వైఎస్సార్‌సీపీలోకి ఉదయ్‌రెడ్డి | Uday Reddy Join in YSRCP Hyderabad | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి ఉదయ్‌రెడ్డి

Published Wed, Mar 13 2019 11:17 AM | Last Updated on Wed, Mar 13 2019 11:17 AM

Uday Reddy Join in YSRCP Hyderabad - Sakshi

ఉదయ్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న శ్రీకాంత్‌రెడ్డి తదితరులు

ఆల్విన్‌కాలనీ: ఏబీవీపీ మాజీ నాయకుడు బి.ఉదయ్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. మంగళవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.గత 20 ఏళ్లుగా ఏబీవీపీలో పనిచేసిన ఉదయ్‌రెడ్డి పలు సమస్యలపై పోరాటం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ఆశయాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్టు చెప్పారు. రాజన్న సువర్ణ యుగం రావాలంటే తిరిగి జగన్‌మోన్‌రెడ్డి నాయకత్వం అవసరమన్నారు. ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నవరత్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరి పుఫుల్లారెడ్డి తదితరులు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement