ఉగ్రఘాతుకంపై విద్యార్థుల నిరసన
పోరుమామిళ్ల: కశ్మీర్ యూరి సైనిక శిబిరంపై పాక్ ముష్కరులు దాడి చేసి 17 మందిని పొట్టనపెట్టుకున్న సంఘటనకు నిరసనగా సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ‘పాకిస్థాన్ డౌన్ డౌన్’ ‘ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, అమరవీరులకు జోహార్’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఆర్టీసీ బస్టాండు వద్ద మానవ హారంగా ఏర్పాడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ డివిజన్ ఇన్‌చార్జి బుసిరెడ్డి మనోహరరెడ్డి, పట్టణ కార్యదర్శి చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమైనచర్య అన్నారు. ప్రపంచదేశాలన్నీ ఐక్యంగా ఉగ్రవాదులను మట్టుపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నారోజు రమణాచారి, నాగేంద్రబాబు, సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.