విశాఖ బీచ్ ఫెస్టివల్‌పై వ్యతిరేకత
Published Tue, Nov 15 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) :
హిందూ సంప్రదాయాలను కాలరాసే విశాఖ బీచ్ ఫెస్టివల్‌ని నిర్వహించరాదంటూ ఆదికవి నన్నయ యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. అభివృద్ధి ముసుగులో సమాజ వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టడం పాలకులకు సమంజసం కాదని యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు కె. రమణ అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు భారత దేశ సంస్కృతీసంప్రదాయాలకు విరుద్ధమని, యువతను తప్పుదారి పట్టించడమే అవుతుందన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదని నిర్వహిస్తే అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ఆర్. మహేష్, జి. శ్యామ్‌ప్రసాద్, రమణాచారి, సత్యనారాయణ, ఉదయ్‌కుమార్, దుర్గాప్రసాద్, దేవా, రమణ, అంజి, స్వామి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement