30న డిగ్రీ కళాశాలల బంద్
నెల్లూరు (టౌన్): డిగ్రీ కళాశాలల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ నెల 30న బంద్ తలపెట్టినట్లు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జగదీష్ తెలిపారు. శనివారం స్థానిక రామలింగాపురంలోని ఏబీవీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. యూనివర్సిటీకి తగినన్ని నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వీఎస్‌యూకు యూజీసీ 12బీ గుర్తింపు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. యూనివర్సిటీలో పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. స్కాలర్ షిప్ పేరుతో చేసే అక్రమ వసూళ్లను వెంటనే అరికట్టాలని డిమాండ్‌తో బంద్ చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో ఏబీవీపీ నాయకులు కౌశిక్, నరేష్, భరత్‌బాబు, రాజేష్, బాలచంద్ర, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.