వినూత్న నిరసన | different agitation | Sakshi
Sakshi News home page

వినూత్న నిరసన

Published Tue, Nov 8 2016 9:33 PM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

different agitation

రాజమహేంద్రవరం కల్చరల్‌ :
సాగరతీర ప్రేమ కాదు.. సాగరమంత ప్రేమ కావాలని కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపకుడు కల్యాణం అప్పారావు పేర్కొన్నారు. విశాఖలో జరగనున్న బీచ్‌లవ్‌ కార్యక్రమానికి నిరసన వ్యక్తం చేయడానికి ఆయన మంగళవారం అంబేడ్కర్‌ నగర్‌లోని రామాలయం వద్ద గోపూజను నిర్వహించారు. గద్దెనెక్కిన పాలకులకు సద్భుద్ధి ప్రసాదించాలని గోమాతను కోరుతూ పూజలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రజలను సమ్మోహనపరచడానికి కాదు, సేవాభావంతో ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మన సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించాలని ఆయన కోరారు. స్థానిక మహిళలు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement