడంతో ఆయా వర్గాలమద్దతు పొందవచ్చుననే ఆశాభావంతో వారుఉన్నారు. రణజిత్కు ఆరెస్సెస్ అండ.. రణజిత్ మోహన్‌కు ఆరెస్సెస్‌లోని వివిధ శాఖలు, సరస్వతి విద్యాపీఠాలు, శిశుమందిర్ ఏబీవీపీ, బీఎంఎస్ పూర్వ విద్యార్థులు మద్దతు తెలుపుతు న్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని కొన్ని ప్రాంతా ల్లో తాము బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలపడం లేదని, రణజిత్కే తమ మద్దతు అంటూ ఆయా విభాగాలు తీర్మానాలు కూడా చేసినట్టు సమాచారం. బీజేవైఎం నుంచి రవి.. ఈ ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే యువకుడిగా, యువకుల గొంతుకగా నిలుస్తా... అని ఓటర్లకు ఎడ్ల రవి విజ్ఞప్తి చేశారు. నామినేషన్ వేశాక రవి మాట్లాడుతూ బీజేపీలో చిన్న కార్యకర్తగా రాజకీయ జీవితం ఆరంభమైందని, బీజేవైఎం అధికార ప్రతినిధిగా పని చేస్తున్నానని, బీజేవైఎం నేతగా, అడ్వొకేటుగా తనకు ప్రజలతో మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఎడ్ల రవికి ఈ జిల్లాల్లోని యువమోర్చా కార్యకర్తలు పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్టు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. -
గడ్కరీ మాటలకు అర్థాలే వేరులే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎవరయితే ఇంటిని చక్కదిద్దు కోలేరో వారిక దేశాన్ని ఎలా చక్కదిద్దుతారు? కనుక మీరు ముందుగా మీ కుటుంబ బాధ్యతలపై దృష్టి పెట్టండి!’ అని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫిబ్రవరి రెండవ తేదీన ఏబీవీపీ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ప్రజలు తమను కలల్లోకి తీసుకెళ్లే నాయకులను ఇష్ట పడతారు. ఒకవేళ వారి కలలను నెరవేర్చడంలో నాయకులు విఫలమయితే వారిని పట్టుకొని ప్రజలు కొడతారు. కనుక మీరు నెరవేర్చగల హామీలను మాత్రమే ఇవ్వండి’ అని జనవరి 28వ తేదీన ముంబైలో బీజేపీ అనుబంధ రవాణా సంఘం ‘నవభారతీయ శివ్ వాహతుక్ సంఘటన’ సమావేశంలో గడ్కారీ వ్యాఖ్యానించారు. ‘సాంస్కృతిక కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకూడదు. రాజకీయ నాయకులకు పరిమితులు ఉంటాయి. కనుక వారు విద్యా, సాహిత్య కార్యక్రమాల్లో జోక్యం చేసుకోరాదు’ అంటూ జనవరి 13వ తేదీన మహారాష్ట్రలోని యవత్మల్లో జరిగిన 92వ అఖిల భారతీయ మరాఠి సాహిత్య సమ్మేళనం’లో గడ్కారీ వ్యాఖ్యానించారు. ‘మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మహిళా సాధికారికతకు నిదర్శనం. మహిళలకు రిజర్వేషన్లు లేకపోయినప్పటికీ రాజకీయల్లో రాణించారు’ అని జనవరి ఏడవ తేదీన నాగపూర్‌లో జరిగిన స్వయం ఉపాధి మహిళా బృందాలను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అదే సమావేశంలో ఆయన కుల, మత రాజకీయాలను విమర్శించారు. ‘ఎవరైనా జ్ఞానం ప్రాతిపదికనే ఎదగాలి. సాయిబాబా, గజానన్ మహరాజ్ లేదా సంత్ తుక్దోజీ మహరాజ్‌ను మీది ఎమతమని అడుగుతామా? ఛత్రపతి శివాజీ మహరాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ లేదా జ్యోతీబా ఫూలేలను మీ కులం ఏమిటని అడుగుతామా?’ ‘నేనే పార్టీ అధ్యక్షుడిని అయితే నా ఎంపీలు, ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయక పోతే ఎవరిది బాధ్యత ? నాదే బాధ్యత’ అని డిసెంబర్ 25వ తేదీన ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో మాట్లాడుతూ గడ్కరీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సహనం పాటించడం భారత ప్రజలకున్న పెద్ద సంపద. భారత్ ఓ దేశం కాదు, ఓ జాతంటూ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలు నాకిష్టం’ అని ఆయన అన్నారు. ‘ప్రజల జీవితాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధిని తీసుకరాకపోతే నీవు అధికారంలోకి వచ్చినా ఒక్కటే అధికారం కోల్పోయినా ఒక్కటే’ అని అన్నారు. అంతకుముందు డిసెంబర్ 22వ తేదీన పుణెలో జరిగిన జిల్లా పట్టణ కోపరేటివ్ బ్యాంకుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘పరాజయాన్ని ఒప్పుకునే సంస్కారం పెరగాలి’ అని అన్నారు. అక్టోబర్‌లో బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌కు ఇచ్చిన ఓ టీవీ ఇంటర్వ్యూలో ‘బీజేపీ ఎన్నికలకు ముందు నెరవేర్చడం సాధ్యంకాని హామీలను ఇచ్చింది. రాజకీయాలనేవే తప్పనిసరి ఆడాల్సిన ఓ ఆట. దానికి పరిమితులుంటాయి. వైరుధ్యాలు కూడా ఉంటాయి. మేము ఎప్పటికీ అధికారంలోకి రామని గట్టిగా భావించాం. అయితే అసాధ్యమైన హామీలు ఇవ్వాల్సిందిగా మా వారు మాకు సూచించారు. ఎన్నికయినా వాటిని ఎలాగు నెరవేర్చలేం. అయితే సమస్య ఏమి వచ్చిందంటే, జనం ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారు. డేట్లతో సహా మేమిచ్చిన హామీలను మాకు గుర్తు చేస్తున్నారు. చిద్విలాసంగా నవ్వుతూ ముందుకు పోతున్నాం అంతే’ అని వ్యాఖ్యానించారు. గడ్కరీ గతేడాది కాలంగా చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ పరమైనవని, ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాను ఉద్దేశించి చేసినవే ఎక్కువన్న విషయం స్పష్టం అవుతోంది. ‘ఇంటిని చక్కదిద్దుకోలేని వాడు దేశాన్ని ఏం చక్కదిద్దుతాడు’ అన్న వ్యాఖ్య భార్యను విడిచిపెట్టిన మోదీని ఉద్దేశించి చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రజల జీవితాలను బాగు చేయలేని వాడు అధికారంలో ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటేనని అనడం, అసాధ్యమయ్యే హామీలను ఇవ్వడం (సబ్కే సాత్ సబ్కా వికాస్) తప్పని చెప్పడం, ఎన్నికల్లో ఓడిపోతే అందుకు బాధ్యత వహించాల్సిందనడం మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా కనిపిస్తాయి. ఓటమికి పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యత అనడం అమిత్ షాను ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తోంది. ఇక కుల, మతాల గురించి, దేశ ప్రజల సహనం గురించి, ఇందిరా, నెహ్రూల గురించి మాట్లాడడం పార్టీ వైఖరిని దూషించినట్లుగా కనిపిస్తోంది. ఇక విద్యా, సాహిత్య కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల జోక్యం అనవసరం అనడం మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నాయకుడు రాజ్ థాక్రే అభ్యంతరం మేరకు ప్రముఖ సాహితీవేత్త నయన్‌తార సహగల్‌ను మహారాష్ట్ర సాహిత్య సమ్మేళనానికి నిర్వాహకులు ఆహ్వానించకపోవడంపై వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి మోదీని పరోక్షంగా విమర్శించడం ద్వారా పార్టీలో తాను ఆయనకు ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదగాలనుకోవడం, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే మిత్రపక్షాలను ఆకర్షించే ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ఎదగాలనుకోవడం, ఇక ఇందిరా, నెహ్రూలు, ప్రజల సహనం గురించి మాట్లాడం అంటే తాను మోదీ లాంటి నియంతృత్వ వాదిని కాదని, ప్రజల మనిషినని, నిబద్ధత కలిగిన వ్యక్తిని అని చెప్పుకోవడం కావచ్చు. అయితే ఇలాంటి అన్వయింపులను గడ్కరీ కొట్టి వేస్తున్నారు. మీడియా అసందర్భంగా తన వ్యాఖ్యలకు ఉటంకిస్తోందని ఆరోపిస్తున్నారు. పార్టీ నాయకత్వానికి, తనకు మధ్య దూరం పెంచడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రభుత్వాలు పడిపోవడానికి పార్టీ నాయకులు నియంతృత్వ పోకడలే కారణమని, ప్రధాని పదవి నుంచి మోదీని తప్పించి గడ్కారీని నియమించాలంటూ ఆరెస్సెస్ నాయకుడు మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి సురేశ్ జోషిలకు డిసెంబర్ నెలలో ‘వసంత్‌రావు నాయక్ సేథి స్వావలంబన్ మిషన్’ చైర్పర్సన్ కిషోర్ తివారీ మరి ఎందుకు లేఖ రాశారో? పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన గడ్కరీకి ఇప్పటికీ ఆరెస్సెస్ అండదండలున్న విషయం తెల్సిందే. -
ఏబీవీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక
సాక్షి, అమరావతి బ్యూరో: ఏబీవీపీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డా. ఎస్ సుబ్బయ్య (తమిళనాడు), ఆశీష్ చౌహాన్(హిమాచల్‌ప్రదేశ్)లు మళ్లీ ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎలక్షన్ ఆధికారి మమతా యాదవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 27న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనున్న ఏబీవీపీ జాతీయ సమావేశాల్లో వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ఏడాదిపాటు బాధ్యతలు నిర్వహించనుంది. -
హెచ్‌సీయూలో ఏబీవీపీ ఘన విజయం
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఘన విజయం సాధించింది. 2018–19 విద్యా సంవత్సరానికి విద్యార్థి సంఘ ఎన్నికల పోలింగ్‌ను శుక్రవారం నిర్వహించగా ఓట్ల లెక్కింపును శనివారం చేపట్టారు. రాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపులో ఏబీవీపీ, ఓబీసీఎఫ్, సేవాలాల్ విద్యార్థిదళ్ కూటమి అభ్యర్థులంతా ఘన విజయం సాధించాచినట్లు హెచ్‌సీయూ అధికారులు తెలిపారు. ఫలితాలు ప్రకటించగానే ఏబీవీపీ, ఓబీసీఎఫ్, సేవాలాల్ విద్యార్థి దళ్ కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ప్రెసిడెంట్‌గా నాగ్‌పాల్ విజయం హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్, హెచ్‌సీయూ విభాగం మహిళా కన్వీనర్, సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్న ఆర్తి నాగ్‌పాల్ తన సమీప ప్రత్యర్థి ఎర్రం నవీన్‌కుమార్‌పై 334 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆర్తికి 1,663 ఓట్లు రాగా నవీన్‌కు 1,329 ఓట్లు మాత్రమే లభించాయి. ఉపాధ్యక్ష పదవికి పోటీచేసిన అమిత్ కుమార్ çతన సమీప ప్రత్యర్థి పి.పారితోశ్పై 247 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అమిత్‌కు 1,505 ఓట్లు లభించగా పారితోశ్కు 1,258 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీచేసిన ధీరజ్ సంగోజి తన సమీపç ప్రత్యర్థి అభిషేక్కుమార్పై 127 ఓట్లతో విజయం సాధించారు. ధీరజ్‌కు 1,573 ఓట్లురాగా అభిషేక్‌కు 1,446 ఓట్లు లభించాయి. సంయుక్త కార్యదర్శి పదవికి పోటీచేసిన ఎస్. ప్రవీణ్‌కుమార్ తన సమీప ప్రత్యర్థి అనుమపెస్ కృష్ణన్‌పై 39 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. సాంస్కృతిక కార్యదర్శి పదవికి పోటీచేసిన అరవింద్ ఎస్ కుమార్ తన ప్రక్రితి చక్రవర్తిపై 233 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అరవింద్‌కు 1,475 ఓట్లు రాగా చక్రవర్తికి 1,242 ఓట్లు పోల్ అయ్యాయి. క్రీడా కార్యదర్శి పదవికి పోటీ చేసిన కె. నిఖిల్రాజ్ తన సమీప ప్రత్యర్థి శ్యామ్యూల్ ఈను రాగ్ నాలామ్పై 139 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిఖిల్‌కు 1,467ఓట్లు రాగా, శ్యామ్యూల్‌కు 1,328 ఓట్లు లభించాయి. నోటాకు 983 ఓట్లు హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో నోటాకు గణనీయంగా ఓట్లు పడ్డాయి. ఆరు పదవులకే 983 ఓట్లు పోల్ కావడం విశేషం. అ«ధ్యక్ష పదవికి 95, ఉపాధ్యక్ష పదవికి 216, ప్రధాన కార్యదర్శికి 144, క్రీడా కార్యదర్శికి 199, సాంస్కృతిక కార్యదర్శికి 133, సంయుక్త కార్యదర్శికి 196 ఓట్లు పోల్ అయ్యాయి. -
విద్యార్థుల కాళ్లు మొక్కిన ప్రొఫెసర్
-
విద్యార్థుల కాళ్లు మొక్కిన ప్రొఫెసర్
భోపాల్ : అధ్యాపక వృత్తిలో ఉంటూ పాపం చేశానంటూ విద్యార్థులను వెంబడిస్తూ వారి కాళ్లను మొక్కుతున్న ఓ ఉపాధ్యాయుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని మాంద్‌సోర్‌లో రాజీవ్ గాంధీ ప్రభుత్వ కళాశాలలో దినేశ్ గుప్తా ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పరీక్షల ఫలితాలు జాప్యం అవుతున్నాయని ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడు పవన్ శర్మ ఆధ్వర్యలో నిరసన చేపట్టారు. దీనిలో భాగంగా దినేశ్ గుప్తా పాఠాలు చెబుతున్న తరగతి దగ్గరకి వెళ్లి స్లోగన్లు ఇవ్వడం ప్రారంభించారు. తన క్లాస్‌ను అడ్డుకోవద్దంటూ దినేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో భారత్ మాతాకీ జై, వందేమాతరం స్లోగన్‌లనే అడ్డుకుంటారా.. దినేశ్ గుప్తా దేశ ద్రోహి అంటూ స్లోగన్లు ఇవ్వడం ప్రారంభించారు. ప్రిన్సిపాల్ రవింద్ర సొహానీ జోక్యం చేసుకొని దినేశ్ గుప్తాతోపాటూ ఏబీవీపీ విద్యార్థులను సంయమనం పాటించాలని సూచించారు. ప్రొఫెసర్ తమకు క్షమాణ చెప్పాల్సిందేనని ఏబీవీపీ విద్యార్థులు పట్టుబట్టారు. దీనికి దినేశ్ గుప్తా ఒప్పుకోకపోవడంతో అతన్ని వెంబడిస్తూ దేశద్రోహి అంటూ స్లోగన్లు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన దినేశ్ గుప్తా కాలేజీ క్యాంపస్‌లోనే విద్యార్థులు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకున్నారు. వెంటపడి మరీ కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. దాంతో విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏబీవీపీ ఉపాధ్యాయులను గౌరవిస్తుందని, రాజీవ్ గాంధీ ప్రభుత్వ కళాశాలలో చోటు చేసుకున్న ఘటన బాధాకరమని ఏబీవీపీ జాతీయ నేత అంకిత్ గార్గ్ వ్యాఖ్యానించారు. పరీక్షా ఫలితాల్లో జాప్యం కారణంగానే ఏబీవీపీ విద్యార్థులు నిరసన తెలిపారని, దినేశ్ గుప్తాను దేశ ద్రోహి అని ఎవరూ అనలేదన్నారు. ఆ సమయంలో ప్రొఫెసర్ కోపంగా ఉన్నందును క్యాంపస్‌లో రచ్చ చేయడానికే విద్యార్థుల కాళ్లు పట్టుకున్నారని తెలిపారు. 'నిరసన పేరుతో నా తరగతికి ఏబీవీపీ విద్యార్థులు అడ్డుతగిలారు. వాళ్లు నన్ను దేశ ద్రోహి అంటూ స్లోగన్లు ఇచ్చారు. నన్ను క్షమాణ చెప్పాలని కోరారు. సరే, అని వాళ్ల కాళ్ల మొక్కా. ఈ క్యాంపస్‌లో గత 32 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా. వారికన్నా నాకే దేశభక్తి ఎక్కువ. దేశభక్తిని ఒకరికి చూపించాల్సిన అవసరం నాకు లేదు. విద్యార్థులు బాగా చదువుకోవాలనే నేను కోరుతున్నా. చదువుకుంటేనే జీవితం బాగుంటుంది. వాళ్లపై చర్యలు తీసుకోవాలని నేను అనుకోవడం లేదు' అని దినేశ్ గుప్తా తెలిపారు. ఇది అంత పెద్ద సమస్య ఏమీ కాదని, ఈ సమస్య పరిష్కారం అయిపోయిందని ప్రిన్సిపల్ రవింద్ర సొహానీ అన్నారు. -
జేఎన్‌యూలో ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు ముగిసి 24 గంటలు కూడా గడవకముందే క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల్లో గెలిచిన వామపక్ష కూటమిలోని ఆల్ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ), ఓటమి పాలైన ఏబీవీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అనంతరం పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున క్యాంపస్‌లోని గంగా దాబా వద్ద ఏబీవీపీ నేత సౌరభ్ శర్మ ఆధ్వర్యంలో తమపై దాడి జరిగిందంటూ విద్యార్థి సంఘం నూతన అధ్యక్షుడు సాయి బాలాజీ, మాజీ అధ్యక్షురాలు గీతాకుమారి తదితరులు వసంత్‌కుంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హాస్టల్ గదుల్లో ఉన్న తమ మద్దతుదారులను వామపక్షాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా కొట్టారంటూ ఏబీవీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఏబీవీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని సాయి బాలాజీ ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో క్యాంపస్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. కాగా, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నూతన అధ్యక్షుడు ఎన్.సాయిబాలాజీ స్వస్థలం హైదరాబాదు. 2014 నుంచి ఆయన జేఎన్‌యూలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో పీహెచ్డీ చేస్తున్నారు. -
జేఎన్‌యూలో వామపక్షాల విజయభేరి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో యునైటెడ్ లెఫ్ట్ విజయం సాధించింది. జేఎన్‌యూ ప్రెసిడెంట్‌గా సాయి బాలాజీ, వైస్ ప్రెసిడెంట్‌గా సారికా చౌదరీ విజయం సాధించారు. అజీజ్ అహ్మద్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవ్వగా, అమృత జయదీప్ జాయింట్ సెక్రటరీగా విజయభేరి మోగించారు. దీంతో యూనివర్సిటీలోని నాలుగు కీలక పదవులను ఆ కూటమి సొంతం చేసుకుంది. లెఫ్ట్ కూటమి నుంచి పోటీ చేసిన సాయి బాలాజీకి 2151 ఓట్లు పోలవ్వగా బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ నుంచి పోటీచేసిన లలిత్ పాండేకి కేవలం 972 ఓట్లు మాత్రమే సాధించారు. కాగా ఏబీవీపీ నేతలు కౌంటింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంలు లాక్కునేందుకు ప్రయత్నించడంతో శనివారం ప్రకటించాల్సిన ఫలితాలు ఆదివారంకి వాయిదా పడ్డ విషయం తెలిసిందే. కాగా గత ఆరేళ్లల్లో అత్యధికంగా 68 శాతం పోలింగ్ నమోదైంది. యునిటైడ్ లెఫ్ట్‌ను బలపరిచిన కూటమిలో ఆల్ఇండియా స్టూడెంట్ అసోషియేషన్ (ఎఎఐఎస్‌ఎ), స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ), డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (ఎఐఎస్ఎఫ్) ఉన్నాయి. -
డీయూ ఎన్నికల్లో ఏబీవీపీ హవా
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) అధ్యక్ష పదవితోపాటు మరో రెండు కీలక పదవులను గెలుచుకుంది. కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐ ఒక్క స్థానానికి పరిమితం కాగా, వామపక్ష ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఐ) బలపరిచిన ఆప్ అనుబంధ ఛాత్ర విద్యార్థి సంఘర్‡్ష సమితి ఖాతా తెరవలేదు. ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌గా ఏబీవీపీకి చెందిన అంకివ్ బసోయా, వైస్‌ప్రెసిడెంట్‌గా ఏబీవీపీకే చెందిన శక్తి సింగ్, జాయింట్ సెక్రటరీగా జ్యోతి విజయం సాధించారు. సెక్రటరీగా ఎన్ఎస్యూఐకి చెందిన ఆకాశ్ చౌదరి 9,199 ఓట్లతో గెలుపొందగా.. ఈ పోస్టుకు గాను నోటాకు 6,810 మంది విద్యార్థులు ఓటేయడం గమనార్హం. ఈ నెల 13వ తేదీన జరిగిన ఈ ఎన్నికల్లో 23 మంది బరిలో నిలవగా పోలైన ఓట్లు 44.46 శాతం మాత్రమే. -
పరిపూర్ణనందను కలిసిన హిందూ ధార్మిక సంస్థల నేతలు
సాక్షి, తూర్పుగోదారి: మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారన్న ఆరోపణలపై పరిపూర్ణనాధ స్వామి నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. శనివారం కాకినాడలోని శ్రీపీఠంలో ఉన్న స్వామీజీని ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్‌పీ, గోరక్షక దళం, ఏబీవీపీ, ఆర్హెచ్ఎస్, హిందూ ధార్మిక సంస్థల నేతలతో పాటు, ఉప్పల్ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీ ఎస్ఎస్ ప్రభాకర్ స్వామీజీని మర్యాద పూర్వకంగా కలిశారు . వారు స్వామీజీతో సుమారు గంటపాటు సమావేశమైయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ...విశ్వహిందూ సమాజం తరుపున పరిపూర్ణనంద స్వామిని హైదరాబాద్‌కు రమ్మని సాదరంగా ఆహ్వానించామని తెలిపారు. దీనికి స్వామీజీ కూడా సానుకూలంగా స్సందించారు అన్నారు. హైదరాబాద్‌లో స్వామీజీపై ఉన్ననగర బహిష్కరణపై హైకోర్టు స్టే ఇచ్చిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. దీనితో తెలంగాణా ప్రభుత్వం ఆయనకు ఘన స్వాఘతం పలుకుతుందని భావిస్తున్నామని ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు. -
ఏబీవీపీ ధర్నా
తాండూరు టౌన్ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. తాండూరులోని అంబేద్కర్‌చౌక్‌లో పెద్దఎత్తున విద్యార్థులు రోడ్డుపై గంటపాటు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈసందర్భంగా ఎబీవీపీ వసతిగృహాల జిల్లా కో–కన్వీనర్ రాజేష్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రూ.1168 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విద్యార్థులకు చెల్లించాల్సి ఉందన్నారు. ఎంసెట్ స్కాంలో అసలైన నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ ధర్నాలో పలు కళాశాలల విద్యార్థులు, ఎబీవీపీ కార్యకర్తలు హరీష్, శ్రీను, నవీన్, భరత్ తదితరులు పాల్గొన్నారు. పోలీసలు రాకతో స్వల్ప ఉద్రిక్తత... విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణ సీఐ ప్రతాప్‌లింగం, ఎస్సై వెంకటేష్, పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకొని విద్యార్థులను బలవంతంగా రోడ్డుపై నుంచి తొలగించేందుకు యత్నించగా అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం పోలీసులు విద్యార్థులను శాంతింపజేసి అక్కడనుంచి పంపించారు. వికారాబాద్‌లో విద్యార్థులతో కలిసి ఏబీవీపీ ర్యాలీ... వికారాబాద్ అర్బన్ : ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజురియింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పసుల మహేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ విషయమై విద్యార్థులతో కలిసి రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ... ప్రభుత్వం సకాలంలో ఉపకారవేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో కళాశాలల ఫీజు చెల్లించాలని యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే ఉపకారవేతనాల మీదనే ఆధారపడి చదివే పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజురియింబర్స్‌మెంట్, ఉపకారవేతనాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారిపట్టించి ఇతర పనులకు వాడుకుంటుందన్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉపకారవేతనాలను నెలనెల విద్యార్థుల ఖాతాలో జమచేయాలన్నారు. లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఏబీవీపీ నాయకులు సతీష్, అనీల్, వెంకట్ రెడ్డి, నవీన్ తదితరులు ఉన్నారు. -
‘బాబుకు జాబ్ వచ్చింది కానీ యువతకు రాలేదు’
సాక్షి, ఏలూరు : ఆంధ్రప్రదేశ్‌లోని విద్యావ్యవస్థ స్థితిగతులపై ఏబీవీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో శనివారం వారు మాట్లాడుతూ.. బాబుకు జాబ్ వచ్చింది కానీ, యువతకు ఉద్యోగాలు రావడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థల దందా పెరిగిపోయిందని ఆరోపించారు. వియ్యంకుల చేతిలో ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ నలిగిపోతోందని మండిపడ్డారు. ఈ సమావేశాల అనంతరం రాష్ట్రంలోని విద్యావ్యవస్థపై సమగ్ర నివేదికని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, గవర్నర్ నరసింహన్‌కు అందజేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు ప్రత్యేకంగా ఫిజికల్ ఎడ్యూకేషన్ సంస్థలు ఏర్పాటు చేయాలని ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి కౌశిక్ డిమాండ్ చేశారు. -
ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం
కామారెడ్డి టౌన్: ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కొత్త బస్టాండ్ వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎస్ఆర్కే కళాశాలలో విద్యార్థులకు సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రంజీత్మోహన్ మాట్లాడుతూ దేశ రక్షణలో యువత పాత్ర వహించాలన్నారు. కార్యక్రమంలో అడ్వొకేట్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటి సభ్యుడు బాల్‌రాజ్, నాయకులు స్వామి, నరేందర్‌రెడ్డి, రాహుల్, నారాయణ, నరేశ్, రాజాగౌడ్, అనిల్, ప్రవీన్, భాను తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ జెండా ఆవిష్కరణ దోమకొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఏబీవీపీ నాయకు లు జెండాను ఎగురువేశారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల సమక్షంలో జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యార్థులు కళాశాల ఆవరణలో స్వచ్చభారత్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏబీవీపీ మండల ప్రతినిధులు మనిదీప్, రణదీర్, రాజు, వేణులు పాల్గొన్నారు. -
సీబీఎస్ఈ పేపర్ లీక్; షాకింగ్ ట్విస్ట్!
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేస్తోన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. సిట్ ఆధికారుల బృందం చేపట్టిన దర్యాప్తులో అనేకానేక విషయాలు బయటపడుతున్నాయి. లీకేజీలో కీలక సూత్రధారులుగా భావిస్తోన్న వ్యక్తులంతా బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో కీలక నేతలు కావడం విమర్శలకు దారితీసింది. పదో తరగతి మ్యాథ్స్ పేపర్ లీకేజీలో ప్రధాన ముద్దాయిగా అనుమానిస్తున్న సతీశ్ పాండేను ఇప్పటికే జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జత్రాహిబాగ్(జార్ఖండ్)లో‘స్టడీ విజన్’ పేరుతో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తోన్న పాండే.. ఛాత్రా జిల్లా ఏబీవీపీ అధ్యక్షుడు కూడా. ఇటు ప్రభుత్వానికి, సీబీఎస్ఈ బోర్డుకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనల్లో ఏబీవీపీ పాలుపంచుకోవడంపైనా మిగతా విద్యార్థి సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు షైలా రషీద్ శనివారం ఈ మేరకు చేసిన వరుస ట్వీట్లు వైరల్ అయ్యాయి. ‘‘మీరే లీకేజీలు చేస్తూ, తప్పును కప్పిపుచ్చుకోవడానికి మీరే ఆందోళనలకు నాయకత్వం వహించడం ఎంత దారుణం..’ అని షైలా మండిపడ్డారు. అటు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు కూడా సతీశ్ పాండే ఫొటోలను సర్క్యులేట్చేస్తూ ఏబీవీపీ, దాని మాతృసంస్థ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. 12వ తరగతి ఎకనామిక్స్‌కు 25న రీ ఎగ్జామ్: పేపర్ లీకేజీ నేపథ్యంలో 12వ తరగతి ఎకనామిక్స్ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని చెప్పిన సీబీఎస్ఈ బోర్డు.. ఆ తేదిని ఏప్రిల్ 25గా పేర్కొంది. అయితే 10వ తరగతి మ్యాథ్స్ రీ ఎగ్జామ్ తీదీలపై ఇంకా స్పష్టత రాలేదు. కేవలం ఢిల్లీ, హరియాణాలో మాత్రమే టెన్త్ మ్యాథ్స్ రీ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉండొచ్చని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి అనిల్ స్వరూప్ శనివారం మీడియాతో చెప్పారు. -
ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ ఓయూలో ఆందోళన
-
పెన్షన్ భిక్ష కాదు.. ఉద్యోగి హక్కు
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్) : ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ ప్రభుత్వం పెట్టే భిక్ష కాదని, అది ఉద్యోగి హక్కు అని ఏబీఆర్ఎస్ఎం జాతీయ ఉపాధ్యక్షులు పాలేటి వెంకట్రావు పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఏబీవీపీ కార్యాలయంలో తపస్ ఇందూర్ జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ... వృత్తి పట్ల నిబద్ధత కలిగిన కార్యకర్తల సమూహమే తపస్ సంఘం అని తెలిపారు. సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలుయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇప్పకాయల సుదర్శన్, పాపగారి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ రద్దు కోరుతూ తపస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద 27వ తేదీన ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ధర్నాకు సంబంధించిన పోస్టర్లను వారు విడుదల చేశారు. రాష్ట్ర కార్యదర్శి కీర్తి సుదర్శన్, జిల్లా కోశాధికారి రమేష్‌లాల్, నాయకులు కృష్ణవేణి, శ్రీకాంత్, లక్ష్మీనర్సయ్య, అరుణ్, నరోత్తం, వివిధ మండలాల బాధ్యులు నాగభూషణం, రాము, గోపి, సాయిలు పాల్గొన్నారు. ‘సీపీఎస్’ ను రద్దు చేయాలి:వెంకట్రావు కామారెడ్డి టౌన్: హర్యాన రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని అఖిల భారత రాష్ట్రిక శైక్షిక్మహాసంఘ్(ఏబీఆర్ఎస్ఎం) న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుడు పాలెటి వెంకట్రావు అన్నారు. ఆదివారం సరస్వతి శిశుమందిర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తపస్ ఆధ్వర్యంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో ఈనెల 27న నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో సీపీఎస్‌పై శాసనసభలో ఎటువంటి తీర్మాణాన్ని చేయకపోవడంతో సమస్య శాపంలా మారిందన్నారు. ఈ సమావేశంలో తపస్ జిల్లా అధ్యక్షుడు రమేష్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్, నాయకులు రమేష్, లక్ష్మిపతి, రాజశేకర్, ఆంజనేయులు, తదితరులున్నారు. -
ఇదేం కక్కుర్తి
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి హాస్టల్ నుంచి అక్రమంగా తరలిస్తున్న వస్తువులను ఏబీవీపీ నాయకులు పట్టుకుని నిలదీసి న సంఘటన ఎల్లారెడ్డిలో బుధవారం జరిగింది. ఏబీవీపీ నాయకులు ఓంకార్, తులసీరాంలు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల వార్డెన్‌గా విధులను నిర్వర్తిస్తున్న జ్యోతిలక్ష్మి బుధవారం మధ్యాహ్నం పాఠశాల నుంచి అక్రమంగా విద్యార్థులకు అందించాల్సిన మిరియాలు, పెసర్లు, నువ్వులు, ఆవాలు, బెడ్ షీట్లు, స్టీల్ గిన్నెలను సంచిలో వేసుకుని ఇంటికి తరలిస్తుండగా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పట్టుకున్నట్లు వారు తెలిపారు. విద్యార్థులకు అందించాల్సిన వస్తువులను ప్రతి సారీ సంచులలో తీసుకుని వెళ్తుందని వారు ఆరోపించారు. పట్టుకున్న వస్తువులను హాస్టల్‌కు తరలించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. స మాచారం అందుకున్న రెవెన్యూ అధి కారి గిర్దావార్ వెంకట్‌రెడ్డి పాఠశాలకు చేరుకుని పంచనామా నిర్వహించారు. ప్రిన్సిపాల్ సంచిలో 5కిలోల నువ్వులు, 5కిలోల ఆవాలు, 5కిలోల పెసర్లు, 5 బెడ్షీట్లు, 6స్టీల్ గిన్నెలు, 3కిలోల మిరి యాలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపా రు. నివేదికను తహసీల్దార్ అంజయ్యకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. -
శాతవాహన వర్సిటీ వద్ద ఉద్రిక్తత
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ వద్ద స్థానిక యువకులకు, కాలేజీ విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ దగ్గర మనుధర్మ శాస్త్రాన్ని పీడీఎస్యు, డీఎస్యు, బీఎస్ఎఫ్ విద్యార్థులు తగులబెట్టారు. దీంతో ఈ సంఘాల విద్యార్థులు, స్థానిక యువకులు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. నగర పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ అక్కడకు చేరుకుని కమలాసన్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఆయన వారితో మాట్లాడి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. -
ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిగా సుబ్బయ్య
సాక్షి, ముంబై: బీజేపీ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) జాతీయ అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన డా.ఎస్ సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శిగా ముంబైకి చెందిన ఆశిష్ చౌహాన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ ఏడాది పాటు ఈ పదవుల్లో కొనసాగనున్నట్లు ఎన్నికల అధికారి డా.రామన్ త్రివేది తెలిపారు. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 3 వరకు జార్ఖండ్‌లోని రాంచీలో జరిగే ఏబీవీపీ 63వ జాతీయ సమావేశాల్లో వీరిద్దరూ బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. -
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ దిష్టిబొమ్మ దహనం..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవనించేలా అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం ఆయన దిష్టిబొమ్మను ప్రధాన ద్వారం వద్ద దహనం చేశారు. ఏబీవీపీ, జేఎన్టీయూఎచ్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలను నిరసిస్తూ ర్యాలీని నిర్వహించారు . ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర కార్యదర్శి జవ్వాజి దిలీప్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వద్ద మెప్పు పొందడం కోసం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ రాక ఏ ఒక్క విద్యార్థికి ఇబ్బంది కలగలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతేకాక ఇంజనీరింగ్ విద్యార్థులు పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారని, అనవసరంగా కొందరు విద్యార్థులు రాద్ధాంతం చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
వారణాసిలో ఊహించని ఝలక్
వారణాసి : మోదీ సొంత నియోజకవర్గంలో భారత జనతా పార్టీకి ఊహించని పరిణామం. స్థానికంగా ఉన్న ఓ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విభాగం ఏబీవీపీ ఘోర పరాజయం చవిచూసింది. స్వతంత్ర్య అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం సాధించటం విశేషం. మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ యూనివర్సిటీ ఎన్నికలను విద్యార్థి సంఘాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. ఈ దఫా జరిగిన ఎన్నికల్లో ఏబీపీవీ తరపున వాల్మీకి ఉపాధ్యాయ బరిలోకి దిగగా, సమాజ్‌వాదీ ఛాత్ర సభ నుంచి రాహుల్ దుబే పోటీ చేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రాహుల్‌కి టికెట్ ఇవ్వకపోవటంతో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేశాడు. మొత్తం పోలైన ఓట్లలో 2.365 ఓట్లు రాహుల్‌కి దక్కగా, వాల్మీకికి 1,393 ఓట్లు దక్కాయి. దీంతో వెయ్యికి పైగా ఓట్లతో రాహుల్ ఘన విజయం సాధించినట్లయ్యింది. ఇక వాల్మీకిపై పలు ఆరోపణలు రావటం.. రాహుల్ అనుచరులపై దాడి చేశాడన్న కేసు వాల్మీకి ఓటమికి కారణాలైనట్లు విశ్లేషిస్తున్నారు. కాగా, ఉపాధ్యక్ష పదవి, లైబ్రేరీ సెక్రటరీ పదవులను గతేడాది అభ్యర్థులకే మద్దతు ఇచ్చి ఎస్సీఎస్(సమాజ్‌వాదీ పార్టీ విభాగం), ఎన్ఎస్యూఐ(కాంగ్రెస్ పార్టీ విభాగం) నిలుపుకోగా, ఉన్న ఒక్క పదవిని ఏబీవీపీ కోల్పోయినట్లయ్యింది. కాగా, ఈ మధ్య జరిగిన పలు యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ వరుస పరాజయాలను చవిచూడటం గమనార్హం. -
విద్యాసంస్థలు బంద్ : ఏబీవీపీ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్ : కార్పొరేట్ కళాశాల్లో అభ్యసిస్తున్న విద్యార్థుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో అఖిల భారత విద్యా పరిషత్(ఏబీవీపీ) ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఇంత జరుగుతున్నా ఇంటర్ బోర్డు అధికారులు, ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయాలుగా నిలుస్తున్న నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలను వెంటనే మూసేయాలని డిమాండ్ చేశారు. బ్రాండ్ పేరుతో వందల కోట్ల వ్యాపారం చేస్తున్న నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లో వందల మంది విద్యార్థులు ఉసురు తీసుకున్నా ఒక్క అరెస్టు కూడా జరగలేదని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బంద్: విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఏబీవీపీ నాయకులు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నారాయణ, చైతన్య కాలేజీల ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణను వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో బంద్ కారణంగా వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ కాలేజీలు మూతపడ్డాయి. కడపలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం బైక్ ర్యాలీ నిర్వహించింది. కోటిరెడ్డి సర్కింల్, అంబేడ్కర్ సర్కిల్‌లలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూలు ఆందోళన నిర్వహించాయి. మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాస రావులను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. బంద్ నేపథ్యంలో అనంతపురం నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాలేజీ వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థి నేతలు చేరుకోవడంతో పోలీసులు వారిని ఈడ్చుకెళ్లారు. విజయవాడలోని బెంజ్‌సర్కిల్ వద్ద విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థుల మరణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. విద్యార్థుల ఆత్మహత్యపై నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. కార్పొరేటు కళాశాలల యాజమాన్యాలు, విద్యాశాఖ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, డీజీపీ, అధికారులు పాల్గొననున్నారు. -
నేడు కార్పొరేట్ విద్యాసంస్థల బంద్
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ విద్యాసంస్థలైన నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం కార్పొరేట్ విద్యాసంస్థల బంద్‌కు పిలుపు ఇస్తున్నట్లు ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రాఘవేందర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెండు విద్యాసంస్థల్లో ఇప్పటివరకు వందల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినా ఒక్క అరెస్టు కూడా జరగలేదన్నారు. ఆయా కాలేజీల హాస్టళ్లకు అనుమతులే లేవని, అయినా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని అన్నారు. -
సోమవారం బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీవీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా సోమవారం ఏబీవీపీ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యార్ధుల ఆత్మహత్యలపై రాష్ట్రం మొద్దునిద్ర పోతోందని విద్యార్ధి సంఘాల నాయకులు మండిపడ్డారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మూడున్నర ఏళ్లలో వందలాది మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలంగాణ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్పొరేట్లకు తొత్తుల్లా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. -
బీజేపీకి మళ్లీ షాక్.. మరో వర్సిటీ ఎన్నికల్లో ఓటమి
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీకి ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. ఆ పార్టీకి చెందిన అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీకి వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే జేఎన్‌యూ, హెచ్‌సీయూ వంటి విశ్వవిద్యాలయాల్లో జరిగిన స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన ఆ పార్టీ అనుబంధ సంస్థ తాజాగా అలహాబాద్ యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో కూడా ఓటమిని చవిచూసింది. సమాజ్‌వాది పార్టీకి చెందిన సమాజ్‌వాది చత్ర సభ(ఎస్సీఎస్) భారీ విజయాన్ని ఖాయం చేసుకుంది. రాష్ట్ర ఎన్నికల్లో ఊహించని విధంగా మట్టి కరిచిన ఆ పార్టీ తిరిగి విద్యార్థి ఎన్నికల రూపంలో పెద్దమొత్తంలో విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఐదు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ ఒకే సీటును అది కూడా జనరల్ సెక్రటరీని దక్కించుకోగా ఎస్సీఎస్ మాత్రం అధ్యక్ష, ఉపాధ్యక్షపదవితోపాటు మరో రెండు కీలక పదవులను తన ఖాతాలో వేసుకుంది. 2015లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఏబీవీపీ 4 స్థానాలను సొంతం చేసుకుంది. తాజా ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎస్సీఎస్ తరుపున బరిలో నిలిచి విజయం సాధించిన అధ్యక్షుడు అవినాష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇది అందరు విద్యార్థుల విజయం అని చెప్పారు. కాగా, గురుదాస్‌పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. -
అవి హత్యలా.. ఆత్మహత్యలా?
ఒంగోలు: శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో స్థానిక శ్రీచైతన్య కాలేజీ వద్ద కార్పొరేట్ యాజమాన్యాల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా భాగ్ కన్వీనర్ అశోక్ మాట్లాడుతూ కడప జిల్లాలో నారాయణ కాలేజీలో పావని ఆత్మహత్య జరిగి వారంరోజులు కూడా గడవకముందే హైదరాబాదు, ఏపీల్లో మొత్తం అయిదుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. కార్పొరేట్ కాలేజీల్లో నిజంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయా లేక హత్య జరిగిన తరువాత వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో జరిగిన ఆత్మహత్యలపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్పోరేట్ వ్యవస్థల గుర్తింపు రద్దుచేసి డాక్టర్ ప్రొఫెసర్ నీరదారెడ్డి నివేదికను అమలు చేయాలన్నారు. ఇప్పటివరకు జరిగిన ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయాలని, ఎక్కడైనా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే దానికి ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా సంఘటనా కార్యదర్శి హనుమంతు, వినయ్, బాలు, సాయి, సంతోష్, గోపాల్, నవీన్, ప్రభుకుమార్, రాజశేఖర్, సురేంద్ర, షరీఫ్ పాల్గొన్నారు. -
పూల్ పార్టీలు.. బర్గర్లతో లొంగదీసుకున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం ఢిల్లీ యూనివర్సిటీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్యూఐ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీని దారుణంగా మట్టికరిపించి సాధించిన గెలుపుపై కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికీ సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే ఎన్‌ఎస్‌యూఐది నిజమైన గెలుపు కానే కాదని అంటోంది ఏబీవీపీ. తప్పుడు ప్రచారంతో వాళ్లు విజయం సాధించారని ఏబీవీపీ నేత, డీయూఎస్‌యూ కార్యదర్శి మహమేధా నగర్ ఆరోపిస్తున్నారు. ’ పూల్ పార్టీలు, బర్గర్లను విద్యార్థులకు ఆశగా చూపి లొంగదీసుకున్నారు. ప్రలోభాల పర్వంగా సాగిన ఈ ఎన్నికల్లో వారిది నైతిక విజయమే కాదు‘ అని ఓ టీవీ ఛానెల్ చర్చా వేదికలో మహమేధా తెలిపారు. అయితే ఎన్ఎస్యూఐ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. విద్యార్థులు ఈసారి రాజకీయాలు కాదు.. మార్పును కోరుకున్నారు. పురోగతి కోసమే తమకు బాధ్యతలు అప్పజెప్పారు ఢిల్లీ యూనివర్సిటీ కొత్త అధ్యకుడు రాఖీ టస్సీడ్ తెలిపారు. ఇక నిరుద్యోగ నిర్మూలనలో కేంద్రప్రభుత్వం విఫలం అయినందుకే ఈ ఫలితం వెలువడిందని ఆప్ చెబుతోంది. అయితే ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు విద్యార్థులకు చాలా స్వేచ్ఛ ఉంటుందని, బీజేపీపై వ్యతిరేకత మొదలైందని చెప్పటానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని సీనియర్ పాత్రికేయుడు శేఖర్ గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. -
డూసూ ఎన్నికల్లో ఎన్ఎస్యూఐ విజయం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) విజయకేతనం ఎగురవేసింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది. ఇక ఏబీవీపీ కేవలం కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులు దక్కించుకుంది. కాగా డూసూ ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు దక్కడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. -
ఏబీవీపీ ఆందోళన: పోలీసుల లాఠీచార్జి
-
ఏబీవీపీ ఆందోళన: పోలీసుల లాఠీచార్జి
నెల్లూరు: ఏబీవీపీ విద్యార్థుల ఆందోళనతో జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు అడ్డుకుని వారిపై లాఠీచార్జి చేశారు. ఈ సంఘటనలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. -
చలో కలెక్టరేట్ ఉద్రిక్తం
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు - విద్యా రంగంలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ - అడ్డుకున్న పోలీసులు ∙ ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థుల అరెస్టులు - పోలీసుల తీరు, అరెస్టులకు నిరసనగా నేడు విద్యా సంస్థల బంద్‌కు పిలుపు సాక్షి నెట్వర్క్: విద్యారంగంలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఏబీవీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్లను ముట్టడించారు. అనుమతి లేని కార్పొరేట్ విద్యా సంస్థలను సీజ్ చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల విద్యార్థులు, ఆందోళనకారులు కలెక్టరేట్ల లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. పలు జిల్లాల్లో ఆందోళనకారులను, ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసుల వైఖరికి, అరెస్టులకు నిరసనగా గురువారం విద్యాసంస్థల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా.. బుధవారం ఉదయమే హైదరాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడు మట్ట రాఘవేందర్ ఆరోపించారు. విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమిస్తుంటే.. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం 30 యా క్ట్ను తెచ్చిందని మండిపడ్డారు. దానిని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్, నిర్మల్, రంగారెడ్డి తదితర జిల్లాల్లోనూ కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు హాజరయ్యారు. ఖమ్మం జిల్లాలో పెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ జిల్లాలో కలెక్టరే ట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. హన్మకొండలో ని ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థు లు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కొందరు విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపో యేందుకు ప్రయత్నించగా.. వారికి, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బంగారు తెలంగాణ ఇదేనా? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఫల్యం కారణంగా గ్రూప్–2, ఎస్సై, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోందని ఆందోళనల సందర్భంగా విద్యార్థులు మండిపడ్డారు. కమిషన్ చైర్మన్ చక్రపాణిని పదవి నుంచి తొలగించాలని.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందని కారణంగా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు గుర్తింపు లేకుండా బ్రాంచిలను నడుపుతూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటే విద్యార్థులు వర్షంలో తడుస్తూ ఆందోళనలు చేయడమేనా అని ప్రశ్నించారు. -
నేడు జూనియర్ కాలేజీల బంద్
కర్నూలు సిటీ: జిల్లాలో గురువారం.. జూనియర్ కాలేజీల బంద్ చేపడుతున్నట్లు అఖిల భారత విద్యార్థి పరిషత్ జిల్లా కన్వీనర్ మహేంద్ర తెలిపారు. బుధవారం స్థానిక సెంట్రల్ ప్లాజాలోని ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మారుస్తోందన్నారు. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అనుమతులు లేకుండా అనుబంధ కాలేజీలను నిర్వహిస్తున్నా.. అధికారులు తనిఖీలే చేయడం లేదన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు గణేష్, హర్ష, జయసింహ, మహేష్, రవి, గోపి, తదితరులు పాల్గొన్నారు. -
రేపు పాఠశాలల బంద్
అనంతపురం సెంట్రల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను చిన్నచూపు చూస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. స్థానిక ఏబీవీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగార్జున మాట్లాడారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు యథేచ్చగా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయన్నారు. పాఠశాలల్లో పుస్తకాలు, వస్త్ర దుకాణాలు ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు దండుకుంటున్నాయని విమర్శించారు. మరోపక్క ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. వీటిని నిరసిస్తూ ఈనెల 28న బంద్ చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఏపీబీవీ నాయకులు కిరణ్‌కుమార్, పులిరాజు, భాస్కర్, శ్రీనివాసులు, నరేష్ పాల్గొన్నారు. -
రేపు జూనియర్ కళాశాలల బంద్
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్లైన్ అడ్మిషన్లు అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం వెనుకడుగు వేయటం కార్పొరేట్ కళాశాలలకు రెడ్ కార్పెట్ పరచటమే అని ఏబీవీపీ ఆరోపించింది. కార్పొరేట్ కళాశాలల్లో ఆత్మహత్యలు, విద్యార్థుల మిస్సింగ్ లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అంతేకాక, కార్పొరేట్ కళాశాలకు అమ్ముడు పోయిన ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ అశోక్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరింది. తమ డిమాండ్ల సాధనకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతానికి ఈనెల 14వ తేదీన జూనియర్ కళాశాలల రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపు ఇచ్చింది. -
కేసీఆర్ తో కేరళ సీఎం విజయన్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్ ఆదివారం భేటీ అయ్యారు. సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా నగరానికి వచ్చిన విజయన్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. భోజన విరామం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులూ రెండు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చించారు. తెలంగాణలో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాల గురించి, ఐటీ, టూరిజం వంటి అంశాల గురించి విజయన్‌కు కేసీఆర్ వివరించారు. టీఆర్ఎస్ సర్కార్ పథకాల అమలు పట్ల విజయన్ హర్షం వ్యక్తం చేశారు. కాగా, శబరిమలలో తెలంగాణ అతిథి గృహం నిర్మాణం కోసం త్వరగా భూకేటాయింపులు చేయాలని కేరళ సీఎంను కేసీఆర్ కోరారు. ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాకను నిరసిస్తూ ఆర్టీసీ కల్యాణ మండపం దగ్గర ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేరళలో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. కేరళ సీఎం గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ఏబీవీపీ,బీజేపీలకు ఎలాంటి సంబంధం లేదు
-
బర్నింగ్ వర్శిటీస్.
-
సోషల్ ‘వార్’కు గుర్మెహర్ స్వస్తి
తనను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి ► ఢిల్లీ వర్సిటీలో ఏబీవీపీ వ్యతిరేక ర్యాలీ.. న్యూఢిల్లీ: ఏబీవీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తన ప్రచారాన్ని విరమిస్తున్నట్లు లేడీ శ్రీరాం కాలేజీ విద్యార్థిని, కార్గిల్ అమరుడి కుమార్తె గుర్మెహర్ కౌర్ మంగళవారం స్పష్టంచేసింది. ప్రచారంపై తీవ్ర వ్యతిరేకతతోపాటు అత్యాచార, హత్య బెదిరింపులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ప్రచారాన్ని విరమించుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నా ధైర్యసాహసాలను ప్రశ్నించేవారికి అవసరమైనదానికంటే ఎక్కువే సమాధానమిచ్చా’ అని ట్వీట్ చేసింది. తన కుటుంబంతో కలసి ఉండేందుకు ఆమె జలంధర్‌కు వెళ్లింది. ఆమెకు రక్షణ కల్పించాలని అక్కడి పోలీసులను ఢిల్లీ పోలీసులు కోరారు. మరోవైపు.. ఢిల్లీ వర్సిటీ నార్త్ క్యాంపస్‌లో ఏబీవీపీకి వ్యతిరేకంగా మంగళవారం జేఎన్ యూ, డీయూ, జామియా వర్సిటీలకు వందలాది విద్యార్థులు, అధ్యాపకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి గుర్మెహర్ కౌర్ గైర్హాజరైంది. కౌర్‌కు వచ్చిన బెదిరింపులకు సంబంధించి ఢిల్లీ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై.. లైంగిక వేధింపులు, బెదిరింపుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, ర్యాలీలో ఇద్దరు ఏఐఎస్ఏ విద్యార్థులపై దాడి చేశారనే ఆరోపణలపై ఇద్దరు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కౌర్ వ్యాఖ్యలపై తాను చేసిన ట్వీట్ సరదా కోసమేనని, దాన్ని అపార్థం చేసుకున్నారని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పారు. అయితే కౌర్ వ్యాఖ్యలను ఒలింపిక్ మెడలిస్ట్ యోగేశ్వర్ దత్ ఖండించారు. కౌర్, హిట్లర్, లాడెన్ ల ఫొటోలను జతచేసి దత్ పోస్ట్ చేశారు. ‘తండ్రి ఆత్మ క్షోభిస్తోంది’ కౌర్‌పై కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు విమర్శలు ఆపడం లేదు. ‘మన జవాన్లు విధుల్లో చనిపోతే వేడుక చేసుకునే వారు కౌర్‌ను తప్పుదారి పట్టిస్తున్నారు.. ఆమె తండ్రి ఆత్మ తప్పకుండా క్షోభిస్తూ ఉంటుంది’ అని అన్నారు. ‘జవాన్లు చనిపోతే లెఫ్టిస్టులు పండగ చేసుకుంటారు. వర్సిటీల్లో్ల యువతను తప్పుదారి పట్టిస్తున్నారు’ అని ఆరోపించారు. రిజిజు విమర్శలను సీపీఎం నేత సీతారాం ఏచూరి తిప్పికొట్టారు. ‘‘గాంధీని చంపాక ఎవరు పండుగ చేసుకున్నారు? ‘గాంధీ హత్య తర్వాత ఆరెస్సెస్ కార్యకర్తలు సంతోషంతో స్వీట్లు పంచారు’ అని పటేల్(తొలి హోం మంత్రి)..గోల్వార్కర్(ఆరెస్సెస్)కు 11–09–1948న చెప్పా రు’’ అని ఏచూరి ట్వీట్ చేశారు. -
ఢిల్లీ మార్చ్‌లో కన్నయ్య.. ఏబీవీపీ ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన జేఎన్‌యూ విద్యార్థి కన్నయ్యకుమార్ తిరిగి ఢిల్లీ యూనివర్సిటీలో కనిపించాడు. ఢిల్లీ యూనివర్సిటీలో అఖిలభారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నాడు. అహింస పరిస్థితులు యూనివర్సిటీల్లో నెలకొల్పాలని శాంతియుత పరిస్థితులు ఏర్పాటుచేయాలంటూ నినాదాలు చేశారు. మరోపక్క, ఏబీవీపీ విద్యార్థులు కన్నయ్య కుమార్ గోబ్యాక్ అంటూ ప్రతి నినాదాలతో హోరెత్తించారు. ఏబీవీపీ, ఏఐఎస్ఏ విద్యార్థుల మధ్య ఈ నెల 22న ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్ కాలేజీలో వివాదం రగిలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఏబీవీపీకి వ్యతిరేకంగా వివిధ కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు, టీచర్లు ఢిల్లీ యూనివర్సిటీలో నిరసన ర్యాలీలు చేపట్టారు. ఏబీవీపీ తన ఆగడాల ఆపేయాలంటూ మండిపడ్డారు. ఈ ర్యాలీలోనే కన్నయ్య పాల్గొన్నాడు. -
ఢిల్లీని వదిలి వెళ్తాను: గుర్మెహర్
న్యూఢిల్లీ: కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె, ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ తన ఆందోళనను విరమించాలని నిర్ణయించుకుంది. తనపై బీజేపీ, ఏబీవీపీతో సహా సెల్రబిటీలు కూడా తీవ్రమైన కామెంట్లు చేస్తుండటంతో తన నిరసనను ఇక్కడితే ఆపేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు మద్ధతు తెలిపిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఆందోళన విరమించకపోతే అత్యాచారం చేస్తామంటూ ఏబీవీపీ వారు తనపై బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ నుంచి గుర్మెహర్ కౌర్ ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకున్నట్లు చెప్పింది. ఈ వివాదంలో గుర్మెహర్కు అరవింద్ కేజ్రీవాల్ మద్ధతు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్మెహర్కు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గత వారం రాంజాస్ కాలేజీలో జరిగిన గొడవలపై చర్చించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ను కలిశారు. రాంజాస్ కాలేజీలో విధ్వసం సృష్టించిన ఏబీవీపీ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంగ్ గవర్నర్‌కు కేజ్రీవాల్ విజ్ఞప్తిచేశారు. గుర్మెహర్ను బెదిరించిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్ కోరారు. గుర్మెహర్ తండ్రి కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. తన తండ్రిని పాకిస్తాన్ చంపలేదని, యుద్ధం ఆయనను చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరోసారి ఆమె వివాదంలో చిక్కుకుంది. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలిద్‌ను రాంజాస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించారు. దీనిపై గత బుధవారం ఏబీవీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు విద్యార్థులు, మీడియాపై దాడికి పాల్పడగా ఈ ఘటనలో దాదాపు 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనపై గుర్మెహర్ కౌర్ గుర్మెహర్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ.. ఏబీవీపీకి భయపడేది లేదంటూ.. తనకు దేశ వ్యాప్తంగా విద్యార్థుల మద్దతు ఉందని రాసున్న ప్లకార్డుతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం మొదలైంది. రాంజాస్ కాలేజీ వివాదం.. సంబంధిత కథనాలు ట్విట్టర్ వార్‌కు తెరలేపిన సెహ్వాగ్ ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! నన్ను రేప్ చేస్తామని బెదిరించారు -
ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
బ్రేవో... గుర్మెహర్
- ఏబీవీపీ దాడులకు నిరసనగా యువతి పోరాటం - మద్దతుగా నిలబడుతున్న దేశ యువత - సోషల్ మీడియాలో వైరల్‌గా ఆమె ప్రొఫైల్ పిక్ - చంపుతామని, రేప్ చేస్తామని బెదిరింపులు - భయపడనంటున్న లేడీ శ్రీరాం విద్యార్థిని - మంగళవారం నిరసన ర్యాలీకి పిలుపు స్వతంత్ర భావాలున్న ఓ 24 ఏళ్ల యువతి ఆమె. స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించుకునే హక్కు తనకుందని, తననెవరూ భయపెట్టలేరని అంటోంది. వ్యతిరేక గళమే వినపడకూడదనే ఫర్మానాలను లెక్కచేయనంటోంది. ముప్పేటదాడి జరుగుతున్నా, బెదిరింపులు వస్తున్నా... ధైర్యంగా నిలబడి పోరాడుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడామె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. పేరు గుర్మెహర్ కౌర్. ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజి విద్యార్థిని. భిన్న అభిప్రాయాలకు, భావజాలానికి చోటులేదనే రీతిలో ఢిల్లీ వర్శిటీల్లో ఏబీవీపీ కనబరుస్తున్న ఆధిపత్య ధోరణిపై, చేస్తున్న దాడులపై సోషల్ మీడియా కేంద్రంగా పోరాటం చేస్తోంది. ‘నేను ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని. ఏబీవీపీకి భయపడను. నేను ఒంటిరిని కాదు. భారత్‌లోని ప్రతి విద్యార్థి, విద్యార్థిని నాకు తోడుగా ఉన్నారు’ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకొని ఫోటో దిగింది. ‘డీయూ వీటిని తిప్పికొట్టాలి. ‘ఏబీవీపీకి వ్యతిరేకంగా విద్యార్థులు’ అనే హ్యాష్‌టాగ్‌తో ఫేస్బుక్లో తన ప్రొఫైల్ పిక్చర్ కింద పెట్టింది. రాంజాస్ కాలేజీలో గత బుధవారం ఏబీవీపీ దాడులకు దిగిన కొద్ది గంటల్లో గుర్మెహర్ దీన్ని పోస్ట్ చేసింది. అమాయకులైన విద్యార్థులపై ఏబీవీపీ అంత దారుణంగా దాడి చేయడం కలచివేస్తోంది. ఇవి ఆగాలి. ఇది నిరసనకారుల మీద దాడి కాదు... ప్రజాస్వామ్య విలువలపై దాడి. ఈ దేశ పౌరుల స్వేచ్ఛపై, భావాలపై, విలువలపై, హక్కులపై జరిగిన దాడి... అని గుర్మెహర్ అభివర్ణించింది. ఆమె తోటి విద్యార్థులు గుర్మెహర్ ఏబీవీపీ వ్యతిరేక వ్యాఖ్యలతో ఉన్న ఫోటోను తమ ప్రొఫైల్ పిక్ కింద పెట్టుకొని మద్దతు పలికారు. అప్పటినుంచి ఇది వైరల్ అయింది. దేశవ్యాప్తంగా అన్ని యూనివర్శిటీల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది.. వేలమంది తమ ఫ్రొఫైల్ పిక్‌ను మార్చేసి గుర్మెహర్ ఫోటోను పెట్టుకున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఆమెపై దాడి మొదలైంది. చంపేస్తామని, రేప్ చేస్తామని.. అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టింగ్‌లు పెడుతున్నారు. ట్విటర్లో ఆమెను దేశద్రోహిగా చిత్రీకరిస్తున్నారు. తనకు వచ్చిన బెదిరింపులపై సోమవారం గుర్మెహర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ మహిళా కమిషన్‌ను కూడా ఆశ్రయించింది. ఆమెకు భద్రత కల్పించాలని మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. 1999లో కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ కూతురు గుర్మెహర్. భారత్-పాక్‌ల మధ్య శాంతి నెలకొనాల్సిన అవసరాన్ని చెబుతూ గతంలో ఆమె ‘పాకిస్తాన్ మా నాన్నను చంపలేదు. యుద్ధం చంపింది’ అనే పోస్ట్‌ను పెట్టింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు సోమవారం దీన్ని రీపోస్ట్ చేస్తూ... ‘ఈ అమ్మాయి బుర్రను పాడుచేస్తోంది ఎవరు? బలమైన సైనిక సంపత్తి ఉంటేనే యుద్ధం రాదు. భారత్ ఎప్పుడూ ఇతరులపై దాడి చేయలేదు. కానీ బలహీనంగా ఉన్నపుడల్లా భారత్‌పై దండయాత్రలు జరిగాయి’ అని ట్వీట్ చేశారు. స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించిన... ఎవరికీ భయపడబోనని చెప్పిన ఓ సాధారణ కాలేజీ అమ్మాయి జోలికి, అదీ అమరవీరుడి కూతురని కూడా చూడకుండా వెళ్లాల్సిన అవసరం రిజిజుకు ఏమిటి? ఆమె గతంలో ఎప్పుడో పెట్టిన పోస్ట్ వెతికితీసి... వక్రభాష్యం చెబుతూ ఆమె వెనక ఎవరో ఉన్నారనే అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేయడం ఓ కేంద్రమంత్రికి తగినదేనా? జేఎన్‌యూలో కన్హయ్య అరెస్టు, గొడవలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య-ఏబీవీపీ పాత్ర, వీసీ అప్పారావుపై కేసు అసలు కదలకపోవడం... ఇవన్నీ చూస్తుంటే అధికారం అండతోనే ఏబీవీపీ రెచ్చిపోతోందని విశ్లేషకుల అభిప్రాయం. వర్శిటీల కాషాయీకరణ అజెండా అమలవుతోందనే విమర్శలు కూడా గతంలో చాలానే వచ్చాయి. వీరూ... హిట్ వికెట్ సాధారణంగా సందర్భానుసారంగా, హాస్యస్పోరకంగా ట్వీట్లు పెట్టే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ట్వీటర్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పంచ్‌లతో కూడిన అతని ట్వీట్లు బాగా పేలుతాయి. అయితే వీరూ సోమవారం అనవసరంగా దీంట్లో వేలుపెట్టి విమర్శల పాలయ్యాడు. గుర్మెహర్ పేరు ఎక్కడా ఎత్తకున్నా... ఆమెలాగే ప్లకార్డు పట్టుకొని దానిపై ‘నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. వాటిని నా బ్యాట్ చేసింది’ అని ఫోటోదిగి ట్వీట్ చేశారు. దీన్ని సినీ నటుడు రణ్‌దీప్ హుడా రీట్వీట్ చేయడంతో ఇద్దరిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. వీరూ స్థాయికి ఇలాంటివి తగవని, హింసను ధైర్యంగా ఎదుర్కొంటున్న ఓ యువతిని హేళన చేయడమేమిటని దుయ్యబట్టారు. దాంతో రణ్‌దీప్ తగ్గాడు. ‘పాపం అభం శుభం తెలియని అమ్మాయిని రాజకీయంలో ఓ పావుగా వాడుకుంటున్నారు’ అని ట్వీట్ చేశాడు. దీనికి గుర్మెహర్ దీటుగా బదులిచ్చింది... ‘రాజకీయ పావునా? ఆలోచిస్తా. విద్యార్థులపై దాడులను నేను సమర్థించను. అది తప్పా? అని నిలదీసింది. ప్రముఖ జర్నలిస్టులు బర్కాదత్, శేఖర్ గుప్తాలు ... గుర్మెహర్కు అండగా నిలిచారు. సెహ్వాగ్, రణ్దీప్లను తప్పుబట్టారు. ‘ఆమె లోకం తెలియనిది కాదు. పావు అంతకన్నా కాదు. తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్ఛగా వెల్లడించే పరిణితిగల యువతి’ అని శేఖర్ గుప్తా ట్వీట్ చేశారు. బీజేపీకి చెందిన మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ అయితే ’1993లో జనాన్ని నేను చంపలేదు. బాంబులు చంపాయి’ అని రాసున్న ప్లకార్డును మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం పట్టుకున్నట్లుగా ట్వీట్ చేసి... గుర్మెహర్ను హేళన చేశారు. దీనిపై కూడా నెటిజన్లు విరుచుకుపడ్డారు. మీరు ఎవరైనా సరే, ఏ సంస్థకు చెందిన వారైనా... ఓ అమ్మాయిని రేప్ చేస్తామని బెదిరించలేరు. ఇది మహిళల కోసం చేస్తున్న పోరాటం. మంగళవారం ఖల్సా కాలేజీ నుంచి నిరసన ర్యాలీ చేపడతాం’ అని మహిళా కమిషన్‌ను కలిసిన తర్వాత గుర్మెహర్ వెల్లడించింది. ఎక్కడ మొదలైంది... ఢిల్లీ యూనివర్శిటీలోని రాంజాస్ కాలేజీలో ఈనెల 21, 22 తేదీల్లో ‘కల్చర్స్ ఆఫ్ ప్రొటెస్ట్’ పేరిట సెమినార్‌ను ఏర్పాటు చేసింది ఆ కాలేజీకి చెందిన సాహిత్య సొసైటి. దీనికి జేఎన్‌యూ పరిశోధక విద్యార్థి ఉమర్ ఖాలిద్‌ను, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ ఉపాధ్యక్షురాలు షేహ్లా రషీద్‌ను మాట్లాడటానికి ఆహ్వానించింది. కిందటి ఏడాది అప్పటి జేఎన్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, మరో పరిశోధక విద్యార్థి అనిర్బన్ భట్టాచార్యలతో పాటు ఉమర్ ఖాలిద్‌ను దేశద్రోహం అభియోగాలపై పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కోర్టు వీరిపై అభియోగాలను కొట్టివేసింది. అప్పట్లో జేఎన్‌యూలో జరిగిన నిరసనల్లో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని, ఉమర్, షేహ్లా రషీద్‌లు దేశద్రోహులని బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ఆరోపణ. అందుకే రాంజాస్ కాలేజీకి వీరిని పిలవడాన్ని ఏబీవీపీ వ్యతిరేకించింది. నిరసనలకు దిగింది. ఒత్తిడికి తలొగ్గిన రాంజాప్ కాలేజీ ప్రిన్సిపల్ వీరిద్దరికీ ఆహ్వానాలను ఉపసంహరించారు. పోలీసులు కూడా తాము ఉమర్‌కు రక్షణ కల్పించలేమని చేతులెత్తేశారు. దీన్ని వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీఎస్యూలు తప్పుపట్టాయి. అభిప్రాయాలను వెల్లడించుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని, దేశభక్తి పేరిట బల ప్రదర్శనకు దిగి ఏబీవీపీ తమ గొంతు నొక్కాలని చూస్తోందని షేహ్లా రషీద్ అన్నారు. ఏబీవీపీ కార్యకర్తలు గత బుధవారం దాడులకు దిగారు. రాంజాస్ కాలేజీపైకి రాళ్లురువ్వారు. భౌతిక దాడి చేయడంతో ముగ్గురు ప్రొఫెసర్లు, మీడియా ప్రతినిధులు పలువురు గాయపడ్డారు. గడిచిన ఐదారు రోజులుగా ఢిల్లీ యూనివర్శిటీ వైరి విద్యార్థి సంఘాల పోటాపోటీ నిరసనలతో హోరెత్తుతోంది. వర్శిటీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ జాతీయ పతాకంతో ఏబీవీపీ సోమవారం యూనివర్శిటీలో ర్యాలీ నిర్వహించింది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఏబీవీపీ విద్యార్ధుల తిరంగా ర్యాలీ
-
నన్ను రేప్ చేస్తామని బెదిరించారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి ఆమెకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయి. అందులో భాగంగానే.. ఏకంగా ఆమెను రేప్ చేస్తామని కూడా కొంతమంది బెదిరించారు. ఈ విషయాన్ని స్వయంగా గుర్మెహర్ కౌర్ తెలిపారు. ఢిల్లీలోని రాంజాస్ కాలేజిలో బుధవారం జరిగిన గొడవ తర్వాత.. తాను ఏబీవీపీకి భయపడనంటూ ఆమె ఒక లేఖ రాసి, ప్లకార్డుతో కూడిన ఫొటోను ఫేస్బుక్లో ఆమె అప్లోడ్ చేయడంతో, అది బాగా వైరల్ అయ్యింది. 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ మన్దీప్ సింగ్ కుమార్తె ఆమె. తనకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయినా, ఆయన ధైర్యాన్ని పుణికి పుచ్చుకుంది. సోషల్ మీడియాలో తనకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయని, తనను జాతి వ్యతిరేకిగా అందులో పలువురు తిడుతున్నారని ఆమె చెప్పారు. ఎవరైనా దాడి చేస్తామని, రేప్ చేస్తామని బెదిరిస్తే అది చాలా భయంకరంగా ఉంటుందని అన్నారు. రాహుల్ అనే వ్యక్తి తాను రాసిన కామెంటులో చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడని, తనను ఎలా రేప్ చేయాలనుకుంటున్నాడో కూడా అందులో వివరించాడని, అది చూసి చాలా భయమేసిందని గుర్మెహర్ కౌర్ తెలిపారు. గత సంవత్సరం జేఎన్‌యూలో జరిగిన ఒక ర్యాలీలో జాతి వ్యతిరేక నినాదాలు చేసి, ప్రస్తుతం రాజద్రోహ నేరం ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్‌ను రాంజాస్ కాలేజిలో జరిగిన ఒక సెమినార్‌కు ఆహ్వానించడంతో.. దాన్ని ఏబీవీపీ వ్యతిరేకించింది. ఈ సందర్భంగా మిగిలిన విద్యార్థులకు, ఏబీవీపీ వాళ్లకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై స్పందించిన గుర్మెహర్, తన ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా మార్చారు. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఆమె అందులో చెప్పారు. తాను ఒంటరిని కానని, దేశంలో ప్రతి విద్యార్థి తన వెంట ఉన్నారని అన్నారు. దాంతో ఆమెను సమర్థించేవాళ్లు, వ్యతిరేకించేవాళ్లు కూడా భారీ స్థాయిలో ఫేస్బుక్లో కామెంట్లు పెట్టారు. ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! -
ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు
ఢిల్లీ: బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి వ్యతిరేకంగా ఫేస్బుక్లో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇటీవల రాంజాస్ కాలేజిలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ.. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ విద్యార్థిని గుర్‌మెహార్ కౌర్ ఈ పోస్టు చేసింది. 'నేను ఢిల్లీ యూనివర్సిటి విద్యార్థినిని. ఏబీవీపీకి భయపడను. నేను ఒంటిరిదాన్నికాను. నాకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల మద్దతు ఉంది' అని రాసిన ప్లకార్డు చేతపట్టుకుని కౌర్ దిగిన ఫోటోను అప్లోడ్ చేసింది. జేఎన్యూకు చెందిన ఉమర్ ఖలీద్ రాంజాస్ కాలేజికి రావడానికి వ్యతిరేకిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. దీనికి నిరసనగా గుర్‌మెహార్ స్పందించింది. కార్గిల్ యుద్దంలో వీరమరణం పొందిన కెప్టెన్ మన్దీప్ సింగ్ కూతురు ఆమె. ఏబీవీపీ దాడి అమాయక విద్యార్థులకు అవాంతరం కలిగించిందని పోస్టులో పేర్కొంది. ఇది నిరసనకారులపై దాడి కాదని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అభిప్రాయపడింది. స్వేచ్చ, ఆదర్శాలు, విలువలు, పౌరుడి హక్కులపై దాడి జరిగినట్లు అభివర్ణించింది. ఈ చర్యతో ప్రతి భారత పౌరుడు బాధపడ్డాడని చెప్పింది. -
క్యాంపస్ హీట్
-
రాంజాస్ కాలేజీలో రణరంగం!
పోలీసులతో విద్యార్థుల ఘర్షణ ఉమర్ ఖలీద్‌కు ఆహ్వానంపై రగడ న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్ కాలేజీ బుధవారం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో 20మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. పలువరు జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలిద్‌ను రాజాంస్ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించడంతో గొడవ ప్రారంభమైంది. ఉమర్ ఖలీద్ రాకను వ్యతిరేకిస్తూ మంగళవారం ఏబీవీపీ విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన దిగారు. దేశద్రోహులకు ఆహ్వానాలు అందిస్తున్నారని ఆరోపిస్తూ కాలేజీపై దాడి చేశారు. దీంతో ఉమర్ ఖలీద్, షెహ్లా రషీద్ ఆహ్వానాలను కాలేజీ రద్దు చేసుకుంది. అయితే, ఏబీవీపీ ఉద్దేశపూరితంగా ఈ కార్యక్రమాలను రద్దు చేయించిందని, కాలేజీపై దాడి చేసిన ఏబీవీపీపై చర్యలు తీసుకోవాలని రాంజాస్, డీయూ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఏఐఎస్ఏ నేతృత్వంలో మౌలిస్‌నగర్ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. -
అధిక ఫీజులను అరికట్టాలని వీసీ చాంబర్ ముట్టడి
ఎంజీ యూనివర్సిటీ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నారని ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం యూనివర్సిటీ వీసీ చాంబర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నీరూటి రమేష్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేస్తున్నప్పటికీ విద్యార్థుల నుంచి బలవంతంగా కళాశాలలు ఫీజులు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పరీక్ష ఫీజులు కూడా తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా యూనివర్సిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులు లేకపోయినా, కనీస సౌకర్యాలు లేకపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పేర్కొన్నారు. క్రీడా పోటీల పేరిట యూనివర్సిటీ వసూలు చేసిన లక్షల రూపాయలు ఏం చేశారో లెక్కలు చూపాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థుల సమస్యలను వీసీ అల్తాఫ్ హుస్సేన్‌కు వివరించారు. దాంతో ఆయన మాట్లాడుతూ సమస్యలు తన దృష్టికి రాలేదని, అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా నాయకులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. దాంతో భారీ ఎత్తున పోలీసులు మొహరించారు. ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఆ తర్వాత వదిలేశారు. -
దేశాభివృద్ధిలో విద్యార్థుల మేథోసంపత్తి కీలకం
ఏబీవీపీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఇన్చార్జ్ రామ్మోహన్ అనంతపురం : దేశాభివృద్ధిలో వి ద్యార్థుల మేధోసంపత్తి కీలక మని ఏబీవీపీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఇన్చార్జ్ రామ్మోహన్ అన్నారు. రెండు రోజులు నిర్వహించే విశ్వవిద్యాలయ విద్యార్థుల మహాసభలు స్థానిక కమ్మ భవ¯న్లో ఆదివారం ప్రారంభమయ్యాయి. ము ఖ్య అతిథులుగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, రామ్మోహ¯ŒS, భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరు రమేష్, బీజీవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధ¯ŒSరెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు తిరుమలరెడ్డి, సీఆర్ఐటీ గ్రూప్ ఆఫ్ ఇన్Ü్టట్యూట్ కరస్పాండెంట్ చిరంజీవిరెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు నేడు అరాచక, విద్రోహ శక్తులను, సంఘ వ్యతిరేక శక్తులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని ఆందోâýæన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. యూనివర్శిటీల్లోని నిధులను పక్కదోవ పట్టించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. 3500 మందికి పైగా అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటి భర్తీకి ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపడంలేదన్నారు. పరిశోధనలకు నెలవు కావాల్సిన యూనివర్శిటీలు ఆ దిశగా చొరవ చూపడం లేదన్నారు. మహాసభలలో రాయలసీమ జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కరుణాకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగార్జున, జిల్లా కన్వీనర్ కష్ణ, ఎస్కేయూ ఇ¯ŒSచార్జ్ హరికష్ణలతో పాటు 18 యూనివర్శిటీల నుంచి 360 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
మహాసభల పోస్టర్లు ఆవిష్కరణ
వైవీయూ: అనంతపురంలో ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించనున్న విశ్వవిద్యాలయాల విద్యార్థుల మహాసభల పోస్టర్లను ఏబీవీపీ విశ్వవిద్యాలయ నాయకులు శుక్రవారం ఆవిష్కరించారు. వైవీయూలో ఏబీవీపీ వైవీయూ శాఖ అధ్యక్షుడు గంతి రామమోహన్ ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ మహాసభల్లో రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాయాల నుంచి విద్యార్థులు, పరిశోధకులు పాల్గొననున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో కుల, మతశక్తులకు, విద్రోహ, ఉగ్రవాదశక్తులకు వ్యతిరేకంగా, దేశాభివృద్ధిలో విశ్వవిద్యాలయాల పాత్ర గురించి ఈ సభల్లో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రవికల్యాణ్, మారుతీ, షేక్షావలీ, చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
‘ఘంటా’ దిష్టిబొమ్మ దహనం
నిర్మల్ అర్బన్: గ్రూప్-2 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఆధ్వర్వంలో శుక్రవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌక్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఓఎంఆర్ షీట్లపై ఫొటోలు వేయకపోవడం, కోడింగ్, డీకోడింగ్ లేకపోవడం, అనుభవం లేని ఇన్విజిరేటర్లు విధులు నిర్వహించారన్నారు. బయోమెట్రిక్ విధానంలో విఫలం, 40శాతం అభ్యర్థుల వేలిముద్రలు మాత్రమే తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. గ్రూప్ - 2లో కొన్ని ప్రశ్నలు నక్సలైట్ నాయకుల పేర్లను, నక్సలైట్ల ఎన్కౌంటర్, జనశక్తి సంఘాల గురించి ఉన్నాయని, దీంతో అభ్యర్థుల్లో నక్సలిజం భావాలను పెంచారని ఆరోపించారు. వెంటనే చైర్మన్ పదవి నుంచి ఘంటా చక్రపాణిని తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అజీమ్, రాకేశ్‌రెడ్డి, నిఖిల్, వినీత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
28న విశ్వవిద్యాలయాల బంద్
నెల్లూరు(అర్బన్): ఈనెల 28వ తేదీన రాష్ట్ర వ్యాపితంగా ఉన్న విశ్వవిద్యాలయాలను బంద్ చేస్తున్నామని విక్రమ సింహపురి యూనివర్సిటీ ఏబీవీపీ కార్యదర్శి దారా వెంకటేశ్వర్లు తెలిపారు. బంద్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను శుక్రవారం స్థానిక వర్సిటీ కళాశాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విశ్వవిద్యాలయాల్లో సమస్యలు పేరుకుని పోయాయని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని, ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయాలని, ప్రతి యూనివర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిన విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ పి.శివశంకర్‌ను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు జయచంద్ర, ప్రతాప్, రఘు, సురేంద్ర, నరేష్ పాల్గొన్నారు. -
ఏబీవీపీ దీక్షలో ఉద్రిక్తత
ధర్నా చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టిన పోలీసులు అంబేడ్కర్ విగ్రంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం సొమ్మసిల్లి పడిపోయిన విద్యార్థి, ఆస్పత్రి తరలింపు వీసీ హామీతో దీక్ష విరమింపజేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి, సురేంద్రరెడ్డి నెల్లూరు(టౌన్) : వీఎస్‌యూను నూతన భవనంలోకి తరలించడంతో పాటు వీసీ వీరయ్య, రిజిస్ట్రార్లపై సీబీఐ విచారణ చేపట్టాలని ఏబీవీపీ నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. దీక్ష గురువారానికి మూడోరోజుకు చేరడంతో. వీఎస్‌యూ కళాశాల విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు వీఆర్సీ కూడలిలో ధర్నా నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో వాహనాలు భారీగా నిలచిపోయాయి. 1వ పట్టణ ఎస్ఐ గిరిబాబు వచ్చి దీక్ష విరమించాలని కోరారు. దీక్ష విరమించేది లేదని చెప్పడంతో గిరిబాబు ధర్నా చేస్తున్న విద్యార్థులను బలవంతంగా అక్కడ నుంచి పంపించి వేశారు. దీంతో ఏబీవీపీ నాయకులిద్దరు ఆగ్రహాంతో పెట్రోలు బాటిళ్లతో ఆంబేడ్కర్ విగ్రహంపైకి ఎక్కి ఆత్మహాత్యాయత్నానికి ప్రయత్నించారు. కాగా దీక్షలో కూర్చున్న కౌషిక్ విద్యార్థి సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే హుటావుటిన జయభారత్ ఆస్పత్రి తరలించారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నాయకుల అరెస్టు నగర డీఎస్పీ వెంకటరాముడు సంఘటన స్థలానికి చేరుకుని ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి 4వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాయకులను దీక్ష విరమించాలని కోరగా వారు వీసీ వచ్చి హామీ ఇస్తేనే చేస్తామని చెప్పారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డిలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి డీఎస్సీతో మాట్లాడి విద్యార్థులను విడిపించారు. డీఎస్సీ వీసీ వీరయ్యకు సమాచారం అందించి పిలిపించారు. ఈ సందర్భంగా వీసీ వీరయ్య మాట్లాడుతూ మరో నాలుగు రోజుల్లో వర్సిటీని నూతన భవనంలోకి మార్చుతామని హామీ ఇచ్చారు. రిజిస్ట్రార్‌పై విచారణ జరిపించాలని గతంలోనే సీబీఐకి లేఖ రాసినట్లు చెప్పారు. దీనిపై కోటంరెడ్డి శ్రీధరరెడ్డి వీసీ వీరయ్యపై మండిపడ్డారు. గతంలో కూడా ఇదే మాటా చెప్పారని ఇప్పటి వరకు లేఖ రాయలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో అందుకు సంబంధించి కాపీలను విద్యార్థులకు అందజేస్తామని వీసీ చెప్పారు. ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఏబీపీవీ నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షవిరమింపజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ వర్సిటీ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు సాంబశివారెడ్డి, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుంటే మళ్లీ దీక్ష చేపడతామని హెచ్చరించారు. -
విశాఖ బీచ్ ఫెస్టివల్‌పై వ్యతిరేకత
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : హిందూ సంప్రదాయాలను కాలరాసే విశాఖ బీచ్ ఫెస్టివల్‌ని నిర్వహించరాదంటూ ఆదికవి నన్నయ యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. అభివృద్ధి ముసుగులో సమాజ వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టడం పాలకులకు సమంజసం కాదని యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు కె. రమణ అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు భారత దేశ సంస్కృతీసంప్రదాయాలకు విరుద్ధమని, యువతను తప్పుదారి పట్టించడమే అవుతుందన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదని నిర్వహిస్తే అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ఆర్. మహేష్, జి. శ్యామ్‌ప్రసాద్, రమణాచారి, సత్యనారాయణ, ఉదయ్‌కుమార్, దుర్గాప్రసాద్, దేవా, రమణ, అంజి, స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
వర్సిటీని నూతన భవనంలోకి మార్చాలి
నెల్లూరు (టౌన్) : విక్రమ సింహపురి యూనివర్సిటీని నూతన భవనంలోకి మార్చాలని ఏబీవీపీ వర్సిటీ శాఖ అధ్యక్షుడు సాంబశివారెడ్డి డిమాండ్ చేశారు. వర్సిటీని నూతన భవనంలోకి మార్చాలని రెండో రోజూ శుక్రవారం వీఎస్‌యూ కళాశాల బంద్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వర్సిటీ భవనం పూర్తయి రెండేళ్లు అవుతున్నా.. ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. వీసీ, రిజిస్ట్రార్ అసమర్థత వల్లే నూతన భవనంలోకి మార్చలేదన్నారు. ఇటీవల వర్సిటీకి రూ.24 కోట్లు విడుదలతో మార్గం సుగమమైందన్నారు. వర్సిటీని పట్టించుకోవాల్సిన పాలక మండలి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. వీసీ, రిజిస్ట్రార్లు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై అడిగితే ఇన్చార్జి ప్రిన్సిపల్ బెదిరింపులకు దిగుతున్నారన్నారు. వర్సిటీ భవనం మార్పుపై ఈ నెల 16న స్పష్టత ఇస్తామని హామీ ఇవ్వడంతో బంద్‌ను విరమింపజేశారు. ఽఏబీవీపీ నాయుకులు జయచంద్ర, ప్రతాప్, రఘు, చైతన్యకృష్ణ, రఫి, కిరణ్, వివేక్, నరేష్, దిలిప్ తదితరులు పాల్గొన్నారు. -
బీచ్ ఫెస్ట్‌కు వ్యతిరేకంగా ABVP ర్యాలీ
-
జనగామ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత
జనగామ: ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చిన కలక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి రావడంతో అప్రమత్తమైన పోలీసులు గేట్లు మూసివేశారు. దీంతో విద్యార్థులు అక్కడే బైఠాయించారు. ఒక దశలో విద్యార్థులు గేట్లు తెరుచుకొని లోపలికి దూసుకెళ్లడానికి యత్నించడంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. -
పాకిస్తాన్, అమెరికాలకు జాతీయత లేదు
పట్నా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎల్.నర్సింహారెడ్డి ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘జాతీయవాదం – భావవ్యక్తీకరణ’పై సదస్సు హన్మకొండ చౌరస్తా : పాకిస్తాన్, అమెరికాలకు జాతీయత లేనే లేదని, జాతీయత అంటే భారత దేశానిదని పట్నా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని సామా జగన్మోహన్రావు స్మారక భవనంలో శనివారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యం లో ‘జాతీయవాదం – భావ వ్యక్తీకరణ’ అంశంపై సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వళన చేసి సదస్సు ప్రారంభించారు. అనంతరం రావుల కృష్ణ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ వేల ఏళ్ల చరిత్రకు ఆనవాళ్లు ఇప్పటికీ మన కళ్ల ముందు కనిపిస్తుండటమే మన జాతీయతకు నిదర్శనమన్నారు. ఆయా దేశాల్లో ఎక్కడ చూసినా వేల ఏళ్ల చరిత్రకు నిదర్శనాలు కనబడవని చెప్పారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచి సంస్కృతీ సంప్రదాయాలకు కట్టుబడి ఉండటమే మనదేశం గొప్పదనమన్నారు. భారతదేశంపై దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్ మరో పదేళ్లు బతికి ఉంటే ప్రపంచాన్ని హిందూయిజంలోకి మార్చేవాడని చెప్పారు. దేశ సంస్కృతిని దెబ్బతీసేందుకు నాటి నుంచి అనేక మంది పనికట్టుకొని విషప్రచారం చేస్తున్నారని చెప్పారు. సుమతి శతకాలు, వందేమాతరం తదితరాలతో దేశభక్తిని, సంస్కృతిని చాటేలా పుస్తకాలను ముద్రించాల్సిన ప్రభుత్వం, 2006లో కేంద్ర మంత్రిగా పనిచేసిన అర్జున్‌సింగ్ సెక్స్ ఎడ్యుకేషన్ పేరిట పాఠశాల వి ద్యార్థులకు అందించే పుస్తకాలపై బూతు బొమ్మలు ముద్రించి పంపిణీ చేశారని అన్నారు. ఉపాధ్యాయినులు బోధించలేని దుస్థితిలో ఉండగా నిరసనలు వ్యక్తం కాగా వాటిని పడేశారని అన్నారు. భారత రాజ్యాం గంలో భావ స్వేచ్ఛ ఉందే తప్పా, భావహక్కు లేదన్నారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడే వ్యక్తులను దేశద్రోహులుగా గుర్తించి ప్రజలే బుద్దిచెప్పాలన్నారు. దేశంలో 30 లక్షల ఎన్జీఓలు ఉండగా వాటిలో 15లక్షలవి బోగస్ అని మన్మోహన్సింగ్ ప్రభుత్వం గుర్తించిందన్నారు. వీరసైనికులు ప్రాణా లు తెగించి జాతిని రక్షిస్తుంటే, మరికొందరు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సుఖాలు అనుభవిస్తూ దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యానిస్తున్నారు. విశిష్ట అతిథిగా హాజరైన కేయూ ప్రొఫెసర్ రంగారావు మాట్లాడుతూ దేశభక్తి, గౌరవం కలిగి ఉండటం ప్రతిపౌరుడి బాధ్యత అన్నా రు. నేటి సమాజంలో దేశాన్ని ఎంత వ్యతిరేకిస్తే అంత మేధావిగా పాపులారిటీ వస్తోందన్నారు. భారత రాజ్యాంగంలో వాక్స్వాతంత్ర్యం ఉందే తప్ప ఇష్టమొచ్చినట్లు మా ట్లాడే హక్కు లేదన్నారు. దేశ రక్షణకు, సం స్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకగా మాట్లాడితే కఠినంగా శిక్షించేలా ప్రభుత్వాలు చట్టాలు సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మేల్యే మందాడి సత్యనారాయణరెడ్డి, గుజ్జుల నర్సయ్య, ముద్దసాని సహోదర్‌రెడ్డి, మాజీ మేయర్ రాజేశ్వర్‌రావు, బీజేపీ జిల్లా అద్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, చాడ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
దేశభక్తులుగా మార్చడమే లక్ష్యం
వనపర్తి టౌన్ : కోట్లాది మంది వీరుల త్యాగఫలంగా సిద్ధించిన స్వాంత్య్రానికి భంగం వాటిల్లే ప్రమాదకారుల నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు ప్రతి పౌరుడిని చిత్తశుద్ధి కలిగిన దేశభక్తుడిగా మార్చడమే ఏబీవీసీ లక్ష్యం అని ఏబీవీపీ క్షేత్రీయ సంఘటన కార్యదర్శి రాంమోహన్‌జీ అన్నారు. శనివారం పట్టణంలో రెండు రోజులపాటు జరిగే విభాగ్ అభ్యాస వర్గ (సైద్ధాంతిక శిక్షణ తరగతుల) సమావేశాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏబీవీపీ విద్యార్థుల సమస్యలపైనే కాకుండా.. ఉద్యమాల నిర్మాణం వైపు ముందుకు సాగుతుందన్నారు. విద్యా వ్యవస్థలో విలువల పెంపునకు ఏబీవీపీ పాత్ర అమోఘమన్నారు. అంబేద్కర్ పేరుతో కమ్యూనిస్టులు రాజకీయాలు చేస్తూ మహానుభావుడి ఆశయాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తూ.. మరోపక్క వ్యక్తి నిర్మాణంతో సమాజ నిర్మాణాభివృద్ధికి ఏబీవీపీ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఖరేందర్నాథ్, జిల్లా కన్వీనర్ భరత్‌చంద్ర, నగర కార్యదర్శి వంశీ, జిల్లా మాజీ అధ్యక్షుడు రాము తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్రఘాతుకంపై విద్యార్థుల నిరసన
పోరుమామిళ్ల: కశ్మీర్ యూరి సైనిక శిబిరంపై పాక్ ముష్కరులు దాడి చేసి 17 మందిని పొట్టనపెట్టుకున్న సంఘటనకు నిరసనగా సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ‘పాకిస్థాన్ డౌన్ డౌన్’ ‘ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, అమరవీరులకు జోహార్’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఆర్టీసీ బస్టాండు వద్ద మానవ హారంగా ఏర్పాడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ డివిజన్ ఇన్చార్జి బుసిరెడ్డి మనోహరరెడ్డి, పట్టణ కార్యదర్శి చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైనచర్య అన్నారు. ప్రపంచదేశాలన్నీ ఐక్యంగా ఉగ్రవాదులను మట్టుపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నారోజు రమణాచారి, నాగేంద్రబాబు, సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ వర్సిటీ ఎన్నికలలో ఏబీవీపీ హవా
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలలో అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) యూనియన్ విజయకేతనం ఎగురవేసింది. ఢిల్లీ వర్సిటీలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ఫలితాలలో ఏబీవీపీ యూనియన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. విద్యార్థి సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలతో పాటు కార్యదర్శి సీటును ఏబీవీపీ కైవసం చేసుకోగా, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) సంయుక్త కార్యదర్శి సీటు మాత్రమే దక్కించుకోగలిగింది. దీంతో రేండేళ్ల తర్వాత ఎన్ఎస్యూఐకి ఒక్క పదవి దక్కింది. వర్సిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫొటోలతో ఏబీవీపీ ప్రచారం చేసిందని ఆరోపణలున్నాయి. ఏబీవీపీ యూనియన్ తరఫున ఉపాధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థి ప్రియాంక చౌరీ తన పేరు కలిసొచ్చేలా ప్రియాంక పోస్టర్లతో వర్సిటీలో ప్రచారం నిర్వహించారు. 2014 వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ సెక్రటరీ అభ్యర్థి నౌహీద్ సైరసీ పోస్టర్లతో ప్రచారం చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. -
కాలేజీలో హీరోయిన్ ఫొటోల హల్ చల్!
యూనివర్సిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలు ఈ నెల 9న నిర్వహించనున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ వర్గానికి చెందిన స్టూడెంట్ యూనియన్ తమ ఎన్నికల ప్రచార పోస్టర్లపై ప్రియాంక చోప్రా ఫొటోలను వినియోగించారు. అసలు విషయం ఏంటంటే.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) కు చెందిన విద్యార్థి సంఘం నాయకుడు ప్రియాంక చౌరీ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) యూనియన్ తరఫున ఉపాధ్యక్ష రేసులో ఉన్నాడు. ప్రియాంక పేరు కలిసొస్తుందని ప్రియాంక చౌరీ తమ ప్రచారం పోస్టర్లపై హీరోయిన్ ఫొటో వాడుతున్నారు. గతంలోనూ వర్సిటీ ఎన్నికల్లో భాగంగా సెలబ్రిటీల ఫొటోలతో వాల్ పోస్టర్లు అంటించారు. 'ఆల్ ద బెస్ట్ ప్రియాంక 4 ఇమ్మీస్' అని ప్రియాంక చౌరీ బ్యాలెట్ నెంబర్ 4ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ విషయంపై ఏబీవీపీ జాతీయ మీడియా కన్వినర్ సాకేత్ బహుగుణను ప్రశ్నించగా.. తాము హీరోయిన్ పోస్టర్లతో ప్రచారం చేయలేదన్నారు. 68వ ఇమ్మీ అవార్డుల్లో ప్రియాంక చోప్రా పాల్గొననున్న సందర్భంగా హీరోయిన్ ఫ్యాన్స్ వాల్ పోస్టర్స్ అంటించారని, ప్రియాంక 4 ఇమ్మీస్ అంటే ప్రియాంక ఫర్ ఇమ్మీస్ అనే అర్థమని వివరణ ఇచ్చారు. యాధృచ్ఛికంగా తమ అభ్యర్థి బ్యాలెట్ నెంబర్ 4 కావడంతో తమపై దుష్రచారం జరిగిందని ఆరోపించారు. 2014 వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ సెక్రటరీ అభ్యర్థి నౌహీద్ సైరసీ పోస్టర్లతో ప్రచారం చేసి విజయం సాధించడం గమనార్హం. -
ప్రతి విద్యార్థికి సీటు కల్పించాలి
గద్వాల : డిగ్రీ కళాశాలలో చేరడానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి సీటు కల్పించాలని ఏబీవీపీ నగర కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆన్లైన్ ప్రవేశాల కారణంగా చాలామంది విద్యార్థులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు బుధవారం కళాశాల ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ ప్రవేశాల కారణంగా పేద విద్యార్థులు అనేక మంది సక్రమంగా నమోదు చేసుకోలేదని, దీంతో వారు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వంతో చర్చించి తక్షణ ప్రవేశాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, సతీష్, నంద, ప్రసాద్, జితేందర్, మాధవ్, అనిల్, భాను, సాయి, శ్రీకాంత్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
ఏబీవీపీ బంద్ విజయవంతం
నెల్లూరు(టౌన్) : డిగ్రీ కళాశాలల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం చేపట్టిన బంద్ విజయవంతం అయిందని ఏబీవీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జగదీష్ తెలిపారు. డీకేడబ్ల్యూ విద్యార్థినులతో స్థానిక కేవీఆర్ పెట్రోలు బంకు సెంటరులో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుమతులు లేని కళాశాలలపై దాడులు నిర్వహించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జీఓనెం 35ను రద్దు చేసి ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలల్లో మౌళిక వసతులు కల్పించి క్రీడలను ప్రోత్సహించాలన్నారు. వీఎస్‌యూకు యూజీసీ 12బి గుర్తింపును ఇవ్వాలన్నారు. వర్సిటీ అక్రమాలపై సీబీఐ చేత విచారణ చేయించాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయుకులు శ్రీకాంత్, నరేష్, బాలచంద్ర, రాజేష్, పరుశురామ్, భాస్కర్, మహేష్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు డిగ్రీ కళాశాలల బంద్
ఏలూరు సిటీ : రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చిందని, దీనిలో భాగంగా జిల్లాలో బంద్‌ను జయప్రదం చేయాలని నగర సంఘటనా కార్యదర్శి ఎ.శ్రీకాంత్ తెలిపారు. స్థానిక పవర్‌పేటలోని సేవాభారతి కార్యాలయంలో సోమవారం కార్యకర్తల సమావేశం జరిగింది. బంద్‌కు కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించాలని ఆయన కోరారు. జీవో 35ను రద్దు చేయాలని, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. నాయకులు సందీప్, అనుదీప్, పవన్ పాల్గొన్నారు. -
30న డిగ్రీ కళాశాలల బంద్
నెల్లూరు (టౌన్): డిగ్రీ కళాశాలల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ నెల 30న బంద్ తలపెట్టినట్లు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీష్ తెలిపారు. శనివారం స్థానిక రామలింగాపురంలోని ఏబీవీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. యూనివర్సిటీకి తగినన్ని నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వీఎస్‌యూకు యూజీసీ 12బీ గుర్తింపు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. యూనివర్సిటీలో పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. స్కాలర్ షిప్ పేరుతో చేసే అక్రమ వసూళ్లను వెంటనే అరికట్టాలని డిమాండ్‌తో బంద్ చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో ఏబీవీపీ నాయకులు కౌశిక్, నరేష్, భరత్‌బాబు, రాజేష్, బాలచంద్ర, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల పనితీరుపై డీఈఓకు ఫిర్యాదు
ధన్వాడ : మోడల్ పాఠశాలల్లో విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల పనితీరుపై శనివారం డీఈఓకు ఫిర్యాదు చేసినట్లు ఏబీవీపీ నాయకులు విష్ణు, రాజు, కురుమూర్తి తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని ఆరోపించారు. కూరగాయల టెండర్లలో జరిగిన అక్రమాలపై, విద్యార్థులకు రావాల్సిన కాస్మొటికి చార్జీలపై విచారణ జరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
అమ్మాయిలపై దాడులు అరికట్టాలి
సదాశివపేట: నీకు నేను రక్ష- నాకు నీవు రక్ష, మనం అందరం కలిసి దేశానికి ధర్మానికి, సంస్కృతికి రక్ష అని ఏబీవీపీ ఎస్ఎఫ్డీ జిల్లా కన్వీనర్ మహేశ్‌స్వామి పేర్కొన్నారు. ఏబీవీపీ పట్టణశాఖ అధ్వర్యంలో శనివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్ష బంధన్ నిర్వహించారు. కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఏబీవీపీ నాయకులకు రాఖీలు కట్టి రక్ష బంధన్ నిర్వహించారు. అనంతరం కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఒకరినోకరులు రాఖీలు కట్టుకుని అనందించారు. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి ప్రత్యేకతను మహేశ్‌స్వామి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు జగదీశ్వర్, లచ్చయ్య, పవన్‌కుమార్, విద్యాసాగర్ పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో.. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ దస్తగిరికి విద్యార్థులు రాఖీలు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్, కళాశాల కమిటీ నాయకులు నవీన్, నర్సింలుకు విద్యార్థులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఐక్యత, స్నేహభావాలను పెంపొందించడం కోసం తాము నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. కులమత బేధం లేకుండా అందరు సంతోషంగా జరుపుకునే పండుగ రక్షాబంధన్ అని తెలిపారు. రక్షాబంధన్ స్ఫూర్తితో అమ్మాయిలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం ఆరికట్టాలని, ఎస్ఎఫ్ఐ కళాశాల కమిటీలు వారికి రక్షణగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ దస్తగిరి, కళాశాల కమిటీ నాయకులు కళావతి, ముబిన, నవీన్, శ్రీను, నర్సింలు, శ్యామలా, మాధవి,మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ నిరసన
ఆదిలాబాద్ టౌన్ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణచౌక్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జోనల్ ఇన్చార్జి ప్రశాంత్ మాట్లాడుతూ డిగ్రీలో ఆన్లైన్ విధానంపై విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల సీట్లు మిగిలిపోయాయన్నారు. దరఖాస్తు చేసుకోని విద్యార్థులకు నష్టం కలగకుండా స్పాట్ ఆడ్మిషన్లు నిర్వహించాలన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. వసతిగృహల్లో ఉంటున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎంసెట్–2 లీకు సంబంధించి సీబీఐ విచారణపై చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కర్ణద్వైత్, అనిల్, ప్రమోద్, నిఖిల్, శివ, శశికాంత్, అరుణ్, చందు, సుజత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ విద్యార్థులకు న్యాయం చేయాలి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జిల్లా కన్వీనర్ కరుణాకర్‌రెడ్డి చేవెళ్ల: డిగ్రీలో ఇప్పటివరకు ప్రవేశం పొందని సుమారు రెండు లక్షల మందికి ప్రభుత్వం న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జిల్లా కన్వీనర్ జే.కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై ఆయన మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. డిగ్రీలో ప్రవేశంకోసం ప్రభుత్వం 2016-17 ఈ విద్యాసంవత్సరం నుంచి మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో ప్రవేశాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు ఫేజ్-1, ఫేజ్-2 కౌన్సెలింగ్ నిర్వహించినా ఇప్పటికీ రెండు లక్షల మందికి ప్రవేశాలు లభించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఇంకా చాలావరకు సీట్లు ఖాళీగానే ఉన్నాయని తెలిపారు. ఇటు సీట్లు భర్తీకాక, అటు విద్యార్థులకు ప్రవేశంలేక డిగ్రీ విద్యా విధానం ఆగమ్యగోచరంగా తయారైందని చెప్పారు. డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్ భర్తీ విధానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం దానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదన్నారు. ఆన్లైన్ విధానంలో తమపేర్లు నమోదు చేసుకునే విధానం తెలియక 2లక్షల మంది ఇంకా ప్రవేశాలకోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిగ్రీలో ప్రవేశంకోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు. అంతేకాకుండా ఆన్లైన్లో దరఖాస్తు, ప్రవేశాలు, తదితర అంశాల్లో అవగాహన కోసం ప్రభుత్వం సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. -
ఆమ్నేస్టీ సంస్థపై రాజద్రోహం కేసు
బెంగళూరు: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ (ఆమ్నేస్టీ)పై కర్ణాటకలో రాజద్రోహం కేసు నమోదు అయింది. కశ్మీర్లో మానవ హక్కులపై అమ్నేస్టీ సంస్థ శనివారం బెంగళూరులో సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో కశ్మీరీలు ఆజాదీ నినాదాలు చేశారు. దీంతో అమ్నేస్టీ సదస్సు జాతి వ్యతిరేకమంటూ ఏబీవీపీ ఫిర్యాదు చేసింది. దేశానికి వ్యతిరేకంగా కొందరు ప్రసంగాలు చేశారని ఏబీవీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అమ్నెస్టీ సంస్థతో పాటు మరికొందరిపై కర్ణాటక పోలీసులు సోమవారం రాజద్రోహం కేసు నమోదు చేశారు. కాగా తమకు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ అందలేదని ఆమ్నేస్టీ కర్ణాటక విభాగం తెలిపింది. -
కడియం, లక్ష్మారెడ్డిలను బర్తరఫ్ చేయాలి : ఏబీవీపీ
హైదరాబాద్: ఎంసెట్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి బాధ్యతగా మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను వెంటనే బర్తరఫ్ చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. శనివారం సచివాలయం ముట్టడి కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున వచ్చిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. ఎంసెట్-2 రద్దు చేసి ఎంసెట్-3ని నిర్వహిస్తామనడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. దోషులను వదిలేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదని హితవుపలికారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి బాధ్యులను చేస్తూ.. విద్యా మంత్రి కడియం శ్రీహరి, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, కమిషనర్ రమణారావులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీ వెనుక మంత్రులు, వారి బంధువుల పాత్రపై కూపీ లాగి వారికి శిక్షపడే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మట్ట రాఘవేంద్ర, దిలీప్ నాయకులు జగన్, నర్సింహ, వేణు, ఎల్లస్వామి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రులు రాజీనామా చేయాలి
సంగారెడ్డి మున్సిపాలిటి: ఎంసెట్ పేపర్2ను ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఏబీవీపీ రాష్ట్ర కమిటగీ పిలుపు మేరకు పట్టణంలోని విద్యాసంస్థల్లో తరగతుల బహిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అనిల్‌రెడ్డి మాట్లాడుతూ ఎంసెట్ వంటి కీలక ప్రవేశ పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రశ్నపత్రం లీకేజీ అయ్యిందని ఆరోపించారు. ప్రశ్నపత్రం లీకేజీ వెనక ప్రభుత్వ హస్తం ఉందని విమర్శించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రితోపాటు వైద్యశాఖ మంత్రిలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. ఎంసెట్ ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులను పట్టుకొని ప్రభుత్వం ర్యాంకులు సాధించిన వారిని ద్రోహులుగా చిత్రీకరించి పోలీసు వాహనాల్లో తరలించడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇప్పటికే విద్యార్థులు ఉద్యోగాలకోసం పలు అర్హత పరీక్షలు రాసి మానసికంగా ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ఎంసెట్ పరీక్షను రద్దుచేయడం విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీయడమేనన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్రకార్యవర్గ సభ్యులు నెహ్రూ రాథోడ్, జోనల్ ఇన్చార్జిచార్జ్ అశోక్, నాయకులు విఠల్, శ్రీకాంత్, అభిలాష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో.. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ అయిందని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి ఆరోపించారు. శనివారం సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ఎదుట ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులైన నిందులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. ఎంసెట్ పరీక్షను రద్దుచేయకుండా అందుకు బాధ్యులైన విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఎంసెట్‌పై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతోనే ప్రశ్నపత్రం లీక్ అయిందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఏబీవీపీ బంద్ ఉద్రిక్తం
– ప్రియదర్శిని కళాశాలలో కరస్పాండెంట్, ఏబీవీపీ నాయకుల ఘర్షణ –హుజూర్‌నగర్‌లో ఘటన హుజూర్నగర్ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ పట్టణంలో ఉద్రిక్తంగా మారింది. ఏబీవీపీ నాయకులు కళాశాలలను బంద్ చేయించే క్రమంలో స్థానిక ప్రియదర్శినీ జూనియర్ కళాశాలలో కరస్పాండెంట్ పశ్య శ్రీనివాసరెడ్డి, ఏబీవీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.కళాశాలను బంద్ చేయాలని ఏబీవీపీ నాయకులు కరస్పాండెంట్‌ను కోరగా అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన ఏబీవీపీ నాయకులు కళాశాలలోకి ప్రవేశించి బంద్‌కు సహకరించాలని విద్యార్థులను కోరారు. దీంతో విద్యార్థులు బయటకు వస్తున్న విషయం తెలుసుకున్న కరస్పాండెంట్ అక్కడకు వచ్చి విద్యార్థులను తరగతి గదుల్లోకి వెళ్లాలని ఆదేశించారు. అంతేగాక ఏబీవీపీ నాయకులను కళాశాల నుంచి బయటకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో అధ్యాపకులు ఘర్షణను నివారించగా ఏబీవీపీ నాయకులు కళాశాల ప్రధాన గేటు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కోకన్వీనర్ అనంతు కరుణాకర్ మాట్లాడుతూ విద్యా సంస్థల బంద్‌కు సహకరించాలని తాము కోరగా కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి మాపై కర్రలతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కరస్పాండెంట్ వివరణ కళాశాలలు బంద్ చేయాలంటూ పదే పదే రావద్దని, ఈ ఒక్కసారి మాత్రమే బంద్ చేస్తామని అందుకు అంగీకరిస్తూ హామీ పత్రం రాసిస్తే వారికి సహకరిస్తానని చెప్పాను. అందుకు వారు నిరాకరిస్తూ కళాశాలలోకి వెళ్లి విద్యార్థులను బయటకు పంపించారు. దీంతో పాటు తాగునీటి కుండను పగులకొట్టడంతోనే వారిని కళాశాల నుంచి బయటకు పంపాన్నారు. ఏబీవీపీ నాయకులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
బస్సుల కోసం విద్యార్థుల రాస్తారోకో
దుబ్బాక: ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచి సమయానుకూలంగా నడపాలని డిమాండ్ చేస్తూ పెద్ద గుండవెల్లి విద్యార్థులు మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో సిద్దిపేట–తిమ్మాపూర్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సకాలంలో బస్సులు రాకపోవడంతో తాము తరగతులకు హాజరుకాలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలు మార్లు ఆర్టీసీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం దుబ్బాక డిపో వద్దకు వచ్చి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు దొడ్ల శ్రీకాంత్, గూడ శ్రీకాంత్, రాజు, పర్శరాములు, దిలీప్, అజయ్, మహేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ కళాశాలలపై తనిఖీలు చేయాలి
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో గుర్తింపు లేకుండానే ప్రవేశాలు నిర్వహిస్తున్న డిగ్రీకళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వైవీయూలోని పరిపాలనా భవనంలోని రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గుడిపాటి సుబ్బరాజు మాట్లాడుతూ కళాశాలలు ప్రారంభమై నెలరోజులు పూర్తవుతున్నా నేటికీ చాలా కళాశాలలు గుర్తింపు తీసుకోకుండానే తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. విశ్వవిద్యాలయ అధికారులు సైతం తనిఖీలు చేపట్టకుండా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. కళాశాలలు ప్రారంభం కాకముందే తనిఖీలు చేపట్టి అర్హత కలిగిన ళాశాలలకు గుర్తింపు నివ్వాల్సి ఉన్నా అధికారులు అదిశగా చర్యలు చేపట్టలేదన్నారు. ప్రైవేట్ కళాశాలలో అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలహీనం చేస్తున్నారన్నారు.ప్రైవేట్ కళాశాలల్లో పక్కా భవనాలు లేకున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ల్యాబ్‌లు, గ్రంథాలయం, మరుగుదొడ్లులతో పాటు కనీస మౌలిక సదుపాయాలు లేని కళాశాలలు సైతం వేలాది రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థులను దోచుకుంటున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడి డిగ్రీ కళాశాలలపై తనిఖీలు చేపట్టి అర్హత ఉన్న వాటికి గుర్తింపునివ్వాలని లేనివాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య వై. నజీర్‌అహ్మద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ గంపా సుబ్బరాయుడు, రవికల్యాణ్, సాయి, వంశీ, ప్రసాద్‌బాబు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేడు రాష్ట్ర బంద్‌కు ఏబీవీపీ పిలుపు
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని.. ఎంసెట్-2 పేపర్ లీకేజీకి బాధ్యులైన మంత్రులు, ఎంసెట్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. -
ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో
బెజ్జూర్ : విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన ర హదారిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు పోరాటాన్ని ఆపేది లేదని ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే తేవాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి, జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల నియామకాన్ని వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ వసతి గహాల్లో పెరిగిన ధరకు అనుగుణంగా చార్జీలు ఇవ్వాలన్నారు. గంట పాటు రోడ్డుపై విద్యార్థులు బైఠాయించడంతో పోలీసులు అక్కడకు చేరుకొని రాస్తారోకోను అడ్డుకున్నారు. అనంతరం విద్యార్థులు తహసీల్దార్ రఫతుల్లాకు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు బాలకష్ణ, కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు.