కవాడిగూడ: హైదరాబాద్ నగర శివారులో జరిగిన ‘దిశ’ అత్యాచా రం, హత్యను నిరసిస్తూ సోమవారం అఖిల భారత విద్యా ర్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి పార్క్ నుంచి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి అనుమతి నిరాకరిస్తూ పోలీసులు విధించిన ఆంక్షలను ధిక్కరిస్తూ విద్యార్థులు కదంతొక్కారు. పోలీసుల హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా వందలాది మంది ర్యాలీ చేపట్టారు.
అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసు వలయాల మధ్య ఆర్టీసీ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్, ఇందిరాపార్క్ చౌరస్తా వరకు ధర్నా కొనసాగింది. ఇందిరాపార్క్ చౌరస్తా వద్దకు రాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకోవాలని యత్నించగా.. పోలీసులకు, ఏబీవీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో విద్యార్థులు ధర్నాచౌక్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. బహిరంగసభ నిర్వహించారు. దిశ కేసులో నిందితులను కఠినంగా శిక్షించి ఉరితీయాలని నినా దాలు చేశారు.
ప్రభుత్వం విఫలం..: నిధి త్రిపాఠి
ఈ నిరసన కార్యక్రమానికి ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సభను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను అరికట్టడంలో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. దిశ కేసులో నిందితులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా మరణశిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఉదయ్, నగర కార్యదర్శి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment