
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ విద్యాసంస్థలైన నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం కార్పొరేట్ విద్యాసంస్థల బంద్‌కు పిలుపు ఇస్తున్నట్లు ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రాఘవేందర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ రెండు విద్యాసంస్థల్లో ఇప్పటివరకు వందల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినా ఒక్క అరెస్టు కూడా జరగలేదన్నారు. ఆయా కాలేజీల హాస్టళ్లకు అనుమతులే లేవని, అయినా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment