beach festival
-
ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో బీచ్ ఫెస్టివల్
-
గోవా బీచ్ ఫెస్టివల్ విషాదం
-
ముగిసిన బీచ్ వాలీబాల్ పోటీలు
-
తవ్వేకొద్దీ అక్రమాలు
నిబంధనలకు నీళ్లొదిలారు.. అడ్డగోలు వ్యవహారానికి తెర తీశారు. రూపాయి ఖర్చు చేసే చోట వంద పెట్టారు.. అందిన కాడికి దోచుకోవాలని భావించారు. ఇష్టానుసారంగా బిల్లులు పెట్టేశారు. ఈ దోపిడీ వ్యవహారంపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో అక్రమార్కులు అవాక్కయ్యారు. స్పందించిన కలెక్టర్ బి.లక్ష్మీకాంతం సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ అధికారులుగా జేసీ విజయకృష్ణన్, డీఆర్వోను నియమించారు. సమగ్ర విచారణ జరిగి నిజానిజాలు తేలేవరకు బిల్లులు చెల్లించకూడదని ఆదేశించారు. విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విచారణలో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగుచూస్తున్నాయి. సాక్షి, మచిలీపట్నం: జూలై 9, 10, 11 తేదీల్లో మంగినపూడి బీచ్ వద్ద బీచ్ ఫెస్టివల్ నిర్వహిం చారు. ఆహ్లాదం పేర దోపిడీ పర్వానికి తెర తీశా రు. స్టేజ్ ఏర్పాటు నుంచి లైటింగ్, ఆఖరికి నీళ్లు ఇవ్వకపోయినా ఇచ్చినట్లు రూ.లక్షల్లో బిల్లులు పెట్టారు. ఈ అక్రమ తంతుపై ‘సాక్షి’లో ‘బీచ్ ఫెస్టివల్ దోపిడీ’, ‘బీచ్.. లెక్కలన్నీ తూచ్’ శీర్షికన వ రుస కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పటి నుంచి సాగుతున్న విచారణ.. ప్రస్తుతం ఓ కొలిక్కి వస్తోంది. ఒక్కో బిల్లు వారీగా లోతైన విచారణ జరుగుతుండటంతో తమ బిల్లుల్లో ఎక్కడ కోత పడుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్వో చాంబర్లో డీఆర్వో లావణ్యవేణి, ఆర్డీఓ ఉదయభాస్కర్‌రావు బిల్లుల బాధితులతో ఇంటర్వ్యూలు నిర్వహించి బిల్లులకు సంబంధించి ఆరా తీశారు. ఒక్కో కుండీ రూ.12 వేలు పైమాటే బీచ్ ఫెస్టివల్లో భాగంగా రహదారులకు ఇరువైపులా మొక్కలు ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టు అప్పగించారు. ఒక్కో కుండీకి రూ.12 వేలకు పైగా బిల్లు పెట్టారు. ఇలా 1060 కుండీలకు గాను రూ.13 లక్షలు చెల్లించారు. ఈ విషయమై అధికారులు సదరు కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. కుండీలు అంత ధర పలుకుతాయా? వర్క్ఆర్డర్ లేకుండా ఎలా పనులు చేపట్టారు? అన్ని మొక్కలు పెట్టాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించినట్లు సమాచారం. వెలుగుల మాటున మాయ! బీచ్ ఫెస్టివల్ నిర్వహించిన మూడు రోజుల పాటు విద్యుత్ వెలుగులకు రూ.38 లక్షలు వెచ్చించారు. ఒక లైట్ పెట్టేచోట అన్ని లైట్లు ఎందుకు ఏర్పాటు చేశారు? ఎవరు పెట్టమని చెప్పారు? మూడు రోజులకు అంత మొత్తం ఎందుకు అవుతుంది? అని ప్రశ్నించారు. ముడా అధికారులు బాగా చేయాలని చెప్పడంతో పెట్టామని సదరు కాంట్రాక్టర్లు సమాధానం చెప్పినట్లు తెలిసింది. ప్రకటనల పేరుతో పక్కదారి బీచ్ ఫెస్టివల్ కార్యక్రమానికి సంబంధించి నాలు గు టీవీ ఛానళ్లకు (సాక్షి కాదు) ప్రకటనలు ఇచ్చి నట్లు బిల్లులు పెట్టారు. ఆ బిల్లులు సైతం కంపెనీ పేరు మీద కాకుండా ఓ యాడ్ ఏజెన్సీ పేరుమీద పెట్టారు. సదరు ఏజెన్సీ నిర్వాహకుడిని పిలిచి ఎలాంటి ప్రకటనలు ప్లే చేశారని ప్రకటించగా.. స్క్రోలింగ్ వేశామని సమాధానమిచ్చారు. స్కో లింగ్ ఒక్కో చానల్‌కు రూ.1.60 లక్షలు అవుతుం దా? అని అధికారులు ప్రశ్నించారు. యాడ్స్ ప్లే చేసినట్లు ఆధారాలు తీసుకురావాలని కోరగా.. నిర్వాహకుడు తెల్లమొహం వేసినట్లు తెలిసింది. యూట్యూబ్‌కు రూ.56 వేలా? విజయవాడకు చెందిన ఫేస్బుక్ అనుబంధంతో కూడిన ఓ యూట్యూబ్ చానల్‌కు ఏకంగా రూ.56 వేలు చెల్లించారు. ఆ ఛానల్లో వీడియో ఎప్పుడు ప్లే అయ్యిందో తెలియని పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా ఫ్లెక్సీలకు రూ.10 లక్షలు వెచ్చించినట్లు బిల్లులు పెట్టారు. మూడు రోజుల పాటు కూల్ ప్యూరిఫైడ్ వాటర్ సరఫరా చేసినట్లు రూ.9 లక్షలు బిల్లులు పెట్టారు. ఐడీ కార్డులకు రూ.70 వేలు, డివైడర్ల మధ్య, పూల కుండీలకు మట్టి తోలినట్లు రూ.లక్షల్లో బిల్లులు పెట్టేశారు. అంతా కమీషన్ల వ్యవహారమే అక్రమ బిల్లుల వెనుక అంతా కమీషన్ల వ్యవహారం నడిచినట్లు సమాచారం. బీచ్‌లో మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన స్టేజ్‌కు రూ.40 లక్షలు బిల్లు పెట్టారు. అధికారులపై గుర్రు బీచ్ ఫెస్టివల్లో బిల్లులు పెట్టిన వారిని శుక్రవారం డీఆర్వో ఛాంబర్‌కు పిలిపించి విచారించారు. అందులో ఎందుకు అంత మొత్తం బిల్లు పెట్టారు?, వర్క్ ఆర్డర్ లేకుండా ఎలా చేశారు? అసలు కొటేషన్లు సైతం నామమాత్రంగా ఎందుకు వేయించారు? అన్న ప్రశ్నలు సంధించారు. బిల్లుల్లో కొంచెం తగ్గిస్తే మంజూరవుతుందని అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే సమగ్ర విచారణ నిర్వహిస్తే మరిన్ని నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. బిల్లులు పరిశీలించిన అధికారులు తాము పనులకు తగ్గ బిల్లులు పెట్టామని ఎక్కువగా చేయలేదని పేపర్ మీద రాయించుకుని పంపించివేశారు. -
భారీ భూకంపం.. 400 మంది మృతి
జకార్తా/పలూ: ఇండోనేసియాపై మరోసారి ప్రకృతి పగబట్టింది. 2004 నాటి సుమత్రా సునామీ దుర్ఘటనను, రెండు నెలల క్రితం నాటి భూకంపాన్ని మరిచిపోకముందే మరోసారి భూకంపం, సునామీ రూపంలో ప్రకృతి కన్నెర్రజేసింది. సులవేసి ద్వీపంలోని పలూ పట్టణంలో దేశ, విదేశీ పర్యాటకులు బీచ్ ఫెస్టివల్‌కు సిద్ధమవుతున్న తరుణంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం, ఆ వెంటనే 4–6 మీటర్ల ఎత్తు రాకాసి అలలతో సునామీ విరుచుకుపడటంతో 400 మంది మృతిచెందారు. వంద మందికిపైగా గల్లంతయ్యారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆసుపత్రులు కూలిపోవడంతో ఆరుబయటే క్షతగాత్రులకు చికిత్సనందిస్తున్నారు. సముద్రతీరంలోని పలూ పట్టణం దాదాపుగా నేలమట్టమైంది. సహాయ కార్యక్రమాలను ప్రారంభించిన సైన్యం, అధికారులకు ఎటు చూసినా శవాల గుట్టలే కనబడుతున్నాయి. బీచ్‌లో ఇసుకలో కూరుకుపోయి సగం బయటకు కనబడుతున్న మృతదేహాలే దర్శనమిస్తున్నాయి. శనివారం రాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం 384 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూ ఉపరితలానికి పదికిలోమీటర్ల లోతులో శుక్రవారం సాయంత్రం సమయంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కాగా, సునామీ బారిన పడిన ఇండోనేసియాను ఆదుకుంటామని ఐక్యరాజ్య సమితి ప్రసంగంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. హృదయ విదారక దృశ్యాలు భూకంపం తీవ్రతకు చాలాచోట్ల ఇళ్లు కూలిపోవడంతో శిథిలాల్లో చిక్కుకుని పలువురు చనిపోగా వేల మంది క్షతగాత్రులయ్యారు. ఆసుపత్రులూ కూలడంతో ఆసుపత్రుల ఆరుబయటే చికిత్సనందిస్తున్నారు. బీచ్‌లో కూరుకుపోయిన వారు కొందరైతే.. అలల ధాటికి కొట్టుకొచ్చి బలమైన గాయాలతో చనిపోయిన వారు మరికొందరు. బురదలో కూరుకుపోయిన ఓ చిన్నారి మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు తీసి బంధువులకు అప్పజెబుతున్న దృశ్యాలు కంటతడిపెట్టించాయి. నిరాశ్రయులు లక్షల్లోనే.. భూకంపం తాకిడికి ఇళ్లన్నీ కూలి వేల మంది నిరాశ్రయులయ్యారు. భూమి కంపిస్తున్న సమయంలో స్థానికులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లు, రిసార్టులనుంచి బయటకు పరుగులు తీస్తున్న సమయంలోనే సునామీ విరుచుకుపడింది. సముద్ర తీరంలో ఉన్న ఓ మసీదు ఉవ్వెత్తున ఎగిసిపడిన అలల ధాటికి ధ్వంసమవగా.. సమీపంలోని ఇళ్లలోకి కార్లు, ఇతర వాహనాలు చొచ్చుకొచ్చాయి. ఓ ఎత్తైన భవనంపై ఏర్పాటుచేసిన సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. రోడ్లు, వీధి దీపాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఈ పట్టణమంతా శుక్ర, శనివారాల్లో రాత్రంతా చీకట్లోనే మగ్గింది. ‘అలలు అంతెత్తున ఎగసిపడుతుండటాన్ని చూసి పరిగెత్తాను. అందుకే ప్రాణాలు కాపాడుకోగలిగాను’ అని ఓ స్థానికుడు పేర్కొన్నారు. రంగంలోకి సైన్యం ఈ ఏడాది జూలై, ఆగస్టులో లోంబోక్ ద్వీపంలో వచ్చిన దానికంటే ఈసారి వచ్చిన భూకంప తీవ్రతే ఎక్కువని అధికారులు తెలిపారు. కాగా, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సైన్యాన్ని రంగంలోకి దించారు. విద్యుత్, సమాచార వ్యవస్థతోపాటు మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే పనిలో సైన్యం ఉంది. శనివారం కూడా పలూలో భూమి పలుమార్లు స్వల్ప తీవ్రతతో కంపించింది. కాగా పలూకు సమీపంలోని దొన్గాలా ప్రాంతంపైనా సునామీ విరుచుకుపడినట్లు సమాచారం అందిందని.. అయితే అక్కడి పరిస్థితేంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. ‘భూకంపం, సునామీల బాధితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉండటం బాధ కలిగించింది. నీటి తీవ్రతకు కొట్టుకుపోయారని ప్రత్యక్షసాక్షులు, అధికారులు చెబుతున్నారు’ అని సేవ్ ద చిల్డ్రన్ ఎన్జీవో చీఫ్ టామ్ హోవెల్ పేర్కొన్నారు. పలూ పట్టణానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు కూడా వారి ప్రాంతాల్లో ఒకసారి భారీ కుదుపు వచ్చిందని పేర్కొన్నారంటే భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమత్రాలో మొదలై.. ప్రపంచంలోని అద్భుతమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటైన ఇండోనేసియాపై 2004 నుంచి ప్రకృతి పగబట్టింది. ఆ ఏడాది బాక్సింగ్ డే (డిసెంబర్ 26) సంబరాల్లో పర్యాటకులు ఉన్నపుడు 9.3 తీవ్రతతో వచ్చిన భూకంపం, ఆ తర్వాత 24 మీటర్ల ఎత్తులో వచ్చిన రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఇండోనేసియా వ్యాప్తంగా లక్షా 68వేల మంది చనిపోయారు. నాటి సునామీ భారత్‌సహా పలు దేశాలపై ప్రభావాన్ని చూపింది. 2005 మార్చిలో 8.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 900 మంది చనిపోయారు. 2006 మేలో జావా ద్వీపంలో వచ్చిన భూకంపం 6వేల మందిని బలిగొంది. 2009లో సుమత్రా ప్రధాన ఓడరేవైన పడాంగ్‌లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం 1,100 మందిని చంపేసింది. ఆ తర్వాత అడపా దడపా వచ్చిన భూకంపం, సునామీలు ఇండోనేసియాపై విరుచుకుపడుతూ వందల సంఖ్యలో ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. రవాణా వ్యవస్థ ధ్వంసం పలూ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఓ భారీ బ్రిడ్జి ధ్వంసమైంది. ఈ నగరానికి మిగిలిన ప్రపంచంతో అనుసంధానం చేసే రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. కొండచరియలు పడి దార్లు మూసుకుపోయాయి. ప్రార్థనలకోసం తీరంలోని మసీదుకు వచ్చిన వారు మొదట భూమి కంపించగానే పరుగులు తీశారు. అంతలోనే వరుసగా భూమి కంపించడంతో చాలా మంది మసీదు శిథిలాల కింద చిక్కుకుపోయి మరణించినట్లు తెలుస్తోంది. బురదలో కూరుకుపోయిన చిన్నారి మృతదేహాన్ని తరలిస్తున్న సహాయక సిబ్బంది దాదాపు పూర్తిగా నేలమట్టమైన పలూ నగరంలోని ఆస్పత్రి ఆవరణలో చికిత్స పొందుతున్న భూకంప బాధితులు -
విచారణ ‘బీచ్’లోకేనా?!
సాక్షి, మచిలీపట్నం : మసూల బీచ్ ఫెస్టివల్ పేర అక్రమాలకు ఆజ్యం పోశారు. అందినకాడికి దోచుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అనుకున్నదే తరువాయి దోపిడీ పర్వానికి పావులు కదిపారు. ఏకంగా రూ.కోట్లు దోపిడీకి తెగబడ్డారు. చేయని ఖర్చుకు బిల్లులు పెట్టి కోట్లు నొక్కేందుకు తెర తీశారు. అక్రమ బాగోతంపై ‘సాక్షి’లో ‘బీచ్ ఫెస్టివల్ దోపిడీ’, ‘బీచ్ లెక్కలన్నీ తూచ్’ శీర్షికలతో వరుస కథనాలు ప్రచురితం కావడంతో రాజకీయ, అధికార వర్గాల్లో కలకలం రేగింది. మొక్కల పేరుతో రూ.60 లక్షలు బిల్లులు పెట్టి రూ.50 లక్షలు స్వాహా చేసేందుకు సిద్ధమైన వైనాన్ని, మూడు రోజుల పాటు స్టేజ్ నిర్మాణానికి రూ.9 లక్షలు వెచ్చించాల్సి ఉండగా, రూ.40 లక్షలకు పైగా బిల్లులు పెట్టిన తంతును బహిర్గతం చేయడంతో స్పందించిన కలెక్టర్ లక్ష్మీకాంతం అక్రమాలపై విచారణ నిర్వహించాలని జేసీ విజయకృష్ణన్‌ను నియమించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. అనూహ్యంగావిచారణ అధికారి మార్పు.. బీచ్ ఫెస్టివల్ దోపిడీ పర్వంపై విచారణకు తొలుత జేసీ విజయకృష్ణన్‌ను నియమించారు. ఆమె తనదైన శైలిలో విచారణకు ఉపక్రమించారు. అక్రమ తంతులో ఎవరి హస్తం ఉంది? ఎవరెవరికి ఏ మేరకు ముడుపులు అందాయి? అన్న కోణంలో విచారణ ప్రారంభించారు. అనంతరం ఏమైందో ఏమో? అనూహ్యంగా విచారణ అధికారి మార్పు ప్రక్రియ తెరపైకి వచ్చింది. అంత తక్కువ వ్యవధిలోనే మార్పు చేయాల్సిన అవసరం ఏముంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక మరో కోణం దాగుందని స్పష్టమవుతోంది. అక్రమాలను కప్పి పుచ్చేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అర్థమవుతోంది. జేసీ స్థానంలో విచారణ అధికారులుగా డీఆర్వో, ఆర్డీవో, ‘ముడా’ వీసీని నియమించారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చిన చందంగా నిధుల దుర్వినియోగం అయిన శాఖకు చెందిన అధికారికే ఆ బృందంలో స్థానం కల్పించారు. వారే నిధుల వ్యయంపై నివేదిక ఇవ్వాలని సూచించడాన్ని బట్టి చూస్తే విచారణ ఏ మేరకు పక్కాగా జరుగుతుంది? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిల్లులు తాత్కాలికంగా నిలుపుదల చేసినా.. మరో రెండు రోజుల్లో మంజూరుకు కసరత్తు జరుగుతోంది. దీని బట్టి చూస్తే అక్రమ బిల్లులను సక్రమం చేసుకుని, అవినీతి నుంచి బయటపడేందుకు పావులు కదుపుతున్నారని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే అక్రమ తంతు నుంచి గట్టెక్కించాలని ఓ అధికారికి ఇటీవల భారీగా ముడుపులు సమర్పించినట్లు తెలిసింది. భారీగా పెట్టిన బిల్లులను పైకి తక్కువగా చూపించి.. చెల్లింపుల్లో మాత్రం యథావిథిగా ఇచ్చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారడంతో ఇప్పట్లో బిల్లులు చెల్లిస్తే మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతాయేమోనని.. కొన్ని రోజులు విరామం ప్రకటించి.. విషయం సద్దుమణిగిన అనంతరం చెల్లించే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
బీచ్‌లో రెచ్చిపోయిన ఖాకీ
జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈనెల 11వ తేదీన జరిగిన ఘటన పోలీసు శాఖకే మచ్చగా మారింది. పోలీసు శాఖలోని ఓ సీఐపై సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్, అతని స్నేహితులు.. పర్యాటకుల మధ్య బాహాబాహీకి దిగారు. అధికారిపై ముష్టియుద్ధం చేçస్తూ అరుపులు కేకలతో అలజడి సృష్టించారు. దీంతో సీఐకి రక్తపు గాయాలు అయ్యాయి. సీఐ ఫిర్యాదుతో సదరు కానిస్టేబుల్, అతనికి సహకరించిన స్నేహితులను పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటనకు మంగినపూడి బీచ్‌లో సోమవారం (ఆఖరి రోజు) జరిగిన మసులా బీచ్ ఫెస్టివల్ వేదికగా మారింది. ఈ ఘటన పోలీసు వర్గాల్లో కలకలానికి దారి తీసింది. కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : అతనో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. పేరు దాసరి నాగప్రసాద్‌బాబు. ఊరు పామర్రు నియోజకవర్గంలోని ఎలకుర్రు శివారు మల్లేశ్వరం. టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా మంగినపూడి బీచ్‌లో నిర్వహించిన మసులా బీచ్ ఫెస్టివల్‌కు స్నేహితులతో ఈ నెల 11వ తేదీన వెళ్ళాడు. అంతా పూటుగా మద్యం సేవించారు. ఇంకే ముంది బీచ్ ఒడ్డున అల్లరి, అలజడి సృష్టించటం మొదలుపెట్టారు. పోలీసులు ఉన్నారన్న విషయాన్ని పక్కనబెట్టి పర్యాటకులను పట్టించుకోకుండా వీరంగం సృష్టించటం ప్రారంభించారు. మట్టి తీసి పర్యాటకుల మీద చల్లటం, అరుపులు కేకలు వంటి వికృత చేష్టలతో హల్చల్కు దిగారు. ఈ వీరంగాన్ని తట్టుకోలేని పలువురు పర్యాటకులు సమీపంలో ఉన్న ఓ సీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ అక్కడకు వెళ్లారు. అప్పటికీ కానిస్టేబుల్ అండ్ ఫ్రెండ్స్ వీరంగం పరాకాష్ఠకు చేరింది. ఆ చేష్టలను చూసిన సీఐ ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని లైన్లో నిలబెడుతుండగా కానిస్టేబుల్ నాగప్రసాద్‌బాబు ఆయనతో వాదనకు దిగాడు. ఉన్నట్టుండి సీఐపై దాడికి తెగబడ్డాడు. ముఖంపై పిడిగుద్దులకు సాహసించాడు. దీంతో సీఐకి బలమైన గాయమై రక్తస్రావం జరిగింది. మెడకు బలమైన దెబ్బ తగిలింది. సమీపంలో ఉన్న కానిస్టేబుల్ కూడా నాగప్రసాద్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అందరూ కలిసి అతనిపైనా దాడికి దిగారు. ఈ తతంగమంతా పర్యాటకుల సమక్షంలో జరగటం అందరినీ అవాక్కు అయ్యేలా చేసింది. రూరల్ స్టేషన్లో కేసు నమోదు.. గాయపడిన సీఐ బందరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. జరిగిన ఘటనపై నాగప్రసాద్బాబుతో పాటు అతని అనుచరులపై బందరు రూరల్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు అందుకున్న రూరల్ సీఐ బి. రవికుమార్ దర్యాప్తు చేయగా నాగప్రసాద్‌బాబు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా జార్ఖండ్‌లో పని చేస్తున్నట్లు తేలింది. ఆయనను, స్నేహితులను సీఐ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా నాగప్రసాద్‌బాబు తరఫు బ«ం«ధువులు పామర్రు నియోజకవర్గంలోని ఓ టీడీపీ నాయకురాలి రికమండేషన్‌తో రాజీ చేసుకునేందుకు పావులు కదిపి విఫలం కావటంతో స్థానికంగా ఉన్న మరో టీడీపీ నేత తమ్ముడితో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే సదరు టీడీపీ నేత తమ్ముడు సైతం లోకల్ పోలీసులకు ఫేవర్‌గా మాట్లాడటంతో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్, అతని స్నేహితుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా మారినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ ఘటనపై బందరు రూరల్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట్రతిపాఠి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. -
అజ్ఞాతంలోకి టీడీపీ మహిళా ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికారులు పట్టించుకోలేదని ఇప్పటికే అలక మీదున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మరోసారి తన అక్కసును వెళ్లబుచ్చారు. తనను అవమానించేలా వ్యవహరించారని బీచ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు ఆమె భర్త, రూరల్ ప్రజాప్రతినిధులు కూడా కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. జరిగిన పరాభవాన్ని తట్టుకోలేక ఏకంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జిల్లా మంత్రులు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. దీంతో అట్టహాసంగా ప్రారంభిద్దామనుకున్న బీచ్ ఫెస్టివల్‌కు ఆదిలోనే నేతల షాక్ తగిలినట్టయ్యింది. భర్తను వేదికపైకి పిలవలేదని.. గతేడాది జరిగిన బీచ్ ఫెస్టివల్లో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రతికూల పరిస్థితి ఎదురైంది. సీఎం సమక్షంలో జరిగిన ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని పిలిచి ఆమె భర్త సత్తిబాబును పిలవకపోవడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున వేదిక వద్ద నిరసనతో పాటు ఆందోళన చేశారు. వేదికపైకి ఎక్కిన ఎమ్మెల్యేను కిందికి దిగిపోవాలని పిల్లి అనుచరులందరూ పెద్ద పెద్ద నినాదాలతో హల్చల్ చేశారు. వాస్తవానికి, ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమం. ఏ పదవిలోనూ లేని పిల్లి సత్తిబాబును పిలవాల్సిన అవసరం లేదు. అధికారులు అనుసరించిన తీరు సరైనదే. కానీ ఎమ్మెల్యే భర్త అన్న హోదాలో పిలవాలన్న డిమాండ్‌తో పరిస్థితి చేయిదాటిపోతుండడంతో సీఎం జోక్యం చేసుకుని పిల్లి సత్తిబాబును వేదికపైకి పిలిచారు. దీంతో వివాదం సద్దుమణిగింది. పట్టించుకోలేదన్న ఆవేదన బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్ల నుంచి ప్రారంభోత్సవం వరకు తనను పట్టించుకోలేదన్న ఆవేదనతో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్తిబాబు ఉన్నారు. అన్నీ తమకు తెలిసే జరగాలన్న అభిప్రాయంతో ఉన్న వారిని అధికారులు పట్టించుకోలేదు. ఇది పార్టీ కార్యక్రమం కాదని, పూర్తిగా అధికారిక కార్యక్రమమని అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంకేముంది రూరల్ ఎమ్మెల్యేకు రుచించలేదు. దీంతో ఎమ్మెల్యే వర్గం రగిలిపోతూ వచ్చింది. ప్రారంభోత్సవానికి గైర్హాజర్ అవమాన బాధతో కుంగిపోయి ఏకంగా ప్రారంభోత్సవానికి గైర్హాజయ్యారు. తమ ఎమ్మెల్యేకు పరాభవం జరిగిందని ఆ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ, సర్పంచ్‌లు, ఇతర నాయకులు కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఈ పరిణమాలను గమనించిన మంత్రులు కళా వెంకటరావు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప మంగళవారం ఉదయం నుంచి ‘ఎమ్మెల్యే అనంతలక్ష్మి’ ఫ్యామిలీకి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, ఎమ్మెల్యే, ఆమె భర్త, ఇతర నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో బుజ్జగింపు కుదరలేదు. ఎంత యత్నించినా ఫోన్లో కూడా ఎమ్మెల్యే అందుబాటులో రాకపోవడంతో చేసేదేం లేక షెడ్యూల్ ప్రకారంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంత్రులు కానిచ్చేశారు. అక్కసుతోనే.. అవమాన భారంతో రగిలిపోతున్న రూరల్ ఎమ్మెల్యేకు అధికారులు తీసుకున్న తాజా నిర్ణయం మరో సంకటంగా పరిణమించింది. వీఐపీ పాసులు తక్కువగా జారీ చేయడం గాయంపై కారం చల్లినట్టయ్యింది. పాసుల విషయంలో నియంత్రణ పాటించడంతో రూరల్ ఎమ్మెల్యే తట్టుకోలేక పోయారు. తన నియోజకవర్గ పరిధిలో జరిగిన కార్యక్రమానికి పాసుల పరిమితి ఏంటంటూ అధికారులపై విరుచుకుపడటం ప్రారంభించారు. ఇదే సందర్భంలో కొన్ని రోజులుగా ఎదురవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కినుక వహించారు. అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని, కనీసం కార్యక్రమానికి రమ్మని ఆహ్వానం పలకలేదని, ఏర్పాట్లలో కార్పొరేషన్ అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారని, ఫెస్టివల్‌కు ముందు నిర్వహించిన 2కే రన్‌కు ఆహ్వానించలేదని, తన సలహా లేకుండా, మాట వరస చెప్పకుండా ఏర్పాట్లన్నీ చేశారని, ప్రోటోకాల్ విషయంలో మేయర్కిచ్చిన ప్రాధాన్యం తనకు ఇవ్వలేదని, రూరల్‌లో జరిగిన కార్యక్రమంలో మేయర్‌కు పెద్దపీట వేయడమేంటన్న అక్కసుతో అలకబూనారు. -
రీచ్... ఫెస్టివల్
మంగళవారం సాయంత్రం నుంచి కాకినాడ సాగర తీరాన జరగనున్న బీచ్ ఫెస్టివల్‌కు సర్వం సిద్ధమవుతోంది. లక్షలాదిగా తరలిరానున్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. తొలిరోజున ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రముఖ సినీ నేప«థ్య గాయకుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ కాకినాడకు సోమవారం రాత్రి చేరుకున్నారు. కాకినాడ రూరల్: సువిశాల సాగరతీరం కాకినాడ సొంతం. నిరంతరం అలల సవ్వడులతో, పాలనురగను పోలిన తరంగాలతో.. ఇసుక తిన్నెల అందాలతో అలరారే ఈ ప్రాంతం జిల్లాకే పెట్టని ఆభరణంగా అభివర్ణిస్తారు. అయితే పాలనా యంత్రాంగం దీనిని అభివృద్ధి చేసేలా ఆలోచిస్తే ప్రపంచ పర్యాటక పటంలో కాకినాడ స్థానం సుస్థిరమవుతుంది. కాకినాడ తీరాన్ని ఆనుకొని ఉన్న మడ అడవులు, సముద్రం మధ్యలో ఉన్న హోప్ఐలాండ్ ద్వీపం జిల్లాకే తలమానికంగా ఉన్నా వీటి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించకపోవడంపై పర్యాటకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొరియాను పోలిన తీరం మన తీర ప్రాంతం దక్షిణ కొరియాను పోలి ఉంది. అక్కడి బీచ్ అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం వల్ల నిత్యం సందర్శకులతో కళకళలాడుతుంది. తద్వారా ఎంతో ఆదాయాన్ని సైతం సమకూర్చుకోగలుగుతోందని పర్యాటక శాఖ అధికారులు సైతం చెబుతుంటారు. ఆ తరహాలోనే కాకినాడ బీచ్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రతిపాదనలు సిద్ధం చేశామని నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నారు. మన జిల్లాలో సుమారు 160 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. దీని అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు వేయడం లేదనే చెప్పాలి. అప్పటి ఎమ్మెల్యే కన్నబాబు చొరవతో.. కాకినాడ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా 2013లో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు సాగరసంబరాల పేరుతో బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు. దీంతో కాకినాడ బీచ్ అంతర్రాష్ట్ర ఖ్యాతిని సంపాదించింది. ఐదేళ్లుగా ఈ ప్రాంతానికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్నారు. ఇదే ప్రాంతంలో అప్పట్లోనే హరితా రిసార్ట్స్ పేరుతో ప్రత్యేక బీచ్ ఏర్పడడం దానిలో పర్యాటకశాఖ రూ.4.5 కోట్ల వ్యయంతో 18 ఏసీ కాటేజీలను నిర్మించి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చింది. అనంతరం ఈ ప్రాంతంలో 50 ఎకరాల్లో రూ.45 కోట్ల వ్యయంతో వివిధ రకాల భవనాలతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా పనులు చేట్టారు. అయినా పర్యాటకాన్ని అందిపుచ్చుకోవడంలో వెనుకబడ్డామనే చెప్పాలి. అభివృద్ధి జరిగితే అద్భుతమే.. ఐ.పోలవరం మండలం భైరవపాలెం నుంచి కాకినాడ, ఉప్పాడ, అద్దరిపేటల మీదుగా విశాఖపట్నం వరకు ఎక్కడా వంపులు లేని తీరం ఈ జిల్లా ప్రత్యేకతగా చెప్పవచ్చు. కాకినాడ బీచ్‌లో సరైన సౌకర్యాలు లేకపోయినా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. శని, ఆదివారాల్లో అయితే బీచ్ ప్రాంతం ప్రజలు, పర్యాటకులతో నిండిపోతుంది. కొరియా తీరాన్ని పర్యాటకశాఖాధికారులు సందర్శించి ఆ తరహాలో అభివృద్ధి చేయగలిగితే పర్యాటకంగా ప్రాచుర్యం సాధించవచ్చంటున్నారు. కానరాని సౌకర్యాలు మన జిల్లాలో ఐదేళ్లుగా టూరిజంశాఖ ఆధ్వర్యంలో కాకినాడలో బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఫెస్టివల్ అయిన తరువాత దానిపై ఎటువంటి శ్రద్ధ కనబరచడంలేదు. జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నా వాటి అభివృద్ధి కోసం నిధులు వెచ్చించక పోవడం, కనీస సౌకర్యాలకు దూరంగా ఉండడంతో పర్యాటకుల సందర్శన తక్కువగా ఉంటోంది. హరితా రిస్టార్స్ బీచ్‌లో ఇప్పటికే బార్ అండ్ రెస్టారెంట్, మీటింగ్‌హాల్, జిమ్, 18 కాటేజీలు నిర్మించినా పూర్తిస్థాయిలో పర్యాటకులకు అందుబాటులో లేదనే చెప్పొచ్చు. ప్రస్తుతం బీచ్‌లో రూ.45 కోట్ల వ్యయంతో లేజర్‌షో, వాటర్‌ఫౌంటెన్, గ్యాలరీ కన్వెన్షన్ హాళ్లు, ల్యాండ్ స్కేపింగ్, సస్పెన్షన్ బ్రిడ్జి వంటి పనులు చేస్తున్నారు. పర్యాటకులకు నిత్యం తాగునీరు, ఆహారం అందించే ఫుడ్‌కోర్టులు, ఇతర షాపింగ్‌లు వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. బీచ్‌లో పడక కుర్చీలు, టెంట్లు, బీచ్ ప్రాంతంలో సీ మోటార్‌బైక్, వాటర్ స్కైయింగ్, తినుబండారాల స్టాల్స్, వాటర్ స్పోర్ట్స్ వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రెండు నిమిషాల వ్యవధిలోనే షటిల్ సర్వీసులు కాకినాడ రూరల్: కాకినాడ సాగర తీరంలో ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు జరిగే బీచ్ ఫెస్టివల్‌కు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా షటిల్ సర్వీస్ ఏర్పాటు చేసినట్టు ఎస్పీ విశాల్‌గున్ని వివరించారు. బీచ్ ఫెస్టివల్ ప్రాంతాన్ని ఆయన సోమవారం సందర్శించి పరిశీలించారు. బీచ్‌లో వేదిక, ప్రత్యేక అతిథులు, అతిథుల గ్యాలరీ, పార్కింగ్ స్థలాలు, షాపింగ్ మాల్స్, ఇతర ప్రాంతాలన్నీ పరిశీలించి బీచ్ ఫెస్టివల్‌కు వచ్చిన ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. అనంతరం ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్‌కు 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని ట్రాఫిక్ పర్యవేక్షణకు నియమించామని, ఆయన ఆధ్వర్యంలో పార్కింగ్ తదితర అంశాలను సిబ్బంది పర్యవేక్షిస్తారన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా షటిల్ సర్వీస్ ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేశామని, దీనివల్ల దొంగతనాలు నిరోధించే వీలుంటుందన్నారు. అదే విధంగా నాలుగు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. -
సీఎం పర్యటనపై కలెక్టర్ సమీక్ష
కాకినాడ రూరల్: డిసెంబర్ 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న కాకినాడ బీచ్ ఫెస్టివల్ ప్రారంభ రోజున ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ కార్తికేయమిశ్రా, ఎస్పీ విశాల్‌గున్ని, జేసీ ఎ.మల్లికార్జునలతో పాటు జిల్లా అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో సమీక్షించారు. సీఎం చంద్రబాబు పర్యటనకు కాకినాడ నగరం, బీచ్ ఫెస్టివల్ ప్రాంతాల్లో చేయవలసిన ఏర్పాట్లను కలెక్టర్ చర్చించారు. పర్యటనలో నగరంలో హెలీప్యాడ్ ఏర్పాటు, సీఎం పర్యటన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. కాకినాడ బీచ్ ఫెస్టివల్‌కు ఈసారి అధిక సంఖ్యలో ప్రజలు, పర్యాటకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, గతంలో జరిగిన బీచ్ ఫెస్టివల్స్ అనుభవం దృష్టిలో పెట్టుకొని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. బీచ్ ప్రాంతానికి సామాన్య ప్రజలు ఇబ్బంది లేకుండా చేరుకోవడం, వీఐపీలు కూడా సభాస్థలికి సులువుగా చేరేందుకు చేపట్టవలసిన చర్యల్లో భాగంగా అందుబాటులో ఉన్న బ్రిడ్జిలతో పాటు అవసరమైన తాత్కాలిక బ్రిడ్జి ఏర్పాటుపై కూడా చర్చించారు. బీచ్ ఫెస్టివల్‌కు వచ్చే ప్రజలకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి బీచ్‌కు చేరే విధంగా రవాణా ఏర్పాటుతో పాటు బీచ్ సమీపంలో ఉన్న ఓఎన్జీసీ స్థలంలో పార్కింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం పర్యటన, బీచ్ ఫెస్టివల్ కోసం పక్కా ట్రాఫిక్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సామాన్య ప్రజలకు ట్రాఫిక్ తదితర విషయాలపై మార్గనిర్దేశం చేయాలన్నారు. సీఎం పర్యటించే నగరంలోని ప్రాంతాల్లో శానిటేషన్ పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ శివపార్వతికి కలెక్టర్ కార్తికేయమిశ్రా సూచించారు. ట్రైనీ కలెక్టర్ ఆనంద్, డీఎస్పీ వర్మ, ట్రాఫిక్ డీఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
పర్యటకశాఖాధికారులపై కలెక్టర్ ఫైర్
కాకినాడ రూరల్: కాకినాడ వాకలపూడి బీచ్‌లో స్వదేశ్దర్శన్ పథకం కింద రూ. 45 కోట్లతో చేపడుతున్న పనుల్లో నాణ్యతాలోపం కొట్టవచ్చినట్టు కనిపిస్తోందని, పనులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవంటూ కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు, పర్యాటకశాఖాధికారులతో కలసి శనివారం ఆయన బీచ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఫౌంటెన్, ల్యాండ్ స్కేపింగ్, షాపింగ్ కాంప్లెక్స్, కాన్ఫరెన్స్ హాలు, లేజర్‌షో, ఏసీ థియేటర్ పనులను ఆయన పరిశీలించారు. ల్యాండ్ స్కేపింగ్ పనులు మందకొడిగా జరుగుతుండడం, ఆ పనులు కూడా సక్రమంగా లేకపోవడంతో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 10 నాటికి అన్ని పనులు పూర్తికావాలన్నారు. బీచ్‌లో షాపింగ్ కాంప్లెక్స్‌లో ఏఏ షాపులు ఏర్పాటు చేస్తున్నారని పర్యాటకశాఖ ఆర్డీ జి. భీమశంకరాన్ని ప్రశ్నించగా ఆయన సరిగా బదులివ్వలేదు. అక్వేరియం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పడంతో అతనిని పిలిపించండని ఆదేశించారు. దాంతో వచ్చిన వ్యక్తిని అక్వేరియం ఎలా ఏర్పాటు చేస్తున్నారని అడగగా తనకు ఏమీ తెలియదని, భీమశంకరం రమ్మంటే వచ్చానని చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే భీమశంకరాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. విద్యుత్ లైటింగ్‌కు ఏర్పాటు చేసిన స్తంభాలు తుప్పపట్టి ఉండడంతో విద్యుత్‌శాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీచ్‌లో హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ స్తంభాల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 19, 20, 21 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ డిసెంబర్ 19, 20, 21 తేదీల్లో ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ ప్రారంభం రోజునముఖ్య మంత్రి హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. సామర్లకోట, కాకినాడ నగరం, కొత్తపల్లి ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటుచేయాలన్నారు. ప్రముఖులు నేరుగా సభాస్థలికి రావడానికి వీలుగా ప్రత్యేక మార్గం కేటాయించాలన్నారు. బీచ్ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్ ఎ. మల్లికార్జున నోడల్ అధికారిగా ఉంటారని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 21న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరవుతారని ఆయన సమక్షంలో జరిగే రాక్ డ్రమ్స్ ప్రదర్శన ఎంపిక జాతీయ స్థాయిలో జరుగుతుందన్నారు. అనంతరం వాకలపూడి బీచ్ మార్గాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. జేసీ మల్లికార్జున, కాకినాడ ఆర్డీవో ఎల్ రఘుబాబు, సమాచారశాఖ డీడీ ఎం ఫ్రాన్సిస్, పర్యాటకశాఖ ఈఈ శ్రీనివాసరావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
అంతా నాన్‌లోకల్
దిగుమతి చేసుకున్నవారికే ప్రాధాన్యం లోకల్ టాలెంట్‌కు దక్కని చోటు స్థానిక కళాకారుల అసంతృప్తి బీచ్ ఫెస్టివల్‌పై విమర్శలు నేను పక్కా లోకల్ .. అంటూ ఈ రోజుల్లో అంతా లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు. చివరకు ‘నేను లోకల్’ పేరుతో విడుదలకు సిద్ధమైన చిత్రం ఆడియో ఫంక్ష¯ŒS కూడా లోకల్‌గానే చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం సంక్రాంతి పండగ సందర్భంగా కాకినాడ సాగర తీరంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్లో లోకల్ టాలెంట్‌ను గుర్తించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, ముంబై తదితర నగరాల నుంచి తీసుకువచ్చినవారికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై స్థానిక కళాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లా సంస్కృతీసంప్రదాయాలకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ‘సాగర సంబరాల’కు 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని నిర్వహణకు అప్పటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రత్యేక చొరవతో ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చారు. స్థానిక కళాకారులకు, సంప్రదాయాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. గత మూడేళ్లుగా కూడా సాగరసంబరాల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొంది, కనుమరుగవుతున్న కళలను ప్రోత్సహించేందుకు కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఈసారి బీచ్ ఫెస్టివల్లో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. స్థానికేతరులకు ఇచ్చిన ప్రాధాన్యంలో కనీసం 10 శాతం కూడా స్థానిక కళలకు, కళాకారులకు, సంప్రదాయాలకు ఇవ్వలేదని పలువురు విమర్శిస్తున్నారు. అన్నీ ఉన్నా.. దక్కని ప్రాధాన్యం రాష్ట్రంలో మరే జిల్లాకూ లేనటువంటి భౌగోళిక స్థితిగతులు మన జిల్లాకు సొంతం. ఒకపక్క మెట్ట ప్రాంతం, మరోవైపు డెల్టా, ఇంకోవైపు ఏజెన్సీ ప్రాంతం, సాగరతీరం ఇలా భిన్న సంస్కృతులు, వాతావరణాలు కనిపిస్తాయి. ఏ ప్రాంతానికా ప్రాంతం ఒక్కో ప్రత్యేకతను మూటగట్టుకుని ఉన్నాయి. సాగర సంబరాల సందర్భంగా వాటికి ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేసి ఉంటే బాగుండేదని పలువురు అంటున్నారు. ∙కాకినాడ జమునానగర్, సర్పవరం ప్రాంతాల్లో వందల సంఖ్యలో తోలుబొమ్మలాట కళాకారులున్నారు. కోనసీమతోపాటు పలు ప్రాంతాల్లో హరికథ, బుర్రకథ కళాకారులున్నా వారిలో ఒక్కరికి కూడా సాగర సంబరాల్లో అవకాశం దక్కలేదు. ∙సంప్రదాయ నృత్యాలకూ జిల్లాలో కొదవలేదు. గత సాగరసంబరాల్లో గిరిజనుల నృత్యప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈసారి వాటికి చోటు కల్పించలేదు. ∙గతంలో జిల్లాలోని 10 ముఖ్య దేవస్థానాల నమూనా ఆలయాలు ఏర్పాటు చేయగా ఈసారి అన్నవరంతోపాటు శ్రీశైలం నమూనా ఆలయాలకే పరిమితమయ్యారు. ∙ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, అయినవిల్లి సిద్ధి వినాయకుడు, అంతర్వేది లక్షీ్మనరసింహస్వామి, పిఠాపురం పాదగయ.. ఇలా ప్రసిద్ధి చెందిన అనేక ఆలయాలున్నా వాటికి కూడా సాగర సంబరాల్లో కనీసం కూడా అవకాశం లేకుండా పోయింది. ∙గతంలో సైకత శిల్పాలను ప్రోత్సహించగా ఈ ఏడాది దానికి అనుకున్నంత ప్రోత్సాహం కనిపించలేదు. ∙పాడి పరిశ్రమ, వ్యవసాయం, గిరిజన ఉత్పత్తులకు కూడా సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. ∙గతంలో జరిగిన సంబరాల్లో జిల్లా నలుమూలల నుంచీ 100కు పైగా పాఠశాలలు, కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాల్గొనేవారు. అదేవిధంగా ఈసారి పాఠశాలల విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం కల్పిస్తారని అంతా ఆశించారు. కానీ, ఐదారు పాఠశాలలకు మించి విద్యార్థులు హాజరు కాలేదు. భాగ్యనగర్ బడా సంస్థకే అంతా.. ∙ఈ ఏడాది సాగర సంబరాలకు పర్యాటక శాఖ రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. వీటితోపాటు పరిశ్రమలు, జిల్లాలోని వివిధ సంఘాల నుంచి విరాళాలు కూడా సమకూరాయి. మొత్తమ్మీద సాగర సంబరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్ల వరకూ ఖర్చు చేసేందుకు గ్రీ¯ŒSసిగ్నల్ ఇచ్చింది. ∙ఈ నేపథ్యంలో సాగర సంబరాల మొత్తం నిర్వహణను అధికారులు ఈసారి హైదరాబాద్‌కు చెందిన ఒక బడా సంస్థకు అప్పగించారు. ప్రధాన వేదికతోపాటు లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటును కూడా ఆ సంస్థకే అప్పగించారు. ఇదే వేదికపై ‘నేను లోకల్’ సినిమా ఆడియో రిలీజ్ కూడా నిర్వహించారు. గత ఏడాది రూ.22 లక్షలు వెచ్చించి ముంబై నుంచి ఒక సింగర్‌ను తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రాం రెండు గంటలు కూడా లేదంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది కూడా ముంబైకే చెందిన కేకే అనే సింగర్‌ను రూ.24 లక్షలు వెచ్చించి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. హైదరాబాద్, చెన్నై, ముంబై నుంచి కళాశారులను దిగుమతి చేశారే తప్ప జిల్లా కళాకారులను ప్రోత్సహించినది లేదంటూ పలువురు విమర్శిస్తున్నారు. -
సంబరాల సాగరమై..
జలధిని మించినట్టుగా.. అంబరాన్ని తాకిట్టుగా జనకెరటం ఎగసిపడింది. సంక్రాంతి సెలవులకు బంధుమిత్రులంతా రావడం.. భోగి పండగ సాయంత్రం అందరూ కలిసి, కాసేపు సరదాగా గడపాలని కోరుకోవడంతో.. సాగర సంబరాల్లో రెండో రోజైన శుక్రవారం కాకినాడ తీరం జనసంద్రాన్ని తలపించింది. సంబరాల వేదికపై ప్రదర్శించిన జానపద కళా, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఉర్రూతలూగించాయి. కాకినాడ రూరల్ : సంబర సమయాన సాగరతీరం సందడిగా మారింది. ఉవ్వెత్తున ఎగసే కెరటంలా.. రెండోరోజూ శుక్రవారం పర్యాటకులు పోటెత్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల నృత్యాలు, హాస్యస్కిట్లు, మ్యూజికల్ నైట్స్, గాత్ర సంగీతం, నృత్యనాటికలు, జానపద కళారూపాలు, ఫ్యాష¯ŒSషో వంటి ప్రదర్శనలు పర్యాటకులను అలరించాయి. జిల్లాలోని అనేక పాఠశాలలకు చెందిన 550 మందికి పైగా విద్యార్థులు కోలాటం, నృత్యాలు, నాటికలు ప్రదర్శించారు. కూచిపూడి, భరతనాట్యం, సినీ డా¯Œ్సలు, సినీ నృత్యాలు, రింగ్ డ్యాన్సులతో అదరగొట్టారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రజాప్రతినిధులు, అధికారులు మెమెంటోలు అందజేశారు. ‘ఫ్లవర్’ఫుల్ షో.. బీచ్ సంబరాల్లో బెంగళూరు ఫ్ల్లవర్షోతో పాటు కడియం, కడియపులంక నర్సరీ యజమానులు పెద్ద ఎత్తున పూలు, పండ్లు, కూరగాయలు జౌషధ, బోన్సాయ్ మొక్కలతో 60కిపైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ రకాల రోగాలను నయం చేసే ప్రకృతి సిద్ధమైన వేర్లు, కాయలు, పండ్లను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శనగా ఉంచారు. ఆకట్టుకున్న పలు స్టాళ్లు మారేడుమిల్లి, అడ్డతీగల ప్రాంతాలకు చెందిన బొంగు చికె¯ŒS స్టాల్స్, ఆత్రేయపురం పూతరేకులు, పెరుమాళ్లపురం బెల్లం పాకం గారెలు, గోదావరి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీత, రొయ్య, సొర్ర, పండుగొప్ప, వంజురంలాంటి 34 రకాల వంటకాలు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తులు, మత్స్యశాఖ ఏర్పాటు చేసిన వివిధ రకాల చేపల అక్వేరియం, చేనేత వస్త్ర ప్రదర్శనలు పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి. తూరంగి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు గొబ్బెమ్మలతో ఆకర్షణీయంగా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసిన పాడిన పాటలు, ఆడిన ఆటలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురు కళాకారులు నిర్వహించిన మ్యూజికల్ నైట్స్, జబర్దస్త్ టీము సభ్యుల హాస్యస్కిట్లు పర్యాటకులను కడుపుబ్బా నవ్వించాయి. -
సంబరాలు ఆరంభం
బీచ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి రాజప్ప పర్యాటకులకు కనువిందు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు తీరంలో నాలుగు రోజులు కొనసాగనున్న సందడి ఉవ్వెత్తున ఎగసే జలధి తరంగాలు మనసులో వెల్లువెత్తే ఉత్సాహానికి ఉపమానాలు. ఆ అలల సాక్షిగా.. కాకినాడ కడలి తీర సందర్శకుల మదిలో అటువంటి ఉత్సాహమే ఉరకలెత్తింది. గురువారం ప్రారంభమైన సాగర సంబరాల్లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో, వివిధ రకాల పశు ప్రదర్శనలు, స్టాల్స్.. ఇటు విజ్ఞానాన్ని, అటు ఆనందాన్ని పంచాయి. సంక్రాంతి సందడి ఈ సంబరాలకు అదనపు ఆకర్షణగా నిలిచింది. నిశి ముసిరిన వేళ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సందర్శకులను అలరించాయి. కాకినాడ బీచ్‌లో గురువారం సాగర సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆ«ధ్యాత్మికత విలసిల్లే ఆలయ నమూనాలు, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే థింసా.. కొమ్ము నృత్యాలు, చేనేతల అందాలు, రంగురంగుల పూల సోయగాలు, నోరూరించే వంటకాలు, కళాకారుల నైపుణ్యానికి అద్దం పట్టే శిల్పాలు, చిత్రాలు, జాతీయ సమైక్యతను చాటి చెప్పే సాంస్కృతిక ప్రదర్శనలు సాగరతీరంలో కొలువుదీరి పర్యాటకులకు కనువిందు చేశాయి. బెంగళూరు ఫ్లవర్ షో, వ్యవసాయశాఖ, పురావస్తుశాఖ, ఇండియ¯ŒS కోస్ట్‌గార్డ్, ఏపీ టూరిజం, ఉద్యానవనం, డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. మత్య్సశాఖ ఆధ్వర్యంలో రొయ్యల పుట్టుక, పెరిగే విధానం, వాటిని ఎగుమతి చేసే పద్ధతులు వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్లో వివిధ రకాల మత్స్యసంపదను ప్రదర్శించారు. చేనేత పరిశ్రమను ప్రోత్సహించే విధానాలు, నేత, దారాలకు రంగులు అద్దె తీరు, వస్రా్తలు తయారు చేసే పద్ధతిని వివరించే విధంగా స్టాల్స్ పెట్టారు. పశుసంవర్ధక శాఖకు చెందిన స్టాల్స్ పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో డాగ్ షోను, పుంగనూరు ఆవు, దూడ, ఒంగోలు ఆవు, ముర్రాగేదె, గిరి ఆవులను ప్రదర్శనలో ఉంచారు. – కాకినాడ రూరల్ నోరూరించిన వంటకాలు గోదావరి వంటకాలు, పెరుమాళ్లపురం బెల్లంగారెలు, మారేడుమిల్లికి చెందిన బ్యాంబూ చికెన్, గోదావరి మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన 36 రకాల సముద్ర ఉత్పత్తుల వంటకాలు, సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామం జీడిపప్పు, పచ్చళ్ల వ్యాపారం, ఆత్రేయపురం నేతి పూతరేకులు, మాడుగుల అల్వా, రాయలసీమ బిర్యానీ, నాటుకోడి పులుసు, రాగి సంగటి, పెద్దాపురం పాలకోవా ఇలా 100కి పైగా వివిధ రకాల వంటకాలతో కూడిన స్టాల్స్‌తో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన తినుబండారాలు నోరూరించాయి. ఇలా సాగరతీరంలో 400 రకాల స్టాల్స్ పర్యాటకులకు కనువిందు చేశాయి. అలరించిన శిల్పాలు, చిత్రాలు ఒడిశాకు చెందిన కళాకారులు బీచ్‌లో వేసిన నగదు రహిత విధానాన్ని తెలిపేలా, జిల్లా నమూనాలో ఉన్న సముద్ర ఉత్పత్తులు, వివిధ పంట ఉత్పత్తులతోను, మత్స్యకన్య, బుద్ధుడు, తిరుమల, తిరుపతి దేవస్థానం, శ్రీకృష్ణుడు వంటి సైకత శిల్పాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా ఆకట్టుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. దీన్ని ప్రకాశంజిల్లా అద్దంకికి చెందిన కళాకారులు ఏర్పాటు చేశారు. విరుల విందు బెంగళూరు, చెన్నైలతో పాటు జిల్లాలోని కడియం, కడియపులంక తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 350 వరకు వివిధ జాతుల పూల మొక్కలు, బోన్సాయ్, వివిధ రకాల కొటా¯Œ్స మొక్కలు, వివిధ పండ్లతో తయారు చేసిన దేవుళ్ల ఆకారాలను ప్రదర్శించారు. నమూనా ఆలయాలకు పోటెత్తిన భక్తులు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్నవరం దేవస్థానం, మురమళ్ల వీరేశ్వరస్వామి నమూనా దేవస్థానాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా సముద్రతీరంలో తాటాకులతో ప్రత్యేక ఇళ్లను జిల్లా విద్యాశాఖ నిర్మించింది. సంక్రాంతి పండగ గ్రామాల్లో ఏ విధంగా ఉండేదో వివరిస్తూ గొబ్బెమ్మలు, రంగవల్లులు, భోగిమంటలు ఏర్పాటు చేశారు. గ్రామీణ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గంగిరెద్దులు, హరిదాసు, గరగల నృత్యం, కోలాటం, కాళికానృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గిరిజన సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే «థింసా, కొమ్ము నృత్యం పర్యాటకులను ఆకట్టుకున్నాయి. జిల్లా సంస్కృతి చాటేలా బీచ్‌ఫెస్టివల్ కాకినాడ రూరల్ : జిల్లా చరిత్ర, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా నాలుగురోజులపాటు ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. గురువారం రాత్రి కాకినాడ సాగరతీరంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్‌ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. తూర్పుగోదావరి ప్రాకృతిక సౌందర్యం, సంస్కృతీసంప్రదాయాలకు పర్యాటక పరమైన ప్రాచుర్యం కల్పించేందుకు ఏటా క్రమం తప్పకుండా కాకినాడ బీచ్ ఫెస్టివల్, కోనసీమ, మన్యం ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాకినాడ నుంచి అంతర్వేది, రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం, మారేడుమిల్లి సర్క్యూట్లను రూ.350 కోట్లతో అభివృద్ధి చేసి జిల్లాను టూరిజం హబ్‌గా రూపుదిద్దుతున్నట్టు చినరాజప్ప వివరించారు. వచ్చే ఏడాది బీచ్ ఫెస్టివల్‌ను జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి రూ.23 కోట్లతో మొదట దశ పనులు పూర్తి చేశామన్నారు. బీచ్ ఫెస్టివల్ తరహాలో ఫిబ్రవరిలో కోనసీమ ఉత్సవాలు, మార్చిలో మన్యం ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రూ.100 కోట్లు బీచ్ అభివృద్ధికి కేటాయించారన్నారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, వనమాడి వెంకటేశ్వరరావు, కలెక్టర్ అరుణ్‌కుమార్, జేసీ సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీర్రెడ్డి, ఎంపీపీ పుల్ల సుధాచందు, జెడ్పీటీసీ సభ్యులు కాకరపల్లి సత్యవతి, ఎంపీటీసీ సభ్యులు కర్రి సత్యనారాయణమూర్తి, స్థానిక సర్పంచ్ యజ్జల బాబ్జీ తదితరులు ఈ సాగర సంబరాలను పర్యవేక్షించారు. -
విశాఖ బీచ్ ఫెస్టివల్‌పై వ్యతిరేకత
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : హిందూ సంప్రదాయాలను కాలరాసే విశాఖ బీచ్ ఫెస్టివల్‌ని నిర్వహించరాదంటూ ఆదికవి నన్నయ యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. అభివృద్ధి ముసుగులో సమాజ వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టడం పాలకులకు సమంజసం కాదని యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు కె. రమణ అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు భారత దేశ సంస్కృతీసంప్రదాయాలకు విరుద్ధమని, యువతను తప్పుదారి పట్టించడమే అవుతుందన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదని నిర్వహిస్తే అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ఆర్. మహేష్, జి. శ్యామ్‌ప్రసాద్, రమణాచారి, సత్యనారాయణ, ఉదయ్‌కుమార్, దుర్గాప్రసాద్, దేవా, రమణ, అంజి, స్వామి, తదితరులు పాల్గొన్నారు. -
ఇది ‘పచ్చ’ కామెర్ల మాయాజూదం
‘బీచ్‌లవ్’ ప్రతిపాదనపై కవుల నిరసనగళం రాజమహేంద్రవరం కల్చరల్ : ప్రభుత్వం తలపెట్టిన ’బీచ్ లవ్’ భారతీయ సంస్కృతికి వ్యతిరేకం, ఆంధ్ర సంస్కృతికి అవమానమని కళాగౌతమి అనుబంధ సంస్ధ రచయితల సమితి ఏకగ్రీవ తీర్మానంతో నిరసించింది. ఆదివారం దానవాయిపేట గ్రంథాలయం మేడపై జరిగి న సమితి సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ బి. వి.ఎస్.మూర్తి మాట్లాడుతూ విదేశీయులు మన దేశానికి చేయలేని కీడును నేడు గద్దెనెక్కిన పెద్దలు చేస్తున్నారని నిరసించారు. ‘జరుగవలెను ప్రేమలు చాటుగానె–బట్టబయలు చేయుట భావ్యమగునె– వెర్రి వేషాలు వేయంగ వెసలుబాటు–ఆటవస్తువయ్యె అబల బ్రతుకం త’ అన్న స్వీయరచనను వినిపించారు. విజయకుమార్ యాళ్ళ రచించిన ‘విజయరవళి‘ పుస్తకాన్ని ఆవిష్కరించారు. బుద్ధినీ విదేశాలకు అమ్ముకుంటున్నాం.. కవులు బీచ్ లవ్‌పై తమ నిరసనకు ఇలా వ్యక్తం చేశారు.. ‘మద్యం మత్తులో మీరు–సాగర సౌందర్యాన్ని తొక్కేస్తున్నారు–వెకిలి పాటల మధ్య–సాగరఘోష మీకు వినిపించదు–నకిలీ దీపకాంతుల్లో నిండు చంద్రుని చూడలేరు (రామచంద్రుని మౌనిక)’, ‘భూమిని అమ్ముకుంటున్నాం–నీటిని అమ్ముకుంటున్నాం–అగ్నిని అమ్ముకుంటున్నాం–బుద్ధిని విదేశాలకు అమ్ముకుంటున్నాం (బహుభాషావేత్త మహీధర రామశాస్త్రి)’, ’సాగర తీరతిన్నెలపై–చట్టబద్ధతను కూర్చి–విశృంఖల సంస్కృతికై ’పచ్చ’కామెర్ల మాయాజూదం (తాతపూడి అబ్రహాం ప్రభాకర్)’ అంటూ బీచ్‌లవ్ ప్రతిపాదనను నిరసించారు. -
బికినీల సంస్కృతి మనది కాదు
కాంగ్రెస్ మహిళా విభాగం నిరసన ర్యాలీ బీచ్‌లవ్ ఫెస్టివల్‌ను అడ్డుకుని తీరుతాం.. ఏబీవీపీ బీచ్ ఫెస్టివల్ పై నిరసనలు మిన్నంటుతున్నాయి. పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారుు.భారతీయ సంస్కృతిపై దాడి అంటూ పలువురు మండిపడుతున్నారు. తక్షణమే బీచ్‌లవ్ ఫెస్టివల్ రద్దు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ బలపడుతోంది. ప్రభుత్వం పంతంతో ముందుకెళితే ఎలాగైనా అడ్డుకుంటామని ప్రజాసంఘాలు,విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. డాబాగార్డెన్: బికినీల సంస్కృతి మాకొద్దంటూ కాంగ్రెస్ పార్టీ మహిళా భాగం..విషసంస్కృతిని ప్రోత్సహిస్తున్న బీచ్ లవ్ ఫెస్టివల్‌ను అడ్డుకుని తీరుతామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ), తక్షణమే రద్దు చేయాలంటూ ఉత్తరాంధ్ర సంస్కృతి పరిరక్షణ వేదిక నిరసన చేపట్టారుు. బీచ్‌లవ్ ఫెస్టివల్ ను వ్యతిరేకిస్తూ నగర కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం యల్లమ్మతోటలో గల పార్టీ కార్యాలయం నుంచి జగదాంబ జంక్షన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టగా..అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) డాబాగార్డెన్‌స అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. బికినీల సంస్కృతి మాకొద్దు.. : బికినీల సంస్కృతి మాకొద్ద ని నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి అన్నారు. మహిళా సాధికారత అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. మహిళలను అవమానపరిచే బీచ్ ఫెస్టివల్‌ను రద్దు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి గుంటూరు భారతి మాట్లాడుతూ పాశ్చత్య సంస్కృతి మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు యల్లపు రఘురాం, హైదరాలీ షింకా, ఆలేటి హేమలత, రజియాబేగం పాల్గొన్నారు. బీచ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటాం : విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్న బీచ్ లవ్ ఫెస్టివల్‌ను అడ్డుకుని తీరుతామని అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) హెచ్చరించింది. బీచ్‌లవ్ ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తూ డాబాగార్డెన్‌స అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అల్లూరి నడచిన భూమిపై అశ్లీలత రద్దు చేయాలని..యువతను అభివృద్ధి వైపు నడిపించాలి..కానీ ఆకర్షణల వైపు కాదని..బీచ్ ఫెస్టివల్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఏబీవీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి టి.ఎన్.రాజు, జిల్లా కన్వీనర్ ఎం.గణేష్, సిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నరేంద్ర మాట్లాడుతూ దేశ సంస్కృతిని కించపరుస్తూ పాశ్చాత్య సంస్కృతి ప్రోత్సహిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. అభివృద్ధి పేరిట మందు వ్యాపారం, అశ్లీల వాతావరణం సృష్టించడం టీడీపీ ప్రభుత్వానికి తగునా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మహేంద్ర, మౌనిక, రమ్య, లావణ్య అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. -
వినూత్న నిరసన
రాజమహేంద్రవరం కల్చరల్ : సాగరతీర ప్రేమ కాదు.. సాగరమంత ప్రేమ కావాలని కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపకుడు కల్యాణం అప్పారావు పేర్కొన్నారు. విశాఖలో జరగనున్న బీచ్‌లవ్ కార్యక్రమానికి నిరసన వ్యక్తం చేయడానికి ఆయన మంగళవారం అంబేడ్కర్ నగర్‌లోని రామాలయం వద్ద గోపూజను నిర్వహించారు. గద్దెనెక్కిన పాలకులకు సద్భుద్ధి ప్రసాదించాలని గోమాతను కోరుతూ పూజలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రజలను సమ్మోహనపరచడానికి కాదు, సేవాభావంతో ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మన సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించాలని ఆయన కోరారు. స్థానిక మహిళలు పాల్గొన్నారు. -
బీచ్ ఫెస్టివల్‌పై భగ్గుమంటోన్న మహిళా లోకం
-
'బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహించి తీరుతాం'
-
బీచ్‌లవ్ ఆగదు
- అది ఓ వినూత్న కార్యక్రమం - సీఎం చంద్రబాబు స్పష్టీకరణ సాక్షి, అమరావతి బ్యూరో: ‘విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ద్వారా వినూత్న కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. బీచ్‌ను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగానే దీన్ని నిర్వహిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతిని అపహాస్యం చేసేలా విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. దీనిపై తొలిసారి స్పందించిన సీఎం మాత్రం తమ ప్రభుత్వ చర్యను గట్టిగా సమర్థించుకున్నారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ కాలేజీలో 2వ ఆంధ్రప్రదేశ్ సైన్స కాంగ్రెస్-2016 సదస్సును చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ నిర్వహణను కొందరు అపహాస్యం చేసేలా ప్రకటనలు ఇస్తూ రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను మొదటి నుంచి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే వ్యక్తినని చెబుతూ.. విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహించి తీరుతామని ఉద్ఘాటించారు. పురస్కారాల ప్రదానం ఈ సదస్సులో పలువురు ప్రముఖులకు, యువ సైంటిస్ట్లకు అవార్డులను సీఎం చేతుల మీదుగా అందజేశారు. సైన్స రంగంలో ప్రముఖులైన ఏవీఆర్‌ఏ చైర్మన్ డాక్టర్ ఏవీ రామారావు, మణిపాల్ యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ బీఎం హెడ్జీ, నిమ్స్ మాజీ డెరైక్టర్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు, బీఎం బిర్లా సైన్స సెంటర్ డెరైక్టర్ డాక్టర్ బీజీ సిద్ధార్థలకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు. అలాగే రక్షణ శాఖ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి, లారస్ ల్యాబ్స్ అధినేత డాక్టర్ సి.హెచ్.సత్యనారాయణ, అడ్వాన్స సిస్టమ్స్ లేబొలేటరీ డెరైక్టర్ డాక్టర్ తెస్సీ తోమస్‌లకు డిస్టింగ్విషెడ్ సైంటిస్ట్ అవార్డులు ప్రదానం చేశారు. 10న ఢిల్లీకి సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 10న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ రకాల పెండింగ్ సమస్యలపై ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ నేపథ్యంలో ఏఏ శాఖలో ఎలాంటి పరిష్కారం కాని సమస్యల వివరాలను వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. తిరుపతిలో సైన్స మ్యూజియం ప్రపంచ స్థారుులో ఉన్నతమైన అంశాలతో కూడిన సైన్స మ్యూజియం తిరుపతిలో ఏర్పాటుకు కృషి చేస్తానని, అందుకు అవసరమైన 50 ఎకరాల భూములను ఇచ్చేం దుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చం ద్రబాబు తెలిపారు. జనవరిలో తిరుపతిలో జరగబోయే జాతీయస్థారుు సైన్స సెమినార్ ప్రారంభానికి ప్రధాని మోదీ రానున్నారని, ఆయన చేతుల మీదగా సైన్స మ్యూజియానికి శంకుస్థాపన చేరుుస్తామన్నారు. -
బీచ్ ఫెస్టివల్‌కు వ్యతిరేకంగా తిరుపతిలో నిరసన
-
'ఆయన చంద్రబాబు కాదు ప్యాకేజీల బాబు'
-
ఎమ్మెల్యే దంపతుల్ని పొగడడమే యాంకరింగ్..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: బీచ్ ఫెస్టివల్.. కాకినాడ సాగర ఉత్సవాలు.. వీటికి ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్‌గా ప్రభుత్వం నామకరణం చేసింది. నిర్వహణకు దాదాపు రూ.కోటి ఖర్చు చేసింది. ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమమైనా స్థానికంగా ఉన్న వివిధ పరిశ్రమల యాజమాన్యాలు లక్షల రూపాయల విరాళం ప్రకటించాయి. స్టాల్స్ అద్దెలు, ఇతరత్రా కొంత రాబడి వచ్చింది.కానీ ఈ కార్యక్రమం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల స్వోత్కర్ష, వారి పిల్లలు, బంధుమిత్రుల హంగామాకు వేదికగా మారింది. ఇక ఈ మూడు రోజులూ మంచి వ్యాపారం జరుగుతుందని భారీ అద్దె చెల్లించి స్టాల్ తీసుకున్న నిర్వాహకులు మాత్రం బెంగ పడుతున్నారు. కేవలం ఆదివారం ఒక్కరోజుపైనే లాభమా, నష్టమా అనేది ఆధారపడి ఉంది. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఏటా బీచ్ ఫెస్టివల్‌ను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వమే అన్నీ చేతుల్లోకి తీసుకోవడంతో పర్యాటక శాఖ పాత్ర నామమాత్రమవుతోంది. ఈసారి బీచ్ ఫెస్టివల్‌ను రాష్ట్ర పండగగా ప్రకటించిన ప్రభుత్వం.. నిర్వహణకు రూ.కోటి కేటాయించింది. ఈ ఫెస్టివల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు మూడు వేదికలను నిర్మించారు. ప్రధాన వేదికపై సంగీత విభావరి, మిమిక్రీ తదితర వినోద కార్యక్రమాల నిర్వహణను హైదరాబాద్‌కు చెందిన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించారు. మూడ్రోజుల కార్యక్రమాల నిర్వహణకు రూ.95 లక్షల కాంట్రాక్టును ఆ సంస్థకు ఇచ్చినట్లు సమాచారం. ఆ సంస్థ నిర్వాహకులతో జిల్లాకు చెందిన ఎంపీ కుమారుడికి సన్నిహిత సంబంధాలున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతచేసినా ఆ ప్రధాన వేదికపై స్థానిక కళలకు, కళాకారులకు స్థానం లభించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ప్రధాన వేదిక వద్ద సందర్శకులకు ఇబ్బందికర పరిస్థితే ఏర్పడుతోంది. వేదిక ముందు మూడు వరుసల్లో బారికేడ్లు వేశారు. అక్కడి సీట్లన్నీ వీఐపీలకు కేటాయించారు. ఆ పాస్‌లలో ఎక్కువ స్థానిక ఎమ్మెల్యే కుటుంబసభ్యుల చేతుల్లోకే వెళ్లాయి. బారికేడ్ల అవతల నుంచి వేదికపై కార్యక్రమాలు చూడటానికి వీలుగాకపోవడంతో చుట్టూ ఉన్న వారు బారికేడ్‌పై పడిపోతున్నారు. తీరా వీఐపీల గ్యాలరీ తొ లిరోజు నిండుగా కనిపించినా మలిరోజు వెలవెలపోయింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న బీచ్‌ఫెస్టివల్ పూర్తిగా నేతలకు పొగడ్తల కార్యక్రమంలా తయారైంది. తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఓ ఎమ్మెల్యే దంపతులపై యాంకరు పొగడ్తల వర్షం కురిపించడం గమనార్హం. కార్యక్రమాల గురించి సందర్శకులకు చక్కగా వివరిస్తూ ఆహ్లాదం పంచాల్సింది పోయి ఇదేమి చోద్యమని సందర్శకులు విస్తుపోయూరు. నిరుటి బీచ్ ఫెస్టివల్లో ప్రధాన వేదికపై అధికార పార్టీ నాయకుల తనయులు కొందరు డ్యాన్సులతో హల్చల్ సృష్టించడం విమర్శలకు దారి తీసింది. కనీసం ఆదివారం ముగింపు కార్యక్రమంలోనైనా అలాంటివి జరక్కుండా అధికారులు చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఫుడ్‌స్టాల్స్ నిర్వాహకుల ఆవేదన.. ఈ ఫెస్టివల్ రాజకీయ నాయకులకు పండగ వాతావరణం తీసుకొచ్చినా మూడు రోజులకు రూ.10 వేలు చెల్లించి స్టాల్ తీసుకున్న వ్యాపారులకు నిరుత్సాహాన్నే మిగిల్చింది. కారణం.. బీచ్‌లో ఈ స్టాల్స్ అన్నీ ప్రధాన వేదికకు సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఏర్పాటు చేశారు. వాటిలో కూడా అధికార పార్టీ ముఖ్య నేతకు చెందిన సంస్థ స్టాళ్లకు తొలి వరుసలోనే కేటాయింపు లభించింది. ఇక చివరి వరుసలో ఉన్న స్టాళ్ల వద్ద సందర్శకులే కరువయ్యారు. తొలిరోజు సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు చేసిన ఓవరాక్షన్ ఫలితంగా వ్యాపారం ఏమీ జరగలేదని స్టాల్స్ నిర్వాహకులు పెదవి విరుస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి సీఎం రాత్రి 10 గంటలకు వెనుదిరిగే వరకూ ఆంక్షలు విధించారు. ఇక ప్రధాన ద్వారం ఎదురుగా ఏర్పాటు చేసిన నమూనా ఆలయాలను సందర్శించినవారు నేరుగా ప్రధాన వేదికవైపు వెళ్లిపోతుండగా స్టాల్స్ వైపు వస్తున్నవారి సంఖ్య తక్కువగా ఉంటోంది. కనీసం ఆదివారమైనా పోలీసులు సహకరిస్తే సందర్శకుల రాక పెరిగి వ్యా పారం జరుగుతుందని స్టాల్స్ నిర్వాహకులు ఆశిస్తున్నారు.