అనంతపురంలో ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించనున్న విశ్వవిద్యాలయాల విద్యార్థుల మహాసభల పోస్టర్‌లను ఏబీవీపీ విశ్వవిద్యాలయ నాయకులు శుక్రవారం ఆవిష్కరించారు. వైవీయూలో ఏబీవీపీ వైవీయూ శాఖ అధ్యక్షుడు గంతి రామమోహన్ ఆధ్వర్యంలో పోస్టర్‌లను ఆవిష్కరించారు.
వైవీయూ: అనంతపురంలో ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహించనున్న విశ్వవిద్యాలయాల విద్యార్థుల మహాసభల పోస్టర్‌లను ఏబీవీపీ విశ్వవిద్యాలయ నాయకులు శుక్రవారం ఆవిష్కరించారు. వైవీయూలో ఏబీవీపీ వైవీయూ శాఖ అధ్యక్షుడు గంతి రామమోహన్ ఆధ్వర్యంలో పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ మహాసభల్లో రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాయాల నుంచి విద్యార్థులు, పరిశోధకులు పాల్గొననున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో కుల, మతశక్తులకు, విద్రోహ, ఉగ్రవాదశక్తులకు వ్యతిరేకంగా, దేశాభివృద్ధిలో విశ్వవిద్యాలయాల పాత్ర గురించి ఈ సభల్లో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రవికల్యాణ్, మారుతీ, షేక్షావలీ, చంద్ర తదితరులు పాల్గొన్నారు.